👉పోలింగ్ పూర్తి అయిన తర్వాత 48 గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఆయా నియోజకవర్గాల వారీగా ఈసీ వెబ్ సైట్ లో ఎందుకు ఉంచలేకపోతున్నారు? అన్న ప్రశ్నను సంధించింది సుప్రీం ధర్మాసనం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నల్ని సందించింది. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే ముగిసిన మొదటి.. రెండు.. మూడో దశల పోలింగ్ శాతాల్ని వెల్లడించే విషయంలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవటం.. ఈ గణాంకాల్ని పదే పదే మార్చటంపైనా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బోలెడంత విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి.. ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నా.. మరింత వేగంగా సమాచారాన్ని వెల్లడించే వీలుంది. అంతేకాదు.. ఇప్పుడున్న వనరుల నేపథ్యంలో ఏడు దశల్లో ఎన్నికల్ని నిర్వహించటానికి మించిన వైఫల్యం మరొకటి లేదన్న మాటా పలువురి నోటి వినిపిస్తోంది. అప్పుడెప్పుడో పదుల ఏళ్ల క్రితమే.. రెండు.. మూడు దశల్లో ఎన్నికలను పూర్తి చేసిన ఎన్నికల సంఘం రోజులు గడుస్తున్న కొద్దీ.. అంతకంతకూ ఎక్కువ సమయాన్ని తీసుకోవటం.. సరైన ప్లానింగ్ లేకపోవటమే కారణంగా చెప్పాలి. సుప్రీంకోర్టు తాజా ప్రశ్నల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఏమని బదులిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
👉కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు:
కంభం సీఐ రామకోటయ్య..కౌంటింగ్ సమయంలో ఘర్షణలు చేస్తే ఉపేక్షించమని కంభం సీఐ రామకోటయ్య అన్నారు.శనివారం కంభం పోలీస్ స్టేషన్ లో పలు రాజకీయ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.ప్రతి ఒక్కరు ప్రశాంతమైన వాతావరణం జీవించాలని తెలిపారు.కౌంటింగ్ సందర్భంగా గ్రామాల్లో ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.కార్యక్రమంలో ఎస్సై పులి రాజేష్ మరియు మండల ఇరుపార్టీ ల నాయకులు పాల్గొన్నారు…
👉భక్తులతో వెళుతున్న టూరిస్ట్ బస్సులో మంటలు: 8 మంది మృతి* హర్యానా లో శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నూహ్ ప్రాంతంలో ఓ టూరిస్ట్ బస్సుకు మంటలు చెలరేగాయి. శుక్రవారం అర్థరాత్రి 1:30 నిమిషాల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పో యారు. మరో 24 మంది గాయపడ్డారు. బస్సులో కనీసం 60 మంది ఉంటారని సమాచారం. వీరిలో చాలా మంది మతపరమైన యాత్రలో పాల్గొన్నట్టు తెలుస్తోంది.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు.. ఘటనాస్థలా నికి చేరుకొని క్షతగాత్రులు, మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
👉పొదిలి మార్కాపురం అడ్డరోడ్డు వద్ద మోటార్ బైక్ ఢీకొన్న ఆర్టీసీ బస్సు బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు బాధితుడు నగర పంచాయతీ కార్మికుడిగా గుర్తింపు హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు పరామర్శించిన తగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి.
👉పెట్రేగిపోతున్న మట్టి మాఫియా..!!!
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చెర్లోపల్లె గ్రామం ఎడవల్లి పెద్ద చెరువు చర్లపల్లి సమీపంలో విచ్చలవిడిగా చెలరేగిపోతున్న మట్టి మాఫియా తెల్లవారుజాము నుండి ఇష్టారాజ్యంగా చెరువులోని మట్టిని చుట్టుపక్కల ఇటుకుల బట్టీలకు,ప్లాట్లకు తరలిస్తున్నారు. ఎన్నికలు ముగిసిన అధికారులు అటు ఇరిగేషన్ వారు మరియు రెవిన్యూ శాఖ ఎవరు గానీ పట్టించుకోకపోవడం తో అంతా మాదే రాజ్యం అన్న విధంగా మట్టి మాఫియా తయారయ్యింది..
👉 వాన పడింది.. వజ్రాల వేట మొదలైంది
👉కర్నూలు జిల్లా తుగ్గలిలో తొలకరి జల్లులు కురవడంతో ఇక్కడి ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. జొన్నగిరికి వెళ్లి వజ్రాల అన్వేషణను ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేట సాగుతోంది. ఒక్క వజ్రం దొరికితే తమ తలరాత మారిపోతుందన్న ఆశతో వజ్రాలు వెదుకుతున్నారు. గతేడాది కోట్ల విలువ చేసే వజ్రాలు దొరకడంతో ఈఏడాది వజ్రాల కోసం జనం తరలి వచ్చారు.
👉పల్నాడు జిల్లా ఇన్చార్జిగా కలెక్టర్ శ్యాంప్రసాద్..
పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్యాంప్రసాద్ శుక్రవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ శివ శంకర్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు బదిలీ చేశారు. ఈనేపథ్యంలో జాయింట్ కలెక్టర్గా ఉన్న శ్యాంప్రసాద్ కు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జేసీనే ఇన్ఛార్జ్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.
- 👉ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..అన్నమయ్య జిల్లా మదనపల్లె
సెలవుల్లో ఊరికి పంపలేదని ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తంబళ్లపల్లె మండలంలో కలకలం రేపిన ఘటనపై వివరాలు .. మండలంలోని బలకవారిపల్లె హరిజనవాడకు చెందిన వెంకటప్ప కుమారుడు బి.శ్రీరాములు(15) కురబలకోట చేనేతనగర్లోని గురుకుల పాఠశాలలో 8చదువుతున్నాడు. సెలవుల్లో ఇంటిపట్టినే ఉన్న శ్రీరాములు, వాల్మీకిపు రంలోని బంధువుల ఇంటికి వెళ్లాలని కోరగా ఇంట్లో ఒప్పుకోలేదని ఆత్మహత్యయత్నం చేశాడు. కుటుంబీకులు గమనించి వెంటనే ఊరు నుంచి తప్పించి అతనిని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంచడంతో తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది