టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

👉టిడిపిని వాలంటీర్లే ఓడిస్తారా???

సీఎం జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన వాటిలో వాలంటరీ వ్యవస్థ కూడా ఒకటి..50 ఇళ్లకు చొప్పున ఒకరిని నియమించి.. ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను కూడా అందిస్తూ ఉన్నారు.అయితే ఇలాంటి వాలంటరీ వ్యవస్థ పైన గతంలో చంద్రబాబు నాయుడు చాలా నీచమైన కామెంట్స్ కూడా చేయడం జరిగింది.గోన సంచులు మోసే ఉద్యోగులు అంటూ వెటకారం చేయడమే కాకుండా మహిళలు ఒంటరిగా ఇళ్ల వద్ద ఉంటే వాలంటరీలు వెళ్లి తలుపు తడుతున్నారని..నీచ స్థాయికి దిగజారిపోయి మరీ మాట్లాడారు. ఈ మాటలకు పవన్ కళ్యాణ్ కూడా వత్తాసు పలకడం జరిగింది.దీంతో వాలంటరీలంతా రోడ్డు ఎక్కడమే కాకుండా దాదాపుగా 30 వేల మంది మహిళలు కూడా అదృశ్యమయ్యారని..తనకు కేంద్ర హోంశాఖ మంత్రి తెలియజేసింది అంటూ ఏవేవో నానా మాటలు మాట్లాడి ఉన్న పరువు కాస్త పోగొట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే టిడిపి, జనసేన నేతలు వాలంటరీ వ్యవస్థకి ప్రస్తుతం భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది.ఎందుకంటే ప్రధానంగా ఎన్నికలలో వాళ్లే దెబ్బేసేలా చంద్రబాబుకు కనిపిస్తూ ఉండడంతో వాలంటరీలను సైతం గాళం వేసే పనిలో భాగంగా రూ.5000 జీతాన్ని కాస్తా రూ.10వేలకు పెంచుతానంటూ ఉగాది రోజున తెలియజేశారు.దీంతో వాలంటరీలంతా కూటమి వైపు తిరుగుతారని బాబు ఎంతో ఆశగా ఉండేవారు..కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు..వాలంటీర్లు రాజీనామా చేసి వైసిపి పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాలంటరీ అనే పదాన్ని పక్కనపెట్టి మరి ప్రతి ఇంటికి వెళ్లి జగన్ ప్రభుత్వంలో తాము నేరుగా చేసిన సేవలు గురించి వివరిస్తూ పలు రకాల కార్యక్రమాలను చేపడుతూ జగన్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ ఇంటికి వెళ్లి మరీ ప్రచారం చేస్తున్నారట.దీన్ని బట్టి చూస్తే అధికార పార్టీకి రాజకీయంగానే కాస్త అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది..ముఖ్యంగా చంద్రబాబు ఇస్తానన్న 10, 000 రూపాయల గాళం ఏమాత్రం పనిచేయలేదని క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది.మరి కొంతమంది నిన్ను నమ్మలేము దొర అంటూ చంద్రబాబుని కామెంట్స్ చేస్తూ ఉన్నారు..దీన్నిబట్టి చూస్తే బాబును వాలంటరీలే ఓడించేలా కనిపిస్తున్నారు.

👉 డబ్బుల కోసం పవన్ సీట్లు అమ్ముకున్నారా!!!పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు..ఇటీవల జనసేనకు రాజినామా చేసి, వైసీపీలో చేరిన పోతిన మహేష్ ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ డబ్బులు,ఆస్తులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవును…జనసేన పార్టీ టిక్కెట్ దక్కకపోవడంతో పవన్ కల్యాణ్ వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో ఫైరయిన పోతిన మహేష్…తాజాగా ఆయన ఆస్తులపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న పోతిన మహేష్ కు ఓ ప్రశ్న ఎదురైంది.ఇందులో భాగంగా…పవన్ కల్యాణ్ సినిమాలు చేసి సంపాదించిన డబ్బు పార్టీకి ఖర్చుపెడుతున్నారని జనసైనికులు చెబుతుంటే.. డబ్బుల కోసం పవన్ సీట్లు అమ్ముకున్నారని పోతిన మహేష్ చెప్పడంపై ప్రశ్నించారు! దీంతో దీనికి సమాధనంగా స్పందించిన మహేష్…2014 నుంచి 2024 వరకూ పవన్ కల్యాణ్ చేసిన సినిమాలు ఎన్ని? ఎన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి?ఎన్ని డిజాస్టర్ అయ్యాయి?పవన్ కల్యాణ్ చేసిన సినిమాలు… అత్తారింటికి దారేది,గోపాల గోపాల,సర్ధార్ గబ్బర్ సింగ్,కాటమ రాయుడు, అజ్ఞాతవాసి,వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో అని చెబుతు..ఈ సినిమాల మొత్తానికి ఆయనకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత? అని ప్రశ్నించారు.ఇదే క్రమంలో… 2014 నుంచి 2024వరకూ సినిమాల్లో ఆయనకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత..? ఆయన కట్టిన ఇన్ కం ట్యాక్స్ ఎంత..? ఆయన మెయిటినెన్స్ పోగా మిగిలింది ఎంత..?ఆయన పార్టీ కోసం ఖర్చు పెట్టింది ఎంత..?ఆయన కొన్న ఆస్తులు ఎంత..? అని ప్రశ్నించారు.ఇదే సమయంలో పవన్ కల్యాణ్ కి డబ్బులు ఎవరు ఇస్తున్నారనేది బహిరంగ సత్యం అని చెబుతూ…చంద్రబాబు నుంచి, టీడీపీ నేతల నుంచి పవన్ కు డబ్బులు వస్తున్నాయనేది అంతటా ఇదే క్రమంలో ఖచ్చితంగా పవన్ కల్యాణ్ కి ఉన్న ఆస్తుల వివరాలను ఎన్నికలకు ముందే బయటపెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా తాను ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు. దీంతో… పోతిన మహేష్ కు తెలిసి పవన్ కల్యాణ్ 2014 – 2024 వరకూ కొన్న ఆస్తులు ఎంత అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది!

👉ప్రస్తుతం పవన్ పిఠాపురం నుంచి బరిలో ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో రెండు చోట్ల ఓడిపోయిన ఆయన ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకే కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాన్ని చూసి మరీ ఎంచుకున్నారు. ఇప్పటికే నాలుగు రోజుల పాటు నియోజవర్గంలో పర్యటించి.. స్థానిక నాయకులతో చర్చలు జరిపారు. అక్కడ తన గెలుపు బాధ్యతను టీడీపీ ఇన్ ఛార్జి వర్మకు అప్పగించారు.👉ఇదిలా ఉండగా.. పవన్ పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని జైభీం పార్టీ అభ్యర్థి జగ్గారపు మల్లిఖార్జున పవన్ కల్యాణ్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు. జనసేనాని విచ్చలవిడిగా రూ.వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని.. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కులం, మతం ప్రాంతం ఆధారంగా పవన్ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు అంటూ.. చర్యలు తీసుకోకుంటే హైకోర్టును ఆశ్రయిస్తాం అని సంచలన ఫిర్యాదే చేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి……

👉 ఆంధ్ర మిర్రర్.. దరిశి  లో జరిగిన జయహో *బీ. సి సభ* లో దర్శి శాసనసభ అభ్యర్థి డా గొట్టిపాటి లక్ష్మి, జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ ,ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి,మునిసిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య ,మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు మరియు కార్యక్రమంలో రాష్ట్ర బి. సి. నాయకులు, తెలుగుదేశం,జనసేన,బిజెపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

👉 ఆంధ్ర మిర్రర్ గిద్దలూరు.. శ్రీరామ నవమి సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు రోడ్ లో సీతామహాలక్ష్మి కల్యాణ మండపంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువనాయకులు మాగుంట రాఘవరెడ్డి వారి సతీమణి చందన మరియు గిద్దలూరు శాసనసభ అభ్యర్థి అశోక్ రెడ్డి వారి సతీమణి పుష్పలీల పాల్గొన్నారు.కార్యక్రమంలో డా. జె. వి నారాయణ, కుప్పా రంగసాయి, బిజెపి తెలుగుదేశం,జనసేన,నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

👉ముత్తుముల సమక్షంలో టిడిపిలో చేరిన మాజీ జెడ్పిటిసి* ఆంధ్ర మిర్రర్..అర్థవీడు మండలంలో పర్యటిస్తున్న ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో పెద్దకందుకూరు గ్రామానికి చెందిన మాజీ జడ్పిటిసి సభ్యురాలు వెంకటలక్ష్మి వైసీపీని వీడి తన అనుచరవర్గంతో సహా తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టిడిపి కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో అశోక్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తామని మాజీ జెడ్పిటిసి తెలిపారు.

👉వైసీపీలో చేరిన తెలుగుదేశం పార్టీ మాజీ కో ఆప్షన్ మెంబర్ మహబూబ్ బేగ్…ఆంధ్ర మిర్రర్ ..ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం లోని బెస్తవారిపేట పట్టణ నికి చెందిన,మాజీ కో ఆప్షన్ మెంబర్ మహబూబ్ బేగ్,పఠాన్ ఉస్మాన్ ఖాన్,అలీమ్ బేగ్,అజీజ్ బేగ్ ,టిడిపిని వీడారు.మంగళవారం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సోదరుడు కుందూరు కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు.ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి కృష్ణమోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు నెం.1బాషా, ఇర్ఫాన్ పాల్గొన్నారు

👉వైసీపీలో చేరిన మాజీ వార్డ్ మెంబర్ మౌలాలి.. ఆంధ్ర మిర్రర్..ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురం పంచాయతీకి చెందిన మాజీ వార్డు నెంబర్ షేక్.మౌలాలి టిడిపిని వీడారు.మంగళవారం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సోదరుడు కుందూరు కృష్ణ మోహన్ రెడ్డి గారి సమక్షంలో మౌలాలి వైసీపీ లో చేరారు.ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి కృష్ణ మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ యువ నాయకులు,ఇర్ఫాన్,ఇబ్రహీం,దోమన,రమణ. రాంసుబ్బారెడ్డి, పాల్గొన్నారు..

7k network
Recent Posts

మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!