👉పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..రూ.1,21,618 కోట్ల ఆస్తుల జప్తు!
అవును.. యూపీఏ హయాంతో పోలిస్తే బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా ఈడీ జోరు గత పదేళ్లలో విపరీతంగా పెరిగిందని అంటున్నారు.దేశంలో గత పదేళ్లలో తన రాజకీయ ప్రత్యర్థుల మీదకు మోడీ.. ఈడీని వదులుతారనే విమర్శ విపక్షాల నుంచి ఉన్న సంగతి తెలిసిందే. అయితే…ఆస్తుల జప్తు కూడా అదే స్థాయిలో ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి.ఈ క్రమంలో గత పదేళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు బాగా పెరిగిందని తెలుస్తుంది. సోదాలు, అరెస్టుల సంఖ్యతో పాటు జప్తు సొమ్ము భారీగా ఉందని అంటున్నారు. అవును..యూపీఏ హయాంతో పోలిస్తే బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా ఈడీ జోరు గత పదేళ్లలో విపరీతంగా పెరిగిందని అంటున్నారు.ఈ క్రమలో..గత కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే… సుమారు 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించిందని తెలుస్తుంది. ఇదే సమయంలో..అరెస్టుల సంఖ్య కూడా 24 రెట్లు పెరిగింది.ఈ క్రమంలో జూలై 2005 – మార్చి 2014.. ఏప్రిల్ 2014 – మార్చి 2024 మ్నధ్య లెక్కలను పీటీఐ విశ్లేషించింది. చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..ఈ గణాంకాల ప్రకారం..మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న యూపీఏ ప్రభుత్వంలోని తొమ్మిదేళ్లలో 1,797 కేసులను ఈడీ నమోదు చేస్తే.. గత పదేళ్లలో ఆ సంఖ్య 5,155కు చేరిందని చెబుతున్నారు. అంటే… కేసుల విషయంలో వృద్ధి సుమారు మూడు రెంట్లు అన్నమాట! ఇక సోదాల విషయానికొస్తే… యూపీఏ హయాంలోని తొమ్మిదేళ్లలో 84 సోదాలు జరగగా..2014-24 మధ్య దేశవ్యాప్తంగా 7,264 సోదాలను ఈడీ నిర్వహించింది.ఇక ఆస్తుల జప్తు విషయానికొస్తే… యూపీఏ హయాంలో 29 అరెస్టులు జరిగి,5,086.43 కోట్ల ఆస్తులు జప్తూ చేయగా.. పదేళ్ల మోడీ పాలనలో 755 మందిని ఈడీ అరెస్టు చేసి, రూ.1,21,618 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.అంటే అరెస్టులు 26 రెట్లు,జప్తులు 24 రెట్లు పెరిగాయన్నమాట. ఇదే క్రమంలో…యూపీఏ హయాంలో 102 ఛార్జిషీట్లు దాఖలవ్వగా.. బీజేపీ పాలనలో 1281 ఛార్జిషీట్లు నమోదయ్యాయి.ఈ నేపథ్యంలో..ఈ డేటాపై స్పందించిన ఒక ఈడీ అధికారి..మనీ లాండరింగ్ నేరాలను కట్టడి చేయడానికి తాము తీసుకున్న చర్యలను ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు! అయితే..విపక్షాలు మాత్రం..రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీని బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపిస్తున్నాయని అన్నారు! కాగా..ఆరోపణలు వచ్చిన అనంతరం బీజేపీలో చేరిన వారు మాత్రం..పైన చెప్పుకున్న జాబితాలో లేరనే విమర్శలు వినిపిస్తుండటం గమనార్హం!
👉సీఎం జగన్ సమక్షంలో కీలకనేతల చేరికలు..
