సీఎం జగన్ సమక్షంలో బిజెపి టీడీపీ నుండి వైకాపాలో చేరిన కీలక నేతలు.
ధూళిపాళ్ల, పల్నాడు జిల్లా..మేమంతా సిద్ధం యాత్ర సందర్భంగా తెలుగుదేశం,బీజేపీల నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో ఆలూరు,కోడుమూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం,బీజేపీ నుంచి ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ,కోడుమూరు నియోజకవర్గం టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి,కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి,బిజెపి నుంచి మాజీ మేయర్,ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ,ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ తదితరులు వైకాపాలో చేరారు.
👉పొదిలి మార్కాపురంలో మాగుంట చందన ప్రచారం..
తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించాలని కోరుతూ టిడిపి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి కోడలు,టిడిపి యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందనా రెడ్డి పొదిలి పట్టణంలో ప్రచారం నిర్వహించారు.శుక్రవారం స్థానిక రథం రోడ్ లో పట్టణ మహిళలతో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఆమె కూటమి అభ్యర్థిగా ఒంగోలు పార్లమెంట్ కు పోటీ చేస్తున్న తన మామ మాగుంట శ్రీనివాస్ రెడ్డిని, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందుల నారాయణ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆమె వెంట సీనియర్ టిడిపి నాయకులు యర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మహిళలు పాల్గొన్నారు. 👉 మార్కాపురం, పొదిలి లో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ మరియు సింగర్ కంపెనీ ఆధ్వర్యంలో మాగుంట అభిమానులు నడుపుతున్న ఉచిత కుట్టు మెషిన్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా శిక్షణ తీసుకుంటున్న మహిళలతో ఆమె కొద్ది సేపు ముచ్చటించారు. కార్యక్రమంలో ఆత్మకూరి బ్రహ్మయ్య, శ్రీమతి చెరుకూరి ఆదిలక్ష్మి ,వెంకటేశ్వర రెడ్డ, నరసింహ రెడ్డి, ట్రైనర్ సుశీల పలువురు మహిళలు పాల్గొన్నారు.
👉మద్యపాన నిషేధమంటూ జగన్ రెడ్డి లక్షలకోట్లు లూటీ చేశాడు..గిద్దలూరు టీడీపీ అభ్యర్థి ముత్తుముల..
రాష్ట్రంలో మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి లక్ష కోట్లు లూటీ చేశాడని,కల్తీ మద్యంతో వేలమంది మహిళల మంగళ సూత్రాలను తెంచిన వ్యక్తి జగన్ రెడ్డి అని గిద్దలూరు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ సర్కార్ పై ధ్వజమెత్తారు.జే బ్రాండ్ల ద్వారా దోచుకున్న లక్షల కోట్ల డబ్బును కంటైనర్ల ద్వారా ఎన్నికలకు వైసీపీ నాయకులు తరలించారని, మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వమే మద్యం అమ్మేలా చర్యలు చేపట్టాడని, 2020 లో క్రిసిల్ చేసిన సర్వే ప్రకారం ఏపీలో దాదాపు 34.5% మంది మద్యం సేవిస్తున్నారని తేలింది.2021లో నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వేలో కూడా ఏపీలో దాదాపు 31.4 % మంది మద్యం సేవిస్తున్నారని స్పష్టం అయ్యింది.మద్యపాన నిషేధం పై హామీ ఇచ్చిన జగన్ రెడ్డి నేటికీ ఒక్క డీ- అడిక్షన్ సెంటర్ ని కూడా ప్రారంభించలేదన్నారు. ఐదేళ్లలో మద్యం సేవించే వారి సంఖ్య పెరిగిందే కానీ తగ్గిన దాఖలాలు లేవన్నారు. మద్యం మాఫియా ద్వారా “జె గ్యాంగ్ ” లక్ష కోట్లను అప్పనంగా కొట్టేసిందని,జగన్ రెడ్డి లక్షల కోట్లు అవినీతి చేయడం కోసమే మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్లను నిషేధించారన్నారు.జగన్ రెడ్డి హయాంలో మద్యం బ్లాక్ మార్కెట్ లో విచ్చలవిడిగా సరఫరా అవుతోందని,మద్యం బ్లాక్ మార్కెట్ అమ్మకాల డబ్బు అంతా తాడేపల్లి ప్యాలెస్ కు తరలిపోతుందన్నారు.జగన్ రెడ్డి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి మద్యం వ్యాపారంలో ఆరితేరి పోయాడని,ఆయన రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలను నియంత్రిస్తూ, ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి కనుసన్నలోనే రాష్ట్రంలో మద్యం మాఫియా అరాచకాలు నడుస్తున్నాయని, ఎన్నికల సమయంలో అక్రమంగా వైకాపా అభ్యర్థులకు మద్యం సరఫరాకు ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి ప్రణాళికలు రచించారు. ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డిని వెంటనే విధుల నుంచి తొలగించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.నిబంధనలకు విరుద్ధంగా 9 నవంబర్ 2021న రాత్రికి రాత్రే 312, 313 జీవోలను తీసుకుని వచ్చారని,మద్యం అమ్మకాల మీద వచ్చే ఆదాయాన్ని కూడా జగన్ రెడ్డి మరో ఇరవై ఏళ్లకు తాకట్టు పెట్టాడని అంటే వచ్చే 20 ఏళ్ల వరకు మద్యపాన నిషేధం అమలు కాకుండా చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని,జాతీయ, ఆర్ అండ్ బీ రహదారులకు సమీపంలో మద్యం దుకాణాలు ఉండకూడదనే సుప్రీం కోర్డు ఉత్తర్వులను కూడా జగన్ ప్రభుత్వం భేఖాతరు చేసిందని,జగన్ రెడ్డి జే బ్రాండ్ కారణంగా జంగారెడ్డి గూడెంలో 25 మంది మరణించారని ఆరోపించారు.వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి,జగన్ ట్రబుల్ ఇంజన్ సర్కార్ పోయి ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ రావడం తథ్యమన్నారు.*👉సైకిల్ గుర్తు పై ఓటు వేయండి – అశోక్ అన్నను గెలిపించండి..ఇంటింటి ప్రచారంలో ముత్తుముల సోదరి గీత*గిద్దలూరు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపే లక్ష్యంగా వారి సోదరి గీత బెస్తవారిపేట పట్టణంలో గత నాలుగు రోజులుగా ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బెస్తవారిపేట పట్టణంలోని రాణిపేట,అచ్చిరెడ్డి కాలనీ,టీచర్స్ కాలనీలలో ఇంటింటికి తిరిగి టీడీపీ,జనసేన,బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.
👉టీడీపీని వీడి మల్లికా ఆధ్వర్యంలో 100 కుటుంబాలు ఎమ్మెల్యే అన్నా సమక్షంలో వైకాపాలో చేరిక..
తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు,మదర్ థెరిసా స్వచ్ఛంద సేవాసంస్థ అధ్యక్షురాలు సయ్యద్ మల్లికా ఆధ్వర్యంలో 100 కుటుంబాలు టిడిపిని వీడి మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నారాంబాబు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారికీ ఎమ్మెల్యే అన్నా పార్టీ కండువాలు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నా రాంబాబు విజయానికి,ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయానికి కృషి చేస్తామన్నారు.అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా పార్టీలో చేరినవారికి కృతజ్ఞతలు తెలిపారు.
👉 రాష్ట్రస్థాయి ప్రతిభ చాటిన కంభం వాసవి విద్యార్థులు..
కంభం వాసవి జూనియర్ కాలేజీ విద్యార్థులు ఎస్. చిరాయు (ఎంపీసీ), టి రాగ సుధా (ఎంపీసీ )470 మార్కులకు గాను 461 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభను చాటారు వారికి కళాశాల కరస్పాండెంట్ గోళ్ళ సుబ్బరత్నం (బాబు) మరియు కళాశాల అధ్యాపక సిబ్బంది అభినందనలు తెలిపారు
👉 ఇజ్రాయిల్ పై దమనకాండను తీవ్రంగా ఖండించిన ఎస్ ఐ ఓ నాయకులు..
రంజాన్ సందర్భంగా పాలస్తీనా భూభాగంపై ఐక్యరాజ్య సమితి ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ దమన కాండను కొనసాగిస్తూ అమాయక చిన్నారులపై, ఆసుపత్రులపై,శరణార్థి రెబిరాలపై బాంబుదాడులు చేస్తూ రాక్షస కాండ నిర్వర్తిస్తున్న ఇజ్రాయిల్ తీరును స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు వివరించి, తీవ్రుంగా ఖండించారు.ప్రకాశం జిల్లా గిద్దలూరు లో స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు మాట్లాడుతూ భారత దేశంలో 42 ఏళ్ళుగా విద్యార్థులను,యువకులను చైతన్య పరచి, దైనాదేశాలకు అనుగుణంగా సమాజ పునర్నిర్మాణానికి సంసిద్ధువ్ని చేస్తోందని అన్నారు.విద్యాలయాల్లో నైతిక విువన్ని పెంపొందిస్తూ ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కృషి చేస్తుందని తెలిపారు. ప్రతివారం చిన్న పిల్లలకు,విద్యార్థులకు, యువకులకు నైతిక శిక్షణ కొరకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.ఈ దారుణాన్ని నిరసిస్తూ ఇజ్రాయిల్ కంపెనీ ఉత్పత్తుల్ని బహిష్క రించనలసినదిగా పిలుపునిచ్చింది.అలీనదేశ పౌరులుగా మనం దౌర్జన్యకారుల దుర్మార్గాన్ని నిరసించి,పీడిత ప్రజల పక్షాన నైతిక మద్దతను ప్రకటించడం మన బాధ్యత అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహామండలి సభ్యులు డా. మొయీన్ రాషడ్,జిల్లా అధ్యక్షలు నాయబ్ రసూల్, స్థానిక అధ్యక్షులు ఫయాజ్ పలసేన్,స్థానిక కార్యదర్శి సుభాని ఇతర సభ్యులు పాల్గొన్నారు.