పవన్ ని కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట..రేణిగుంట గోదాముల్లో బయటపడ్డ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎన్నికల తాయిలాలు..ముత్తుములకే మాదిగల ఓట్లు..సూపర్ సిక్స్ పథకాలను ప్రతీ ఇంటికి తెలపాలి:ముత్తుముల*

పవన్ కళ్యాణ్ ని కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట..

మంగళగిరి లోని జనసేన పార్టీ ఆఫీస్ లో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన తోపాటు యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి, ప్రకాశం జిల్లా పార్టీ ఇంచార్జి షేక్ రియాజ్ , అయినాబత్తిన ఘనశ్యాం ,తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్పా రంగసాయి గారు,కండే శ్రీనివాసులు తదితర నాయకులు పాల్గొన్నారు.

👉రేణిగుంట గోదాముల్లో బయటపడ్డ టన్నుల కొద్దీ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎన్నికల తాయిలాలు..టీడీపీ నేతలు ఫైర్..    రేణిగుంట గోదాముల్లో బయటపడ్డ టన్నుల కొద్దీ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎన్నికల తాయిలాలు.. చేతి గడియారాలు, డమ్మీ ఈవీఎం యంత్రాలు, గొడుగులు, కండువాలు, జెండాలు, ఆమ్ప్లిఫైర్లు, టోపీలు , టీషర్స్ గుర్తింపు- పరిసర ప్రాంతాల్లో మరిన్ని గోడౌన్ లలో కుక్కర్లు, ఫ్యాన్లు,డబ్బుల కట్టలు ఉన్నట్లు సమాచారం.రెండవ రోజు మధ్యాహ్నం హడావుడిగా గోడౌన్ కు చేరుకున్న వాణిజ్య పన్నుల శాఖ అధికారులు.. బిల్లులు ఉన్నాయంటూ మీడియాను కూడా అనుమతించకుండా హడావుడి ఎన్నికల అధికారులు ఏమైయ్యారని టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు..తాయిలాలు నిల్వ ఎన్నికల నియమావళి విరుద్ధం కాదా..! అంటు మండిపడ్డారు ..ఎస్పీ, కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు.

ఫోటో : టీడీపీ లో చేరిన వారితో అశోక్ రెడ్డి

 

టీడీపీలో చేరిన 100 కుటుంబాలు

పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండల ఎంపీపీ మేడూరి వెంకట్రావ్ ఆధ్వర్యంలో వెలగలపాయ గ్రామానికి చెందిన 100 కుటుంబాలు మరియు భోగోలు గ్రామానికి చెందిన వార్డు మెంబర్, ముఖ్య నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారందరికి టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ముత్తుముల అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.కార్యక్రమంలో వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన జె రామలింగేశ్వర రావు, కె జయచంద్ర గౌడ్, కె వెంకట్రావ్,జె శ్రీను, ఎస్ ప్రసాద్, ఎమ్ మహేష్ మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గోన్నారు.

👉 వివాహా కార్యక్రమంలో పాల్గోన్న ముత్తుముల..   ప్ర   కాశం జిల్లా, రాచర్ల గ్రామంలో సూర మధుసూదన్ రెడ్డి శారదల కుమార్తె చి.ల.సౌ హరిప్రియ వివాహా కార్యక్రమంలో గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు. అనంతరం రాచర్ల మండలం, రంగారెడ్డి పల్లె గ్రామంలో కందుల శింగారెడ్డి కుమార్తె చి.ల.సౌ వాహిని వివాహా కార్యక్రమంలో పాల్గోని నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.*

👉అశోక్ రెడ్డికే మాదిగల ఓట్లు..మాదిగలను మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడిస్తాం*..

గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్న ముత్తుముల అశోక్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఎమ్మార్పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు తెలిపారు.. గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగ ప్రజలంతా అశోక్ రెడ్డికే మీ విలువైన ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.బుధవారం పట్టణంలోని టీడీపి కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో మాదిగల మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉంటుందన్నారు…మాదిగలను మోసం చేసిన జగన్..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గీకరణ అనేది తన తండ్రి కోరిక అని అధికారంలోకి రాగానే వర్గీకరణ సమస్యకు అనుకూలంగా తీర్మానం చేస్తామని జగన్మోహన్ రెడ్డి మాటిచ్చారని.ఈ రాష్ట్రాన్ని ఐదేళ్లు ముఖ్యమంత్రిగా జగన్ పరిపాలించినప్పటికీ రిజర్వేషన్ వర్గికరణ అంశాన్ని పట్టించుకోలేదని ఒక్క మాట కూడా మాట్లాడలేదని వర్గీకరణ విషయంలో కనీసం సుప్రీంకోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వ తరఫు నుంచి ఒక్క న్యాయవాదిని కూడా జగన్ ఏర్పాటు చేయకుండా మాదిగలను మోసం చేశారని డాక్టర్.మున్నంగి నాగరాజు మాదిగ మండిపడ్డారు.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీని మాదిగ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు..*కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి జలదంకి నరశింగరావు మాదిగ, యం.యస్.పి. రాష్ట్ర కార్యదర్శి పుల్లుగుజ్జు ఫ్రాంక్లిన్ మాదిగ, యం.యస్.పి. జిల్లా అధ్యక్షులు తొరటి. ఆనంద్ మాదిగ,రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదిమూలపు ప్రకాష్ మాదిగ,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, బొప్పూరి.ప్రసాద్ మాదిగ, గిద్దలూరు నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షులు గుర్రం దానియేలు మాదిగ, పందీటి రజినిబాబు,చిట్టెం ఆరోగ్యం మాదిగ,మండల అధ్యక్షులు కొమ్మునూరి వెంకటేష్ మాదిగ,నాయకులు వినుకొండ చిన్న, ఓబయ్య మాదిగ,గుర్రం ప్రసాద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.*

👉సూపర్ సిక్స్ పథకాలను ప్రతీ ఇంటికి తెలపాలి : ముత్తుముల.*రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు ఉమ్మడిగా ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రతీ ఇంటికి తెలియచేయాలని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాచర్ల, గిద్దలూరు,కొమరోలు టీడీపీ ముఖ్యనాయకులు, యూనిట్, బూత్ ఇన్ఛార్జ్ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతీ టీడీపీ కార్యకర్త రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో నెలకొన్న అరాచక పాలనను ప్రజలకు వివరించాలని, నాడు తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రతీ ఒక్కరికి గుర్తు చేసి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం, ఉపాధి, మహిళా సంక్షేమం, రైతుల సంక్షేమం ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ప్రతీ ఒక్కరూ ఒక సైనికునిగా పని చేసి నియోజకవర్గంలో తన గెలుపుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాచర్ల కొమరోలు గిద్దలూరు మండలాల ముఖ్య నాయకులు క్లస్టర్,యూనిట్, బూత్ ఇన్ఛార్జ్ లు పాల్గొన్నారు.*

*👉ప్రభుత్వ మద్యం షాప్ లో విధులు నిర్వహిస్తున్న సూపర్వైజర్, వాచ్మెన్ అరెస్ట్..288 క్వార్టర్ సీసాల మద్యం బాటిళ్లు తో పాటు ఒక కారు స్వాధీనం..* పరారీలో యాచవరం గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి..

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామం వద్ద అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ కారును స్వాధీనం చేసుకున్న సెబ్ అధికారులు.అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్, ఒకరు పరారీ, 288(180 ఎం.ఎల్) మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న అధికారులు. కారును సీజ్ చేయడంతో పాటు మద్యం తరలిస్తున్న వ్యక్తులను రిమాండ్ కు తరలించిన అధికారులు.అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిలో ఇద్దరూ కాకర్ల గ్రామంలోని ప్రభుత్వ మద్యం షాపులో పనిచేస్తున్న కొప్పుల వెంకట రమేష్ (సూపర్వైజర్), దార్ల అనిల్ (వాచ్ మెన్) గా విధులు నిర్వహిస్తున్నట్లు సెబ్ అధికారులు గుర్తించారు. యాచవరం గ్రామానికి చెందిన బెల్ట్ షాప్ నిర్వాహకుడు యామ చిన్న వెంకటేశ్వర్లు పరారీ లో ఉన్నట్లు సెబ్ అధికారులు తెలిపారు. పట్టు బడిన కారు మరియు మద్యం విలువ సుమారు 3,50,000/- విలువ ఉంటుంది అని సెబ్ డీఎస్పీ దుర్గాప్రసాద్ మీడియా సమావేశం లో వివరాలు వెల్లడించారు…_

👉 గిద్దలూరు మండలం దిగువమెట్ట రైల్వేస్టేషన్ సమీపంలో గాయపడ్డ చుక్కల దుప్పిని స్థానికులు గుర్తించారు.వెంటనే వారు దిగువ మెట్ట అటవీశాఖ డిప్యూటీ రేంజి అధికారి వంశీకృష్ణ కి సమాచారం అందించారు. ఆయన సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన దుప్పిని స్వాధీన పరుచుకొని కేఎస్ పల్లి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రంగస్వామి,గోపాల మిత్రులు రామాంజనేయులతో ప్రథమ చికిత్స చేయించారు.అనంతరం చుక్కల దుప్పిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.ఈ కార్యక్రమంలో దిగువ మెట్ట అటవీశాఖ డిప్యూటీ రేంజి అధికారి వంశీకృష్ణ,ఎఫ్ బీ వో ఖయుమ్,చెక్ పోస్టు హెల్పర్ సుందర్ రాజ్,స్వచ్ఛ సేవకులు పి.సురేంద్ర,రమణ తదితరులు ఉన్నారు

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం