విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు కోటి రూపాయలు.. సీఎం రేవంత్.. “దోచుకోవడం,దాచుకోవడం తప్ప విద్యార్థుల ఫీజులు చెల్లించడం తెలియదా -జగన్ పై షర్మిల ఆగ్రహం..”రాష్ట్ర శాసనసభ స్సీకర్‌ అయ్యన్నపాత్రుడు సవాల్.. నాచారం పేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. యువకుడి మృతి ..గుజరాత్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం..”టీచర్ పై ఫొక్సో చట్టం క్రింద కేసు నమోదు..అక్కా చెల్లెళ్ల పై గ్యాంగ్ రేప్!..కాంగ్రెస్‌ నేత మారు గంగారెడ్డి హత్య..పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌ దాఖలు..మ‌మ‌త‌-శ‌ర‌ద్‌-హేమంత్‌ స‌ర‌స‌న‌.. జ‌గ‌న్ కూడా!!.. రేవన్నకు బెయిల్ నిరాకరణ.. ఎపి జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్* మార్కాపురం యూనిట్ ఎన్నిక..మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్

👉విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు కోటి రూపాయలు.. సీఎం రేవంత్ రెడ్డి
కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కోటి రూపాయలు అందజేస్తామన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ లకు కోటి 25 లక్షలు, డీఎస్పీ అడిషనల్ ఎస్పీ, ఎస్పీలకు కోటి 50 లక్షలు, ఐపీఎస్ కుటుంబాలకు 2 కోట్లు. శాశ్వతంగా అంగవైకల్యం పొందిన కుటుంబాలకు ర్యాంక్ ను బట్టి వారికి 50 లక్షల నష్ట పరిహారం మరియు ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు.
👉హైడ్రా కూల్చిన భవనాల వ్యర్థాలను తొలగించని నిర్మాణదారులకు నోటీసులు..నిజాంపేట్ ఎర్రకుంట చెరువు FTL పరిధిలో నిర్మించిన 5 అంతస్తులు గల మూడు భవనాలను ఆగస్టు 14న కూల్చిన హైడ్రా..వ్యర్థాలలోని ఐరన్ తీసుకెళ్లి.. ఇతర వ్యర్థాలను అక్కడే వదిలేసి వెళ్లిన నిర్మాణదారుడు..దీంతో ఎర్రకుంట చెరువులో ఉన్న వ్యర్థాలను తొలగిస్తున్న హైడ్రా..అనంతరం చెరువును సుందరీకరించి పునరుజ్జీవనం కల్పిస్తామని తెలిపిన హైడ్రా.
👉 జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో కాంగ్రెస్‌ నేత మారు గంగారెడ్డి హత్య.. గ్రామంలో రాజకీయ కక్షలతోనే హత్య జరిగినట్లు అనుమానం..ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న గంగారెడ్డి..జగిత్యాల-ధర్మపురి రోడ్డుపై జీవన్‌రెడ్డి బైఠాయింపు.. జగిత్యాలలో బీఆర్ఎస్‌ రాజ్యం నడుస్తుందా అని ప్రజలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు.
👉భీమడోలు పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచారం.. ఏలూరు జిల్లా.. ట్రాప్ కెమెరాలో రికార్డ్ అయిన చిరుతపులి దృశ్యాలు..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన అధికారులు.. భీమడోలు ప్రాంతంలో చిరుతపులి అని నిర్ధారించిన ఉన్నత అధికారులు…
👉నాంచారంపేట గ్రామంలో ఇరువర్గాలు మధ్య ఘర్షణ,హరి ప్రసాద్ అనే యువకుడు మృతి😯😯😯తిరుపతి జిల్లా.. చిల్లకూరు మండలం ముత్యాల పాడు,నాంచారం పేట గ్రామాలలో ఘర్షణ వాతావరణం*..తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నాంచారం పేట గ్రామంలో చలరేగిన రాజకీయ ఘర్షణలు,ఈ ఘర్షణలో హరిప్రసాద్ అనే 20 ఏళ్ళ యువకుడు మృతి,మరి కొంతమంది కి గాయాలు..
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడు గ్రామంలో గత కొన్ని రోజులుగా వైసిపి టిడిపి పార్టీలకు చెందిన రెండు కుటుంబాల మధ్య పొలానికి సంబంధించిన వివాదం నడుస్తూ ఉంది,ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం వైసిపి పార్టీకి చెందిన వ్యక్తికి సంబంధించిన పొలం వద్ద టిడిపి కి సంబంధించిన నాయకులు గూడూరు నుండి ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున రౌడీషీటర్లను వెంటబెట్టుకుని ఫెన్సింగ్ రాళ్లు విరగ్గొట్టి నానా హంగామా సృష్టించారు, ఈ వివాదం కొనసాగుతుండగానే సోమవారం సాయంత్రం నాంచారం పేట గ్రామానికి చెందిన టిడిపి పార్టీకి చెందిన వారు కొందరు వైసీపీకి పార్టీకి చెందిన వారి ఇంటి మీదకు వెళ్లి కొందరిని గాయపరిచి అక్కడున్న కార్లు,మరికొన్ని వాహనాలను ధ్వంసం చేయడం తో వైసీపీ పార్టీకి చెందినవారు కూడా తిరగబడి టిడిపి పార్టీకి చెందిన వారిని అడ్డుకోవడంతో నాంచారం పేట ముత్యాలపాడు గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది,ఇటీవల ఘర్షణల విషయం తెలుసుకున్న గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునిల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని ఇరు పార్టీల వారితో శాంతియుతంగా ఉండాలని ఘర్షణలు పడవద్దు అని సర్ది చెప్పి వెళ్లిపోయారు, అయినా కూడా గ్రామంలో ఘర్షణ వాతావరణం తగ్గకపోవడంతో అర్ధరాత్రి మరోసారి రెండు పార్టీలకు చెందినవారు ఘర్షణలు పడి కర్రలు,రాడ్లు తో కొట్టుకోవడం తో టిడిపి పార్టీకి చెందిన హరిప్రసాద్ అనే యువకుడుకి తీవ్ర గాయాలు కావడంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ హరిప్రసాద్ అక్కడ మరణించాడు,మరి కొంతమందికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తుంది,దీంతో రెండు గ్రామాల్లో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది, విషయం తెలియగానే గూడూరు డిఎస్పి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు,
👉 గుజరాత్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం..!!!
గుజరాత్‌లో మరోసారి డ్రగ్స్ భారీగా డ్రగ్స్ పట్టుబడింది. భరూచ్‌ జిల్లా అంక్‌లేశ్వర్‌ జీఐడీసీ ప్రాంతంలోని అవ్‌సర్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో సూరత్‌, భరూచ్‌ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలో రూ.250 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు రూ.14.10 లక్షల విలువైన 141 గ్రాముల ఎండీ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. 427 కిలోల అనుమానిత డ్రగ్స్‌ను పరీక్ష కోసం ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపారు.
👉 సిరిసిల్ల: టీచర్ పై పాక్సో చట్టం క్రింద కేసు నమోదు..
సిరిసిల్ల పట్టణంలోని గీతనగర్ లో గల గర్ల్స్ హై స్కూల్ సోమవారం జిల్లా షీ టీం సిబ్బంది మహిళ చట్టాలపై, షీ టీమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొంత మంది విద్యార్థులు షీ టీం సిబ్బంది వద్దకు వచ్చి నరేందర్ అనే టీచర్ కొద్ది రోజులుగా క్లాస్ రూమ్ లో విద్యార్థునుల పట్ల బ్యాడ్ టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. వెంటనే టీచర్ నరేందర్ పై పోక్సో కేసు నమోదు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
👉 పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడులో లోక్‌సభ స్థానాలు తగ్గే అవకాశం ఉండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ కారణంగా రాష్ట్రంలో ఎంపీ స్థానాలు తగ్గే పరిస్థితి తలెత్తుతున్నప్పుడు.. పిల్లల్ని కనే విషయంలో పరిమితులు ఎందుకు విధించుకోవాలనే ఆలోచన వస్తోందన్నారు. చెన్నైలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 31 జంటలకు సామూహిక వివాహాలు జరిపించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘పూర్వం కొత్తగా పెళ్లయిన జంటలను పెద్దలు.. 16 సంపదలతో వర్థిల్లాలని ఆశీర్వదించేవారు. ఇప్పుడు 16 సంపదలకు బదులుగా 16 మంది పిల్లల్ని కనాల్సిందిగా దీవించాల్సివస్తుందేమో!’’ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన విధానాన్ని చూస్తే ఇలాగే ఆలోచించాలేమోనన్నారు.
👉 తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వినియోగించారని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌ను హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు విచారణకు స్వీకరించింది. వచ్చే నెల 22న కోర్టు ముందు హాజరు కావాలని పవన్‌ కల్యాణ్‌తో పాటు తెలంగాణ సీఎస్‌ శాంతికుమారి, సమాచార శాఖ ముఖ్య కార్యదర్శికి సమన్లు జారీ చేసింది.గత జనవరిలో అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అక్కడకు పంపిన తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయని పవన్‌ ఆధారాల్లేకుండా చేసిన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని న్యాయవాది ఇమ్మనేని రామారావు పిటిషన్‌లో పేర్కొన్నారు.
👉ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత..
ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత
దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతోంది. సోమవారం ఉదయానికి ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) 349కి పడిపోయింది. దాంతో కాలుష్య నియంత్రణ మండలి ఈ పరిస్థితిని ‘వెరీ పూర్‌ (Very poor)’ కేటగిరీగా వర్గీకరించింది. వాయు కాలుష్యం కారణంగా నగరంపై దట్టంగా పొగ మంచు కమ్మి ఉంటోంది. దాంతో ఉదయం పూట వాహనదారులు రోడ్లపై విజిబిలిటీ సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
👉 మాజీ సీఎం,పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌కి దమ్ముంటే నవంబరులో జరిగే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని రాష్ట్ర శాసనసభ స్సీకర్‌ అయ్యన్నపాత్రుడు సూచించారు. సోమవారం అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గొలుగొండపేట గ్రామంలో 68 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకుంది అసెంబ్లీకి వచ్చి సమస్యలను ప్రస్తావించడానికేనని,ఈ విషయాన్ని జగన్మోహన్‌రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు.
👉 జగన్‌ నీకు సిగ్గులేదా?..*దోచుకోవడం,దాచుకోవడం తప్ప విద్యార్థుల ఫీజులు చెల్లించడం తెలియదా? రాజశేఖరరెడ్డి కొడుకువై ఉండి..*3,500 కోట్ల ఫీజు బకాయిలా?: షర్మిల*
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.3,500 కోట్ల బకాయి పెట్టేందుకు సిగ్గులేదా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిలదీశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక అని ఎక్స్‌ వేదికగా సోమవారం ఆమె స్పష్టం చేశారు. నాడు వైఎ్‌సఆర్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అద్భుతంగా అమలు చేశారని, ఆయన సొంత కొడుకై ఉండి జగన్‌ తన హయాంలో ఈ పథకాన్ని నీరుగార్చారని అసహనం వ్యక్తం చేశారు. రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను కూటమి ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
👉 మాజీ ఎంపీకి షాక్.. బెయిల్ నిరాకరణ..
మాజీ ఎంపీకి షాక్.. బెయిల్ నిరాకరణ
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై నిర్ణయాన్ని నెల రోజుల క్రితం రిజర్వ్ చేసింది. తాజాగా తీర్పును వెల్లడిస్తూ ప్రజ్వల్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
👉 కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు ఐఏఎస్‌ అధికారులపై హైకోర్టు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. తామిచ్చిన ఆదేశాలను అమ లు చేయని పక్షంలో కోర్టు ముందు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలను అధికారులు పాటించక పోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎ్‌స.రావత్‌, కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా, కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జలవనరులశాఖ ఈఈ డీవీ.రామ్‌గోపాల్‌పై బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. హైకోర్టు రిజిస్ట్రీ.. వారెంట్‌ అమలు చేసేందుకు వీలుగా విచారణను నవంబర్‌ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు.
👉మ‌మ‌త‌-శ‌ర‌ద్‌-హేమంత్‌ స‌ర‌స‌న‌.. జ‌గ‌న్ కూడా!! అలానే..ఇప్పుడు కూడా.. జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌న్న‌ది చ‌ర్చ‌. ఔను.. పొలిటిక‌ల్‌గా ఇప్పుడు ఈ చ‌ర్చే సాగుతోంది. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, మ‌హారాష్ట్ర కురువృద్ధ నాయ‌కుడు శ‌ర‌ద్ ప‌వార్‌, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ స‌హా ప‌లువురు నేతల స‌ర‌సన వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా చేరుతున్నారా? అనేది కీల‌క అంశం. ఎందుకంటే..
ప్ర‌స్తుతం వైసీపీ ఉన్న ప‌రిస్థితి, భ‌విష్య‌త్తులో నాలుగు సంవ‌త్స‌రాల‌కు పైగానే కాలాన్ని గ‌డ‌పాల్సిన ప‌రిస్థితిని త‌లుచుకుంటే.. ఆయ‌న‌కు జాతీయ‌స్థాయిలో ద‌న్నుకావాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో గ‌తంలో కాంగ్రెస్ పార్టీతో పోరు పెట్టుకుని.. బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత కుంప‌టి పెట్టుకున్న కీలక నాయ‌కుల మాదిరిగానే జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. రాజ‌కీయాల్లో ఏదీ కొత్తకాదు. ఏదీ పాత‌కాదు. అవ‌స‌రం-అవ‌కాశం.. అనే రెండు ప‌ట్టాల‌పైనే ఎవ‌రి రాజ‌కీయాలైనా ముందుకు సాగుతాయి. అలానే..ఇప్పుడు కూడా.. జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌న్న‌ది చ‌ర్చ‌. మ‌మ‌తా బెన‌ర్జీ ఒక‌ప్పుడు క‌ర‌డు గ‌ట్టిన కాంగ్రెస్ వాది. పార్ల‌మెంటులోనూ దుమ్ము రేపారు. ఆ త‌ర్వాత‌.. ప‌శ్చిమ బెంగాల్‌లో వ‌చ్చిన విభేదాల‌తో కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీగా వేరు ప‌డ్డారు. ఇక‌, మ‌హారాష్ట్ర‌కు చెందిన శ‌ర‌ద్ ప‌వార్‌.. ఇందిర‌మ్మ హ‌యాం నుంచి కాంగ్రెస్‌తోనే ఉన్నారు. కేంద్రం లో మంత్రి ప‌ద‌వులు కూడా చేశారు. సోనియా గాంధీతో వ‌చ్చిన విభేదాల కార‌ణంగా ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చిన నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్ సీపీ)ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక‌, జార్ఖండ్ అదికార పార్టీ జేఎంఎం ఒక‌ప్ప‌టి అధినేత శిబు సొరేన్ కూడా.. ఇందిర‌మ్మ హ‌యాంలో కాంగ్రెస్ నాయ‌కుడు. రాష్ట్ర విభ‌జ‌న కోసం పోరాడి.. త‌ర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే.. కాంగ్రెస్‌తో ఇలా విభేదించి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారంతా.. ఇప్పుడు ఆ పార్టీతోనే చేతులు క‌లిపిన విష‌యం తెలిసిందే. కూట‌మిగా ఏర్ప‌డ్డారు. కాబ‌ట్టి.. రాజ‌కీయాల్లో ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు జ‌గ‌న్ ప‌రిస్థితి కూడా ఇలానే మారినా ఆశ్చ‌ర్యం లేద‌న్న‌ది ప‌రిశీల‌కుల మాట‌. కాంగ్రెస్ పార్టీ త‌న‌కు సీఎం సీటు ఇవ్వ‌లేద‌ని, ఓదార్పు యాత్ర‌లు చేయ‌నివ్వ‌లేద‌ని అలిగి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ‌న్‌.. సొంత కుంప‌టి పెట్టుకున్నారు. అయితే.. కాల మాన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇప్పుడు ఆ పార్టీతోనే లోపాయికారీగా చేతులు క‌లిపే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.
