ప్రధాని మోదీ జగన్ ఊసేది?..రేవంత్ ను అమిత్ షా భయపెడుతున్నాడా?..రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలతో ఆడుకోవడం దుర్మార్గం-జగన్..నడ్డాపై కేసు ..రేవంత్ కేసుకు కౌంటరా?..విస్తృత ప్రచారంలో మాగుంట కుటుంబం..జాతీయ క్రీడాకారులకు సన్మానం..రూ.8.5 కోట్ల నగదు సీజ్‌

👉ప్రధాని మోదీ  ప్రసంగంలో జగన్ ఊసేది?. మోదీ ఏపీలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పలు సభల్లో పాల్గొన్న ప్రధాని ఏపీ ప్రభుత్వంపై జగన్ పేరెత్తకుండా విమర్శలు చేశారు. గతంలో కూటమి ప్రచారంలోను మోదీ జగన్ పై కాకుండా మంత్రులు, ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు.ఇప్పుడేమో తాజాగా ఓ అడుగు ముందుకేసి టీడీపీ,జనసేన నాయకులు కోరుకున్నట్లుగా వైసీపీ ప్రభుత్వాన్నయితే విమర్శించారు. కానీజగన్ ప్రస్తావన లేదు.

ఏపీలోను డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని మోదీ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదల కోసం కాకుండా మాఫియా కోసం పనిచేస్తుందని విమర్శించారు. అన్నమయ్య జిల్లా పీలేరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ..ఏపీలో ఎన్డీయే కూటమి, డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందన్నారు. అనేక ఖనిజాలు,దేవాలయాలు కలిగిన నేల రాయలసీమని.. ఈ ప్రాంతంలో చైతన్యవతంమైన యువత ఉందన్నారు.ఇక్కడ ఓ ఆసక్తికర అంశం ఏంటంటే.. జగన్ పేరు లేకుండా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రధాని మోదీ.. తన ఎన్నికల ప్రసంగంలో టీడీపీ పేరు మాత్రం ప్రస్తావించడం లేదు. అలా అని భాగస్వామి జనసేనను తలచుకోవడం లేదు. ఎంత వరకు ఎన్డీయే, బీజేపీ గురించి మాత్రమే చెబుతున్నారు. అటు టీడీపీ, ఇటు జగన్ ఈ రెండు పేర్లు లేకుండా ప్రధాని మోదీ చాలా వ్యూహాత్మకంగా ఏపీలో పర్యటిస్తున్నారు.ప్రధాని మోదీ మాటల మాంత్రికుడు అనే విషయం అందరికీ తెలిసిందే. అందులో ప్రధాని ప్రసంగం అంటేనే తీవ్రమైన కసరత్తులు జరుగుతాయి.ఆయన ఎన్నికల ముందు ఎన్నో  హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను అబద్ధపు హామీలతో మోసగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి . అయితే మోదీ టీడీపీ ప్రస్తావన తీసుకురాకపోవడం వెనుక రాజకీయ కోణం ఉందని విశ్లేషణలు మొదలయ్యాయి. ఎందుకంటే ఏపీలోని రెండు పార్టీలు టీడీపీ, వైసీపీ తమకు అనుకూలంగా వ్యవహరించేవే. ఈ సమయంలో ఇద్దరితో వైరం పెంచుకోవాలని మోదీ భావించడం లేదు. ఒకవేళ ఎన్నికల తర్వాత ఆయా పార్టీలతో అవసరం వస్తే ముందు జాగ్రత్త చర్యగా ప్రధాని ప్రచారం సాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

👉 నడ్డాపై కేసు .. రేవంత్ కేసుకు కౌంటరా ? దాంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కు నోటీసులు జారీ చేసి తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు.ముస్లిం రిజర్వేషన్ల మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మార్పింగ్ చేసి రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పినట్లు తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఆ పోస్టు వచ్చిన నేపథ్యంలో బీజేపీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ పై కేసులు నమోదు చేశారు. దాంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కు నోటీసులు జారీ చేసి తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు.ఎన్నికల నేపథ్యంలో తాను హాజరు కాలేనని రేవంత్ సమాధానం ఇచ్చాడు.ఈ విషయంలో కోర్టుకు వెళ్లగా కోర్టు కూడా నాలుగు వారాల గడువు విధించింది.అయితే మే5న బీజేపీ ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. అది ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని బెంగుళూరు పోలీసులు ట్విట్టర్ ఎక్స్ కు వెళ్లడించారు.అదే రోజు బెంగుళూరు డీజీపీ కార్యాలయం ఆ ట్వీట్ మీద విచారణకు ఆదేశించింది.ఈ మేరకు బెంగుళూరు హైగ్రౌండ్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదయింది. ముస్లింలకు వ్యతిరేతకంగా ఉన్న ట్వీట్‌పై వివరణ ఇవ్వాలంటూ బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డాకు, బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాళవియా, బీజేపీ స్టేట్‌ ప్రెసిడెంట్‌ బీవై విజయేంద్రకు సమన్లు జారీచేశారు బెంగళూరు పోలీసులు. వారం రోజుల్లో తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. బెంగుళూరు పోలీసులు నడ్డాకు సమన్లు జారీచేయడం వెనక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ మీద నమోదయిన కేసుకు కౌంటర్ అని భావిస్తున్నారు.కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ మార్ఫింగ్ వీడియోలు పోస్ట్ చేయడం మూలంగానే ఇరుక్కున్నాయి. దీంతో బీజేపీ పెట్టిన కేసుకు కౌంటర్ గా బెంగుళూరులో నడ్డా మీద కేసు పెట్టినట్లు భావిస్తున్నారు. ఈ వార్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ గా మారిందని అంటున్నారు. తెలంగాణలో కేసు పెడితే అది ఖచ్చితంగా కౌంటర్ అని భావించే బెంగుళూరులో కేసు పెట్టించినట్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో వేచిచూడాలి.

👉 రేవంత్ ను అమిత్ షా భయపెడుతున్నాడా ?..

“అమిత్ భాయ్ నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.దానికి మినిస్ట్రీ ఆఫ్ హోమం అఫైర్స్ ను ఉపయోగించుకుంటున్నాడు “అమిత్ భాయ్ నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.దానికి మినిస్ట్రీ ఆఫ్ హోమం అఫైర్స్ ను ఉపయోగించుకుంటున్నాడు. ఒక రాజకీయ పార్టీ వ్యతిరేకంగా మార్ఫింగ్ వీడియో తయారు చేస్తే , ఒక రాజకీయ పార్టీ లేదా నాయకుడు,లేదా సంబంధిత రాజకీయ పార్టీ ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. కానీ ఈడీ మరియు సీబీఐని ఉపయోగించినట్లుగా వారు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కోర్టుకు నా ట్విట్టర్ అకౌంట్ల వివరాలు ఇచ్చాను.సోషల్ మీడియా యుగంలో ఇష్టారాజ్యంగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.అందుకు ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసి నోటీసులు పంపుతున్నారు.ఇది సరైనది కాదు’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన మార్ఫింగ్ వీడియోకు సంబంధించి రేవంత్ కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.తాజాగా ఎఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ తనను కేంద్ర హోంమంత్రి భయపెట్టాలని చెప్పడం సంచలనం రేపుతున్నది.అదే సమయంలో రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి కూడా రేవంత్ స్పందించాడు.పీఎం పదవిలో ఉండి నరేంద్రమోడీ అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు. రాహుల్‌గాంధీ ఎలాంటి వాడో ప్రపంచానికి తెలుసు. అతను నిజాయితీపరుడు.వారి ఇంట్లో ముగ్గురు ప్రధానులు ఉన్నారు. అయినా ఆయనకు సొంత ఇల్లు లేదు.మోడీ ప్రధానమంత్రి పదవిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే అది అతనికి సరిపోదు’ అని వ్యాఖ్యానించడం విశేషం.

👉 మీ రాజకీయం స్వార్థం కోసం మైనార్టీల జీవితాలతో ఆడుకోవటం దుర్మార్గం:కళ్యాణదుర్గంలో బహిరంగ సభలో సీఎం జగన్..

ఆరు నూరైన నూరు ఆరైనా మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండితీరాల్సిందే,ఇది మీ వైయస్ఆర్ బిడ్డ మాట..ఇలా మోదీ ముందు చంద్రబాబు మాట్లాడగలడా? మైనార్టీ రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పిన తర్వాత కూడా బాబు ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నాడు. మైనార్టీలను వేరుగా చూడటం, రాజకీయం స్వార్థకోసం మైనార్టీల జీవితాలతో ఆడుకోవటం దుర్మార్గం.. ఎన్ఆర్సీ, సీఏఏ ఏదైనా సరే మైనార్టీల గౌరవానికి ఎల్లప్పుడు అండగా ఉంటా👉చంద్రబాబు ఓటుకు ఇచ్చే వెయ్యి, 2వేలకు మోసపోవద్దు,👉చంద్రబాబు తాను దోచుకున్న సోమ్ముతో ప్రతి ఎన్నికలకు నోట్లు ఇచ్చి ఓట్లు కోనాలని ప్రయత్నిస్తుంటాడు,అతను ఇచ్చే వెయ్యి, రెండు వేలకు మోసపోవద్దు..మీ బిడ్డ జగన్ మళ్ళీ వస్తేనే ప్రతి సంవత్సరం ఏ ఏ నెల ఏ పథకాలు వస్తాయో తెలియజేస్తు క్యాలెండర్ అందిస్తాం..గుర్తుపెట్టుకోండి జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతినెల ప్రతి ఇంట్లో పండుగే..పథకాలన్నీ కొనసాగాలంటే జగనే రావాలన్నారు.

👉 జాతీయస్థాయి క్రీడాకారులను సన్మానించిన వేదాన్షి కరెస్పాండెంట్ ఎస్. పరమేష్.

కర్నూలు జిల్లా స్పోర్ట్స్ న్యూస్.. గురువారం కర్నూలు జిల్లాలోని పెదపాడు గ్రామంలో వేదాన్షి స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన క్రీడాకారుల అభినందన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న వేదాన్షి స్కూల్ కరస్పాండెంట్ ఎస్. పరమేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల్లో ఎల్లప్పుడూ గెలుపోవటములను సమానంగా తీసుకుని ముందుకు సాగాలని, అలాగే గోవాలో జరిగిన సెవెంత్ నేషనల్ ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొని జాతీయస్థాయిలో పథకాల సాధించిన క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం జాతీయస్థాయి పోటీలలో పథకాలు అండర్ – 17 జూనియర్ పోటీలలో యు. రఘు 44 కేజీ విభాగంలో బంగారు పతకం, విజయ్ 52 కేజీ విభాగంలో సిల్వర్ పతకం, విష్ణు వర్ధన్ 66 కేజీ విభాగంలో బంగారు పతకం, యూత్ పోటీలలో జస్వంత్ 60 కేజీ విభాగంలో బంగారు పతకం, మహేష్ 75 కేజీ విభాగంలో బంగారు పతకం, సీనియర్ పోటీలలో ప్రసాద్ 60 కేజీ విభాగంలో బంగారు పతకం, శివ కుమార్ 80 కేజీ ప్లస్ విభాగంలో సిల్వర్ పతకం, వరుణ్ 90 కేజీ ప్లస్ భాగంలో బంగారు పతకం సాధించిన క్రీడాకారులను సన్మానించిన. ఈ కార్యక్రమంలో కోచ్ ఫయాజ్, తల్లిదండ్రులు, చందు తదితరులు పాల్గొన్నారు.

👉 ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద పోలీసుల తనిఖీలు.. లారీలో తరలిస్తున్న రూ.8.5 కోట్ల నగదు సీజ్‌.. హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు తరలిస్తుండగా పట్టివేత…..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

👉 కొత్తపట్నం మండలంలో కొత్తపట్నం, పల్లెపాలెం, రాజుపాలెం తదితర గ్రామాలలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు, ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ , మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు శ్రీ నిఖిల్ రెడ్డి ఆళ్ల శ్రీనివాస రెడ్డి మరియు పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ మండల నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉 మార్కాపురం లో రాక్ వెల్ స్కూల్ లో *”MY FIRST VOTE” Interaction With Raghav* అనే కార్యక్రమం లో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకునే యువతీ యువకుల కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు తెలుగుదేశం పార్టీ యువనాయకులు మాగుంట రాఘవ రెడ్డి. ఈ కార్యక్రమం లో మాగుంట రాఘవ రెడ్డి మాట్లాడుతూ యువత తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, తమ సన్నిహితులకు ఓటు యొక్క విలువను తెలియపరచాలని కోరారు.

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…