👉ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న: సీఎం రేవంత్.
👉సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు.అమ్మవారికి రేవంత్ పట్టు వస్త్రాలు సమర్పించారు.మరో వైపు భక్తుల రద్దీ కొనసాగుతోంది.భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించి,బోనాలు సమర్పించు కుంటున్నారు.*
👉 వైసీపీ కార్యకర్త హత్యపై స్పందించిన సీఎం చంద్రబాబు.. పల్నాడు జిల్లా వినుకొండ హత్య గంజాయి వల్లే జరిగిందని వైసీపీ నేతలే ఒప్పుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ పెంచి, పోషించిన గంజాయి, డ్రగ్స్ సంస్కృతి వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో శ్వేతపత్రాల్లోని వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం జగన్‌కు లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఢిల్లీ వెళ్తామని డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ ఎంపీలతో సమావేశంలో విమర్శించారు.
👉 అమరావతి: అసెంబ్లీ సమావేశాల నుంచి పారిపోయేందుకే జగన్ దిల్లీ డ్రామాలు ఆడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ శ్వేతపత్రంలోని వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం జగన్‌కు లేదు..ఆయన పెంచిపోషించిన గంజాయి, డ్రగ్స్ సంస్కృతి వల్లే అనర్థాలు. వినుకొండ హత్య గంజాయి వల్లే జరిగినట్లు వైకాపా నేతలే ఒప్పుకొన్నారు.. శాంతిభద్రతల అంశంలో నేతలంతా క్రమశిక్షణ పాటించాలి.. వైకాపా అబద్ధపు విషప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడదాం..ఒకట్రెండు కార్పొరేషన్లకే జగన్ నిధులు మళ్లించారు. ఖజానా మొత్తాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు’’ అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాభివృద్ధిని సవాల్‌గా తీసుకొని పనిచేద్దామని ఎంపీలకు పిలుపునిచ్చారు. శాంతిభద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు..***కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకోవటం కోసం, రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. శాఖల వారీగా ఎక్కువ నిధులు తీసుకు రావాలనే లక్ష్యంతో, స్పష్టమైన ప్రణాళికతో వెళ్ళాలని చంద్రబాబు ఆదేశించారు….👉 అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలోని నలుగురు అధికారులు పర్యవేక్షించాల్సిన శాఖలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు సీఎం కార్యాలయం, సాధారణ పరిపాలనశాఖ, హోమ్, ఆర్థిక, ఎక్సైజ్, రెవెన్యూ, దేవాదాయ శాఖలు కేటాయించారు. ఏవీ రాజమౌళికి జలవనరులు, విద్యుత్, గనులు, వ్యవసాయం, సీఎంఆర్ఎఫ్, ఫిర్యాదులు తదితర శాఖలు పర్యవేక్షించనున్నారు. ప్రద్యుమ్నకు రవాణా, పురపాలక, పంచాయతీరాజ్, ఆర్టీజీఎస్, అటవీ, పౌరసరఫరాలశాఖలు కేటాయించారు. కార్తికేయ మిశ్రాకు ఆర్థిక, ఐటీ, ఎన్ఆర్ఐ వ్యవహారాలు, సమాచార పౌరసంబంధాలు, పరిశ్రమలు, సీఎం దిల్లీ, విదేశీ పర్యటనల సమన్వయం తదితర విభాగాలు చూడనున్నారు. 👉దిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఛైర్మన్ మనోజ్ సోనీ శనివారం తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేసినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్ నెలలోనే బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఇంకా ఐదేళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేయడం గమనార్హం. అయితే, ఆయన రాజీనామాను ఇంకా ఆమోదించలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
👉కర్నూలులో సినీనటి శ్రీరెడ్డి పై కేసు నమోదు.😱 కర్నూల్ .. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ను దూషించిన శ్రీరెడ్డి ..
మంత్రులు లోకేశ్, అనిత పై అనుచిత వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమాల్లో అసభ్య కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి .. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత రాజుయాదవ్..
👉 అమరావతి: సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరో తెలుగు వ్యక్తికి “మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి దుర్భర జీవితం గడుపుతున్నానంటూ వీరేంద్ర కుమార్ ఎక్స్(ట్విటర్)లో వీడియో పోస్టు చేశారు. ఖతర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించి సౌదీలోని ఎడారిలో ఒంటెల మధ్య తనను పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నానని పేర్కొన్నారు. వీరేంద్ర వీడియో చూసి మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదని ఆయన హామీ ఇచ్చారు.
👉ఏపీలో గతకొన్ని రోజులుగా జరుగుతున్న ఘర్షణ వాతావరణాలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… రాష్ట్రంలో అరాచకం స్వైరవిహారం చేస్తుందని ఒకరంటే.. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అవును… తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్ లో మీడియాతో మట్లాడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. చంద్రబాబు, చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… ఐదేళ్ల వైసీపీ పాలనలో తాము ఏనాడూ పులవర్తి నానీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని.. ఆయన మాత్రం ఎమ్మెల్యే అయ్యినప్పటినుంచీ తమపై కక్ష సాధింపు పనిలేనో ఉన్నాడని చెవిరెడ్డి ఆరోపించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయినా కాలేదని.. ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 35 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు జరిగాయని చెవిరెడ్డి ఆరోపించారు. వాస్తవానికి చంద్రగిరి నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం అని.. అలాంటి చోట ప్రజలు నేడు భయపడి తిరగాల్సిన పరిస్థితి ఎదురైందని అన్నారు. ఈ నేపథ్యంలోనే… ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వైసీపీ కార్యకర్తలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారని.. ఎక్కడపడితే అక్కడ వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని.. దాడులు చేసినవారిని గుర్తుపట్టకుండా ముఖాలకు ముసుగులు వేసుకుని వచ్చి చితకబాదుతున్నారని చెవిరెడ్డి సంచలన ఆరోపణలు! గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పులవర్తి నానీని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తాము వేధించలేదు సరికదా.. మైనింగ్ వ్యాపారానికి సాయం చేశామని.. ఆ మైనింగ్ వ్యాపారం అడ్డుకోవడానికి తాము ఏనాడూ ప్రయత్నాలు చేయలేదని చెవిరెడ్డి చెప్పారు. నేడు పులవర్తి నాని మైనింగ్ కంపెనీకి చెందిన లారీలు తమిళనాడు, కర్ణాటకలో స్వేచ్చగా తిరగడానికి తామే సహాయం చేశామని అన్నారు. ఒకవేళ తాను చెప్పేది అసత్యమైతే… టీడీపీ నాయకుడు పులవర్తి నాని, గతంలో పెద్దిరెడ్డి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. దీంతో.. ఈ విషయం వైరల్ గా మారింది.
👉 అమరావతి: గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ నిర్మించిన భవనానికి అనుమతులు లేవని సీఆర్డీఏ, పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ప్రాంతం సీఆర్డీఏ పరిధిలో ఉన్నందున సీఆర్డీఏతో పాటు ఉద్దండరాయునిపాలెం పంచాయతీ అధికారులు సంయుక్తంగా నోటీసు ఇచ్చారు. ఈ నోటీసులపై మాజీ ఎంపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. శనివారం విచారణ జరిగింది. సురేష్ భవనం అంశంలో చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టరాదని పిటిషనర్‌కు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.
👉ఎన్టీఆర్ జిల్లా:- జిల్లాలో జోరుగా వర్షాలు..వరదలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సృజన ఆదేశం..కలెక్టరేట్లో కంట్రోల్‌రూం(0866-2575833) ఏర్పాటు
👉కర్నూలులో సినీనటి శ్రీరెడ్డి పై కేసు నమోదు.. కర్నూల్ .. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ను దూషించిన శ్రీరెడ్డి ..మంత్రులు లోకేశ్, అనిత పై అనుచిత వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమాల్లో అసభ్య కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి .. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత రాజుయాదవ్..
👉సంగారెడ్డి: బీడీఎల్ భానూరులో ఏపీకి చెందిన సీఐఎస్ఎఫ్ జవాను మృతి చెందారు. విధుల్లో ఉండగా బెటాలియన్ బస్సులో తుపాకీ పేలి తూటా తలలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో జవాను వెంకటేశ్ (34) అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో నుంచి కిందకు దిగుతున్న క్రమంలో ఆయన వద్ద ఉన్న గన్ మిస్ ఫైర్ అయి ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. నంద్యాల జిల్లా అవుకు మండలం జూనూతల గ్రామానికి చెందిన వెంకటేశ్ హైదరాబాద్‌లోని సీఐఎస్ఎఫ్ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. 13ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన వెంకటేశ్ మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
👉ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్ లు…ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్ లు చేపట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం తప్పడంలేదు. ఇటీవలే పెద్ద ఎత్తున ఐపీఎస్ లను బదిలీ చేశారు. పలు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. తాజాగా, ఐఏఎస్ లను బదిలీ చేశారు. పలు కీలక శాఖలకు కమిషనర్లను, ఎండీలను, డైరెక్టర్లను, సీఈవోలను, సీఎండీలను, జాయింట్ కలెక్టర్లను నియమించారు.
👉మార్కాపురం మండలం తిప్పాయపాలెం వద్ద అనంతపురం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ గేదెలను ఢీకొని బోల్తా….ఈ ప్రమాదంలో ధర్మవరం కు చెందిన గజ్జల శివయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి….మరో ఒకరికి తీవ్ర గాయాలు ఒంగోలు కు తరలింపు,మరో ముగ్గురికి స్వల్ప గాయాలు,…ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు….స్వల్ప వేగంతో బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులు వెంటనే బయటికి వచ్చి వారి గమ్యస్థానాలకు వేరే వాహనాల్లో తరలిపోయారు….
👉ఒకే వీధిలో రెండు దొంగతనాలు..ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని సంగావీధిలో రహంతుల్లా అనే కొబ్బరి బొండాల వ్యాపారి ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న రెండు బీరువాలను పగులగొట్టి , రెండు తులాల బంగారం, రూ.5 వేలు నగదును దుండగులు దోచుకొని వెళ్లారు. అలాగే అదే వీధిలోని సతీష్ అనే యువకుడి పల్సర్ ద్విచక్ర వాహనం కూడా చోరికి గురైంది.శనివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీంను రంగంలోకి దింపి వేలిముద్రలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.