మోడీపై ట్రాన్స్ జెండర్ పోటీ..సీఎంజగన్ దంపతులకు వేద ఆశీర్వచనం..మేం ఏం చేస్తే బాగుంటుంద‌ని అనుకుంటున్నారో చెప్పండి..(బిజెపి టిడిపి జనసేన)..శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కేపీ దంపతులు..ముత్తుముల జన్మదిన వేడుకలు

👉 మోడీపై ట్రాన్స్ జెండర్ పోటీ వారణాసి నుంచి ముచ్చటగా

మూడవసారి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్నారు. 2024లో అదే సీటు నుంచి మోడీ పోటీకి దిగుతున్నారు. ఆయన మీద పోటీకి కాంగ్రెస్ అజయ్ రాయ్ ని సిద్ధం చేసింది.ఇక ఇదే వారణాసి నుంచి హిందూ మహాసభ నుంచి హేమాంగి సఖి మాత పోటీ చేస్తూండడం అందరిలో ఆసక్తిని పెంచుక్తోంది.ఆమె ఒక ట్రాన్స్ జెండర్.అంతే కాదు ఆమె బరోడాలో జన్మించారు.ఆమె ప్రపంచంలోనే భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ కావడం విశేషంగా చూస్తున్నారు.అలాగే ఆమె 2019లో ఆచార్య మహామండలేశ్వర్ గా పట్టాభిషిక్తులు అయ్యారు. ఆమె హిందూత్వ భావాలు పుష్కలంగా కలిగి ఉన్నారు.ఆమె గొప్ప ఆధ్యాత్మికపరురాలిగా ఉన్నారు.అతి పురాతన ప్రాంతం ఆధ్యాత్మిక నిలయం అయిన వారణాసి నుంచి ఆమె పోటీ ఇపుడు అందరినీ ఆలోచింపచేస్తోంది.ఆమె పోటీతో హిందూత్వ నినాదాన్నే ఊపిరిగా చేసుకుని ముందుకు సాగుతున్న బీజేపీకి ఎంతవరకూ ఇబ్బంది అవుతుందన్న చర్చ సాగుతోంది.ఇప్పటిదాకా రెండు ఎన్నికల్లోనూ నరేంద్ర మోడీకి ప్రధాన పోటీదారులుగా ఉన్న ఆప్ కానీ ఎస్పీ కానీ సెక్యూలర్ భావజాలంతో ముందుకు సాగినవారు.దాంతో హిందూత్వ అన్న నినాదం ఏకమొత్తంగా బీజేపీ పరం అయ్యేది.👉ఇపుడు హిందూ మహా సభ బీజేపీకి పోటీగా అభ్యర్ధిని పెట్టడం అందులో హేమాంగి సఖిమాత వంటి వారు ముందుకు రావడం అంటే ఇపుడు అంతా ఆసక్తిగా దీనిని చూస్తున్నారు. వారణాసిలో ప్రధాన ప్రత్యర్ధిగా కాంగ్రెస్ అభ్యర్ధి అతుల్ రాయ్ ఉన్నా హిందూ మహా సభ పోటీని కూడా తీసి పారేయటానికి లేదని అంటున్నారు. బీజేపీ భావజాలంతోనే హిందూ మహా సభ ఉన్నా ఎందుకు ప్రధాని మోడీ పైనే పోటీ పెడుతోంది అన్నది కూడా చర్చగా సాగుతోంది. బీజేపీ హిందూత్వ అజెండా ..రాజకీయ అజెండా అన్న కారణంతోనే పోటీకి దిగుతోందా అన్న చర్చ కూడా ఉంది.ఏది ఏమైనా ఎవరీ హేమాంగ్ సఖి మాత అని నెటిజన్లు ఇపుడు ఆమె కోసం సెర్చ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే బలమైన నేతగా ఉన్న మోడీని ఢీ కొనడం అంటే ఆషామాషీ కాదు. సో హేమాంగ్ సఖి మాత ఏ విధంగా తన ప్రచారాన్ని చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.

👉మేం ఏం చేస్తే బాగుంటుందో  చెప్పండి.. NDA”ప్ర‌స్తుతం జ‌రుగుతున్న

అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీలు సీట్లు పంచుకుని పోటీకి రెడీ అయిన విష‌యం తెలిసిందే.”మేం ఏం చేస్తే బాగుంటుంద‌నుకుంటున్నారో చెప్పండి”అని ఏపీలో చేతులు క‌లిపిన బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీల కూట‌మి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చింది.ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీలు సీట్లు పంచుకుని పోటీకి రెడీ అయిన విష‌యం తెలిసిందే.త్వ‌ర‌లోనే ఉమ్మ‌డిగా ప్ర‌చారం కూడా చేయాల‌ని భావిస్తున్నాయి. దీనికి సంబంధించి షెడ్యూల్‌ను కూడా ఖ‌రారు చేసుకుంటున్నాయి. ఇదిలావుంటే..కూట‌మి పార్టీల ఎన్డీయే ప్ర‌భుత్వం ఏపీలో ఏర్ప‌డితే..ఏం చేయాల‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారో చెప్పాల‌ని కూట‌మి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చింది.షడ్రుచుల వెనుక ఉన్న సైన్స్ ఇదే! కూట‌మి పార్టీల అంచ‌నా ప్ర‌కారం..ఏపీలో ఈ మూడు పార్టీల క‌ల‌యిక‌పై ప్ర‌జ‌ల‌కు చాలానే అంచ‌నాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క స‌మ‌స్య ఉన్న నేప‌థ్యంలో ఆయా జిల్లాల్లోని ప్ర‌జ‌లు ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుకుం టున్నారు. ఈ విష‌యం అటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ చేప‌ట్టిన వారాహి యాత్ర‌ల్లో బ‌య‌ట‌ప‌డింది.ఇక‌, చంద్ర‌బాబు చేప‌ట్టిన బాదుడే బాదుడు యాత్ర‌ల్లోనూ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు వినిపించాయి. అదేవిధంగా బీజేపీ నాయ‌కుల‌కు కూడా ఒక అవ‌గాహ‌న ఉంది.అందుకే.. తాము ఉమ్మ‌డిగా క‌లిసి అధికారంలోకి వ‌స్తే..ప్ర‌జ‌లు ఏం చేయాల‌ని కోరుకుంటున్నార‌నేది వారి ప్ర‌శ్న‌.ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తూ.. కూట‌మి పార్టీలు ఉమ్మ‌డిగా.. మేం ఏం చేస్తే బాగుంటుంద‌ని అనుకుంటున్నారో చెప్పండి అని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తాజాగా పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఒక ఫోన్ నెంబ‌రును కూడా ఇచ్చాయి. 8341130393 నెంబ‌రుకు మిస్డ్‌కాల్‌, వాట్సాప్,డాక్యుమెంట్‌, మెసేజ్ రూపంలో ఏదో ఒక విధంగా ప్ర‌జ‌లు త‌మ ఆకాంక్ష‌ల‌ను, స‌మ‌స్య‌ల‌ను.. తెల‌పాల‌ని కోరాయి.వీటిని తాము త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల ముందు ఉంచ‌నున్న మేనిఫెస్టోలో ఉమ్మ‌డిగా పేర్కొంటామ‌ని ఆయా పార్టీల నాయ‌కులు తెలిపారు. తాజాగా విజ‌యవాడ‌లో టీడీపీ,జ‌న‌సేన‌,బీజేపీ పార్టీల ద్వితీయ శ్రేణి నాయ‌కులు.. భేటీ అయి..మేనిఫెస్టోపై చ‌ర్చించారు…..,…

👉 ఉగాది పండుగ సందర్భంగా సీఎం వైయస్ జగన్ దంపతులకు వేద ఆశీర్వచనం.అనంతరం ఉగాది పచ్చడిని స్వీకరించిన సీఎం వైయస్ జగన్ దంపతులు…👉నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనన్నకు, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త,కేపి.నాగార్జున రెడ్డి ఆయన సతీమణి కేపి.కల్పనారెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనన్నకు,గిద్దలూరు,మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

👉గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త, కేపి.నాగార్జున రెడ్డి ఆయన సతీమణి కేపి.కల్పనారెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనన్నకు, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

👉ముత్తుముల క్రిష్ణకిషోర్ రెడ్డి జన్మదిన వేడుకలు..

గిద్దలూరు పట్టణం ప్రశాంతి నగర్ లోని గిద్దలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి సోదరుడు క్రిష్ణకిషోర్ రెడ్డి జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి .కార్యక్రమంలో కేక్ కటింగ్ జరిగింది,టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు