ఓడరేవులన్నీ ఆదానీ హస్తగతం..యోగీకి పొగ పెడుతున్నారా ?..బిజెపి ధృత్తరాష్ట్ర కౌగిలిలో టిడిపి…విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి ..అంబటికీ చీర జాకెట్..పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు..కంభంలో బాలయ్య జన్మదిన వేడుకలు ..త్రిపురాంతకం ఎంపీపీ రాజీనామా.

👉 ఓడరేవులన్నీ ఆదానీ హస్తగతం ! ముఖ్యంగా దేశంలోని దాదాపు అన్ని ఓడరేవులు, కీలక విమానాశ్రయాలు ఇప్పుడు గౌతమ్‌ అదానీ కనుసన్నల్లోనే ఉన్నాయి.

దేశంలోని ఓడరేవులన్నీ దాదాపు ఆదానీ హస్తగతం అవుతున్నాయి. గుజరాత్‌ లో 4, ఆంధ్రప్రదేశ్‌ లో 2, తమిళనాడులో 2, గోవాలో 1, మహారాష్ట్రలో 1, కేరళలో 1, పుదుచ్చెరిలో 1, ఒడిషాలో 1 పోర్టు ఇప్పటి వరకు ఆదానీ గ్రూపు చేతిలో ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులో పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా ఓడరేవు చేరింది. వీటితో పాటు ఆదానీకి శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌లోనూ పోర్టులు ఉన్నాయి. మోదీ హయాంలోనే అదానీ గ్రూప్‌ అన్ని రంగాల్లో వేగంగా విస్తరించుకుంటూ పోయింది. ముఖ్యంగా దేశంలోని దాదాపు అన్ని ఓడరేవులు, కీలక విమానాశ్రయాలు ఇప్పుడు గౌతమ్‌ అదానీ కనుసన్నల్లోనే ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఏపీసెజ్‌) లిమిటెడ్‌.. కోల్‌కతాలోని శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ పోర్టు కంటైనర్‌ ఫెసిలిటీ కార్యకలాపాలు, నిర్వహణ కోసం ఐదేండ్ల కాంట్రాక్టును కుదుర్చుకున్నది. కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా ఈ డీల్‌ను పొందినట్టు ఏపీసెజ్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఇప్పటికే దేశంలోని 13 పోర్టులు, టెర్మినల్స్‌ అదానీ గ్రూప్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. వీటిలో 45 బెర్తులున్నాయి. ముంద్రాలోగల దేశీయ తొలి పోర్ట్‌ ఆధారిత సెజ్‌, తిరువనంతపురంలోగల తొలి డీప్‌ వాటర్‌ ట్రాన్స్‌షిప్‌మెంట్‌ పోర్ట్‌ కూడా అదానీ చేతిలో ఉండడం గమనార్హం. నిర్మాణం ప్రారంభం! భారతదేశం తూర్పు తీరంలో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ డాక్‌.. అతిపెద్ద కంటైనర్‌ టెర్మినల్‌. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇక్కడ దాదాపు 0.63 మిలియన్‌ టీఈయూ (20 అడుగులకు సమానమైన యూనిట్‌) హ్యాండ్లింగ్‌ జరిగింది. పశ్చిమ బెంగాల్‌తోపాటు బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, అస్సాం, ఇతర ఈశాన్య రాష్ర్టాలతోపాటు నేపాల్‌, భూటాన్‌లకు సేవలు అందాయి. ఈ డాక్‌కు సింగపూర్‌, పోర్ట్‌ కెలాంగ్‌, కొలంబో పోర్ట్‌ హబ్‌ల నుంచి రెగ్యులర్‌ లైన్‌ సర్వీస్‌ కాల్స్‌ కూడా ఉన్నాయి.

👉 యోగీకి పొగ పెడుతున్నారా ? ఈ నేపథ్యంలో యూపీ పరాజయాలకు యోగీ ఆదిత్యనాథ్ ను బాధ్యుడిగా చేయాలని చూస్తున్నట్లు బీజేపీ శ్రేణులలో చర్చ నడుస్తున్నది.

బీజేపీ కంచుకోట అనుకున్న ఉత్తరప్రదేశ్ లో ఆ పార్టీ ప్రతిష్ట బీటలు వారింది. 2019లో 62 స్థానాలు సాధించిన బీజేపీ ఇప్పుడు కేవలం 33 స్థానాలకే పరిమితమైంది. 2019లో 49.6 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 41.4 శాతానికి పడిపోయింది. ఈసారి బీజేపీ 49 మంది సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వగా 27 మంది ఓడిపోయారు. దీంతో బీజేపీ కేవలం 240 లోక్ సభ స్థానాలకు మాత్రమే పరిమితమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు భాగస్వామ్యపక్షాల మీద ఆధారపడాల్సి వచ్చింది. 2019లో 49.6 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 41.4 శాతానికి పడిపోయింది. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ(అమేథీ), అజయ్‌ మిశ్రా(ఖేరి), మహేంద్రనాథ్‌ పాండే(చందౌలి), ఎనిమిదిసార్లు ఎంపీగా పనిచేసిన మేనకా గాంధీ(సుల్తాన్‌పూర్‌), మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌ సింగ్‌ కుమారుడు రాజ్‌వీర్‌ సింగ్‌(ఎటా) తదితర ప్రముఖ బీజేపీ నేతలు ఓడిపోయారు. ఈ నేపథ్యంలో యూపీ పరాజయాలకు యోగీ ఆదిత్యనాథ్ ను బాధ్యుడిగా చేయాలని చూస్తున్నట్లు బీజేపీ శ్రేణులలో చర్చ నడుస్తున్నది. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా ప్రకటన యోగీకి చెక్ పెట్టేందుకేనని అంటున్నారు. యోగీ మీద ఒత్తిడి పెంచేందుకే ఆయన ఈ ప్రకటన చేశారని అంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో కేంద్ర నాయకత్వం తప్పిదమే ఈ ఫలితాలకు కారణమని యోగీ వర్గం వాదిస్తుండగా, యూపీలో వరుసగా జరిగిన ప్రశ్నా పత్రాల లీకేజీలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల వాయిదాలు, పెరిగిపోయిన నిరుద్యోగం, వంటి అంశాలు ఎన్నికల్లో బీజేపీకి నష్టం చేశాయని అంటున్నారు. అందుకే యోగీని వీటికి బాధ్యుడిని చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని చెబుతున్నారు. కొంతకాలం ఆగితే ఏం జరుగుతుందో తెలుస్తుంది.

👉 బీజేపీ యొక్క ధృతరాష్ట్ర కౌగిలి నుండి టీడీపీ కాపాడబడుతుందా! .. రేకా చంద్ర శేఖర రావు…

బీజేపీతో స్నేహం చేసి పతనమైన పార్టీలు ఎన్నో ….ఎన్నెన్నో ..1.) ఒక నాడు 30 సంవత్సరాల క్రితం బహుజన సమాజ్ పార్టీ , సమాజ్ వాదీ పార్టీ కలయికతో ఉత్తర ప్రదేశ్ లో ఆ రెండు పార్టీల ప్రభుత్వం ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా ఏర్పడింది. ఆ రెండు పార్టీల మద్య విభేదాలు చిలికి చిలికి గాలి వానగా మారిన తర్వాత బీజేపీ మద్దత్తుతో మాయావతి ముఖ్యమంత్రిగా బీ యస్ పీ ప్రభుత్వం ఏర్పడింది. ఇదేమిటి అన్న వారికి మనువాద, మతోన్మాద బీజేపీ కంటే సమాజవాది పార్టీయే మనకు ప్రధాన శత్రువు అని బహెన్ మాయావతి చెప్పారు. తర్వాత క్రమంగా బీ యస్ పీ పతనం అయ్యి  ఆ స్తానాన్ని బీజేపీ ఆక్రమించింది. బీజేపీతో పోరాడుతున్న సమాజవాదీ పార్టీ బతికి వుంది, బలంగా ఉంది..2.) కాశ్మీర్ లో బీజేపీతో స్నేహం చేసిన పీడీపి నేడు అడ్రస్సు గల్లంతయ్యింది.3.)పంజాబ్ లో బీజేపీతో స్నేహం చేసిన అకాలీ దళ్ మసకబారింది. ఒక నాడు అది ఆరాష్ట్రాన్ని పాలించింది.4.)తమిళ నాడులో తనతో స్నేహం చేసిన అన్నా డియంకే ఉనికిని కోల్పోయింది. ఆ పార్టీ తమిళనాడుని అనేక సార్లు పాలించింది. నేడు ఆ పార్టీ రెండు మూడు ముక్కలయి లేవలేక పోతున్నది.5.)తనతో స్నేహంగా ఉంటున్నందుకు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్  బీజేడి.. పార్టీకి నేడు నడుములు ఇరిగాయి. బీజేపీ మొదటి సారిగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది.6.) మహారాష్ట్రలో బలమయిన శివ సేన, శరద్ పవర్ పార్టీలను రెండు రెండు పార్టీలుగా చీల్చి , అందులోని ఒక్కొక్క వర్గాన్ని తమ తొత్తులుగా బీజేపీ మార్చుకుంది.7.) రెండు స్తంభాల ఆట బీజేపీ – కాంగ్రెసులతో ఆడుతూ ఎలాగో తన జే డీ యూ ఉందని అనిపించుకుంటున్నాడు నితీష్ కుమార్ .8.) విడి పోయిన టీడీపీ ని మరల కూటమిలోకి వచ్చేలా చేయగలిగింది బీజేపీ .అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని టీడీపి నేడు బలమైన శక్తిగా నిలబడింది. మైనారిటీ సంకీర్ణ కేంద్ర ప్రభుత్వంలో ఉంటూ ఆంధ్ర ప్రదేశ్ హక్కులను, రావలసిన వాటాలను చంద్రబాబు సాధించుకో గలిగితే తెలుగు దేశం నిలబడుతుంది. అన్ని పార్టీలను బ్లాక్ మెయిల్ చేసిన విధంగా టీడీపీ బ్లాక్ మెయిలింగుకి గురి అవుతుందా ! తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకుని చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ని ప్రగతి పథాన నిలుపగలుగుతాడా !కాలమే చెబుతుంది.బీజేపీతో పోరాడుతున్న డియంకే, సమాజ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెసు వంటి పార్టీలు బతికి బట్ట కడుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు కాపాడబడాలంటే సమాఖ్య వ్యవస్త బలంగా ఉండాలి.సమాఖ్య వ్యవస్తను రద్దు చేసి యూనిటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు కావాలని కోరుకునే బీజేపీ రాష్ట్రాల హక్కులను ఎందుకు కాపాడుతుంది?ఈ లాజిక్ ని మరచి పోయిన ప్రాంతీయ పార్టీలు పతనం అవుతాయి.సమాఖ్య వ్యవస్త బలంగా ఉండాలన్న లక్ష్యం కలిగిన వాడు యన్టీఆర్. ఆయన వారసులం అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ సమాఖ్య వ్యవస్త బలంగా ఉండాలి అన్న శక్తులతో కాక , సమాఖ్య వ్యవస్త పట్ల, రాష్ట్రాల హక్కుల పట్ల ఏ మాత్రం గౌరవం లేని బీజేపీతో చేస్తున్న స్నేహం నిలబడుతుందా!మైనారిటీలతో మైత్రిని కోరుతూ, మైనారిటీలకు రక్షణగా ఉండే తెలుగు దేశం బీజేపీ మోసపు ఎత్తుగడలకు గురయ్యి మైనారిటీ వ్యతిరేక పార్టీగా మారి యన్టీఆర్ కి ద్రోహం చేస్తుందా! బీజేపీ యొక్క ధృతరాష్ట్ర కౌగిలి నుండి టీడీపీ కాపాడబడుతుందా! వేచి చూద్దాం!

👉ముంబై విమానాశ్రయంలో 32.79 కేజీల బంగారం స్వాధీనం :జూన్ 10..ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల వద్ద రూ.19.15 కోట్లు విలువ చేసే 32.79 కేజీల బంగారాన్ని గుర్తించారు.లోదుస్తులు, బ్యాగుల్లో 72 బిస్కెట్లను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని వారిద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

👉విద్యుత్ షాక్ తో అన్నదమ్ములు మృతి..ప్రకాశం జిల్లా గిద్దలూరు లో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఓ శుభకార్యానికి ఆటోలో సప్లయర్స్ సామాన్లు తరలించి తిరిగి తీసుకు వెళుతున్న క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ నీటి మోటర్ వైర్లు ఆటోకు తాకి విద్యుత్ సరఫరా కావడంతో ఆటలో ఉన్న అన్నదమ్ములు శీలం లోహిత్ (18) శీలం సాయి (16) అక్కడికక్కడే మృతి చెందారు. మొదట కుటుంబ సభ్యులు అన్నదమ్ములను ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు కానీ అప్పటికి ఇద్దరు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

👉వైసీపీ నేత అంబటి రాంబాబుకు చీర, జాకెట్, పూలు ఇచ్చేందుకు వచ్చిన తెలుగు విద్యార్థి నేతలు.చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం.. అడ్డుకున్న పోలీసులు. ఇంటి ముందు అంబటి ఫొటోకు బొట్టు పెట్టి, కుర్చీలో వస్తువులు పెట్టిన విద్యార్థి నేతలు.

👉 అనకాపల్లిలో శ్రీనూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అధికారంలోకి వస్తే నూకాంబికా అమ్మవారిని దర్శించుకుంటానని మొక్కుకున్న పవన్ కళ్యాణ్మొక్కు తీరడంతో అనకాపల్లి నూకాంబికా అమ్మవారి దర్శించుకున్న పవన్ కళ్యాణ్.

👉టిడిపి సీనియర్ నాయకులకు సన్మానం..గిద్దలూరు నియోజకవర్గంలో ముత్తుముల అశోక్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలిచిన సందర్భంగ సోమవారం కంభం మండల టీడీపీ అధ్యక్షులు తోట శ్రీను , ఒంగోలు పార్లమెంట్ నాయకులు కేతం శ్రీను, కొత్తపల్లి శ్రీను, ఒంగోలు పార్లమెంట్ మైనారిటీ నాయకులు ఎన్టీఆర్ గౌస్, సీనియర్ నాయకులు సయ్యద్ నూరుల్లా ఖాద్రీ,టీడీపీ పట్టణ అధ్యక్షులు మాధవ మూర్తిలను అర్బన్ కాలనికి చెందిన జేడీ బాబు, మెడిగ శ్రీను ఘనంగా సన్మానించారు .కార్యక్రమంలో మహబూబ్ బాషా , బషీర్,కాకర్ల పిచ్చయ్య, హుస్సేన్ , ముజీబ్, మున్నా , మాజ్ ,ఇస్మాయిల్, కాశయ్య తదితరులు పాల్గొన్నారు

👉 కంభం లొ ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు ..  కంభం మండలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు జూనియర్ గౌస్ ఆధ్వర్యంలో,హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాల క్రిష్ణ 64 వ పుట్టిన రోజు సందర్భంగా కంభం పట్టణం లో అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు నూరుల్లా ఖాద్రీ, సోమయ్య,కేతం శ్రీనివాసులు,సయ్యద్ గౌస్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు దాదా తదితరులు పాల్గొన్నారు

👉 త్రిపురాంతకం ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి రాజీనామ..రాజీనామా పత్రాన్ని జడ్పీ సీఈవోకు రాజీనామ అందజేసిన ఎంపీపీ.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?