మోదీపై అనర్హత వేటు వ్యవహారం..మంత్రి బుగ్గన,ఆమంచిల ఎన్నికల అఫీడబిట్ పై అభ్యంతరం.. మాగుంట, ముత్తుముల,కేపీ కుటుంబాల విస్తృత ప్రచారం..పోలీసుల అవగాహన సదస్సు..

👉13 రాష్ట్రాల్లో మొత్తం 88 నియోజకవర్గాల్లో రెండో దశ లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే తొలి విడత పోలింగ్ ముగిసిన నేపథ్యంలో…

రెండో విడతలో బిహార్, ఛత్తీస్‌ గఢ్, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్‌ లల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది.ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తుంది.మరోపక్క బీజేపీని ఎలాగైనా గద్దెదించాలని ఇండియా కూటమి కసరత్తులు చేస్తుంది.ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది.పైగా ఆ విషయం ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించింది కావడంతో మరింత ఆసక్తిగా మారింది. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే…ప్రధాని మోడీకి సంబంధించి అనర్హత పిటిషన్ దాఖలయ్యింది..దీనిపై విచారణ తేదీ ఫిక్సయ్యింది. అవును…ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్ ఒకటి ఢిల్లీ హైకోర్టులో దాఖలైంది.ఈ పిటిషన్ ను ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. అయితే…నేడు ఈ పిటీషన్ విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది.దీంతో…ఈ నెల 29వ తేదీ (సోమవారం) ఈ పిటీషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుందని తెలుస్తుంది. దీంతో…సోమవారం ఢిల్లీ హైకోర్టులో ఏమి జరగబోతోందనేది ఆసక్తిగా మారింది. వాస్తవాన్నికి ఈరోజే ఈ పిటిషన్ పై విచారణ జరగవలసి ఉన్నప్పటికీ…ఈ పిటీషన్‌ ను విచారించాల్సిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్తా విధులకు హాజరు కాలేదు.ప్రస్తుతం ఆయన సెలవులపై వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం నాడు విధులకు హాజరు కానున్నారని..ప్రధాని మోదీ అనర్హత పిటీషన్‌ పై ఆరోజు ఆయన విచారణ చేస్తారని చెబుతున్నారు! వీవీప్యాట్‌ల‌పై సుప్రీంకోర్టు తీర్పు లోక్‌ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా… దేవుళ్లు,మతాల పేర్లను విస్తృతంగా వినియోగిస్తోన్నారనే ఆరోపణలను ప్రధాని మోడీ ఎదుర్కొంటోన్నారు. హనుమాన్ చాలీసాను స్వేచ్ఛగా వినే హక్కును కూడా ప్రజలు కోల్పోయారంటూ కర్ణాటక ఎన్నికల ప్రచార సభలో మోడీ పేర్కొన్నారు.ఇదే క్రమంలో… ఉత్తరప్రదేశ్‌ లోని ఫిలిభిత్‌ లోని ఎన్నికల ప్రచార సభలో దేవుళ్లు – దేవాలయాలు, హిందువులు – హిందూమతం పేర్లతో మోడీ ఎన్నికల్లో ప్రచారం చేశారని పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తుంది!

👉ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌ పై అభ్యంతరం..మరోసారి డోన్‌ నుంచి ప్రాతినిథ్యం వహించేందుకు వైసీపీ అభ్యర్థిగా బుగ్గన నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు నామినేషన్ల పరిశీలన సందర్భంగా.. ఆయన ఎన్నికల అఫిడవిట్‌ పై అభ్యంతరం వ్యక్తం అయ్యింది. ఇందులో భాగంగా… టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి తరఫు న్యాయవాది.. బుగ్గన నామినేషన్ పై అభ్యంతరం తెలిపారు. ఇందులో భాగంగా… బుగ్గన తన ఆస్తుల వివరాలు పూర్తిగా వెల్లడించలేదని, నామినేషన్‌ పత్రంలో కొన్ని కాలమ్స్‌ ని భర్తీ చేయలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే క్రమంలో.. ఈ ఫిర్యాదులో పేర్కొన్న విషయాలకు సంబంధించి తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, అందువల్ల వెంటనే అతని నామినేషన్‌ తిరస్కరించాలని ఎన్నికల అధికారిని కోరారు. ఇదే సమయంలో కొన్ని ఆధారలను ఆర్వోకు చూపించారని అంటున్నారు.

👉చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ పెండింగ్…

4.63 కోట్లు విద్యుత్ బకాయలు ఎగనామం పెట్టాడంటూ ఆర్వోకు పిర్యాదు చేసిన నాగార్జున రెడ్డి అనే వ్యక్తి.వీటితో పాటు నియోజకవర్గంలో ఆమంచి అక్రమాలు, అరాచకాలు, హత్యలు చేశాడని బుక్ లేట్ రూపంలో ఆర్వో సమర్పింసిన నాగార్జున రెడ్డి.నామినేషలో పత్రాలలో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను లేవు అందుకే పెండింగ్ లో పెట్టాం: ఆర్వో రేపు ఉదయం 10గంటలకు సబ్మిట్ చేయాలని చెప్పామని ఆర్వో సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.

చిన్న కంభం టీడిపి కి భారీ షాక్…

గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి తమ్ముడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ లో చేరిన కుటుంబాలు..కంభం పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి తమ్ముడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి గారి సమక్షంలో కంభం మండలం చిన్న కంభం పంచాయతీ పరిధిలోని “”దేవ నగరం”” గ్రామం “”ఎస్సీ పాలెం”” చెందిన 100 కుటుంబాలు సర్పంచ్ తమ్ముడు డాక్టర్ రసూల్ మరియు మాజీ ఎంపీటీసీ గజ్జెల ఓంకార్ ఆధ్వర్యంలో టీడీపిని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.ఈ సందర్భంగా వారికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

👉 పలువురు వాలంటీర్ల రాజీనామా..చంద్రబాబు.. మోసపూరితమైనటువంటి వాలంటరీకి ఇచ్చిన హామీ, గతంలో వాలంటరీ వ్యవస్థపై తాను తాన దత్త పుత్రుడు చేసిన తీవ్ర ఆరోపణలు , మరియు వాలంటరీ సేవలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి, వ్యవస్థను తాత్కాలికంగా నియంత్రణ చేసిన చంద్రబాబుకు వ్యతిరేకంగా గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కే. నాగార్జున రెడ్డికి మద్దతుగా బేస్తవారిపేట మండలం పి. వెంకటాపురం వాలంటరీస్ పి. వెంకటాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టమటం వెంకటరమణారెడ్డి మరియు గ్రామస్తులు ఆధ్వర్యంలో కందుల శివారెడ్డి ,కే .సుశీల, కె. రవికుమార్, బి .కృష్ణవేణి ,ఏ. పద్మావతి ,ఎం . దివ్యభారతి, స్వచ్ఛందంగా రాజీనామా చేయడం జరిగింది.

👉 శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ముత్తుముల   కుమారుడు దివ్యేష్.. గిద్దలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి తనయుడు దివ్యేష్ రెడ్డి శుక్రవారం రాచర్ల మండలం సోమిదేవిపల్లె గ్రామంలో జరుగుతున్న కప్పేట వెంకటేశ్వర రెడ్డి రమాదేవిల కుమారుడు మాధవ రెడ్డి వైష్ణవిల వివాహ వేడుక మహోత్సవంలో 👉కొమరోలు మండలం తాటీచెర్ల గ్రామంలో జరుగుతున్న బోగోలు నడిపి పోలయ్య అంకమ్మల కుమారుడు రామాంజనేయులు రమాదేవిల వివాహ వేడుక మహోత్సవంలో 👉గిద్దలూరు మండలం తంబళ్ల పల్లె గ్రామంలో జరుగుతున్న కొత్తకోట శ్రీనివాసులు రాజ్య లక్ష్మిల కుమారుడు రాజమోహన్, విష్ణుప్రియ ల వివాహ వేడుక మహోత్సవంలో👉కంభం మండలం జంగం గుంట్ల గ్రామంలో జరుగుతున్న శ్రీరాం యేసయ్య రాణిల కుమారుడు ప్రవీణ్ కుమార్ ఇందు ల వివాహ వేడుక మహోత్సవంలో,గిద్దలూరు పట్టణంలోని శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి ఆలయ కళ్యాణ మండలంలో జరుగుతున్న వలసాని శ్రీనివాసులు లక్ష్మీ దేవిల కుమారుడు వెంకటేష్,లక్ష్మీ శ్వేతల వివాహ వేడుక మహోత్సవంలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు.కార్యక్రమంలో మండల గ్రామ టీడీపీ నాయకులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

👉వైసీపీ పాలనలో వ్యాపార రంగాలు కుదేలు..అన్నీ వర్గాల సంక్షేమం ఎన్డీయే కూటమితోనే సాధ్యం..మీకు ఏ సమస్య వచ్చిన అండగా ఉంటా..గిద్దలూరు పట్టణ ఇంటింటి ప్రచారంలో ముత్తుముల అశోక్ రెడ్డి..రాష్ట్రంలో వైసీపీ పాలనలో వ్యాపార రంగాలు కుదేలు అయ్యాయని గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం గిద్దలూరు పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్ నుండి అమ్మవారిశాల,పొట్టి శ్రీరాములు విగ్రహాం వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించి వ్యాపార సముదాయాల యజమానులను కలుసుకొని టీడీపీ,జనసేన,బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.నాడు తెలుగుదేశం హయాంలో అన్నీ వర్గాల సంక్షేమం కోసం కృషి చేయటం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ అన్నీ వర్గాలను నట్టేట ముంచిందని,వ్యాపార రంగాల పై దాడులు చేయించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని ప్రజలంతా వైసీపీ చేస్తున్న అరాచకాలను గుర్తు ఉంచుకోవాలన్నారు.తాను స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చిన అండగా ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.

👉 దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి మరియు దర్శి శాసనసభ అభ్యర్థి డా గొట్టిపాటి లక్ష్మి భర్త డా. కడియాల లలిత్ సాగర్ సమక్షం లో పలువురు వై. యస్. ఆర్. సి.పి ని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది ఈ కార్యక్రమం లో టి. డి. పి, జనసేన, బీజేపీ మండలం నాయకులు, గ్రామ నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉 మైనారిటీ సంక్షేమానికి గత NDA కూటమి ప్రభుత్వం లో రాష్ట్రం లో చేపట్టిన వివిధ పధకాలను తెలియజేస్తూ రూపొందించిన పొస్టర్ ను ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆవిష్కరించారు. ఆయన  ఆవిష్కరించిన కరపత్రాలను ముస్లిం నాయకులు షేక్ మస్తాన్ వలి,షేక్ పఠాన్ అహ్మద్ ఖాన్, షేక్ అబూ బకర్,షేక్ తోహిద్, షేక్ బాబా మసీద్ లో పంపిణి చేసారు.తెలుగుదేశం పాలన లో దుల్హన్ స్కీం ,ఇమామ్ మౌజన్లకు గౌరవ వేతనాలు, చంద్రన్న భీమా , విద్యావ్యాప్తి ,దుకాన్ ఔర్ మకాన్ , స్వయం ఉపాధి , విదేశీ విద్య స్కీం ,సబ్సిడీ రుణాల పధకాలు ముస్లిం సంక్షేమం కోసం గతం లో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయడం జరిగిందని ముస్లిం సోదరులకు తెలియజేస్తూ కరపత్రాలను ముస్లిం నాయకులు పంపిణి చేశారు.

👉కంభం మండలం కందులాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్బిఎస్ నగర్ ,గాంధీ బజార్,ఇస్లాంపేట్ వీధులలో ప్రచారాన్ని కొనసాగిస్తున్న గిద్దలూరు నియోజకవర్గ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సోదరుడు కృష్ణ మోహన్ రెడ్డి సతీమణి కుందూరు కోమలత రెడ్డి మరియు కంబం మండలం కన్వీనర్ గొంగటి చెన్నారెడ్డి ,ఎంపీపీ తులసమ్మ , సర్పంచ్ బత్తుల రజినీ ఎంపీటీసీ నేరెళ్ల శ్వేత ,ఉప సర్పంచ్ గారు, సచివాలయం కన్వీనర్ లు, గృహ సారధులు,పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు..

👉 దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి మరియు దర్శి శాసనసభ అభ్యర్థి డా గొట్టిపాటి లక్ష్మి భర్త డా. కడియాల లలిత్ సాగర్ సమక్షం లో పలువురు వై. యస్. ఆర్. సి.పి ని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది ఈ కార్యక్రమం లో టి. డి. పి, జనసేన, బీజేపీ మండలం నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉 టీడిపి కీ భారీ షాక్..ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం,అర్ధవీడు పట్టణానికి చెందిన 25 మేదరి కుటుంబాలు,మాజీ ఎంపీపీ రవికుమార్  ఆధ్వర్యంలో వైస్సార్సీపీ లోకి చేరారు.శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి సోదరుడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి  సమక్షంలో వైసీపీలోకి చేరారు.ఈ సందర్భంగా వారిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కృష్ణ మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.*

👉ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఐపియస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (క్రైమ్) శ్రీధర్ రావు కంభం మరియు అర్ధవీడు పీఎస్ పరిధిలో గ్రామాలను సందర్శించి ప్రజలకు ఎన్నికల ప్రవర్తన నియమావళి మరియు ఓటు హక్కు ప్రాధాన్యత గురించి, ఎలక్షన్ సమయంలో ఏమి చేయవచ్చునో చేయకూడదో అనే విషయాలపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. పోలింగ్ రోజున ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేందుకు జిల్లా పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని, ప్రతీ ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహనా పెంచుకొని పాటించాలని సూచించారు.ఎన్నికల వేళ ప్రజలు గొడవలు,అల్లర్లకు దూరంగా ఉండాలని, ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేలా సహకరించాలని కోరారు. గ్రామాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.కార్యక్రమంలో కంభం సీఐ రామకోటయ్య, కంభం ఎస్సై రాజేష్, అర్ధవీడు ఎస్సై అనితా మరియు సిబ్బంది పాల్గొన్నారు.

7k network
Recent Posts

మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!