డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఫిజికల్‌గా జారీ చేయరా?..ఏపీ హైకోర్టు..బ్రాండ్‌ ఏపీ…ఈ లక్ష్యం దిశగానే కొత్త పారిశ్రామిక విధానం: బాబు..మాజీ మంత్రి జోగి రమేష్ కు బిగ్ షాక్!..జోగి కుమారుడు అరెస్ట్..నంద్యాలలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ.. హైదరాబాదులో దవాఖానాలు కిటకిట..

👉 బ్రాండ్‌ ఏపీ…ఈ లక్ష్యం దిశగానే కొత్త పారిశ్రామిక విధానం: బాబు..టాప్‌-5 రాష్ట్రాలతో పోటీ పడాలి.. 15% సమగ్ర వృద్ధే లక్ష్యం..నీతి ఆయోగ్‌ ఆలోచనలు.. పరిగణనలోకి తీసుకోవాలి..ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మనకు 10 ఓడరేవులు, 10 విమానాశ్రయాలు
పశ్చిమ కంటే తూర్పు తీర ప్రాంతం రోడ్డు,రైలు, విమానయానంతో అనుసంధానం ..ఇవన్నీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం..16న పారిశ్రామికవేత్తలతో భేటీ
100 రోజుల్లోగా ముఖ్య పాలసీలు: సీఎం
👉డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఫిజికల్‌గా జారీ చేయరా?.. ఏపీ హైకోర్టు.. డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లను ఫిజికల్‌గా ఇవ్వకుండా కేవలం డిజిటల్‌ రూపంలో జారీ చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వాటిని ఫిజికల్‌గా జారీ చేసే విషయంలో చట్టంలో ఎలాంటి నిషేధమూ లేదని గుర్తు చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, కేంద్ర రవాణాశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది.
డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ పత్రాలను ఫిజికల్‌ రూపంలో జారీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పంజాబ్‌కు చెందిన రాహత్‌ ద సేఫ్‌ కమ్యూనిటీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కమల్‌ ఏపీ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ పిల్‌ ఇటీవల సీజే ధర్మాసనం ముందు విచారణకు రాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్ల జారీ కోసం వాహనదారులు ప్రభుత్వానికి నిర్దేశిత సొమ్మును చెల్లిస్తున్నారన్నారు. అయినప్పటికీ వాటిని ఫిజికల్‌ రూపంలో జారీ చేయడం లేదని, కేవలం డిజిటల్‌ రూపంలోనే అందజేస్తున్నారని వివరించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
**స్కూల్ వ్యాన్ ల ఫిట్ నెస్ పరీక్షలకు సీఎం ఆదేశం*
అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లె హైవే క్రాస్ సమీపంలో స్కూల్ వ్యాను బోల్తాపడిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదంలో భవిష్య అనే చిన్నారి మృతి చెందడంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రవాణా శాఖ అధికారులు డ్రైవ్ నిర్వహించాలని, ఫిట్ నెస్ లేకుండా స్కూల్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
👉*మాజీమంత్రి జోగిరమేష్ ఇంట్లో ACB తనిఖీలు..
తనిఖీలు చేస్తున్న 15 మంది ఏసీబీ అధికారులు.. *ఇంటిని స్వాధీనం చేసుకుని కొనసాగిస్తున్న సోదాలు** *అగ్రిగోల్డ్ వ్యవహారంలో ACB విచారణ..

*మాజీ మంత్రి జోగి రమేష్ కు బిగ్ షాక్!… వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలింది. ఇందులో భాగంగా విజయవాడ శివార్లలోని ఇబ్రహీపట్నం లోని ఆయన నివాసంలో ఈరోజు ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు..గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు చెలరేగిపోయారని.. ప్రధానంగా అప్పట్లో మంత్రులుగా ఉన్నవారి అక్రమాలకైతే అడ్డూ అదుపూ లేకుండా పోయిందనే విమర్శలు కూటమి పార్టీల నుంచి బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా అయన ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు.వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలింది. ఇందులో భాగంగా విజయవాడ శివార్లలోని ఇబ్రహీపట్నం లోని ఆయన నివాసంలో ఈరోజు ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని.. ప్రధానంగా అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఫిర్యాదులు అందడం వల్లే ఈ దాడులు జరిగినట్లు చెబుతున్నారు.*అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూములను విక్రయించారనే ఆరోపణలను జోగి రమేష్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ భూములు సీఐడీ అధీనంలో ఉన్నప్పటికీ ఆయన వాటిని కొనుగోలు చేసి, భారీ ధరలకు విక్రయించారనే ఆరోపణలు గతంలో విపరీతంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో సుమారు ఐదు కోట్ల రూపాయలను ఆయన ఆర్జించారనే ఆరోపణలు ఉన్నాయి.అంబాపురంలో 69/2, 87 సర్వే నెంబర్లలోని సుమారు 2,300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉండగా.. దాన్ని గతంలో సీఐడీ స్వాధీనం చేసుకుంది. అయితే ఈ భూమిని రమేష్.. తన సమీప బంధువుల పేరు మీదకు బదలాయించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం!

👉జోగి రమేష్ కుమారుడు అరెస్ట్… చంద్రబాబుకు మాజీమంత్రి ప్రశ్నలు! అనంతరం కొన్ని గంటలకే జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా… ఈ రోజు తెల్లవారుజామున వియవాడ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను తనిఖీ చేసినట్లు చెబుతున్నారు. అనంతరం కొన్ని గంటలకే జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు… మంగళవారం తెల్లవారుజామున సుమారు 15 మంది అధికారు జోగి రమేష్ నివాసంలో సోధాలు చేపట్టారు.ఈ క్రమంలో పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ సోదాలు అయిన కొన్ని గంటలకే జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐడీ స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను మరికొంతమందితో కలిసి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన జోగి రాజీవ్… తన తండ్రిపై ఉన్న కక్షతోనే తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ఇదే సమయంలో… కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని వెల్లడించారు. మరోపక్క తన కుమారుడు రాజీవ్ అరెస్ట్ పై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాబుని ప్రశ్నించారు. ఇందులో భాగంగా… అగ్రిగోల్డ్ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పూ చేయలేదని చెప్పిన జోగి రమేష్.. తాను కానీ, తన కుటుంబం కానీ అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో ఏదైనా తప్పు చేసి ఉంటే విజయవాడ నడిరోడ్డులో ఉరేసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా… బలహీన వర్గాలకు చెందిన తమను వేధించడం న్యాయమా చంద్రబాబు నాయూ అంటూ ప్రశ్నించారు. తన కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే పైన దేవుడున్నాడని అన్నారు. ఇదే క్రమంలో… “మీరు మమ్మల్ని తొక్కొచ్చు..రెడ్ బుక్ తీయొచ్చు.. మాపై కేసులు పెట్టోచ్చు.. మీరు మరీ ఇంత దుర్మార్గంగా ఏమీ తెలియని కుర్రాడిపై కేసుపెట్టి జైల్లో పెట్టాలన్న వంకర బుద్దిని మార్చుకోవాలి” అని జోగి రమేష్ అన్నారు.♦

👉”హార్ ఘర్ తిరంగ” కార్యక్రమంలో భాగంగా భారీ జాతీయ జెండా ర్యాలీని ప్రారంభించిన రాష్ట్ర మంత్రివర్యులు NMD ఫరూక్ .*నంద్యాల పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హార్ ఘర్ తీరంగ ప్రతి ఇంటికి జాతీయ జెండా చేరాలని ముఖ్య ఉద్దేశంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో నంద్యాలలో స్థానిక టెక్క మార్కెట్ యార్డ్ నుండి గాంధీచౌక్ వరకు భారీ జాతీయజెండా ర్యాలీ నిర్వహించారు.

*ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు NMD ఫరూక్  జాతీయ జెండా ర్యాలీని ప్రారంభించి ప్రతి ఒక్కరూ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల జీవిత గాధలను గుర్తుచేసుకుని దేశ అభివృద్ధికి పూన:రంకితమవ్వాలని పిలుపునిచ్చారు*కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఐఏఎస్, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ ఎన్ డి ఫిరోజ్, డీఆర్ఓ పద్మజ, జిల్లా అధికారులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.*

*దావాఖానలు కిటకిట.. హైద్రాబాద్..*వాతావరణంలో మార్పుల కారణంగా రోగాలు ప్రబలుతున్నాయి. జర్వం, జలుబు, గొంతునొప్పి, దగ్గు, వాంతులు, విరేచనాలతో జనం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఏ హాస్పిటల్ చూసినా వైరల్ ఫీవర్ బాధితులతో కిక్కిరిసిపోతోంది.*ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా వైరల్ ఫీవర్ బాధితులుంటున్నారు. వర్షాకాలం.. కొన్ని రోజులుగా వాతావరణం ముసురుగా ఉండటంతో విషజ్వరాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. పది రోజులుగా పలు రకాల జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఒక్క ఫీవర్ హాస్పిటల్‌లోనే రోజుకు 600 నుంచి 700 వరకు ఓపీ ఉంటోంది. సాధారణ రోజుల్లో ఇక్కడ 300 నుంచి 400 మంది మాత్రమే వస్తుంటారు. సీజన్‌మార్పుల కారణంగా ఈ సంఖ్య సుమారు ఐదు రెట్లు పెరిగింది.ఇక ఇన్ పేషెంట్‌గా చేరుతున్న వారి సంఖ్య రోజుకు 30 నుంచి 40 వరకు ఉంటోంది. వీరిలో ఎక్కువగా హెపటైటిస్, చికెన్ గున్యా, డెంగ్యూ, విషజర్వాల బాధితులు ఉంటున్నారు. ఒక్క ఫీవర్ హాస్పిటల్‌లో మాత్రమే కాదు ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ హాస్పిటల్స్‌లో కూడా వైరల్ ఫీవర్స్ బాధితుల సంఖ్య పెరిగింది. ప్రతి హాస్పిటల్ రోజు ఉండే సాధారణ ఓపీ కన్నా 500 వందల మంది వరకు ఎక్కువ ఒపి ఉంటోంది. పెరిగిన ఓపీ మొత్తం కూడా వైరల్ ఫీవర్స్ బాధితులేనని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటే ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం