అవును .. పేపర్స్ లీక్ నా ఘనతే-ఎమ్మెల్యే బేడీ రామ్..నీట్ పరీక్ష పై దద్దరిల్లిన లోక్ సభ..బిజెపిలోకి వైసీపీ ఎమ్మెల్యేలు?.. నటుడు విజయ్ కీలక వ్యాఖ్యలు..ప్రత్తిపాటి సంచలన వ్యాఖ్యలు..చిక్కుల్లో సజ్జల..అధికారులతో పవన్ సమీక్ష..అమ్మ ఫౌండేషన్ దాతృత్వం..శారదా పీఠం ఆక్రమణలపై ఆగ్రహం..

👉 అవును .. పేపర్స్ లీక్ నా ఘనతే !

‘‘నాకు చాలా రాష్ట్రాలలో సంబంధాలు ఉన్నాయి.చిన్న చిన్న కేసులు నేను తీసుకోను.‘‘నాకు చాలా రాష్ట్రాలలో సంబంధాలు ఉన్నాయి.చిన్న చిన్న కేసులు నేను తీసుకోను.ఎక్కువ మంది ఉండే పెద్ద వ్యవహారాలు అయితేనే ఒప్పుకుంటా.నాకు డబ్బులు ఇస్తే కచ్చితంగా అభ్యర్థిని పాస్‌ చేయిస్తా.పరీక్ష రద్దు అయితే మాత్రం నాకు సంబంధం లేదు. డబ్బులు తీసుకుని అనేక రాష్ట్రాలలో ఎంతో మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా చేశాను’’అని బీజేపీ మిత్రపక్షమైన సుహల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ(ఎస్‌బీఎస్‌పీ)కి చెందిన జఖానియా ఎమ్మెల్యే బేడీ రాం అలియాస్‌ త్రివేణి రాం మాట్లాడినప్పుడు రహస్యంగా రికార్డ్ చేసిన వీడియో దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది. నీట్‌-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్‌ అయిన వివాదం దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తున్న నేపథ్యంలో ఈ వీడియో సంచలనంగా మారింది.బేడీరాంకు డబ్బులిచ్చినా ఉద్యోగం రాకపోవడంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒక యువకుడు అడుగుతున్న క్రమంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తుంది.బేడీ రాం వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ తీవ్రంగా స్పందించాయి.బేడీ రాంకు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయని, పేపర్‌ లీక్‌లో తన పాత్ర ఉందని ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా ఎన్డీయేలో ఎలా ఉన్నాడని ప్రశ్నిస్తున్నాయి. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న బీజేపీ మిత్రపక్ష నాయకుల నైతిక దిగజారుడుతనానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ప్రశ్నించారు. వెంటనే బేడీ రాంను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే బేడీరాం ఎన్నికల అఫిడవిట్‌లో తొమ్మిది కేసులు నమోదై ఉండగా వీటిల్లో ఎనిమిది కేసులు పేపర్‌ లీక్‌ ఘటనలకు సంబంధించినవేనని తెలుస్తుండడం గమనార్హం. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లో రైల్వే, పోలీసు నియామక పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్‌ చేశాడని అతడిపై కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.

👉 నీట్ పరీక్షపై లోక్‌సభలో చర్చ..
నీట్ పరీక్షపై లోక్‌సభలో చర్చ
లోక్‌సభలో ఇవాళ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై దుమారం రేగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను నిలిపివేసి.. నీట్ పరీక్షపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ ఓం బిర్లా ఒప్పుకోలేదు. నీట్‌పై చర్చ చేపట్టాలంటూ విపక్ష నేతలు నినాదాలు చేయడంతో సభను 12 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. అంతే కాక మైక్ కుడా ఆఫ్ చేసినట్లు సమాచారం.
👉 బీజేపీలోకి వైసీపీ ఎంపీలు.. సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు! ఈ క్రమంలో ఏపీ బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. గతకొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… వైసీపీ నుంచి గెలిచిన నలుగురు లోక్ సభ ఎంపీలు బీజేపీలో వెళ్తారాని, ఈమేరకు ఆ పార్టీ పెద్దలతో చర్చలు నడుస్తున్నాయని.. అన్ కండిషనల్ గా కాషాయం కండువా కప్పుకోవడానికి వైసీపీ ఎంపీలు రెడీ అయిపోయారనే ప్రచారం బలంగా జరిగింది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. అవును… వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరతారంటూ ఒక ప్రచారం ఇటీవల వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ముందుగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈ విషయంలో అత్యుత్సాహం చుపిస్తున్నారని.. పెద్దిరెడ్డి పైనా ఒత్తిడి తెస్తున్నారని రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చారు. వీటిపై మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.ఇందులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు ఎవరూ పార్టీ మారడం లేదని.. వైసీపీ నేతలు పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్నదంతా ఫేక్ ప్రచారమని తెలిపారు. ఇదే సమయంలో…తనకు బీజేపీలో చేరాల్సిన కర్మ పట్టలేదని.. జగన్ తనను సొంత తమ్ముడిలా చూస్తారని.. తనకు వైసీపీని, జగన్ ని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమయంలో స్పందించిన సోము వీర్రాజు… వైసీపీ ఎంపీలను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అటువంటి ఆలోచన కానీ, ప్రతిపాదన గానీ లేవని తెలిపారు.👉ఇదే సమయంలో ఈవీఎంలపై అనుమానాలున్నాయని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అంతా గౌరవించాలని..ఇదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం కూడా హుందాతనంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.ఇక ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఈ సందర్భంగా వీర్రాజు తెలిపారు. ఇందులో భాగంగా..ఏపీకి అవసరమైన నిధులు, ప్రాజెక్టులూ వచ్చేలా కేంద్రంలోని బీజేపీ సర్కార్ బాధ్యతగా వ్యవహరిస్తుందని అన్నారు. ఏపీలో మద్యం పాలసీ.. వైసీపీ ఓటమిలో కీలక భూమిక పోషించిందని వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

👉ఢిల్లీలో ఎడతెరిపి లేని వర్షం..రాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీళ్లు.-నీళ్లలో కొట్టుకుపోయిన కార్లు–ఢిల్లీ ఎయిర్‌పోర్టులో టెర్మినల్ వన్ దగ్గర కూలిన రూఫ్- రూఫ్ కింద చిక్కుకున్న నలుగురు- ముగ్గురిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది– మరొకరిని కాపాడేందుకు సిబ్బంది ప్రయత్నం– రూఫ్ కూలడంతో కార్లు ధ్వంసం-ఉదయం 5.30 గంటలకు కూలిన ఎయిర్‌పోర్టు రూఫ్-వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు

👉 ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి..ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కూలిన టెర్మినల్‌ను కేంద్ర పౌర విమానాయన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. పైకప్పు కూలిన ఘటనపై ఎయిర్‌పోర్ట్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
👉నటుడు, TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌
కీలకవ్యాఖ్యలు
తమిళనాడులో డ్రగ్స్‌ విక్రయాలు పెరిగిపోయాయి
యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు
తండ్రిగా,పార్టీఅధ్యక్షుడిగా నాకు భయమేస్తుంది-విజయ్
డ్రగ్స్‌ అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..
యువత కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి-విజయ్..సోషల్‌మీడియాలో మన పార్టీపై  దుష్ప్రచారం చేస్తున్నారు..అసత్య ప్రచారాన్ని తమిళనాడు ప్రజలు తిప్పికొట్టాలి
రాజకీయాల్లో మన వాదన బలంగా వినిపించాలి-విజయ్
👉 మంత్రి నారా లోకేష్‌కి తమ సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజా దర్బార్‌కు తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉండవల్లి నివాసంలో ఉదయం నుంచీ మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యలు వివరించారు. సమస్యలు, వైకాపా పాలనలో కబ్జాలు, సహాయాల కోసం వచ్చిన వారందరికీ న్యాయం చేస్తామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.
👉కూతురు జోలికి రావద్దని మందలించిన తండ్రిని నడిరోడ్డుపై నరికి, నరికి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు..!👉విజయవాడలో జరిగిన దారుణం..!!*
కన్న కుమార్తె ఎదురుగానే కర్కశంగా హతమార్చాడు. బృందావన్‌ కాలనీలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది..భవానీపురంలోని చెరువు సెంటర్‌కు చెందిన కె.శ్రీరామచంద్రప్రసాద్‌ (56) బృందావన్‌ కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. నిత్యం భవానీపురం నుంచి రాకపోకలు సాగిస్తున్నాడు. ఆయన కుమార్తె దార్శిని ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువు తోంది. విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠ విజ్ఞాన్‌ విహార్‌ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మణికంఠకు ఇన్‌స్టాలో దార్శినితో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటు న్నారు. ఈ విషయం తెలిసిన శ్రీరామచంద్రప్రసాద్‌ కుమార్తెను హెచ్చరించాడు. బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలన్నాడు.
తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను హెచ్చరించాడు. దీంతో కొద్దిరోజులుగా దార్శిని అతడిని పక్కనపెట్టింది. పెళ్లి చేసుకోవాలని మణికంఠ చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. దీనిపై శ్రీరామచంద్రప్రసాద్‌ కొంతమందిని తీసుకుని మణికంఠ ఇంట్లో పంచాయితీ పెట్టాడు. ఆ తర్వాత మణికంఠ ఇంట్లో రోజూ గొడవలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో మణికంఠ తల్లి గురువారం ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో మణికంఠ పగ పెంచుకున్నాడు.
గురువారం శ్రీరామచంద్రప్రసాద్‌ కుమార్తెను తీసుకుని బృందావన్‌ కాలనీలోని కిరాణా షాపునకు వచ్చాడు. రాత్రి 9 గంటల సమయంలో షాపు మూసేసి ఇద్దరూ ఇంటికి బయల్దేరారు.పగతో రగిలిపోతున్న మణికంఠ కత్తి తీసుకుని బృందావన్‌ కాలనీకి వచ్చాడు. షాపునకు 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టు కింద నిలబడ్డాడు. తండ్రీకూతుళ్లు స్కూటర్‌పై వస్తుండగా, ఎదురుగా వెళ్లి బైకుతో ఢీ కొట్టాడు. కిందపడిపోయిన శ్రీరామచంద్రప్రసాద్‌పై కత్తితో వేటు వేశాడు. రోడ్డుపై పడిన తండ్రిని దార్శిని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టగానే మళ్లీ నరికాడు. దార్శిని ఎంత ఆపినా విచక్షణ లేకుండా నరికాడు.ఆ తర్వాత ఆమెను బెదిరించాడు.తనతో తిరిగిన వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతానని హెచ్చ రించాడు. చుట్టుపక్కల వారు రాగానే పరారయ్యాడు.
శ్రీరామచంద్రప్రసాద్‌ను వెంటనే ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా,అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసు పత్రి మార్చురీకి తరలించారు. కేసును కృష్ణలంక ఇన్‌స్పెక్టర్‌ ఆకుల మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.
👉 *రైతుల కమిషన్ సొమ్ము రిటర్న్ ఇచ్చిన విడదల రజనీ….జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడదల రజిని పేరుతో రూ 1.16 కోట్లు మద్దత దారులు వసూలు చేసారు..
తాజాగా చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి రజనీ డబ్బును వెనక్కి ఇచ్చేశారు..
💥ఈ రోజు న్యూఢిల్లీలో భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి
👉 మంగళగిరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యకులుగా ప్రమాణస్వీకారం చేసిన *పల్లా శ్రీనివాసు రావుకు శుభాకాంక్షలు తెలియజేసిన అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ మరియు అనంతపురం అర్బల్ ఎంఎల్ఏ దగ్గుపాటి ప్రసాద్ 👉తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాసరావుని ఈ రోజు అమరావతి ఎన్టీఆర్ భవన్ లో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాజానగరం నియోజకవర్గ పరిశీలకులు కొత్తపల్లి ఆశిష్ లాల్ మరియు ఇచ్చాపురం నియోజకవర్గం పరిశీలకులు ఎన్.వి.వి రామారావు
👉అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని తన నివాసంలో శుక్రవారం పవన్ అధికారులతో సమావేశమయ్యారు. వివిధ శాఖల్లో నిధుల వినియోగం, చేపట్టిన పనుల ప్రస్తుత పరిస్థితులపై పవన్ సమీక్ష నిర్వహించారు.

👉 జవహార్ రెడ్డికి పోస్టింగ్
ఏపీ మాజీ సీఎస్ జవహార్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం
పోస్టింగ్ ఇచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన
తరగతుల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా
నియమించింది. ఆయనతో పాటు మాజీ సీఎం
జగన్ వద్ద ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన
పూనం మాలకొండయ్యకు కూడా పోస్టింగ్ ఇచ్చింది.
ఆయనను సాధారణ పరిపాలన శాఖలోని GPM &
ARకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
👉అంబానీపై ట్రోల్స్.. ‘కొడుకు పెళ్లి ఖర్చును మా మీద
వేస్తున్నావా?’
రిలయన్స్ జియో రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంపై
నెటిజన్లు మండిపడుతున్నారు. ‘కొడుకు పెళ్లి ఖర్చు
మొత్తాన్ని దేశ ప్రజల నెత్తిన పడేస్తున్నావా అంబానీ
మావా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘ఎన్నికలు
అయిపోయాయి కదా ఇక బాదుడే బాదుడు’ అని
కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య జియో సిగ్నల్ కూడా
సరిగా రావట్లేదని ఫైరవుతున్నారు.
👉జగన్ కాపాడకుంటే పిన్నెల్లి పాపాల పుట్ట ఎప్పుడో పగిలేది: ప్రత్తిపాటి*
*రౌడీలకు రోజులు చెల్లాయనడానికి పిన్నెల్లి అరెస్టే సంకేతం: ప్రత్తిపాటి*
పల్నాడులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పెంచి పోషించింది, ఇంతకాలం కాపాడింది మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డే అన్నారు. మాజీమంత్రి, చిలకలూరిపేట తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మారడంతోనే రాష్ట్రంలో రౌడీమూకలకు కాలం చెల్లిందనడానికి పిన్నెల్లి అరెస్టుతో సరైన సంకేతం పంపినట్లైందన్నారాయన. ప్రజలందర్నీ భయం గుప్పిట్లోకి నెట్టి, ఆ భయమే పెట్టుబడిగా వేలకోట్లు సంపాదించుకుని, ఎంతోమంది తెలుగుదేశం పార్టీ వారి రక్తం కళ్లచూసినా రాక్షసుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అని ధ్వజమెత్తారు ప్రత్తిపాటి. మూడున్నర దశాబ్దాలుగా ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలను చూస్తున్న తనకే గత అయిదేళ్లుగా మాచర్ల నియోజకవర్గంలో నెలకొన్న దారుణ పరిస్థితులు భీతి కలిగించాయన్నారు. అంతగా నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టించిన ప్రజాప్రతినిధిని చరిత్రలో చూడలేదన్నారు ప్రత్తిపాటి. శుక్రవారం చిలకలూరిపేటలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడారు. మాచర్ల కేంద్రంగా పిన్నెల్లి నిర్మించిన నేరసామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకలించడానికి ఇక సమయం ఆసన్నమైందన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు దెబ్బతో పల్నాడు ప్రాంత వైకాపా నేతలతో పాటు ఇంతకాలం జగన్ అండ తో చెలరేగిపోయిన రౌడీలందర్నీ వణుకు మొదలైందన్నారు ప్రత్తిపాటి. వెయ్యి గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానతో కొట్టుకుని పోక తప్పదని, అలానే ప్రభంజనం లాంటి విజయంతో రాష్ట్రంలో కొలువుదీరిన ప్రజాప్రభుత్వంతో పిన్నెల్లి మాఫియా ఆటకట్టిందని ఆయన చుర కలు వేశారు. పరారీలో ఉన్న పిన్నెల్లి సోదరు వెంకటరామిరెడ్డి, వాళ్ల చేతుల్లో ఆయుధాల్లా పని చేసిన చేసిన తురకా కిషోర్ ముఠానూ సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలని, పల్నాడులో పూర్తి స్థాయి ప్రశాంత పరిస్థితులు నెలకొల్పడంతో అదే కీలకమని ప్రత్తిపాటి సూచించారు. నిజానికి పిన్నెల్లి అయిదేళ్లుగా ఎన్నో నేరాలు, ఘోరాలు చేసినా బీసీ నాయకుడు తోట చంద్రయ్య హత్య రోజు నుంచే పిన్నెల్లి రాజకీయ పతనం ప్రారంభమైందన్నారు ప్రత్తిపాటి. అసలు ఇలాంటివ్యక్తికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండడానికే ఏమాత్రం అర్హతలేదన్నారు. బాధితులపైనే ఎదురుకేసులు పెట్టించి దోచుకున్న పిన్నెల్లి ముఠా వేళ్లు కత్తిరింపుతోనే ప్రశాంత పల్నాడు సాధ్యమని, ఇంతకా లం అతడి దురాగతాలకు అండగా నిలిచిన పోలీసు సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు ఉన్నతాధికారులను కోరారు ప్రత్తిపాటి పుల్లారావు.
👉 “చిక్కుల్లో సజ్జల”..డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వైసిపి సోషల్ మీడియా వేలకోట్లు ప్రజాధనాన్ని స్వాహా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
*వైసీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న వారికి డిజిటల్ కార్పొరేషన్ పేరుతో అవుట్సోర్సింగ్ పేరిట వేలకోట్ల చెల్లింపులు చేశారు. వీరంతా వైసిపి కోసం పనిచేశారు..పైకి మాత్రం కార్పొరేషన్. చేసిందంతా మాత్రం దోపిడీనే. ప్రజల సొమ్ముతో సోషల్ మీడియాలో వైసిపి ప్రచారం చేసిందని తేలింది.**విశేషమేమిటంటే.. జడ్జిలపై తప్పుడు వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన వారికి కూడా లక్షల్లో జీతాలు చెల్లించినట్లు బయటపడింది.*
*ఇటీవల టిడిపి నేతలు దాడి చేశారని ఆరోపణలు చేసిన పాలేటి రాజ్ కుమార్, ఆయన భార్యకు కూడా డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు చెల్లించడం ప్రాధాన్యత సంతరించుకుంది.*
*వైసిపి సోషల్ మీడియాను హ్యాండిల్ చేసింది సజ్జల భార్గవ్ రెడ్డి. అందులో పని చేస్తున్న వారికి డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఏపీ ప్రభుత్వం జీతాలు చెల్లించారు..*అందుకే ఈ కేసు ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి మెడకు చుట్టుకుంది.అందుకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది…అయితే ఆయన ఎక్కడ ఉన్నా విడిచి పెట్టే ఛాన్స్ లేదు. తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటే భార్గవ రెడ్డి పై సైతం ఉక్కు పాదం మోపి అవకాశం ఉంది.వీరిపై మున్ముందు కేసులు పెరిగే అవకాశం ఉందని.. అన్నింటికీ ఈ తండ్రీ కొడుకులే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి.*
👉 తిరుమల…*శారదా పీఠం ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధం!*
ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి
తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధం ◆తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు.
తిరుమలలోని విశాఖ శారదా పీఠం ఆక్రమణలను ఏపీ సాధు పరిషత్తు స్వామీజీలు పరిశీలించారు. అనంతరం శ్రీనివాసానంద సరస్వతి మీడియాతో మాట్లాడారు.
“తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చేశారు. ఇక్కడ ఒక్కరికీ అన్నం పెట్టడం లేదు.. పూజలు చేయడం లేదు. 4 అంతస్తులకు అనుమతి ఇస్తే.. 6 అంతస్తుల నిర్మాణం చేపట్టారు. గదులను భక్తులకు అధిక ధరలకు విక్రయించి దోపిడీకి పాల్పడుతున్నారు.10వేల చదరపు గజాల్లో అక్రమ కట్టడాలు నిర్మించారు. శారదా పీఠం ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం” అని శ్రీనివాసానంద సరస్వతి హెచ్చరించారు.
👉ఆపదలోఉన్న నిరుపేదమహిళకు ఆర్థికసహాయం చేసిన అమ్మఫౌండేషన్…
కొమరోలు మండలం తాటిచర్ల పంచాయతీలో నివాసముంటున్న పళ్ళాల భాగ్యమ్మ భర్తచనిపోయి గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నా విషయాన్ని గ్రామస్తులు అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువచ్చారు గతంలో వారికి 5000రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తాం అని హామీ ఇచ్చారు
గ్రామస్తులు ద్వారా విషయం తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుబొనేని వేంకటేశ్వర్లు శుక్రవారం వారి నివాసానికి వెళ్లి ఆమెను పలకరించి అమ్మ ఫౌండేషన్ టీం సభ్యుల సహకారంతో ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఆర్ధికసాయం అందజేసిన అమ్మ ఫౌండేషన్ టీం సభ్యులకు బాధితురాలు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పందిళ్ళ నాగార్జున, బుడయ్య,రవితేజ,రంగమ్మ,వెంకటస్వామి,తిరుమలయ్య ,భాలసుబ్బయ్య శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
👉 BSNLకు మారుతామంటోన్న JIo యూజర్లు ..
*సిగ్నల్ సరిగా రాకపోవడం, రీఛార్జ్ ధరలు పెంచేయడంతో జియో యూజర్లు Airtelకు మారుదామనుకున్నారు. తాజాగా Airtel కూడా ధరలు పెంచడంతో యూజర్లు షాక్‌లో ఉన్నారు. ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ BSNL బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా BSNL 4G సేవలు ప్రారంభం కానున్నాయి. దీంతో నెట్‌వర్క్ మారిపోవడం బెటర్ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు*
*# అంబాని కొడుకు పెళ్లి ఖర్చు అంతా జియో కస్టమర్స్ మీద వేస్తున్నారు అంటూ మండిపడుతున్న ప్రజలు #*
👉 ప్రభుత్వం ఏర్పాటు చేసి 15 రోజులు కూడా కాలేదు అన్నిచోట్ల అవినీతి అక్రమ సంపాదన, రైలు యాక్సిడెంట్, పేపర్ లీకులు బయటపడుతున్నాయి.
👉 *పల్నాడు జిల్లా ..నరసరావుపేట
గురువారం కారంపూడి మండలం ఒప్పిచర్లలో గండికోట విజయలక్ష్మి(53) అనే మహిళ దారుణహత్య.
మహిళను కర్రతో కొట్టి హత్యాచారం చేసి హత్య చేసినట్లు మీడియా సమావేశంలో వెల్లడించిన ఎస్పీ మలికగర్గ్..
మృతురాలి భర్త వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన కారంపూడి పోలీసులు.
ఇద్దరు నింధితులను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు.
నిందితులు రామావత్ బాబు నాయక్, బాణావత్ బాలూ నాయక్ గా గుర్తింపు..మృతురాలు బడ్డీ బంకు తో పాటు బెల్ట్ దుకాణం నడుపుతున్నట్లు తెలిపిన ఎస్పీ..మృతురాలికి గ్రామంలో ఉన్న రెండు గృహాలు.ఒక గృహంలో అద్దెకు ఉంటున్న రమావత్ బాబు నాయక్.రమావత్ బాబు నాయక్ మృతురాలి దుకాణంలో బకాయి ఉన్నట్లు తెలిపిన ఎస్పీ.రమావత్ బాబు నాయక్ వద్దకు అతని స్నేహితుడు బాణావత్ బాలూనాయక్ రావడంతో మందు కోసం విజయలక్ష్మి వద్దకు వెళ్లిన వైనం.ఈక్రమంలో అప్పు ఇవ్వనని, ఇవ్వాల్సిన బకాయి ఇవ్వాలని కోరిన మృతురాలు విజయలక్ష్మి.
దీనితో విజయలక్ష్మి పై కక్ష పెంచుకుని గురువారం రాత్రి ఆమె ఇంటికి వచ్చి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన నిందితులు.మహిళను వివస్త్రను చేసి ఆపై హత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఇద్దరు నిందితులు.నిందితులు ఇద్దరిని కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపిన పల్నాడుజిల్లా ఎస్పీ మలికగర్గ్.
👉ప్రకాశం జిల్లా.. ఒంగోలు..జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారీ స్థానిక మామిడిపాలెంలోని ఈవీఎం గోదాములను శుక్రవారం తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవిఎం గోదాము షట్టర్లకు వేసిన సీలును ఓపెన్ చేసి లోపలి పరిస్థితిని పరిశీలించారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వినియోగించని ( నాన్ పోల్డ్ ) ఈవీఎంల పరిస్థితిని ఆమె ప్రత్యక్షంగా చూసి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నాన్ పోల్డ్ ఈవీఎంలు 1600 ఇక్కడ భద్రపరిచినట్లు అధికారులు ఆమెకు వివరించారు. ఈవీఎంల పరిస్థితి, ఇక్కడ కల్పిస్తున్న భద్రత, సీసీటీవీ ల ద్వారా పర్యవేక్షిస్తున్న విధానం పై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. వీటికి సంబంధించిన నివేదికను ఎన్నికల సంఘానికి పంపుతామని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఇంచార్జి డిఆర్ఓ శ్రీ. విశ్వేశ్వరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కాలేషా (టిడిపి), రాజశేఖర్ (బిజెపి), రసూల్ (కాంగ్రెస్), సుదర్శన రావు (ఆప్), సయ్యద్ హనీఫ్ ( సిపిఎం), జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు ఉన్నారు.
👉జగిత్యాల జిల్లా :ఎపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టు లో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి వస్తున్న సందర్భంగా భద్రత ఏర్పట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్..
ఈ సందర్భంగా భద్రతపరంగా చేయవలసిన ఏర్పాట్లు గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కొండగట్టులో ఏర్పాటు చేసిన ఔట్ పోస్టు ను సందర్శించి సిసి కెమెరాలు యొక్క పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో  డిఎస్పీ రఘు చందర్, సిఐ నీలం రవి మరియు ఎస్ఐ రహీం , సిబ్బంది ఉన్నారు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం