కాంగ్రెస్ బూచి చూపిస్తున్న మోడీ?.. షర్మిల చెప్తున్నవన్నీ నిజాలేనా???.. జగన్ పాలన దోపిడీ దౌర్జన్యాలు.. బాలయ్య… మాగుంట సమక్షంలో పలువురి చేరికలు

👉తాజాగా తెలంగాణలో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని మోడీ ఇక్క‌డ మ‌రో చిత్ర‌మైన విష‌యాన్ని తెర‌మీదికి తెచ్చారు.అదే`డ‌బుల్ ఆర్‌` ట్యాక్స్‌. (డ‌బుల్ అంటే.. రేవంత్ రెడ్డి) ఆయ‌న పేరు చెప్ప‌కుండా డ‌బుల్ ఆర్ అంటూ..ప్ర‌ధాని మోడీ ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు.తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం డ‌బుల్ ఆర్ ట్యాక్స్‌లు ప్ర‌జ‌ల పై రుద్దు తోంద‌ని..వారి ఆస్తులు కూడా మిగ‌ల‌బోవ‌ని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కేంద్రంలో రేపే కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే..డ‌బుల్ ఆర్ ట్యాక్స్ అక్కడ కూడా రుద్దు తార‌ని..దీంతో ప్ర‌జ‌లు పేద‌లు అవుతార‌ని .. రోడ్ల‌మీద‌కు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని మోడీ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

అందుకే బీజేపీకి ఓటేయాల‌ని..కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వాన్ని గెలిపించాల‌ని మోడీ పిలుపునిచ్చారు.కానీ, మోడీ వంటి పెద్ద నాయ‌కుడు ఇలా ప్ర‌జ‌ల‌ను భ‌య పెట్టి.. అధికారంలోకి రావాల‌ని అనుకోవ‌డ‌మే ఇప్పుడు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది.మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ ఇలా భ‌య పెట్ట‌డంతోనే త‌న ప్ర‌సంగాన్ని పూర్తి చేశారు. అయితే..ప్ర‌జ‌లు ఏమీ అమాయ‌కులు కాద‌న్న విష‌యం ఆయ‌న‌కు తెలియంది కాదు. ఎవ‌రు వ‌స్తే..ఏం జ‌రుగుతుందో వారికి తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌దు. సో.. మోడీ త‌న ప్ర‌సంగాల్లో ఈ భ‌యోత్పాతం క‌లిగించే భావ‌న‌ను త‌గ్గించుకుంటే..ఆయ‌న ఇమేజ్ బాగుంటుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.👉 ఆయన ముస్లింల వల్ల దేశానికి ప్రమాదం ఉందని హిందుత్వాన్ని రెచ్చగొడుతూ అమాయక హిందూ ప్రజలను మోసం చేస్తూ.. దేశ సంపదను పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నారని పలువురు మేధావులు ఆరోపిస్తున్న విషయం విధితమే.

👉ష‌ర్మిల చెప్పేవి నిజాలేనా?..ఈ డౌట్ ఎందుకు వ‌స్తోందంటే! ఏపీలో కాంగ్రెస్ చీఫ్ వైఎస్‌ ష‌ర్మిల చేస్తున్న విమ‌ర్శ‌లు.. చేస్తున్న కామెంట్లు చాలా సీరియ‌స్‌గా ఉన్నాయి.ష‌ర్మిల చెప్పేవి నిజాలేనా? ఈ డౌట్ ఎందుకు వ‌స్తోందంటే!ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం అంద‌రికీ తెలిసిందే. నువ్వు 100 కోట్లు తిన్నావ‌ని ఒక‌రు అంటే.. నువ్వు 1000 కోట్లు తిన్నావ‌ని మ‌రొక‌రు అంటారు. ఈ విమ‌ర్శ‌లు కామ‌న్‌.దీనిలో నిజానిజాలు ఆ దేవుడికే ఎరుక‌. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌..ఈ విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు..కూడా బుట్ట దాఖ‌ల‌వుతాయి.కానీ, ఏపీలో కాంగ్రెస్ చీఫ్ వైఎస్‌ ష‌ర్మిల చేస్తున్న విమ‌ర్శ‌లు.. చేస్తున్న కామెంట్లు చాలా సీరియ‌స్‌గా ఉన్నాయి.అందునా.. ఆమె చేస్తున్న

విమ‌ర్శ‌లు ఎవ‌రో.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై కాదు..సొంత అన్న‌. ఆయ‌న ద్వారా నే రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.కానీ, ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు… ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల చేస్తున్న వ్యాఖ్య‌లు, చెబుతున్న విష‌యాలు.. నిజ‌మేనా? అనే సందే హం వ్య‌క్త‌మ‌వుతోంది.ప్ర‌ధానంగా మాజీ సీఎం, దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరును.. చార్జిషీట్‌లో ఎక్కించార‌ని.. ఆమె రెండు రోజులుగా చెబుతున్నారు. అయితే.. ఇది సీఎం జ‌గ‌న్ చేయించాడ‌ని.. క‌న్న తండ్రి పేరును చార్జిషీట్‌లో ఎక్కించేలా చేసిందిజ‌గ‌నేన‌ని ష‌ర్మిల చెబుతున్నారు. మ‌రోవైపు.. ఇదే విష‌యంపై సీఎం జ‌గ‌న్ మాత్రం కాంగ్రెస్ పార్టీనే త‌న తండ్రి వైఎస్ పేరును చార్జిషీటులో చేర్చింద‌ని అంటున్నారు.ఓకే.. ఈ రెండు విష‌యాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ష‌ర్మిల చెబుతున్న‌ట్టు.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరును జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులోని చార్జిషీటులో ఆయ‌నే చేర్చార‌ని అనుకుందాం. కానీ, ఇది ఎప్పుడు జ‌రిగింది? 2011-12 మ‌ధ్య క‌దా! మ‌రి సొంత తండ్రి పేరును సొంత అన్న ఇలా బ‌ద్నాం చేసిన‌ప్పుడు.. అప్పుడు ఎందుకు ష‌ర్మిల స్పందించ‌లేదు? పైగా.. జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణాన్ని అని రాష్ట్రంలో ప‌ర్య‌ట‌న ఎందుకు చేశారు? అనేది డౌట్ కొట్టే ప్ర‌శ్న‌.ఎందుకంటే.. ఏదైనా విష‌యం చెబితే. దాని పూర్వాప‌రాలు ఒక‌ప్పుడు అందుబాటులో లేక‌పోయినా..ఇప్పుడు అంద‌రికీ అందుబాటులో ఉన్నాయి. కాబ‌ట్టి నేత‌ల మాట‌ల నిజాలు ఏమిటో ఇట్టే తెలిసి పోతుంది.ఇక‌, జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నాడు.. అన్నారు ష‌ర్మిల‌. అందుకే క‌డ‌ప‌లో వైఎస్ కుటుంబం మొత్తం తిరిగి ప్ర‌చారం చేస్తోంద‌న్నారు.

👉జగన్మోహన్ రెడ్డి పాలన అంతా దోపిడీలు, దౌర్జన్యాలు.. నందమూరి బాలకృష్ణ

 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ప్రముఖ సినీనటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి నటసింహం బాలకృష్ణ మంగళవారం మర్రిపూడి లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా దోపిడీలు, దౌర్జన్యాలు, అహంకారపూరితమైన వ్యవహార శైలితో సాగుతుందని బాలకృష్ణ అన్నారు. జగన్ మాయమాటలు నమ్మి ఇంకోసారి మోసపోవద్దని కొండపి నియోజకవర్గం ప్రజలను ఆయన కోరారు. వందించడం జగన్మోహన్ రెడ్డి బ్లడ్ లోనే ఉందని నాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేయడమే కాక అంతా చెల్లికి తల్లికి అన్యాయం చేసిన ఘనుడని విమర్శించారు. మద్యపాన నిషేధం చేసాకే ఓట్లు అడుగుతాను అన్న ముఖ్యమంత్రి నేడు ఏ మొహం పెట్టుకొని ఈరోజు ప్రజలను ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.జగన్మోహన్ రెడ్డికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక రాష్ట్ర ప్రజలను హింసించడం మొదలుపెట్టాడని ఆయన అన్నారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం, వారికి తొత్తులుగా కొంతమంది అధికార యంత్రాంగం పని చేశారని విమర్శించారు. రాబోయేది రామరాజ్యమని 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తద్యమని బాలకృష్ణ అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రకాశం జిల్లాలో స్వామిపై, శ్రీనివాసరెడ్డి పై పోటీ చేసే నాయకులు దొరక్క ఇతర ప్రాంతాల నుంచి ట్రాన్స్ఫర్ మీద తెచ్చుకొని పోటీ చేయించడం దారుణం చేయించడం పిరికిపంద చర్య అన్నారు.తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమం అభివృద్ధి కళ్ళ ముందు రాష్ట్ర ప్రజలకు కనిపిస్తున్నాయని కళ్ళు మూసుకున్న జగన్మోహన్ రెడ్డికి కనపడుతుందని దేవా చేశారు. అవినీతి మరకలేని మాగుంట శ్రీనివాసరెడ్డి,స్వామి కావాలో లేక ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారాల కోసం వలస వచ్చిన రాజకీయ నాయకులు కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.కొండేపి నియోజకవర్గం ప్రజలు చాలా తెలివైన వాళ్ళని అందుకే స్థానికుడైన స్వామిని ఇప్పటికి రెండుసార్లు గెలిపించారని రేపు హట్రిక్ ఎమ్మెల్యేగా నిలబెట్టడం ఖాయం అనిపిస్తుందని ఇక్కడికి వచ్చిన ప్రజలను చూస్తే అర్థమైందన్నారు. స్వామి పొట్టిగా ఉన్న అసెంబ్లీలో మాత్రం చిచ్చరపిడుగుల వ్యవహరించి మన అధినేత చంద్రబాబు నాయుడుకు అండగా నిలుస్తున్నారని బాలయ్య అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నూరు శాతం అంగవైకల్యం ఉన్న వికలాంగులకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని, వికలాంగులకు 6వేల పెన్షన్, వృద్ధులకు 4వేలరూపాయలు ఉమ్మడి ప్రభుత్వంలో ఇవ్వడం జరుగుతుందన్నారు.నాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇద్దరు బిడ్డలకు అమ్మబడి ఇస్తారని ప్రజలను మభ్య పెట్టారన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఒక ఇంటిలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15 వేల రూపాయలు తల్లికి వందనం పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతు ప్రభుత్వంగా నాడు తెలుగుదేశం పార్టీ ఎన్నో నదులను అనుసందరీకరించి పంటలను కాపాడిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని,కొండపి ప్రజల జీవనాడి అయిన సంఘమేశ్వర ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు గడిచిన ఇచ్చే ముందుకు తీసుకెళ్లలేక పోయారని ఆరోపించారు. వచ్చే మన ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన సంగమేశ్వర ప్రాజెక్టును పూర్తి చేసి కొండపి నియోజకవర్గ ప్రజలకు తాగునీరు సాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు.ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని నిరుద్యోగ యువతను మోసం చేయడమే కాకుండా వారి విద్యా ఆర్హతకు రావాల్సిన ఉద్యోగాలు వైసీపీ ప్రభుత్వం కల్పించలేకపోయింది అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం వ్యవహరించి నిరుద్యోగ శాతాన్ని పెంచిందన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ 60 రోజుల్లోనే మెగా డీఎస్సీ ద్వారా నిరుద్యోగ యువతకు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించి 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. అప్పటివరకు నిరుద్యోగులకు ప్రతినెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. కొండపి నియోజకవర్గం లో దామచర్ల సత్య,డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి కృష్ణార్జునల లాగా కలసి పనిచేసి తెలుగుదేశం పార్టీని రక్షించుకునేందుకు అనునిత్యం కష్టపడుతున్నారని తెలిపారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అచ్యుత్ కుమార్,నియోజకవర్గ పరిశీలకులు అడకా స్వాములు,జనసేన నాయకులు కనపర్తి మనోజ్ కుమార్, బిజెపి నాయకులు బాలకోటయ్య తోపాటు ఆరు మండలాల టిడిపి అధ్యక్షులు, జనసేన బిజెపి అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

