పత్తి చేలల్లో వాడిపోతున్న పసిమొగ్గలు..వారికి అదే చివరి రోజు: సీఎం చంద్రబాబు..తిరుమల కొండపై మరోసారి హెలికాప్టర్ కలకలం..తిరుమల లడ్డు వివాదం — పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్.. చీమకుర్తి రోడ్డు సమస్యపై కలెక్టర్ ఆఫీస్ లో ప్రజా సంకల్ప వేదిక ఫిర్యాదు..టాస్క్ ఫోర్సులో, ఒంగోలు, ఎస్. కొండ, బాపట్ల, మార్కాపురం, గిద్దలూరు కంభంలో ఘనంగా అమరవీరులకు నివాళి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల, ఎమ్మెల్యే ముత్తుముల మాజీ ఎమ్మెల్యే అన్నా..

👉పత్తి చేలల్లో.. వాడిపోతున్న పసిమొగ్గలు..
– గుజరాత్‌లో అంధకారమవుతున్న బాలల భవితవ్యం
– ఎనిమిదేండ్లకే స్కూళ్ల నుంచి పంట పొలాల్లోకి
– రూ. 200 కోసం కూలీలుగా గిరిజన పిల్లలు
– అందులో రూ. 50 రవాణా చార్జీలకు
– పిల్లల భవితను కబళిస్తున్న పేదరికం
– నిస్సహాయులుగా అధికారులు
– గుజరాత్‌ పత్తి చేనుల్లో బాలకార్మికులుగా నాలుగు జిల్లాల గిరిజన పిల్లలు.. రోజు కూలి రూ. 200,రూ. 50 వాహన చార్జీలకే..పనిలో 1,50 వేల బాల కార్మికులు,1,90,000 కౌమార పిల్లలు.. సాగుదారులకు కలిసి వస్తున్న గిరిజనుల పేదరికం..
👉12 ఏండ్ల గిరిజన బాలిక కోకిలా ఆవేదన‘రెండేండ్ల క్రితం నేను స్కూల్‌కు వెళ్లేదాన్ని. యేటా రెండు నెలలు మాత్రమే పనికి వచ్చేదాన్ని. కానీ, మా నాన్న అనారోగ్యంతో మంచం పట్టాడు. నన్ను మొత్తం పనికే రమ్మని అమ్మ చెప్పింది. ఇంటికి కొంత డబ్బు అందిస్తున్నందుకు సంతోషంగా ఉన్నది’ పత్తి చేనులో పని ముగించుకుని బండిలో ఇంటికి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతున్న 12 ఏండ్ల గిరిజన బాలిక కోకిలా చెప్పిన మాటలివి.‘నేను నా పిల్లలను స్కూల్‌కు పంపించా లనే అనుకున్నా…కానీ, ఆ ప్రభుత్వ హైస్కూల్‌లో నలుగురు టీచర్లు మాత్రమే ఉన్నారు. పిల్లలను స్కూల్‌కు పంపినా నేర్చుకునేది పెద్దగా ఏమీ ఉండదు. పనికి తీసుకు వచ్చింది బెటర్‌ అని అనుకున్నా’.. పిల్లలను తన వెంటే పత్తి చేనులో పనికి తీసుకువచ్చిన ఓ గిరిజన తండ్రి అభిప్రాయమిది.
న్యూఢిల్లీ: మన దేశంలో పత్తి ఉత్పత్తి దారుల్లో అగ్రశ్రేణిలో ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్‌ ఒకటి. ఇక్కడ 26.8 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తారు. ఈ సాగులో పనికి ఉత్తర గుజరాత్‌, దక్షిణ రాజస్తాన్‌ మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర గుజరాత్‌ జిల్లాల్లోని పత్తి సాగులో పని చేయడానికి రాజస్తాన్‌ దక్షిణాది జిల్లాలైన ఉదరు పూర్‌, దుంగర్‌పూర్‌, ఉత్తర గుజరాత్‌ బనస్కాంత, సబర్కాంత జిల్లాల గిరిజనులు కుటుంబాలుగా వచ్చి కూలి చేసుకుని తిరిగి వెళ్తుంటాయి.
👉ఉత్తర గుజరాత్‌లోని పత్తి చేనుల్లో పని చేసే మొత్తం కార్మిక శక్తిలో కేవలం ఉదరుపూర్‌ నుంచి వచ్చే బాలలు 12.20 శాతం మంది, కౌమారదశ పిల్లలు19.75 శాతంగా డెవలప్‌మెంట్స్‌ ఫర్గాటెన్‌ చిల్డ్రన్‌ తన 2019 నివేదికలో పేర్కొంది. కోట్రా, ఝాడలో, లసాదియా, సాలుంబర్‌, సారడ, ఖేర్వాడా, రిషబ్‌దేవ్‌, గోగుందా వంటి గిరిజన ప్రాంతాల నుంచి ఎక్కువ వలస కూలీలగా గుజరాత్‌కు వస్తున్నారు.పైన పేర్కొన్న నాలుగు జిల్లాల నుంచే 70 శాతం కార్మికులు గుజరాత్‌లో పత్తి సాగుకు పని చేస్తున్నారు. ఇందులో 1,25,000 బాలలు, 1,90,000 కౌమార పిల్లలు కార్మికులుగా ఉన్నారు.
👉రోజుకు మిగిలేది రూ. 150
ఈ కూలీల్లో పిల్లలు కూడా ఎక్కువగా ఉంటున్నారు. వారు పత్తి సాగులో అన్ని పనులు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ పాలినేషన్‌ కోసం వీరిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పాలినేషన్‌ ప్రక్రియలో మేల్‌ ఫ్లవర్‌ బడ్‌ను ఫీమేల్‌ ఫ్లవర్‌ ప్లాంట్‌ దగ్గరికి ఒక రోజులో చాలా సార్లు తీసుకురావాల్సి ఉంటుంది. ఆ పత్తి చెట్టు నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతుంది. కాబట్టి, ఈ పనికి పిల్లలు పర్‌ఫెక్ట్‌ అని భావిస్తారు. సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ మధ్య కాలంలో ఈ ప్రక్రియ ప్రారంభిస్తారు.
పత్తి సాగు కోసం పిల్లలను మధ్య దళారీలు చేనులకు తీసుకువస్తారు. లేదా గిరిజనులే తెలుసుకుని వస్తారు. అలా కుదరకపోతే ఇంటి వద్దే సాగు పనులు చేసుకుంటారు. ఉదయం 5 గంటలకు వీరి పని మొదలవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు పని ముగించుకుని వాహనాల్లో ఇంటికి తిరిగి వెళ్లిపోతారు. వీరి కూలి రూ. 200. ఇందులో రూ. 50 వాహన చార్జీగా చెల్లించాల్సి ఉంటుంది.
👉అడ్డుకోలేరా?
స్కూల్‌ డ్రాపౌట్లను తగ్గించడానికి, బాల కార్మికులుగా బాలలు మగ్గడాన్ని అడ్డుకోవడానికి ఇక్కడ ప్రయత్నాలు పెద్దగా లేవని చెప్పొచ్చు. బాల కార్మికుల గురించి ఉదరుపూర్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ దష్టికి తీసుకెళ్లగా.. గిరిజన పిల్లలు సాగులో ముఖ్యంగా పత్తి సాగులో ఎక్కువగా పనికి వెళ్తున్నారనే విషయం తమ దష్టికి వచ్చిందని, కానీ, తమకు ఎవరూ ఫిర్యాదు చేయడం లేదని తెలిపారు. తల్లిదండ్రులే పిల్లలను తమ వెంట తీసుకెళ్లుతుండటం వల్ల రిపోర్ట్‌ చేయడానికి ముందుకు రావడం లేదని వివరించారు. పోలీసులు ఆ వాహనాలను అడ్డుకునే ప్రయత్నాలు చేసి..
పలుచోట్ల చెక్‌ పోస్టులు పెడితే వారు వేరే మార్గాల గుండా వెళ్తున్నారు. పోలీసుల ప్రయత్నాలు ముమ్మరమైనప్పుడు గుజరాత్‌లోని పత్తిసాగుదారులే ఈ గిరిజనులను వారి దగ్గర పత్తి సాగు చేయాలని కోరుతారు. అప్పుడు గిరిజనులు కుటుంబమంతా కలిసి పంట పొలం వద్దే ఉంటారు. నిర్దిష్ట సమయం అనేది లేకుండా కుటుంబమంతా పనిలోనే నిమగమై ఉంటుంది.
👉పరిష్కారమేంటీ?
రాజస్థాన్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు ధ్రువ్‌ కుమార కావ్య కూడా ఈ సమస్యను అంగీకరించారు. ఈ సమస్య పరిష్కారానికి బాల కార్మికుల పరిరక్షణకు సమగ్రమైన ప్రభుత్వ పాలసీ రావాల్సిందేనని పేర్కొన్నారు. ఇందులో స్కూల్‌ డ్రాపౌట్లను ప్రత్యేకంగా పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ‘ఇందుకు ప్రధాన కారణం పేదరికం. కాబట్టి, బాల కార్మికులను పట్టుకుని స్కూల్‌కు తెచ్చినా.. మళ్లీ వారు కూలికి వెళ్లే చాన్స్‌ ఉంటుంది. ఎంత మంది డ్రాపౌట్లు ఉన్నారనే విషయంపై రాజస్థాన్‌ ప్రభుత్వం ఇది వరకే సర్వేలు చేపట్టలేదు. కాబట్టి, పిల్లలను మళ్లీ పొలాల నుంచి పాఠశాల బాటపట్టించే విధంగా పాలసీని తీసుకురావాలి’ అని వివరించారు.
👉వారికి అదే చివరి రోజు: సీఎం చంద్రబాబు..
క్రిమినల్స్, రౌడీలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఎవరైనా రౌడీలు మీ ఇష్టప్రకారం చేస్తే అదే చివరి రోజు కావాలని మా ఆకాంక్ష. ఆ విధంగా మా పోలీస్ వ్యవస్థను తయారు చేస్తాం. గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, స్మగ్లింగ్ చేస్తూ మృగాలుగా మారుతున్నారు. ఆడబిడ్డలను లైంగికంగా హింసించి హత్య చేస్తున్నారు. ప్రతి ఒక్క కేసును సవాల్‌గా తీసుకుంటాం.శాశ్వత పరిష్కారం చూపిస్తాం.’ అని అన్నారు.👉 శాంతిభద్రతలను కాపాడటంలో రాజీ లేదు:
శాంతిభద్రతలను కాపాడటంలో రాజీ లేదు: సీఎం చంద్రబాబు
శాంతిభద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీ పడేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు.
సోమవారం విజయవాడలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.‘2014-19లో పోలీసు సంక్షేమానికి రూ.55 కోట్లు ఇచ్చాం.ఉమ్మడి రాష్ట్రంలో పోలీసులు నక్సలిజాన్ని అణచివేశారు.ఫ్యాక్షనిజం,రౌడీల ఆట కట్టించారు.విధి నిర్వహణలో చాలా మంది ప్రాణాలు విడిచారు. ప్రజల హృదయాల్లో హీరోలుగా నిలిచారున్నారు.
👉 పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాం .. రాష్ట్ర విభజన తర్వాత పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి దీటైన పోలీస్ వ్యవస్థకు శ్రీకారం చుట్టామన్నారు. ఏపీ పోలీస్ అంటే దేశంలోనే మోడల్ పోలీస్ గా తీర్చిదిద్దేలా ముందుకెళ్లామని తెలిపారు. పోలీస్ సంక్షేమం ప్రభుత్వం బాధ్యత అని సీఎం అన్నారు.
👉తిరుమల కొండపై మరోసారి హెలికాప్టర్ కలకలం..
తిరుపతి జిల్లా: అక్టోబర్21,.తిరుమల శ్రీవారి కొండపై మరోసారి హెలికాఫ్టర్లు చెక్కలు కొట్టడం కలకలం రేపింది, ఈరోజు ఉదయం స్వామివారి స్వామివారి ఆలయ గోపురానికి దగ్గరగా హెలికాప్టర్ వెళ్ళింది, కొందరు భక్తులు గమనించి తమ మొబైల్ లో రికార్డు చేశారు.
మరికొందరు భక్తులు టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యా దు చేశారు. హెలికాప్టర్ ఎక్కడి నుంచి వచ్చిందో అధికారులు ఆరాతీస్తు న్నారు. తిరుమల కొండపై సోమవారం ఉదయం హెలికాప్టర్ వెళ్లడం కలకలం రేపుతోంది.
శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలను నో ఫ్లైజోన్ గా ప్రకటించారు. కానీ తరచుగా తిరుమల కొండ మీదుగా విమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందనే విషయాలపై టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
నో ఫ్లై జోన్ గా ఉన్న తిరుమల కొండపై హెలికాప్టర్ ఎలా వెళ్లిందనే విషయమై అధికారులు ఏవియేషన్ అధికారులతో మాట్లాడుతున్నారు. ఆగమశాస్త్ర నిబంధనల మేరకు తిరుమల కొండపై నుంచిహెలికాప్టర్ వెళ్లకూడదు. తిరుమల శ్రీవారి కొండ పైన సంచరించింది ఎవరన్నది తెలియవలసింది..
👉**తిరుమల లడ్డు వివాదం — పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్**
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై పవన్ చేసిన వ్యాఖ్యలకు భారీ షాక్ తగిలిందనే చెప్పుకోవాలి.
తాజాగా పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది.
నవంబర్ 22న వ్యక్తిగతంగా న్యాయస్థానంలో హాజరుకావాలని ఆదేశించింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించారని న్యాయవాది రామారావు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం ఆయనకు నోటీసులిచ్చింది.
👉 ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి..
*పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా గిద్దలూరు పట్టణంలోని ప్రధాన వీధులలో సీఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు*

* శిoగరాయకొండ పట్టణంలో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసు సిబ్బంది మరియు ఇన్స్పెక్టర్ బి మహేంద్ర ఆధ్వర్యంలో స్కూలు పిల్లలతో మానవహారంగా ఏర్పడి అమరవీరులైన పోలీసుల కు శ్రద్ధాంజలి ఘటించారుఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు… స్టాఫ్ రిపోర్టర్ రహమాన్.
👉ఆర్ఎస్ఎఎస్టీఫ్ (RSASTF)
టాస్క్ ఫోర్సులో ఘనంగా అమరవీరులకు నివాళి..
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్సు (ఆర్ఎస్ఎఎస్టీఎఫ్) కార్యాలయంలో సోమవారం అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరులకు నివాళులర్పించిన టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ. శ్రీనివాస్ మాట్లాడుతూ 1959 అక్టోబరు 21న సీఆర్ పీఎఫ్ డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో చైనా చేసిన మెరుపు దాడుల్లో 16మంది జవాన్లు మరణించిన రోజును సంస్మరణ దినోత్సవంగా జరుపుకంటున్నట్లు తెలిపారు. గత ఏడాది టాస్క్ ఫోర్సు కానిస్టేబుల్ బి. గణేష్ మరణించడాన్ని ఆయన గుర్తు చేశారు. ఈనెల 31వరకు అమర వీరులను సంస్మరిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన అమరవీరులను స్పూర్తిగా తీసుకుని విధులను నిర్వహించాలని సూచించారు. దీనికి ముందు డీఎస్పీ జి. బాలిరెడ్డి గత సంవత్సరం దేశ వ్యాప్తంగా మరణించిన అమర వీరుల పేర్లను చదివి వినిపించారు.కార్యక్రమాన్ని ఆర్ఐ (ఆపరేషన్స్) కే.సురేష్ కుమార్ రెడ్డి నిర్వహించగా, సీఐ సురేష్ కుమార్ వ్యాఖ్యతగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఇంకా ఎసీఎఫ్ శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓలు మురళీకృష్ణ, ఆర్ఐ కృపానంద, ఆర్ఎస్ఐలు,సిబ్బంది పాల్గొన్నారు.
👉ప్రకాశం జిల్లా మార్కాపురంలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి పట్టణంలోని నాలుగు వీధుల్లో వారి సేవలు స్మరించుకుంటూ విద్యార్థులు, రాజకీయ నాయకులతో కలిసి సీఐ సుబ్బారావు ఆద్వర్యంలో పోలీసులు ర్యాలీ చేశారు. ప్రజాస్వామ్య రక్షణే పరమావధిగా, సమాజ శ్రేయస్సే ఊపిరిగా, ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అసువులు బాసిన పోలీస్ వీరులారా మీకు వందనం అంటూ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కొనియాడారు.
*పోలీస్ అమరవీరులారా మీకు వందనం*
ప్రకాశం జిల్లా కంభంలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి పట్టణంలోని నాలుగు వీధుల్లో వారి సేవలు స్మరించుకుంటూ విద్యార్థులు, రాజకీయ నాయకులతో కలిసి సీఐ సుబ్బారావు ఆద్వర్యంలో పోలీసులు ర్యాలీ చేశారు. ప్రజాస్వామ్య రక్షణే పరమావధిగా, సమాజ శ్రేయస్సే ఊపిరిగా, ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అసువులు బాసిన పోలీస్ వీరులారా మీకు వందనం అంటూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో కంభం సీఐ కే మల్లికార్జున కంభం ఎస్సై బి నరసింహ రావు తోపాటు బిపేట అర్ధవీడు ఎస్సైలు పాల్గొన్నారు.రిపోర్టర్ ఎన్.వెంకటేశ్వర్లు
👉కడప..మావోయిస్టుల దాడిలో మృతి చెందిన బ్రహ్మంగారిమఠం పాపిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన జవాన్ రాజేష్ వీర మరణం పొందిన జవాన్ రాజేష్ కు మిలిటరీ లాంచనులతో అంతిమయాత్ర పూర్తి …
👉చీమకుర్తి రోడ్డు సమస్యపై కలెక్టర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేసిన ప్రజా సంకల్ప వేదిక..*అక్రమ గ్రానైట్ రవాణాను అరికట్టాలి…**మర్రిచెట్ల పాలెం నుండి చీమకుర్తి వరకు రోడ్డును అభివృద్ధి చేయాలి..*ఒంగోలు కలెక్టరేట్,
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో గ్రానైట్ అక్రమ రవాణాపై ప్రభుత్వం చర్యలు చేపట్టి రోడ్డును అభివృద్ధి చేయాలని ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరె రంగ సాయి రెడ్డి ఈ రోజు ఒంగోలు కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.
గ్రానైట్ అక్రమ రవాణా ద్వారా వందల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన మైనింగ్ మాఫియా…
ప్రపంచ ప్రసిద్ధి చెందిన చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ను 45 గ్రానైట్ క్వారీల ద్వారా అధికారికంగా రోజుకి 300 వాహనాల ద్వారా 3200 క్యూబిక్ మీటర్ల గెలాక్సీ గ్రానైట్ రాయి తరలింపు…కానీ అనధికారికంగా మరో 3000 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ రాయి అక్రమ తరలింపు చేస్తున్నట్లు సమాచారం…ప్రభుత్వం మారిన మైనింగ్ మాఫియాకు అడ్డుకట్టం వేయలేదు, అధికారుల తీరు మారలేదు.
ఎలాంటి అనుమతులు లేకుండా అత్యంత ఖరీదైన చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ని కొండలను పిండి చేసి మైనింగ్ మాఫియా క్వారింగ్ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి లక్షల కోట్ల గండి కొడుతుందని ఆరోపించారు.
👉మనది మాటల ప్రభుత్వం కాదు– “చేతల ప్రభుత్వం”*
*అర్ధవీడు మండలంలో రూ. 1.25 కోట్ల అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగిస్తున్నది మాటల ప్రభుత్వం కాదని, ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చే చేతల ప్రభుత్వమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు అన్నారు. పల్లె పండుగ ప్రగతికి అండగా పంచాయతీ వారోత్సవాలలో భాగంగా అర్ధవీడు మండలంలో రూ.1.25 కోట్ల రూపాయల అంతర్గత సీసీ రోడ్లకు వారు శంకుస్థాపన చేశారు. మొహిద్దిన్ పురం గ్రామంలో రూ.35 లక్షలు, అర్ధవీడు గ్రామంలో రూ. 50 లక్షలు, పాపినేనిపల్లె గ్రామంలో రూ. 60 లక్షల రూపాయలతో ప్రారంభించనున్న అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన స్థాపనలు చేసి గ్రామాల్లో శిలాఫలకాలను ఆవిష్కరణ చేశారు..ఈ కార్యక్రమంలో డీఈ సుబ్బారెడ్డి, ఎంపీడీఓ నరసయ్య,టిడిపి నాయకులు,ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు… ని.వర్గ ఇన్చార్జ్ ఫయాజ్..
**రావూరి వారి వివాహా కార్యక్రమంలో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*కంభం మండలం, లింగోజీ పల్లె గ్రామంలో రావూరి తిరుపతి రావు (టీచర్) కుమారుడు చి.శివ ప్రసాద్, చి.ల.సౌ పార్వతీ లకు ఆదివారం రాత్రి జరిగిన వివాహ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. రిపోర్టర్ అస్లాం బేగ్
👉బాపట్ల పట్టణం లోని పట్టణ పోలీసు స్టేషన్ వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్బంగా నివాళులు అర్పించిన బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు ,జిల్లా ఎస్పీ తూషార్ దూడి ,డిఎస్పీలు. ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
* *సయ్యద్ వారి వివాహానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా**కంభం మండలం హాజరత్ గూడెంలో వైసీపీ సోషల్ మీడియా సభ్యుడు సయ్యద్ మజీద్ సోదరి వివాహనికి హాజరుఅయి నూతన వధూవరులను ఆశీర్వదించిన గిద్దలూరు మాజి శాసన సభ్యులు,మార్కాపురం వైసీపీ సమనవ్యకర్త అన్నా వెంకట రాంబాబు వైసిపి నాయకులు పాల్గొన్నారు*
👉 ప్రకాశం జిల్లా…పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కాలం చెల్లిన (expired)చిక్కీలు పంపిణీ చేసిన వైనం…కొంతమంది విద్యార్థులు గమనించి అక్కడే పడేశారు..కొంతమంది తెలియక తినేశారు..
కాలం తీరిన చిక్కీలు తిన్న విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం కొంత ఆందోళన చెందుతుతున్నారు..
సెప్టెంబర్ 24 వ తేదీన ముగిసిన పరిమిత తేదీ..
మరి ఉపాధ్యాయులు, పంపిణీ చేసిన వారికి కనబలేదా? లేక ఏమి కాదులే అని నిర్లక్ష్యంతో ఇచ్చారా? అనే విషయాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
👉నల్లమల్ల రోడ్లపై పెద్దపులి సంచారం…*
అమ్రాబాద్ మండలం బికే తిరుమలాపూర్ సమీపంలో పెద్దపులి ప్రత్యక్షం.గ్రామ రోడ్డు చివర్లో స్థానికులకు కనిపించిన పెద్దపులి.కాసేపు రోడ్డుపై తిరుగుతూ అడవిలోకి వెళ్ళిపోయిన ట్లు సమాచారం
👉 అనుమానాస్పద రీతిలో చిరుత పులి మృతి..చిత్తూరు జిల్లా:సోమల మండలం.
సోమల మండలం 81 చిన్నప్పరపల్లె పంచాయతీ గట్టు వారి పల్లి సమీపంలో చిరుత పులి అనుమానస్పద రీతిలో మృతి చెంది ఉండడాన్ని సోమవారం స్థానిక రైతులు గుర్తించారు. చిరుత పులి గోర్ల కోసం వేటగాళ్లు చిరుత పులిని చంపి చిరుత పులి గోర్లు ఎత్తుకెళ్లినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.పూర్తి వివరాలు ఫారెస్ట్ అధికారుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

7k network
Recent Posts

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.

నేడు పంజాబ్ బంద్‌* .. 👉 బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్ …👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..ఆ పార్టీల మధ్యనే పోటీ..👉 బియ్యం స్కామ్‌లో పేర్నినాని తన భార్యను ఇరికించారు -టీడీపీ నేత బుద్ధావెంకన్న ..*మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము..తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్.. 💥మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు*…అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి ఇలా.. *కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి

👉చేతులకు సంకెళ్లతో టీచర్ల నిరసన..👉బిఆర్ఎస్ అక్రమాలపై ధ్వజమెత్తిన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*.. 👉పోలీస్స్టేషన్లో గుండెపోటుతో న్యాయవాది మృతి* .. *నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ .. *జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి… *హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది..మార్కాపురం డిఎస్పి నాగరాజు.