లాయర్ గా మారిన కేజ్రీవాల్..చంద్రబాబుపై సజ్జల ఆరోపణ..మోడీ- జ’గన్’ మధ్య ఏం జరుగుతుంది?..ఇవిఎం తయారీ సంస్థ డైరెక్టర్ నేడు బిజెపి అభ్యర్థి.. సోషల్ మీడియాకు జిల్లా కలెక్టర్ ఎస్పీల హెచ్చరిక..ఒంగోలులో భారీ చోరీ..గిద్దలూరు టిడిపి వైసిపిలలో చేరికలు

👉 లాయర్‌గా మారిన కేజ్రీవాల్.. తన కేసును తానే వాదించుకున్న ఢిల్లీ సీఎం..

ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీని కోర్టు పొడగించింది.ఈక్రమంలోనే కోర్టులో వాదనల సందర్భంగా కేజ్రీవాల్ లాయర్ అవతారం ఎత్తారు.ఢిల్లీ లిక్కర్ కేసులో తన వాదనలను తానే వినిపించారు.ఈ సందర్భంగా ఈడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.తనను ఈ కేసులో ఇరికించి..తన ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయాలనేదే ఈడీ లక్ష్యమని మండిపడ్డారు.ఇక కేజ్రీవాల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరో 4 రోజులు పొడగించింది.లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలో ఢిల్లీ లిక్కర్ కేసు సంచలనంగా మారింది.2 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,ఢిల్లీ సీఎం అరవిందే కేజ్రీవాల్ అరెస్ట్‌తో కేసులో వేగం పెరిగింది. ఈ క్రమంలోనే ఈ నెల 21 వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది.అనంతరం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు 7 రోజుల ఈడీ కస్టడీ విధించింది.అది గురువారంతో పూర్తి కావడంతో మరోసారి 4 రోజులపాటు కస్టడీని పొడగించింది.ఈ సందర్భంగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో జరిగిన విచారణలో భాగంగా తన కేసు గురించి కేజ్రీవాల్ తానే వాదించుకున్నారు.ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌-ఈడీపై కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేసేందుకు ఈడీ ప్రయత్నిసోందని తీవ్ర ఆరోపణలు చేశారు.ఢిల్లీ లిక్కర్ కేసులో రూ.100 కోట్ల అవినీతి జరిగిందని ఈడీ చెబుతోందని..మరి ఆ రూ.100 కోట్లు ఎక్కడికి పోయాయని కేజ్రీవాల్ ప్రశ్నించారు.ఈకేసులో తనను అరెస్ట్‌ చేసేందుకు తగిన ఆధారాలు ఈడీ వద్ద లేవని తెలిపారు. ఏ కోర్టు కూడా తనను దోషిగా పరిగణించలేదని కేజ్రీవాల్ కోర్టు ముందు వాదించారు.ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన 31 వేల పేజీల ఛార్జిషీట్‌లో, ఈడీ దాఖలు చేసిన 25వేల పేజీల ఛార్జిషీట్‌లో ఎక్కడా తన పేరు లేదని కేజ్రీవాల్ తెలిపారు. అయినా తనను ఎందుకు అరెస్ట్‌ చేశారని కేజ్రీవాల్ ప్రశ్నించారు.ఈక్రమంలోనే తనను ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరికించడమే లక్ష్యంగా ఈడీ అధికారులు ప్రవర్తిస్తున్నారని కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.ఈ కేసులో అప్రూవర్‌గా మారిన మాగుంట రాఘవరెడ్డి ఇచ్చి 7 స్టేట్‌మెంట్లలో 6 స్టేట్‌మెంట్లలో తన పేరు లేదని చెప్పారు. శరత్‌ చంద్రారెడ్డి అరెస్ట్‌ తర్వాత రూ.55 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా బీజేపీకి ఇచ్చాడని ఈ సందర్భంగా కేజ్రీవాల్ గుర్తు చేశారు.శరత్ చంద్రారెడ్డితో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆరోపించారు.ఈ సందర్భంగా ఈడీ అధికారులకు రెండు లక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్న కేజ్రీవాల్..అందులో ఒకటి తనను ఈ కేసులో ఇరికించడం..రెండోది ఆప్‌ను లేకుండా చేయడమేనని కోర్టు ముందు చెప్పారు.ఇక ఈ కేసులో మరో 7 రోజులపాటు కేజ్రీవాల్‌ను కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఈడీ కోరింది. రెండు వైపులా వాదనలు విన్న కోర్టు..కేజ్రీవాల్‌ కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో ఏప్రిల్‌ 1 వ తేదీ వరకు కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీలో ఉండనున్నారు.

👉*లైసెన్సుడ్ ఆయుధాల డిపాజిట్, లైసెన్సు లేని ఆయుధాల కట్టడికి ప్రత్యేక చర్యలు: ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్.. ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి*

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున లైసెన్సులు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు.కొత్తగా ఎలాంటి లైసెన్సులు మంజూరు చేయరాదని స్పష్టం చేశారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లైసెన్సుడ్ ఆయుధాల డిపాజిట్, లైసెన్సు లేని ఆయుధాలు, ఇతర పేలుడు పదార్థాల స్వాధీనం, వాటి రవాణాను అడ్డుకోవడం, తదితర అంశాలపైన జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, ఏ.ఎస్.పి నాగేశ్వరరావు, డిఆర్ఓ శ్రీలత, జిల్లా జైలు సూపరింటెండెంట్ వరుణా రెడ్డి మరియు ఇతర అధికారులతో కలిసి ఆయన గురువారం ప్రకాశం భవనంలోని తన చాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యక్తిగత లైసెన్స్డ్ఆయుధాలను అందరూ తిరిగి డిపాజిట్ చేసేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.లైసెన్సుల జారీ, ఆయుధాల రకాలకు సంబంధించిన వివరాలతో కూడిన రిజిస్టర్ లను పక్కాగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు.పోలీసు, రెవెన్యూ అధికారుల మధ్య కామన్ డేటా ఉండాలని ఆయన సూచించారు. లైసెన్సుదారులు చనిపోతే వారి వద్ద ఉన్న ఆయుధాల స్థితిగతులు,రాజకీయ నేపథ్యమున్న ఖైదీలు జైలులో నుంచి ప్రతివారం కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న కాల్ డేటా వివరాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.శాంతియుత ఎన్నికల నిర్వహణ పైన ఇలాంటి ఖైదీలు ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకుండా గట్టి నిఘా పెట్టాలని ఆయన సూచించారు…దీనిపై ఎస్పీ స్పందిస్తూ లైసెన్స్ దారులు తమ ఆయుధాలను డిపాజిట్ చేసేలా ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే చర్యలు తీసుకున్నామన్నారు.ప్రతి లైసెన్స్ ఆయుధం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు.గుర్తింపు లేని ఆయుధాల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టామని,ఇలాంటివి రవాణా జరగకుండా నిఘా పెట్టామని తెలిపారు.జైలులోని ఖైదీల నేర చరిత్ర, రాజకీయనేపథ్య వివరాలను కూడా సంబంధిత అధికారుల ద్వారా తీసుకుని అలాంటి ఖైదీల అనుచరుల కదలికలను గమనిస్తున్నామన్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.

*బీజేపీ అభ్యర్థులంతా చంద్రబాబు మనుషులే: సజ్జల* బీజేపీ తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థుల జాబితాను కూడా చంద్రబాబు నిర్ణయించారని సజ్జల ఆరోపించారు.ఏపీలో త్వరలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేనలు పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే బీజేపీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల జాబితాను బీజేపీ హైకమాండ్ విడుదల చేసింది.ఆంధ్రప్రదేశ్ లోని 10 శాసనసభ స్థానాలకు గాను బరిలో దిగుతున్న క్యాండిడేట్ల వివరాలను బిజెపి వెల్లడించింది.ఈ క్రమంలోనే ఆ జాబితా పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బీజేపీ తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థుల జాబితాను కూడా చంద్రబాబు నిర్ణయించారని సజ్జల ఆరోపించారు. బీజేపీలోని తన మనుషులకు టికెట్లు ఇప్పించి చంద్రబాబు పావులు కదిపారని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో ఉన్నది టీడీపీ ఏజెంట్లేనని కథనాలు వస్తున్నాయని సజ్జల ఆరోపించారు.3 కోట్లు ఇస్తే సీటు వదిలేస్తానని టీడీపీ నేతకు ఓ బీజేపీ నేత ఆఫర్ ఇచ్చినట్టు ఆడియో లీక్ అయిందని గుర్తు చేశారు.ఇక,జనసేన అభ్యర్థుల జాబితానూ చంద్రబాబు తన మనుషులతో నింపేశారని ఆరోపించారు.ఇదంతా చంద్రబాబు ఆడుతున్న నాటకం అని సజ్జల ఎద్దేవా చేశారు.

👉కానీ ప్రజలు మాత్రం టిడిపి గెలిచిన వైసిపి గెలిచిన మోడీ కను సన్నల్లోనే ఉంటాయన్నది స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు.. లేదంటే ఇరు పార్టీల నాయకులు జైళ్ళ పాలు కావాల్సి వస్తుందని  బహిరంగంగా ప్రచారం జరుగుతుంది.

మోడీ- జగన్ ల మధ్య ఏం జరుగుతుంది..??? ..మోడీ గురించి జగన్ మాట్లాడడు. జగన్ గురించి మోడీ మాట్లాడడు. వీరి మధ్య ఏదో జరుగుతుందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ఏపీలో ప్రారంభించారు.ఈ సభలలో ఆయన ప్రసంగం అంతా చంద్రబాబు మీదనే ఉంది. ఆయననే టార్గెట్ చేశారు.బాబు రాజకీయాలు నీచంగా చేస్తున్నారు అని విరుచుకుపడ్డారు.అంతా కలసి తన మీదకు దండెత్తి వస్తున్నారు అన్నారే తప్ప ఆ కూటమిలో ఉన్న బీజేపీని పల్లెత్తు మాట అనలేదు.జనసేన పేరు ప్రస్తావించకపోయినప్పటికీ దత్తపుత్రుడు అని పవన్ ని టార్గెట్ చేశారు.మరి బీజేపీ పొత్తులో ఉంది కదా ఏపీకి విభజన హామీలు అమలు చేయలేదు కదా, ప్రత్యేక హోదా ఇవ్వలేదు కదా ఏపీకి స్పెషల్ గ్రాంట్స్ ఇవ్వలేదు కదా పోలవరం పూర్తి చేయలేక పోయింది. రాజధానికి నిధులు ఇచ్చి నిర్మించలేక పోయింది ఇలా చాలా ఉన్నాయి.మరి మోడీ ప్రభుత్వం మీద జగన్ ఎందుకు విమర్శలు చేయలేదు అన్న చర్చ సాగుతోంది.ఇక కంటికి కనిపిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తోంది బీజేపీ, కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదు. ఇలా చూస్తే కనుక బీజేపీ ప్రభుత్వం ఏపీకి ఏమీ చేయలేదు.గట్టిగా మాట్లాడితే కేంద్రాన్ని ఎన్ని అయినా అనవచ్చు.కానీ జగన్ ఎక్కడా మోడీ పేరు ఎత్తలేదు,ఆయన ఊసు తలవలేదు తన స్పీచ్ మొత్తం చంద్రబాబు చుట్టూ తిప్పేశారు.మోడీ చూస్తే ఏపీలో జగన్ మీద ఏవిధంగా విమర్శలు చేయలేదు.డిటో అన్నట్లుగా జగన్ కూడా మోడీని ఏమీ అనడంలేదు.అసలు ఏమి జరుగుతోంది అన్నదే అంతా ఆలోచిస్తున్నారు.ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ వైరం ఉంది.ప్రత్యర్ధులుగా ఉంటూ ఎన్నికల సమరంలో పాలు పంచుకుంటున్నారు.కానీ కూటమికి పెద్దన్న మోడీని జగన్ విమర్శించడంలేదు. ఏపీలో ప్రభుత్వాన్ని అయిదేళ్ల పాటు నడిపిన వైసీపీ అధినేత జగన్ గురించి మోడీ అనడం లేదు.దీంతోనే ఏదో జరుగుతోంది తెర వెనక అన్నది మాత్రం అందరిలో అనుమానాలుగా ఉన్నాయని అంటున్నారు.అయితే మోడీతో పెట్టుకున్న వారికి ఏమి జరుగుతుందో అందరికీ తెలుసు. కేజ్రీవాల్ ఇటీవల అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. అలాగే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది.బలమైన ప్రభుత్వం కేంద్రంలో ఉండబోతోంది. అందుకే ఎందుకొచ్చింది అనే జగన్ బీజేపీ జోలికి పోవడం లేదు అని అంటున్నారు.ఏపీలో చూస్తే బీజేపీ కూడా ఏమీ లేకపోవడం వల్ల కూడా ఆయన ఆ పార్టీని టార్గెట్ చేయడం లేదు అంటున్నారు.ఇక మోడీ కూడా ఏపీలో పాతిక సీట్లూ బీజేపీ వైపు ఉండేలా చూసుకోవడం కోసమే జగన్ గురించి పెద్దగా విమర్శలు చేయడంలేదని అంటున్నారు. ఏది ఏమైనా టిడిపి వైసిపి పార్టీలు బిజెపి కనుసనల్లోనే నడుస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు.

👉 *ఈవీఎంల తయారీ సంస్థ డైరెక్టర్ ఇప్పుడు బీజేపీ అభ్యర్థి:*…ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అదోని అసెంబ్లీ స్థానానికి పార్థసారధిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. పార్థ డెంటల్ యజమాని ఆయన. అంతేగాకుండా ఆపార్టీలో ఓబీసీ మోర్చా నాయకుడు. దానికి తోడు ఈవీఎంలను తయారుచేసే ఈసీఐఎల్ లో డైరెక్టర్ గా నియమితుడైన బీజేపీ నాయకుడు.ఈవీఎంల మీద అనేక సందేహాలు కొనసాగుతున్న తరుణంలో వాటిని తయారుచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలో తమ పార్టీ వారినే ఇండిపెండెంట్ డైరెక్టర్లు అంటూ బీజేపీ నియమించింది. ఇప్పుడా డైరెక్టర్ లో ఒకరికి టికెట్ కూడా ఇచ్చింది.ఎన్నికల పారదర్శకత, దేశంలో వ్యవస్థల స్వతంత్య్రత ఏ స్థాయికి చేరాయో,ఎంతకు దిగజారాయో ఇది చాటుతుంది. ప్రజాస్వామ్యాన్ని పరిహాసించే చర్చగా ఉంది. మరలా బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇస్తే దేశ పరిస్థితి ఏ స్థాయికి దిగజారగలదో అర్ధం చేసుకోవచ్చు.

👉*జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో సాంసంగ్ సెల్ ఫోన్ దుకాణంలో భారీ చోరీ.. నగరం నడిబొడ్డులో దొంగల బీభత్సం ఐదు లక్షల నగదు 30 లక్షల విలువైన స్మార్ట్ ఫోన్లు* ఒంగోలు పట్టణంలోని కర్నూల్ రోడ్ ఫ్లైఓవర్ పక్కన ఉన్న సాంసంగ్ అక్షిత మొబైల్ షాప్ లో గుర్తుతెలియని దుండగులు షట్టర్ పగలగొట్టి షాపులో 5 లక్షల రూపాయలు నగదు సుమారు 30 లక్షలు విలువైన స్మార్ట్ ఫోన్లన్నీ దోచుకొని వెళ్లినట్లు సెల్ షాపు ఓనర్ అనంతశెట్టి శ్రీను తెలిపారు విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు సిఐ భక్తవత్సలం రెడ్డి క్లూస్ టీం తో తనిఖీలు చేస్తున్నారు . గురువారం రాత్రి 11 గంటల వరకు షాప్ యజమాని వ్యాపార లావాదేవీలన్నీ చూసుకొని సెల్ షాపులు మూసివేసి వెళ్లారు ఉదయం 6 గంటల సమయంలో పేపర్ బాయ్ పేపర్ వేయటానికి వచ్చి చూడగా షట్టర్ పగలగొట్టి ఉండటం చూసి దుకాణం యజమానికి సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న యజమాని దుకాణంలోని ఐదు లక్షల రూపాయల నగదు 30 లక్షల విలువైన స్మార్ట్ ఫోన్లన్నీ చోరీ గురయ్యాయని గుర్తించి తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిత్యం రద్దీగా ఉండే కర్నూల్ రోడ్డు ఫ్లైఓవర్ పక్కనే భారీ చోరీ జరగటం పట్ల ప్రజల ఆందోళనకు గురవుతున్నారు

*👉సామాజిక మాధ్యమాల్లో నిరాధార, వాస్తవ దూరమైన సమాచారం ప్రసారం చేసినా చట్టపరపమైన చర్యలు:*సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను మరియు ట్రోలింగ్ లను తీవ్రంగా పరిగణిస్తాం.. ప్రకాశం జిల్లా ఎస్పీ పి. పరమేశ్వర రెడ్డి ఐపియస్..

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను మరియు ట్రోలింగ్ లను తీవ్రంగా పరిగణిస్తాంవాట్సాప్/టెలిగ్రామ్/ఫేస్ బుక్/ఇంస్టాగ్రామ్ మరియు ఇతర గ్రూపుల్లో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే గ్రూప్ అడ్మిన్ దే పూర్తి బాధ్యత అని హెచ్చరించారు.త్వరలో జరగబోనున్న సార్వత్రిక ఎన్నికలు -2024 నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలు, ట్రోలింగ్లు, తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని, సరైన సమాచారం లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా నిరాధార, వాస్తవ దూరమైన పోస్ట్లు/వీడియోలు/వార్తలు సామాజిక మాధ్యమాల్లో ఉంచినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.గ్రూప్ లో యాడ్ చేసే ప్రతి సభ్యుడు తప్పకుండా అడ్మిన్ కి తెలిసి ఉండాలని, ఎవరైనా సభ్యులు అభ్యంతకరంగా ప్రవర్తిస్తే వెంటనే గ్రూప్ నుండి తొలగించాలని,అభ్యంతకర, ఫేక్ న్యూస్, వదంతులుపై స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలని, వివాదస్పద పోస్టింగ్ సంబంధించి అడ్మిన్ చర్యలు తీసుకోకుంటే వారిపై ఐపిసి 153A మరియు సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.👉దేశ భద్రతకు ముప్పు కల్గించేవి, కుల, మత, వర్గ మరియు రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేవి, తప్పుడు సమాచారం, అసభ్యకర, అభ్యంతర, నేరపూరితమైన మరియు బెదిరింపులకు పాల్పడేవి, వ్యక్తిగత పరపతి మరియు మనోభావాలు దెబ్బతీసే విధంగా మార్ఫింగ్ చేసిన ఫోటోలు/వీడియోలు, ప్రజలను తప్పుదారి పట్టించే సమాచారం ఇతరులకు ఎట్టి పరిస్థితిలో షేర్ చేయకూడదని సూచించారు.సామాజిక మాధ్యమాలలో వస్తున్న అసభ్యకర,అభ్యంతరకర, విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టింగులకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా ప్రకాశం జిల్లా పోలీస్ వాట్సప్ నెంబర్: 9121102266 కు సమాచారం తెలియజేయండి. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.

👉*50 కుటుంబాలు వైసీపీలో చేరిక*..ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చోళవీడు గ్రామంలో 50 కుటుంబాలు టిడిపిని వీడి వైసీపీలో చేరాయి.గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సమక్షంలో 50 కుటుంబాలు వైసీపీలో చేరాయి.ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

👉టీడీపీలో చేరిన కందులాపురం గ్రామ వాలంటీర్…….కంభం పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సోదరుడు కృష్ణకిషోర్ రెడ్డి సమక్షంలో కందులాపురం గ్రామానికీ చెందిన గ్రామ వాలంటీర్ బొగెం కొండయ్య తన వాలంటీర్ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు.ఈ సందర్బంగా టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నేటి నుండి తెలుగుదేశం గెలుపు కోసం పని చేస్తానని వాలంటీర్ తెలిపారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేతం శ్రీను, రాజు, గాంధీ పాల్గోన్నారు.*

*అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి పోలీసులు..ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం లో అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని స్థానిక ఎస్సై బి.నరసింహా రావు గురువారం అదుపులోకి తీసుకున్నారు.అదుపులోకి తీసుకున్న నిందితుని వద్ద నుండి 49 (180 ఏం.ఎల్) మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు..

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం