గూగుల్ కు బీజేపీ అంత భారీ బిజినెస్ ఇచ్చిందా.. పవన్ కోసం వందమంది పుష్పలు దిగారా?..ఘనంగా మంత్రి ఆదిమూలపు బర్త్ డే.. విస్తృత ప్రచారంలో మాగుంట ముత్తుముల కుటుంబాలు..

👉గూగుల్ కు బీజేపీ అంత భారీ బిజినెస్ ఇచ్చిందా? రాజకీయ పార్టీల నుంచి రూ.390 కోట్ల ఆదాయం ..ఇందులో బీజేపీ దాదాపు రూ.100 కోట్లకు పైగా ప్రకటనలకు ఖర్చు..!!!

భారత రాజకీయ పార్టీలు ఇచ్చిన బిజినెస్ లో బీజేపీ వాటా 26 శాతంగా పేర్కొన్నారు. గూగుల్.. యూట్యూబ్ లకు ప్రకటనల రూపంలో దాదాపు రూ.101 కోట్లను ఖర్చ చేసినట్లుగా గుర్తించారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఆసక్తికర అంశం వెలుగు చూసింది. సెర్చింజిన్ లో తోపు లాంటి గూగుల్ కు.. వీడియో ఆధారిత ప్లాట్ ఫాంలో తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించే యూట్యూబ్ కు భారతీయ జనతాపార్టీ భారీ బిజినెస్ ఇచ్చిన వైనం వెలుగు చూసింది. మిగిలిన రాజకీయ పార్టీలతో పోలిస్తే.. బీజేపీ వీటి కోసం భారీగా ఖర్చు చేసిన వైనం బయటకు వచ్చింది. 2018 మే 31 నుంచి 2024 ఏప్రిల్ వరకు దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు పెట్టిన ఖర్చు లెక్కల్ని ఒక మీడియా సంస్థ వెల్లడించింది. పాతిక రాజకీయ పార్టీల ఖర్చును మదింపు చేసిన సదరు సంస్థ.. ఏయే పార్టీ ఎంత చొప్పున ఖర్చు చేసిందన్న వివరాల్నివెల్లడించింది. గడిచిన ఆరేళ్లలో రాజకీయ ప్రకటనల రూపంలో గూగుల్.. యూట్యూబ్ లకు భారత రాజకీయ పార్టీల నుంచి రూ.390 కోట్ల ఆదాయం లభించింది.ఇందులో బీజేపీ దాదాపు రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేయటం గమనార్హం. భారత రాజకీయ పార్టీలు ఇచ్చిన బిజినెస్ లో బీజేపీ వాటా 26 శాతంగా పేర్కొన్నారు.గూగుల్.. యూట్యూబ్ లకు ప్రకటనల రూపంలో దాదాపు రూ.101 కోట్లను ఖర్చ చేసినట్లుగా గుర్తించారు. గూగుల్ యాడ్స్.. గూగుల్ డిస్ ప్లే..వీడియోపై రూ.45 కోట్లు ఖర్చు చేసిన కాంగ్రెస్ రెండోస్థానంలో నిలిచినట్లుగా పేర్కొన్నారు. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే గూగుల్ యాడ్స్ లో రూ.42 కోట్లు ఖర్చు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ రూ.42 కోట్లలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు రూ.16.6 కోట్లు ఖర్చు చేయటం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో గతనవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాటి అధికార బీఆరర్ఎస్ గూగుల్ యాడ్స్ కోసం రూ.12కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసిందని తేల్చారు.అయినప్పటికీ ఆ పార్టీ ఎన్నికల్లో ఓటమిపాలు కావటం గమనార్హం.ఏపీ విషయానికి వస్తే అధికార వైపీపీ గూగుల్ యాడ్స్ రూపంలో గడిచిన ఆరేళ్లలో రూ.6.4కోట్లు.. పశ్చిమబెంగాల్అధికారపక్షం టీఎంసీ రూ.4.8కోట్లు ఖర్చు చేసినట్లుగా గుర్తించారు.

👉పవన్ కోసం పిఠాపురంలో 40 మంది పుష్పలు దిగారంట!..ఈ సందర్భంగా భీమ్లా నాయక్ సినిమా నాడు జరిగిన సంగతులంటూ కొన్ని విషయాలు చెప్పారు. అనంతరం తనకోసం సీమ నుంచి 40 మంది దిగారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు! సార్వత్రిక ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్..వరుసగా ప్రచార సభల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో పర్యటించారు పవన్. ఈ సందర్భంగా మలికిపురం సెంటర్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా భీమ్లా నాయక్ సినిమా నాడు జరిగిన సంగతులంటూ కొన్ని విషయాలు చెప్పారు. అనంతరం తనకోసం సీమ నుంచి 40 మంది దిగారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు! అవును… తాజాగా రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన పవన్..మలికిపురంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఇందులో భాగంగా తాను భీమ్లా నాయక్ సినిమా విడుదల కోసం ఎవరి కాళ్లూ పట్టుకోవాలనుకోలేదని.. అవసరమైతే యూట్యూబ్ లో ఫ్రీగా వదిలేస్తానని చెప్పినట్లు తెలిపారు.ఆ మాట ఎందుకన్నానంటే… ఆత్మగౌరవం కోసం ప్రాణాలైనా వదిలేసుకుంటాం కానీ, దేహీ అని అనము అని పవన్ వెల్లడించారు.కాగా… ఆ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నసంగతి తెలిసిందే! ఇదే సమయంలో… ఇది 2009 కాదు 2024 అని, ఆ విషయం జగన్ గుర్తుపెట్టుకోవాలని సూచించిన పవన్ కల్యాణ్… రాజకీయాల్లోకి తెగించి వచ్చినట్లు వెల్లడించారు. సుమారు 40మంది ఎర్రచెందనం స్మగ్లర్లను తన కోసం పిఠాపురం,గోదావరి జిల్లాలో దించారట..ఒకటే చెబుతున్నా నేను భారతీయుడిని,ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తా.. నేను పవన్ కల్యాణ్ ని అని వెల్లడించారు.ఇదే క్రమంలో… ఉన్నది ఒకటే జీవితం అని.. జగన్ లాంటి వారికి,పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వారికి లొంగమని వెల్లడించారు పవన్. ఈ సందర్భంగా గతంలో ఢిల్లీలో ఒక కేంద్రమంత్రి వివాహంలో మిథున్ ని కలిసినట్లు చెప్పిన పవన్…ఎవరైనా చిత్తూరు జిల్లా నియోజకవర్గాల్లోకి వచ్చి వేలుపెడితే ఊరుకోమని చెప్పారని.. ఆయన మాత్రం గోదావరి జిల్లాలోకి వచ్చి వేలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ..,……..

👉మంత్రి ఆదిమూలపు సురేష్ కు పుట్టినరోజు

రాష్ట్ర మంత్రివర్యులు కొండేపి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండల వైసీపీ నాయకులు మంత్రి సురేష్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.సింగరాయకొండ లోని వైసిపి కార్యాలయంలో మంత్రిని కలిసిన నాయకులు ముందుగా కేక్ కట్ చేయించి శాలువాతో సత్కరించి బొకేలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాకా వెంకట రెడ్డి, చిమట,మర్రిపూడి సొసైటీ అధ్యక్షులు మాకినేని వెంకట్రావు,భోగసముద్రం విజయభాస్కర్ రెడ్డి , నాయకులు ఇనుకొల్లు పిచ్చిరెడ్డి ,బోదా రమణారెడ్డి, ఇనుకొల్లు సుబ్బారెడ్డి, సర్పంచ్ కదిరి భాస్కర్ రావు, మండల నాయకులు మాచేపల్లి నాగయ్య, కే.బ్రహ్మానంద రెడ్డి, ఇనుకొల్లు మాదిరెడ్డి, అలికేపల్లి కోటేశ్వరరావు, నారపరెడ్డి , మాచెపల్లి హనుమంతరావు, కె సాల్మన్, వనిపెంట మల్లికార్జున్ రెడ్డి, శ్రీనివాసరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

👉 ఒంగోలు లోని రంగారాయుడు చెరువు మరియు గాంధీ పార్క్ లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి సతీమణి గీతా లత ,మరదలు మాగుంట సహన రెడ్డి, ఒంగోలు శాసనసభ అభ్యర్థి దామచర్ల నాగ సత్య లత పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తాతా ప్రసాద్,ఆళ్ల శ్రీనివాస రెడ్డి మరియు తదితర నాయకులు మహిళా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

👉 సింగరాయకొండ లో జరిగిన తెలుగుదేశం ప్రచార కార్యక్రమం మరియు పార్టీ లో చేరికల కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువనాయకులు మాగుంట రాఘవ రెడ్డి, కొండపి శాసనసభ అభ్యర్థి డోల బాలవీరాంజనేయ స్వామి మరియు యువ నాయకులు దామాచర్ల సత్య కార్యక్రమం లో టి. డి. పి, జనసేన, బీజేపీ మండల నాయకులు, గ్రామ నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు👉 నేడు సింగరాయకొండ మండలం ఆర్యవైశ్య రోడ్, రైల్వేస్టేషన్ రోడ్ లో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి మేనకోడలు ప్రణతి రెడ్డి, కీర్తి రెడ్డి, రంజిత రెడ్డి, టీడీపీ జనరల్ సెక్రటరీ చీమకుర్తి కృష్ణా , టీడీపీ జనరల్ సెక్రటరీ సుదర్శి చంటి, ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ రామా రావు శ్రీను సుబ్రహ్మణ్యం మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉 కనిగిరి నియోజకవర్గం పి . సి పల్లి మండలం లో పి. సి. పల్లి,బొట్లగూడూరు, పెద్ద ఈర్లపాడు గ్రామాల్లో లో కనిగిరి నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి డా.ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారి తో కలిసి ప్రచారం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వారి తనయులు మాగుంట నిఖిల్ రెడ్డి. ఈ కార్యక్రమం లో పలువురు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

👉 మార్కాపురం పట్టణం తూర్పు వీధి మాలంపాటి వెంకటరెడ్డి  అద్వర్యంలో తెలుగు దేశం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి సతీమణి చందన రెడ్డి మార్కాపురం శాసనసభ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సతీమణి కందుల వసంత లక్ష్మి మరియు నాగలక్ష్మి, సంగీత, రోజా, సుబ్బలక్ష్మి, మల్లేశ్వరి, పార్వతి మరియు తెలుగుదేశం, జనసేన,బిజెపి మహిళా కార్యకర్తలు,నాయకులు ,పాల్గొన్నారు.వలేటివారిపాలెం గ్రామం లో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెల్లెళ్లు సుధ, సురేఖ, సంధ్య ఒంగోలు శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ సతీమణి నాగసత్యలత,ఒంగోలు శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ అక్క మాధవి,జనార్దన్ కుమార్తె అనిషా లక్ష్మి మరియు ఆత్మకూరి బ్రహ్మయ్య తదితర నాయకులు తెలుగుదేశం,జనసేన,బీజేపీ మండలనాయకులు, అధ్యక్షులు,కార్యకర్తలు పాల్గొన్నారు.👉ఈ రోజు ఉదయం కనిగిరి పట్టణంలో ఎన్నికల ప్రచారం లో భాగంగా నాయకులు మరియు అభిమానులు ఏర్పాటు చేసిన “చాయ్ మీటింగ్” కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధి ఉగ్ర నరసింహా రెడ్డి. ఈ సందర్భంగా వీధుల్లోని చిరు వ్యాపారులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

👉 పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటిన్లను ఎందుకు రద్దు చేశారు..?ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు పునః ప్రారంభిస్తాం*గిద్దలూరు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల*

పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటిన్లను ఎందుకు రద్దు చేశారో వైసీపీ పాలకులు సమాధానం చెప్పాలని గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ పాలకులను ప్రశ్నించారు.ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు రోడ్డు పైన జీవనోపాధి చేసుకొనే చిరు వ్యాపారులను కలుసుకొని టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి మ్యానిఫెస్టోలోని అంశాలను వారికి వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.నాడు తెలుగుదేశం హయాంలో పేదల ఆకలి తీర్చేందుకు గిద్దలూరు పట్టణంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించి కేవలం రూ.5 రూపాయలకే పేదలకు మూడు పూటల భోజనం అందించడం జరిగిందన్నారు.2019 లో అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల పై అక్కసుతో వారి ఆకలి తీర్చే అన్న క్యాంటిన్లను రద్దు చేసి పేదల కడుపు కొట్టిందన్నారు.పేదలకు సంక్షేమం అందించటం అంటే అన్న క్యాంటిన్లు రద్దు చేయటం,నిత్యావసర ధరలు,సిమెంట్,ఇసుక, గ్యాస్,విద్యుత్ ధరలు పెంచటమా అని రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సంక్షేమం, అభివృద్ధి కుంటు పడిందన్నారు.నాడు తెలుగుదేశం హయాంలో తాను గిద్దలూరు పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం గుండ్లమోటు నుండి పైపులైన్ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందించడం జరిగిందని, అదే విధంగా రామన్న కత్తువా నుండి పైప్ లైన్ ద్వారా పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించేందుకు 100 కోట్లతో పనులను ప్రారంభించడం జరిగిందని, అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు అభివృద్ధి పై గాని ప్రజల సంక్షేమం పై గాని దృష్టి పెట్టలేదన్నారు.తాను స్థానికుడనని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ప్రజలకు సంక్షేమం అందించడమే తన లక్ష్యమన్నారు.మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తనకు మద్దతుగా నిలిచి గిద్దలూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న తనకు మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాస రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.👉ముత్తుముల సమక్షంలో టిడిపిలో చేరిన 20 కుటుంబాలు..గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో గిద్దలూరు పట్టణానికి చెందిన వేములపాటి చెన్నయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని 20 కుటుంబాలకు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.రాబోయే ఎన్నికల్లో అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.

👉 తండ్రి గెలుపు కోసం తనయుడి ప్రచారం..కంభం పట్టణ జయప్రకాష్ స్ట్రీట్, మేదర్ బజార్లో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించి మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న ముత్తుముల అశోక్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన అశోక్ రెడ్డి తనయుడు ముత్తుముల దివ్యేష్ రెడ్డి,కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు*

7k network
Recent Posts

మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!