👉హఫీజ్‌ఖాన్‌కు రాజ్యసభ సీటిస్తా: మైనారిటీలకు జగన్ గేలం???
♦♦మైనారిటీ ఓటు బ్యాంకుకు సీఎం జగన్ మరోసారి గేలం వేశారు.పార్టీ కోసం ఎంతగానో శ్రమించిన హఫీజ్ ఖాన్‌ను రాజ్యసభకు పంపిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఎమ్మిగనూరులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కర్నూల్ నుంచి హఫీజ్ ఖాన్‌కు తాను టికెట్ ఇవ్వలేకపోయానని చెప్పారు.
అయితే.. అందుకు ప్రతిగా 2 ఏళ్ల తరువాత వచ్చే రాజ్యసభ ఎన్నికలకు(2026లో) అభ్యర్థిగా హఫీజ్‌ను ఇప్పుడే ప్రకటిస్తున్నట్టు చెప్పారు.తన మనసులో ఎలాంటి కల్మషం ఉండదని,అందుకే లక్షల మంది సమక్షంలో ముస్లిం నేత హఫీజ్ ఖాన్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించానన్నారు.
“కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో హఫీజ్ ఖాన్ కు టికెట్ కేటాయించలేకపోయాం. రెండేళ్ల తర్వాత రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా హఫీజ్ ఖాన్ రాజ్యసభకు పోటీ చేస్తారు” అని సీఎం జగన్ వివరించారు.
రెండేళ్ల తర్వాత వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో కొందరి పదవీకాలం ముగుస్తుందని, హఫీజ్ ఖాన్ కు కచ్చితంగా టికెట్ ఇస్తామని సభాముఖంగా సీఎం జగన్ హామీ ఇచ్చారు. అయితే..గతంలోనూ ఇలాంటి హామీలు చాలానే ఇచ్చారు. కానీ,ఏఒక్కటీ నిలబెట్టుకోలేకపోవడం గమనార్హం.
- *గళాలకు తాళం: నాలుగు రోజుల్లో 40 మందికి ఈడీ నోటీసులు!!!…
బలమైన గళం వినిపిస్తోందా? అది కూడా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఉందా? అయితే.. వెంటనే తాళం వేసేయండి! ఇదీ.. ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు అవలంబిస్తు న్న విధానం.ఇప్పటి వరకు ఒక ఎత్తు.అంటే.. గడిచిన ఐదేళ్ల కాలంలో ఎలా జరిగిపోయిందో. ఏమో..ఎంత మందికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారో.. ఎన్ని కేసులు పెట్టారో.. కానీ.. ఇప్పుడు కీలక సమయం.పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమైన సమయం. ఈ నేపథ్యంలో విచ్చలవిడితనం పెరిగిపోయింది.గత ఐదేళ్లలో ఎంత మందికి నోటీసులు ఇచ్చారో లెక్కలు తెలియవు కానీ..తాజాగా గడిచిన నాలుగు రోజుల్లో ఇంకా చెప్పాలంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత.. అనూహ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న బలమైన గళాలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరి సంఖ్య ఏకంగా 40 వరకు ఉందని తెలుస్తోంది.వీరిలో ముఖ్యమంత్రుల పిల్లల నుంచి మాజీ ముఖ్యమంత్రుల వరకు ఉన్నారు.ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే..వీరంతా బలమైన గళంతో మోడీ ఓటు బ్యాంకును ప్రభావితం చేసేవారే కావడం గమనార్హం. ఇదీ లెక్క..తాజాగా నాలుగు రోజుల్లో ఈడీ నోటీసులు ఇచ్చిన వారిని చూస్తే..కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణ విజయన్,పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఫైర్‌బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రా ఉన్నారు.అదేవిధంగా జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా,తమిళనాడు అధికార పార్టీ డీఎంకేకి చెందిన రాజా,యూపీ ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీకి చెందిన కీలక నేత, ఫైర్ బ్రాండ్, మోడీని ఓడిస్తామని చెప్పిన సోలంకి, మహారాష్ట్ర లోని ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నేత కీర్తికార్, బీహార్ ప్రధాన ప్రతిపక్షం ఆర్‌జేడీ ఫైర్ బ్రాండ్.. బీజేపీని గద్దె దింపుతామని ప్రతిజ్ఞ చేసిన సుభాష్ లు సహా అనేక మంది ఉన్నారు…మరి..ఇదంతా చూస్తే..దేశం ఎటు పోతోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రధానిని విమర్శించిన వారికి కూడా వార్నింగులు ఇస్తున్నారు. కర్ణాటకకు చెందిన తంగేడికి తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు.తమిళనాడుకు చెందిన మంత్రికి కూడా నోటీసులు ఇచ్చి కేసు నమోదు చేశారు. దీంతో అమర్త్యసేన్ వంటి నోబెల్ బహుమతి అందుకున్నవారు..తాజాగా ప్రపంచ మీడియాతో మాట్లాడుతూ..భారత దేశం నిరంకుశ వైఖరి దిశగా అడుగులు వేస్తోందని వ్యాఖ్యానించడం గమనార్హం.
