👉మోడీకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన ప్రియాంక గాంధీ !👉యుద్ధం సమయంలో ఇందిరా గాంధీ తన బంగారాన్ని విరాళంగా ఇచ్చారు … తన తల్లి (సోనియా గాంధీ) దేశం కోసం మంగళసూత్రం త్యాగం చేశారు..👉గత 75 ఏళ్లుగా స్వేచ్ఛగా ఉంది.అందులో 55 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది..ఆ సమయంలో మీ మీ బంగారాన్ని, మంగళసూత్రాన్ని ఎప్పుడైనా లాక్కుందా?లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో నిర్వహించిన ప్రచార సభలో ప్రియాంక సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈసందర్భంగా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు,ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలు రాజకీయ వాతావరణాన్ని సెగలు కక్కించేసేలా చేస్తుంది.ఇప్పుడు ప్రియాంక వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి!అవును లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయపార్టీలూ వారి వారి ప్రచార కార్యక్రమాలను పీక్స్ కి తీసుకెళ్తున్నాయి.ఈ సమయంలో తాజాగా యుద్ధం సమయంలో ఇందిరా గాంధీ తన బంగారాన్ని విరాళంగా ఇచ్చేశారని గుర్తు చేసిన ప్రియాంక గాంధీ…తన తల్లి (సోనియా గాంధీ) దేశం కోసం మంగళసూత్రం త్యాగం చేశారని రాజీవ్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.ప్రధానంగా… ప్రజల వద్ద ఉన్న బంగారం సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పునఃపంపిణీ చేస్తుందని,ఈ విషయంలో మహిళల మంగళ సూత్రాలనూ వదలదంటూ కాంగ్రెస్ పై ప్రధాని మోడీ చేసిన ఆరోపణల నేపథ్యంలో ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదే సమయంలో మంగళసూత్రం ప్రధాన్యాన్ని మోడీ అర్ధం చేసుకుని ఉంటే అలా అనైతికంగా మాట్లాడేవారు కాదంటూ ఘాటుగా స్పందించిన ప్రియాంక…భారత్ గత 75 ఏళ్లుగా స్వేచ్ఛగా ఉంది.అందులో 55 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది..ఆ సమయంలో మీ మీ బంగారాన్ని, మంగళసూత్రాన్ని ఎప్పుడైనా లాక్కుందా? అంటూ ప్రజలను ప్రశ్నించారు.ఇదే క్రమంలో… చిత్రదుర్గ్ లో నిర్వహించిన సభలోనూ ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు.ఇందులో భాగంగా ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోనే అతి పెద్ద నాయకుడైన ఆయన నైతికతను వదిలేశారని దుయ్యబట్టారు.ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకే మోడీ సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.విపక్షాల బ్యాంకు ఖాతాలను నిలిపివేసి, ఇద్దరు ముఖ్యమంత్రుల్ని జైలుపాలు చేసిందని తెలిపారు!
👉శ్రీరాముడిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!..మోదీ ఎవరికి దేవుడు?..జైశ్రీరామ్ అనడం తప్ప దేశానికి చేసిందేమీ లేదు.. పెట్రోల్ ధరలు పెంచినందుకా?సరుకు రవాణా ఛార్జీలు పెంచి నిత్యవసరాలు పెంచినందుకు దేవుడా?..మతం పేరుతో రాజకీయం చేస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలి.
తాజాగా చేవెళ్ల ఎంపీ స్థానానికి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ సందర్భంగా జరిగిన ర్యాలీలో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తయిన బీఆర్‌ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో అయినా మెరుగైన సీట్లను సాధించిపెట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.తాజాగా చేవెళ్ల ఎంపీ స్థానానికి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ సందర్భంగా జరిగిన ర్యాలీలో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు.శ్రీరాముడు బీజేపీ ఎంపీనో,ఎమ్మెల్యేనో కాదన్నారు.రాముడి అందరివాడని వ్యాఖ్యానించారు.శ్రీరాముడు అందరికీ దేవుడు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.బీజేపీ ఎన్నికల్లో ఓడిపోయినా రాముడికి ఏమీ కాదన్నారు. శ్రీరాముడితో తమకు ఎలాంటి పంచాయతీ లేదన్నారు.ఏం ఫరక్ పడదన్నారు.మతం పేరుతో రాజకీయం చేస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.బీజేపీ కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నా జైశ్రీరామ్ అనడం తప్ప దేశానికి కానీ,తెలంగాణకు కానీ చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో ఒక్క కాలేజీ, బడికి,గుడికి ఒక్క పైసా ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదన్నారు.2014లో మోదీ ప్రధాని అయినప్పుడు సిలిండర్ ధర తక్కువగా ఉంటే ఇప్పుడు పెంచారని కేటీఆర్ ఆరోపించారు.మోదీ దేవుడు అని బీజేపీ నేతలు అంటున్నారని..మోదీ ఎవరికి దేవుడని నిలదీశారు.పెట్రోల్ ధరల పెంచినందుకా..?సరుకు రవాణా ఛార్జీలు పెంచి నిత్యవసరాలు పెంచి బతుకులు ఆగం చేసినందుకు దేవుడా అని ప్రశ్నించారు. అలాగే చేవెళ్లలో తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్ రెడ్డి,కొండా విశ్వేశ్వర్ రెడ్డికి బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు తప్పకుండా బుద్ధి చెప్పాలని పార్టీ శ్రేణులను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ కు 8 నుంచి 10 సీట్లు ఇస్తే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మనం చెప్పినట్లే వింటుందన్నారు.కేంద్రంలో అధికారంలో ఉండే ఎవరైనా మన వద్దకు రావాలంటే బీఆర్‌ఎస్ కు ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరారు. మోదీ, ఎన్డీయే కూటమికి 400 కాదు..200 సీట్లు కూడా వచ్చేలా లేవని కేటీఆర్ తెలిపారు.కాంగ్రెస్ పార్టీకి కూడా 100 నుంచి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.
👉ఎవరెస్టు,ఎండీహెచ్ మసాలాలపై కూడా నిషేధం విధింపు..
ప్రమాదకర ఇథిలిన్ ఆక్సైడ్ మోతాదుకు మించడమే కారణం .. హైదరాబాద్..భారత్‌కు చెందిన మసాలా ఉత్పత్తుల కంపెనీ ‘ఎవరెస్ట్’కు మరో షాక్ తగిలింది. ఇటీవల సింగపూర్‌లో వేటుకు గురైన ఈ కంపెనీపై తాజాగా హాంకాంగ్ కూడా బ్యాన్ విధించింది. ఎవరెస్ట్‌తో పాటు భారత్‌కు చెందిన మరో కంపెనీ ఎండీహెచ్‌కు చెందిన మసాలా ఉత్పత్తులపై కూడా నిషేధం విధిస్తున్నట్టు హాంకాంగ్‌కు చెందిన ఆహార భద్రత నియంత్రణ సంస్థ (సీఎఫ్‌ఎస్) వెల్లడించింది.తమ పౌరులెవ్వరూ ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని సూచించింది. ఈ మసాలాల్లో ఇథలిన్ ఆక్సైడ్ మోతాదుకు మించి ఉన్నట్టు పేర్కొంది.కాగా, విదేశాల్లో నిషేధానికి గురైన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలు భారత్‌లో కూడా విక్రయిస్తుండటంతో ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అప్రమత్తమైంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఈ కంపెనీలకు చెందిన మసాలాలను సేకరించి ప్రయోగశాలలో నమూనాలను పరీక్షిస్తున్నట్టు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా,2023లో ఎవరెస్ట్ సాంబార్ మసాలా, గరం మసాలాను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించిన విషయం తెలిసిందే.👉ఏమిటీ ఇథిలిన్‌ఆక్సైడ్? …ఇథిలిన్ ఆక్సైడ్‌కు మండే స్వభావం ఉంటుంది. వ్యవసాయం, హెల్త్ కేర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలలో పురుగుమందుల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, కీటకాల నుంచి ఆహారాన్ని రక్షించడానికి కూడా వాడుతారు. మోతాదుకు మించి ఇది శరీరంలోకి చేరితే రొమ్ము క్యాన్సర్‌తో పాటు నాడీమండల వ్యవస్థ, మెదడు, డీఎన్‌ఏపై దుష్ప్రభావం చూపే ప్రమాదమున్నదని వైద్య నిపుణులు చెప్తున్నారు
👉రాచర్ల మండలం రామాపురం గ్రామంలో మధిరె చిన్ని పోలి రెడ్డి ఆద్వర్యంలో తెదేపా ను వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన 50 కుటుంబాలు..*
👉 రాచర్ల మండలం రామాపురం గ్రామంలో మధిరె చిన్న పోలి రెడ్డి ఆధ్వర్యంలో తెదెపా ను వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన రామాపురం కు చెందిన 50 కుటుంబాలు వీరంతా రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కు సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది… కార్యక్రమంలో రాచర్ల మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు, జెసి యస్ కన్వీనర్ లు,సోసైటీ చైర్మన్ లు,ఎంపీపీ లు జడ్పీటీసీ లు, వైస్ ఎంపీపీ లు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, వైసీపీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు…👉కంభం మండలం తురిమెళ్ళ గ్రామానికి చెందిన 22 మంది గ్రామ వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ రాజీనామా లెక్కలను కంభం ఎంపీడీవో కు అందజేయడం జరిగింది..తాము 2024 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగనన్న గెలుపు ఎలక్షన్ గా గిద్దలూరు లో కుందురు నాగార్జున రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు.
👉బేస్తవారిపేట మండలం సలకలవీడు గ్రామంలో బిక్కా వీరాంజనేయ రెడ్డి ఆద్వర్యంలో తెదేపా ను వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి సతీమణి కేపి.కల్పనా రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన 20 కుటుంబాలు……👉అర్ధవీడు మండలం పెద్ద కందుకూరు గ్రామంలో తెదేపా ను వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి తమ్ముడు కుందూరు కృష్ణ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో 10 కుటుంబాలు చేరాయి…👉అర్ధవీడు మండలం మిట్టమీద పల్లె గ్రామంలో తెదేపా ను వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కుందురు నాగార్జున రెడ్డి తమ్ముడు కృష్ణ మోహన్ రెడ్డి సమక్షంలో 10 కుటుంబాలు ,శంకరాపురం గ్రామం బీసీ కాలనీ లో 80 కుటుంబాలు వైసీపీ లో చేరాయి………. ..👉రాచర్ల మండలం, పాలకవీడు పంచాయితీ, అనుమలవీడు గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు నిన్న ఉదయం 11:00 గంటల సమయం లో టీడీపీ లో చేరిన ముఖ్య నాయకుల 30 కుటుంబాలు.నిన్నటి రోజున వైసీపీ మండల ఇంఛార్జి శ్రీనివాస రెడ్డి ,మండల కన్వీనర్ మురళీ, సీనియర్ నాయకులు సూరా స్వామి రంగారెడ్డి ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం 7:00 గంటల సమయం లో టీడీపీ ని వీడి వైస్సార్సీపీ లో చేరటం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారిలో చనిగ వీరయ్య, శనిగ భూపాల్, శనిగ నారాయణ, వెంకటయ్య, రాబర్ట్, నన్నెవలి,బొడ్డు ప్రసాద్, వెరీ ఇరువురు, ఉప సర్పంచ్ భవాని, ఇబ్రహీం,జార్జ్, ప్రవీణ్, ప్రభాకర్ నాయుడు, రామాంజనేయులు ఆధ్వర్యంలో తిరిగి సొంత గూటికి చేరారు .వీరందరు కుందూరు నాగార్జున రెడ్డి విజయం కోసం కృషి చేస్తాం అని చెప్పటం జరిగింది….👉CRI మురళి ఆధ్వర్యంలో సొంత గూటికి చేరిన 9 వ వార్డు కు చెందిన ముత్రాసు వెంకటేశ్వర్లు…*గిద్దలూరు టౌన్ 9 వ వార్డు కు చెందిన ముత్రాసు వెంకటేశ్వర్లు మధ్యాహ్నం టిడిపి లో చేరగా తిరిగి ఈరోజు సాయంత్రం వార్డు కౌన్సలర్ ముద్దర్ల శ్రీనువాసులు, CRI మురళి ఆద్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి సమక్షంలో సాయంత్రం వైసీపీ లో చేరారు.