*సీఎం జగన్ సమక్షంలో టీడీపీ,జనసేన నాయకులు వైయస్ఆర్‌సీపీలో చేరిక..అనంతపురం జిల్లా..
మేమంతాసిద్ధం బస్సుయాత్రలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన పార్టీ నుంచి కీలక నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.సంజీవపురం స్టే పాయింట్ వద్ద సీఎం వైయస్.జగన్ సమక్షంలో పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ కీలక నేత వేణుగోపాల్(డీయస్పీ), జనసేన నియోజకవర్గ నేత తిరుపతేంద్ర,పుట్టపర్తి టీడీపీ మండల నేత కె పెద్దన్న, వెంకటస్వామి తదితరులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ టిెక్కెట్ హామీతో డీఎస్పీ ఉద్యోగానికి వేణుగోపాల్ రాజీనామా చేశారు. 👉మేమంతా సిద్ధం బస్సుయాత్రలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో టీడీపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు..సంజీవపురం స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మాజీ ఎంపీపీ వి హనోక్, టీడీపీ నేత, చంద్ర దండు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అన్షార్ అహ్మద్.కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.* అనంతరం బత్తనపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్* సుమారు 40 నిమిషాలు పాటు బత్తలపల్లిలోనే జనంతోనే గడిపారు.. బత్తలపల్లిలో మేమంతా సిద్ధం బస్సుయాత్రకు పొటెత్తిన జనం. రెండు చోట్ల భారీ గజమాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ప్రజలు.. బత్తలపల్లిలో రోడ్డుకు రెండువైపులా దారిపొడవునా వేచిచూస్తున్న ప్రజలకు బస్సుపై నుంచి అభివాదం చేసిన ముఖ్యమంత్రి జగన్..💐💐💐💐
👉వైసీపీ కి ఎమ్మెల్సీ రాజీనామా..దాచేపల్లి.. వైసిపి ప్రాధమిక సభ్యత్వం, వైసిపి రాష్ట్ర బిసి విభాగం అధ్యక్ష పదవికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా*..ఈ నెల 5 లేదా 6వ తేదీల్లో జరిగే టీడీపీ పార్టీ కార్యక్రమంలో నారా లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరిక…తనతో పాటు తన వర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, వైసిపి కి రాజీనామా చేశారు ..
👉మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీలో చేరిక….ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు మార్కాపురం నియోజకవర్గ ఎన్ డి ఏ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సమక్షంలో మార్కాపురం మాజీ ఏఎంసి చైర్మన్ డి.వి. కృష్ణారెడ్డి మరియు వైసిపి నాయకులు ఏరువ రామిరెడ్డి తమ అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరారు.
👉 మార్కాపురం: టీడీపీ నాయకులపై కేసు నమోదు
మార్కాపురం మండలం వేములకోటలో గతనెల 23న టీడీపీ నాయకులు నిర్వహించిన సభలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో 12 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వరనాయక్ తెలిపారు. అనుమతి లేకుండా వేములకోటలో టీడీపీ నేతలు సమావేశం ఏర్పాటు చేసి. భోజనాలు పెట్టారు.ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు గుర్తించిన ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు మేరకు కోర్టు పరిశీలనకు పంపారు.
👉సొంత గూటికి చేరుకున్న స్వామి గుప్తా..
బెస్తవారిపేట పట్టణం, వాసవి టెంపుల్ ధర్మకర్త, ప్రముఖ వైసీపీ నాయకులు బొంత లక్ష్మణ స్వామి గుప్తా,వారి కుటుంబసభ్యులు సొంత గూటికి చేరుకున్నారు.నిన్న టీడీపీలో చేరిన స్వామి గుప్తా తిరిగి గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి సోదరుడు కృష్ణ మోహన్ రెడ్డి, బెస్తవారిపేట ఎంపీపీ ఓసురా రెడ్డి సమక్షంలో నేడు వైసీపీ లోకి తిరిగి వచ్చారు.ఆయన ను కృష్ణ మోహన్ రెడ్డి
వైసీపీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించినారు.
👉*ఏపి చీఫ్ సెక్రటరీ జవహర్ తో ఫోన్ లో మాట్లాడిన వైఎస్ షర్మిలా రెడ్డి..పెన్షన్ల పంపిణీకి 10 రోజులు పడుతుందని చెప్పిన సి ఎస్..*సి ఎస్ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేసిన పీసీసీ చీఫ్..
రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరగక పోతే..*సీఎస్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించిన షర్మిలా రెడ్డి*..
వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ పంపిణీ చేయలేరా..
ఇతర ప్రభుత్వ ఉద్యోగులు లేరా ప్రభుత్వ యంత్రాగం అంతా ఉండి దేనికి అని ప్రశ్నించారు.
`DBT ద్వారా కూడా పెన్షన్ పంపిణీ ఒక్క రోజులో చేయొచ్చు కదా అని నిలదీశారు.
పెన్షన్ దారుల పూర్తి వివరాలు అన్ని మీ దగ్గరే ఉన్నాయి కదా..పెన్షన్ల పంపిణీ ఆలస్యం చేయాలని అనుకోవడం ప్రభుత్వ కుట్ర అని షర్మిలా రెడ్డి`ఆరోపించారు.
ఎన్నికల కమీషన్ సూచనల ప్రకారం తక్షణం పెన్షన్లు విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు
👉రాచర్ల మండలం, యడవల్లి పంచాయతీలోని అంకిరెడ్డి పల్లె గ్రామంలో పర్యటించిన అనంతరం గ్రామంలోని ముఖ్య నాయకులతో సమావేశం అయిన గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి..👉అనంతరం యడవల్లి గ్రామంలో స్థానిక టీడీపీ శ్రేణులతో సమావేశమై రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ, గిద్దలూరు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
👉 అనంతరం ఒద్దులవాగుపల్లె పంచాయతీలోని మేడంవారి పల్లె గ్రామంలో పర్యటించి స్థానిక మహిళలతో సమావేశమై రాబోయే ఎన్నికల్లో స్థానికంగా నివాసం ఉండే తనకు,ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే మాగుంట శ్రీనివాస రెడ్డికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించినారు.