24 మందితో చంద్రబాబు కొత్త టీం..ప్రత్యేక ఆకర్షణగా విదేశీ ప్రతినిధులు..మహిళను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన ఎస్సై..పొదిలిలో అన్నదానం కంభంలో టిడిపి జనసేన సంబరాలు

👉👉 24 మందితో చంద్రబాబు కొత్త టీం…17మంది ప్రత్యేకత ఇదే! ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.ఆయంతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు.చంద్రబాబుతో పాటు మరో 24మంది చేత గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు

 ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టీస్ ఎన్వీ రమణ, చిరంజీవి, రజనీకాంత్ దంపతులతోపాటు రాంచరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త కేబినెట్ లో జనసేన నుంచి ముగ్గురికి మంత్రిపదవులు దక్కగా.. బీజేపీ నుంచి ఒకరిని మంత్రిపదవి వరించింది. ఇందులో భాగంగా.. జనసేన నుంచి పవన్ కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లకు అవకాశం దక్కింది. ఇక బీజేపీ విషయానికొస్తే… ఆ పార్టీ నుంచి సత్యకుమార్ యాదవ్ కు ఛాన్స్ దక్కింది. ఈ క్రమంలోనే ప్రమాణస్వీకారం చేసిన వారిలో 17 మంది కొత్తవారే కావడం గమనార్హం. ఈ సందర్భంగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారి జాబితా ఈ విధంగా ఉంది. పవన్ కల్యాణ్ (పిఠాపురం) నారా లోకేష్ (మంగళగిరి) అచ్చెన్నాయుడు (టెక్కలి) నాదెండ్ల మనోహర్‌ (తెనాలి) సత్యకుమార్‌ (ధర్మవరం) కొల్లు రవీంద్ర (మచిలీపట్నం) వంగలపూడి అనిత (పాయకరావుపేట) నిమ్మల రామానాయుడు (పాలకొల్లు) పొంగూరు నారాయణ (నెల్లూరు సిటీ) ఎన్‌.ఎం.డీ ఫరూక్‌ (నంద్యాల) పయ్యావుల కేశవ్‌ (ఉరవకొండ) ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు) అనగాని సత్యప్రసాద్‌ (రేపల్లె) కొలుసు పార్థసారథి (నూజివీడు) గొట్టిపాటి రవికుమార్‌ (అద్దంకి) డోలా బాల వీరాంజయనేయ స్వామి (కొండపి) గుమ్మిడి సంధ్యారాణి (సాలూరు) బీసీ జనార్దన్‌ రెడ్డి (బనగాలపల్లి) కందుల దుర్గేష్‌ (నిడదవోలు) సవిత (పెనుకొండ) వాసంశెట్టి సుభాష్‌ (రామచంద్రపురం) టీజీ భరత్‌ (కర్నూలు సిటీ) మండపల్లి రామ్‌ ప్రసాద్‌ రెడ్డి (రాయచోటి) కొండపల్లి శ్రీనివాస్‌ (గజపతినగరం) .

👉చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా విదేశీ ప్రతినిధులు..గన్నవరం*ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి విదేశీ అతిథులు హాజరయ్యారు.**వివిధ దేశాల తరఫున కాన్సలేట్ ప్రతినిధులు వచ్చారు.**వీరిలో సింగపూర్‌, అమెరికా, జపాన్‌, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌ తదితర దేశాల ప్రతినిధులు ఉన్నారు.నవ్యాంధ్రలో నవశకం సారధ్య బాధ్యతలు తీసుకున్న చంద్రబాబుపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. పెట్టుబడులు తీసుకొచ్చి, పరిశ్రమల స్థాపనతో రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేస్తారని యువత గంపెడాశలు పెట్టుకుంది. దీంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయం నుంచి, ప్రజల కోసమే తాను శ్రమిస్తానని బాబు ప్రకటించడం కూడా ప్రజల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది.ఈ క్రమంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అయితే, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి దేశంలోని నేతలే కాకుండా, విదేశీ ప్రతినిధులు కూడా హాజరు కావడం ఆసక్తిగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన అనంతరం అమరావతికి పూర్వవైభవం రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆయా దేశాలు పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నాయనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు తగ్గట్లుగా ఆయా దేశాలు వారి వారి ప్రతినిధులను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పంపించాయి. వివిధ దేశాల తరఫున కాన్సల్‌ ప్రతినిధులు వచ్చారు. వీరిలో సింగపూర్‌, అమెరికా, జపాన్‌, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌ తదితర దేశాల ప్రతినిధులు ఉన్నారు.

👉వైసీపీ మాజీ నేతలిద్దరికి మంత్రి పదవులు..ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిలో ఇద్దరు నేతలు మాత్రమే చంద్రబాబు కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. కొలుసు పార్థసారథి(నూజివీడు), ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు)మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), వసంతవెంకటకృష్ణప్రసాద్ (మైలవరం), కోనేటి ఆదిమూలం(సత్యవేడు), గుమ్మనూరి జయరాం (గుంతకల్లు)కుఅవకాశం దక్కలేదు.

👉సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

👉 కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 41 మంది దుర్మరణం..కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలో ఓ భవనంలోని కిచెన్‌లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని కొందరు మృతిచెందగా.. మరి కొందరు భయపడి భవనంపై నుండి దూకి మృతిచెందారు.ఈ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. వీరిలో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం

👉 పాడేరు ఘాట్ రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం అదుపు తప్పి రోడ్డు కు అడ్డంగా పల్టీ కొట్టిన వ్యాన్ మృతులు సుమారు 5 మంది కి పైగానే ఉండే అవకాశం ప్రస్తుతం గుర్తించిన మృతులు 4 మంది తీవ్ర గాయాలు పాలై మృత్యువు తో పోరాడుతున్న మరి కొంతమంది క్షత గాత్రులు

*చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా అన్నదానం.

మార్కాపురం తెలుగుదేశం శాసనసభ్యులుగా కందుల నారాయణ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిచిన త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ప్రజలకు అన్నదానం..పొదిలి ప్రకాష్ నగర్ లో భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన తెలుగుదేశం నాయకులు మౌలాలి.అన్నదాన కార్యక్రమానికి భారీగా పాల్గొన్న ప్రకాష్ నగర్ ప్రజలు..కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు ముల్లా ఖుద్దూస్, షాహిద్, ముల్లా రబ్బాని, యువ నాయకులు గిద్దలూరు శ్రీకాంత్ తదితరులు పట్టణ మరియు మండల తెలుగుదేశం నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు

👉 కంభం లో టిడిపి జనసేన నాయకుల సంబరాలు…ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, కొణిదల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా కంభం పట్టణంలో కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

👉మహిళను ఢీకొట్టి …ఆగకుండా వెళ్లిపోయినఎస్సై.!!!తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పరిధిలోని ఎంపేడు వద్ద ఏర్పేడు-వెంకటగిరి రహదారిపై కారు ప్రమాదం.ఒకరు మృతి, మరొకరికి గాయాలు..గాయాలైన వ్యక్తికి సహాయం చేసేందుకు వెళ్తున్న మహిళను ఢీకొట్టిన ఏర్పేడు ఎస్సై జిలానీ కారు.వాహనం ఆపకుండానే వెళ్లిపోయిన ఎస్సై. అక్కడికక్కడే మృతి చెందిన మహిళ. ఏర్పేడు-వెంకటగిరి రహదారిపై జరిగిందీ ప్రమాదం.

👉కడప జిల్లా:పెట్రోలు బంకు యాజమాన్యం నిర్లక్ష్యంతో రోడ్లపైకి పెట్రోల్ చెలరేగిన మంటలు తప్పిన ప్రమాదం…బద్వేల్ నెల్లూరు రోడ్ లోని హెచ్పి పెట్రోల్ బంక్ ట్యాంక్ లోకి చెరిన వర్షపు నీరు…కలుషితమైన పెట్రోల్…మోటార్ హ్యాండ్ బోర్ ద్వారా రోడ్లపైకి కలుషిత పెట్రోలు పంపింగ్ చేసిన బంకు సిబ్బంది…చెలరేగిన మంటలు…స్థానికులు సహాయంతో మంటలు అదుపు…

👉 పాకాల…తిరుపతి జిల్లా .పూతలపట్టు- నాయుడిపేట ప్రధాన రహదారిలోని పాకాల మండలం నేండ్రగుంట సమీపంలోని రాడార్ కేంద్రం వద్ద ఘటన.ముందు వెళుతున్న కంటైనర్ ను ఢీకొన్న కారు .ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మహిళ(35) మరో వ్యక్తి (44)మృతి.ఏడు సంవత్సరాల బాలుడికి తీవ్ర గాయాలు.బెంగళూరు నుంచి తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వస్తున్న కుటుంబం.వివరాలు తెలియాల్సి ఉంది.

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త