ముస్లింలే ఎక్కువ పిల్లలను కంటున్నారా!.. ఓవైసీ..హోరాహోరి ప్రచారంలో మాగుంట,ముత్తుముల,కుందూరు కుటుంబాలు ..

👉ముస్లింలే ఎక్కువ పిల్లలను కంటున్నారా….తెరపైకి మోడీ, షా,యోగీ ఫ్యామిలీస్ టాపిక్! దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న వేళ రాజకీయాలు తీవ్రస్థాయిలో వేడెక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న వేళ రాజకీయాలు తీవ్రస్థాయిలో వేడెక్కుతున్నాయి.ఈ సమయంలో నేతల మధ్య మాటల యుద్ధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.ఈ క్రమంలో…రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న మోడీ..ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుండగా.. వాటికి కౌంటర్ గా అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి!

అవును…లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ప్రధాని మోడీ..ఈ క్రమంలో రాజస్థాన్‌ లో ప్రచారం నిర్వహించారు! ఈ సమయంలో…దేశ ప్రధాని మోడీ..ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇదే క్రమంలో…దేశ వనరులపై తొలి హక్కు ముస్లింలకే ఉంటుందంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారని తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు,ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి.మోడీ హిందువులకు ప్రధానా..లేక, దేశ ప్రజలందరికీ ప్రధానా అనే కామెంట్లు తెరపైకి వచ్చాయి. బ్రిటిషర్లు వదిలేసిన డివైడ్ అండ్ రూల్ ని ఇంకా మెయింటైన్ చేయడం భావ్యం కాదని అంటున్నారు! ఈ సమయంలో…మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ స్పందించారు. ఇందులో భాగంగా…కేవలం ముస్లింలు మాత్రమే పిల్లలను ఎక్కువగా కంటున్నారా..?అంటూ ప్రశ్నించారు అక్బరుద్దీన్. ఇదే సమయంలో… మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌ పేయికి 7 మంది సోదరులు సోదరీమణులు ఉన్నారని.. యోగీ తల్లిదండ్రులకు కూడా ఏడుగురు సంతానం ఉండగా.. అమిత్ షాకు కూడా ఏడుగురు సోదర సోదరీమణులున్నారని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. అదేవిధంగా మోడీ తల్లి కూడా ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిందని తెలిపారు! ఇదే సమయంలో…దేశానికి చారిత్రక కట్టడాలుగా చెప్పుకుంటున్న ఎర్రకోట,తాజ్‌ మహల్,కుతుబ్ మినార్, జామా మసీదు,చార్మినార్‌ నిర్మాణాలను ముస్లింలే నిర్మించారని చెప్పిన అక్బరుద్దీన్… దేశాన్ని అందంగా సుందరంగా తీర్చిదిద్దిందే ముస్లింలు అని తెలిపారు. ఇదే సమయంలో… ముస్లింలను చొరబాటుదారులని చెప్పడాన్ని తప్పుబట్టారు.ఈ దేశం తమదే అని ఇకపై కూడా భారత్ తమ దేశంగానే ఉంటుందని నొక్కి చెప్పారు.దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర వైరల్ గా మారాయి. జాతీయ మీడియాలో బ్యానర్ ఇష్యూగా మారాయి

👉 సింగరాయకొండ మండలం హనుమాన్ నగర్ లో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరదలు మాగుంట సహన రెడ్డి సోదరి సంధ్య,..కార్యక్రమంలో బూత్ కమిటీ కన్వీనర్ నాగేంద్ర , సింగరాయకొండ టౌన్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి , నాయకులు గోకరాజు పాపయ్య నాయుడు, టౌన్ ప్రెసిడెంట్ ఏడుకొండలు , టౌన్ లీడర్ శ్రీ సాధన బ్రహ్మయ్య తదితర నాయకులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండల నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉ముత్తుముల సమక్షంలో టిడిపిలో చేరిన బసినేపల్లి సర్పంచ్….గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్చార్జ్  ముత్తుముల అశోక్ రెడ్డి  సమక్షంలో బేస్తవారిపేట మండలం, బసినేపల్లె గ్రామ సర్పంచ్ వినుకొండ బుజ్జిబాబు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.రాబోయే ఎన్నికల్లో బసినేపల్లె పంచాయతీలో అశోక్ రెడ్డికి అత్యధిక మెజార్టీ తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన తెల్లగొల్ల వెంకటేశ్వర్లు, పుల్లయ్య, జొన్న జేమ్స్, పగ్గాల రాము తదితరులు పాల్గోన్నారు.