👉 ఈనెల 31వ తేదీ మార్కాపురం పట్టణంలో జరిగే చంద్రబాబు నాయుడు ప్రజాగళం బహిరంగ సభను జయప్రదం చేయండి- మాజీ ఎమ్మెల్యే కందుల
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మార్కాపురం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీని స్థాపించారో కానీ ఇప్పటికి కూడా సంస్థాగతంగా ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీ సొంతమని పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని అన్నారు.
ఈనెల 31వ తేదీన మధ్యాహ్నం రెండున్నర గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మార్కాపురంనకు విచ్చేసి గడియార స్తంభం సెంటర్ వద్ద ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొంటారని ఈసభకు నియోజకవర్గంలోని ప్రతి తెలుగుదేశం కార్యకర్త పాల్గొని మునుపెన్నడూ లేని విధంగా సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
👉తెలుగుదేశం పార్టీలో చేరికలు..
మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సమక్షంలో మార్కాపురం పట్టణంలోని తూర్పువీధిలో తూర్పు వీధికి చెందిన 50 కుటుంబాలు,మార్కాపురం మండలం బోడపాడు గ్రామం నకు చెందిన 50 కుటుంబాల తో పాటు మార్కాపురం పట్టణంలో దొడ్డావారి వీధికి చెందిన 100 కుటుంబాలు గురువారం రాత్రి తెలుగుదేశం పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారిలో తూర్పు వీధి కి చెందిన గుంటక వెంకటేశ్వర రెడ్డి, దగ్గుల శ్రీనివాస్ రెడ్డి, గాయం వెంకటనారాయణరెడ్డి,తదితర 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
బోడపాడు గ్రామం నుండి కనక శ్రీనివాసులు, గంగిరెడ్డి శేషిరెడ్డి, వెన్న వెంకటరెడ్డి, తదితర 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
దొడ్డవారి వీధి నుండి దొడ్డ బ్రహ్మానందరెడ్డి,దొడ్డ సత్యనారాయణ రెడ్డి, దొడ్డ రమణారెడ్డి,దొడ్డ జగన్మోహన్ రెడ్డి,తదితర 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
👉చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన.. గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు..
ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా నియమించిన మొదటి సారిగా గిద్దలూరు నియోజకవర్గానికి వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి గజ మాలతో ఘన స్వాగతం ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి తో పాటు అన్న రాంబాబు, నియోజవర్గ వైసీపీ నాయకులు,కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు..
👉 గిద్దలూరు నియోజకవర్గంలో వైస్సాపీసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కెపి నాగార్జునరెడ్డి సమక్షంలో టీడీపీ రాష్ట్ర తెలుగుయువత నాయకులు షేక్. ఇర్ఫాన్, కంభం మాజీ టీడీపీ పట్టణ నాయకులు షేక్. బాబు, మాజీ ఎంపీటీసీ ఇస్మాయిల్ మరియు ఖాజా టీడీపీని విడి వైసీపీ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారందరికీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డిలు వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ విజయానికి అన్నీ రంగాల కృషి చేయాలని పిలుపునిచ్చారు
*👉ఇంటింటి ప్రచారంలో ముత్తుముల సతీమణి పుష్పలీల
గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిల అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపే లక్ష్యంగా వారి సతీమణి శ్రీమతి పుష్పలీల గిద్దలూరు పట్టణంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.గిద్దలూరు పట్టణంలోని నల్లబండబజారులో ఇంటింటికి తిరిగి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మ్యానిఫెస్టోలోని అంశాలను, సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. నాడు తెలుగుదేశం హయాంలో అశోక్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో గిద్దలూరు పట్టణంలో ఎంతో అభివృద్ధి చేశాడని, పట్టణంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించారని ప్రజలకు ఏ సమస్య వచ్చిన స్థానికంగా అందుబాటులోనే ఉంటారని,గిద్దలూరు నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరగాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ సైకిల్ గుర్తు పై ఓటు వేసి అశోక్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్ధించారు.*
కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు చింతలపూరి బాలరాజు,షేక్ మహబూబ్ బాషా,షేక్ పెద్ద మస్తాన్,బొంతా లక్ష్మీదేవి,బీజేపీ నాయకురాలు పిడతల సరస్వతి,గోపారపు గోపాల్ రెడ్డి, పిడతల రవితేజ,పాల్గొన్నారు.
👉పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి నివాసానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.గిద్దలూరు వైఎస్ఆర్సిపి నేత పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి నివాసానికి ఒంగోలు పార్లమెంటు వైసిపి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సందర్శించారు.ఆయనతో పాటు గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి కూడా పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డితో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాసేపు ముచ్చటించారు.మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.2024 ఎన్నికలలో తమ సహాయ సహకారాలు అవసరమని పిడతల రాంభూపాల్ రెడ్డి ని,పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు.ముందుగా కార్యకర్తలు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
👉బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం: టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల.. ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినదినోత్సవ వేడుకలు*..
తెలుగు రాష్ట్రాల్లోని బడుగు, బలహీన వర్గాల కోసం అన్న నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘణంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేసి అనంతరం ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన అధ్యుడు తారకరామారావు అని, మహిళలకు ఆస్థిలో సమాన హక్కు, బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం అని, ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని ఆ దిశగానే బీసీ డిక్లరేషన్ ను ప్రకటించి బడుగు బలహీన వర్గాల ప్రజలకు పార్టీ అండగా నిలిచిందన్నారు.అన్నీ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సూపర్ సిక్స్ పథకాలు లబ్ది చేకూరుస్తాయని,రాబోయే ఎన్నికల్లో ఎన్టీఆర్ ఆశీర్వాదంతో తెలుగుదేశం అధికారంలోకి రావటం తద్యం అన్నారు..కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు సయ్యద్ శానేశావలి, ప్రధాన కార్యదర్శి పందీటి రజిని బాబు, మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు బుడతా మధుసూదన్ యాదవ్, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గోన్నారు.* 👉ముత్తుముల సమక్షంలో 150 కుటుంబాలతో సహా టీడీపీలో చేరిన రాచర్ల వైస్ ఎంపీపీ సుజాత*గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో రాచర్ల మండలం,సత్యవోలు పంచాయతీ,రంగారెడ్డి పల్లె గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాచర్ల మండల వైస్ ఎంపీపీ ఈదుల సుజాత గ్రామంలోని ముఖ్య నాయకులు మరియు తన అనుచరులు మొత్తం 150 కుటుంబాలతో సహా అధికార పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈసందర్బంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసిపిని వీడిన వైస్ ఎంపీపీ సుజాత మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలోనే మహిళా సంక్షేమం జరిగిందని, నాడు ఎన్టీఆర్ ఆస్థిలో సమాన హక్కు కల్పిస్తే,చంద్రబాబు హయాంలో మహిళలు ఆర్ధికంగా బలోపేతం కావటానికి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారని,రాజకీయ అవకాశాలు, మహిళలకు విద్యా అవకాశాలు,కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పార్టీలో చేరటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.. కార్యక్రమంలో వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ గోళం పాలరాజు యాదవ్, జిల్లెల్ల బాల వెంకటరెడ్డి, నర్సిరెడ్డి, దొనపాటి వెంకట నారాయణ రెడ్డి, మాజీ సొసైటీ మెంబర్ ఈదుల రంగస్వామి రెడ్డి,ఈదుల హరి రంగారెడ్డి,కొత్తకోట రాజశేఖర్,కటారు రాజశేఖర్, కొత్తకోట పెద్దిరాజు,ముత్యాల శేషారెడ్డి, కొండా సుబ్బారెడ్డి దొండపాటీ శ్రీరామిరెడ్డి, తదితర ముఖ్య నాయకులు, మండల టీడీపీ నాయకులు పాల్గోన్నారు……………….👉బేస్తవారిపేటలో ముమ్మరంగా వాహన తనిఖీలు*
స్థానిక టోల్గేట్ సమీపంలో ట్రైనీ డీఎస్పీ షహబాజ్అహ్మద్, సీఐరామకోటయ్య వాహన తనిఖీలు నిర్వహించారు.ట్రైనీ డీఎస్పీ షహబాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మండలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.