ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి..షర్మిల భర్త బ్రదర్ అనిల్ కామెంట్లు ఎవరిపై?.. బాబుకు మోది షాక్!!.. పవన్ ఇల్లు అసిస్టెంట్ అమ్మేశాడా..బి పేటలో మాగుంట ప్రచారం..గిద్దలూరు తెదేపాలో చేరిన నాయకులు..అబాకస్ పోటీ పరీక్షలో జాతీయస్థాయి అవార్డు సాధించిన నజీర్..

👉ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది.ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు.జిరాక్సులు మాత్రమే ఇస్తారు.వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి.ఈ డేటా , పత్రాలు అన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి.చివరికి ఆస్తి యజమానుల ఫింగర్ ప్రింట్స్ కూడా వారి దగ్గరే ఉంటాయి. వాటిని ఉపయోగించుకుని రాత్రికి రాత్రి పత్రాలు మార్చేస్తే ప్రభుత్వానికి బాధ్యత ఉండదు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా.. మొదట ప్రభుత్వ అధికారి దగ్గరకే వెళ్లాలి.మొత్తం ఓ కుట్ర ప్రకారం…ప్రజల ఆస్తులపై హక్కులు లేకుండా చేస్తున్నారన్న అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖలో కార్డు ప్రైమ్‌ 2.0 అనే రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చింది.ఆస్తి సొంతదారుడు, కొనుగోలుదారుడు,ఇద్దరు సాక్షుల సంతకాలు ఉండవు. వీరి వేలిముద్రనే సంతకంగా పరిగణిస్తున్నారు. కొత్త విధానంలో దరఖాస్తుదారులే స్వయంగా డాక్యుమెంట్లు రూపొందించుకోవాలి.లేదా నెట్‌సెంటర్‌ నిర్వాహకులను ఆశ్రయించాలి. డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌కు వెళ్ళి దరఖాస్తు చేసుకోవడానికి లాగిన్‌ కావాలి.అందులో ఏ రకమైన డీడ్‌ రాయించుకోవాల్సి ఉంటుందో దానికి సంబంధించిన ఫార్మేట్‌ను ఎంపిక చేసుకుని, ఆ వివరాలు నమోదు చేసి, దానిని సబ్‌రిజిస్ట్రార్‌కు లింక్‌ రూపంలో పంపించాలి. దానిని సబ్‌ రిజిస్ట్రార్‌ పరిశీలించిన తర్వాత అందులో ఏవైనా తప్పులను సవరించాల్సి ఉంటే తిరిగి దరఖాస్తుదారుడికి సబ్‌రిజిస్ట్రార్‌ మెయిల్‌ ద్వారా లింక్‌ పంపుతారు. వాటిని కూడా సరిచేసి లింక్‌ ద్వారానే మరలా సబ్‌రిజిస్ట్రార్‌కు పంపితే, దానిని ఆయన ఓకే చేసినతర్వాతే కొనుగోలుదారుడు, అమ్మకందారుడు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్ళి వేలిముద్ర వేయాల్సివుంటుంది.ఇంత చేసిన తర్వాత కూడా అసలైన పత్రాలివ్వరు.అవి ప్రభుత్వం దగ్గరే అంటే.. ఈ ర్డు ప్రైమ్‌ 2.0 అనే రిజిస్ట్రేషన్ విధానం గుప్పిట్లో పెట్టుకున్న క్రిటికల్ కేర్ అనే ప్రైవేటు కంపెనీ వద్ద ఉంటాయి.ఈ రిజిస్ట్రేషన్ సంగతి సరే..అసలైన పత్రాలు ఎందుకు ఇవ్వరు..జిరాక్సులే ఎందుకు ఇస్తారన్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా… అమలు చేయాల్సిందేనని అధికారులు ఆదేశాలిచ్చారు.దీని వెనుక గూడుపుఠాణి ఏమిటో ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.

👉షర్మిల భర్త బ్రదర్ అనిల్ కామెంట్లు ఎవరిపై?..  తాజాగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ చేసిన కామెంట్లు మీడియాలో వైరల్ గా మారాయి. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఆదివారం రోజు కడపలోని రాజారెడ్డి వీధిలో పర్యటిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ..ఎవరికి భయపడకండి..

