30 కోట్ల పందెం వేసి చెల్లించలేక వ్యక్తి ఆత్మహత్య..ఎగ్జిట్ పోల్స్ ఈవీఎంలను మేనేజ్ చేయడానికేనా ?..ఏపీలో కూడా ఫొన్ ట్యాపింగ్త్ త్వరలో విచారణ జరిపిస్తా–లోకేష్..గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటా- వైసీపీ కార్యకర్త..కేసులు నీరుగారే విధంగా ఎఫ్‌ఐఆర్‌లు..సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఓ బ్యాంక్ మేనేజర్..రిటైర్డ్ ఉద్యోగిని ముంచిన ముఠా..చంద్రబాబు,లోకేష్ లను కలిసిన ముత్తుముల .

👉నూజివీడు : సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా గెలుస్తుందని సుమారు రూ.30 కోట్ల పందెం వేసి తిరిగి చెల్లించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాలరెడ్డి (52) ఏడో వార్డు సభ్యుడు. భార్య సర్పంచి.వీరు వైకాపా మద్దతుదారులు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైకాపా గెలుస్తుందని వేణుగోపాలరెడ్డి వివిధ గ్రామాలకు చెందిన వారితో సుమారు రూ.30 కోట్ల వరకు పందెం వేశారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు రోజు ఊరు విడిచి వెళ్లారు. పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో ఇంటికి తిరిగి రాలేదు. పందెం వేసిన వారు ఫోన్లు చేసినా స్పందించకపోవడం..గ్రామంలో లేకపోవడంతో ఈ నెల 7న పందెం వేసినవారు ఆయన ఇంటికెళ్లి తలుపులు పగులగొట్టి ఏసీలు, సోఫాలు, మంచాలు తదితర వస్తువులు తీసుకెళ్లిపోయారు.ఈ క్రమంలో మరుసటిరోజు ఊళ్లోకి వచ్చిన ఆయన విషయం తెలిసి మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం పొలం వద్ద పురుగు మందు తాగారు. మృతదేహం వద్ద ఓ లేఖను ‘ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా తన భర్త మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్నట్లు మృతుడి భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

👉 ఎగ్జిట్ పోల్స్ ఈవీఎంలను మేనేజ్ చేయడానికేనా ? ఎగ్జిట్ పోల్స్ దేశంలో వెల్లువలా వచ్చి పడే కల్చర్ గత మూడు నాలుగు ఎన్నికల నుంచి మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ దేశంలో వెల్లువలా వచ్చి పడే కల్చర్ గత మూడు నాలుగు ఎన్నికల నుంచి మొదలైంది. అంతకు ముందు అలాంటిది ఏమీ లేదు. ఎగ్జిట్ పోల్స్ గురించి పాపులర్ చేసింది కూడా ఎన్నికల వ్యూహ కర్తలే. జనాల మనసులో తమ అభిప్రాయాలను చొప్పించడానికి ప్రీ పోల్ సర్వేలను విచ్చలవిడిగా నిర్వహిస్తూ హల్ చేసే సంస్థలు పోలింగ్ రోజు జనాల అభిప్రాయం తీసుకున్నామని చెబుతూ ఎగ్జిట్ పోల్స్ ని నిర్వహించడం మొదలెట్టాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఎన్ని కరెక్ట్ అవుతున్నాయన్నది పక్కన పెడితే ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్ కంటే వీటికే ఎక్కువ ఆసక్తి ఉండేలా చూసుకోవడంలో మాత్రం చాలా సంస్థలు సక్సెస్ అయ్యాయి. ఈ నేపధ్యంలో ఎగ్జిట్ పోల్స్ అసలు ఎందుకు అన్న చర్చకు తెర లేస్తోంది. వాటి వల్ల ఉపయోగం ఏమిటి అన్నది కూడా ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఎగ్జిట్ పోల్స్ తరువాత కేవలం ఒకటి రెండు రోజుల తేడాలో అసలు ఫలితాలు వస్తాయి. మరి ఈ రెండు రోజులలో ఎవరిని సంతోషపెట్టడానికి అన్న ప్రశ్నలు కూడా బోలెడు కలుగుతాయి. అయితే కార్పోరేట్ కల్చర్ లోకి ఎన్నికలు వెళ్ళాక ప్రతీదీ బిజినెస్ ఫోకస్డ్ గానే చేస్తూ పోతున్నారు. ఈ నేపధ్యంలో ఎగ్జిట్ పోల్స్ కి కూడా అర్ధాలు పరమార్ధాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంటే ఈవీఎంలను మానేజ్ చేయడానికా అన్నట్లుగా దేశంలో ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. నిజానికి ఈసారి చూస్తే ఒక్కటి అంటే ఒక్క ఎగ్జిట్ పోల్ నిజం కాలేదు. దాదాపుగా అన్నీ ఫెయిల్ అయ్యాయి. దీనికి నేషనల్ మీడియా ఏ విధంగా సమర్ధించుకుంటుందో తెలియదు కానీ ఎగ్జిట్ పోల్ సర్వేలు అయితే అసలు ఫలితాలకు దరిదాపులలోకి కనీసంగా కూడా రాలేదని చెప్పక తప్పదు. అదే టైం లో ఎగ్జిట్ పోల్స్ తప్పుగా వచ్చాయంటే ఈ లోపల ఈవీఎంలను మేనేజ్ చేసుకోవడానికి చూస్తున్నారా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. అంటే ఎగ్జిట్ పోల్స్ లో ఎలా వచ్చినా ఈవీఎంలలో మాత్రం తమకు వీలుగా మేనేజ్ చేసుకునే విధానాన్ని అమలు చేసుకునే వెసులుబాటు దొరుకుతోంది అని అంటున్నారు. అసలు ఈవీఎంలను మేనేజ్ చేయవచ్చా అంటే దాని మీద కూడా అనుకూలంగా ప్రతికూలంగా చర్చ సాగుతోంది. చేయవచ్చు అని అంటున్న వారూ ఉన్నారు. తమకు ఎక్కడ ఏమైనా ఇబ్బది ఉంటే ఆయా చోట్ల మేనేజ్ చేసుకుని ఒడ్డున పడే విధంగానూ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ ని వాడుకుంటున్నారు అని అంటున్నారు. నిజానికి చూస్తే ఎగ్జిట్ పోల్స్ అన్నవి ఓటర్ల మనోభావాలను ఎంతో కొంత బయటపెడతాయని చెబుతారు. అలా కనుక తమ పెర్ఫార్మెన్స్ ఎక్కడైనా పూర్ గా ఉంటే దానిని సరి చేసుకోవడానికి ఎగ్జిట్ పోల్స్ కి ఎగ్జాక్ట్ పోల్స్ కి మధ్య ఆ చివరి రెండు రోజులను పూర్తి ఫలవంతంగా ఉపయోగించుకుంటారా అన్న డౌట్లు వస్తున్నాయట. అసలు నేషనల్ మీడియా ఎందుకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తోంది ఎవరి కోసం అంటే ఇంత కంటే వేరే ప్రయోజనాలయితే లేవని అంటున్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం మీద ఒక వైపు చర్చ జరుగుతున్న వేళ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అందులో ఎంత వాటాను అందుకుంటున్నాయన్న చర్చ కూడా సాగుతుంది. గెలుస్తామని చెప్పడం కాదు ఎన్ని గెలుస్తామని చెబితే దానిని బట్టి ఇబ్బంది ఉన్న చోట్ల సర్దుబాట్లు దిద్దుబాట్లకు వీలుగానే ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు ఉంటున్నాయా అన్నది కూడా సందేహంగా ఉందని అంటున్నారు. కాదేదీ అక్రమానికి అనర్హం అని చెబుతారు. ఏ విధానమూ పూర్తిగా లోపాలు లేకుండా ఉండదు, బ్యాలెట్ పేపర్ మీద ఓటింగ్ అంటే అందులో కూడా చాలా పొరపాట్లు ఉన్నాయి. అదే టైంలో ఈవీఎంల విషయంలో దానికి మించి శతకోటి సందేహాలు ఉన్నాయి. డెవలప్మెంట్ పెరిగి ఈ విధంగా ఎన్నికలలో కార్పోరేట్ కల్చర్ వెర్రి తలలు వేస్తున్న క్రమంలో ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వల్ల లాభాలు ఏంటి అంటే అంతా ఇక్కడికే ఇదే రకమైన ఆలోచనలకే రావాల్సి వస్తోంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికలకు సర్వేలకు అలాగే సర్వేలకు ఎగ్జిట్ పోల్స్ కి ఆ మీదట ఎగ్జిట్ పోల్స్ కి ఈవీఎంల మానేజ్మెంట్ కి మధ్య విడదీయలేని విష బంధం ఏమైనా ఉందేమో అన్నది ప్రజాస్వామ్య ప్రియుల సందేహం. ఈ సందేహం విలువ వెల కట్టలేనిది. జవాబు చెప్పేవారు ఉంటే మాత్రం అది అద్భుతమే అవుతుంది.

👉ఏపీలో కూడా ఫొన్ ట్యాపింగ్త్ త్వరలో కేసు వేసి విచారణ జరిపిస్తా – లోకేష్ బాబు..పెగాసిస్ సాఫ్ట్వేర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.ఫోన్ ట్యాపింగ్ పై తమ దగ్గర కచ్చితమైన ఆధారాలు ఉన్నాయంటున్న నారా లోకేష్.త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించే అవకాశం.

👉 కొవ్వూరు గామన్ బ్రిడ్జి పై బ్రాహ్మణ గూడెం గ్రామానికి చెందిన వ్వక్తి ఫ్యామిలీ తో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి అత్యధికమంది ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు విచారణ చేయాలనిడిమాండ్ చేస్తున్నాడు. పోలీసు అధికారులు వస్తే దూకేస్తానని బెదిరిస్తున్నారు.

👉జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించారు. సభ్యులు అందరూ ఏకగ్రీవంగా బలపరిచడం జరిగింది.సమావేశంలో రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొనడం జరిగింది.

👉అయ్యో ఆవేశంలో రాజీనామా చేసామే అనుకుంటున్న వాలంటీర్లు ..రాజీనామా చేసిన 1,08,273 మంది వాలంటీర్ల పరిస్థితేంటి?..ఆంద్రప్రదేశ్ లో ఎన్నికల ముందు రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ప్రస్తుతం రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,08,273 మంది రాజీనామా చేశారు.మళ్లీ వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.వాలంటీర్లకు నెలకు రూ.10 వేల జీతం ఇస్తామని ప్రచారంలో చంద్రబాబుహామీ ఇచ్చారు. కానీ రాజీనామా చేసినవారికి తిరిగి ఉద్యోగం రాకపోవచ్చు…👉పల్నాడు, తిరుపతి, అనంతపురం ఘటనలపై సిట్‌ నివేదిక..కేసులు నీరుగారే విధంగా ఎఫ్‌ఐఆర్‌లు..264 పేజీలతో రెండు వ్యాల్యూములు..డిజిపి, ఇసి కార్యాలయానికి నివేదిక..అమరావతి : ఎన్నికల సమయంలో తలెత్తిన ఘర్షణల్లో నిందితులను రక్షించే విధంగా అప్పటి పోలీసు అధికారులు వ్యవహరించారని సిట్‌ నివేదిక పేర్కొంది. ఎన్నికల రోజు, అనంతరం పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన హింసపై ఎన్నికల సంఘం సిట్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఐజి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను చీఫ్‌గా నియమించింది. ప్రాథమిక విచారణ అనంతరం 267 పేజీలతో కూడిన రెండు వ్యాల్యూములను సోమవారం డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తాకు, ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఈ నివేదికలో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. ఎన్నికల రోజు పల్నాడు జిల్లాలో ఇవిఎంలు పగులకొట్టింది ఎవరో తెలిసినా వారి పేర్లు నమోదు చేయలేదని సిట్‌ పేర్కొంది. బిఎల్‌ఒలు కూడా వారి పేర్లతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, ఫలితంగా అగంతకులుగా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని తెలిపారు. అది కూడా ఎన్నికలకు సంబంధించి కఠిన నిబంధనలు కాకుండా సర్వసాధారణ సెక్షన్లు పెట్టారని నివేదికలో తెలిపారు. పల్నాడు జిల్లాలో ఓ ఎమ్మెల్యే ఇవిఎంను పగులకొడితే అక్కడ ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదని, పోలీసులూ పట్టించుకోలేదని గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారని చెప్పడంతోపాటు అసలు ఏం జరిగిందో కూడా విచారణ చేయలేదని తెలిపారు. నిందితులను కూడా ప్రశ్నించలేదని పేర్కొన్నారు.అలాగే బాధితుల నుండి వివరాలూ తీసుకోలేదని,వారికి వైద్య పరీక్షలు చేయించడం, చికిత్స నివేదికలు పొందుపరచడం వంటి అంశాలను కూడా కేసుల్లో చేర్చలేదని తెలిపారు. దీనివల్ల కేసు నీరుగారిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. తాడిపత్రిలో వైసిపి, తెలుగుదేశం పార్టీల అభ్యర్థులకు ద్విచక్ర వాహన ర్యాలీలు చేసుకునేందుకు అవకాశం కల్పించారని వివరించారు.ఇది 144 సెక్షన్‌కు విఘాతం కలిగేలా చేసిందని వివరించారు.తిరుపతి, పల్నాడు జిల్లాల్లో అల్లరిమూకలు విధ్వంసం సృష్టించాయని, ఈ కేసుల్లో పోలీసుల వాహనాలు ధ్వంసం చేసినా పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదని నివేదికలో పేర్కొంది. పల్నాడు జిల్లాలో పోలీసులు ఘటనలను అసలు సీరియస్‌గా తీసుకోలేదని వివరించారు. దాడులు చేసింది ఎవరో తెలిసినా వారిని అరెస్టు చేయలేదని, నివాస ప్రాంతాల్లో దాడులు జరిగినా సాక్షులను విచారించలేదని తెలిపింది. మొత్తంగా 37 కేసులు నమోదు చేశారని, రెండు కేసుల్లో చార్జిషీటు దాఖలు చేశారని పేర్కొన్నారు. ఈ కేసుల్లో నిందితులకు శిక్షలు పడే వారకూ ఎస్‌పిలు, డిఐజిలు పర్యవేక్షించాలని సిట్‌ సూచించింది.లేనిపక్షంలో కేసులు నీరుగారిపోతాయని పేర్కొంది.మొత్తంగా సిట్‌లో 11 మంది అధికారులు ప్రత్యక్ష విచారణలు జరిపి నివేదికలు తయారు చేశారు.

👉గుంటూరు: వైకాపా ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్పై మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘరామకృష్ణరాజు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఘటనకు సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ బాధ్యులని తెలిపారు. అలాగే, తన గాయాలపై గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ప్రభావతి కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగనన్ను విమర్శిస్తే చంపేస్తానని సునీల్ కుమార్ బెదిరించారని తెలిపారు. తన ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.

👉 సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఓ బ్యాంక్ మేనేజర్ ..నాగర్ కర్నూల్ జిల్లా..వాట్సాప్ డిపి ని న్యూడ్ ఫోటో గా చిత్రీకరించి బ్యాంక్ మేనేజర్ ని బ్లాక్ మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లు..సైబర్ నేరగాళ్ల వికృత చేష్టలకు భయపడి 1 లక్ష 56 వేల రూపాయలు ముట్ట చెప్పుకున్న బ్యాంకు మేనేజర్ అయినప్పటికీ వదలని సైబర్ నెరగాళ్లు..బ్యాంకు మేనేజర్ కాంటాక్ట్స్ లో ఉన్న 300 మందికి న్యూడ్ ఫోటోలను పంపిన సైబర్ నెరగాళ్లు.చేసేదేమీ లేక తీవ్ర ఆవేదనతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బ్యాంక్ మేనేజర్.. జిల్లా కేంద్రంలో నివాసముంటున్న ఓ బ్యాంకు మేనేజర్ కు జరిగిన సంఘటన..సైబర్ నేరగాళ్లు ఎంతకైనా తెగిస్తారు అన్నదానికి ఇదే ఉదాహరణ .ప్రజలారా తస్మాత్ జాగ్రత్త సోషల్ మీడియాలో జాగ్రత్తలు తప్పనిసరి..

👉ఆంధ్రప్రదేశ్ లో షాకింగ్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ సీబీఐ, కస్టమ్స్, నార్కోటిక్స్ అండ్ ఇన్కంటాక్స్ ఆఫీసర్ల ముఠా ఒక రిటైర్డ్ ఉద్యోగిని నిలువునా ముంచేసింది. ఒకటీ, రెండూ కాదు ఏకంగా రూ.85 లక్షలను స్వాహా చేసింది.వివరాలు ఇలా ఉన్నాయి.ఒక ఎజెన్సీ(జర్మనీకి చెందిన ఫార్మా)లో అసోసియేట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి తన కొడుకు చదువుకోసం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. మే 2న రిటైర్మెంట్ సెటిల్మెంట్ డబ్బులు అతని ఉత్తమ్ నగర్ బ్రాంచ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న ఆయన కుమారుడి వీసా అపాయింట్మెంట్ మే 17న ఉంది. ఇక్కడే ముఠా తమ పథకాన్ని పక్కాగా అమలు చేసింది.మే 14న, తండ్రి రికార్డులను తనిఖీ చేస్తామంటూ నకిలీ ముఠా రంగంలోకి దిగింది. పథకం ప్రకారమే రెండు రోజుల పాటు స్కైప్లో ‘ఇంటరాగేషన్’ చేసి, ఫేక్ ఐడీ కార్డులు చూపించి ఆయన్ను నమ్మించింది.నకిలీ సైబర్ క్రైమ్ డీసీపీ అంటూ బాధితుడికి మరో వ్యక్తి ఫోన్ చేశాడు. మాదక ద్రవ్యాలు, మనీలాండరింగ్ అలాంటి అనేక కేసుల్లో నీ పేరు వచ్చిందని, ఈ కేసులన్నింటికీ తన ఆధార్ లింక్ చేసి ఉన్నట్టు బెదించారు. అంతేకాదు మరొక వ్యక్తికి డయల్ చేసి,ఇతనిపై (రిటైర్డ్ ఉద్యోగి) ఎన్ఐఆర్ నమోదు చేయాలా అంటూ నాటకమాటాడు. ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు అంటూ ఆదేశించాడు. లేదంటే జైలుకెళతావని కూడా బెదిరించాడు.దీంతో తీవ్ర భయానికి, ఒత్తిడికి లోనైనాడు. ఇంతలోనే నకిలీ డీసిపీ మళ్లీ ఫోన్ చేసి మీరు నిర్దోషిగా కనిపిస్తున్నారు, కాబట్టి. రూ.85 లక్షలు తక్షణమే చెల్లించండి. వెరిఫికేషన్ తర్వాత 15 నిమిషాల్లో తిరిగి ఇస్తానని నకిలీ అధికారులు హామీ ఇవ్వడంతో దీన్ని నమ్మిన బాధితుడు చెక్కు ద్వారా చెల్లింపు చేశారు.విశాఖపట్నంలో పోలీసులకు దాఖలు చేసిన ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఎఆర్) ప్రకారం ఈ నగదును ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో హెచ్ఎఫ్సి ఖాతాను నిర్వహిస్తున్న ‘రాణా గార్మెంట్స్’ అనే కంపెనీకి బదిలీ చేసింది. తరువాత దేశవ్యాప్తంగా ఉన్న మరో 105 ఖాతాలకు ఈ సొమ్మును బదిలీ చేసినట్టు తేలింది.విశాఖ బ్యాంకులోని కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉందని, రిటైర్మెంట్ తర్వాత అతను పొందిన డబ్బులు, తన ఖాతా గురించి మొత్తం సమాచారం ఈ ముఠాకు తెలుసునని ఆరోపించారు. అలాగే రాణా గార్మెంట్స్ KYC వివరాలు బ్యాంకు దగ్గర లేవా ఆయన అని ప్రశ్నించారు.హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉత్తమ్ నగర్ బ్రాంచ్ కూడాపోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాఖ క్రైం బ్రాంచ్ ఈ కేసును టేకోవర్ చేసింది. కేసు దర్యాప్తులో ఉందని, తమకు కొన్ని ఆధారాలు లభించాయని పోలీసు వర్గాలు తెలిపాయి.

👉 ప్రకాశంజిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డిని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు ఉద్యోగస్తులు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు…..👉మంగళగిరి.. తాడేపల్లి లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుని అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ బాబులను మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన  గిద్దలూరు ఎమ్మెల్యే అశోకరెడ్డి ..

👉విద్యుత్ షాక్ తో మరణించిన సోదరులకు సంతాపం తెలిపిన కుందూరు..గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన సోదరులు శీలం లోహిత్ (18)శీలం సాయి (16) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మరణించగా, విషయం తెలుసుకున్న గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించి, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు….

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?