👉ప్రధాని మోదీపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..మహిళల మంగళసూత్రాలను కూడా కాంగ్రెస్ వదలిపెట్టదంటూ మోదీ తీవ్ర విమర్శ..మతాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ మండిపడ్డ షర్మిల..ప్రధానికి దమ్ముంటే తను చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోవాలని సవాల్..కాంగ్రెస్‌పై విషం చిమ్ముతున్నారంటూ ఆగ్రహం..ప్రధాని మోదీ దేశంలో చేసిన
అభివృద్ధి గురించి చెప్పుకోలేక కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్ముతున్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు తెంచుతామట.మతాల మధ్య మళ్ళీ చిచ్చు పెడుతున్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ద్వేషం పెంచుతారా? మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు సృష్టించి ఎన్ని మంగళసూత్రాలు తెంచలేదు? ఇప్పుడు ప్రధానిగా ఉన్నప్పుడు మణిపూర్ ఘటనతో ఎన్ని మంగళసూత్రాలు తెంచలేదు? రాహుల్ గాంధీ ప్రేమను నింపే మాటలు మాట్లాడుతున్నారు. మోదీ మాత్రం మతాలను విడదీసి మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీకి దమ్ముంటే చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి. ముస్లింలను కించపరిచేలా మాట్లాడటం సరికాదు.ఇది బీజేపీకి, ఈ దేశానికి మంచిది కాదు. బీజేపీ ఈ దేశానికి చాలా ప్రమాదకరం.కాంగ్రెస్ పార్టీతోనే దేశ, రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాస్వామ్యానికి రక్షణ అన్నారు.
👉 మేమంతా సిద్ధం బస్సుయాత్ర యాత్రలో భాగంగా విశాఖపట్నంలో పర్యటించినప్పుడు సీఎం జగన్ సీనియర్ నేత అలాగే మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గురించి ఆసక్తికరమైన మాటలు మాట్లాడుతూ బొత్సను నేను అన్నా అంటానని ఆయన నాకు తండ్రి లాంటి వారిని అందరూ కలిసి బొత్స అన్నాను గెలిపించాలని అన్నారు. అయితే జగన్ చేసిన ఇలాంటి వ్యాఖ్యలకు బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న షర్మిల జగనన్నను తీవ్రంగా విమర్శించారు.
దాంట్లో భాగంగా గతంలో బొత్స సత్యనారాయణ వైయస్ రాజశేఖర్ రెడ్డిని తాగుబోతు అన్నారని తల్లి విజయమ్మను కూడా అవమానించాడు.ఇలాంటి బొత్స తనకు తండ్రి తో ఎలా సమానం అవుతారని ఆమె ప్రశ్నించారు.ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడిన వారినేమో మంత్రి పదవులు ఇచ్చి పక్కన పెట్టుకున్నారని ఆయన్ను తన తండ్రితో సమానంగా పోల్చడం అనేది ఎంతవరకు సబబొ చెప్పాలని సీఎం జగన్ పై షర్మిల తీవ్రంగా విరుచుకుబడ్డారు.అలాంటి వ్యక్తిపై నీకు అంత ప్రేమగా ఉంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలు తీసేసి బొత్స ఫోటోలు పెట్టుకోమని కౌంటర్ ఇచ్చారు.👉వంగా గీతను సీఎం జగన్ తన తల్లితో పోల్చడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు.గతంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వంగా గీత వైయస్ రాజశేఖర్ రెడ్డిని అవమానించిన సంగతి మర్చిపోయారా జగనన్న అని గుర్తు చేశారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి దంపతులను అవమానించినవారిని పక్కన చేర్చుకోవడంలోనే జగన్ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుస్తుందని తీవ్రంగా విమర్శించారు.ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ కారన్నారు.ఆయన కోసం పని చేసి గొడ్డలి పోటుకు గురైన వాళ్ళు ఏమి కారన్నారు. అసలు వైఎస్సార్సీపీ పార్టీలో వైఎస్సార్ లేడని షర్మిల ఆరోపించారు.వై అంటే వైవీ సుబ్బారెడ్డి,ఎస్ అంటే సాయి రెడ్డి ,ఆర్ అంటే రామకృష్ణా రెడ్డి అన్నారు.జగనన్న చేసిన అరాచకమైన పాలనను ప్రజలు గమనించారని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా జగనన్న ఇంటికి ఎపుడు పంపుదామంటూ ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.
