యువతి జాతకంలో దోషం ఉందని కారులోనే జల్సా చేసిన పూజారి..జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో లైంగిక వేధింపులు ?..బ్లాక్ లో తిరుమల టికెట్లు అమ్ముకున్న ముస్లిం ఎమ్మెల్సీ! ..కనిపించకుండాపోయిన యువతి.. ఆసుపత్రిలో ప్రత్యక్షం!.విద్యార్థిని మరణం విషాదకరం : హోం మంత్రి అనిత..ఏపీకి చెందిన జవాన్‌ రాజేష్ మృతి.. వైపాలెంలో కార్డెన్ సెర్చ్..పోలీసు అమరవీరుల త్యాగాలను మరువద్దు.. *వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. జూదమాడుతున్న ముగ్గురు పోలీసులు అరెస్ట్ .

👉ఏపీలో స్కూళ్లకు రూ.100 కోట్ల నిధులు విడుదల : లోకేశ్..ఏపీలో సమస్యల వలయాలుగా మారిన స్కూళ్ల నిర్వహణ కోసం రూ.100 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. 2024-25 సంవత్సరానికి 855 పీఎంశ్రీ స్కూళ్లకు ₹8.63cr..కేజీబీవీలకు ₹35.16cr, మండల రిసోర్స్ కేంద్రాలకు ₹8.82cr, మిగతా స్కూళ్లకు ₹51. 90cr నిధులు ఇచ్చారు.సుద్దముక్కలు, డస్టర్స్, చార్టులు, విద్యా సామాగ్రి,రిజిస్టర్లు, రికార్డులు, క్రీడా సామాగ్రి, ఇంటర్నెట్,తాగునీటి కోసం ఈ నిధులును యాజమాన్యం వాడాలని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

👉అధికారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్..
అధికారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్
లంచం అనే పదం తనకు వినిపించొద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేనలో చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకత పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో లంచాలు, రికమండేషన్స్ లేకుండా బదిలీలు చేశామని అన్నారు. లంచం తీసుకునే వాళ్లు పంచాయతీరాజ్ శాఖకు అవసరం లేదన్నారు.
👉కడపజిల్లాలో పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మరణం విషాదకరం : హోం మంత్రి వంగలపూడి అనిత*
*తీవ్రంగా గాయపడి కోలుకోలేక ఆస్పత్రిలో మృతి చెందడం చాలా దిగ్భ్రాంతికరం..*బాలికపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు నన్ను తీవ్రంగా కలచివేశాయి..*పెట్రోల్ పోసి నిప్పంటించిన విఘ్నేష్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం..*జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో 4 బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి అరెస్ట్ చేశాం.
ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని, అందుకు సహకరించిన వారిని చట్టప్రకారం వెంటనే కఠిన శిక్షపడేలా చేస్తాం..బాధితురాలి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు.
👉కనిపించకుండాపోయిన యువతి.. తెల్లాసరికల్లా బ్రెయిన్ డెడ్‌తో ఆసుపత్రిలో ప్రత్యక్షం!..కనిపించకుండాపోయిన యువతి ఆసుపత్రిలో అపస్మాకరస్థితిలో దర్శనమిచ్చింది. దీంతో ఉలిక్కిపడ్డ కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది.మధిర సహన అనే యువతిని.. నవీన్ అనే రౌడీ షీటర్ నిన్న కారులో తీసుకెళ్లాడు.
కొన్ని గంటల తర్వాత యువతిని తెనాలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు.ఆస్పత్రిలో సహనను చేర్పించిన సమాచారాన్ని తల్లిదండ్రులకు చెప్పిన నవీన్.. అక్కడ నుంచి పారిపోయాడు.యువతి ఆస్పత్రిలోకి వచ్చే సరికే బ్రెయిన్ డెడ్ అయి ఉందని వైద్యులు చెబుతున్నారు.
కూతురిని రక్షించుకొనేందుకు తెనాలి సహా గుంటూరు, మంగళగిరిలోని పలు ఆసుపత్రులకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. చివరికి తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు కూడా తీసుకెళ్లారు. అయితే యువతి బ్రెయిన్ డెడ్‌కు గురవడంతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చేతులెత్తేశారు.
ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌కి యువతిని తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.👉యువతిని నవీన్ ఎక్కడికి తీసుకెళ్లాడు.. ఎందుకు తీసుకెళ్లాడు..యువతి బ్రెయిన్ డెడ్ ఎలా అయింది. అనే కోణంలో విచారిస్తున్నారు. నవీన్‌పై వల్లభాపురం పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ కూడా ఉంది.
👉ఛత్తీస్‌గఢ్‌లో ఏపీకి చెందిన జవాన్‌ రాజేష్ మృతి..
మావోయిస్టులు అమర్చిన మైనింగ్‌ బాంబు పేలి జవాన్ మృతి.. బ్రహ్మంగారి మఠం మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన జవాన్‌గా గుర్తింపు.. జవాన్‌ మరణంతో పాపిరెడ్డిపల్లెలో విషాద ఛాయలు.. నేడు స్వగ్రామానికి చేరుకోనున్న జవాన్ మృతదేహం..జవాన్‌ రాజేష్‌కు భార్య, ముగ్గురు పిల్లలు..
👉ప్రకాశం జిల్లా ,ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లి గ్రామంలో సిఐ ప్రభాకర్ రావు, ఎస్సై చౌడయ్య ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్….ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి సరైన ధ్రువపత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు…జిల్లాలో చెడ్డి గ్యాంగ్ కదలికలు ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ ఎస్పీ ఆదేశాలతో కార్డెన్ సెర్చ్ నిర్వహించామని వెల్లడి…
👉లారీ..బైక్ ఢీ.. కానిస్టేబుల్ సుభాని మృతి* ప్రకాశం జిల్లా: చీమకుర్తి మండలం రెడ్డినగర్ వద్ద ముందు వెళ్తున్న లారీని బైక్ ఢీ కొన్న సంఘటన జరిగింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. మృతుడు పెద్దదోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామానికి చెందిన స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ దూదేకుల సుభాని గా గుర్తించారు. చీమకుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఇంచార్జ్ రహమాన్..
👉పోలీసు అమరవీరుల త్యాగాలను మరువద్దు..
*వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా..
శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలర్చించి పోలీసు అమరవీరులను ప్రజలు మరువద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే) పురస్కరించుకోని పోలీసులు క్రోవ్వోత్తుల ర్యాలీని నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్తో పాటు పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బందితో పాటు, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గోన్నారు. అశోక జంక్షన్ నుండి వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము వరకు నిర్వహించిన ఈ ర్యాలీలోని వారు పోలీస్ కమిషనరేట్ కార్యాలయములోని అమర వీరు స్థూపం వద్ద చేరుకోని అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నక్సలైట్ల చేతుల్లో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు వృధాపోవని, వారి త్యాగాల ద్వారా నేడు ప్రశాంత వాతవరణం నెలకొందని, అలాగే అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 21వ తేది నుండి 31 తారీఖు వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా పోలీస్ కమిషనర్
వెల్లడించారు. ఈ కార్యక్రమములో డిసిపిలు రవీందర్ , అదనపు డిసిపిలు సంజీవ్, సురేష్ కుమార్, రవితో పాటు ఏసిపిలు, పాల్గొన్నారు.
👉 జూదం ఆడుతూ ముగ్గురు ఖాకీలు పట్టుబడ్డారు.