👉 ఒంగోలు నగరం లో గుంటూరు రోడ్ లోని A1ఫంక్షన్ హాల్ ఎదురుగా జరిగిన యువగళం కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మర్యాద పూర్వకంగా కలిసిన యువ నాయకులు,మాగుంట రాఘవ రెడ్డి మరియు పలువురు టిడిపి నాయకులు..

👉 సింగరాయకొండ మండలం, ములగుంట పాడు గ్రామంలో ఇంటింటికీ NDA కూటమి అభ్యర్థులు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి,ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిని భారీ మెజారిటీతో గెలిపించండని మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబ సభ్యులుతో కలిసి ప్రచారం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఐనాబత్తిన రాధిక ,ఉప్పుటూరి రజనీ, పోలిశెట్టి మాధురి,పూసల ప్రమీల,రత్నగిరి అంజమ్మ, నల్లబోతుల భారతి,ఇందిరా, కృష్ణవేణి,ఏ మాధవి,ఎం స్వప్న,ఎన్ ఆదిలక్ష్మి,ఎం జయమ్మ,ఐనాబత్తిన రాజేష్, కాసుల శ్రీకాంత్,కాసుల శ్రీనివాస్,కిచ్చెంశెట్టి ప్రవీణ్ కుమార్,సయ్యద్ ఖాజా హుసేన్,చప్పిడి బాను, ముద్రగడ సైదులు,జన సైనికులు.చిగురుపాటి శేషగిరి రావు, బసవయ్య, సన్నేబోయిన మల్లికార్జున, అంబటి శ్రీను సన్నేబోయిన వెంకటేశ్వర్లు చొప్పర శ్రీహరి, శ్రీనివాసులు, శివ కుమారి, నాగార్జున,బాబు రావు, నాగేశ్వర రావు కట్ట శ్రీనివాసులు సుధీర్ బాబు,సుభాషిణి తదితర నాయకులు తెలుగుదేశం, జనసేన,బీజేపీ మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

👉ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో బుధవారం ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి శాసనసభ అభ్యర్థి డా. గొట్టిపాటి లక్ష్మి భర్త డా.కడియాల లలిత్ సాగర్,యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి సమక్షంలో దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం వెలుగువారిపాలెం కి చెందిన వెంకటేశ్వర్లు,బాలనాగయ్య, వెంకటేశ్వర రెడ్డి, కోటిరెడ్డి, సన్నపురెడ్డి పెద్ది రెడ్డి, వై. యస్. ఆర్. సి. పి ని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది. కార్యక్రమం లో పలువురు పాల్గొన్నారు.

👉 ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ రావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఒంగోలు మాజీ AMC చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం .

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…