మోడీ సార్ మాటలకు అర్ధాలే వేరు నా ?
ఒక వైపు చూస్తే ఎన్డీయే కూటమికి నాలుగు వందల సీట్లకు పైగా రావాలన్నది బీజేపీ ఎప్పటి నుంచో పాడుతున్న పాట. ఒక వైపు చూస్తే ఎన్డీయే కూటమికి నాలుగు వందల సీట్లకు పైగా రావాలన్నది బీజేపీ ఎప్పటి నుంచో పాడుతున్న పాట. ఈ బిగ్ నంబర్ ఉంటే కనుక దేశాన్ని 2047 నాటికి ఎక్కడికో తీసుకుని వెళ్తామని చెబుతున్నారు. బీజేపీకి నాలుగు వందలు సీట్లు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మోడీ చెబుతున్నారు. కౌంటింగ్ అన్నది లాంచనమని జూన్ 4న మరోసారి బీజేపీ సర్కారు కేంద్రంలో కొలువుదీరడం ఖాయమని నరేంద్ర మోదీ అంటూ వస్తున్నారు.ఇప్పటికే ముగిసిన ఆరు దశల ఎన్నికల పోలింగ్‌లో దేశం ఈ మేరకు నిర్ణయించిందని అంటున్నారు. ఎన్డీయే కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు.సదుద్దేశాలు, విధానాల కారణంగా ఎన్డీయే ప్రభుత్వాన్ని మూడోసారి ఏర్పాటు చేయాలని దేశం నిర్ణయించుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అదే టైంలో ఇండియా కూటమి మతపరమైనదిగా, కులపరమైనదిగా దేశం అర్థం చేసుకుందని ప్రధాని మోదీ ఆరోపించారు.ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు గాను రాజ్యాంగాన్ని మార్చాలని వారు నిర్ణయించుకున్నారని మోదీ ఆరోపించారు.ఇలా విపక్షాల మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న నరేంద్ర మోడీ ఇంటర్వ్యూలలో మాత్రం బలమైన ప్రతిపక్షం కావాలని కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు.దేశలో గట్టి విపక్షం లేకపోవడమే తనకు అదే ఒక వెలితిగా ఉందని కూడా అంటున్నారు. 2014 నుంచి ఈ రోజు వరకూ బలమైన ప్రతిపక్షం లేకపోవడం బాధాకరం అని ఆయన చెప్పుకొస్తున్నారు. ప్రస్తుత ప్రతిపక్షం అంటే కాంగ్రెస్ తమ ప్రభుత్వానికి ఎన్నడూ ఉపయోగపడలేదని ఆయన విమర్శించారు. దేశ ప్రయోజనాలను కోరి తీసుకున్న అనేక నిర్ణయాలను రాజకీయ లబ్ది కోసం వ్యతిరేకించింది అని ఆయన అంటున్నారు.అదే సమయంలో ప్రతిపక్షాలు తనకు శత్రువులు కాదు అని మోడీ చెప్పడం విశేషం. తాను ప్రతిపక్షాలతో కలసి పనిచేయాలని చూస్తానని వారిని ఏ మాత్రం తక్కువ అంచనా వేయడం లేదని అన్నారు. దేశాన్ని డెబ్బై ఏళ్ల పాటు పాలించిన వారి నుంచి ఏదైనా మంచిని గ్రహించేందుకే చూస్తాను అని మోడీ అంటున్నారు. ఇలా ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకుంటున్న మోడీ మరో వైపు వారిని ఏ వంద సీట్లకో పరిమితం చేయాలని చూడడం ఏమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఎన్డీయేకు 400 కి పైగా ఎంపీలు వస్తే వందాకు పై సీట్లతోనే విపక్షం ఉండాలి. అపుడు గట్టి ప్రతిపక్షం ఎలా వస్తుందో ,పార్లమెంట్ లో ఉన్న మొత్తం సీట్లలో ఎనభై శాతం పైగా ఎన్డీయే కైవశం చేసుకోవాలని ఆరాటపడుతూ విపక్షం బలంగా ఉండాలని చెప్పడం వెనక ద్వంద్వ నీతి లేదా అని ఇండియా కూటమి నేతలు విమర్శిస్తున్నారు. నిజంగా మోడీ విపక్షాలు బలంగా ఉండాలని చూస్తే పార్లమెంట్ లో వారిని నియంత్రించే వైఖరిని మానుకోవాలని అంటున్నారు. ఏకంగా రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వం మీద అనర్హత వేటు వేయించిన తీరుని కూడా గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వానికి మద్దతుగా విపక్షాలు ఎందుకు ఉంటారు అన్నది కూడా ఇండియా కూటమి నుంచి వస్తున్న మరో ప్రశ్న. విపక్షాలు ప్రభుత్వ విధానాలు విమర్శిస్తే రాజకీయ లబ్ది కోసమే అని ప్రచారం చేయడం సమంజసం కాదని అంటున్నారు. విపక్షాలు శత్రువులు కాదు అన్న వైఖరిని బీజేపీ తీసుకుంటే గడచిన రెండు లోక్ సభలలో బీజేపీ తీరు మరోలా ఉండేది కదా అని అంటున్నారు.ఏది ఏమైనా మోడీ బలమైన ప్రతిపక్షం కావాలి అన్న దానికి అర్ధాలు వేరులే అన్నట్లుగానే ఉందని అంటున్నారు నిజానికి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా ఉండాలి. అలాగే అధికార పక్షానికే మొత్తం సీట్లు అప్పగించకూడదు. అలా అయితేనే బ్యాలెన్స్ గా ఉంటుంది. అపుడే ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి. కానీ తమకు బండ మెజారిటీ ఇవ్వాలని అధికార పక్షాలు కోరుకుంటూ విపక్షాలను తగ్గించాలని చూస్తున్నాయి. కానీ మాటవరసకు మాత్రం బలమైన విపక్షం కావాలని నినదిస్తున్నాయని అంటున్నారు. అయితే ఈసారి మాత్రం బలమైన విపక్షమే కేంద్రంలో వస్తుందని అంటున్నారు. ఇండియా కూటమి అధికార పక్షంలోకి వచ్చినా బీజేపీ బలమైన విపక్షం అవుతుందని వారు అంటున్నారు. చూడాలి మరి మోడీ సార్ మాటలకు అర్థాలు ఏమిటి అన్నది.
డ్వాక్రా మహిళల డబ్బులు కూడా కొట్టేసిన ఏకైక ప్రభుత్వం జగన్ సర్కారు
స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి రూ.వందల కోట్లు మాయం, స్త్రీనిధి నుంచి దారి మళ్లించిన రూ.750 కోట్లు ఏ చేశారో ప్రభుత్వం చెప్పాలి, చివరకు కార్పొరేషన్లు, విద్యాసంస్థల నుంచి కూడా వందల కోట్లు దోచేశారు, ఏపీ స్టేట్ ఫైనాన్షిల్ సర్వీసెస్ కార్పొరేషన్ ద్వారా రూ.4,736కోట్ల గోల్‌మాల్, రెండున్నరేళ్ల క్రితమే కాలపరిమితి ముగిసిన డిపాజిట్లు ఎందుకు ఇవ్వలేదు?, 33 ప్రభుత్వశాఖలు, ప్రభుత్వరంగ సంస్థల నిధులు స్వాహా చేసిన సర్కారు, జూన్-4 ఫలితాల్లోపు ప్రతి పైసాకు జగన్ సర్కారు సమాధానం చెప్పాలి, డ్వాక్రా అక్కచెల్లెళ్లమ్మల డబ్బులను తక్షణం స్త్రీనిధి ఖాతాకు జమ చేయాలి, విద్యాసంస్థలు, కార్పొరేషన్ల నుంచి మళ్లించిన నగదు వెంటనే తిరిగి ఇవ్వాలి..ప్రత్తిపాటి..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తప్పుచేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. సమర్థిస్తున్న మంచు విష్ణు?. బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమను ఆయన వెనకేసుకురావడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఎందుకంటే, రేవ్ పార్టీలో హేమ ఉందని స్వయంగా బెంగళూరు సిటీ కమిషనర్ వెల్లడించారు. ఈ మేరకు కొన్ని ఫొటోలు రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆమె బ్లడ్ శాంపిల్స్ పరీక్షించారు. ఆమె మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు అందులో నిరూపితమైంది.
ఓవైపు ఇంత జరుగుతుంటే, మీడియా నిరాధార ఆరోపణలు చేస్తోదంటూ హేమను వెనకేసుకొచ్చాడు మంచు విష్ణు. ఓవైపు పోలీసులు పక్కాగా అన్నీ చెబుతుంటే, నిర్థారించుకోకుండా ఓ అభిప్రాయానికి రావొద్దని అంటున్నాడు. ఈ సందర్భంగా మా అసోసియేషన్ యాక్షన్ పై కూడా విష్ణు స్పందించాడు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు బెంగళూరు పోలీసులు పక్కా ఆధారాలు సమర్పించాలంట. అలా సాక్ష్యాధారాలు సమర్పిస్తే, హేమపై అసోసియేషన్ తగు చర్యలు తీసుకుంటుందట. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఆధారాలు ఇవ్వాల్సిన అవసరం పోలీసులకేంటి? తమ ఎంక్వయిరీ ఏదో తాము చేసుకుంటారు, అవసరమైతే కోర్టుకు ఆధారాలు అందిస్తారు. పోలీసులు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎందుకు సాక్ష్యాధారాలిస్తారు..? ఒకవేళ మంచు విష్ణు, అధ్యక్షుడి హోదాలో అడిగితే సాక్ష్యాలు ఇస్తారేమో కానీ, పోలీసులు తమంతట తాము ఎందుకు కేసు వివరాలిస్తారు?
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ
: అవినీతి మరకను ఒకరి తర్వాత ఒకరు పుచ్చుకుంటూ తలవంపులు తెస్తున్నారు. ప్రతి పనికీ చేయిచాపి, చివరికి ఏసీబీ వలకు చిక్కుతూ ఉన్న పరువును రచ్చకెక్కిస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలోని రావులపాలెం పోలీస్ స్టేషన్ అంతటా హాట్‌టాపిక్‌గా మారింది. ఐదు నెలల వ్యవధిలోనే ఇక్కడ పనిచేసిన అధికారులు ఇద్దరు లంచం తీసుకుంటూ దొరికిపోవడం చర్చనీయాంశం అయ్యింది.
నాడు ఎస్సై అవినీతికి పాల్పడుతూ వలలో చిక్కుకోగా, నేడు అదే స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్న సీఐ ఏసీబీకి పట్టుబడటం గమనార్హం.ఆ వివరాల్లోకి వెళ్తే.. గతంలో రావులపాలెం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకి ఎస్సై ర్యాంకు అధికారి ఉండేవారు. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఈ స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేసి ఎస్సై స్థానంలో సీఐ స్థాయి అధికారిని నియమించారు.
గత జనవరిలో ఇదే స్థానంలో ఎస్సై హోదాలో ఉన్న అప్పటి ఎస్సై ఎం.వెంకటరమణ ఒక కేసులో 41 నోటీస్ జారీ చేసే విషయంలో ముద్దాయిని స్టేషన్‌కు పిలిచి చార్జి షీట్‌లో తక్కువ శిక్షపడేలా సెక్షన్లు మార్చి సహాయ పడతానంటూ, ఆ కేసులో అనపర్తి మండలం పొలమూరుకు చెందిన సత్తి విజయరామకృష్ణారెడ్డి నుంచి రూ. లక్ష డిమాండ్ చేశారు.
దానికి బాధితుడు అంగీకరించకపోవడంతో రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి ఆ సొమ్ము తీసుకుంటూ అప్పటి ఎస్సై వెంకటరమణ, కంప్యూటర్ ఆపరేటర్ సత్యప్రసాద్‌లు ఏసీబీకి చిక్కారు.
జనవరి 9న ఈ ఘటన జరగ్గా, అదే నెలలో 13న అప్‌గ్రేడ్ స్టేషన్‌గా మారిన రావులపాలెం పోలీస్ స్టేషన్‌కు సీఐగా తణుకు రూరల్ నుంచి బదిలీపై వచ్చిన సీహెచ్ ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. మొదటి నుంచీ సీఐపై పలు ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఎన్నికల అనంతరం తిరిగి పశ్చిమ గోదావరి జిల్లా వెళ్లేందుకు ఇప్పటికే సీఐ సన్నాహాలు చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పాత కేసుల్లో నిందితుల నుంచి సొమ్ము దండుకోవాలనే లక్ష్యంతో వారం రోజులుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
దీనికోసం కిందిస్థాయి సిబ్బందితో వివిధ కేసుల్లో బాధితులకు ఫోన్లు చేయించి స్టేషన్‌కు రావాలని పిలుపిస్తున్నారు. గతనెల 16న రావులపాలెం మండలం పొడగట్లపల్లి వద్ద కోడిపందేల శిబిరంపై పోలీసులు దాడి చేసి, పలువురిని అరెస్ట్ చేయడంతో పాటు, వాహనాలు, కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో లక్ష్మణరాజును రూ.50 వేలు ఇవ్వాలని పలుమార్లు బాధించడంతో, అతను విసిగిపోయి రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతని నుంచి రూ.50 వేల లంచాన్ని తీసుకుంటూ సీఐ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు చిక్కాడు.
వెసులుబాటును అస్త్రంగా మలచుకుని..
నాడు ఎస్సై రూ.25 వేలు, నేడు సీఐ రూ. 50 వేలు తీసుకుంటూ పట్టుబడడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక్కడకు ఏ అధికారి వచ్చినా అవినీతి మాత్రం తగ్గడం లేదని విమర్శలు వస్తున్నాయి.
ఏడేళ్ల లోపు శిక్షపడే కేసులను కోర్టుకు తీసుకు వెళ్లకుండా 41 నోటీస్ జారీచేసి పంపించే విధంగా చట్టంలో ఉన్న వెసులుబాటును అస్త్రంగా మలచుకుని రూ. వేలల్లో డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలులు వినిపిస్తున్నాయి దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లాస్థాయి అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
వేములవాడలో జ్యోతిషం చెప్పే ఓ పూజారి అధిక వడ్డీల పేరుతో రెండు కోట్లు వసూలు చేసి ఊడాయించాడు.తన దగ్గరికి వచ్చే అమాయక ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టించి నమ్మించి మోసం చేసాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జ్యోతిషం చెప్పే మహేష్ రెండు కోట్ల రూపాయలతో పరారయ్యారు. గత కొంతకాలం వేములవాడలోని అంభాబాయ్ అలయంలో పూజారిగా పనిచేసేవాడు. అలయంలో పూజలతో పాటుగా, జ్యోతిష్యం, వశీకరణ పూజలు చేస్తూ ప్రజలకి దగ్గర అయ్యాడు. తాను చెప్పినట్లు పూజలు చేస్తే కోరుకున్నది సాధించవచ్చని నమ్మకం కలిగించాడు. మహేష్ వద్దకి వచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరగడంతో వారికి అధిక వడ్డీ ఆశ చూపించాడు.తాను చెప్పినట్లు డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇస్తానని కొంత మందికి అధిక వడ్డీ ఇస్తూ నమ్మిస్తు వచ్చాడు. అధిక వడ్డీ ఇస్తూ ఉండడంతో చాలా మంది మహేష్‌ను నమ్మి డబ్బులు అప్పజెప్పారు. డిపాజిట్ కాలం ముగిసిన వారికి డబ్బులు చెల్లించి మళ్ళీ డిపాజిట్ల ఆశ చూపడంతో నగరంలోని చాలమంది రెండు కోట్ల వరకు డిపాజిట్ చేసారు. రెండు కోట్లు వసూలు అయ్యాక వాటిని సర్దుకొని మహేష్ ఉడాయించాడు. కొద్ది రోజులుగా జోతిష్యాలయం మూసి ఉండడంతో పాటుగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వేములవాడలోని వ్యాపారులు, భక్తులు మహేష్ పూజారి వద్ద పెట్టుబడులు పెట్టిన వారు పోలీసులని కలిసి తమ డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నారు.
ప్రేమ పేరుతో యువతి మోసం చేసిందనే మనస్తాపంతో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ సమీపంలో చోటు చేసుకుంది.
మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. కాజీపేట మండలం సోమిడికి చెందిన మంతుర్తి రమేశ్, రాజమ్మ దంపతుల కుమారుడు రాజ్‌కుమార్ (28) దాదాపు ఏడేళ్లుగా హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
పనిచేసే చోట పరిచమైన ఓ యువతితో కొద్దికాలంగా చనువుగా ఉంటున్నాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన సదరు యువతి కుటుంబీకులకు ఇటీవల వీరి ప్రేమ విషయం తెలియడంతో రాజ్‌కుమార్‌ను హెచ్చరించారు.
దీంతో రాజ్‌కుమార్ ఎదురు తిరగడంతో యువతి బంధువులు సూర్యాపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రేమించిన యువతి.. కుటుంబీకుల ఒత్తిడికి తలొగ్గి ఎదురు తిరుగడం, బంధువులు చంపేస్తామంటూ బెది రించడంతో రాజ్‌కుమార్ మనస్తాపానికి గురయ్యాడు.దీంతో ఏడేళ్లుగా సాగిన ప్రేమాయణం.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ సెల్ఫీ వీడియోను రికార్డు చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధు, మిత్రులకు పంపించాడు. వెంటనే అప్రమత్తమైన సన్నిహితులు రాజ్‌కుమార్‌ను వెతకడానికి ప్రయత్నించగా సూర్యాపేటలో చిక్కాడు.
ఎంత నచ్చ చెప్పినా వినకుండా తనకు ఆత్మహత్యే శరణ్యమని చెప్పి పరారయ్యాడు.ఈ క్రమంలో శనివారం ఉదయం నల్లగొండ సమీపంలో గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన విషయం వెలుగు చూసింది.యువతి కుటుంబీకుల బెదిరింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, చెట్టంత ఎదిగిన కుమారుడు ప్రేమ కోసం బలయ్యాడని, తనను బెదిరించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు కోరారు.
*రూ.250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్..
సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య ను అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట డిఎస్పీ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… సి.ఎం.ఆర్ బియ్యం ను ప్రభుత్వానికి అప్పగించకుండా కోట్లు విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించారని తిరుమలగిరి పోలీసు స్టేషన్ లో పౌర సరఫరా శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు ఇమ్మడి సోమనర్సయ్య కు చెందిన మూడు మిల్లులలో అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో సుమారు రూ.250 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్టు నెల క్రితం అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి ఇమ్మడి సోమయ్యను అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్ కు తరలించినట్టు సూర్యాపేట డిఎస్పీ తెలియజేశారు.
కొనకనమిట్లమండలంలోని రైతులకు పంట రుణాలు, నష్టపోయిన పంటలకు బీమా సొమ్మును అందించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించిన ఏపీ రైతు సంఘం నాయకులు పి వి కొండయ్య,ఎస్ వెంకటేశ్వర్లు, కె కోటేశ్వరరావు, శ్రీను, పలువురు నాయకులు ఉన్నారు.