మోడీ సార్ : ఓన్లీ డైలాగ్స్.. నో యాక్షన్!!!..చిరంజీవికి రాజకీయం అంటే బిజినెస్-పోసాని..టిడిపి వైసిపి జనసేన ప్రజలను మోసం చేస్తున్నారు..కాంగ్రెస్ అభ్యర్థి ఈద..మాగుంట సమక్షంలో టిడిపిలో చేరికలు..జిల్లా వైద్యశాఖాధికారి ఆకస్మిక తనిఖీ.

మోడీ సార్ : ఓన్లీ డైలాగ్స్.. నో యాక్షన్ ..!?

దాంతో ఏలూరు సభకు ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన నరేంద్ర మోడీ అప్పటి సీఎం చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేశారు.ఏపీకి వచ్చినప్పుడల్లా మోడీ అమిత్ షాలు అధికార పార్టీ మీద నిప్పులు చెరుగుతూ ఉంటారు. అదీ ఎన్నికల వేళలో అయితే ఇంకాస్తా జోరు పెంచుతారు. తీరా ఎన్నికల తరువాత చూస్తే అంతా మామూలుగా ఉంటుంది. ఇది ఏపీ ప్రజలకే కాదు తెలుగు ప్రజలకూ అనుభవంగానే ఉంటోంది. 2019లో టీడీపీ మోడీకి ఎదురు నిలిచి పోటీ చేసింది. దాంతో ఏలూరు సభకు ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన నరేంద్ర మోడీ అప్పటి సీఎం చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేశారు.అవినీతి కుటుంబ పాలన అని హాట్ కామెంట్స్ చేశారు. పోలవరం ఏటీఎం లా చేసి అవినీతి సొమ్ము దోచుకున్నారని కూడా నిందించారు.సీన్ కట్ చేస్తే ఇదే చంద్రబాబు ఇపుడు మోడీ పక్కన ఉన్నారు.2024 ఎన్నికల్లో మోడీ వైసీపీ మీద ఘాటు విమర్శలు చేస్తున్నారు. వైసీపీ అవినీతి సర్కార్ అంటున్నారు. మాఫియా పాలన అంటున్నారు.గూండా రాజ్ అని కూడా విమర్శిస్తున్నారు.అమిత్ షా కూడా ఇదే రకంగా విమర్శలు చేసి వెళ్లారు.ఈ ప్రభుత్వం మీద చర్యలు ఉంటాయని అంటున్నారు. అందరికీ ట్రీట్మెంట్ ఉంటుందని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీలోనూ కేంద్రంలోనూ ఏర్పాటు అయ్యాక ప్రతీ మాఫియాకూ ట్రీట్మెంట్ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.ఇదే రకంగా తెలంగాణాలోనూ మోడీ మాట్లాడారు,కేసీఆర్ సర్కార్ అవినీతిమయం అన్నారు. యాక్షన్ తీసుకుంటామని అన్నారు.కానీ ప్రజలే ఆ ప్రభుత్వాన్ని దించారు తప్ప కేంద్రం నుంచి ఏ రకమైన యాక్షన్ లేదు.లిక్కర్ స్కాం లో కవితను అరెస్ట్ చేయడం సంగతి పక్కన పెడితే పదేళ్ళ పటు పాలించి తెలంగాణాను దోచేశారు అని బీఆర్ఎస్ నేతల మీద మోడీ అమి షా చేసిన కామెంట్స్ వాటి మీద చర్యలు ఏవీ అని అంతా చర్చించుకున్న సందర్భం ఉంది. తెలంగాణాలో కేసీఆర్ పదేళ్ల పాటు రాజ్యం చేస్తే కేంద్రంలో మోడీ కూడా అధికారం చలాయిస్తున్నారు.మరి ఎన్నికల సభలలోనే విమర్శలు చేయడం తప్ప ఎందుకు యాక్షన్ కి దిగలేకపోయారు అన్నది సగటు జనంలో ప్రశ్నలుగానే ఉన్నాయి.ఇక ఏపీలో చూస్తే 2014 నుంచి 2018 దాకా చంద్రబాబు మిత్రుడుగా ఎన్డీయేలో ఉన్నారు. పోనీ అలా చూసీ చూడనట్లుగా వదిలేసారు అనుకున్నా 2018 తరువాత ఆయన బయటకు వచ్చి మోడీ ప్రభుత్వం మీద యుద్ధం చేశారు కదా ఏపీలో అవినీతి జరుగుతోందని బీజేపీ పెద్దలు పదే పదే చెప్పారు కదా. దాని మీద విచారణ కానీ ఏదైనా చేశారా అంటే లేదు. పోనీ 2019లో రెండవసారి అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు అయిదేళ్ళ పాలన మీద విచారణ చేశారా అంటే అదీ లేదు. తీరా ఎన్నికల ముందు ఆయన్ని ఎన్డీయే జట్టులో చేర్చుకుని బాబు భేష్ అంటున్నారు.అంటే తాము చెప్పిన మాటలు అన్నీ తూచ్ అని జనాలు అనుకోవాలనా అన్నది బీజేపీ పెద్దలు చెప్పాల్సి ఉంది అంటున్నారు. ఇపుడు చూస్తే అయిదేళ్ల వైసీపీ పాలన అవినీతి మయం అక్రమాల మయం అయినపుడు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఇన్నాళ్ళూ ఏమి చేస్తోంది అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం.కేంద్రం తన వద్ద నున్న దర్యాప్తు సంస్థలతో ఏపీలో జరుగుతున్న అవినీతి మీద ఎందుకు విచారణకు ఆదేశించలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. పోనీ కేంద్రానికి ఈ విషయాలు సరిగ్గా తెలియవు అనుకుంటే గత ఏడాది బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ గా నియమితురాలు అయిన దగ్గుబాటి పురంధేశ్వరి ఏపీలో లిక్కర్ స్కాం అని ఏకంగా కేంద్రానికి అతి పెద్ద ఫిర్యాదు చేశారు. అలాగే అనేక రకాలైన ఆరోపణలతో ఆమె ఒక నోట్ ని సమర్పించారు. మరి ఆనాడు మాట్లాడకుండా కనీసంగా కూడా రెస్పాండ్ కాకుండా తీరా ఎన్నికల వేళ వైసీపీ అవినీతి చేసింది అని కొత్త మాటగా పాత విషయాలను చెప్పడం అంటే ఏమనుకోవాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. తాము ఏమి చెప్పినా జనాలు వింటారు అన్నది ఒక ధోరణిగా బీజేపీ పెద్దల విషయంలో కనిపిస్తూంటే మరోటి ఏంటి అంటే ఏపీని ఏపీ రాజకీయ పార్టీలను తమ గుప్పిట పెట్టుకోవడం కోసమే ఈ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు అని అంటున్నారు. వామపక్ష నేతలు ఈ విధంగానే మోడీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ఏపీలో రాజకీయాన్ని తమ గుప్పిట పెట్టుకుని ఒక్క సీటూ తమకు లేకపోయినా ఆటాడించడానికే ఇదంతా చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు. మరి మోడీ ఎన్నికల వేళ చేస్తున్న గంభీర ప్రకటనలు హెచ్చరికలు చూసిన వారు ఏమనుకుంటున్నారు. సీరియస్ గా తీసుకుంటున్నారా అంటే ఆలోచించాల్సిందే. ఏది ఏమైనా ఏపీలో అవినీతి గత పదేళ్ళుగా రెండు ప్రభుత్వాలలో సాగింది అని మోడీయే 2019, 2024లలో ఏకంగా బహిరంగ సభలలోనే ప్రకటించారు. వివక్ష లేకుండా తన తర భేదాలు లేకుండా ఏపీలో పదేళ్ల పాలనలో చోటు చేసుకున్న అవినీతి మీద ఈసారి అధికారంలో వచ్చిన తరువాత అయినా సమగ్రమైన విచారణ జరిపించి అవినీతిలో చిక్కుకున్న ప్రజల సొమ్ముని బయటకు తెస్తేనే బీజేపీ పట్ల జనాలకు నమ్మకం కుదురుతుంది అని అంటున్నారు.

👉చిరంజీవికి రాజకీయం అంటే బిజినెస్… పోసాని సంచలన వ్యాఖ్యలు!ప్రధానంగా ప్రచార కార్యక్రమాలు, ఆ సభల్లో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోతుంది. ఎలక్షన్ కోడ్ రావడానికీ, పోలింగ్ తేదీకీ ఈసారి కాస్త ఎక్కువ సమయం ఉండటంతో ఏపీలో రాజకీయాలు గతంలో అంత హాట్ హాట్ గా లేవనే కామెంట్లు వినిపించాయి! అయితే… నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.. పోలింగ్ కి కౌంట్ డౌన్ మొదలవ్వడంతో ఏపీ రాజకీయాల్లో అసలు సిసలు రసవత్తరత మొదలైపోతుంది. ప్రధానంగా ప్రచార కార్యక్రమాలు, ఆ సభల్లో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోతుంది. కాకపోతే గతంలో ప్రత్యర్థులు ప్రజలకు మేలు చేసిందేమీ లేదని విమర్శిస్తూ ఎన్నికల్లో ఓట్లు అడిగేవారు.. ఇప్పుడు జగన్ మాత్రం తన వల్ల మేలు జరిగితేనే ఓటు వేయమని కోరుతున్నారు. అది తప్ప మిగతా రచ్చ రచ్చ అంతా కామన్ గానే సాగుతుందని అంటున్నా ఆ సంగతి అలా ఉంటే… పిఠాపురంలో పవన్ ను గెలిపించాలని.. అతడు మంచి చేస్తాడని.. చట్టసభల్లో ప్రజలకోసం పోరాడతాడని, అవసరమైతే కలబడతాడని.. ఇంట్లో ఆఖరి వాడిగా పుట్టినా ప్రజలకు మేలు చేసేవిషయంలో ముందుంటాడని.. అందువల్ల పిఠాపురం ప్రజలు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి పవన్ కల్యాణ్ ని గెలిపించాలని కోరుతున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో… పిఠాపురంలో జనసేనానికి మెగాస్టార్ మద్దతు కూడా లభించినట్లే అనే విషయంపై స్పష్టత వచ్చేసింది. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళి స్పందించారు. ఇందులో భాగంగా… పవన్‌ ను గెలిపించమని చిరంజీవి ఎలా అడుగుతారు? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో… ప్రజారాజ్యం పార్టీ నాటి విషయాలనూ గుర్తు చేశారు! అవును… పవన్ కు ఓటు వేయాలని కోరుతూ పిఠాపురం ప్రజలను చిరంజీవి కోరడంపై పోసాని స్పందించారు. ఇందులో భాగంగా… చిరంజీవికి ప్రజలంటే లెక్కలేదని.. ప్రజాసేవ అంటూ పార్టీ పెట్టి మూసేశాడని.. సినిమాల్లాగే రాజకీయాల్ని ఆయన వ్యాపారంలా చూశాడని.. అందుకే 18మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి అమ్మేశాడని అంటూ పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 👉ఇదే క్రమంలో… 18 ఎమ్మెల్యేలను ఇచ్చినప్పటికీ చిరంజీవి ఏనాడైనా రాష్ట్ర ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించారా? అని ప్రశ్నించిన పోసాని.. ఇప్పుడు పవన్‌ ని గెలిపించమని ఎలా అడుగుతారంటూ ఫైరయ్యారు. ఒకప్పుడు దేశం మొత్తం మీద ఒకటి తెలంగాణలో, మరొకటి యూపీలో రెండే రెండు ఎంపీ సీట్ల నుండి బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు పోసాని.దాని కారణం అప్పట్లో వాజ్‌ పేయి,అద్వానీ కష్టపడి పనిచేసిన విధానం అని.. ప్రజాసేవపై వారికున్న కమిట్ మెంట్ ఫలితం అని అన్నారు! కానీ 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ చిరంజీవి మాత్రం తన పార్టీని కాంగ్రెస్‌ లో కలిపేశారని..ఇక రాజకీయాల్లోకి రానని చెప్పి, ఇప్పుడు మళ్ళీ జనసేన తరపున ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. నాడు ప్రజారాజ్యం సమయంలో చిరంజీవిని నమ్మిన ఎంతోమంది కాపుల్లు బలైపోయారని.. అనంతరం వారికి వారే నచ్చచెప్పుకుని కాస్త కుదురుకున్నారని పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. !

👉వైసిపి టిడిపి జనసేన ఆంధ్ర ప్రజల చెవిలో బీజేపీ పువ్వు పెడుతున్నారు ఒంగోలు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఈద. పొదిలి..

రాష్ట్రంలో వైసిపి టిడిపి జనసేన ఎవరికి ఓటేసినా అది కేంద్రంలో బిజెపికే పోతుందని కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పది సంవత్సరాల కాలంలో కేంద్రంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు జగన్లు ప్రజలు మోసం చేశారని విమర్శించారు. 10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, 2014లో అధికారంలోకి వచ్చిన బిజెపి దాన్ని అమలు చేయలేదన్నారు. 10 సంవత్సరాల క్రితం ఎన్నికల హామీలో భాగంగా తిరుమల వెంకన్న సాక్షిగా ఆయన పాదాల చెంత తిరుపతి సభలో మోడీ రాష్ట్రానికి పది సంవత్సరాలు పాటు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. పోలవరాన్ని కేంద్రమైన నిర్మిస్తుంది అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకమైన నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తానన్న మోడీ కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసే లేదన్నారు. ఆనాడు ఈనాడు కూటమిలో ఉన్న టిడిపి జనసేన మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను మోడీకి తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో చంద్రబాబు ఆంధ్ర ప్రజలు మోసం చేశారన్నారు. ఆనాడు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరాన్ని, ఆది కాదని చంద్రబాబు కమిషన్ కోసం కక్కుర్తి పద్దరన్నారు. ఆనాటి హామీ అమలు చేయక పోగా 2019 నాటికి తనకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ప్రగల్బాల్ పలికిన జగన్మోహన్ రెడ్డి తన కేసుల కోసం మరోసారి దానిని మోడీ కాళ్ల దగ్గర సాగిలపడ్డ రన్నారు. దశల వారి సంపూర్ణ మద్య నిషేధం, అమరావతిలో రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన జగన్ వాటిలో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ప్రత్యేక హోదా కోసం ఐదేళ్ల కాలంలో ఏ ఒక్కరోజు కూడా మోడీని గాని అమిషాను గాని అడిగిన దాఖలాలు లేవన్నారు. పోలవరం కాపర్ డ్యాం కొట్టుకుపోయినా,మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఏ మొక్కను బాగు చేయలేదన్నారు. రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా చెప్పుకోవడం ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రమన్నారు. బినామీ కంపెనీలు పెట్టి సొంతంగా మద్యం వ్యాపారం చేస్తూ వచ్చే ఆదాయం అంతా తన సొంత జోబులో నింపుకుంటున్నారని విమర్శించారు.రాష్ట్రంలో పాలనలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథంలో ల్యాండ్, శాండు, మైన్స్, వైన్స్ మాఫియా జరుగుతుందన్నారు. నకిలీ మద్యంతో రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలను జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. నకిలీ బ్రాండ్ మద్యం తాగి కొన్ని వేల మంది యువకులు కిడ్నీలుదెబ్బతిని అనారోగ్యాలతో మన కళ్ళ ముందే చనిపోతున్న విషయాన్ని గమనించాలన్నారు. రాష్ట్రంలో ఇసుకను కొల్లగొట్టి వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలులక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారన్నారు. ఈ జిల్లాల్లో చీమకుర్తి గ్రానైట్ క్వారీ లను ఎంపీలు ఎమ్మెల్యేలు దోచుకున్న విషయం అందరికీ తెలుసు అన్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న జగన్ సాక్షి క్యాలెండర్ ను మాత్రం రిలీజ్ చేస్తున్నారన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో రెండు లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఏ ఒక్క పోస్టు భర్తీ చేయలేదని విమర్శించారు. ఈ జిల్లాలో ఇతర జిల్లాల నుంచి ఎర్రచందనం స్మగ్లర్లను పోటీకి దింపుతున్నారని వీరు సంపద దోపిడీకి వచ్చారన్నారు. కాంగ్రెస్ మార్కాపురం అభ్యర్థి జావిద్ అన్వర్ మాట్లాడుతూ తాను గత 20 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉంటూ స్వచ్ఛందంగా అందరికీ అందుబాటులో ఉంటున్నాను అన్నారు. దేశ భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా ఒంగోలు పార్లమెంటు సుధాకర్ రెడ్డిని, మార్కం అసెంబ్లీకి తనను హస్తం గుర్తుపై ఓటు వేసి మెజారిటీ గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

👉జిల్లా వైద్యశాఖాధికారి ఆకస్మిక తనిఖీ..ప్రకాశం జిల్లా బేస్టవారిపేట మండలము బేస్టవారిపేట ప్రాదమిక అరోగ్య కేంద్రం ను జిల్లా వైద్యశాఖాధికారి సురేష్ లేబర్ రూమ్ ను ఇంజెక్షన్ రూమ్ ను మందులు ఇచ్చు రూమ్ ను రక్త పరీక్ష రూమ్ లను పరీ సీలించి తగు సూచనలను వివరించారు అంతే కాకుండా అక్కడికి వచ్చిన రోగులకు అందుతున్న సౌకర్యలను మంచి నీరు మొదలగునవి అడిగి తెలుసుకొన్నారు మీడియా ద్వారా ప్రజలను అవసరమైన పనులను త్వరగా పనులు చేసుకుని ఏoడ లో ఏ క్కువ సేపు తిరగ వద్దని, వడ దెబ్బ కు గురి కావద్దని తెలియ చేసారు ద్రవ పదార్థాలను ఏ క్కువగా సేవించా లని మరియు దగ్గరి లో వున్న హెల్త్ వెల్నెస్ సెంటర్ లను దగ్గర లొ వున్న ప్రాదమిక అరోగ్య కేంద్రం లను ఉపయోగించు కోవలని జిల్లా ప్రజలకు తెలియ చేసారు

👉నంద్యాల.. ప్రతాప్ థియేటర్ వద్ద దారుణం …మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ..బీరు బాటల్ తో యువకుని పై దాడి పగిలిన బీర్ బాటిల్తో గొంతుపై పొడిచి హత్యాయత్నం….గాయపడిన యువకుని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు…సంఘటనా స్థలానికి చేరుకునీ దర్యాప్తు చేపట్టిన వన్ టౌన్ పోలీసులు….

👉 ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో శింగరాయకొండ మండలం శింగరాయకొండ గ్రామానికి చెందిన పామర్తి మాధవరావు, విజయ్ కుమార్, ప్రదీప్ కుమార్, కిరణ్ కుమార్, చదేళ్ల రమేష్, చిలకపాటి జనార్దన్ మునగాల వెంకటేశ్వర్లు, ఛాంబతి అనిల్, సన్నబోయిన సాయి, ఉడత మణి సుబ్బారావు, బెల్లం రాజు, మాదాల పరమేశ్వరరావు, మద్దిసాని బ్రహ్మయ్య గారు మరియు 15 కుటుంబాలు వైస్సార్సీపీ పార్టీ ని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరినారు, ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు వారిని కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించినారు .

👉 ఒంగోలు లోని మాగుంట కార్యాలయం లో మాజీ యం. పి. పి ఎన్నాబత్తిన మురళి ఆధ్వర్యంలో లో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి సమక్షం లో నేడు సోమరాజుపల్లె గ్రామానికి చెందిన 40 కుటుంబాలు అర్రేబోయిన మరియు వేల్పుల కుటుంబాలు వై. యస్. ఆర్. సి. పి ని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది వారిని కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది.

👉 మార్కాపురం లోని సౌజన్య కల్యాణ మండపం లో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన మహిళా నాయకులు, మహిళా కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి,వారి సతీమణి చందన రెడ్డి, మార్కాపురం శాసనసభ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి వారి సతీమణి కందుల వసంత లక్ష్మి ఈ కార్యక్రమం లో పలువురు మహిళా సంఘాల నాయకులు, కార్యకర్తలు, ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి సమక్షం లో ముండ్లమూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన 15 కుటుంబాలు నేడు కొర్రపాటి శ్రీనివాస రావు మరియు వెంకటేశ్వర రావు ఆధ్వర్యం లో వై. యస్. ఆర్. సి. పి ని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది,

7k network
Recent Posts

మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!