👉 ముస్లింల 4 శాతం రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర” : ఖాదర్ భాషా, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ భాషా.,బీజేపీ అగ్రనేత అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ ఖాదర్ భాషా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇటీవలే అమిత్ షా వ్యాఖ్యలపై చంద్రబాబు వైఖిరి ఏంటో ప్రకటించాలని డిమాండ్ చేసారు. ముస్లింల రిజర్వేషన్ రద్దు ప్రకటించిన బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు కొందరు పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా ముస్లిం ఓట్ల కోసం కుట్రలు..మోసాలు చేస్తున్నారని విమర్శించారు. ముస్లిం ఓట్ల కోసం బీజేపీ, మోదీ ఫోటో లేకుండా పాంప్లెట్లు తయారు చేసి మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై బీజేపీతో మాట్లాడాలని లేదంటే..పొత్తులో ఉన్న బీజేపీపై నిర్ణయం తీసుకున్నాక మాత్రమే ముస్లిం ఓట్లు అడగాలని ఖాదర్ భాషా డిమాండ్ చేసారు.
👉వచ్చే నెలలో జరిగే సాధారణ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ పిలుపునిచ్చారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు,జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ దిశగా బుధవారం సాయంత్రం తాళ్లూరు మండలంలోని శివరామపురం గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియకు ఆటంకాలు కలుగకుండా ఇప్పటికే కొందరిపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు.అర్హులందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూస్తున్నామని,అందుకే జిల్లా ఎస్పీ అయిన తాను ఈ గ్రామం వచ్చానని చెప్పారు. గ్రామంలో అవసరమైన భద్రత చర్యలు చేపట్టడంతో పాటు పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను జిల్లా యంత్రాంగం కల్పించిందన్నారు.పోలింగ్ కేంద్రానికి రాలేని వారు ఇంట్లో నుంచే ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం హోమ్ ఓటింగ్ విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ఓటు హక్కును అర్హులందరూ వినియోగించుకోవాలని ఎస్పీ ఈసందర్భంగా పిలుపునిచ్చారు.ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ముందుగా స్క్వాట్ భద్రత టీము గ్రామంలో డిఫెన్స్ డ్రిల్ నిర్వహించింది. కార్యక్రమంలో దర్శి డి.ఎస్.పి. శ్రీ. అశోక్ వర్ధన్,ఎంపీడీవో యుగకీర్తి, తహసిల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్, సీ.ఐ.షమీవుల్లా, ఎస్.ఐ. రమణయ్య,ఇతర అధికారులు పాల్గొన్నారు.
👉టీడీపీ అబద్ధపు మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరు..జగనన్న మళ్ళీ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు.కంభం మండలం కంభం టౌన్ అర్బన్ కాలనీలో ఇంటింటి ప్రచారంలో కుందురు నాగార్జున రెడ్డి సతీమణి కల్పనా రెడ్డి,కేపి.కృష్ణమోహన్ రెడ్డి సతీమణి కోమలత రెడ్డి,సోదరీ మణులు పద్మ,అరుణ* కంభం మండలంలోని కంభం టౌన్ లో అర్బన్ కాలనీ మొదటి రోజు ఎన్నికల ప్రచారంలో ఆమె
ఇంటింటికి తిరిగి గత ఐదు సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.ప్రజలకు ఏ సమస్య వచ్చిన స్థానికంగా అందుబాటులో ఉంటున్నారని,ప్రజా సమస్యలను పరిష్కరించటమే కుందూరు నాగార్జున రెడ్డి ధ్యేయమన్నారు.జగనన్న మళ్ళీ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు వస్తాయి,టీడీపీ అబద్ధపు మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు.
👉 దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో బుధవారం రాత్రి తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను,అభిమానులను కలిసిన ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి.. కార్యక్రమంలో దర్శి శాసనసభ అభ్యర్థి డా.గొట్టిపాటి లక్ష్మి భర్త డా లలిత్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.
👉వైసీపీని వీడి నూరు కుటుంబాలు టిడిపిలో చేరిక.. నేడు దర్శి నియోజకవర్గం తాళ్లూరు లో వై. యస్. ఆర్. సి. పి ఎం. పి. పి శ్రీను సమక్షం లో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి మరియు దర్శి శాసనసభ అభ్యర్థి డా.గొట్టిపాటి లక్ష్మి భర్త డా. లలిత్ సాగర్ సమక్షం లో నేడు వై. యస్. ఆర్. సి. పి పార్టీ ని వీడి తెలుగుదేశం పార్టీ లోకి 100 కుటుంబాలు శ్రీను సమక్షం లో చేరడం జరిగింది మరియు పలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది తదుపరి రాఘవ రెడ్డి లలిత్ సాగర్ వారిని కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది.కార్యక్రమం లో టీడీపీ, జనసేన, బీజేపీ మండల నాయకులు, అధ్యక్షలు,కార్యకర్తలు పాల్గొన్నారు👉 దర్శి నియోజకవర్గం తాళ్లూరు లో సరస్వతి కాలేజీ విద్యాసంస్థల అధినేత రమణారెడ్డి ఇచ్చిన విందులో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి మరియు దర్శి శాసనసభ అభ్యర్థి డా. గొట్టిపాటి లక్ష్మి భర్త డా.లలిత్ సాగర్ మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.