పశ్చిమ గోదావరి జిల్లా తేతలిలో సీఎం జగన్ సమక్షంలో మేమంతా సిద్ధం యాత్ర సందర్భంగా గన్నవరం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్.గణపతిరావు కుమారుడు ఎన్ గణేష్ బాబు, మనవడు ఎన్.గణపతిరావులు తెలుగుదేశం పార్టీ నుంచి టీడీపీ నేత వడ్లమూడి గంగరాజు తాడేపల్లి గూడెంకు చెందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏపీ కన్వీనర్ గమ్మిని సుబ్బారావులు సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరారు…….👉తూర్పు గోదావరి జిల్లాలో తుడిచిపెట్టుకుపోయిన జనసేన!..సీఎం వైయస్ జగన్ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరిన రాజోలు జనసేన పార్టీ ఇంఛార్జ్, బొంతు రాజేశ్వరరావు, ఇతర నేతలు..👉పవన్ కళ్యాణ్ నమ్మించి మోసం చేశాడంటూ వరుసగా జనసేనను వీడిన అమలాపురం ఇంఛార్జ్ రాజబాబు,ముమ్మడివరం ఇంఛార్జ్ పితాని బాలకృష్ణ, పిఠాపురం ఇంఛార్జ్ శేషు కుమారి,కాకినాడ మాజీ మేయర్ సరోజ ఆరోపణ .
👉నేడు ప్రకాశం భవనం లో కలెక్టర్ కార్యాలయం లో నామినేషన్ వేసిన పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. కార్యక్రమంలో ఆయన సతీమణి గీతమ్మ తనయులు మాగుంట రాఘవ రెడ్డి సతీమణి చందన,నిఖిల్ రెడ్డి కార్యక్రమం లో జనసేన ఇంచార్జి షేక్ రియాజ్,బిజెపి జిల్లా అధ్యక్షులు శివా రెడ్డి, టిడిపి అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
👉గిద్దలూరు వైయస్సార్సీపి అభ్యర్థిగా కుందూరు నాగార్జున రెడ్డి నామినేషన్..రేపు( శుక్రవారం) ఉదయం 10:30 గంటలకు గిద్దలూరు పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి వద్ద నుండి గిద్దలూరు వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయుటకు ర్యాలీగా బయలుదేరి,గిద్దలూరు ఎమ్మార్వో కార్యాలయం లో నామినేషన్ వెయ్యనున్నారు.
కావున నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, డైరెక్టర్లు, మండల పార్టీ కన్వీనర్లు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్ లు, గృహ సారదులు, అభిమానులు,ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు.
👉రాచర్ల పంచాయతీలో తెలుగుదేశం ఇంటింటి ప్రచారంలో అశోక్ రెడ్డి సోదరీ గీత.. ఆంధ్ర మిర్రర్.
ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే అవ్వ తాతలకు 4వేల రూపాయలు, వికలాంగులకు 6వేల రూపాయలు పెన్షన్ ప్రతీ నెల ఇంటి వద్దకే వచ్చి అందజేయడం జరుగుతుందని అశోక్ రెడ్డి సోదరి గీత ప్రజలకు వివరించారు.ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రాచర్ల పంచాయతీలోని ఫారం గ్రామం మరియు ఎస్.పి.జి పాలెం ఏబీఎన్ పాలెం లలో ఇంటింటికి తిరిగిన వారు టిడిపి జనసేన బిజెపి మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు.నాడు తెలుగుదేశం హయాంలో అశోక్ రెడ్డి గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు,పక్కా గృహాలు, పెన్షన్లు మంజూరు చేశారని గుర్తు చేశారు.ప్రజలకు ఏ సమస్య వచ్చిన స్థానికంగా అందుబాటులో ఉంటారని ప్రజా సమస్యలను పరిష్కరించటమే వారి ధ్యేయమన్నారు.గిద్దలూరు నియోజకవర్గ ప్రజలంతా మే 13న జరిగే ఎన్నికల్లో స్థానిక నాయకుడు,ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న ముత్తుముల అశోక్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసుల రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
👉 రాజీనామా చేస్తే రూ.15వేలు బంపర్ ఆఫర్.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిళ్లు
ప్రస్తుతం ఎక్కడ చూసినా కొందరు వైకాపా నాయకులు,పాలకుల లక్ష్యం ఒక్కటే.. గ్రామ వాలంటీర్లతో రాజీనామా చేయించడమే. రహస్యంగా వాలంటీర్లను ఓ ప్రాంతానికి రప్పించుకుని సమావేశాలు నిర్వహించడం, రాజీనామాలకు ఒత్తిడి తీసుకురావడం పరిపాటిగా మారింది..
కొందరు విముఖత చూపడంతో వారినీ ఒప్పించేందుకు కొత్త ఆఫర్లను ప్రకటిస్తుండటం కనిపిస్తోంది.బరిలో ఉన్న అభ్యర్థి ద్వారా ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తారని చెబుతుండటం గమనార్హం. అలాగే, మళ్లీ అధికారంలోకి రాగానే మీ ఉద్యోగం తిరిగి ఇస్తామనే హామీలూ గుప్పిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు వాలంటీర్లు ఇష్టం లేకపోయినా రాజీనామాలకు సిద్ధమైనట్లు..
రోజుకు నలుగురిని మార్చాలంట! నాయకులు ఆఫర్‌కు తోడు..కొన్ని నిబంధనలనూ ప్రస్తావించడం క్షేత్రస్థాయిలో చర్చగా మారింది. రాజీనామా చేసిన వాలంటీర్లు వైకాపా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించడంతో పాటు..ఒక్కొక్క వాలంటీర్ రోజుకు కనీసం నలుగురిని కలసి వైకాపాకు ఓటేసేలా చేయాలన్నది ఆ మాటల సారాంశం.ఇలా చేసినందుకు తమ నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందని భరోసా ఇస్తుండటం చర్చగా మారింది..
👉వైరల్ వీడియో… ఢిల్లీ బస్సులో అమ్మాయి అసభ్యకరమైన చర్య!..
ఇదే సమయంలో ఢిల్లీలో పబ్లిక్ బస్సులో ఒక అసభ్యకరమైన సంఘటన వెలుగు చూసింది. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు కొంతమంది వ్యక్తుల ప్రవర్తన ఉంటుంటుంది! సభ్యసమాజం ఏమనుకుంటుందనే ఇంగితం ఏమాత్రం లేకుండా ప్రవర్తిస్తుంటారు.ఈ క్రమంలో ఇప్పటికే సోషల్ మీడియాలో రీల్స్ పేరున కొంతమంది అమ్మాయిలు ఇటీవల చేసిన రచ్చ సంగతి తెలిసిందే! ఇదే సమయంలో ఢిల్లీలో పబ్లిక్ బస్సులో ఒక అసభ్యకరమైన సంఘటన వెలుగు చూసింది. అవును..భారతదేశంలో ప్రతీ పౌరుడికీ తినే తిండి,ధరించే దుస్తుల విషయంలో స్వేచ్చ ఉన్న మాట వాస్తవమే కానీ..అది శృతిమించితే, సమాజాన్ని ఇబ్బందులకు గురిచేసేది అయితే మాత్రం ఇబ్బందులు తప్పవనేది తెలిసిన విషయమే! ఈ క్రమంలో పబ్లిక్ బస్సులో ఒక షాకింగ్ దృశ్యానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక యువతి తన లోదుస్తులు.. బ్రా, ప్యాంటీలు తప్ప మరేమీ ధరించకుండా రద్దీగా ఉండే పబ్లిక్ బస్సులో ప్రయాణిస్తున్నట్లు కనిపించింది.ఈ సమయంలో పిల్లలు, పురుషులు, మహిళలు అనే తారతమ్యాలు లేకుండా అంతా సమానంగా ఇబ్బందిపడ్డారనే చెప్పాలి.ఈ సమయంలో కొంతమంది ఆమెను చూసిన తర్వాత బస్సు దిగిపోవడం కనిపించింది! బస్ కండక్టర్ కూడా ఏమీ తెలియనట్లు,ఏమీ చేయలేని పరిస్థితికి చేరుకున్నట్లు తెలుస్తుంది!ఈ సమయంలో సదరు మహిళ ప్రవర్తన పూర్తిగా అసభ్యకరంగా పరిగణించబడింది!లోదుస్తులు ధరించి పబ్లిక్ బస్సులో ప్రయాణించడం తనకే కాదు,అలాంటి ప్రవర్తనను చూసే ఇతర ప్రయాణికులకు కూడా అగౌరవంగా ఉంటుందనే విషయం గ్రహించాలి..!