సిఎఎ రాజ్యాంగ విరుద్ధం..గిద్దలూరు..టిడిపిలో చేరికలు..రంజాన్ తోఫా రద్దు చేసిన ఘనత వైకాపాదే..110 రంజాన్ కిట్ల పంపిణీ

👉సీఎఎ రాజ్యాంగ విరుద్ధం.. మతప్రాతి ప్రాతిపదికగా పౌరసత్వం ఇవ్వడం అన్యాయం.. ఖండించిన జె ఐ హెచ్.. ఆవాజ్ కమిటీలు..ఆంధ్ర మిర్రర్…ప్రకాశం జిల్లా..కంభం…

సీఎఎ రాజ్యాంగ విరుద్ధమని,మతప్రాతిపదికగా ఒక మతాన్ని మినహాయించి పౌరసత్వాన్ని కల్పించడం రాజ్యాంగం ఆశయాలకు భిన్నంగా వ్యవహరించడమే అని జమాతే ఇస్లామి హింద్ భాద్యులు ఎస్ ఎ రఫీ, పి గౌస్ ఖాన్, ఆవాజ్ కమిటీ తోపాటు పలువురు ముస్లిం పెద్దలు తీవ్రంగా ఖండించారు. రంజాన్ సందర్బంగా నిర్వహించిన ఓ సమావేశం లో వారు మాట్లాడుతూ కులం మతం ఇత్యాది భావనలతో వ్యక్తిగత నమ్మకాలతో నిమిత్తం లేకుండా ఈ దేశంలో నివసించే వారందరూ భారత ప్రవచిస్తుంటే కొందరిని ప్రత్యేకించి ఒక మతం వారిని వేరు చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమే అని వారు ఖండించారు. బిజెపి ప్రభుత్వం తాము చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి,ప్రజల దృష్టిని మరల్చడానికి ఇటువంటి కుట్రలు పన్నుతుందని వారు ఆరోపించారు.👉 సి ఏ ఏ ను కేరళ ప్రభుత్వము అమలు చేయమని ముఖ్యమంత్రి తెలిపారని అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలియజేయాలని,సి ఎ ఏ అమలు చేస్తున్న బిజెపితో పొత్తు పెట్టుకున్న వైకాపా, టీడీపీ పార్టీలు ఈ రాష్ట్రంలో సి ఎ ఏ అమలు చేయమని ప్రకటించాలని ఆవాజ్ కమిటీ జిల్లా కార్యదర్శి ఎం షంషీర్ బేగ్ తెలిపారు.లేనిపక్షంలో లౌకిక వాదులందరు ఆ పార్టీలను ఓడించాలన్నారు.👉ఈ సందర్బంగా లౌకిక వాద పరిరక్షణ కోసం అహర్నిశలు సహాయ సహకారాలు అందిస్తున్న కమ్యూనిస్ట్ పార్టీలకు,ప్రత్యేక బులెటిన్ లు ముద్రిస్తు, ప్రజలలో చైతన్యం పెంచేందుకు ప్రజాశక్తి పత్రిక చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.కార్యక్రమం లో ముఫ్టీ యాసిన్ సాహెబ్,రసూల్ బేగ్,అబ్దుల్ కలాం,అసిఫ్ ఖాన్,చాంద్, మౌలాలి పాల్గొన్నారు.

👉ముత్తుముల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ఎంపీటీసీ, ముఖ్య నాయకులు*

కొమరోలు మండలంలోని సూరవారిపల్లె పంచాయతీ, మొట్టుపల్లె గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు యరదేశీ పాండు తన అనుచరులు ముఖ్య నాయకులతో సహా వైసీపీకి గుడ్ బై చెప్పి గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీని వీడిన వారికీ అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.. టీడీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ, ముఖ్య నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు స్థానికునికి, స్థానికేతరునికి జరిగే ఎన్నికలు అని గిద్దలూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.*కార్యక్రమంలో వైసిపిని వీడి టిడిపిలో చేరిన యరదేశీ రంగయ్య, దమ్ము తిరుపాలు, యరదేశి వెంకటేశ్వర్లు, యరదేశి వెంకట రంగయ్య, కొమరోలు బాబు,టీడీపీ నాయకులు తదితరులు పాల్గోన్నారు…. 👉ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన 35 విశ్వబ్రాహ్మణ కుటుంబాలు*  గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో కంభం పట్టణానికి చెందిన 35 విశ్వ బ్రాహ్మణ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్బంగా వారికీ టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.నాడు తెలుగుదేశం హయాంలో చేతి వృత్తుల వారిని అన్నీ విధాలుగా చేతోడుగా ఉన్నామని రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం విజయానికి అన్నీ రంగాల వారు కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరిన విశ్వబ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ ఎద్దనపూడి లక్ష్మి నారాయణ, ప్రధాన కార్యదర్శులు నల్లగట్ల వీరబ్రహ్మం, చెరుకుపల్లి సుభ్రమణ్యం, తదితరులు పాల్గోన్నారు.*

👉*రంజాన్ తోఫా రద్దు చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వమే..తెలుగుదేశం హయాంలోనే మైనార్టీల సంక్షేమం.. ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన మైనార్టీ కుటంబాలు….తెలుగుదేశం హయాంలో ముస్లిం మైనార్టీ సోదరులకు మంజూరు చేసిన రంజాన్ తోఫా పథకాన్ని రద్దు చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వమే అని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంభం పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన ముస్లిం మైనార్టీ సోదరులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువా కప్పి సాదరముగా పార్టీలోకి ఆహ్వానించారు.రాబోయే ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ సోదరులకు వెన్నుపోటు పొడిచిన జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని, గిద్దలూరు నియోజకవర్గంలో అశోక్ రెడ్డిని గెలిపించి తెలుగుదేశం జెండాను ఎగరేస్తామన్నారు. కార్యక్రమంలో వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన పి. హరికృష్ణ, సయ్యద్ హుస్సేన్, షేక్ పండు, సయ్యద్ అమీర్, షేక్ ఖలందర్, పి దస్తగిరి, ఏ. రాకేష్, డి. నాయబ్ రసూల్, అనిల్ కుమార్, షేక్ అర్షద్, షేక్ కరిముల్లా, షేక్ మస్తాన్, షేక్ చాంద్ బాషా మండల టీడీపీ నాయకులు పాల్గోన్నారు.

👉ముత్తుములను మర్యాదపూర్వకంగా కలిసిన కొంగల వీడు ఎస్టీ కాలనీ నాయకులు..* గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్చార్జి ముత్తుముల అశోక్ రెడ్డిని కొంగలవీడు గ్రామంలోని ఎస్టీ కాలనీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువా వేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు ప్రజలకు స్థానికంగా అనునిత్యం అందుబాటులో ఉండే ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కొంగలవీడు ఎస్టీ కాలనీకి చెందిన వార్డు మెంబర్ జగన్నాధం రమణయ్య, వైస్ సర్పంచ్ దాసరి సురేష్, మాజీ వైస్ సర్పంచ్ దాసరి చిన్న వెంకటయ్య, తదితరులు పాల్గోన్నారు.

👉110 రంజాన్ కిట్ల పంపిణీ.. ఆంధ్ర మిర్రర్..కంభం

జకాత్ లో భాగంగా జమాత్  ఏ ఇస్లామి-హింద్ ప్రతి సంవత్సరం పేదవారి ఇంటికి వెయ్యి రూపాయల సరుకులు మరియు జకాత్ ను నగదు రూపంలో అందించడం జరుగుతుంది.అలాగే ఈ సంవత్సరం కూడా ఆదివారం జమాత్ ఆధ్వర్యంలో 110 కిట్స్ పేదవారికి పంపిణీ చేశారు.కార్యక్రమంలో జమాత్ ఏ ఇస్లామి హింద్ అధ్యక్షుడు రఫీ, జమాత్ ఏ ఇస్లామి హింద్ మాజీ ఉపాధ్యక్షులు గౌస్ ఖాన్, ముఫ్తీ యాసిన్ సాబ్, ఆవాజ్ కమిటీ జిల్లా కార్యదర్శి షంషీర్ బేగ్,ఎస్ ఐ ఒ ఏపీ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ చాంద్ బాషా ,ఆర్టి ఏజెంట్ కరిముల్లా(మూవ్మెంట్ ఫర్ పీస్ & జస్టిస్ ),ఏ బి ఫంక్షన్ హాల్ అధినేత అయ్యుబ్ ఖాన్,టీచర్ కలాం, రసూల్ బేగ్, జమాత్ ఏ ఇస్లామి హింద్ సభ్యులు అసిఫ్,అబ్దుల్లా, ఎస్ ఐ ఒ సభ్యులు వసీం,బాజిద్,సాజిద్,రఖీబ్, ఫిరోజ్ ఖాన్, నసీర్, ఆదిల్, అకిబ్, సాకిబ్ మరియు బస్టాండ్  మస్జిద్  జమాత్ పాల్గొన్నారు.

7k network
Recent Posts

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..

సీఎం సమక్షంలో వైకాపాలో చేరిన కీలక నేతలు..ప్రచారంలో మాగుంట చందన..జగన్ సర్కారు పై ధ్వజమెత్తిన ముత్తుముల.. ఎమ్మెల్యే అన్నా సమక్షంలో వైకాపాలో చేరికలు..ఇజ్రాయిల్ దాడులను ఖండించిన ఎస్ఐఓ..రాష్ట్రస్థాయిలో కంభం వాసవి విద్యార్థుల ప్రతిభ.

బీజేపీ నేతలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు .. పిఠాపురం నుంచి కే.పవన్ కల్యాణ్ పోటీ!..సింబల్ తెలిస్తే షాకే!..రంజాన్ వేడుకలలో ఎంపీ మాగుంట,ఎమ్మెల్యే కేపీ..విస్తృత పర్యటన లో ముత్తుముల..యశోద హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స