ఏలూరు నగర శివారు శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక శనివారపుపేట వైజంక్షన్ లోని అబ్బిరెడ్డి అపార్టుమెంటులో కొంతమంది జూదం అడుతున్నారని సమాచారం అందుకున్న త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు శనివారం తన సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. అక్కడ జూదం ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 2 లక్షల 37 వేల 500 నగదు స్వాధీనం చేసుకన్నారు. జూదం ఆడిన 11 మందిలో ముగ్గురు ఖాకీలు ఉండటంతో దాడి చేసేందుకు వెళ్లిన పోలీసులు కంగుతిన్నారు. ఈ ముగ్గురినీ ఏలూరు ట్రాఫిక్ కానిస్టేబుల్ రవికుమార్, భీమవరం ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, భీమడోలు లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రకాశ్ గా గుర్తించారు. ఇదలా ఉండగా ఏఆర్ కానిస్టేబుల్ భీమవరం సమీపంలోని ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి గన్మెన్ గా పనిచేస్తున్నారు.
👉బ్లాక్ లో తిరుమల టికెట్లు అమ్ముకున్న ముస్లిం ఎమ్మెల్సీ! వైసీపీ వీడి టీడీపీలో చేరినా..
వైసీపీ మాజీ ఎమ్మెల్సీ, తాజాగా టీడీపీలో చేరిన కడప జిల్లా ముస్లిం మహిళా ఎమ్మెల్సీ జకియా ఖానం ఓ వివాదంలో చిక్కుకున్నారు. అధికారంలో ఉండగా తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను బ్లాక్ లో అమ్ముకున్నట్లు ఆమెపై ఆరోపణలు రావడంతో ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఆమెతో పాటు ఆమె పీఆర్వోను సైతం నిందితులుగా చేర్చారు. తాజాగా ఆమె వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
తిరుమల దర్శనం వీఐపీ టికెట్లను బ్లాక్ లో అమ్ముకున్నట్లు వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై ఓ భక్తుడు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై భక్తులు 6 టికెట్లు పొందినట్లు తెలుస్తోంది. 6 టికెట్లను రూ.65 వేలకు భక్తులకు వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం అమ్ముకున్నట్లు ఫిర్యాదులో తెలిపాడు. దీంతో టీటీడీ విజిలెన్స్ దీనిపై ప్రాథమిక విచారణ జరిపింది. అందులో వాస్తవం ఉన్నట్లు తేలింది.
“కొత్త ఏడాది జనవరిలో శ్రీవారి దర్శనం, వసతిగదుల టికెట్ల తేదీలు ఇవే”దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు.. తిరుపతి పోలీసులకు జకియా ఖానంతో పాటు ఇలా టికెట్లు బ్లాక్ లో అమ్మడానికి కారకులైన వారిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బ్లాక్ టికెట్ల వ్యవహారంపై కేసు నమోదు చేసి ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ జకియా ఖానం, ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజ పేర్లు చేర్చారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేసి ఆరోపణలు నిర్ధారణ అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
👉జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో లైంగిక వేధింపులు ? యూఎస్ రిటర్న్ ఏపీ దంపతుల షాకింగ్..
తమిళనాడులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ కు చెందిన ఇషా ఫౌండేషన్ ఆశ్రమం మరో తీవ్ర ఆరోపణ ఎదుర్కొంటోంది. తాజాగా ఇద్దరు మహిళల్ని అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందిన ఇషా ఫౌండేషన్ పై అమెరికా నుంచి రిటర్న్ అయిన ఓ ఆంధ్రప్రదేశ్ జంట లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆశ్రమంలో ఏం జరుగుతందో వారు పూసగుచ్చినట్లు డెక్కన్ హెరాల్డ్ వెబ్ సైట్ కు వివరించారు.
రాగాని సత్యనరేంద్ర, యామిని అనే దంపతులు దశాబ్దానికి పైగా ఇషా ఫౌండేషన్ లోనే ఉన్నారు. ఈ ఆశ్రమ కమిటీలో సభ్యులుగా కూడా ఉన్నారు. ఆ తర్వాత యూఎస్ లో ఉంటున్నారు. వీరి కుమారుడిని ఇషా ఫౌండేషన్ నడుపుతున్న హోమ్ స్కూల్ లో ఉంచారు. అక్కడ తమ కుమారుడిపై మరో బాలుడు మూడేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, దీనిపై ఆశ్రమం వారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, అందుకే మీడియాను ఆశ్రయిస్తున్నట్లు ఈ దంపతులు తెలిపారు.
గతంలో ఇదే స్కూల్లో ఓ 8 ఏళ్ల బాలిక వ్యాయామ ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు భరించలేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వారు ఆరోపించారు.ఇలా పిల్లలు రేప్ కు గురవుతున్నా, చనిపోతున్నా ఆశ్రమం నుంచి ముఖ్యంగా సద్గురు నుంచి ఎలాంటి స్పందన లేదని దంపతులు ఆరోపిస్తున్నారు. భారతీయ విలువలు, సంస్కృతితో తమ బాబును చదివించాలని ఈ ఆశ్రమంలో చేర్పిస్తే అక్కడ ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నట్లు వారు తెలిపారు. దీనిపై ఆశ్రమం దృష్టికి తెస్తే తమ బాలుడినే తప్పుబడుతున్నట్లు కూడా వెల్లడించారు
👉యువతి జాతకంలో దోషం ఉందని కారులోనే జల్సా చేసిన పూజారి, కట్ చేస్తే !
జాతక దోషం సమస్యలు సరిచేస్తానని నమ్మించిన పూజారి తనకు తెలిసిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై హాసన్ జిల్లాలోని ప్రముఖ దేవాలయం పూజారిని బెంగళూరులోని బాగల్‌గుంటే పోలీసులు అరెస్ట్ చేశారు.కర్ణాటకలోని హాసన్‌లోని ప్రముఖ పురదమ్మ ఆలయ పూజారి దయానంద్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.
కొద్ది రోజుల క్రితం బాగల్‌గుంటే సమీపంలో నివసిస్తున్న బాధితురాలిని పూజారి లైంగికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి నిందితుడు దయానంద్ ను అరెస్టు చేశారు.హాసన్‌లోని పురదమ్మ దేవాలయం శక్తి దేవిగా భక్తుల నుంచి ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. దయానంద్ చాలా ఏళ్లుగా పురదమ్మ ఆలయంలో అర్చకుడిగా పని చేస్తున్నారు.
*శక్తిదేవి దేవత పేరు చెబుతున్న పూజారి దయానంద్ మంత్రాలు, వశీకరణం వంటి అపవిత్ర కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గుడి పేరుతో, హుండీ కానుక రూపంలో వచ్చిన డబ్బుతో దయానంద్ విలాసవంతమైన జీవితం గడిపేవాడు. దయానంద్ అతని శరీరం మీద చాలా బంగారు నగలు ధరించి విలాసవంతమైన కార్లలో తిరిగేవాడు. తన రిచ్ లైఫ్ స్టైల్‌ను వీడియోలు చేసిన దయానంద్ అతని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.
దయానంద్ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి బాగా ఎంజాయ్ చేస్తున్నాడని పోలీసు విచారణలో వెలుగు చూసింది. కొంతకాలంగా ఆ యువతి తాను అనుకున్న పనులు జరగడం లేదని తీవ్ర నిరాశకు గురౌతున్నదని పోలీసులు తెలిపారు.బాధితురాలు కూడా హాసన్ జిల్లా అరసికెరె తాలూకాకు చెందినది. బెంగళూరు నగరంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఆ యువతి ఉద్యోగం చేస్తున్నది.
బెంగళూరు నగరంలోని బాగలగుంటే సమీపంలోని ఒక పీజీలో ఆ యువతి నివాసం ఉంటోంది. పూజారి దయానంద్ పని చేస్తున్న ఆలయాన్ని సందర్శించిన సమయంలో పురదమ్మ భక్తురాలైన బాధితురాలికి పరిచయం ఏర్పడింది. కొన్ని నెలల క్రితం నేను గుడికి వెళ్ళినప్పుడు పూజారి దయానంద్ ఆ యువతి చెయ్యి చూసి మీ జాతకంలో దోషం ఉందని, ఈ దోషం తొలగిపోవాలంటే ప్రత్యేక పూజ చేయాలని, ఈ పూజలకు డబ్బులు ఖర్చవుతాయని పూజారి బాధితురాలితో చెప్పాడు.అందుకు అంగీకరించిన ఆ యువతి రూ. 10 వేలు పూజారి దయానంద్ కు ఇచ్చింది. ఆపై నిందితుడు దయానంద్ బాధితురాలికి కొన్ని నిమ్మకాయలు మంత్రించి ఇచ్చి ప్రతిరోజూ రాత్రి ఈ నిమ్మకాయలు తలదిండు కింద పెట్టి నిద్రపోవాలని మాయమాటలు చెప్పాడు. అనంతరం మే 24వ తేదీన బాధితురాలికి దయానంద్ ఫోన్ చేసి బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌లో తనకు తెలిసిన వ్యక్తి ఇంట్లో పురదమ్మ దేవికి పూజలు చేస్తున్నామని, ఆ పూజలకు నువ్వు కూడా రావాలని ఆ యువతిని ఆహ్వానించాడు.
ఆ పూజకు వస్తే మంత్రించిన తాళి ఇస్తానని, తరువాత ని జాతకంలోని దోషాలపు పోతాయని నిందితుడు దయానంద్ ఆ యువతిని ప్రలోభపెట్టినట్లు సమాచారం.తరువాత పూజారి దయానంద్ బాగుల్ కుంటేలోని బాధితురాలి పీజీ వద్దకు వెళ్లి అతని కారులో ఆమెను ఎక్కించుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్లాడు. అయితే హెచ్ఎస్ఆర్ లేఔట్ లోని ఇంటిలో జరుగుతున్న పూజకు తీసుకెళ్లకుండా మైసూరు రోడ్డుకు తీసుకెళ్లి మార్గం మధ్యంలో కారులోనే ఆ యువతిపై పూజారి దయానంద్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయం ఎవరికైనా చెబితే మార్ఫింగ్ చేసిన నీ ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానని పూజారి దయానంద్ ఆ యువతిని బెదిరించాడు. అనంతరం నిందితుడే దయానంద్ బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేసి రూ 40 వేలు వసూలు చేశాడు. అంతేకాకుండా ఆ యువతి పనిచేస్తున్న కంపెనీకి దగ్గరకు వెళ్లి ఆమెను పదేపదే బెదిరించారు. దయానంద్ ఆమెను హోటల్‌కు తీసుకెళ్లి లైంగికంగా వేధించాడని బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఆ వివరాలు పేర్కొన్నారు.
ఈ లైంగిక వేధింపులను తట్టుకోలేక బాధితురాలు ఎట్టకేలకు బాగల్‌గుంటే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

7k network
Recent Posts

ఉమ్మడి అనంతలో వరద విళయం..వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున..వంగవీటి రాధాను పరామర్శించిన మంత్రి నారా లోకేష్..హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం ..గండేపల్లి సెంధిని (లిక్కర్)ఫ్యాక్టరీలో సిఐడి సోదాలు.. సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బెదిరింపులు.. రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన కానిస్టేబుల్ భార్యలు.. దారి దోపిడి కేసును ఛేదించిన బాపట్ల పోలీసులు..జడ్పి సర్వసభ్య సమావేశంలో సమస్యలు లేవనెత్తిన ఎమ్మెల్యే ముత్తుముల..ఏసీబీకి చిక్కిన పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్..సత్యకుమార్ యాదవ్పై హత్యాయత్నం..బ్రతికుండగానే డెత్ సర్టిఫికేట్ ..6 ఎకరాల భూమి స్వాహా..

విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు కోటి రూపాయలు.. సీఎం రేవంత్.. “దోచుకోవడం,దాచుకోవడం తప్ప విద్యార్థుల ఫీజులు చెల్లించడం తెలియదా -జగన్ పై షర్మిల ఆగ్రహం..”రాష్ట్ర శాసనసభ స్సీకర్‌ అయ్యన్నపాత్రుడు సవాల్.. నాచారం పేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. యువకుడి మృతి ..గుజరాత్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం..”టీచర్ పై ఫొక్సో చట్టం క్రింద కేసు నమోదు..అక్కా చెల్లెళ్ల పై గ్యాంగ్ రేప్!..కాంగ్రెస్‌ నేత మారు గంగారెడ్డి హత్య..పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌ దాఖలు..మ‌మ‌త‌-శ‌ర‌ద్‌-హేమంత్‌ స‌ర‌స‌న‌.. జ‌గ‌న్ కూడా!!.. రేవన్నకు బెయిల్ నిరాకరణ.. ఎపి జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్* మార్కాపురం యూనిట్ ఎన్నిక..మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్

పత్తి చేలల్లో వాడిపోతున్న పసిమొగ్గలు..వారికి అదే చివరి రోజు: సీఎం చంద్రబాబు..తిరుమల కొండపై మరోసారి హెలికాప్టర్ కలకలం..తిరుమల లడ్డు వివాదం — పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్.. చీమకుర్తి రోడ్డు సమస్యపై కలెక్టర్ ఆఫీస్ లో ప్రజా సంకల్ప వేదిక ఫిర్యాదు..టాస్క్ ఫోర్సులో, ఒంగోలు, ఎస్. కొండ, బాపట్ల, మార్కాపురం, గిద్దలూరు కంభంలో ఘనంగా అమరవీరులకు నివాళి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల, ఎమ్మెల్యే ముత్తుముల మాజీ ఎమ్మెల్యే అన్నా..

జర్నలిస్ట్ హత్యకేసులో నిందితుడికి కూటమిలో ప్రమోషన్!?..పెట్రోల్ దాడి ఘటనపై స్పందించిన ఏపీ సీఎం…వైసీపీ స్వామి’కి.. చంద్ర‌బాబు ఒకేసారి రెండు బిగ్ షాక్‌లు!!.. బాధితురాలికి న్యాయం చేయాలి..ఐద్వా, DYFI, SFI, రైతు సంఘాల డిమాండ్.. గుంటూరులో ట్రాఫిక్ డైవర్షన్.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల.. వికలాంగురానికి సాయం అందించిన నూర్ భాషా సంఘం.

యువతి జాతకంలో దోషం ఉందని కారులోనే జల్సా చేసిన పూజారి..జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో లైంగిక వేధింపులు ?..బ్లాక్ లో తిరుమల టికెట్లు అమ్ముకున్న ముస్లిం ఎమ్మెల్సీ! ..కనిపించకుండాపోయిన యువతి.. ఆసుపత్రిలో ప్రత్యక్షం!.విద్యార్థిని మరణం విషాదకరం : హోం మంత్రి అనిత..ఏపీకి చెందిన జవాన్‌ రాజేష్ మృతి.. వైపాలెంలో కార్డెన్ సెర్చ్..పోలీసు అమరవీరుల త్యాగాలను మరువద్దు.. *వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. జూదమాడుతున్న ముగ్గురు పోలీసులు అరెస్ట్ .

కేసీఆర్ కుటుంబానిది దోపిడీ చరిత్ర .. మురికికూపంలో మగ్గిపోతున్న నిరుపేదలకు మంచి భవిష్యత్తును అందించాలన్న లక్ష్యంతోనే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టాం సీఎం రేవంత్..”మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధిలో నా ఇల్లు కూడా పోతుంది..మంత్రి జూపల్లి..”పంటలుపరిశీలించిన రైతు,కౌలురైతు సంఘాల నాయకులు..పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసనలు..”చట్టాన్ని ఉల్లంఘించిన విద్యాసంస్థల యాజమాన్యాలపై ఫిర్యాదు చేయండి- ది పేరెంట్స్ కమిటీ ఆఫ్ ఎపి