రాయచోటి మడకశిర గిద్దలూరు కౌంటింగ్ పై అనుమానం ఏంటి..జగన్ ఆవిష్కరించిన స్థూపం ధ్వంసం..తాటిపర్తి గ్రామంలో జనసేన టిడిపి మధ్య వార్..వివిప్యాట్ కౌంటింగ్ లలో గోల్మాల్..చిన్నారి ప్రాణాలు తీసిన కూలర్..కుక్కల దాడిలో బాలుడు మృతి..మహిళ దారుణ హత్య..ప్రేమించి పెళ్లాడి వేధింపులు

👉 రాయచోటి గిద్దలూరు, మడకశిర మీద అనుమానం ఏంటి ? ఈసారి మాత్రం అంతా రివర్స్ అయింది. రాయలసీమలోనే జగన్ కి భారీ ఓటమి లభించింది. రాయలసీమలో జగన్ కి పట్టు ఉంది.వైసీపీ కి కంచుకోట లాంటి సీట్లు అనేకం ఉన్నాయి.

అలాగే గ్రేటర్ రాయలసీమలో 74 సీట్లు ఉంటే అందులో ఎపుడూ మెజారిటీ సీట్లు వైసీపీ కైవశం చేసుకోవడం గడచిన రెండు ఎన్నికల్లో వస్తోంది. ఈసారి మాత్రం అంతా రివర్స్ అయింది.రాయలసీమలోనే జగన్ కి భారీ ఓటమి లభించింది. ప్రత్యేకించి కడప జిల్లాలో పదికి ఆరు సీట్లు టీడీపీ గెలుచుకోవడం ద్వారా కొత్త చరిత్రను సృష్టించింది. ఇదిలా ఉంటే ఇంతలా టీడీపీ సునామీ క్రియేట్ చేసినా కొన్ని సీట్లలో అతి తక్కువ మెజారిటీతోనే ఆ పార్టీ అభ్యర్ధులు ఓటమి చవి చూశారు.ఆ సీట్లలో రాయచోటి, గిద్దలూరు, మడకశిర వంటివి ఉన్నాయి. ఈ సీట్లలో ఇపుడు వైసీపీ ఓటమి మీద పెద్ద ఎత్తున ప్రజలలోనే చర్చ సాగుతోంది. గెలుపు గుర్రాలు కావాల్సిన వైసీపీ నేతలు ఎందుకు ఓటమి పాలు అయ్యారన్న దాని మీదనే జనంలోనూ అనేక సందేహాలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అంటున్నారు. ఆయా సీట్లలో తక్కువ తేడాతో ఓటమి పాలు అయినా ఎందుకు వైసీపీ అభ్యర్ధులు రీ కౌంటింగ్ అడగలేదని కూడా జనంలో నుంచే వస్తున్న ప్రశ్నగా ఉంది అంటున్నారు. టీడీపీ హై కమాండ్ నుంచి ఫోన్లు వస్తేనే ఆయా నియోజకవర్గాల్లో రిజల్ట్ మారిందని అంటున్నారుట. దీని మీదనే ఆయా నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అయితే నిజంగా రిజల్ట్ అలా మారిందా లేక టీడీపీ మీద బురద జల్లేందుకు అలా అంటున్నారా అన్నది మాత్రం ఇంకా తెలియడంలేదు. మరి తక్కువ ఓట్లతో ఓటమి అని వైసీపీ వారికి తెలిసినా ఎందుకు కిమ్మనకుండా ఉన్నారు అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ సునామీ అన్నది వచ్చింది. ఒక కులం ఒక వర్గం ఒక ప్రాంతం అని కాదు అంతా కలసి మూకుమ్మడిగా టీడీపీకి మద్దతుగా నిలిచారు. దానికి సాక్ష్యమే భారీ మెజారిటీలు అత్యధికంగా నమోదు అయ్యాయి. అయితే కొన్ని చోట్ల వైసీపీ కొంత స్ట్రాంగ్ గా ఉండడంతో మెజారిటీలు తక్కువ వచ్చి ఉండవచ్చు అన్నది కూడా విశ్లేషణగా ఉంది. ఆయన చాలా పెద్దాయనే ఏది ఏమైనా వైసీపీకి తగిలిన భారీ షాక్ తో వారు ఎక్కడ ఏమి జరిగింది అన్నది తెలియక తేరుకోలేక ఉన్నారు. దాంతో వారు పూర్తిగా డిఫెన్స్ లో పడడడంతోనే రీ కౌంటింగ్ లాంటివి అడగడం లేదు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా సాంతం వైసీపీకి ఓటమి పలుకరించిన తరువాత ఒకటి రెండు చోట్ల ఏదో జరిగిందని యాగీ చేసుకోవడం కూడా సబబు కాదనే అంటున్నారు. అయితే నిజంగా ఈ అనుమానాలల్లో పస ఉంటే మాత్రం అడగడంలోనూ తప్పు లేదన్న వారూ ఉన్నారు. చూడాలి మరి వైసీపీ ఏ విధంగా ఆలోచిస్తుందో.

👉 వివి ప్యాడ్ కౌంటింగ్ లో గోల్మాల్.. మీమీ నియోజకవర్గాల లెక్కలు చెక్ చేసుకోండి . అభ్యర్థులందరూ వెంటనే కోర్టుకెళ్లాలని నాయకులు అంటున్నారు..*పోలైన ఓట్లకు .. లెక్కింపు ఓట్లకు చాలా తేడా ఉందన్నారు .*మంగళగిరలో పోలైన వోట్లకంటే కౌంటింగ్ తరువాత అందరి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు 27 వేలు అధికంగా ఉన్నాయి..*పెందుర్తిలో 35 వేల ఓట్లు అధికంగా ఉన్నాయి.. *విశాఖపట్నం సౌత్ లో 15 వేల ఓట్లు అధికంగా వచ్చాయి.*అనకాపల్లిలో 10 వేల ఓట్లు,వామ్మో కూటమి గెలిచిన అన్నీ చోట్లా ఇలానే ఉన్నాయివెంటనే కోర్టుకెళ్లాలని,లేకపోతే ఈ లోపు VVPAT మెషిన్లని ధ్వంసం చేసినా ఆశ్చర్యం లేదని,పోటీ చేసిన అభ్యర్ధులందరికీ ఈవిషయం చేరవేయమని కోరారు.

👉మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించిన స్తూపం ధ్వంసం..అమరావతి ప్రాంతంలో జగన్ పేదలకు సెంటు స్థలాలను కేటాయించారు.ఆసమయంలో కృష్ణాయపాలెం శివారులో శంకుస్థాపన చేసి నమూనా ఇంటితో పాటు, స్థూపాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన స్తూపాన్ని, శిలాఫలకాన్ని జేసీబీతో ధ్వంసం చేశారు.ఈవిషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈఘటనపై వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.

  👉 తాటిపర్తి గ్రామంలో జనసేన టిడిపి మధ్య వార్…పిఠాపురం..తాడిపర్తి లో వెలసినటువంటి అపర్ణ దేవి అమ్మవారు బాధ్యతలు కొరకు జనసేన టిడిపి పార్టీల మధ్య ఘర్షణ…నిర్వహణ కమిటీ జనసేన కావాలంటూ జనసేన పార్టీ వారు..నిర్వహణ కమిటీ టిడిపి కావాలంటూ టిడిపి పార్టీ వారు మెండిపట్టు…

👉కూడేరులోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ.. అనంతపురం. రూ.18,41,300 నగదు చోరీకి గురైనట్లు గుర్తించిన అధికారులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

👉 మహిళ దారుణ హత్య..తెలంగాణ..నేలకొండపల్లి మండలంలోని బైరవునిపల్లిలో శుక్రవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కొన్నాళ్లుగా వేధిస్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడగా ఆయన కూడా కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించి వివరాలు… బైరవునిపల్లి గ్రామానికి చెందిన కోళ్ల సైదమ్మ(47)తో ఆమె భర్త దూరంగా ఉంటుండగా, సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓప్రైవేట్ పాఠశాల హాస్టల్లో వార్డెన్గా పనిచేస్తోంది.👉ప్రస్తుతం సెలవులు కావడంతో స్వగ్రామమైన బైరవునిపల్లి వచ్చింది. అదే గ్రామానికి చెందిన సొంటి శ్రీను తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఆమెను కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వెళ్లి కొట్టినట్లు తెలిసింది. ఈనేపథ్యాన శుక్రవారం కూడా సైదమ్మ ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకున్న శ్రీను వెళ్లి గొడవకు దిగాడు. ఆమె తనను నిరాకరించిందన్న కోపంతో ముందుగానే సిద్ధం చేసుకున్న కత్తితో మూడు చోట్ల బలంగా పొడిచాడు.ఆపై చేతులను కత్తితో ఇష్టానుసారంగా కోశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైదమ్మ రక్తపు మడుగులో పడి పోయింది. దీంతో స్థానికులు ఆమెను నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా శ్రీను సైతం అదే కత్తితో పొడుచుకోగా పేగులు బయటకు రావడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆయనను ఖమ్మం తరలించగా పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉండగా, సెలవుల్లో ఇంటికి రాకుండా కోదాడలో ఉన్నా బతికేదని వారు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.👉భారీ బందోబస్తు..హత్య జరగడంతో బైరవునిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. సైదమ్మ కుటుంబ సభ్యులు, బంధువులు హత్య చేసిన శ్రీను కోసం గ్రామంలో గాలించారు. కానీ ఆయన సైతం ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుసుకున్న వారు ఆగ్రహంతో ఉండగా.. ఎలాంటి ఘటనలు జరగకుండా ఖమ్మం రూరల్ సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యాన నేలకొండపల్లి,ముదిగొండ ఎస్సైలు తోట నాగరాజు, నరేష్,సిబ్బందితో పహారా ఏర్పాటు చేశారు. ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

👉 ప్రేమించి పెళ్లి చేసుకుని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని డబ్బులు తీసుకుని వేరే మహిళలతో ఫోన్‌ చేయించి వేధిస్తున్నాడని ఓ మహిళ మధురానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కదులూరి కనకమహాలక్ష్మి, బిల్లాకుర్తి అప్పారెడ్డి ప్రేమించుకున్నారు. గతేడాది ఆగస్టులో వివాహం చేసుకుని మధురానగర్‌లో నివాసం ఉంటున్నారు. వివాహం అయిన నెల తర్వాత తనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని రూ.30లక్షలు కావాలని అప్పారెడ్డి కనకమహాలక్ష్మిని అడిగాడు. ఆమె స్నేహితులు, బందువుల వద్ద అప్పు తీసుకుని, బంగారం తాకట్టు పెట్టి క్రెడిట్‌ కార్డు ఉపయోగించి మొత్తం రూ.15 లక్షలు ఇచ్చింది. డబ్బులు తీసుకున్నాక ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే చైనాకు వెళ్తానని చెప్పి 29–3–2024న వెళ్లాడు. అతడు వెళ్లిన రెండు రోజులకు మృదల బండారు అనే మహిళ ఫోన్‌ చేసి అప్పారెడ్డి తన భర్త అని, ఐదు సంవత్సరాల బాబు ఉన్నాడని చెప్పింది. వెంటనే అప్పారెడ్డికి ఫోన్‌ చేసి అడగగా అది అబద్దం అని, ఆమె నంబర్‌ బ్లాక్‌ చేయమని చెప్పాడు. నెల రోజులకు శ్రీకర్‌ సీత అనే మహిళ ఫోన్‌ చేసి అప్పారెడ్డి మోసగాడని, అతడిని వదిలేయాలని బెదిరించింది. దీంతో ఈ మహిళలు అప్పారెడ్డితో ఉండి తనను మోసం చేస్తున్నారని, న్యాయం చేయాలని కనకమహాలక్ష్మి మధురానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

👉చిన్నారి ప్రాణాలు తీసిన కూలర్.. కూలర్ కు తాకడంతో విద్యుత్ షాక్ కు గురై ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విచారకర ఘటన నిజామాబాద్ జిల్లా ఆలూరులో జరిగింది. గ్రామానికి చెందిన చిన్నారి సింధూజ ఇంట్లో వాడుతున్న కూలర్ ను తాకడంతో విద్యుత్ షాక్ కు గురై చనిపోయింది. కాగా 15 రోజుల క్రితం ఆర్మూర్‌లో ఓ చిన్నారి కూలర్ తాకి దుర్మరణం చెందగా.. ఇది రెండో సంఘటన. ఇలాంటి ఘటనలు జరగకుండా చిన్నారుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.

👉 బాపట్ల జిల్లా:బాపట్ల రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున రైలు కింద పడిన యువకుడురెండు కాళ్ళు తెగిపోవడంతో ఏరియా వైద్యశాలకు తరలించిన 108 సిబ్బంది.పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు తరలించిన వైద్యులు

* కుక్కల దాడిలో బాలుడు మృతి.. జనగామ జిల్లా: చిల్పూర్ మండలం,ఫతేపూర్ శివారులోని నునావత్ తండాలో దారుణం..కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడు మృతి.తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లొచ్చేసరికి ఇంట్లో కనిపించని బాలుడు.కుక్కల అరుపులు విని పిస్తుండడంతో చెట్ల పొదల్లో చూడగా కనిపించిన బాలుని మృతదేహం..చెట్ల పొదల్లో బాలుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు.

7k network
Recent Posts

సీఎం చంద్రబాబు సమీక్ష..చిరు పవన్ లఫై జగ్గారెడ్డి ఘాటు విమర్శలు..రొట్టెల పండుగ ఉత్సవంలో మంత్రి పొంగూరు..ఎవరైనా దళారులుగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు..!! తిరుపతి జిల్లా ఎస్పీ..ఉమెన్స్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ దామోదర్..మరిన్ని వార్తా విశేషాలత

మోదీది ఉత్త డప్పు..సీఎం రేవంత్..వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై ?..ప్రకాశం జిల్లాలో 28ఎర్రచందనం దుంగలు స్వాధీనం..వినుకొండ మర్డర్ వెనుక బ్యాక్ గ్రౌండ్?..వైద్యాధికారి రంగారావుకు ప్రమాదం..కమిషనర్ శాంతి అక్రమాలు..

మోడీ మీద ఉక్రెయిన్ భారం మోపిన అమెరికా..న‌డిరోడ్డుపై వైసీపీ కార్య‌కర్త దారుణ హ‌త్య‌..రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు..! ఎంపీడీవో మిస్సింగ్ పవన్..మార్కాపురంలో ఖైదీ పరారీ.. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం..విద్యార్థులకు ఫాతిమాసంస్థ చేయూత..బాలుడిపై వీధి కుక్క దాడి…

విద్యాదీవెన,వసతిదీవెన స్థానంలో పాత విధానం: నారా లోకేశ్..వైసీపీకి విజయమ్మ కూడా ప్రత్యర్థిగానే..?గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం.. గుంటూరు ఎస్పీగా సతీష్ కుమార్..ప్రకాశం ఎస్పీగా ఏ.ఆర్ దామోదర్.. మొహర్రం వేడుకలలో మాజీ ఎమ్మెల్యే అన్నా

పూరీ భాండాగారం కింద సీక్రెట్ రూమ్?..ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం..ప్రకాశం జిల్లా ఎస్పీకి ఘనంగా వీడ్కోలు..బాలినేని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన దామచర్ల..అభివృద్ధి కోసం పని చేస్తా- ముత్తుముల..అడ్డంగా బుక్కైన వజ్రకరూరు తహసీల్దార్..