నేషనల్ మీడియా అంతా ఫేకేనా?..ఏడుగురు నక్సల్స్ మృతి..వైఎస్సార్ విగ్రహాలపై చేస్తున్న దాడులను ఇండియా ఖండించిన షర్మిల..కాణిపాకంలో భక్తుల నిలువు దోపిడీ.. జనుల కార్యాలయం సిజ్..ముత్తుములకు ఘన సన్మానం..గురువును సన్మానించిన పూర్వ విద్యార్థులు..

👉నేషనల్ మీడియా అంతా ఫేకేనా ? దేశంలో ఎపుడు ఎన్నికలు జరిగినా జాతీయ మీడియా సంస్థల సరదాయే వేరు. వారే సర్వాంతర్యామి మాదిరిగా సర్వేలు చెబుతూ ఉంటారు. దేశంలో ఎపుడు ఎన్నికలు జరిగినా జాతీయ మీడియా సంస్థల సరదాయే వేరు. వారే సర్వాంతర్యామి మాదిరిగా సర్వేలు చెబుతూ ఉంటారు. ప్రధానులను వారే నిర్ణయిస్తారు. అలాగే దేశంలోని పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రులు ఎవరో కూడా చెప్పేస్తారు. అలా వారి హడావుడి ఒక రేంజిలో ఉంటుంది. అలాంటి జాతీయ సర్వేలు ప్రతీ సారీ సర్వేలు ఇస్తూంటాయి.అవి ప్రీ పోల్ సర్వేలు పోస్ట్ పోల్ సర్వేలు ఎగ్జిట్ పోల్ సర్వేలు మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ రకరకాలుగా ఇస్తూ ఉంటాయి. కానీ ఆ సర్వేలలో ఎన్ని నిజం అయ్యాయన్నది చూడాల్సి ఉంటుంది. సర్వేలతో ప్రభావితం చేస్తామనుకుని బోల్తాపడుతున్న జాతీయ సర్వేశ్వరులే ఎక్కువగా ఉన్నారు. తామే అన్నీ చేస్తున్నట్లుగా ఫీల్ అయ్యే వారూ ఉన్నారు. అయితే గత కొన్ని ఎన్నికలుగా చూస్తూ ఉంటే సర్వేలలో నిజాయితీ బాగా తగ్గిపోతోంది. అందులో రాజకీయం చేరుతోంది. తాము అనుకున్న వారే అధికారం లోకి రావాలన్న యావ కనిపిస్తోంది. ఈ విధంగా లిస్ట్ తీస్తే చాలా జాతీయ సర్వేలు చెప్పిన జోస్యాలు ఈసారి పూర్తి స్థాయిలో తప్పాయి. కేంద్రంలో మోడీకి ఏకంగా 370 నంబర్ కి తగ్గకుండా చాలా ఉదారంగా సర్వేశ్వరులు ఇచ్చేశారు. ఒకరు ఇద్దరు కాదు డజన్ల కొద్దీ సర్వే సంస్థలు ఇచ్చిన ఈ నంబర్లను చూసి అంతా నిజం అనుకున్నారు. మళ్లీ మోడీ బ్రహ్మాండమైన మెజారిటీతో రాబోతున్నారు అని కూడా భావించారు. ఆ మెజారిటీ కూడా 2019 నాటి కంటే ఎక్కువగా ఉంటుందని తలచారు. చిత్రమేంటి అంటే ఒక సంస్థ కాదు అందరూ కూడబలుక్కుని నట్లుగా దాదాపుగా ఒకే నంబర్ ఇచ్చారు. దాంతోనే అందరికీ కనీసంగా ఇందులో కొన్ని నంబర్లు తగ్గినా బాగానే మోడీ నెగ్గుకు వస్తారని అనుకున్నారు. తీరా ఫలితాలు చూస్తే బీజేపీ నంబర్ 240 దగ్గర పడిపోయింది. ఎన్డీయే నంబర్ 290 దగ్గర ఆగింది. మరి ఎనభై సీట్ల దాకా తేడా వచ్చాయి. మరీ ఇంత తేడానా అని అంతా అంటున్నారు. సర్వే ఫలితాలు అన్నీ కూడా ఫేక్ అని కూడా మెల్లగా ఒక అంచనాకు వస్తున్నారు. సర్వేలు చేస్తున్న మీడియా సంస్థలు అన్నీ రాజకీయ పార్టీలకు అనుకూలంగా మారి ఈ నంబర్లు ఇచ్చారన్న విమర్శలకు కూడా బలం చేకూరుతోంది. అందుకే ఈ సర్వేలను నమ్మమని ఇండియా కూటమి నేతలు మొదటే చెప్పారు. వంటింట్లో తయారు చేసిన నంబర్లు ఇవి అని మమతా బెనర్జీ అంటే ఈ సర్వే నంబర్లు మోడీ మార్క్ సర్వేలు అని రాహుల్ గాంధీ ఎత్తి పొడిచారు. చివరికి వారి విమర్శలే నిజం అయ్యాయి. సర్వేలు అన్నీ తప్పుడు తడకలు అని నిరూపితం అయ్యాయి. దాంతో మరోసారి ఈ సంస్థలు సర్వేలు అంటూ జనం ముందుకు వస్తే నమ్ముతారా అన్న చర్చకు తెర లేచింది. అయితే మీరు నమ్మినా నమ్మకపోయినా సర్వేలు చేస్తూనే ఉంటాం, మా అజెండాను జనంలో పెడుతూనే ఉంటామని సర్వేశ్వరులు అనుకుంటే చేసేదేమీ లేదు. కానీ వ్యక్తికైనా సంస్థకు అయినా క్రెడిబిలిటీ ముఖ్యం. అది పోయిన తరువాత ప్రాణం లేని దేహంగానే ఉంటుంది మరి.

👉 ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూజ్మడ్ జిల్లా అడవుల్లో భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు మృతి చెందినట్లు దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు.నారాయణపూర్, కొండగావ్, దంతేవాడ, జగదల్‌పూర్‌కు జిల్లాలకు చెందిన డీఆర్జీ ఐటీబీపి 45 వ బెటాలియన్ కు భద్రతా బలగాలు సంయుక్తంగా తూర్పు బస్తర్ డివిజన్ పరిధిలోని గోబెల్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఆపరేషన్‌లో పాల్గొన్న సమయంలో భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య పలుమార్లు ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.నారాయణపూర్ జిల్లాలోని ఓర్చా పోలీసు స్టేషన్ పరిధిలో గల తుల్తులి_గోబెల్ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల అనంతరం ఘటనా స్థలం లో యూనిఫాం ధరించిన ఏడుగురు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు.ఘటనా స్థలం నుంచి పేలుడు పదార్థాలు,ఆరు తుపాకులు , ఇతర సామగ్రి తో పాటు నక్సల్స్ మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఎన్ కౌంటర్ లో నారాయణపూర్ జిల్లా కు చెందిన ముగ్గురు సైనికులు గాయపడినట్లు దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు.గాయపడిన సైనికుల పరిస్థితి సాధారణంగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.

👉కాణిపాకం ఆలయంలో భక్తుల నిలువు దోపిడీ..

సుదూర ప్రాంతాల నుంచి భక్తిశ్రద్ధలతో కాణిపాకం ఆలయ దర్శనార్థం వచ్చే భక్తులను దేవస్థానం నిలువు దోపిడీ చేస్తోంది సాధారణంగా ఏ ఆలయాల్లో అయినా భక్తులను ఏ వ్యాపారులో దళారులో మోసం చేసి దోపిడీలకు పాల్పడుతుంటారు అయితే అందుకు భిన్నంగా కాణిపాకం దేవస్థానంలో ఆలయ అధికారులే తమ సిబ్బంది ద్వారా భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి ఆలయ దర్శనార్థం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు ఈ నేపథ్యంలో దేవస్థానం వద్ద స్వామి దర్శనం కోసం ఉచిత దర్శనంతో పాటు 51 రూపాయిల శీఘ్రదర్శనం 150 రూపాయల అతి శీఘ్ర దర్శనం టికెట్లను విక్రయిస్తుంటారు అలాగే ప్రోటోకాల్ విఐపి లకు వీఆర్వో కార్యాలయం ద్వారా ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేస్తుంటారు అయితే ఆలయ అధికారులు ఇదే అదునుగా భావించి భక్తులను నిలువు దోపిడీ చేస్తూ ప్రతిరోజు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు ప్రోటోకాల్ విఐపి దర్శనాలు ఏర్పాటు చేయాల్సిన వీఆర్వో కార్యాలయం సిబ్బంది దేవస్థానం ఉన్నతాధికారుల ఆదేశాలు సూచనలు మేరకు 500 రూపాయలు 1000 రూపాయలు విక్రయిస్తూ సామాన్య భక్తులతో పాటు దర్శనాలు కల్పిస్తున్నారు ఆలయంలో 500 రూపాయలు టికెట్ తీసుకున్న భక్తులకి ప్రత్యేక దర్శనంతో పాటు సాధారణ ఆశీర్వచనం చేయాల్సి ఉంది అలాగే వెయ్యి రూపాయలు టికెట్ తీసుకున్న భక్తులకు ప్రత్యేక దర్శనంతో పాటు ప్రత్యేక ఆశీర్వచనం చేయాల్సింది ఈ మేరకు పిఆర్ఓ కార్యాలయం ద్వారా ప్రతిరోజు 500 నుంచి 1500 టిక్కెట్ల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది ఈ టికెట్లు తీసుకున్న భక్తులందరికీ ఆశీర్వచనం అందించకపోగా సాధారణ భక్తులతో పాటు లఘు దర్శనం మాత్రం కల్పిస్తుండడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదేమిటని ప్రశ్నించే భక్తుల పట్ల ఆలయ అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి తాజాగా 500 రూపాయలు టికెట్ తీసుకున్న నెల్లూరు వాసులతో పాటు ఉత్తరప్రదేశ్ చెందిన ఓ మహిళ ఈ నిలువు దోపిడీపై మీడియా ముందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గత మూడు నాలుగు నెలలుగా దేవస్థానం వద్ద ఇదే తంతు కొనసాగుతోంది ఆలయ ఉన్నతాధికారి ఆదేశాల మేరకే ఈ విధంగా నిలువు దోపిడీ చేస్తున్నట్లు తెలుస్తోంది గతంలో ప్రస్తుతం ఉన్న పంచామృతాభిషేకం టికెట్లను మూడు కాలాలపాటు నిర్వహించకుండా ఏకకాలంలో నిర్వహించాలని ఉద్దేశంతో 5000 రూపాయలుగా టిక్కెట్ ధర నిర్ణయించి భక్తుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు గతంలో ఉన్న ఈవో సురేష్ బాబు నోటిఫికేషన్ మాత్రం జారీ చేయడంతో ఆయనను దేవదాయ శాఖ ఉన్నతాధికారులు వివరణ కోరుతూ ఆగమేఘాలపై ఇక్కడి నుంచి బదిలీ చేశారు అయితే ప్రతిరోజు లక్షలాది రూపాయలు భక్తుల నుంచి 500 రూపాయలు 1000 రూపాయలు టికెట్లు విక్రయిస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న ఆలయ ఉన్నదాధికారిపై దేవాదాయ శాఖ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇదేవిధంగా ఈ నిలువు దోపిడీ కొనసాగితే చట్టపరంగా ఆలయ ఉన్నతాధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని పలువురు తెలిపారు అలాగే ఈ నిలువు దోపిడి పై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు స్థానిక జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేస్తామని భక్తులు తెలిపారు.

👉రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది…వైఎస్ షర్మిలా రెడ్డి..మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని APCC చీఫ్..వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం,మిక్కిలి శోచనీయం అన్నారు.ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందేనన్నారు .ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి కాదని తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం.అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదని , గెలుపు ఓటములు ఆపాదించడం తగదని వైఎస్సార్ ను అవమాయించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు..బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు .

👉రామోజీ పాడె మోసిన చంద్రబాబు..రామోజీ అంతిమ వీడ్కోలు..హైదరాబాద్..

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంతిమయాత్ర స్మృతి వనం వద్దకు చేరుకుంది. ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర రామోజీ గ్రూపు సంస్థల కార్యాలయాల మీదుగా స్మారక కట్టడానికి చేరింది. అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. స్మృతి వనం వద్ద నివాళులర్పించిన అనంతరం రామోజీరావు పాడె మోశారు చంద్రబాబు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, సినీ ప్రముఖులు, రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు…..

👉ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర గనుల శాఖ కార్యాలయం సీజ్.. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా: మైన్స్ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. ఏపీఎండీసీ ఇంఛార్జ్ వెంకటరెడ్డి బదిలీ కాగానే కార్యాలయానికి తాళాలు.. ఇసుక కేటాయింపుల్లో పలువురికి లబ్ధి చేకూర్చారని ఆరోపణలు.. ఫైల్స్, హార్డ్ డిస్క్ లు బయటికి వెళ్లకుండా అప్రమత్తమైన పోలీసులు..

👉గురువులను ఘనంగా సన్మానించిన పూర్వవిద్యార్ధులు..నంద్యాల :

నంద్యాలలోని రాజారెడ్డి ఫంక్షన్ హాలులో పదోతరగతి విద్యార్థుల పూర్వ సమ్మేళనం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.ఆదివారం నంద్యాల జిల్లా గోస్పాడు మండలం యాళ్ళురు జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలకు చెందిన 1985 -1986 బ్యాచ్ విద్యార్థులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారి సంఖ్యలో పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనానికి

 

తరలివచ్చారు.కార్యక్రమంలో భాగంగా వినాయకునికు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, పూర్వ విద్యార్థులు తమ గురువులైన నాగేశ్వర రెడ్డి, మర్రెడ్డి, వెంకటేశ్వర్లులను పూర్వ విద్యార్థులు నాసర్ వలి, బాల శౌరి, బిపి శ్రీనివాస రెడ్డి, మధు సుధన్ రెడ్డి, బిఎస్ రామా రెడ్డి,సత్యబాబు, మల్లేశ్వర రెడ్డి,రంగరాజు, నాగరాజు తదితరులు వేదిక పైకి హృదయపూర్వకంగా ఆహ్వానించారు.అనంతరం, గురువులను పూర్వ విద్యార్థినిలు హేమలత, అనురాధ, సామ్రాజ్యం, కృష్ణవేణి, లక్ష్మి కుమారి, తదితరులు శాలువాతో సన్మానించగా, పూర్వ విద్యార్థులు నాసర్ వలి,బాల శౌరి, బిఎస్ రామారెడ్డి, సత్యబాబు, శ్రీనివాస రెడ్డి, తదితరులు పూలమాలలతో సత్కరించారు. పూర్వ విద్యార్థులు తమ గురువుల సేవలను గుర్తు చేసుకుంటు ఒక్కరిగా వారి ఆశీర్వాదాలను తీసుకున్నారు.అనంతరం, గురువులైన నాగేశ్వర రెడ్డి, మర్రెడ్డి, వెంకటేశ్వర్లు తమ జీవిత అనుభవాలను వివరించారు.సమస్యలు ఎన్ని వచ్చిన జీవితంలో భాధ పడవద్దని, సమస్యలు తాత్కాలికమే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని సూచించారు. తమ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్న, తమను గుర్తు చేసుకొని తమను సత్కరించడం పట్ల గురుదేవులు సంతోషం వ్యక్తం చేశారు.పూర్వ విద్యార్థులు సమ్మేళనంలో భాగంగా గురువులైన నాగేశ్వర రెడ్డి, మర్రెడ్డి, వెంకటేశ్వర్లుకి మొమెంటోను జ్ఞాపికగా అందజేశారు.అనంతరం, పూర్వ విద్యార్థులు సంస్క్రతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.పూర్వ విద్యార్ధి బిఎస్ రామ రెడ్డి, చిన్నారులు నృత్యాలతో అలరించారు.సుమారు దశాబ్దకాలం అనంతరం కలిసిన అప్పటి విద్యార్థులు, తమ అనుభాలను,తమ జీవితంలో ఎదురైనా సవాళ్ళను, వాటిని ఎలా అధిగమించింది తదితర విషయాలను చెప్పారు. పూర్వ విద్యార్థుల్లో మాజీ సైనికులు, రైతు సోదరులు,పోలీసులు, వ్యాపారులు, వివిధ రంగాలకు చెందిన వారు తమ తమ అనుభవాలను ఈ పూర్వ విద్యార్థులు సమ్మేళనంలో గుర్తుకొస్తున్నాయి..అంటూ గుర్తు చేసుకున్నారు. మరో వైపు తమ అనుభాలను గుర్తు చేసుకుంటూనే… తమతో కలిసి చదువుకొని స్వర్గాస్తులు అయిన మిత్రులకు, వారి ఆత్మకు శాంతి చేకూరలంటూ మౌనం పాటించి, వారికి శ్రద్దాంజలి ఘంటించారు. చివరగా జాతీయగీతం ఆలాపనతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ముగిసింది.అప్పుడు 11వతరగతి లో ఫెయిల్.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్..మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రియాల్ యాదవ్ ఇండోర్ డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఇటీవల విడుదలైన ఎమ్ పి పి ఎస్ సి ఫలితాల్లో ఆమె ఆరో ర్యాంక్ సాధించారు. రైతు బిడ్డ అయిన ఆమె తాను టెన్త్ వరకు స్కూల్ టాపర్ అని, 11వ తరగతిలో ఫిజిక్స్‌లో ఫెయిల్ అయ్యానని తెలిపారు. ఇప్పటివరకు లైఫ్‌లో అదే తన తొలి, చివరి ఫెయిల్యూర్ అని పేర్కొన్నారు. డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తూనే యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతానని చెప్పారు.

👉 ప్రకాశంజిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డిని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు పలు ఉద్యోగస్తులు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.👉ముత్హుముల అశోక్ రెడ్డి ని సన్మానించిన వి ఆర్ ఓల సంఘం..గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ని కలిసిన ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా విఆర్వోల సంఘం అధ్యక్షులు yp రంగయ్య , జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరామయ్య , నాగేంద్రుడు, ఈశ్వర్ రెడ్డి , అక్బర్ వలి, రమణ, అచ్చయ్య, శంకర్,మరియు నియోజకవర్గ వీఆర్వోలు…

7k network
Recent Posts

సీఎం చంద్రబాబు సమీక్ష..చిరు పవన్ లఫై జగ్గారెడ్డి ఘాటు విమర్శలు..రొట్టెల పండుగ ఉత్సవంలో మంత్రి పొంగూరు..ఎవరైనా దళారులుగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు..!! తిరుపతి జిల్లా ఎస్పీ..ఉమెన్స్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ దామోదర్..మరిన్ని వార్తా విశేషాలత

మోదీది ఉత్త డప్పు..సీఎం రేవంత్..వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై ?..ప్రకాశం జిల్లాలో 28ఎర్రచందనం దుంగలు స్వాధీనం..వినుకొండ మర్డర్ వెనుక బ్యాక్ గ్రౌండ్?..వైద్యాధికారి రంగారావుకు ప్రమాదం..కమిషనర్ శాంతి అక్రమాలు..

మోడీ మీద ఉక్రెయిన్ భారం మోపిన అమెరికా..న‌డిరోడ్డుపై వైసీపీ కార్య‌కర్త దారుణ హ‌త్య‌..రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు..! ఎంపీడీవో మిస్సింగ్ పవన్..మార్కాపురంలో ఖైదీ పరారీ.. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం..విద్యార్థులకు ఫాతిమాసంస్థ చేయూత..బాలుడిపై వీధి కుక్క దాడి…

విద్యాదీవెన,వసతిదీవెన స్థానంలో పాత విధానం: నారా లోకేశ్..వైసీపీకి విజయమ్మ కూడా ప్రత్యర్థిగానే..?గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం.. గుంటూరు ఎస్పీగా సతీష్ కుమార్..ప్రకాశం ఎస్పీగా ఏ.ఆర్ దామోదర్.. మొహర్రం వేడుకలలో మాజీ ఎమ్మెల్యే అన్నా

పూరీ భాండాగారం కింద సీక్రెట్ రూమ్?..ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం..ప్రకాశం జిల్లా ఎస్పీకి ఘనంగా వీడ్కోలు..బాలినేని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన దామచర్ల..అభివృద్ధి కోసం పని చేస్తా- ముత్తుముల..అడ్డంగా బుక్కైన వజ్రకరూరు తహసీల్దార్..