👉 బర్త్ డే రోజు మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్
గుడివాడలో కొడాలి నాని పుట్టినరోజు వేడుకల ఫ్లెక్సీ ఏర్పాటుని అడ్డుకున్న పోలీసులు..మంగళవారం జరగాల్సిన కొడాలి నాని పుట్టినరోజు వేడుకలకు పోలీసుల అనుమతి నిరాకరణ..వైసీపీ నేతలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు.
👉అక్కా చెల్లెళ్ల పై గ్యాంగ్ రేప్…!
శ్రీకాకుళం జిల్లా పలాస — కాశీబుగ్గ మున్సిపాలిటీ చెందిన అక్కా, చెల్లెళ్ళ గ్యాంగ్ రేప్.సూదికొండ కు చెందిన యువకులు బర్త్ డే పార్టీ పేరు తో ముగ్గురు మైనర్ బాలికలను ఊరు బయటకు తీసుకెళ్లారు .ముగ్గురు బాలికలలోని అక్క,చెల్లెళ్ళ పై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన యువకులు . తీవ్రంగా ప్రతిగటించి తప్పించుకున్న మరో బాలిక. ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండించిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన శిరీష. నిందితులపై కఠిన చర్యలు తీసుకుకోవాలని పోలీసులను ఆదేశించిన ఎంఎల్ఏ శిరీష..
👉ఎపి జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్* మార్కాపురం యూనిట్ నూతన కమిటీ ఎన్నిక..
ప్రకాశం జిల్లా మార్కాపురం లోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం ఎపి జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్* మార్కాపురం యూనిట్ కు సంభందించిన అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు రాష్ట్ర నాయకులు హాజరు అయి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం యూనిట్ నుండి 70 మంది సభ్యులు హాజరు అయ్యారు. ముందుగా మీటింగ్ నిర్వహించి కింది స్థాయి సిబ్బంది యొక్క సమస్యలపై చర్చించడం జరిగింది ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో కొత్త యూనియన్ నాయకులను ఎన్నుకోవడం జరిగింది. అన్ని పోస్ట్ లు ఏకగ్రీవం అయ్యాయి.
*మార్కాపురం యూనిట్*
ప్రెసిడెంట్ షేక్ కరీముల్లా, (ఎఫ్ ఎస్ ఓ.)
వైస్ ప్రెసిడెంట్ శశి భూషణ్ యాదవ్,
జనరల్ సెక్రటరీ ఎం.వెంకటేశ్వర్లు
ఆర్గనైజింగ్ సెక్రటరీ : జి. సుధాకర్,
జాయింట్ సెక్రటరీ టి.బాలకుమారి,
ట్రెజరర్ షేక్. అబ్దుల్ జబ్బార్ ఎన్నికైనారు.

7k network
Recent Posts

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.

నేడు పంజాబ్ బంద్‌* .. 👉 బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్ …👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..ఆ పార్టీల మధ్యనే పోటీ..👉 బియ్యం స్కామ్‌లో పేర్నినాని తన భార్యను ఇరికించారు -టీడీపీ నేత బుద్ధావెంకన్న ..*మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము..తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్.. 💥మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు*…అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి ఇలా.. *కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి

👉చేతులకు సంకెళ్లతో టీచర్ల నిరసన..👉బిఆర్ఎస్ అక్రమాలపై ధ్వజమెత్తిన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*.. 👉పోలీస్స్టేషన్లో గుండెపోటుతో న్యాయవాది మృతి* .. *నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ .. *జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి… *హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది..మార్కాపురం డిఎస్పి నాగరాజు.