వైఎస్సార్ కు ఘన నివాళి..జగన్, షర్మిలతో విజయమ్మ!.మాజీ మంత్రి జోగి గైర్హాజర్.. ఒంగోలు ఎస్ కొండ గిద్దలూరు మార్కాపురంలో ఘనంగా వైఎస్ జయంతి వేడుకలు..ఉచిత ఇసుక కార్యక్రమాన్ని ప్రారంభించిన మాగుంట దామచర్ల..రైతు భరోసా కేంద్రంలో చోరీ..కంభంలో రేషన్ బియ్యం పట్టివేత.. ప్రమాదంలో రైతు మృతి

👉వైఎస్సార్ కు ఘన నివాళి.. జగన్, షర్మిలతో విజయమ్మ! అవును… వైఎస్సార్ 75వ జయంతిని పురష్కరించుకుని వైఎసీపీ అధినేత జగన్ ఇడుపుల పాయలో తన తండ్రికి నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు.. ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సమయంలో జగన్ వెంట వైఎస్ విజయమ్మ, భారతి ఉన్నారు.అనంతరం షర్మిళ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. అవును… వైఎస్సార్ 75వ జయంతిని పురష్కరించుకుని వైఎసీపీ అధినేత జగన్ ఇడుపుల పాయలో తన తండ్రికి నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా…ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసిన జగన్.. అనంతరం సమాధి వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఘాట్ వద్దకు చేరుకున్న విజయమ్మ.. వైఎస్ జగన్ ను ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టారు. తర్వాత ఇద్దరూ కలిసి స్మారకంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. వైఎసీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్, విజయమ్మ కలవడం ఇదే తొలిసారి! ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం వైఎస్సార్ కు జగన్ నివాళులు అర్పించిన వెళ్లిన అరగంట తర్వాత ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. అనంతరం తల్లి విజయమ్మ, భర్త అనిల్, కుమారుడు, కోడలు, కుమార్తెతో కలిసి నివాళులు అర్పించారు. మరోపక్క వైఎస్సార్ 75వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయంతిని పురష్కరించుకుని.. రక్తదానం, పేదలకు వస్త్రాలు పంపిణీ, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం మొదలైన సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేస్తున్నారని తెలుస్తుంది.

👉దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి ఇడుపులపాయకు జోగి గైర్హాజర్**ఎట్టకేలకు అజ్ఞాతం వీడి ఇబ్రహీంపట్నం లో రహస్య స్థావరంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం!..చంద్రబాబు ఇంటిపై దొమ్మీకి వెళ్ళిన కేసులో పరారైన మాజీ మంత్రి జోగి రమేష్..జోగితో పాటు చంద్రబాబు ఇంటిపై మారణాయదాలతో పాల్గొన్న పెడనకు చెందిన జోగి అనుచరులు అజ్ఞాతంలోకి..మాజీ మంత్రి పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ తో పాటు ఆయన అనుచరుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు జల్లెడ పడుతున్న నేపథ్యం.

ఒంగోలు చర్చి సెంటర్ లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేకు కట్ చేసి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారికి నివాళిర్పిస్తున్న ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు శ్రీ జంకె వెంకట రెడ్డి గారు*

👉మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా శిoగరాయకొండ మూలాగుంటపాడు లో గల డాక్టర్ వైయస్సార్ విగ్రహమునకు పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మాత్యులు మరియు కొండేపి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి వైస్ ఎంపీపీ సామంతుల రవికుమార్ రెడ్డి ఉన్నారు. 👉ఒంగోలు చర్చి సెంటర్ లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేకు కట్ చేసి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు జంకె వెంకట రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

👉ఉచిత ఇసుక కార్యక్రమాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు..ప్రజల నిర్మాణ రంగ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం అందజేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు .ఒంగోలు వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభిం చారు.ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్ల కాలంలో ప్రజలు ఇసుక కోసం నానా ఇబ్బందులు పడ్డారన్నారు. నిర్మాణ రంగం కుదేలయిందని తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోనే ఇసుక పాలసీని తీసుకుని వచ్చి ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేస్తున్నారన్నారు.టన్ను ఇసుక ధర 247 రూపాయలుగా నిర్ణయించామన్నారు.అది కేవలం జెసిబి ద్వారా ఇసుకను లోడ్ చేయడానికి మాత్రమేనని తెలియజేశారు. ఉచిత ఇసుక పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా పంపిణీ చేపడతామన్నారు.ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మా గుంట శ్రీనివాసులు రెడ్డి , ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు , టిడిపి నాయకులు సింగరాజు రాంబాబు , రాచగర్ల వెంకటరావు , తాతా ప్రసాద్ ,మదన్, గనుల శాఖ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు 👉ఒంగోలు లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు నూతనంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు , జనసేన జిల్లా ఇంచార్జి షేక్ రియాజ్ మరియు పలువురు నాయకులు, అధికారులు.

👉మంచి మనసున్న గొప్ప మహనీయుడు.. సంక్షేమ పథకాల రూపకర్త వైఎస్సార్ సేవలు మరువలేనివి..మార్కాపురం వైఎస్సార్సీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు..రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రజా నాయకుడు, జన హృదయనేత,అపర భగీరధుడు,దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మంచి మనసున్న గొప్ప మహనీయుడు అని మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇంచార్జి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. సోమవారం దివంగత మహానేత వైఎస్సార్ గారి 75వ జయంతి ని పురస్కరించుకొని మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో మార్కాపురం వైసీపీ ఇంచార్జి,మాజీ ఎమ్మెల్యే అన్నా పాల్గొన్నారు.అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకొని అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సంక్షేమ పథకాల రూపకర్త గా మహానేత వైఎస్సార్ గారు పేరు పొందరన్నారు.మహానేత వైఎస్సార్ గారు చూపిన బాటలోనే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నడుస్తున్నారన్నారు. అనంతరం మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే అన్నా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలోని పలువురు రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.

👉75వ వైయస్సార్ జయంతి వేడుకలు సోమవారం   గిద్దలూరు రాచర్ల గేటు సెంటర్ లో,కంభం టౌన్ లో బేస్తవారపేట టౌన్ లో గిద్దలూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్/మాజీ ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది….

👉బేస్తవారిపేట లో రైతు భరోసా కార్యాలయంలో చోరీ..ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో స్థానిక రైతు భరోసా కార్యాలయంలో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు కార్యాలయం వెనుక వైపు తలుపులను పగలగొట్టి లోపలికి ప్రవేశించి ఒక ఎల్ఈడి టీవీ. ఐదు సీలింగ్ ఫ్యాన్లు. గ్యాస్ సిలిండర్.పోయ్యు ని దొంగలించటం జరిగిందిఈరోజు ఉదయం కార్యాలయం సిబ్బంది తలుపులు తెరవగా వెనక వైపు డోరు తెరిచి ఉండటంతో విషయాన్ని గుర్తించి వెంటనే బేస్తవారిపేట ఎస్సై నరసింహారావుకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.దొంగలించిన వారు బెస్తర పేట మండల పరిధిలో గ్రామాలలో ఇద్దరు వ్యక్తులు హిందీలో మాట్లాడుతూ పివిపురం ఎస్సీ పాలెం కు వెళ్లి టీవీ ని అమ్ముతున్నట్లుగా సమాచారం రావడంతో ఎస్ఐ నరసింహారావు తమ సిబ్బందితో గ్రామాలకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు.మార్కాపురం నుండి క్లూస్ టీం రంగప్రవేశం చేయటం జరిగింది.బేస్తవారిపేట మండల అగ్రికల్చర్ ఆఫీసర్ జె మెర్సీ రాణి మాట్లాడుతూ కార్యాలయంలో దొంగిలించిన వారు నార్త్ ప్రాంతముకు చెందినవారుగా ఉండొచ్చని ప్రతినిధులతో తెలిపారు

👉భారీగా రేషన్ బియ్యం పట్టివేత..పి.డి.స్ బస్తాలుతో సహా పట్టుకున్న అధికారులు..రేషన్ షాపునుండి నేరుగా అక్రమార్కుడి ఇంటికి చేరిన బస్తాలు..ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని రావిపాడు రోడ్డులో గల మస్తాన్ వలి స్వామి దర్గా సమీపంలోని మూడు అంతస్తుల ఒక భవనంలో భారీగా రేషన్ బియ్యం నిల్వ ఉన్నాయంటూ సమాచారం అందుకున్న కంభం గోడౌన్ డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్, ఇన్ఫర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారి అనిల్ ఆధ్వర్యంలో చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. సుమారు 200 మూటల వరకు ఉండవచ్చని గోడౌన్ డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్ తెలిపారు.

👉 ప్రమాదంలో గాయపడిన రైతు మృతి…కంభం మండలం జంగంగుంట్ల గ్రామానికి చెందిన దేశిరెడ్డి సుబ్బారెడ్డి (51 ) ఆదివారం సాయంత్రం 6 సమయంలో హైవే రోడ్డు దాటుతుండగా అతని బైక్ ను కారు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమైంది .మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఒక కుమారుడు ఉన్నారు.తన పొలంలో దుక్కి దున్నించి ట్రాక్టర్ డ్రైవర్ కోసం భోజనం తీసుకెళ్తుండగా రోడ్డు క్రాస్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది .పోస్ట్మార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 👉తమ గ్రామం మీదుగా ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరిగినప్పటి నుండి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

7k network
Recent Posts

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి

*మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం:CBN …* జగన్ ది అక్రమ సంబంధం’…వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. షర్మిల షాకింగ్ కామెంట్స్! .. 👉తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్, ముగ్గురు బదిలీ* .. 👉ఆరు శవాలు – వైసీపీకి ఎంత బలమో !*.. *రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం*… 👉జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం …*గిద్దలూరు: నీటి సమస్యపై అత్యవసర సమావేశం..