వైయ‌స్ఆర్ సీపీలో చేరిన జ‌న‌సేన నేత‌ పితాని..ఎన్నికలలో విజేత ఎవరో తేల్చిచెప్పిన వైబ్రాంట్ ఇండియా సర్వే..ఒంగోలులో సీఏఏ కి నిరసనగా ర్యాలీ.. ఏసీబీ దాడులు.

👉2024 ఎన్నికలు..విజేత ఎవరో తేల్చి చెప్పిన వైబ్రాంట్ ఇండియా సర్వే…..ఈసారి ఎన్నికల్లో తమదే విజయం అంటూ ఎవరికి వారు బలమైన నినాదాలు చేస్తున్నారు.గెలుపు ఎవరిని వరించబోతోందనే అంశంపై భిన్న అంచనాలు వెలువడుతున్నాయి.రాష్ట్రంలో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తుంది. అధికార పార్టీని ఎలాగైనా గద్దె దించాలని బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి వ్యూహాలు రచిస్తుంది.. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు విజయం సాధిస్తారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాజా పరిస్ధితులపై మరో సర్వే ఫలితాలు వెలువడ్డాయి.2018 నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో సర్వేలు చేస్తున్న వైబ్రాంట్ ఇండియా అనే సంస్ధ తాజాగా ఏపీలో నిర్వహించిన సర్వే ఫలితాలను ప్రకటించింది. ఇందులో రాష్ట్రంలో వైసీపీకీ మరియు ఎన్డీయే కూటమికీ తీవ్రమైన పోరు నెలకొనబోతుందని తేల్చి చెప్పేసింది. అంతే కాదు పలు చోట్ల హోరాహోరీ పోరు సాగబోతోందని ఈ సర్వే తేల్చింది. రాష్ట్రంలోని 175 సీట్లలో 29 స్ధానాల్లో పరిస్ధితి నువ్వా నేనా అన్నట్లు సాగనున్నట్లు సర్వే ఫలితాల్లో వెల్లడించింది.అయితే రాష్ట్రంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి ఎదురుదెబ్బ ఖాయమని వైబ్రాంట్ ఇండియా సర్వే తేల్చేసింది. వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన ఎన్డీయే కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన 115 నుంచి 120 సీట్లు కైవసం చేసుకుంటాయని ఈ సర్వే తేల్చిచెప్పింది. వైసీపీ కేవలం 55 నుంచి 60 సీట్లకే పరిమితం కానుందని ఈ సర్వే ఫలితాలు తెలిపాయి. అయితే వైసీపీ 29 సీట్లలో కచ్చితంగా గెలుస్తుందని, మరో 18 సీట్లలో తీవ్రమైన పోరు ఉంటుందని తెలిపింది. అలాగే ఎన్డీయే పార్టీలు 79 సీట్లు కచ్చితంగా గెలుస్తాయని, మరో 20 సీట్లలో తీవ్రమైన పోరు ఉంటుందని తెలిపింది.

👉 వైకాపా లో చేరిన జ‌న‌సేన నేత‌ పితాని బాలకృష్ణకళ్యాణ దుర్గం నియోజకవర్గం

టిడిపి ఇన్ ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన జ‌న‌సేన నేత‌ పితాని బాలకృష్ణ..డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా ముమ్మడివరం నియోజకవర్గానికి చెందిన ప‌లువురు జనసేన పార్టీ కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.’మేమంతా సిద్ధం; బస్సుయాత్రలో తుగ్గలి వద్ద వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు,సీఎం వైయస్ జగన్ సమక్షంలో ముమ్మడివరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పితాని బాలకృష్ణ, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్ సానబోయిన మల్లిఖార్జున్‌ సహా పలువురు జనసేన పార్టీ కీలక నేతలు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వారికి వైయ‌స్ఆర్ సీపీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

👉మోడీ మత దురహంకార విధానాన్ని ఖండించండి  ..సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు.. ఒంగోలులో వామపక్ష లౌకిక పార్టీల నిరసన ప్రదర్శన…..

ప్రధాని మోడీ మత దురహంకార విధానాన్ని దేశ ప్రజలందరూ ముక్త కంఠం తో ఖండించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు .రాజ్యాంగస్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చి బిజెపి ప్రభుత్వం సిఏఏ వంటి నిరంకుశ చట్టాన్ని చేయటాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో వామపక్ష లౌకిక పార్టీలు ఆధ్వర్యంలో శనివారం నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఒంగోలులోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పూలమాల వేసి నివాళి అర్పించారు .అక్కడి నుంచి ప్రారంభమైన ప్రదర్శన ఒంగోలు కలెక్టరేట్ వరకు సాగింది.అనంతరం జరిగిన కార్యక్రమానికి సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ అధ్యక్షత వహించారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల్లో హిందువుల ఓట్లు సాధించేందుకు ముస్లిం మైనారిటీ లకు హాని కలిగించే సీఏ ఏ చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమన్నారు.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ల కాలంలో అనేక ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు.సిఏఏ చట్టం కేవలం ముస్లింలకు మాత్రమే కాదని దేశంలోని ఇతర మైనార్టీ వర్గాలకు ఎంతో ప్రమాదకరమైందన్నారు .రాష్ట్రంలోని అధికార పార్టీ వైసిపి ప్రతిపక్ష టిడిపి సీఏ కి అనుకూలంగా ఓట్లు వేసి ఇప్పుడు ముస్లింల హక్కులు కాపాడుతామని హామీలు గుప్పిస్తున్నారన్నారు.టిడిపి వైసిపి వారి విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు .రానున్న ఎన్నికల్లో మతతత్వ బిజెపిని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.కొత్త పార్లమెంట్లో ఇండియా కూటమి సీఏఏకు వ్యతిరేకంగా బిల్లు పెడుతుందని వైసిపి టిడిపి వారి వైఖరిని స్పష్టం చేయాలన్నారు .కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య పాల్గొని ప్రసంగించారు.కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్ డి హనీఫ్ ,సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకురాలు ఎస్ లలిత కుమారి,వామపక్ష పార్టీల నాయకులు వై సిద్దయ్య,జాల అంజయ్య, జీవి కొండారెడ్డి,చీకటి శ్రీనివాసులు,ఆవాజ్ రాష్ట్రకమిటీ సభ్యులు సయ్యద్ హుస్సేన్,షంషీర్ బేగ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఈదా సుధాకర్ రెడ్డి,ముస్లిం మైనారిటీ సెల్ జిల్లా చైర్మన్ షేక్ మాబు, టిడిపి మైనారిటీ నాయకులు కపిల్ భాష, షేక్ కరిముల్లా,కంకణాల ఆంజనేయులు బాబు, రమాదేవి, ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్నారు.

👉రెవెన్యూ శాఖ ప్రధాన అధికారి పై నిఘా పెట్టిన ఏసీబీ…*ఎమ్మార్వో పై వచ్చిన ఆరోపణలపై పంజా విసిరిన ఏసిబి..తిరుపతి రేణిగుంట ఎమ్మార్వో శివ ప్రసాద్ ఇళ్ళు, ఆఫీస్ల పై ఏసిపి దాడులు నిర్వహించింది.గతంలో రేణిగుంట ఎమ్మార్వోగా పని చేసిన శివ ప్రసాద్ ఎన్నికల నేపథ్యంలో కడపకు బదిలీపై వెళ్లారు.రేణిగుంట, కడప, తిరుపతి, బెంగుళూరులలో ఏక కాలంలో దాడులు నిర్వహించారు.భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసిబి అధికారులు.

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..