వైసిపి నేతలకు కార్యకర్తలకు టిడిపి పార్టీలోకి నో ఎంట్రీ సీఎం ఆదేశం..15 న సీఎం రేవంత్ ఖమ్మం జిల్లా పర్యటన..వైకాపా ఉచ్చులో  పడొద్దు: ప్రత్తిపాటి. 15న కబేలాకు సెలవు-విజయవాడ కమిషనర్…శిలాశాసనాన్ని కనుగొన్న పొదిలి పురావస్తు పరిశోధన విద్యార్థి..అంతా ష‌ర్మిల‌కు న‌చ్చిన‌ట్టే ఉండాలా..పార్లమెంటులో ఎంపీ మాగుంట ప్రశ్న..ఆగస్టు 18 న జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభలు..

👉వైసిపి నేతలకు కార్యకర్తలకు టిడిపి పార్టీలోకి నో ఎంట్రీ సీఎం ఆదేశం* టిడిపి అధికారంలోకి వచ్చిందనివాళ్ల సొంత లాభాల కోసం వైసిపిని వీడినట్లు షో చేస్తూ టిడిపిలోకి..వచ్చేవారితో జాగ్రత్తగా ఉండాలని సీఎం ఆదేశించారు ..చిన్న చిన్న నామినేటెడ్ పదవులు పాఠశాల మేనేజ్మెంట్ కమిటీల లాంటి వాటికోసం గానీ నీటిపారుదల సంఘాల అధ్యక్ష పదవుల కోసం గానీ ఇతరత్రా పదవులకోసం గానీ, లోగడ తప్పులు చేసి వాటినుండి తప్పించుకోవడానికి గానీ పార్టీలోకి చేరి మరల వారు ఈ పదవులు పొంది తిరిగి ఆ పార్టీ వారికి అనుకూలంగా ఉంటారని, అటువంటి వారి ఎత్తుగడలు చెల్లవని తేల్చి చెప్పారు. అటువంటి వారిని పార్టీలోకి చేర్చుకోవద్దని కార్యకర్తలను నాయకులను ఆదేశించారు..నిజాయితీగా పార్టీలో తిరిగేవారికే పదవులు గాని నాయకత్వం గానీ వస్తుందని రెండు పడవలపై కాలు వేసే వారిని ,టిడిపిలో ఉంటూ వైసీపీ కోవర్ట్ లుగా పనిచేసే వారిని గుర్తించి వారిని దూరం పెట్టాలని ఆదేశించారు.

👉 ఏపీలో బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు*
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో బాలింతలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్టీఆర్ బేబీ కిట్స్ పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్సులు, సాధారణ అంబులెన్సుల మధ్య అనుసంధానం పెంచాలన్నారు. డోలీతో గర్భిణులు, బాలింతలను మోసుకొస్తున్న దృశ్యాలు కనిపించకూడదని స్పష్టం చేశారు. కాగా బేబీ కిట్లో చిన్న పరుపు, శానిటైజర్, సోప్, పౌడర్, దోమతెర, న్యాప్కిన్ లు ఉంటాయి…
👉పాడి రైతులెవరు వైకాపా తప్పుడు ప్రచారాల ఉచ్చులో  పడొద్దు: ప్రత్తిపాటి*..*మానుకొండవారి పాలెంలో సంగం డెయిరీ పాడి రైతులకు బోనస్ పంపిణీ..*పాల ఉత్పత్తిదారులకు రూ.8.64 లక్షలు పంపిణీ చేసిన ప్రత్తిపాటి*
రాష్ట్రంలో పాడిరైతులు ఎవరూ విపక్ష వైకాపా చేస్తోన్న తప్పుడు ప్రచారాల ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేశారు వ్యవసాయశాఖ మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు. పాడిరైతులను అన్ని విధాల ప్రోత్సహించాలి, వారికి అదనపు ఆదాయాలు అందించి ఆలంబనగా నిలవాలన్నదే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం అని స్పష్టం చేశారాయన. ఆ దిశగా పాల ఉత్పత్తికి సరైన గిట్టుబాటు ధర, మార్కెట్ సదుపాయం కల్పించేందుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మంగళవారం చిలకలూరిపేట 11వ వార్డు పరిధిలోని మానుకొండవారిపాలెంలో సంగం డెయిరీ పాడి రైతులకు ప్రోత్సాహకాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేగా ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని పాడి రైతులకు నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. పాల ఉత్పత్తిదారులకు రూ.8.64 లక్షలు పంపిణీ చేశారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మీద, ధూళిపాళ్ల నరేంద్ర మీద కక్షతో వైకాపా ప్రభుత్వం హయాంలో సంగం డెయిరీని ఎన్నివిధాలుగా ఇబ్బంది పెట్టాలని చూశారో అంతా గమనించారన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతుల్లో నింపిన విశ్వాసం కారణంగానే వాటన్నింటినీ తట్టుకుని ఈరోజు మళ్లీ ఇలా సగౌరవంగా తలెత్తుకుని నిలబడడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత పాలకులు రాష్ట్ర పాడిపరిశ్రమ మొత్తాన్ని అమూల్‌కు కట్టబెట్టాలని చూసినా సంగం డెయిరీని కాపాడిన నాయకుడు, ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అని అభినందించారు. అటువంటి దుర్మార్గపు పాలన సాగించారు కాబట్టే ప్రజలు వైకాపాను 151 నుంచి 11కి పడేశారని స్వాతంత్ర్య భారతంలోనే అత్యధిక మెజార్టీలతో కూటమిని గెలిపించారన్నారు ప్రత్తిపాటి. ఇక అంతా వైకాపా పీడకలను మరిచిపోయిన సంగం డెయిరీని మరింత విస్తరణ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ని పాలు ఉత్పత్తి చేసినా కొనుగోలు చేస్తున్న వ్యవస్థ ఉన్నందున రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాల దిగుబడి పెంచేందుకు ఊరూరా గడ్డిక్షేత్రాలు ప్రారంభించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా అంతా గుర్తుంచుకోవాలన్నారు. అందుకోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆర్థికసాయం కూడా లభిస్తుందని ఆ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రత్తిపాటి. చంద్రబాబు వస్తే పింఛన్లు ఆగిపోతాయని, సంక్షేమ పథకాలు అందవని వైకాపా చేసి తప్పుడు ప్రచారాలు ఎలా తేలిపోతున్నాయో కూడా అంతా గమనించాలన్నారు. చెప్పినట్లు ఇంటింటికీ రూ.4వేల పింఛను, డీఎస్సీ ప్రకటన కసరత్తు, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడమే కాదు ఈ నెల 15 నుంచే అన్న క్యాంటీన్లను కూడా అందుబాటులోకి ప్రారంభించునున్నామన్నారు. వీటన్నింటి ద్వారా ప్రజల అవసరాలు, సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి అంటే ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి చంద్రబాబు అందరి కళ్లకు కడుతున్నారన్నారు ప్రత్తిపాటి. తెదేపా ప్రభుత్వం రాగానే చిలకలూరిపేటలో కాల్వల శుభ్రం, దోమెల బెడద లేకుండా ఫాగింగ్, మంచినీటి సమస్య పరిష్కారానికి, దీపాల ఏర్పాటుకు రూ.90 లక్షల నిధులు విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మానుకొండవారిపాలెంలో ఓవర్‌హెడ్ ట్యాంక్ పడిపోయే దశలో ఉందని స్థానికుల చెప్పారని, తక్షణమే ఆ పథకాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దాని నిర్మాణం పూర్తిచేస్తే ఒకరోజు అటో ఇటో నిధులు విడుదల చేస్తారన్నారు. త్వరితగతిన పాత ట్యాంక్‌ కూల్చివేసి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించాలన్నారు.

*👉ఈనెల 15 న సీఎం రేవంత్ రెడ్డి,ఖమ్మం జిల్లా పర్యటన..

హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15న ఖమ్మం పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం వైరాలో జరిగే బహిరంగసభలో పాల్గొన నున్నారు. అక్కడే రూ.2 లక్షల రుణమాఫీపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి రేపు హైదరాబాద్‌‌కు చేరుకోనున్నారు…

👉రంగారెడ్డి జిల్లా : లంచం తీసుకుంటూ దొరికిన అడిషనల్ కలెక్టర్…!!!రంగారెడ్డి జిల్లాలో అవినీతి అధికారులు పట్టుబడ్డారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్రెడ్డి, సీనియర్అసిస్టెంట్ మదన్ మోహన్ డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డారు.ధరణిలో మార్పులు చేసేందుకు రూ.8లక్షలు డిమాండ్ చేసి దొరికిపోయారు.ఇద్దరి ఇళ్లలోఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు…

👉15న కబేళా, చేపల మార్కెట్లు, మాంసపు దుకాణాలకు సెల‌వు,..విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర..  78వ స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర ఉత్తర్వుల మేరకు గురువారం నగరంలో ఉన్న కబేళాకు సెలవు ప్రకటించారు. బుధవారం రాత్రి నుండి కబేళాలో ఎటువంటి జoతువులను వధించుటకు అనుమతి లేదు. నగరంలో ఉన్న అన్ని చికెన్ షాపులు, మటన్ షాపులు, ni చేపల మార్కెట్లు అన్నియు కూడా తెరుచుటకు అనుమతి లేదు. ఎవరైనా అనుమతి లేకుండా జీవాలను వధించిన యెడల, లేదా షాపులను తెరిచియుండి మటన్, చికెన్ మరియు చేపలను అమ్మిన యెడల చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోనబడునని కమిషనర్ ఆదేశించారు. కావున మటన్, చికెన్, చేపలు హోల్ సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులు అన్ని షాపులు మూసి వేయవలెనని ఆదేశించడమైనది.

👉అంతా ష‌ర్మిల‌కు న‌చ్చిన‌ట్టే ఉండాలా..? అతి పెద్ద కాంగ్రెస్ పార్టీలో క్షేత్ర‌స్థాయి నాయ‌కులు తీసుకునే నిర్ణ‌యాల‌క‌న్నా.. అధిష్టానం తీసుకునే నిర్ణ‌యాల‌కే ప్రాధాన్యం ఉంటుంది….అతి పెద్ద కాంగ్రెస్ పార్టీలో క్షేత్ర‌స్థాయి నాయ‌కులు తీసుకునే నిర్ణ‌యాల‌క‌న్నా.. అధిష్టానం తీసుకునే నిర్ణ‌యాల‌కే ప్రాధాన్యం ఉంటుంది.అధిష్టాన‌మే అన్నీ తానై.. రాష్ట్రాల రాజ‌కీయాల‌ను కూడా స‌రిదిద్దు తుంది. రాష్ట్రాల స్థాయిలో నాయ‌కుల‌ను కూడా ఎంపిక చేస్తుంది. ఇప్ప‌టికీ దాదాపు అదే విధానం కొన‌సాగుతోంది. అయితే.. గ‌తంలో వైఎస్ జీవించి ఉన్న స‌మ‌యంలో అంత పెద్ద జాతీయ పార్టీని కూడా క్షేత్ర‌స్థాయికి తీసుకువ‌చ్చారు. ఉమ్మ‌డి ఏపీలో 2002-2009 వ‌ర‌కు కూడా ఆయ‌నే అన్నీ అయ్యారు. అంటే.. తాను చెప్పిన వారికే టికెట్లు ఇచ్చేలా, తాను తెచ్చిన ప‌థ‌కాల‌కు జై కొట్టేలా వ్య‌వ‌హ‌రించారు. దీనికి అధిష్టానం కూడా మొగ్గు చూపింది. దీంతోవైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని ఎదిరించే నాయ‌కుడు అంటూ ఏపీలో క‌నిపించ‌లేదు. అంతేకాదు.. ఆయ‌న అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా.. ఆయ‌న చెప్పిందే వేదంగా భావిం చారు. దీనిపై అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. జాతీయ పార్టీ కాంగ్రెస్‌ను వైఎస్ ప్రాంతీయ పార్టీ చేశారంటూ.. అస‌మ్మ‌తి నాయ‌కులు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. అయిన‌ప్ప‌టికీ.. అధిష్టానం త‌న నిర్ణ‌యంలో ఎలాంటి మార్పులూ చేయ‌లేదు. ఇక‌, ఇప్పుడు ఈ పంథాలోనే ఏపీ పీసీసీ చీఫ్‌, వైఎస్ త‌న ష‌ర్మిల కూడా ముందుకు సాగుతున్నారు. ప్ర‌స్తుతం ఆమె ఢిల్లీలో ప‌ర్య‌టిస్తు న్నారు. దీనికి ప్రాధాన్యం ఏంటంటే.. ఆమె రాష్ట్రంలో క‌మిటీలు ఏర్పాటు చేసేందుకు, జిల్లాల స్థాయిలో ఇంచార్జ్‌ల‌ను నియ‌మించేందుకు రెడీ అయ్యారు. ఈ స‌మ‌యంలో ఆమె త‌న‌కు న‌చ్చిన వారిని, త‌ను మెచ్చిన వారిని ప‌ద‌వుల్లో కూర్చోబెట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గ‌తంలో త‌న తండ్రి వైఎస్ అనుస‌రించిన విధానాన్నే ష‌ర్మిల పాటిస్తున్నారు. దీనికి సంబంధించి మొ త్తం 52 మంది పేర్ల‌తో అతిపెద్ద జాబితానే ష‌ర్మిల స‌మ‌ర్పించారు. ఈ జాబితాకు అధిష్టానం ఓకే చెబితే.. ఇక‌, ఏపీలో ష‌ర్మిలకు మ‌ద్ద‌తిచ్చే నాయ‌కులే కాంగ్రెస్‌లో క‌నిపిస్తారు. అయితే.. దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నేది చూడాలి. అప్ప‌టి వైఎస్ కు అంత ప్రాధాన్యం ఇవ్వ‌డానికి ఆయ‌న పార్టీని పుంజుకునేలా చేశారు. అధికారంలోకి తీసుకు వ‌చ్చారు.కానీ, ఇప్పుడు ష‌ర్మిల‌.. వ్య‌క్తిగ‌త అజెండాతో ముందుకు సాగుతున్నారే త‌ప్ప‌.. పార్టీని బ‌ల‌ప‌ర‌చ‌లేక పోతున్నారు. ఈ మైన‌స్‌ను పార్టీ అధిష్టానం క‌నుక ప‌రిగ‌ణ‌న‌లోకితీసుకుంటే.. ష‌ర్మిల జాబితాను ప‌క్క‌న పెడుతుంది. కాదంటే మాత్రం ఆమె చెప్పిన వారికే ప‌ద‌వులు వ‌రించ‌నున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. అయిన‌ప్ప‌టికీ.. అధిష్టానం త‌న నిర్ణ‌యంలో ఎలాంటి మార్పులూ చేయ‌లేదు. ఇక‌, ఇప్పుడు ఈ పంథాలో నే ఏపీ పీసీసీ చీఫ్‌, వైఎస్ త‌న ష‌ర్మిల కూడా ముందుకు సాగుతున్నారు. ప్ర‌స్తుతం ఆమె ఢిల్లీలో ప‌ర్య‌టిస్తు న్నారు. దీనికి ప్రాధాన్యం ఏంటంటే.. ఆమె రాష్ట్రంలో క‌మిటీలు ఏర్పాటు చేసేందుకు, జిల్లాల స్థాయిలో ఇంచార్జ్‌ల‌ను నియ‌మించేందుకు రెడీ అయ్యారు. ఈ స‌మ‌యంలో ఆమె త‌న‌కు న‌చ్చిన వారిని, త‌ను మెచ్చిన వారిని ప‌ద‌వుల్లో కూర్చోబెట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గ‌తంలో త‌న తండ్రి వైఎస్ అనుస‌రించిన విధానాన్నే ష‌ర్మిల పాటిస్తున్నారు. దీనికి సంబంధించి మొ త్తం 52 మంది పేర్ల‌తో అతిపెద్ద జాబితానే ష‌ర్మిల స‌మ‌ర్పించారు. ఈ జాబితాకు అధిష్టానం ఓకే చెబితే.. ఇక‌, ఏపీలో ష‌ర్మిలకు మ‌ద్ద‌తిచ్చే నాయ‌కులే కాంగ్రెస్‌లో క‌నిపిస్తారు. అయితే.. దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నేది చూడాలి. అప్ప‌టి వైఎస్ కు అంత ప్రాధాన్యం ఇవ్వ‌డానికి ఆయ‌న పార్టీని పుంజుకునేలా చేశారు. అధికారంలోకి తీసుకు వ‌చ్చారు.కానీ, ఇప్పుడు ష‌ర్మిల‌.. వ్య‌క్తిగ‌త అజెండాతో ముందుకు సాగుతున్నారే త‌ప్ప‌.. పార్టీని బ‌ల‌ప‌ర‌చ‌లేక పోతున్నారు. ఈ మైన‌స్‌ను పార్టీ అధిష్టానం క‌నుక ప‌రిగ‌ణ‌న‌లోకితీసుకుంటే.. ష‌ర్మిల జాబితాను ప‌క్క‌న పెడుతుంది. కాదంటే మాత్రం ఆమె చెప్పిన వారికే ప‌ద‌వులు వ‌రించ‌నున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి…వినియోగంలోకి రాగా, ఆంధ్రప్రదేశ్ లో 2,73,888 మంది రైతుల 3,09,111 హెక్టార్ల భూమి వినియోగంలోకి వచ్చిందని తెలిపారు. కాగా ప్రకాశం జిల్లాలో 31,384 హెక్టార్ల భూమి వినియోగంలోకి వచ్చిందని తెలిపారు. నితి ఆయోగ్ సంస్థ ఆధ్యాయనం ప్రకారం పొలంలో నీటి వినియోగ సామర్ధ్యం, పంట ఉత్పాదకత, ఉపాది అవకాశాల సృష్టి మరియు రైతుల ఆదాయం పెంపు వంటి జాతీయ ప్రాధాన్యతలు కలిగి వున్నాయని తెలిపారు.నీటి కొరత మరియు భూగర్భ జలాలు లేని మైదాన ప్రాతాలలో సూక్ష్మ నీటిపారుదల సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యతను ఈ పధకం ఇస్తుందని మరియు కృషి విజ్ఞాన్ కేంద్రాలు రైతులకు పలు పంటలపై శిక్షణతో పాటు క్షేత్ర ప్రదర్శనలు నిర్వహించి సమర్దవంత నీటిపారుదల పద్దతులు మరియు సాంకేతికతను తెలియజేస్తాయని కేంద్ర మంత్రి తెలియజేశారు.

👉ఆగస్టు 18 న జన విజ్ఞాన వేదిక వార్షిక జిల్లా మహాసభలు..మార్కాపురంలోని శ్రీవిద్య కోచింగ్ సెంటర్ నందు జన విజ్ఞాన వేదిక పట్టణ కమిటీ సమావేశం పట్టణ గౌరవాధ్యక్షులు చక్కిలం శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

జన విజ్ఞాన వేదిక జిల్లా ఆరోగ్య కన్వీనర్ డాక్టర్ బి.శరత్ మాట్లాడుతూ ఆగస్టు 18 న మార్కాపురంలో జరగనున్న జిల్లా వార్షిక మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. జన విజ్ఞాన వేదిక మండల కార్యదర్శి కే ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయులందరూ మహాసభలకు హాజరు కావాలన్నారు. జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షులు కే సుధాకర్ మాట్లాడుతూ మహాసభల సందర్భంగా మ్యాజిక్ షో , సైన్స్ ప్రదర్శనలు ఉంటాయన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు ఏనుగుల రవికుమార్ మాట్లాడుతూ మహాసభలకు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు.కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక పట్టణ  నాయకులు జె శేఖర్,మర్రిపూడి రామకృష్ణహాజరయ్యారు.
👉 విజయనగరం కాలం నాటి శిలాశాసనాన్ని కనుగొన్న పొదిలి పురావస్తు పరిశోధన విద్యార్థి వడ్డే మాధవ్ :

పొదిలి వాస్తవ్యూడు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో పురావస్తుశాస్త్రం పరిశోధన విద్యార్థి వడ్డే మాధవ్ క్రీస్తు శకం 15వ శతాబ్దం నాటి రెండవ దేవరాయ పరిపాలన నాటి శిలా శాసనాన్ని తన పరిశోధనల ద్వారా వెలుగులోకి తెచ్చాడు. ప్రకాశం జిల్లా, ఎర్రగొండ పాలెం మండలం ,నల్లమల అడవిలోని , పాలుట్ల గ్రామం, లో ఈ విద్యార్థి తన పరిశోధన లో భాగంగా ఈ శాసనాలను గుర్తించాడు. ఆదిమానవుల కాలం నాటి స్టోన్ టూల్స్ మరియు మెగాలిథిక్ బర్రియల్స్ కొరకు అడవిలో సంచరించగా మూడు శాసనాలను కనుగొన్నారు. ఆ శాసనాలని ‘ఎస్టాంపేజ్’ (రాతి శాసనం మెద ఉన్న అక్షరాలను ఒక పెద్ద పేపర్ మీద కు ముద్రలు తీయడం) నీ తీసి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో (ఎ.ఎస్.ఐ)శాసనాల అధ్యయన శాఖకు పంపారు. ఈ రాతి శాసనాలను పరిశీలించిన వారికి ఒక శాసనం వాల రికార్డ్స్ లో ఉంది అని మిగితా రెండు మటుకు వాల దృష్టికి రాలేదు అని తెలియ చేసారు . మిగిలిన రెండు శాసనాల్లో వాటి అక్షర శైలి ని బట్టి ఒకటి 19వ శతాబ్దం నాటిది గా మరి ఒకటి 15వ శతాబ్దం నాటిది గా గుర్తించారు. వీటిని కనిపెట్టి ఆర్కియాలజీ విభాగానికి తెలియజేసి నందుకు గాను ఆ శాసనాలను వడ్డే మాధవ పేరున ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో – శాసనాల అధ్యయన శాఖలో రికార్డ్ చేశారు. ఈ రెండు శాసనాలలో 15వ శతాబ్దానికి చెందిన మెద చెక్కబడి ఉన్న తేదీ మరియు సంవత్సరాన్ని బట్టి అది విజయనగర రాజ్యం లో రెండవ దేవరాయ పాలన కాలం నాటిదని గుర్తించారు. అయితే శాసనం మెద ఉన్న విషయంపై పరిశోధన ద్వారా రెండవ దేవ రాయలు ఉదయగిరి రాజ్య పర్యటనకు వచ్చినప్పుడు ఆయన పూజలు ఉత్సవాల నిర్వహించడం మరియు శిబిరాలకు నైవేద్యాలు అందించడం కోసం రాజశ్రీ పర్వత మల్లికార్జున దేవునికి సర్వమాన్యంగా పుటలు వడి ( బహుశా ప్రస్తుత పాలుట్ల) గ్రామాన్ని బహుమతిగాను మరియు 800 వరాహాలు (బంగారు నాణేలు)ఇస్తున్నట్లు శాసనం లో నమోదు చేయబడింది. దీని ఆధారంగా రెండవ దేవరాయల పరిపాలనలో ఆయన పాలుట్ల గ్రామానికి వచ్చినట్లు తెలుస్తుంది.ఈ అధ్యయనానికి మరియు ఆ శాసనాల మెద పై ఉన్న ఆ కాలం నాటి అక్షరాలను అనువదించడానికి సహకరించిన ఏపీగ్రాఫిస్ట్ డా.ఎం.యేసుబాబుకి మరియు రీసెర్చ్ సూపర్వైజర్ అయినటువంటి ప్రొఫెసర్.యస్ .మురళి మోహన్ గారికి పరిశోధన విద్యార్థి వడ్డే మాధవ్ ధన్యవాదాలు తెలిపారు

👉 విజయవాడ లో ఆదివారం జరిగిన జాతీయ స్థాయి కుంగ్ ఫూ, కరాటే పోటీల్లో నిర్మలా కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, పొదిలి విద్యార్థులు చిట్టెమ్మ లక్కీ షాలోమ్ (8 వ తరగతి ) రాకేష్ 9 వ తరగతి విద్యార్థి స్పార్కులింగులో గోల్డ్ మెడల్ సాధించారు. విద్యార్థులను మరియు కరాటే మాస్టర్ జానీ బాషా ను పాఠశాల కరెస్పాండంట్ సిస్టర్ రూబీ, హెడ్మిస్ట్రెస్ సిస్టర్ రాణి మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అభినందించారు.

👉పొదిలి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయమును సోమవారం రాత్రి భారీ వర్షం లోనూ ఆకస్మికంగా తనిఖీ చేసిన పొదిలి జూనియర్ సివిల్ జడ్జి వి. ప్రత్యూష కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంవి రమణ కిషోర్ న్యాయవాది ఎస్ఎం భాషా పాల్గొన్నారు*_
👉 జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రకాశం జిల్లా ఎస్పి ఎ. ఆర్. దామోదర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి .
👉“ప్రతి చుక్క – ఎక్కువ పంట” పధకం అమలుపై మాగుంట ప్రశ్న…దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో “ప్రతి చుక్క ఎక్కువ పంట” పధకం అమలు, లక్ష్యాలు, విజయాలు, కరువు ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి మరియు పధక లాభాలపై అవగాహన గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖ సహాయక మంత్రి, రాంనాద్ ఠాకూర్  సమాధానమిస్తూ –వ్యవసాయంలో నీటి వినియోగ సామర్ధం పెంపు లక్ష్యంతో, పంట ఉత్పాదకత అదాయాన్ని పెంచుటకు సూక్ష్మ నీటిపారుదల సాంకేతికతను (Micro Irrigation Technology) ప్రోత్సహించుటకు మరియు రైతులకు అవగాహన కల్పించుటకు ప్రభుత్వం “ప్రతి చుక్క – ఎక్కువ పంట” పధకాన్ని 2015-16 నుండి రాష్ట్ర కృషి వికాస్ యోజన క్రింద అమలు చేయుచున్నదని తెలిపారు.ఈ పధకంలో సూక్ష్మ నీటిపారుదల సాంకేతికతతో, గత 5 సంవత్సరాలలో దేశం మొత్తంలో 48,02,579 మంది రైతుల 53,68,297 హెక్టార్ల భూమి వినియోగంలోకి రాగా, ఆంధ్రప్రదేశ్ లో 2,73,888 మంది రైతుల 3,09,111 హెక్టార్ల భూమి వినియోగంలోకి వచ్చిందని తెలిపారు. కాగా ప్రకాశం జిల్లాలో 31,384 హెక్టార్ల భూమి వినియోగంలోకి వచ్చిందని తెలిపారు.నితి ఆయోగ్ సంస్థ ఆధ్యాయనం ప్రకారం పొలంలో నీటి వినియోగ సామర్ధ్యం, పంట ఉత్పాదకత, ఉపాది అవకాశాల సృష్టి మరియు రైతుల ఆదాయం పెంపు వంటి జాతీయ ప్రాధాన్యతలు కలిగి వున్నాయని తెలిపారు.నీటి కొరత మరియు భూగర్భ జలాలు లేని మైదాన ప్రాతాలలో సూక్ష్మ నీటిపారుదల సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యతను ఈ పధకం ఇస్తుందని మరియు కృషి విజ్ఞాన్ కేంద్రాలు రైతులకు పలు పంటలపై శిక్షణతో పాటు క్షేత్ర ప్రదర్శనలు నిర్వహించి సమర్దవంత నీటిపారుదల పద్దతులు మరియు సాంకేతికతను తెలియజేస్తాయని కేంద్ర మంత్రి తెలియజేశారు.

👉డ్రగ్‌ పెడ్లర్‌ మస్తాన్‌ సాయికి 14 రోజుల రిమాండ్- వెలుగులోకి విస్తుపోయే నిజాలు*
విజయవాడలో కలకలం రేపిన ఎండీఎంఏ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడ్ని సెబ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. రెండు నెలలు పరారీలో ఉన్న సాయిని గుంటూరులో అరెస్ట్ చేసి నగరానికి తరలించారు. సాయి హిమాచల్ ప్రదేశ్​లో చదువుకునేటప్పుడు డ్రగ్స్​కు అలవాటయ్యాడు. దిల్లీలో తక్కువ ధరకు దొరుకుతుందని ఓ వ్యక్తి చెప్పాడు. దీంతో గోపీచంద్ అనే వ్యక్తిని దిల్లీ పంపారు.*గుంటూరు నగరానికి చెందిన యనమల గోపీచంద్‌ దిల్లీ వెళ్లి 35 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి ఈ ఏడాది జూన్ 3న విజయవాడలో రైలు దిగి బయటకు వస్తుండగా ముందస్తు సమాచారం ఆధారంగా సెబ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇతని కోసం రైల్వే స్టేషన్‌ బయట కారులో ఎదురుచూస్తున్న గుంటూరు నగరానికి చెందిన ఎడ్ల కాంతికిరణ్, షేక్‌ ఖాజా మొహిద్దీన్, షేక్‌ నాగూర్‌ షరీఫ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ ముగ్గురిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టడంతో రిమాండ్‌ విధించారు. ప్రస్తుతం వీరు నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారు. నిందితుల్లో ఖాజా మొహిద్దీన్, నాగూర్‌ షరీఫ్‌ గుంటూరులోని ప్రముఖ బిర్యానీ హోటల్‌ నిర్వాహకులు. నిందితులను సెబ్‌ పోలీసులు విచారించగా వీరి స్నేహితుడైన రావి సాయి మస్తాన్‌రావు ఇచ్చిన చిరునామా ఆధారంగా గోపీచంద్‌ దిల్లీ వెళ్లి తెచ్చినట్లు చెప్పాడు. దీంతో విజయవాడ వెస్ట్‌ సెబ్‌ పోలీసులు ఏ5గా సాయి పేరును చేర్చారు.*14 రోజుల రిమాండ్‌ :
సాయి మస్తాన్‌రావు కోసం సెబ్‌ పోలీసులు గాలిస్తుండటంతో వారికి చిక్కకుండా హైదరాబాద్, గుంటూరుల్లో మకాం మార్చాడు. ఎట్టకేలకు గుంటురు జీటీ రోడ్డులోని మస్తాన్‌ దర్గా వద్ద ఉన్నాడని తెలుసుకుని విజయవాడ వెస్ట్‌ సెబ్‌ ఇన్స్‌పెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి తన బృందంతో వెళ్లి అరెస్టు చేశారు. విజయవాడలోని ఆరో ఎంఎం కోర్టులో న్యాయాధికారి ఎదుట హాజరుపర్చారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు. సాయి బీటెక్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సాయి తండ్రి రామ్మోహన్‌రావు మస్తాన్‌ దర్గా ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఏటా జరిగే ఉరుసు వేడుకలకు రాజకీయ పార్టీల నాయకులతో పాటు పోలీసు అధికారులను సాయి తండ్రి ఆహ్వానించేవారు.
సాయి ఇంజినీరింగ్‌ చదివే సమయంలోనే డ్రగ్స్‌కు అలవాటుపడినట్లు సమాచారం. అప్పటి నుంచే డ్రగ్స్‌ సరఫరాదారులతో సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరు-హైదరాబాద్‌ మధ్య తిరుగుతూ సినీ పరిశ్రమకు చెందిన వారితో పరిచయాల పెంచుకున్నాడు. నిందితుడిని సెబ్‌ ఉన్నతాధికారులు సుదీర్ఘంగా విచారించారు. డ్రగ్స్‌ సరఫరాదారులతో ఉన్న సంబంధాలు? తిరిగి ఎవరెవరికి అందించేవాడు? అన్న విషయాలను రాబట్టినట్లు సమాచారం. వివరాలను సెబ్‌ పోలీసులు వెల్లడించడం లేదు.        *గోవాలోని నైజీరియన్లతో లింకులు :
లావణ్యను హోటల్‌ గదిలో పెట్టి వేధించటంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం స్టేషన్‌లో గతంలో కేసు నమోదైంది. యువతులను ఈవ్‌టీజింగ్‌ చేసిన సంఘటనపై గుంటూరు పట్టాభిపురం స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. గత ఏడాది సెప్టెంబరు 13న రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ, మోకిల పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో డ్రగ్స్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఇందులో వరలక్ష్మి టిఫిన్‌ సెంటర్‌ యజమాని ప్రభాకర్‌రెడ్డి, అనూరాధ, మరో వ్యక్తిని అరెస్టు చేశారు.ఈ కేసులోనే ఏ4గా సాయి మస్తాన్‌రావు ఉన్నాడు. అప్పట్లో కేవలం డ్రగ్స్‌ వినియోగదారుడు అని నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే అనురాధకు గోవాలోని నైజీరియన్లతో లింకులు ఉన్నాయని, వారి సాయంతోనే హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తెస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె అరెస్టు కావడంతో సాయి మస్తాన్‌.. ఆమె పరిచయస్థుల ద్వారా డ్రగ్స్‌ తెప్పించుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. తర్వాత.. వాటిని వినియోగించడంతో పాటు ఇతరులకూ అమ్ముతున్నట్లు పోలీసులు చెబుతున్నారు..

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం