ఉమ్మడి అనంతలో వరద విళయం..వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున..వంగవీటి రాధాను పరామర్శించిన మంత్రి నారా లోకేష్..హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం ..గండేపల్లి సెంధిని (లిక్కర్)ఫ్యాక్టరీలో సిఐడి సోదాలు.. సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బెదిరింపులు.. రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన కానిస్టేబుల్ భార్యలు.. దారి దోపిడి కేసును ఛేదించిన బాపట్ల పోలీసులు..జడ్పి సర్వసభ్య సమావేశంలో సమస్యలు లేవనెత్తిన ఎమ్మెల్యే ముత్తుముల..ఏసీబీకి చిక్కిన పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్..సత్యకుమార్ యాదవ్పై హత్యాయత్నం..బ్రతికుండగానే డెత్ సర్టిఫికేట్ ..6 ఎకరాల భూమి స్వాహా..

👉వంగవీటి రాధాను పరామర్శించిన మంత్రి నారా లోకేష్..
అమరావతిః ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు.ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి..అనంతరం తాడేపల్లి ప్రాతూరులోని వంగవీటి రాధా ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు.ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
👉మామూనూరు 4వ బేటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాల ఆవేదన..వరంగల్ జిల్లా..కానిస్టేబుళ్లను వెట్టిసాకిరి చేపిస్తూ.. కనీసం సెలవులు ఇవ్వకుండా.. కుటుంబానికి దూరం చేస్తున్నారని కన్నీరు మున్నేరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు..కానిస్టేబుల్ ల భార్యలు రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు..నిరసన ఆపేందుకు RTO ఆపీస్ నుండి మామునూరు బేటాలియన్ వరకు పెద్ద ఎత్తున బందోబస్తూ ఏర్పాటు..రిజర్వ్డ్ పోలీసుల బాధలను అర్థం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విన్నపం..కొత్త డీజీ రావడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం.
👉 ఉమ్మడి అనంతలో వరద విళయం ..
తెల్లవారుజామున వరకు భారీ వర్షాలు కురిసాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం అనంతపురం జిల్లాలోని అనంతపురం నగర శివారు కాలనీలో పూర్తిగా నీట మునిగాయి. శ్రీ సత్య సాయి జిల్లాలో చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రెండున్నర దశాబ్దాల కాలంలో ఎప్పుడూ లేనివిధంగా చిత్రావతిలో నీరు పారుతోంది. అదే జిల్లాలోని కనగానపల్లి చెరువు తెగిపోవడంతో అనంతపురం నగరం సమీప కాలనీలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని ఎన్నడూ కూడా ఇలా ఇంత పెద్ద ఎత్తున వరద నీరు రాలేదని పలు కాలనీలవాసులు తెలిపారు.
భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం అందుతుంది. తిండి గింజలు కట్టుకున్న బట్టలు సైతం నీటిపాలయ్యాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రధానంగా శ్రీసత్యసాయి జిల్లాలోని వాగులు,వంకలు,చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అక్కడికి సమీపంలో ఉన్న కాలనీవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. అదే సందర్భంలో నీట మునిగిన పలు కాలనీల నుంచి ప్రజలను పోలీసు యంత్రాంగం రక్షించింది.అనంతపురంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు పండమేరు వాగు ఉప్పొంగింది.
వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రవాహం పెరుగుతుండ డంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు యంత్రాంగం తరలిస్తోంది. భారీ వర్షాలకు 44 పై భారీగా వర్షపు నీరు చేరడంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహన దారులు వదర నీటిలో ఇబ్బందులు పడ్డారు.
👉వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున..
అనంతపురంలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది, ఈ భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది, పండ మేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది,సినీ నటుడు అక్కినేని నాగార్జున మంగళవారం వరదలో చిక్కుకున్నారు. అనంతపురంలో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవం లో ఆయన పాల్గొనాల్సి ఉంది. పుట్టపర్తి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం వెళ్తున్న సమయంలో ఆయన ప్రయాణీస్తున్న కారు వరదలో చిక్కుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు మరో దారిలో పుట్టపర్తి నుంచి అనంత పురానికి ఆయనను సురక్షితంగా సాగనంపారు.
👉 ఇటీవల బాపట్ల జిల్లా మేదర మెట్ల హైవేలో జరిగిన 39.5 లక్షల దారిదోపిడి కేసును ఛేదించిన పోలీసులు..
అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, మేదరమెట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీ ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి… అభినందించారు…బాపట్ల జిల్లా మేదరమెట్ల లో సంచలనం కలిగించిన భారీ దారి దోపిడీని చేదించిన అద్దంకి రూరల్ సీఐ డి మల్లికార్జునరావు, మేదరమెట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీ లను జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ తుషార్ డూడి… అభినందించారు…ముందుగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించరు..
ధనికొండ వెకన్నస్వామి, పగడాల మహేష్, టెంటు కార్తీక్, పూరేటి శివశ్రీనివసరావు, లను సోమవారం మేదరమెట్ల వై జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 39.5 లక్ష లను స్వాధీనం చేసుకున్నారు.. నేరస్తులు ఓకే గ్రామని చెందిన వారు. కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అడినందించారు… ఈ కార్యక్రమాల్లో జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వరావు, సీఐ లు ఎస్ఐ లు పోలిసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి ఫయాజ్..
👉హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం !😯
హైదరాబాద్‌లో స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. తక్కువ ధరలే ప్లాట్లు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ఈ కంపెనీ వంద కోట్లలకుపైగా వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే నెలలు గడిచిపోతున్నా ప్లాట్లు ఇవ్వకపోవడం తమ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులంతా ఆ కంపెనీ కార్యాలయం ఉన్న ఎల్బీనగర్ లో ఆందోళనకు దిగారు.
స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ సంస్థ ఫామ్ ల్యాండ్స్, హెచ్‌ఎండీఏ ప్లాట్లు అమ్ముతామని ఏజెంట్లను పెట్టుకుని విస్తృతంగా ప్రచారం చేసుకుంది. మొదట్లో పెద్ద ఎత్తున లగ్జరీ కార్యక్రమాలు నిర్వహించింది. ఏజెంట్లకు ఆడికార్లు వంటివి బహుకరించింది. ఈ బిల్డప్ చూసి భారీగా భూములున్నాయని చాలా మంది అనుకున్నారు. పద్ద ఎత్తున రిటర్న్స్ వస్తాయని చెప్పి ప్లాట్ల కోసం డబ్బులు కట్టించు కున్నారు.ఏవో ఒప్పంద పత్రాలు ఇచ్చారు కానీ అందులో భూమి,ప్లాట్ల వివరాలు లేవు.మూడేళ్ల నుంచి వారి కార్యకలాపాలు తగ్గిపోయాయి.డబ్బులు కట్టిన వారు తమ ప్లాట్లు తమకు ఇవ్వాలని అడుగుతున్నా స్పందించడం లేదు. చివరికి వారు స్పెక్ట్రా కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్కువ ధరకు ప్లాట్లు అని చెబితే…సర్వం పోగొట్టుకున్న కుటుంబాలు లబోదిబో మంటున్నాయి. స్టేట్ ఇంచార్జ్ హైదర్ అలీ..
👉 సత్యకుమార్ యాదవ్పై హత్యాయత్నం..పోలీసులకు ఫిర్యాదు..
మంత్రి సత్య కుమార్ యాదవ్ పై గత వైసీపీ ప్రభుత్వంలో హత్యాయత్నం జరిగిందని బీజేవైఎం నేత సురేశ్ గుంటూరు ఎస్పీకి పిర్యాదు చేసారు. 2023లో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపి తిరిగి వస్తుండగా, అప్పటి ఎంపీ నందిగం సురేశ్ మరియు మరికొందరు దాడికి యత్నించారని పేర్కొన్నారు. ఆ సమయంలో పోలీసుల వద్ద ఫిర్యాదు చేసినప్పటికీ, ఫిర్యాదును స్వీకరించలేదని సురేశ్ ఆరోపించారు. ప్రస్తుతం, గుంటూరు ఎస్పీ తాజా ఫిర్యాదును స్వీకరించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.బీజేవైఎం (భారతీయ జనతా యువ మోర్చా) నేత సురేశ్ రాజకీయంగా యాక్టివ్ ఉన్న యువనాయకుడు. ఆయన బీజేపీకి చెందిన యువ నాయకత్వంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. సురేశ్ తరచుగా రాజకీయ, సామాజిక అంశాలపై బలమైన వైఖరిని ప్రకటిస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంటాడు..స్టేట్ ఇంచార్జ్ హైదర్ అలీ.
👉ఎన్టీఆర్ జిల్లా ..కంచికచర్ల మండలం, గండేపల్లి సెంధిని (లిక్కర్)ఫ్యాక్టరీలో సిఐడి సోదాలు..
ఉదయం నుంచి రహస్యంగా కొనసాగుతున్న సోదాలు..
మీడియాను లోపలికి అనుమతించని సిఐడి బృందం..
గతంలో ఫ్యాక్టరీ పై కేసు నమోదు అయిన నేపథ్యంలో నేడు విచారణ నిమిత్తం సిఐడి అధికారులు తనిఖీలు చేస్తున్నట్లుగా సమాచారం..
మరింత సమాచారం తెలియాల్సి ఉంది
👉 దేశంలోని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బెదిరింపులు..
దేశంలోని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బెదిరింపులు
దేశ రాజధాని ఢిల్లీలోని రోహణిలో పేలుడు ఘటన మరువకముందే మరోసారి సీఆర్పీఎఫ్ పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి. దేశంలోని అన్ని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. నైట్రేట్ ఆధారిత పేలుడు పదార్థాలను తరగతి గదుల్లో అమర్చినట్లు దుండగుడు మెయిల్‌లో పేర్కొన్నాడు. ఉదయం 11 గంటల్లోగా అన్ని పాఠశాలలను ఖాళీ చేయాలని అన్నాడు. కాగా, ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
👉ఏసీబీకి చిక్కిన పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్..!
వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం మున్సిప‌ల్ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఏసీబీ దాడులు నిర్వ‌హించారు.
పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు కాంట్రాక్టర్ నుంచి రూ.20,000 లు లంచం తీసుకుంటుండ‌గా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఏసీబీ అడిష‌న‌ల్ ఎస్పీ బి.శ్రీ‌కృష్ణ గౌడ్, కమిషనర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా రు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.
👉ప్రకాశం జిల్లా జడ్పి సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి.
చిన్నపాటి వర్షానికి నూతనంగా నిర్మించిన గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి వర్షానికి లీక్ అవుతుంది😯…రోగులు ఇబ్బంది పడుతున్నారు..నాణ్యత లోపంతో గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు.. కాంట్రాకర్ పై అధికారులు చర్యలు తీసుకోవాలి… అదే కాంట్రాక్టర్ తో ఆసుపత్రి మరమ్మతులు చేపట్టాలి..కలెక్టర్ కుడా ఆసుపత్రిని విజిట్ చేశారు…😱 ఎటువంటి మార్పు లేదు..గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్సుకి కొత్త గా డ్రైవర్ కేటాయించాలి..ఇక కొద్ది ప్రస్తుత అంబులెన్సు డ్రైవర్ రెండు నెలలో రిటర్డ్ అవుతున్నారు.. ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లెడ్ కొరత ఉంది.. అధికారులు దృష్టి సారించి ఆసుపత్రిలో బ్లెడ్ నిల్వలు పెంచాలి..మరో మత్తు డాక్టర్ ని గిద్దలూరు ఆసుపత్రికి కేటాయించాలి.. ఆసుపత్రిలో డాక్టర్స్ కొరత ఉంది.. డిప్యుటీషన్ వెళ్లిన డాక్టర్స్ మళ్ళీ గిద్దలూరు లో విధులు నిర్వహించే విదంగా అధికారులు చూడాలి..
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎస్ రహేమాన్..
👉కడప జిల్లా..యర్రగుంట్ల..*బ్రతికుండగానే డెత్ సర్టిఫికేట్
*6 ఎకరాల భూమి స్వాహా😱😱😱
తాను బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించి తన భూమిని ఆన్లైన్లో ఎక్కించుకున్నారని యర్రగుంట్లకు చెందిన భూమి రెడ్డి చిన్ననాగిరెడ్డి అనే వృద్ధుడు వాపోయాడు.
యర్రగుంట్లలో ఆయన తన గోడును విలేకరులకు తెలుపుతూ.ముద్దనూరు మండలం చిన్న దుద్యాల గ్రామంలో తనకున్న 6 ఎకరాల భూమి నీ ముద్దునూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రైటర్ గా పనిచేస్తున్న బో రెడ్డి శివశంకర్ రెడ్డి తాను మరణించినట్లు తప్పుడు ధృవీకరణ పత్రాన్ని సృష్టించి తన పేరు మీద ఉన్న భూమిని ఆన్లైన్లో శివశంకర్ రెడ్డి తన పేరు మీదికి మార్చుకున్నాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మండల తహసిల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ శివ శంకర్ రెడ్డి పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా అధికారులు తిప్పుకుంటున్నారని ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు..

7k network
Recent Posts

ఉమ్మడి అనంతలో వరద విళయం..వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున..వంగవీటి రాధాను పరామర్శించిన మంత్రి నారా లోకేష్..హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం ..గండేపల్లి సెంధిని (లిక్కర్)ఫ్యాక్టరీలో సిఐడి సోదాలు.. సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బెదిరింపులు.. రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన కానిస్టేబుల్ భార్యలు.. దారి దోపిడి కేసును ఛేదించిన బాపట్ల పోలీసులు..జడ్పి సర్వసభ్య సమావేశంలో సమస్యలు లేవనెత్తిన ఎమ్మెల్యే ముత్తుముల..ఏసీబీకి చిక్కిన పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్..సత్యకుమార్ యాదవ్పై హత్యాయత్నం..బ్రతికుండగానే డెత్ సర్టిఫికేట్ ..6 ఎకరాల భూమి స్వాహా..

విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు కోటి రూపాయలు.. సీఎం రేవంత్.. “దోచుకోవడం,దాచుకోవడం తప్ప విద్యార్థుల ఫీజులు చెల్లించడం తెలియదా -జగన్ పై షర్మిల ఆగ్రహం..”రాష్ట్ర శాసనసభ స్సీకర్‌ అయ్యన్నపాత్రుడు సవాల్.. నాచారం పేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. యువకుడి మృతి ..గుజరాత్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం..”టీచర్ పై ఫొక్సో చట్టం క్రింద కేసు నమోదు..అక్కా చెల్లెళ్ల పై గ్యాంగ్ రేప్!..కాంగ్రెస్‌ నేత మారు గంగారెడ్డి హత్య..పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌ దాఖలు..మ‌మ‌త‌-శ‌ర‌ద్‌-హేమంత్‌ స‌ర‌స‌న‌.. జ‌గ‌న్ కూడా!!.. రేవన్నకు బెయిల్ నిరాకరణ.. ఎపి జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్* మార్కాపురం యూనిట్ ఎన్నిక..మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్

పత్తి చేలల్లో వాడిపోతున్న పసిమొగ్గలు..వారికి అదే చివరి రోజు: సీఎం చంద్రబాబు..తిరుమల కొండపై మరోసారి హెలికాప్టర్ కలకలం..తిరుమల లడ్డు వివాదం — పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్.. చీమకుర్తి రోడ్డు సమస్యపై కలెక్టర్ ఆఫీస్ లో ప్రజా సంకల్ప వేదిక ఫిర్యాదు..టాస్క్ ఫోర్సులో, ఒంగోలు, ఎస్. కొండ, బాపట్ల, మార్కాపురం, గిద్దలూరు కంభంలో ఘనంగా అమరవీరులకు నివాళి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల, ఎమ్మెల్యే ముత్తుముల మాజీ ఎమ్మెల్యే అన్నా..

జర్నలిస్ట్ హత్యకేసులో నిందితుడికి కూటమిలో ప్రమోషన్!?..పెట్రోల్ దాడి ఘటనపై స్పందించిన ఏపీ సీఎం…వైసీపీ స్వామి’కి.. చంద్ర‌బాబు ఒకేసారి రెండు బిగ్ షాక్‌లు!!.. బాధితురాలికి న్యాయం చేయాలి..ఐద్వా, DYFI, SFI, రైతు సంఘాల డిమాండ్.. గుంటూరులో ట్రాఫిక్ డైవర్షన్.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల.. వికలాంగురానికి సాయం అందించిన నూర్ భాషా సంఘం.

యువతి జాతకంలో దోషం ఉందని కారులోనే జల్సా చేసిన పూజారి..జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో లైంగిక వేధింపులు ?..బ్లాక్ లో తిరుమల టికెట్లు అమ్ముకున్న ముస్లిం ఎమ్మెల్సీ! ..కనిపించకుండాపోయిన యువతి.. ఆసుపత్రిలో ప్రత్యక్షం!.విద్యార్థిని మరణం విషాదకరం : హోం మంత్రి అనిత..ఏపీకి చెందిన జవాన్‌ రాజేష్ మృతి.. వైపాలెంలో కార్డెన్ సెర్చ్..పోలీసు అమరవీరుల త్యాగాలను మరువద్దు.. *వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. జూదమాడుతున్న ముగ్గురు పోలీసులు అరెస్ట్ .

కేసీఆర్ కుటుంబానిది దోపిడీ చరిత్ర .. మురికికూపంలో మగ్గిపోతున్న నిరుపేదలకు మంచి భవిష్యత్తును అందించాలన్న లక్ష్యంతోనే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టాం సీఎం రేవంత్..”మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధిలో నా ఇల్లు కూడా పోతుంది..మంత్రి జూపల్లి..”పంటలుపరిశీలించిన రైతు,కౌలురైతు సంఘాల నాయకులు..పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసనలు..”చట్టాన్ని ఉల్లంఘించిన విద్యాసంస్థల యాజమాన్యాలపై ఫిర్యాదు చేయండి- ది పేరెంట్స్ కమిటీ ఆఫ్ ఎపి