👉మీఅందరికి సుపరిచితుడు అయిన మా నాన్నని గెలిపించండి..బెస్తవారిపేట మండలం చిన్నఓబీనేనిపల్లె పంచాయితీలో ఇంటింటి ప్రచారంలో ముత్తుముల అశోక్ రెడ్డి తనయుడు..గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన మానాన్నని గెలిపించాలని వారి కుమారుడు ముత్తుముల దివ్యేష్ రెడ్డి ప్రజలను కోరారు. చిన్నఓబీనేనిపల్లె మరియు sc కాలనీలలో ఇంటింటి ప్రచారంలో పాల్గోన్న దివ్యేష్ రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్నడూ జరగని విధంగా తెలుగుదేశం హయాంలో అభివృద్ధి జరిగిందని, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, బీసీ లోన్స్, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్, హౌసెస్, సీఎంఆర్ఎఫ్ ఫండ్స్, త్రాగునీటి సమస్యలు పరిష్కారం చేశారని పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న ముత్తుముల అశోక్ రెడ్డి గారికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

👉గిద్దలూరును అభివృద్ధి చేసే బాధ్యత నాదే ..గిద్దలూరు పట్టణ ఇంటింటి ప్రచారంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల..గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదే అని ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నుండి చిన్న మార్కెట్, గణేష్ నగర్, అమ్మవారిశాల వరకు ఇంటింటికి తిరిగి టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. నాడు తెలుగుదేశం హయాంలో గిద్దలూరు పట్టణంలో ఎంతో అభివృద్ధి చేశానని పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలను అందించానని,తాను గిద్దలూరు స్థానికుడనని గిద్దలూరు అంటే తనకు ఎంతో మమకారం ఉందని, నియోజకవర్గ ప్రజలంతా నా కుటుంబ సభ్యులని వారి సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యం అని అన్నారు. రాష్ట్రంలోనూ, నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు స్థానికుడనైన తనకు,ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు టిడిపి జనసేన నాయకులు పాల్గొన్నారు.*

👉 అర్ధవీడు మండలంలో టీడీపి కి భారీ షాకిచ్చి వైసీపీలోకి చేరిన బీసీ సోదరులు..కుందురు కృష్ణ మోహన్ రెడ్డి భార్య లతక్క సమక్షంలో వైసీపీ లో చేరిన బీసీ కుటుంబాలు..అర్ధవీడు మండలం యాచవరం గ్రామపంచాయతీలో టీడీపి కి భారీ షాక్..వల్లెల మధుమోహన్ రెడ్డి,బోయపాటి రామకృష్ణ,బండపల్లి వెంకట్ నారాయణ,మీసాల శ్రీనివాసులు,నల్లబోతుల వెంకటరమణ,దయ్యాల నరసయ్య ఆధ్వర్యంలో పోతు రాజుటూరు గ్రామానికి చెందిన బండపల్లి వెంకటేశ్వర్లు, బండపల్లి అచ్చయ్య,బండపల్లి రత్తయ్య,బండపల్లి రవికుమార్,అలాగే ఎస్సీ కుటుంబాలు కవలకుంట్ల కాశయ్య,కవలకుంట్ల హరీష్,కుందురు కృష్ణ మోహన్ రెడ్డి భార్య లతక్క ఈ సందర్భంగా వారి అందరికీ వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు..

👉వైసీపీలో చేరిన టీడీపీ అంబవరం వార్డు మెంబెర్…  గిద్దలూరు మండలం అంబవరం పంచాయతీ టీడీపీ 9వ వార్డు మెంబెర్ చిన్న నరసింహులు మరియు అనుచరులు పార్టీని వీడి గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, వైసీపీ అభ్యర్థి సమక్షంలో, గిద్దలూరు మాజీ ఎంపీపీ కడప వంశిధర్ రెడ్డి మరియు పంచాయతీ వైసీపీ నాయకులు శిరిపి నారాయణ రెడ్డి నాయకత్వంలో వైసీపీ లో చేరిక…..ఈ సందర్భంగా వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా  కేపీ నాగార్జున రెడ్డి సాదరంగా ఆహ్వానించినారు.

👉వైసీపీకి మద్దతు తెలిపిన బేల్దారి, హమాలీల సంఘం సభ్యులు..గిద్దలూరు మండలానికి చెందిన బేల్దారి, హమాలీల సంఘం సభ్యులు వైసీపీ ప్రభుత్వానికి,గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి నాయకత్వానికి బేల్దారి సురేష్ ఆధ్వర్యంలో మద్దతు తెలిపాయి.ఈ సందర్భంగా వారికి వైసీపీ కండువాలు కప్పి కృతజ్ఞతలు తెలియజేసిన కుందూరు నాగార్జున రెడ్డి.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కృషి చేస్తామన్నారు*…👉ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సాయంత్రం 11వ వార్డు లో ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి,గిద్దలూరు పట్టణంలోని 11వ వార్డులో గడప గడపకు,అలాగే దుకాణాల వద్ద ప్రచారం చేసి అందరినీ పలకరిస్తూ వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు..*త6మ అమూల్యమైన ఓటు ఫ్యాను గుర్తుపై వేసి గెలిపిస్తే భవిష్యత్తులో తాను అమలు చేయబోయే హామీల గురించి ప్రజలకు స్పష్టంగా వివరించాను.ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు.

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం