దేశాన్ని 2047 వర‌కు పాలిస్తా“మోడీ..పైకం చెల్లించలేదని కిడ్నాప్..మేనమామ పాడు పని..మద్యం మత్తులో నదిలో దూకి?..మాజీ ఎమ్మెల్యే ఉడుములను కలిసిన ఎమ్మెల్యే అన్నా..ట్రై సైకిల్ బహుకరించిన దివ్య హెల్పింగ్ హ్యాండ్స్.

👉దేశాన్ని 2047 వర‌కు పాలిస్తా”మోడీ” సంచలన వ్యాఖ్యలు.. ( అవినీతిపరులైన శతకోటీశ్వరుల అండదండలు,ఇడి,సిబిఐ చెప్పు చేతల్లో ఉన్నాయి కాబట్టి అలా అని ఉండవచ్చా?)…

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ్య‌వ‌హారం.. రాజ‌కీయంగా దుమారం రేపుతోంది. ఆయ‌న అనుకుని అంటున్నారో… లేక అనాలోచితంగా అంటున్నారో తెలియ‌దు కానీ…. ఇప్ప‌టికిరెండు ప్ర‌ధాన మీడియా చానెళ్లకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల ఆంత‌ర్యం ఏంటో తెలియాల్సి ఉంది.రెండు కీల‌క అంశాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాన‌ని మోడీ వ‌రుస‌గా మూడోసారి యూపీలోని వార‌ణాసి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మోడీ వింత స‌మాధానాలుచెప్పారు.’మీరు ఇంకెన్నిసార్లు పోటీ చేయాల‌ని అనుకుంటున్నారు’అన్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. నేను ఇప్పుడు మూడో సారి గెలుస్తున్నా. 140 కోట్ల మంది ప్ర‌జ‌ల ఆశీస్సులు ఉన్నాయి. కాబ‌ట్టి.. మ‌రో నాలుగు సార్లు 5 సార్ల‌యినా గెలుస్తా. అంతేకాదు..ఈ దేశాన్ని 2047 వర‌కు పాలిస్తాఅని మోడీ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. తాను దైవాంశ సంభూతుడిన‌ని (హిట్లర్ కూడా తాను దైవాంశ సంభూతుడేనని చెప్పుకునే వాడట).. ఇత‌ర మ‌నుషుల మాదిరిగా.. త‌న‌కు జీవ సంబంధం లేద‌ని కూడా .. మోడీ వ్యాఖ్యానించారు. నిజానికి ఇవ‌న్నీ.. ఒక దేశ ప్ర‌ధానిగా .. ఎవ‌రూ ఇంత‌కు ముందు చెప్ప‌లేదు.గ‌తంలో వాజ‌పేయిని ఇదే ప్ర‌శ్న అడిగిన‌ప్పుడు ‘ప్ర‌జ‌లు ఇచ్చిన అధికారం.. నువ్వు మాకొద్దు.. అని వారు ఇప్పుడు కోరుకున్నా.. త‌క్ష‌ణం దిగిపోతా. ఈ దేశం ముఖ్యం ప‌ద‌వులు కాదు’అని చెప్పారు. కానీ, దీనికి విరుద్ధంగా లాజిక్ కూడా అంద‌నివిధంగా మోడీ మ‌రో న‌నాలుగు సార్లు 5 సార్లు గెలుస్తాన‌న‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. లాజిక్ ప్ర‌కారం చూసుకున్నా.. ప్ర‌స్తుతం మోడీ వ‌య‌సు 74. మ‌రో ఐదేళ్ల త‌ర్వాత 79.. అప్ప‌టికి బీజేపీ పెట్టుకున్న 75 ఏళ్ల వ‌య‌సు ల‌క్ష్మ‌ణ రేఖ‌ను ఆయ‌న చేరుకుంటారు.కాబ‌ట్టి పోటీకి అన‌ర్హులు అవుతారు. అయినా… పోట చేసినా.. ఇంకోసారి మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు. అప్ప‌టికి 84 ఏళ్లు వ‌స్తాయి.కానీ, మోడీ మాత్రం ఇంకా ఇంకా గెలుస్తాన‌ని చెబుతున్నారు.ఈ వ్యాఖ్య‌ల‌పైనే ఇండియా కూట‌మి నాయ‌కులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు..’ఎండలో తిరిగి ప్ర‌చారం చేయ‌డంతో మోడీకి పిచ్చిప‌ట్టింది. అందుకే ఇలాంటి మాట‌లు చెబుతున్నారు’ అని ఒక‌రంటే..’మోడీని త‌క్ష‌ణం… రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆసుప‌త్రిలోని 203వార్డులో(మాన‌సిక చికిత్స‌లు చేసే) చేర్చాలంటూ“ మ‌రికొంద‌రు చెబుతున్నారు. ఏదేమైనా..మోడీ కొంత అతిగా అయితే స్పందిస్తున్నార‌నేది విశ్లేష‌కులు కూడా చెబుతున్న మాట‌.గ‌తంలో ఉన్నంత ఇమేజ్ ఆయ‌న‌కు ఇప్పుడు లేద‌ని కూడా అంటున్నారు. అందుకే అస‌హ‌నంతో ఆయ‌న లేనిపోని వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని చెబుతున్నారు.ఉదాహ‌ర‌ణ‌కు ఒడిశాలోని ప్ర‌సిద్ధ పూరీ జ‌గ‌న్నాథుని ఆల‌య ర‌త్న‌భండాగారం తాళం చెవుల‌ను న‌వీన్‌ప‌ట్నాయ‌క్ ప్ర‌బుత్వం మాయం చేసింద‌న్నారు. తాము అధికారంలోకి వ‌స్తే.. తాళం చెవుల నిగ్గు తేలుస్తామ‌న్నారు. వాస్త‌వానికి ఇవి ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నులు కావ‌ని.. గ‌తంలో కేర‌ళ‌లోని ప‌ద్మ‌నాభ స్వామి.. ర‌హస్య నిధిపై సుప్రీంకోర్టు వ్యాఖ్య‌లు చేసింది.అయినా.. మోడీ ఇలాంటి వాటికే ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇచ్చారు. 👉శతకోటేశ్వరుల అండదండలు,ఈ డి, సిబిఐ లను చెప్పు చేతల్లో పెట్టుకుని.. ఈవీఎంల మాయాజాలం ఎలాగూ ఉంది.. ఏదో ఒకటి చేసే ఈసారి కనుక  గెలిస్తే.. మనుధర్మశాస్త్రం అమలు చేయించి తానే రాజు లాగా కొనసాగాలని ఆయన కోరిక ఏమో అని మరికొందరు విమర్శిస్తున్నారు.

👉 నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. మద్యం మత్తులో తన భార్యను అత్యంత పాశవికంగా హతమార్చాడు ఓ భర్త. దీంతో కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కనకాద్రిపల్లె గ్రామానికి చెందిన సుగుణమ్మ (48), వడ్డే రమణ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. త్రాగుడుకు బానిసగా మారి రమణ, ప్రతి నిత్యం పుటుగా మద్యం సేవించి, ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులందరితో తరచుగా గొడవ దిగుతున్నాడు. మద్యం మానిపించేందుకు కుటుంబసభ్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. చివరికి గత కొంతకాలంగా కుటుంబ సభ్యులందరూ అతన్ని ఇంటి నుంచి దూరంగా ఉంచారు. అయితే గత రాత్రి పూటుగా మద్యం సేవించిన కిరాతకుడు రమణ ఇంటికి వచ్చి భార్య సుగుణమ్మతో ఘర్షణ పడ్డాడు. దీంతో మరింత ఆవేశానికి లోనైన రమణ, నిద్రిస్తున్న భార్యను తెల్లవారు జామున గొడ్డలితో తల భాగంపై విచక్షణా రహితంగా నరికి దారుణ హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి జారుకున్నాడు.మహిళ దారుణ హత్య సమాచారం తెలుసుకున్న కొలిమిగుండ్ల సీఐ గోపినాథ్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న రమణ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

👉 పైకం చెల్లించలేదని భార్యను కిడ్నాప్ చేసిన వైనం దుండిగల్‌, మే 26: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు కాజేసి యేళ్లకు యేళ్లు ముఖం చాటేశాడు. దీంతో తమ పైకం తిరిగి చెళ్లించాలని ఓ నిరుద్యోగి డిమాండ్‌ చేశాడు. అయితే ఇతగాడు రేపు, మాపు అని తిప్పిస్తుండటంతో విసిగిపోయిన బాధితుడు ఇక లాభం లేదని మాస్టర్ ప్లాన్‌ వేశాడు. సాధారణంగా తీసుకున్న సొమ్ము చెల్లించకుంటే ఇంట్లో విలువైన వస్తువులో, పొలాలో.. ఆస్తులో ఇలా స్వాధీనం చేసుకుంటారు. కానీ తన కుటుంబసభ్యులతో కలిసి అతడి భార్యను కిడ్నాప్‌ చేశారు. కానీ సదరు నిరుద్యోగి మాత్రం తన సొమ్ము వసూలు చేయడానికి ఏకంగా తనను మోసం చేసిన వ్యక్తి భార్యను ఎత్తుకెళ్లాడు.పైగా తీసుకొన్న డబ్బులు ఇస్తేనే భార్యను వదులుతానని హెచ్చరించాడు. దీంతో లబోదిబో మంటూ సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.ఈ విచిత్ర ఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా సూరారం ఠాణా పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఏపీలోని కర్నూల్‌ జిల్లాకు చెందిన మాగంటి లక్ష్మణరావుతో హైదరాబాద్‌కు చెందిన ఎలిజబెత్‌రాణికి 19 ఏండ్ల క్రితం వివాహమైంది. కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలోని సుందర్‌నగర్‌లో ఈ జంట కాపురం ఉంటున్నారు. వీరికి కూతురు,కొడుకు ఉన్నారు.ఎలిజబెత్‌రాణి స్థానిక ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌లో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తుంది.అయితే ఆమె భర్త లక్ష్మణరావు ఏడేళ్ల క్రితం ఓయూ ప్రాంతంలోని మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన వెంకటేశ్‌ అనే వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.4 లక్షలు తీసుకున్నాడు.అయితే ఆ తర్వాత లక్ష్మణరావు దందా బయటపడటంతో పై అధికారులు అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించాడు. అతడికి ఉద్యోగం ఇప్పించకపోగా ఉన్న ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు లక్ష్మణరావు.ఈ విషయం తెలుకున్న వెంకటేశ్‌ డబ్బుల కోసం అతడిని ఒత్తిడి చేయసాగాడు. అయితే లక్ష్మణరావు రేపు, మాపు అంటూ కాలం దాటేస్తుండటంతో చిర్రెత్తుకొచ్చిన వెంకటేశ్‌ కిడ్నాప్‌ ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు మహిళల సాయంతో శనివారం ఉదయం ఎలిజబెత్‌రాణిని ఆటోలో ఎక్కించుకుని మాణికేశ్వర్‌నగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లారు. తాను కిడ్నాపైన విషయం ఎలిజబెత్‌రాణి తన కొడుకుకు ఫోన్‌ చేసి చెప్పింది. దీంతో లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.శనివారం సాయంత్రానికి వెంకటేశ్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని, నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి ఇరువర్గాల మధ్య రాజీ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇరువర్గాలు పోలీసుల అదుపులోనే ఉన్నారు.. ఇంటికొచ్చి భార్యను ఎత్తుకెళ్లారు

👉కొందరు మద్యం మత్తులో ఏం చేస్తున్నామా అనే ఆలోచన కూడ లేకుండా ప్రవర్తిస్తుంటారు.ఏ పని చేయడానికైన వారు వెనుకాడరు. తాజాగా ఓ యువకుడు ఫ్రెండ్స్ చాలెంజ్ చేశారని నీటిలోకి దూకాడు. చివరకు అతడి కుటుంబంలో విషాదం అలుకుముకుంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణ గుట్ట, బండ్లగూడ ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు ఉన్నారు.వీరు కర్ణాటక రాష్ట్రంలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతానికి టూర్ కి వెళ్లారు.ఈ క్రమంలో ఫుల్లుగా మద్యం తాగారు. ఆ మత్తులోనే నలుగురు స్నానం చేసేందుకు నదిలోకి దిగారు.తాగిన మైకంలో ఫ్రెండ్స్ సాజిద్ అనే యువకుడికి ఛాలెంజ్ చేశారు. ఇక ఫ్రెండ్స్ రెచ్చగొట్టడంతో సాజిద్ ఒక్కసారిగా నదిలోకి దూకేశాడు.అతడికి పూర్తి స్థాయిలో ఈత రాదు. దీంతో నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయాడు. ఇది ఇలా ఉంటే సాజిద్ నీటిలో మునిగిపోతుంటే..కాపాడాల్సింది పోయి…అతడి ఫ్రెండ్స్ వీడియోలు తీస్తూ తెగ ఎంజాయ్ చేశారు.చివరకు ఆ యువకుడు మృతి చెందగా… ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతంలో తాగిన మైకంలో ఫ్రెండ్స్ రెచ్చగొట్టడంతో సాజిద్ నదిలోకి దూకి ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సాజిద్ మృతదేహం హైదరాబాద్ పాతబస్తికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు అతను ఎలా చనిపోయాడు అక్కడ ఏం జరిగిందో అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇక ఈ నలుగురు వ్యక్తుల గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ కు చెందిన సాజిద్, గోటి, అఫు గోమా, తాజుద్దీన్ అనే నలుగురు వ్యక్తులు ఆటోలు నడుపుతుంటారు. వీళ్లు అప్పుడప్పుడు గంజాయి కూడా అమ్ముతుండేవారని స్థానికులు చెబుతున్నారు.

👉మేనకోడలితో మామ పాడుపని.. పెళ్లి చేసుకోమనేసరికి ..! పాపం..      అతడు ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు. దేశకోసం ప్రాణాలు అర్పించే ఆర్మీ జవాన్ . సరిహద్దుల్లో పహారా కాసే అతడికి అందమైన ఫ్యామిలీ కూడా ఉంది.కానీ ఏం లాభం.. అతడిది వక్రమైన బుద్ది. సమీప బంధువుపై కన్నేశాడు.ఆమెను లొంగదీసుకున్నాడు.చివరకు పెళ్లి చేసుకోమనే సరికి ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఆ యువతిని మట్టుబెట్టి.. సాక్ష్యాలు లేకుండా చేశాడు. ఇందుకు సహకరించింది జవాన్ భార్య కూడా. ఆ తర్వాత ఏం ఎరగన్నట్లు విధులకు వెళ్లిపోయాడు.. అయితే స్థానికులకు అర్థనగ్నంగా పొలంలో రక్తంతో తడిసి ఉన్న ఓ అమ్మాయి మృతదేహం కనిపించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్ డేటా ఆధారంగా నిందితుడ్ని అరెస్టు చేశారు. చివరకు నిందితుడు బాధితురాలికి మామయ్య అవుతాడని తెలిసి అవాక్కయ్యారు.మేన కోడలు వరుసయ్యే అమ్మాయిని వంచించి, నమ్మకద్రోహం చేసి హత్య చేశాడు ఆమె మామ. కుటుంబ బాంధవ్యాలను భయపట్టేలా ఉన్న ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పింటూ సింగ్ రాజ్ పుత్.. ఆర్మీలో లాన్స్ నాయక్‍గా పనిచేస్తున్నాడు. ఉజ్జయిని నివాసి అయిన భరత్ సింగ్ రాథోడ్ కుమార్తె సవితా రాథోడ్ ఆమెకు మామ వరుస అవుతాడు. అమ్మాయి.. రత్లాంలోని సఖ్వాల్ నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ నర్సింగ్ కోచ్ చేస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.దీంతో వీరిద్దరి మధ్య శారీరక సంబంధం మొదలైంది. అయితే సవితా తరచుగా తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుంది.అప్పటికే పెళ్లైన పింటూ.. దాట వేసుకుంటూ వస్తున్నాడు. ఇటీవల జమ్ము కాశ్మీర్ నుండి సెలవులపై ఇంటికి వచ్చిన పింటూ ఈ విషయంపై తేల్చుకుని విధుల్లో చేరాలని అనుకున్నాడు. ఏప్రిల్ 1వ తేదీన సాయంత్రం సవితను కలవాలని ఫోన్ చేశాడు. ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి రత్లామ్‌లోని మోవ్-నీముచ్ హైవే నాలుగు లేన్‌లో సమీపంలోని మైదానంలోకి వెళ్లారు. తన వెంట తెచ్చుకున్న కత్తితో సవిత ఛాతిపై దాడి చేశాడు. అనంతరం కత్తితో గొంతు కోశాడు. దీంతో అక్కడిక్కడే ప్రియురాలు అతడి కళ్లముందే గిలగిలా కొట్టుకుని చనిపోయింది. మృతదేహాన్ని అక్కడే ఉన్న పొదల్లో పడేసి.. స్వగ్రామానికి వెళ్లాడు.ఇంటికి వెళ్లి తన భార్య శీతల్‌కు జరిగిందంతా చెప్పాడు.అనంతరం భార్య కూడా సాక్ష్యాలను చెరిపేసేందుకు ప్రయత్నం చేసింది. దృశ్యం సినిమా తరహాలో ఆ గ్రామంలో హత్య జరిగిన రోజు తాము లేమని చెప్పేందుకు భార్యను ఆమె పుట్టింట్లో వదిలి..అదే రోజు రాత్రి పింటూ ఢిల్లీ నుండి విమానంలో జమ్ము కాశ్మీర్ చేరుకుని డ్యూటీలో చేరాడు. అమ్మాయి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. కాల్ డేటా ఆధారంగా నిందితుడ్ని గుర్తించారు. కాగా, నిందితుడు పింటూను అరెస్టు చేశారు. అలాగే భర్తకు సహకరించిన భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

👉 కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులురెడ్డిని ఆదివారం సాయంత్రం పొదిలి లో ఆయన నివాసంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు కలిశారు. కార్యక్రమంలో కొనకనమిట్ల ఎంపీపీ మురళి కృష్ణ ,పార్టీ కన్వీనర్ మోర శంకర్ రెడ్డి ,ఉడుముల గురవారెడ్డి , సచివాలయం కన్వీనర్ సురవరపు పెద్ద వెంకటరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి ఏలూరి సంజీవరెడ్డి , సీసీకేఆర్ శ్రీనివాసులురెడ్డి , ఎంఆర్ఎఫ్ వెంకటేశ్వర్ రెడ్డి, కంకణాల రమేష్ , మండల పెసిడెంట్ కారుమూరి వెంకటేశ్వ రెడ్డి,వెన్న శ్రీ రాములు రెడ్డి ,దోర్నాల నారాయణరెడ్డి , పార్టీ నాయకులు పాల్గొన్నారు

👉 దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోకొమరోలు మండలం తాతిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన జయరాం రెడ్డికి  దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో మరియు దాతల సహకారంతో జయరాం రెడ్డికి ట్రై సైకిల్ ను ఇవ్వడం జరిగింది.

కార్యక్రమంలో దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు లొక్కు.శరత్ బాబు, ఉపాధ్యక్షులు సునీల్ కుమార్ నాయుడు సెక్రటరీ కారుమంచి చిన్న పీరయ్య కామూరి శివరామిరెడ్డి, రవికుమార్ బైక్ మెకానిక్ కిషోర్ కుమార్ వెంకటసుబ్బయ్య . మరియు గ్రామ ప్రజలు పాల్గొని సహాయం చేసిన ప్రతి ఒక్కదాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు

7k network
Recent Posts

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.

నేడు పంజాబ్ బంద్‌* .. 👉 బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్ …👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..ఆ పార్టీల మధ్యనే పోటీ..👉 బియ్యం స్కామ్‌లో పేర్నినాని తన భార్యను ఇరికించారు -టీడీపీ నేత బుద్ధావెంకన్న ..*మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము..తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్.. 💥మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు*…అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి ఇలా.. *కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి

👉చేతులకు సంకెళ్లతో టీచర్ల నిరసన..👉బిఆర్ఎస్ అక్రమాలపై ధ్వజమెత్తిన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*.. 👉పోలీస్స్టేషన్లో గుండెపోటుతో న్యాయవాది మృతి* .. *నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ .. *జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి… *హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది..మార్కాపురం డిఎస్పి నాగరాజు.