..అందరికీ ఆ ఏసు ప్రభువే అండగా ఉంటారు.. పాపులను తరిమికొట్టండి.న్యాయం కోసమే మేము పోరాడుతున్నాం.ఆ దేవుడు మీద నమ్మకం ఉంచుకొని పాపాలు చేసే వారిని తొక్కి వేయండి అంటూ బ్రదర్ అనిల్ కుమార్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ అనిల్ కుమార్ తన భార్య షర్మిలకు మద్దతుగా నిలిచి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై పరోక్ష కామెంట్లు చేశారని భావిస్తున్నారు.ఇక ఇప్పటికే కడప పార్లమెంటు స్థానం నుండి వైయస్ షర్మిల కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా సొంత కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డిపై ముకుమ్మడిగా మాటల తూటాలు పేల్చుతున్నారు.ఇక షర్మిల వైసిపి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి పై పోటీ చేస్తుంది.అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా షర్మిల గెలవాలని అవినాష్ రెడ్డి తన చిన్నాన్న వివేకను హత్య చేశారని,అలాంటి నిందితులని పార్లమెంటుకి పంపకూడదని, నిందితులు పార్లమెంటుకు పోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను..మీఅందరూ నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలంటూ ప్రచారం చేస్తోంది.

👉 పవన్ ఇల్లు అసిస్టెంట్ అమ్మేశాడా!!!..

అవును పవన్ ఇల్లు కట్టుకున్నారు..ముచ్చటగా మంచి ఇల్లు. అందులో వుందాం అనుకున్నారు.కానీ దాన్ని మెయింటెయిన్ చేయలేక అమ్మేసారు.కానీ అలా చెప్పుకోవడం నామర్దా కదా ..అందుకే తన అసిస్టెంట్ బలవంతంగా తన చేత అమ్మించేసారు.లేదా తనే అమ్మేసాడు అంటున్నారు.కాస్త కన్ఫ్యూజ్ గా వుంది కదా. పవన్ మాటలు,ప్రసంగాలు అలాగే వుంటాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టింది మెగాస్టార్ చిరంజీవి.దాన్ని నిర్వహించలేక కాంగ్రెస్ లో కలిపేసింది ఆయనే.అలా కలపడం ద్వారా లబ్ది పొంది, కేంద్రంలో మంత్రి పదవి పొందింది ఆయనే.కానీ పవన్ అలా అనుకోవడం లేదు. ప్రజారాజ్యం పార్టీని బలవంతంగా కన్నబాబు అనే జస్ట్ పార్టీ సభ్యుడు లేదా పార్టీ ఎమ్మెల్యే అమ్మేసేలా చేసారు అంటున్నారు.అదే సందర్భంలో అక్కడే వున్న మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంచి వాడే.కన్నబాబే చెడ్డవాడు.కన్నబాబు అంటే మొదటి నుంచీ పవన్ కు కోపమే.తను ఎమ్మెల్యే కాలేదు, తమ దగ్గర చేతులు కట్టుకుని వుండే వాడు ఎమ్మెల్యే,మంత్రి అయిపోయాడు అన్నది పవన్ బాధ.ఆ బాధ ఇన్నాళ్లూ పైకి చెప్పలేదు. ఇప్పుడు కక్కేసారు. ‘కన్నబాబూ రా అంటే పరుగెత్తుకుని వచ్చేవాడు. డొక్కు స్కూటర్ మీద తిరిగేవాడు.మా అన్న ఏదైనా సమాచారం అడిగితే ఇచ్చే పని చేసేవాడు. అంచెలంచెలుగా ఎదిగిపోయాడు’ అనేసి మళ్లీ నాలుక కర్చుకున్నాడు. ఎదగొచ్చు…కానీ అందరినీ తొక్కేసి ఎదగకూడదు అంటూ సవరణ ఇచ్చుకున్నారు.కన్నబాబు ఎవర్ని తొక్కేసి ఎదిగారు? ప్రజారాజ్యం అధినేత మెగాస్టార్ తో పాటే కదా కాంగ్రెస్ లోకి వెళ్లింది. చాలా మంది కాంగ్రెస్ వాదుల మాదిరిగానే కదా వైకపాలోకి వచ్చింది.కష్టపడి ప్రజల అభిమానం చూరగొనకుండా గెలవగలరా? మరి ఇక్కడ తొక్కేయడం అన్న పాయింట్ ఎక్కడుంది?పవన్ ఎంత మంది హీరోలను తొక్కేసి ఈ స్థాయికి వచ్చారు? అలా అంటే ఒకె అనగలరా? అసలు మెగాస్టార్ బ్రదర్ కాకుండా వుంటే పవన్ కు ఈ రోజు ఆ డొక్కు స్కూటర్ అయినా వుండేదా? తమ దగ్గర పని చేెసేవాడు పనివాడిలాగే వుండిపోవాలి.తమను దాటిపోకూడదు అనే నైజం ఎవరికీ ఉండకూడదు.పవన్ తన నైజం అలాంటిది అని బయటపెట్టుకున్నారు ఈ రోజు గత అయిదేళ్లలో ఇదే కన్నబాబు ఎన్నిసార్లు చిరంజీవితో టచ్ లో వున్నారు. జగన్ ను మెగాస్టార్ కు మధ్య కమ్యూనికేషన్ కన్నబాబే అన్న సంగతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.ఈ సంగతి పవన్ కు తెలియదా?పవన్ బాధ ఒకటే తను ఎమ్మెల్యే కాలేకపోయాను, సిఎమ్ కాలేకపోయాను.జగన్ తనకన్నా చిన్న అయినా సిఎమ్ అయిపోయాడు. కన్నబాబు తమ దగ్గర చెేతులు కట్టుకుని వుండేవాడు. మంత్రి అయిపోయాడు.అదే కదా పవన్ బాధ ఆ ఇద్దరి మీద.

👉ఏపీ సీఎం పదవి బాబుకు కాదా..?.. షాక్ ఇచ్చిన మోదీ..!!

ఆంధ్రప్రదేశ్‌ లో పొత్తు కుదిరాక టీడీపీ,జనసేన,బీజేపీ సంయుక్తంగా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో తొలి సభను ‘ప్రజాగళం’ పేరుతో నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ సభకు మూడు పార్టీల ముఖ్య నేతలు.. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ మాటలపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.అభివృద్ధి జర గాలంటే కేంద్రంలో,రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్లు ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఎన్డీయే కూటమిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రసంగం మొత్తంలోనూ ఆయనెక్కడా చంద్రబాబును,పవన్‌ కళ్యాణ్‌ ను అభినందిస్తూ మాట్లాడకపోవడంపై టాక్‌ నడుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓట్లేయాలని అని చెప్పకుండా ఎన్డీయే కూటమికి ఓట్లేయాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. కేంద్రంలో ఎన్డీయే కూటమికి నాయకత్వ స్థానంలో ఉంది బీజేపీయే కావడం ఇక్కడ గమనార్హం.మూడు పార్టీల కూటమి ద్వారా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ఆశించిన చంద్రబాబుకు మోదీ గట్టి షాకే ఇచ్చారని టాక్‌ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎన్డీయేకు రాకుండా కాంగ్రెస్‌ కు మళ్లించడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని కూడా మోడీ ఆరోపించారు. 👉ఇలా తన ప్రసంగం ఆద్యంతం ప్రధాని మోదీ ఎన్డీయే కూటమిని గెలిపించాలని అన్నారే కానీ చంద్రబాబు సీఎం కావాలని లేదా పవన్‌ సీఎం కావాలని వ్యాఖ్యానించలేదు.రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వాలు ఉండాలంటున్న మోదీ మాటల వెనుక నిగూడార్థం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అంటే బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటారనేది ఆయన మాటల ఉద్దేశమని ఊహాగానాలు నడుస్తున్నాయి.ఎన్డీయే కూటమి తరఫున పురందేశ్వరిని ఏపీ ముఖ్యమంత్రిని చేయాలనేది నరేంద్ర మోదీ ఉద్దేశమా అని ఆయన మాటల వెనుక నిగూడార్థాన్ని వెతుక్కుంటున్నారు. చంద్రబాబుపై ఈ ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసింది.ఆయనను 50 రోజులకుపైగా జైలులో పెట్టింది. అలాగే చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ తోపాటు టీడీపీ ముఖ్య నేతలందరిపైన కేసులు దాఖలయ్యాయి.ఈ నేపథ్యంలో తమపై నమోదైన కేసుల విచారణ ముందుకు సాగకుండా ఉండటానికి ప్రధాని మోదీ ఏదడిగినా ఇవ్వడానికి చంద్రబాబు ముందుంటారని అంటున్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి కూడా ఆయన సిద్ధపడొచ్చని చెబుతున్నారు.ఈక్రమంలోనే చిలకలూరిపేట ప్రజాగళం సభలో ప్రధాని మోదీ చంద్రబాబును ఏమాత్రం అభినందించకపోవడం, పొగడకపోవడం దీన్నే సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చంద్రబాబు అనుభవాన్ని కానీ, విజన్‌ ను కానీ, ఆయన సీఎంగా ఉండాల్సిన అవసరాన్ని కానీ మోదీ ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం.కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అనే మాట వెనుక మోదీ ఉద్దేశాలు వేరని అంటున్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అని మోదీ పలుమార్లు నొక్కిచెప్పడం వెనుక కీలక వ్యూహం ఉందని చెబుతున్నారు.బీజేపీ ఏపీలో ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది.. ఎన్ని గెలుస్తుంది? అనే విషయాన్ని పక్కనపెడితే కూటమి తరఫున ముఖ్యమంత్రి ఎవరనే అంతిమ అధికారం మోదీకే ఉంటుందంటున్నారు.ఎన్డీయే ముఖ్యమంత్రి అని ప్రధాని మాటల వెనుక ఉద్దేశం కూడా అదేనని అంటున్నారు. దీని ప్రకారం..బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సీఎంను చేయడమే మోదీ ఉద్దేశం కావచ్చని చెబుతున్నారు.👉పురంధేశ్వరి ఏపీకి సీఎం అవుతారని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి గతంలోనే ప్రస్తావించడం గమనార్హం.మోదీ ప్రసంగం టీడీపీ శ్రేణులకు సంతోషాన్ని ఇవ్వలేదని అంటున్నారు. చంద్రబాబు అనుభవాన్ని పొగుడుతూ వైఎస్‌ జగన్‌ ను మోదీ తిట్టిపోస్తారని టీడీపీ శ్రేణులు అంచనా వేశాయి. అయితే వారి అంచనాలు తప్పడంతో తీవ్ర నిరాశ తప్పలేదని అంటున్నారు.

👉 అబాకస్ పోటీ పరీక్షలో విజయం సాధించి జాతీయస్థాయిలో అవార్డు అందుకున్న స్పందన పాఠశాల విద్యార్థి నజీర్, హైదరాబాదులో ఆదివారం జరిగిన జాతీయస్థాయి అబాకస్ పోటీ పరీక్షలో విద్యార్థి నజీర్ ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా విద్యార్థి నజీర్ ను హైదరాబాద్ అబాకస్ నిర్వాహకులు అభినందించి మోమెంటో అందజేశారు జాతీయ స్థాయిలో సత్తా చాటి జాతీయ అబాకస్ అవార్డు అందుకున్న నజీర్ ను స్పందన విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి అభినందించారు జాతీయ స్థాయి అవార్డు అందుకోవడం తమకు తమ పాఠశాలకు గర్వకారణం అన్నారు.……👉 గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేటలో తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు సైదులు నివాసం లో కార్యకర్తల తో ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గిద్దలూరు శాసనసభ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి మరియు మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయులు నిఖిల్ రెడ్డి.. అనంతరం ఆయన అర్థవేడు మండలంలో రోడ్ షోలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి కుప్పా రంగసాయి,జనసేన నియోజకవర్ఘ ఇంచార్జి బెల్లంకొండ సాయి బాబు మరియు తదితర టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉మాగుంటను కలిసిన కంభం టిడిపి నాయకులు…కంభం మండల టీడీపీ నాయకులు రజాక్ భాష (స్టార్),కాకర్ల ప్రసాద్,బాబు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్దిగా పోటీ చేయుచున్న ముత్తుముల అశోక్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్దిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలుపు కొరకు అత్యధిక మెజార్టీ వచ్చేందుకు కృషి చేస్తామన్నారు.కార్యక్రమంలో అయిన బత్తిన గణేష్ శ్యామ్ పాల్గొన్నారు……………..👉 గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన కంభం పట్టణ వైకాపా నాయకుడు మొగల్ అస్లాం భేగ్.. కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉన్న ఆయన ఆదివారం టిడిపిలో చేరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..

👉ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన 25 కుటుంబాలు..ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో గడికోట పంచాయతీ మాజీ సర్పంచులు ముచ్చుకుండ్ల రామసుబ్బయ్య, మందగిరి రంగస్వామి, దూదేకుల నరసింహులు ఆధ్వర్యంలో దేవనగరం గ్రామానికి చెందిన ఇద్దరు వార్డు మెంబర్లతో సహా 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో స్థానికంగా ఉండే అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం