సాక్షి టీవీలో హార్ట్ ఎటాక్ అని ప్రసారం చేసింది ఎవరమ్మా?..వదిన భారతి పై షర్మిల కీలక వ్యాఖ్యలు.. చంద్రబాబుని జైల్లో మానసికంగా వేధించారు-శివాజీ..అమరావతి కష్టం.. విశాఖపట్నం బెస్ట్- బాలకృష్ణ చిన్నల్లుడు..ప్రజల సొమ్ము తినడానికి రాలేదు అన్నా!

👉వివేకా హత్య.. వదిన భారతిపై షర్మిళ సంచలన వ్యాఖ్యలు! సాక్షి టీవీలో హార్ట్ ఎటాక్ అని ప్రసారం చేసింది ఎవరమ్మా ?

సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచార కార్యక్రమాలు వేడెక్కిపోతున్నాయి.ఈ సందర్భంగా ప్రధానంగా వివేకా హత్య కేసు ప్రస్థావిస్తూ వైఎస్ షర్మిళ చేస్తున్న విమర్శలు పీక్స్ కి చేరుకుంటున్నాయి.ఎన్నికల ప్రచారంలో భాగంగా వివేకా హత్య కేసు ప్రస్థావన వద్దని కోర్టు చెప్పినా షర్మిళ తగ్గడం లేదు! మైకందుకున్న ప్రతీ సారీ అవినాష్ రెడ్డి లక్ష్యంగా వివేకా హత్యకేసు ప్రస్థావన తెస్తున్నారు! ఈ క్రమంలో తాజాగా భారతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిళ! అవును… వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా…వివేకా హత్య కేసు ప్రస్తావనను మరోసారి తీసుకువచ్చారు. ఈ క్రమంలో…వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి రూ.40 కోట్లు చేతులు మారాయంటూ ఆమె ఆరోపించారు.వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు.ఇదే సమయంలో…అవినాష్ ని చిన్నపిల్లాడు అని జగన్ అంటున్నారని గుర్తుచేసిన షర్మిళ…వీళ్లు చిన్నపిల్లలు కాదని అన్నారు. హత్య జరిగిన రోజున ఎవరు చంపారనేది తమకు కూడా తెలియదని, అయితే.. సీబీఐ వచ్చి, ఎంక్వైరీ చేసి..అవినాష్ రెడ్డి హస్తం ఉందని సాక్ష్యాలు, ఆధారాలన్నీ చూపిస్తుందని అన్నారు.ఇదే సమయంలో… చంపినవాళ్లూ, చంపించిన వాళ్లూ కూడా హత్యకు ముందు రోజు ఫోన్లు మాట్లాడుకున్నారని తెలిపారు షర్మిళ! ఇదే క్రమంలో… గొడ్డలితో ఏడు సార్లు నరికితే వివేకానందరెడ్డి ఎముకలు బయటకు వస్తే,ఆయన మెదడు బయటకు వచ్చిందంట,ఇల్లంతా రక్తం అయిపోయిందంట, అయినప్పటికీ ఆ రోజు సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు.అది ఎవరమ్మా…జగన్ మోహన్ రెడ్డి భార్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిళ! ఇదే సమయంలో…నాడు అలా ప్రసారం చేయడానికి గల కారణాలు ఇప్పటికీ చెప్పలేదు అని షర్మిళ అన్నారు.

👉 చంద్రబాబుని జైల్లో మానసికంగా వేధించారు’..

శివాజీ సంచలన వ్యాఖ్యలు! అయితే..అతనిపై భౌతిక దాడి చేయలేదు కానీ.. మానసికంగా దారుణంగా హింసించారంటు సినీనటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడం, ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచడం తెలిసిందే.ఆ సమయంలో చంద్రబాబు ఇంటి నుంచి భోజనం,మెడిసిన్స్ ఏర్పాటు చేశారు.అయితే.. అతనిపై భౌతిక దాడి చేయలేదు కానీ.. మానసికంగా దారుణంగా హింసించారంటు సినీనటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవును… గత ఏడాది సెప్టెంబర్ లో టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడం, ఆయనకు కోర్టు సుమారు రెండు నెలల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించడం తెలిసిందే.ఈ సమయంలో ఆయనను మానసికంగా వేదించారంటూ.. తాజాగా ఒక ఇంటరాక్షన్ లో పాల్గొన్న సందర్భంగా శివాజీ తెలిపారు.ఈ విషయం ఇంకెవరికీ తెలియదని అన్నారు! ఈ సందర్భంగా మాట్లాడిన శివాజీ… “చంద్రబాబు 74 ఏళ్ల యువకుడు..శీతాకాలం ఎక్కువగా ఉన్న రోజుల్లో అతన్ని సీఐడీ అరెస్టు చేసింది. నాకు తెలిసి మీకెవరికీ తెలియని ఒక విషయం ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు మానసికంగా వేధించబడ్డారు..ఈ విషయం ఒక కానిస్టేబుల్ ద్వారా నాకు తెలిసింది” అని అన్నారు. ఇందులో భాగంగా… “చంద్రబాబు 74ఏళ్ల వయసులొ జైల్లో ఉన్నప్పుడు ఆయనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు.వెస్ట్రన్ కమోడ్‌ ను తొలగించి, ఉద్దేశపూర్వకంగా దాని స్థానంలో ఇండియన్ టాయిలెట్‌ ని పెట్టారు.ఈ రోజుల్లో 25-30 ఏళ్ల వారు కూడా ఇండియన్ టాయిలెట్లు ఉపయోగించలేకపోతున్నారు కానీ…చంద్రబాబు ఆ వయసులో వాటిని వాడుకునేలా చేశారు.. స్నానానికి చల్లటి నీళ్లు ఇచ్చారు..” అంటూ సంచలన ఆరోపణలు చేశారు!

👉అమరావతి కష్టం.. విశాఖపట్నం బెస్ట్ అంటున్న బాలకృష్ణ చిన్నల్లుడు!

అమరావతిని రాజధానిగా డెవలప్ చేయాలంటే చాలా టైమ్ పడుతుంది. దాని కంటే అన్నింటికీ అనువైన వైజాగ్‌ని రాజధానిగా అభివృద్ధి చేసుకోవడం మంచిదన్న విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి గీతం భరత్.. జగనన్న నిర్ణయానికి జైకొడుతున్న టీడీపీ.. ఇక వైజాగ్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మీ గెలుపు లాంఛనమే! అని వైకాపా వర్గాలు భావిస్తున్నాయి.

👉పిఠాపురంలో ఉద్రిక్తత.. మెగా హీరోపై బీరు సీసాలతో దాడి!మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన మేనమామ పవన్ కళ్యాణ్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సాయి ధరమ్ తేజ్ పై.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీరు సీసాలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో సాయి తేజ్ తృటితో తప్పించుకోగా.. ఆయన పక్కనే ఉన్న జనసేన కార్యకర్త శ్రీధర్ తీవ్రంగా గాయపడ్డాడు.దీంతో శ్రీధర్ ని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.కాగా, సాయి తేజ్ పై బీరు సీసాలు,రాళ్లతో దాడికి పాల్పడింది అధికార పార్టీ వైసీపీ వర్గీయులు అని ప్రచారం జరుగుతోంది.మెగా హీరో ప్రచారం నిర్వహిస్తున్న చోటుకి కొందరు వైసీపీ వర్గీయులు వచ్చి ‘జై జగన్’ నినాదాలతో ఈ దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు.

👉(పెద్దారవీడు) గొబ్బూరు వద్ద రోడ్డు ప్రమాదం.

తెల్లవారుజామున ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.ప్రమాదంలో మార్కాపురంకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి…మృతులు రామకృష్ణ, సిద్దయ్య గా గుర్తింపు.ప్రకాశం జిల్లా.మార్కాపురం మండలం మాల్యవంతునిపాడు గ్రామం లో రాత్రి పిడుగు పడి సుమారు వంద గొర్రెలు మృతి.8.లక్షల ఆస్తి నష్టం. గొర్రెల కాపరులు కాయ కాకుల తిరుపతయ్య మాదాల నరసయ్య,గంగుల శేఖర్ మాదాల పుల్లయ్య..

👉ప్రజలకు రక్షణగా ఉంటానే తప్ప – తప్పుడు విధానాలకు పాల్పడను..మీరు ఇచ్చే పదవితో మీ కోసమే పనిచేయడం నా లక్ష్యం..ప్రతి పక్ష నాయకులు చెప్పేటట్టు కులం కాదు గుణం చేసి ఓటెయ్యండి..ఎవ్వరిని ఇబ్బంది పెట్టె వ్యక్తిని కాదు..అవతలి వ్యక్తికి – అన్నా రాంబాబుకి బేరిజు వేసుకొని ఆశీర్వదించండి.

ప్రజల సొమ్ము దోచుకోవడానికి కానీ…పెత్తనం చెలాయించడానికి కానీ… ఎక్కడా ఆస్కారం ఇవ్వకుండా…కేవలం ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నానని మార్కాపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అన్నా రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం పొదిలి మండలంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు.ప్రజలు ఇచ్చిన పదవి ద్వారా ప్రజల కోసం పనిచేయాలన్న లక్ష్యంతోనే ఇప్పటి వరకు ముందుకు పోయానన్నారు.రాబోయే రోజుల్లో మార్కాపురం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఇస్తే అదే విధానాన్ని ఖచ్చితంగా అవలంభిస్తానని చెప్పారు. ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి కులాన్ని చూసి ఓట్లు వెయ్యండి అంటున్నారు.నేను చెప్పేది మాత్రం కులాన్ని కాదు… గుణాన్ని చూసి ఓటేయ్యండి అలోచించి వెయ్యండని అభ్యర్థిస్తున్నాను. నేను దోపిడీ దారుడిని కాదు… గ్రామాల్లో చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే వ్యక్తిని కాదు…తప్పుడు కేసులు పెట్టె వ్యక్తిని కాదు… లంచాలు తీసుకోను..ప్రజల సొమ్ము కాపాడుతాను… ప్రజలకు రక్షణగా ఉంటానే తప్ప.. తప్పుడు విధానాలకు పాల్పడే వ్యక్తిని కాదు..బేరీజు వేసుకొండన్నారు.అవతలి వారికీ… అన్నా రాంబాబు ఎలాంటి వ్యక్తి బేరీజు వేసుకొని ఆశీర్వదించి ఆశీస్సులు అందించి మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించండి అని అభ్యర్థించారు.కావున రానున్న ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గ ప్రజలు తమ అమూల్యమైన రెండు ఓట్లను అన్నా రాంబాబుకి,చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వేసి వేయించాలని కోరారు.

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి