అసలైన పుష్పరాజ్‌ పైనే పవన్ దృష్టి ? ..ఎంపీ మాగుంట పై కేజ్రీ వాల్ భార్య ఆరోపణ..బోసి బాబా..100 కోట్ల ఆస్తులు సీజ్..సీబీఐకి అడ్డంగా దొరికిన గుంతకల్లు డీఆర్ఎం..828 మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్..47 మంది మృతి..ఒంగోలు లో జోనోసెస్ డే..

👉రాయలసీమలో కడప, కర్నూలు జిల్లాల్లో మాత్రమే లభించే అరుదైన ఎర్రచందనం విదేశాలకు స్మగ్లింగ్‌ చేసేవారిని పట్టుకోవాలని పవన్‌ కళ్యాణ్‌ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఎర్రచందనం విదేశాలకు తరలిపోయిందనే విమర్శలు ఉన్నాయి.ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లర్‌ అనే ఆరోపణలున్న విజయానందరెడ్డికి చిత్తూరు అసెంబ్లీ సీటును వైసీపీ కట్టబెట్టింది. ఎర్రచందనం అక్రమ ర వాణాకు సంబంధించి ఆయనపై పలు కేసులు ఉండటం గమనార్హం.ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం పవన్‌ కళ్యాణ్‌ సంచలన ఆరోపణలు చేశారు. పెద్దిరెడ్డి కుటుంబం ఎర్రచందనం అక్రమ రవాణాలో ఉందన్నారు. నేపాల్‌ కు అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్నారని విమర్శించారు.👉నేపాల్‌ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,మిథున్‌ రెడ్డికి చెందిన చందనం దుంగలు పట్టుబడ్డాయని,ఈ ఫైల్‌ తన టేబుల్‌ పైనే ఉందని పవన్‌ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక ఉన్న అసలైన పుష్పరాజ్‌.. పెద్దిరెడ్డి కుటుంబమేనన్నది పవన్‌ అనుమానమని అంటున్నారు.ఈ క్రమంలో పవన్‌ ఈ అంశంపై సీరియస్‌ గా దృష్టి సారించారు. ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని తక్షణమే పట్టుకోవాలని పోలీసు శాఖను ఆదేశిస్తూ అటవీశాఖ మంత్రిగా పవన్‌ తన తొలి ప్రధాన ఆదేశాలు జారీ చేశారు. ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాపై తక్షణమే విచారణ జరిపించాలన్నారు.ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్, అక్రమ రవాణా వెనక ఉన్న పెద్ద తలకాయల్ని పట్టుకోవాలని పవన్‌ ఆదేశించారు. నిఘా వ్యవస్థను పటిష్ఠపరచాలని సూచించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారందర్నీ అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.👉ఎక్కడెక్కడ ఎర్రచందనం డంప్‌ లు ఉన్నాయో గుర్తించి, ఈ స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌ ను నడిపిస్తున్న కీలక సూత్రధారులను పట్టుకోవాలన్నారు. వారు తప్పించుకోవటానికి వీల్లేకుండా పక్కాగా కేసులు నమోదు చేయాలని కోరారు. అలాగే నేపాల్‌ లో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలను తిరిగి ఏపీకి తీసుకురావటంపై దృష్టి సారించాలన్నారు.👉ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసుల్లో గతంలో అరెస్టై ప్రస్తుతం బెయిల్‌ పై బయట ఉన్నవారి కార్యకలాపాలు, వారు ఎవరెవరితో లావాదేవీలు కొనసాగిస్తున్నారనే అంశాలపై నిఘా ఉంచాలని పవన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఇప్పటి వరకూ నమోదు చేసిన కేసులు, వాటిలో ఎన్నింటిలో శిక్షలు పడ్డాయి? ఎన్ని వీగిపోయాయి? అందుకు కారణాలేంటి తదితర అంశాలతో తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని పవన్‌ ఆదేశాలు జారీ చేశారు.👉కాగా వైఎస్సార్‌ జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో పట్టుబడ్డ ఎర్రచందనం డంప్‌ నకు సంబంధించిన నివేదికను ఆ జిల్లా అటవీ శాఖాధికారులు పవన్‌ కళ్యాణ్‌ కు అందజేశారు. అక్కడ రూ.1.6 కోట్ల విలువైన 158 దుంగలు పట్టుబడ్డాయని చెప్పారు. ఈ కేసులో పలువురు అరెస్టు చేశామని.. ఈ వ్యవహారంతో పలువురు స్మగ్లర్లకు సంబంధాలు ఉన్నాయని గుర్తించామని అధికారులు పవన్‌ కు వివరించారు.కాగా కడపలోని శ్రీగంధం డంపింగ్‌ యార్డుపై నిఘా పెంచాలని పవన్‌ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎర్రచందనం దుంగలను అడ్డుకునేందుకు చెక్‌ పోస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణాలో అసలైన పుష్పరాజులు పట్టుబడతారో, లేదో చూడాల్సి ఉంది.

👉👉విజయవాడ: వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ అధికారులకు సూచించారు. వీటిపై అవగాహన కోసం గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై వర్క్‌ షాప్‌ ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన పరిశీలించారు. వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి పునర్వినియోగిస్తే పారిశుద్ధ్య సమస్యను అధిగమించవచ్చన్నారు.గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు అనుసరించాల్సిన విధానాలు, వాటి నుంచి ఎటువంటి ఉత్పత్తులు సాధించవచ్చన్న అంశాలపై సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో గార్బేజ్ టు గోల్డ్ పేరుతో ఒక ప్రదర్శన నిర్వహించారు. చెట్ల నుంచి రాలే ఆకులను, కొమ్మలను, పొడి చెత్తను ఊడ్చిన తరవాత తగులపెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతోందన్నారు. వాటిని కంపోస్టుగా మారిస్తే ఎరువుగా ఉపయోగ పడుతుందని.. ఈ విషయంలో స్థానిక సంస్థలు తగు చర్యలు చేపట్టాలన్నారు. రీ సైకిల్ కాని వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించకుండా చూడాలని కోరారు. స్థానిక సంస్థలకు వ్యర్థాలు, పారిశుద్ధ్య నిర్వహణ ఒక సవాల్‌గా మారుతోందని.. శాస్త్రీయ దృక్పథంతో ఘన, ద్రవ వ్యర్థాలను నిర్వహించడంపై అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు.

👉*TDP MP తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు: కేజీవాల్ భార్య*..తన భర్త రాజకీయ కుట్రకు బలి అయ్యారని ఢిల్లీ CM కేజీవాల్ భార్య సునీత ఆరోపించారు.”TDP MP మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేజీవాల్ను అరెస్ట్ చేశారు.తన కొడుకు రాఘవను కాపాడుకునేందుకు శ్రీనివాసులు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు’ అని పేర్కొన్నారు.తన భర్త నిజాయితీపరుడని, ఆయనకు ప్రజలు మద్దతుగా నిలవకపోతే, చదువుకున్న వారెవరూ రాజకీయాల్లోకి వచ్చేందుకు సాహసించరని అన్నారు.

👉బోలే బాబా..ఇప్పుడు బోసి బాబా.. 100 కోట్ల ఆస్తులు సీజ్..!!!మరోవైపు దుర్ఘటనను తీవ్రంగా తీసుకున్న యూపీ సర్కారు..దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో భోలే బాబా కూడబెట్టినదెంతో బయటపడింది.బోలే బాబా..ఇప్పుడు బోసి బాబా.. 100 కోట్ల ఆస్తులు సీజ్ .. మొన్నటిదాకా అతడి పాద మోపిన మట్టి భక్తులకు బంగారం.. అతడి చేతితో ఇచ్చిన నీళ్లు గొప్ప ఔషధం.. లక్షల మందికి అతడో దైవం.. వందల మంది అనుచరులు.. వేలమంది భక్తులు.. విలాస భవనాలు, ఆశ్రమాలు.. ఎకరాల కొద్దీ భూములు.. భోలే బాబా అంటే యూపీ నుంచి మూడు నాలుగు రాష్ట్రాల్లో అబ్బో గొప్ప పేరు. అత్యంత సాధారణ వ్యక్తి అయిన అతడు బాబా అవతారం ఎత్తి వంద కోట్లు కూడబెట్టాడు. అలాంటి బోలే బాబా ఇప్పుడు బోసి బాబాగా మిగిలిపోయాడు. ఉత్తరప్రదేశ్‌ హ‌థ్రాస్‌ జిల్లాలో గత మంగళవారం సూర‌జ్ పాల్ అలియాస్ నారాయ‌ణ్ హ‌రి సాక‌ర్ అలియాస్‌ భోలే బాబా ఆశ్రమంలో జరిగిన తొక్కిసలాటలో 120 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో బాబా పరారయ్యాడు. శనివారం మీడియాకు ప్రకటన ఇచ్చాడు. మరోవైపు దుర్ఘటనను తీవ్రంగా తీసుకున్న యూపీ సర్కారు.. దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో భోలే బాబా కూడబెట్టినదెంతో బయటపడింది…👉20 ఏళ్లలో 100 కోట్లు..భోలే బాబా ఇర‌వై ఏళ్ల కిందట సాధారణ వ్యక్తి. బాబాగా మారాక 100 కోట్ల‌కు పైగా ఆస్తులు కూడ‌బెట్టాడు. తెల్లటి సూటు, బూట్లు, టై, నల్లద్దాలతో కనిపించే భోలే బాబాది విలాస జీవనం. అయితే, అతడికి కాస్‌గంజ్‌, ఆగ్రా, కాన్పూర్‌, గ్వాలియర్‌ సహా దేశవ్యాప్తంగా మొత్తం 24 ఆశ్రమాలున్నాయి. శ్రీ నారాయణ్‌ హరి సాకార్‌ ట్రస్ట్‌ పేరిట వీటిని నిర్వహిస్తున్నాడు. మెయిన్‌ పురి హరి నగర్‌ ఆశ్రమమే 13 ఎకరాల్లో ఉంటుంది. రాజ‌ భ‌వనాన్ని పోలి ఉన్న ఈ ఆశ్ర‌మాన్ని రూ.4 కోట్ల‌తో నిర్మించారు. బాబా, అతడి భార్య కోసం ఆరు విలాసవంతమైన గదులున్నాయి. ఇక 16 మంది వ్యక్తిగత కమాండోలు ఉంటారు. తెల్లటి టయోటా ఫార్చ్యూనర్‌ ముందు ఈ కమాండోలు బైక్‌ లపై వస్తుంటారు. భోలే బాబాకు 30 లగ్జరీ కార్ల కాన్వాయ్‌ ఉండడం గమనార్హం.👉100 కోట్ల ఆస్తులు సీజ్..నేరగాళ్లు, మాఫియాపై బుల్డోజర్లను పంపే యూపీలోని యోగి సర్కారు ఇప్పుడు భోలే బాబాకు సంబంధించిన రూ.100 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. పైన చెప్పుకొన్నట్లే 24 విలాసవంతమైన ఆశ్రమాలూ వీటిలో ఉన్నాయి. తాను విరాళాలే తీసుకోనని చెప్పే బాబా ప్రైవేటు సెక్యూరిటీని మెయింటైన్ చేస్తుండడం గమనార్హం. దీంతోనే అతడిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. చివరకు భక్తులు ఎగబడి తొక్కిసలాట జరిగి వందకు పైగా ప్రాణాలు మట్టిలో కలిశాయి.

👉నిమ్స్ హాస్పటల్ ప్రొఫెసర్ ఆత్మహత్య?..హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్ డాక్టర్ ప్రాచీకర్,ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లోని బేగంపేట లోని తన నివాసంలో అధిక మోతాదులో మత్తుమందు తీసుకుని ఆమె ఆత్మహత్య కు పాల్పడ్డారు. ప్రాచీకర్ నిమ్స్ ఆస్పత్రిలో అనస్తీషియా డిపార్ట్‌మెంట్‌ లో అడిషినల్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది…

👉గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్..!..హాస్టల్‌లో కేర్ టేకర్‌తో కలిసి ప్రిన్సిపాల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది.. బీర్లు తాగుతోంది.👉సూర్యాపేట – బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో ‌ రాత్రిళ్లు గదుల్లో ప్రిన్స్ పాల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థినులు చూడకుండా తమను కొడుతుందని నిరసన తెలిపారు.విద్యార్థినుల నిరసనతో సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది.

👉 పృద్దుల గిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రికి వినతి ప్రజాశక్తి మర్రిపూడి. మర్రిపూడి కొండపై వేంచేసిన శ్రీ పృద్జుల గిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి కోరుతూ స్థానిక టిడిపి నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి వినతిపత్రం సమర్పించారు. శనివారం స్థానిక పృ ద్ధుల గిరి కొండకు దైవదర్శనానికి వచ్చిన ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. కొండపైన అర్చకులు పూర్ణ కుంభం తో ఆహ్వానించారు. స్థానిక టిడిపి నాయకులు కొండ వద్దకి చేరుకునేందుకు గతంలో తారు రోడ్డు మంజూరైనప్పటికీ ఒక కిలోమీటరు అటవీ శాఖ అధికారులు అనుమతి లేక పనులు నిలిచిపోయాయన్నారు. కొండమీద ఆలయం వరకు ఘాట్ రోడ్ నిర్మాణానికి అటవీ శాఖ అధికారులు అనుమతి మంజూరు చేయవలసి ఉందన్నారు. అదేవిధంగా కొండమీద సత్రాలు వద్ద సిమెంట్ రోడ్లు డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అందుకు కృషి చేయాలని మంత్రి వీరాంజనేయ స్వామికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోల మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా అటవీ శాఖ అనుమతులు మంజూరు చేయిస్తానని, సిమెంట్ రోడ్లు ఇతర వాళ్లకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు

👉 నీళ్ళ ట్యాంక్ క్లిన్ చేస్తు ప్రమాదవశాత్తు జారి క్రింద పడ్డ వ్యక్తి మృతి… పొదిలి ఎస్.ఎస్.ఆర్ అపార్ట్ మెంట్ వద్ద సంఘటన…ప్రకాశంజిల్లా పొదిలి పట్టణంలోని దర్శి రొడ్ లో ఉన్న ఎస్.ఎస్.ఆర్ అపార్ట్ మెంట్ లో నీళ్ళ ట్యాంక్ శుబ్రపరచడానికి నలుగురు వ్యక్తులు రాగా కొమటికుంట్ల వెంకట సుబ్బయ్య(35)అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి క్రిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన నెలకొంది._అపార్ట్ మెంట్ వద్ద భార్య, బందువులు కన్నిటి పర్యంతం అయ్యారు._పనికొసం వచ్చి పరలొకానికి వెళ్ళాడని బందువులు శోక తపత్త హృదయం తో కన్నీరుగా విలపిస్తున్నారు. మృతుడు పొదిలి మండలం బుచ్చెనపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి. పూర్తి సమాచారం తెలియరావలసి ఉంది._

👉 ఒంగోలు నగరంలోని 14వ డివిజన్ సంతపేట లో వున్న పశువుల హాస్పిటల్ నందు రాష్ట్ర జోనోసెస్ డే సందర్బంగా గా ఏర్పాటు చేసిన పెంపుడు జంతువులు కు వ్యాక్సినేషన్ కార్యక్రమం ను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ రావు మరియు షేక్ రియాజ్ .ఈ సందర్బంగా జనార్దన్ గారు మాట్లాడుతూ జూనోటిక్ వ్యాధుల ప్రమాదంపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జూలై 6 న ప్రపంచ జూనోసెస్ డే (World Zoonoses Day) నిర్వహించబడుతుంది.జూనోటిక్ వ్యాధికి వ్యతిరేకంగా అవగాహన పెంచడానికి మనం ప్రతిసంవత్సరం ఈ రోజును గుర్తుచేసుకుంటున్నాము.ఆధునిక సమాజంలో ప్రతి ఇంటిలోనూ పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయి. అయితే పెంపుడు జంతువులతో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా లేకుంటే మన ప్రాణాలకూ ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 6న ప్రపంచ జునోసిస్‌ డే ను నిర్వహిస్తుంటారు.మూగజీవాల పెంపకంలో అవగాహనతో పాటు అప్రమత్తత ఎంతో అవసరం.కాబట్టి ఒంగోలు నగరంలోని మూగ జీవాలు వున్న ప్రతిఒక్కరు ఈ వ్యాక్సిన్ ను ఉపయోగించుకోవాలి అని ఈ సందర్బంగా జనార్దన్ ప్రజలకు పిలుపునిచ్చారు..

👉 రైల్వేలోనే సూపర్ హిస్టరీ ..భలే భలే లంచావతారం ..సీబీఐకి అడ్డంగా దొరికిన గుంతకల్లు డీఆర్ఎం ..రూ.120 కోట్ల పనిలో కమీషన్ పేచీ ..గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో తొలిసారిగా ఓ అత్యున్నత అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. లంచం తీసుకొని అవినీతికి పాల్పడిన డీఆర్ఎంతోపాటు ఉన్నత అధికారులను అరెస్ట్ చేశారు. రైల్వే డివిజన్ చరిత్రలో ఒక డివిజనల్ రైల్వే మేనేజర్ లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోవటంతో రైల్వే ఉద్యోగులు ముక్కున వేలేసుకున్నారు. వివరాల్లో వెళితే..గుంతకల్లు రైల్వే డివిజన్ కార్యాలయంలో సీబీఐ సోదాలు మూడు రోజులుగా మాటు వేశారు. ఎట్టకేలకు కాంట్రాక్టర్ల నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా డీఎఫ్ఎం , ప్రదీప్ బాబు, ఓ ఎస్ బాలాజీ సహా సీనియర్ అసిస్టెంట్లు లతో సంబంధం ఉన్న డీఆర్ఎం వినీత్ సింగ్ లను అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా పీలేరు వద్ద కాంట్రాక్టర్లు సత్యనారాయణ, రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు రూ. 120 కోట్ల వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ కాంట్రాక్టు పర్సంటేజీలను అడగడంతో కాంట్రాక్టర్లకు అధికారులతో ఆరు నెలల కిందట గొడవ జరిగింది. ఆర్థిక విభాగంలో పని చేస్తున్న సీనియర్‌ డివిజన్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌ (డీఎఫ్‌ఎం) ప్రదీప్‌బాబు సహా మరికొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు గత మూడు రోజుల నుంచి గుంతకల్లులో మకాం వేశారు. కదిరి ప్రాంతంలో రైల్వే పనులను కాంట్రాక్టర్లకు వర్క్ ఆర్డర్లు ఇచ్చేందుకు ప్రదీప్‌బాబుతో పాటు కొందరు సిబ్బంది డబ్బును డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు ప్రణాళిక బద్ధంగా మూడు రోజులు కిందట మకాం వేశారు. ఈ దాడుల్లో మొదట ఓఎస్ బాలాజీకి రూ. 5 లక్షల నగదు సంచి ఇస్తుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ తో సంభాషణ ఆధారంగా మిగిలిన డీఎఫ్ ఎం, డి ఆర్ఎం, ఓ ఎస్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, కాంట్రాక్టర్ ను అరెస్ట్ చేశారు. అదే విధంగా గుంతకల్లు రైల్వే డీఆర్‌ఎం వినీత్‌సింగ్‌ నివాసంలోనూ , ఆయ‌న కార్యాల‌యంపై సీబీఐ అధికారులు దాడి చేశారు… ఆయ‌న తో పాటు డీఎఫ్‌ఎం ప్రదీప్‌ బాబు, రైల్వే ఉద్యోగులు రాజు, ప్రసాద్‌, బాలాజీల ఇంటిపై కూడా సిబిఐ అధికారులు గ‌త మూడు రోజులుగా సోదాలు చేపట్టగా అవి నేటితో ముగిశాయి.. ఈ సోదాల‌లో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. దీంతో మొత్తం 8 మంది సిబ్బందిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం నిందితులను గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ లో డిఇఎన్ కోఆర్డినేషన్ అక్కిరెడ్డి ని అరెస్టు చేశారు. గతంలో ఇక్కడ ఈయన పనిచేసి బదిలీపై సికింద్రాబాద్ వెళ్లారు ఈ కాంట్రాక్ట్ పనుల్లో ఈయన ప్రమేయం ఉందని నిర్ధారించిన సీబీఐ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించింది.

👉రాజ్‌తరుణ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు.. రాజ్‌తరుణ్‌ నా సహచర నటుడు మాత్రమే. షూటింగ్‌ అయిపోయి 6నెలలు అవుతోంది. అప్పటి నుంచి రాజ్‌తరుణ్‌తో టచ్‌లో లేను. నేను లావణ్యను బెదిరించలేదు. లావణ్యతో నాకు పరిచయం లేదు. లావణ్య నాకు కాల్‌ చేసి వేధిస్తోంది, బెదిరిస్తోంది. రాజ్‌తరుణ్‌తో నటించిన ప్రతి హీరోయిన్‌ను అనుమానిస్తోంది. నాపై లావణ్య అసత్యాలు ప్రచారం చేస్తోంది.. నటి మాల్వీ మల్హోత్రా

👉828 మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్..47 మంది మృతి.ప్రతిరోజు 7 కొత్త కేసులు నమోదు.వీరిలో ఎక్కువ మంది 220 స్కూళ్లు,24 కాలేజీలకు విద్యార్థులే.మాదక ద్రవ్యాల వినియోగమే కారణం.వెల్లడించిన త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.

7k network
Recent Posts

వైసీపీ ప్రభుత్వానికి, మీకు ఏంటి తేడా?:.కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్..త్వరలో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు హోం మినిస్టర్ అనిత..మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…మంత్రి ఫరూక్..వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ను వెంటనే సీజ్ చేయాలి..బాపట్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా అధికారులంతా కృషి చేయాలి..జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమిం అన్సరియా.. పేకాట శిబిరం పై దాడి (కంభం)

బోర్డర్ ఎంట్రీ పేరుతో దోచుకున్నదనం ఎక్కడికి పోయింది..వక్ఫ్ చట్ట సవరణపై లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు.. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ నిర్లక్ష్యంతో రోగి మృతి?..ఎల్ఐసి ఏజెంట్ల నిరసన..అగ్రికల్చర్ డిప్లమో జిల్లా వి ఏ ఏల సంఘం అధ్యక్షునిగా బత్తుల వెంకటసుబ్బయ్య..పోలీసుల అదుపులో వైకాపా మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డి..క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..హోం మంత్రి అనితకు అనంతపురం నగరంలో ఘన స్వాగతం..తీవ్ర మానసిక వేదన కలుగుతోంది: విజయమ్మ..

జమిలి’ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి ‘టివికె’ పార్టీ డిమాండ్‌..సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కూడా దొరికిపోయాడు ..ఇలా చేస్తే నేనే హోంమంత్రిని అవుతా: డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్..కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్న మంత్రి నారా లోకేష్..విద్యుత్ షాక్ ఘటనపై సీఎం విచారం.. ప్రకాశం జిల్లా సమీక్షా మండలి (DRC) సమావేశం..కార్మికులను విధులకు తీసుకునే వరకు పోరాటం ఆగదు..ప్రకాశం జిల్లా మార్కాపురం..

ఝాన్సి రెడ్డిని పరామర్శించిన సిఎం రేవంత్..చంద్రబాబు పొగిడితే జగన్‌కు ఆస్కార్ అవార్డే ?..వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోంది-విజయసాయిరెడ్డి..అనంత” రిజిస్ట్రేషన్ శాఖలో అడ్డగోలు వ్యవహారాలు!…భూపాలపల్లిలో డాక్టర్ల నిర్లక్ష్యం.. శిశువు మృతి..మదనపల్లెలో ప్రైవేట్ బస్సుల దందా.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..

ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. గంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై ఐదుగురు అత్యాచారం..నిందితుల్లో ముగ్గురు మైనర్లు.. పోక్సో కేసు నమోదు చేసినఏపీలో ముగ్గురు చిన్నారులు మిస్సింగ్!.. మాజీ మంత్రి కాకాని …శ్రీనగర్ ఎన్‌కౌంటర్ లో లష్కరే కమాండర్ హతం!..మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి ఫిర్యాదు

కెసిఆర్ అంటే ఇష్టం- రఘురామ సంచలన వ్యాఖ్యలు .. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం- ఆపై హత్య…. జమ్ముకశ్మీర్‌లో ఏపీ విద్యార్థులు దుర్మరణం..ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బీటెక్ విద్యార్థిని చందన..టీడీపీ – జనసేన పార్టీల మధ్య మరోసారి భగ్గుమన్న విభేదాలు