ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే-సీఎం జగన్..జగనన్నకు అద్దం పంపిన షర్మిల..పాతబస్తీలో అమిత్ షాపై కేసు నమోదు..సీఎం జగన్ పై ధ్వజమెత్తిన పవన్ కళ్యాణ్.. కంభం అర్బన్ కాలనీ లో నీటి సమస్య కు చెక్

జగన్‌కు రెండు బటన్లు నొక్కి ఓటేస్తేనే.. పథకాల కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి: నెల్లూరు సీటీలో సీఎం

జగన్_ జగన్.చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదుమళ్లీ ఈ ముగ్గురు కలిశారు. మళ్లీ మేనిఫెస్టో అంట. మేనిఫెస్టో పేరుతో సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవెన్‌‌ అంట. ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు అంట. నమ్ముతారా?మన బతుకులు బాగుపడాలన్నా. పేదల భవిష్యత్తు మారాలన్నా. లంచాలు లేని అవినీతి రహిత పాలన కొనసాగాలన్నా.. ఫ్యాన్ బటన్ పై రెండు బటన్‌లు నొక్కాలి.👉ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే- సీఎం జగన్..4శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న పార్టీతో జత కడతాడు.. మరోవైపు మైనార్టీల ఒట్ల కోసం డ్రామాలు ఆడుతున్నాడు.మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్ ఉండి తీరాల్సిందే మీ బిడ్డ చెబుతున్నాడు, దీనికోసం ఎంతైనా పోరాడతా- ఇదే మాట బాబు చెప్పగలడా, ఎన్డీఏ నుంచి బయటకివచ్చి పోరాడగలడా.. ఎందుకు ఈ దొంగ ప్రేమ – ఎన్ఆర్సీ, సీఏఏ, ఏ అంశమైనా సరే మైనార్టీలకు అండగా జగన్ ఉంటాడు.

👉సీఎం జగన్ మోహన్ రెడ్డికి అద్దం గిఫ్ట్ పంపిన కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి..ఏపీలో ఎన్నికల వేళ వైఎస్ కుటుంబ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేంద్రంగా వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ మధ్య సాగుతున్న రాజకీయ పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. వివేకా హత్యపై న్యాయం కోసం తానూ, ఆయన కుమార్తె సునీత పోరాటం చేస్తుంటే చంద్రబాబు చేయిస్తున్నారంటూ జగన్ చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ ఆయనకు ఓ అద్దం పంపారు.

అందులో ఎవరి మొహం కనిపిస్తుందో చూసుకోవాలన్నారు.జగన్ మానసిక పరిస్థితి గురించి తనకు భయంగా ఉందని షర్మిల వ్యాఖ్యానించారు. తనకు అద్దం పంపిస్తున్నాని, అందులో మీ మొహం కనిపిస్తుందా ? చంద్రబాబు మొహం కనిపిస్తుందా చూసుకోవాలన్నారు. తాను చంద్రబాబతో చేతులు కలిపినట్లు , కంట్రోల్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఒక్క సాక్ష్యం అయినా, ఒక్కఆధారం అయినా చూపించ గలరా ? అని అడిగారు. జగన్ ఒక్క భ్రమలో ఉన్నాడని, ఏదో ఊహల్లో ఉన్నట్లు ఉందన్నారు. జగన్ వైఖరి మాలోకాన్ని తలపిస్తుందన్నారు.తన జన్మ కి చంద్రబాబును ఒక్కసారి మాత్రమే కలిశానని షర్మిల తెలిపారు. తన కొడుకు పెళ్లి కి పిలవడానికి మాత్రమే వెళ్లానన్నారు. ఆనాడు వైఎస్సార్ కూడా పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళాడన్నారు. ఆ స్ఫూర్తి తోనే తాను చంద్రబాబు ను పిలవడానికి వెళ్లానన్నారు. తాను 5 నిమిషాలు కూడా ఏనాడూ బాబుతో మాట్లాడలేదన్నారు. తాను చంద్రబాబు చెప్తే నీకోసం 3200 KM పాదయాత్ర చేశానా, బై బై బాబు అనే క్యాంపెయిన్ చేశానా అని అడిగారు.సునీత,రేవంత్ కూడా చంద్రబాబు చెప్పినట్లు వింటారట, బీజేపీ పొత్తు కూడా చంద్రబాబు మ్యానేజ్ చేశాడట, చంద్రబాబు ఎంత పవర్ ఫుల్ అయ్యారో…ఆయనను పెద్ద చేసి చూపిస్తున్నారో ఆలోచన చేయాలని షర్మిల జగన్ కు సూచించారు. జగన్ మానసిక పరిస్థితి పై నాకు ఆందోళన గా ఉందన్నారు. జగన్ గారు, మీరు అద్దం చూస్కోండి, మీకు మీ మొహం కనిపిస్తుందా ? చంద్రబాబు మొహం కనిపిస్తుందా ? అని ప్రశ్నించారు. సునీత చేస్తున్న న్యాయ పోరాటం మీకు కనిపించడం లేదా అని అడిగారు. హత్య వెనుక అవినాష్ రెడ్డి హస్తం, మీ హస్తం లేకుంటే భయం ఎందుకన్నారు.వైఎస్సార్ పేరును కాంగ్రెస్ లో చేర్చింది కాంగ్రెస్ కాదని, జగన్ మనిషి అన్నారు. పొన్నవోలుతో పిటీషన్ వేయించి మరి చేర్పించాడన్నారు. నిజానికి కేసు వేసింది మాజీ మంత్రి శంకర్ రావు, కానీ ఈ కేసు చెల్లలేదన్నారు. ఎర్రంనాయుడు వేసిన పిటీషన్ ను కోర్టు ఇంప్లేడ్ చేసిందన్నారు. విచారణ చేయమని మాత్రమే అనాడు కోర్టు చెప్పిందని, కానీ వైఎస్ఆర్ పేరును అప్పుడు పిటీషన్ లో చేర్చలేదన్నారు. పొన్నవోలు సుధాకర్ తో సుప్రీం కోర్టు వరకు వెళ్లి పేరు పెట్టించారన్నారు. ఇదే నిజమన్నారు. తారు మారు చేసే ప్రయత్నం చేసినా నిజం దాగదన్నారు.గిఫ్ట్ గా పొన్నవోలుకు అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చారని షర్మిల ఆరోపించారు. సీఎం అయిన 6 రోజులకే అపాయింట్ మెంట్ లెటర్ ఇచ్చారన్నారు. మూడు సార్లు చార్జీ షీట్ లో పెట్టాలి అనుకున్న వ్యక్తికి మీరు పదవి ఇచ్చారని విమర్శించారు. ఏ సంబంధం లేకుంటే ఎందుకు ఇస్తారన్నారు. కళ్ళకు ఎదుట అందరికీ స్పష్టంగా కనిపించిందన్నారు. కాంగ్రెస్ కి సీబీఐ ఛార్జ్ షీట్ కి సంబంధం లేదన్నారు. మమ్మలని ఈ విషయంలో ఊసరవెల్లి అంటున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందని తాను చెప్పినట్లు వీడియోలు ప్లే చేస్తున్నారన్నారు. నిజానికి ఆరోజు తనకు నిజం తెలియదన్నారు.తాను కాంగ్రెస్ పెట్టించింది అనుకున్నట్లు షర్మిల తెలిపారు. సోనియాను కలిశాక అసలు విషయం తెలుసుకున్నట్లు వెల్లడించారు. సోనియా నాతో మేము ఎందుకు పెడతాం అని చెప్పారన్నారు. ఈ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలసినప్పుడు కూడా తెలుసుకున్నాన్నారు. జగన్ కావాలని పెట్టించినట్లు ఉండవల్లి స్పష్టం చేశారన్నారు.అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాతే తాను ఈ విషయం చెప్పగలుగుతున్నట్లు తెలిపారు.👉ఈ మధ్య జగన్ నేషనల్ మీడియాకి ఇంటర్వూలు ఇస్తున్నారని, తాను చంద్రబాబు మనిషి అంటున్నారని, తనను చంద్రబాబు కంట్రోల్ చేస్తున్నాడని చెప్తున్నారని షర్మిల ఆక్షేపించారు. తాను బాబు మాట వింటున్నానని చెప్తున్నారన్నారు. కానీ తాను వైఎస్సార్ బిడ్డనని, తానెంత ఎంత మొండి దాన్నో జగన్ కి తెలుసన్నారు. తాను ఎవరో కంట్రోల్ చేస్తే తిరిగే వ్యక్తి కాదన్నారు. తనకు ఎవరో ఏదో చెప్తే నమ్మే వ్యక్తిని కాదన్నారు. –

👉గీత దాటేస్తున్న రేవంత్ దూకుడు.. పాతబస్తీలో అమిత్ షాపై కేసు!

నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అన్న తీరు గురించి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు కూడా అదే మాదిరి ఉందని చెప్పాలి.నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అన్న తీరు గురించి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు కూడా అదే మాదిరి ఉందని చెప్పాలి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఎంతటి శక్తివంతమైన ముఖ్యమంత్రి అయినప్పటికీ ప్రధాని మోడీ.. ఆయన నీడలా ఉండే అమిత్ షా జోలికి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. అయితే.. ఆ గీతను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు ఒక కేసు బుక్ చేస్తే తాను ఒక కేసు బుక్ చేస్తానన్న రీతిలో సంకేతాల్ని పంపిన వైనం ఇప్పుడు అందరి చూపు పడేలా చేస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన పలువురి మీద కేసు నమోదు కావటంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ సైతం ఈ కేసును ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ కు నోటీసులు జారీ చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే..తాజాగా హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని మొఘల్ పురా పోలీస్ స్టేషన్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీద కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ నేత నిరంజన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు కేసు నమోదు చేయటమే కాదు..ఎఫ్ఐఆర్ ను సిద్ధం చేసిన వైనం చూసినప్పుడు.. రేవంత్ సామాన్యుడు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనపై డీప్ ఫేక్ వీడియో కేసు కత్తి వేలాడుతున్న వేళ.. అంతే స్థాయిలో అమిత్ షా మీద మరో కేసును సిద్ధం చేసిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి అమిత్ షా మీద కేసు పెట్టేంత ధైర్యం.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. కేంద్రంతో ఘర్షణకు పోకుండా.. సామరస్యంగా వ్యవహరిస్తున్న రేవంత్..ఇప్పుడు అందుకు భిన్నంగా దూకుడు ప్రదర్శించటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొందరపాటు మంచిది కాదని.. అమిత్ షాను టార్గెట్ చేసినట్లుగా చర్యలు ఉండకుంటే బాగేండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకూ కేంద్ర హోం మంత్రి మీద నమోదైన కేసు ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. మూడు..నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ పాతబస్తీలో అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించటం తెలిసిందే. ‘రెండు’ టీం ఇండియాల ఢీ ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనల్ని అమత్ షా ఉల్లంఘించినట్లుగా ఈమొయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.ఎన్నికల నియమావళిని బీజేపీ పట్టించుకోలేదని.. చిన్నారులతో ప్రచారం చేయించారని కంప్లైంట్ చేశారు. రోడ్ షో అనంతరం నిర్వహించిన సభలో.. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత మాట్లాడే వేళలో..కొంతమంది చిన్నారుల్ని తన వద్దకు రమ్మంటూ అమిత్ షా సైగ చేశారని.. దీంతో వారు అమిత్ షా వద్దకు వెళ్లారన్నారు. ఈ సమయంలో ఒక చిన్నారి చేతిలో ఉన్న ప్లకార్డులో కమలంపువ్వు గుర్తు ఉందని.. ఇద్దరు చిన్నారుల చేతుల్లో ఆప్ కీ బార్ 400 సీట్స్ అంటూ రాసి ఉండటాన్ని తప్పు పట్టారు. ఇలా ప్రచారం చేయటం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లుగా పేర్కొన్నారు.చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న ఆయన ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది.దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో..శుక్రవారం అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ1గా యమాన్ సింగ్.. ఏ2గా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత.. ఏ3గా అమిత్ షా.. ఏ4గా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపైనా కేసు నమోదు చేశారు.ఈ కేసుతో రేవంత్ అంచనాలకు మించిన రిటార్టు ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఈ అంశం రానున్న రోజుల్లో పలు రాజకీయ పరిణామాలకు కారణమవుతుందన్న మాట వినిపిస్తోంది.మరేం జరుగుతుందో చూడాలి.

👉జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్. .ప్రకాశం జిల్లా…గిద్దలూరు లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బహిరంగ సభ…
పశ్చిమ ప్రకాశం ప్రాంతమైన గిద్దలూరులో అభివృద్ధి లో వెనకబడి ఉందన్న పవన్ కళ్యాణ్..

👉గతంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ని పొట్టన పెట్టుకున్నాడని అన్నారు.
ఇప్పుడు ఈ ప్రాంతానికి మరొక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చాడని అతనిని మనం గెలిపిద్దామా..
ఎంతో ధైర్యంగా దశాబ్దం నుంచి పార్టీని నడుపుతున్నానన్న పవన్ కళ్యాణ్..
వెంగయ్య నాయుడు లాంటి ధైర్యం ఉన్న కార్యకర్తలే జనసేనకు అవసరమని అన్నారు.
రోడ్లు లేవని సదుపాయాలు లేవని అడిగిన వెంగయ్య నాయుడుని వైసిపి పొట్టన పెట్టుకుందన్నారు.
👉ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉన్నా ఐదు కోట్ల జనాభా శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని కలిసి పోటీ చేస్తున్నామన్న పవన్..
చంద్రబాబు నాయుడు ని జైల్లో పెడితే అందరూ భయపడుతుంటే నేను స్వయంగా జైలు వద్దకు వెళ్లి మద్దతు తెలిపానున్నారు.
స్థానికంగా ఉన్న పోలీసులను కూడా వైసిపి కార్యకర్తల్లా మార్చేశారని విమర్శలు..
వైసిపి గుండాల నుంచి ధైర్యంగా ప్రజలు ధైర్యంగా ఉన్నారంటే అదొక జనసేన కార్యకర్తల వల్లే ..
గుండ్ల మోటు తెలుగు గంగ ప్రాజెక్టు అనుసంధానం అనుసంధానం చేస్తాం..
వెలిగొండ ప్రాజెక్టు ఉట్టి సొరంగాలు జగన్ ప్రారంభించాడు.
మేము అధికారంలోకి వస్తే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా రైతులకు నీరు అందించి ఈ ప్రాంతంలో పొలాలను పచ్చగా మారుస్తాం..
మన కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఏర్పాటు చేస్తాం..వచ్చి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే ఉంటుందన్న పవన్..
ఐదు సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలను యువతకు ఇచ్చేలాగా కూటమి బాధ్యత తీసుకుంటుంది.
ప్రకాశం జిల్లా కు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి సివిల్స్ లో మంచి ర్యాంకు సాధించారని ప్రశంసించిన పవన్..
యువతకు ఉదయ్ కృష్ణారెడ్డి ఆదర్శమన్న పవన్ కళ్యాణ్..👉ప్రతిచోట ఉదయ్ కృష్ణారెడ్డి లాంటి యువకులను బయటకు తీసుకు వస్తాం.
👉సీఎం జగన్ ఆరోగ్య శ్రీ పథకం కింద హాస్పిటల్స్ కు 1200 కోట్లు ఎగ్గొట్టాడు..దేశంలో ఏ ప్రభుత్వం ఈయన విధంగా ప్రతి ఒకరికి 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ సదుపాయం కల్పిస్తాం..కేంద్రం నుంచి నేరుగా పంచాయతీలకు నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం..
ముఖ్యంగా దివ్యాంగులుగా ఉన్న వారికి నెలకు 6000 రూపాయలు పెన్షన్ అందిస్తాం..పూర్తిగా కదలని దివ్యాంగులకు 15వేల రూపాయలు ఇంటివద్ద అందిస్తాం..తల సేమియా లాంటి వ్యాధులు ఉన్నవారికి పదివేల రూపాయలు అందిస్తాం..
జగన్ కడుపు,కడుపు కాదు కంభం చెరువు.. ఎంత తిన్నా సరిపోదు వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ..
కంభం చెరువు 6 వేల ఎకరాలకు నీరు అందిస్తుందన్న పవన్..
టూరిజం స్పాట్ గా కంభం చెరువును రూపొందిస్తే జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వస్తారు..
ఎంతసేపు సీఎం జగన్ తానేదో కూర్చోబెట్టి డబ్బులు ఇస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నారు..
మనమంతా టాక్స్ లు పెరిటా కట్టే డబ్బులే మనకు తిరిగి ఇస్తున్నాడు…జగన్ తన మోచేతి అంబలి తాగేలాగా వ్యవహరిస్తున్నాడు..వృద్ధులకు పెన్షన్ పథకం దామోదర్ సంజీవయ్య ప్రారంభించారు.జగన్ కథలు చెబుతాడు తాను ఇచ్చేవాడిని అంట మనం పుచ్చుకునేవాల్లమంట..
మాగుంట శ్రీనివాసులు రెడ్డి చాలా మంచివారు.. ఆయన నాకు ఎనిమిదో తరగతి చదివేటప్పుడు నుంచి తెలుసు..
ఈరోజు మాగుంట గెలుపుకు కృషి చేసేందుకు గిద్దలూరుకు వచ్చాను..గిద్దలూరు ను టూరిజం హబ్ గా చేయించాలి అని మాగుంటకు సూచన..
ఈ ప్రాంతంలో ఉపాధి లేక యువత వలసవళ్లిపోతున్నారు..
ఎవరో ఒకరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోతారని గిద్దలూరు ప్రజలు ఎ దురుచూస్తున్నారు..
జగన్ కు ఎప్పుడు ఒక పచ్చని మొక్క కొట్టేయడమే తప్ప మొక్కలు పెంచడం తెలియదు..
సీఎం జగన్ ఎప్పుడు భూమిలోని ఖనిజాలను దొబ్బేద్దామని చూస్తుంటారు తప్ప మొక్కలు పెంచడం వంటివి తెలియదు..నేను ఒంగోలులో పెరిగినవాణ్ణి, కనిగిరి లో ఉండి చూసినవాణ్ణి..కష్టాలు ఎలా ఉంటాయో నేను ఉండి చూశాను…
రాజకీయాలలోకి నేను సరదాగా రాలేదు.. 150 కోట్లు పెట్టి పోటీ చేసేందుకు నాయకుల వద్ద డబ్బుంది కానీ.. అదే డబ్బు పెట్టి చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తిచేసే దానికి డబ్బు లేదు.కూటమి తరపున నేను ఈరోజు అశోక్ రెడ్డికి ఓటు వేయమని అడిగేందుకు వచ్చాను.
నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను.. నేను గెలుస్తున్నాను.నేను ఒక పిఠాపురం కోసం పనిచేయడం లేదు 175 నియోజకవర్గాలు 25 అసెంబ్లీ ఐదు కోట్ల మంది ప్రజలకు పనిచేయటానికి అడుగుపెడుతున్నాను.
వెంగయ్య నాయుడుకి కష్టం వస్తే ప్రకాశం జిల్లాకు వచ్చాను.. అలాంటిది మీకు కష్టం వస్తే తప్పక వస్తాను..
వైసిపి ప్రభుత్వం రాగానే బీసీలకు ప్రాధాన్యత తగ్గిపోయింది..ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారు..ల్యాండ్ గ్రావింగ్ ఆక్ట్ పెట్టి మన భూములు మనకు కాకుండా చేయాలని చూస్తున్నారు.
మాగుంట ఎప్పుడు కల్తీ లిక్కరు అమ్మలేదు..
అన్ని వర్గాల వారికి ఈ కూటమి అండగా ఉంటుంది..
జనసేన పార్టీ నాయకులు ఉన్నా కానీ కూటమి అభ్యర్థిగా తాను పోటీ చేస్తానంటే అశోక రెడ్డికి నేను మద్దతు తెలిపాను.ఈ దేశం కోసం నేను చచ్చిపోతా.. నా తెలుగు నేల.. వెనుక పడ్డ మన నేలని ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం…నవరత్నాల ప్లస్ మేనిఫెస్టో ప్రజలకు మరింత ప్రయోజనం……
*ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఆచరణకు సాధ్యం కానీ మేనిఫెస్టోను అబద్ధపు హామీలతో ప్రకటన*…..
బేస్తవారిపేట పట్టణ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు*…..
*రాష్ట్రంలోనే అర్హులకు సంక్షేమ పథకాలు అందించడం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.యస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు*….
శుక్రవారం బెస్తవారిపేట పట్టణంలోని పలు విధుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు, మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు*….
*అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలోనే కులమతాలకు,రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి నవరత్నల సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అందజేశారని తెలిపారు*…
నవరత్నాల ప్లస్ మేనిఫెస్టో ప్రజలకు మరింత అదనపు ప్రయోజనం చేకూర్చలే ఉన్నాయని తెలిపారు.చంద్రబాబు ఆచరణకు సాధ్యం కాని మేనిఫెస్టోను ఎన్నికల సందర్భంగా అబద్ధపు హామీలతో ప్రకటించారు తెలిపారు.ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జగనన్న యధావిధిగా కొనసాగిస్తూ, రానున్న ఎన్నికల్లో మరింత అదనపు ప్రయోజనం కలిగించేలా మేనిఫెస్టో రూపొందించారని ప్రజలకు వివరించారు.గిద్దలూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను,ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బేస్తవారిపేట మండల, పట్టణ వైసీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు*…
👉కంభం అర్బన్ కాలనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయిన మంచినీటి బోర్… యుద్ధ ప్రాతిపదికన రెండు మంచినీటి క్రొత్త బోర్ మోటార్లు ఏర్పాటు*. ప్రకాశంజిల్లా కంభం మండలం కంభం టౌన్ అర్బన్ కాలనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంచినీటి బోర్ కాలిపోయింది. దీంతో కొద్ది రోజులుగా మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది..ఇంకా వర్షాలు కురవకపోవడంతో మంచినీటి బోర్లలో నీరు తగ్గింది. వెంటనే విషయం తెలుసుకున్న కంభం సర్పంచ్ పల్నాటి. బోడయ్య, ఉప సర్పంచ్ సయ్యద్. ఖాసిం, పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి.బ్రహ్మయ్య లు చెరువకట్ట దగ్గర గల నక్కలగండి ఒక కొత్త బోరు మోటార్, అర్బన్ కాలనీలో రెండవ కొత్త బోర్ మోటార్ ఏర్పాటు చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సచివాలయం4 కార్యదర్శి పి.కృష్ణ మోహన్ రెడ్డి, స్థానిక వార్డు మెంబర్లు పార్ష. అంజమ్మ, డాక్టర్ సద్దాం హుస్సేన్, షేక్ ఖాదర్బీ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

7k network
Recent Posts

మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!