👉 హైదరాబాద్ లో ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్..కాగ్నిజెంట్ తమ కొత్త క్యాంపస్ ను నేడు శంకుస్థాపన..కాగ్నిజెంట్ కంపెనీ శంకుస్థాపనలో సీఎం రేవంత్‌రెడ్డి.. హైదరాబాద్ లో ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ తమ కొత్త క్యాంపస్ ను నేడు శంకుస్థాపన చేయనుంది.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈవో రవికుమార్ తో చర్చలు జరిపారు. న్యూజెర్సీలో ఈనెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ కంపెనీ పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఒప్పందంలో భాగంగా తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ముందుగానే వెల్లడించింది. హైదరాబాద్ లో 10 లక్షల చదనపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని, అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ ఫోకస్ చేస్తుంది…
👉 కోటి రూపాయల విరాళం అందించిన నారా భువనేశ్వరి..అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ లో ఆకలి అనే పదం వినపడకూడదు అనే మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను మళ్లీ పునఃప్రారంభించడం సంతోషంగా ఉందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజునే అన్న క్యాంటీన్లు మొదలుకావడం శుభపరిణామమని. పేదల ఆకలి తీర్చే ఈ మహత్తర కార్యక్రమం కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరుపున కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విరాళంగా అందిస్తున్నానని అన్నారు. నిరుపేదల ఆకలి తీర్చే ఈ మహాయజ్ఞంలో మీ వంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.
** గురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్ రెడ్డి* 🔸 ప్రభుత్వ ఖర్చుతో నిమ్స్ లో వైద్యం* కోలుకుంటోన్న ములుగు విద్యార్థిని కార్తీక..*హైదరాబాద్: గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని ఆయన సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు. సీఎం సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్ లో కార్తీకకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ విద్యార్థిని కోలుకుంటోంది. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక ఈ నెల 9న ప్రమాదవశాత్తు స్కూల్ మూడో అంతస్తు నుంచి కిందపడిపోయింది. దీంతో నడుము భాగంలో తీవ్రగాయాలయ్యాయి. గురుకుల అధికారులు విద్యార్థినిని తొలుత వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి కి, అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు.నిమ్స్ న్యూరో సర్జన్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ తిరుమల్ బృందం మంగళవారం నాడు కార్తీకకు ఆపరేషన్ నిర్వహించింది. ప్రస్తుతం ఐసీయులో విద్యార్థిని కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. కార్తీక కు కావాల్సిన వైద్యం ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరించనున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప గారితో మాట్లాడి కార్తీక కోలుకునేంత వరకు వైద్యం అందించాలని సూచించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా కార్తీక ఆరోగ్య పరిస్థితిపైన ఎప్పటికప్పుడు నిమ్స్ డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు…
👉 నేడు ఒంగోలు, భాగ్యనగర్ 3వ లైన్ లో కోల్ సొసైటీ అధ్యక్షులు తాటిపర్తి సుబ్బారెడ్డి అనారోగ్యం కారణంగా మృతి చెందినారు వారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి . 👉స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా PACE ఇంజనీరింగ్ కాలేజీ వారి ఆధ్వర్యం లో హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ లో భాగంగా ఒంగోలు లో ఏర్పాటు చేసిన 700 అడుగుల జాతీయ జెండా ర్యాలీ లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు పేస్ కాలేజీ చైర్మన్ మద్దిశెట్టి శ్రీధర్ మరియు విద్యార్థిని విద్యార్థులు కాలేజీ యాజమాన్యం .
👉ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లో భాగంగా బుధవారం కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక కందులాపురం సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఉచితంగా జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ మండలి ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఏ సైమన్ విక్టర్, ఎంపీడీవో మస్తాన్వలి విజయలక్ష్మి కార్యదర్శులు డి బ్రహ్మయ్య సుధాకర్,అధ్యాపకులు ఎం.వి మురళీకృష్ణ, శిరీష కుమారి లతోపాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
👉నూర్ భాష/ దూదేకుల సంఘం సమస్యలపై తహసిల్దార్ కు వినతి..కంభం నూర్ భాష/ దూదేకుల బీసీ ముస్లిం సంక్షేమ సంఘం వారు దూదేకుల విద్యార్థిని విద్యార్థులు కుల దృవీకరణ పత్రం మంజూరు చేయడంలో వస్తున్న సమస్యలు, అభ్యంతరాలపై ఆ సంఘ నాయకులు కంభం తహసిల్దార్ ఎ కిరణ్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది కార్యక్రమంలో కంభం మండల దూదేకుల సంఘం అధ్యక్షుడు డి.ఖాదర్ వలీ ,డి.జిలాని , ఖాదర్ హుస్సేన్ , న్యామతుల్లా, శైక్షవలి,ఫయాజ్ పాల్గొన్నారు .
👉ఆజాద్ కా అమృత్ మహొత్సవ్ లో భాగంగా హర్ ఘర్ తిరంగా…*స్టెప్,జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్దులతో భారి ర్యాలీ….*ర్యాలీలో 400 మంది పైగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు… *విశ్వనాధపురం సెంటర్ లో మానవహరం…ఆజాద్ కా అమృత్ మహొత్సవంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి పిలుపు మేరకు స్టెప్ మరియు జిల్లా యువజన సంక్షేమ శాఖ హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ అసిస్టెంట్ కమిషనర్ షేక్ రజిఖ్ ఆధ్వర్యంలో ప్రకాశంజిల్లా పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్దులతో భారి ర్యాలీ,మానవహరం నిర్వహించారు._ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతు హర్ ఘర్ తిరంగా ను ప్రతి ఒక్కరు పండుగ వాతవారణం లో చేసుకొవాలని,స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకోని వారి త్యాగులను గుర్తు చేసుకొవాలని వారు కొరారు._ ఈ సందర్బంగా స్దానిక విశ్వనాదపురం సెంటర్లో మానవహరం ఏర్పాటు చేసి అనంతరం విద్యార్దులతో ప్రతిజ్ఞ చేయించారు._ కార్యక్రమంలో హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ అసిస్టెంట్ కమిషనర్ షేక్ రజిఖ్, ఎం.వి.ఎస్ లొకేశ్వరరావు,కళాశాల ప్రిన్సిపాల్ తారావాణి,ఎ.మాధవచారి తదితరులు పాల్గొన్నారు._
👉ఎస్సీ ఎస్టీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది .. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోస మనోహర్
ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోస మనోహర్ మాట్లాడుతూ దళితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పటివరకు సబ్సిడీ లోన్లు ఇంకా వదలలేదు, త్వరగా సబ్సిడీ లోన్లు వదలాలని డిమాండ్ చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి భారతదేశంలో ఉండే ఎస్సీ ఎస్టీ ప్రజలకు పేదరికం రూపుమాపాలని , ఎస్సీ ఎస్టీలను ఏ ప్రభుత్వాలు వచ్చినా ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారనీ, స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్న నేటికీ కూడా ఎస్సీ ఎస్టీ ప్రజలు అట్టడుగు వర్గాలు గానే మిగిలిపోయారనీ అవేదన వ్యక్తం చేశారు., నూటికి 98% పేదరికంలో ఉన్నారనీ, ఎస్సీ ఎస్టీ ప్రజల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి పేదరికం రూపుమాపాలని , ఎస్సీ ఎస్టీల మహిళల పైన దాడులు అత్యాచారాలు చేయకుండా ప్రత్యేకమైన స్పెషల్ టీం లను ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు, గత టిడిపి ప్రభుత్వంలో 29 పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ త్వరగా అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు .👉జాతీయ మాల మహానాడు నూతన కమిటీల ఎన్నిక.మాల మహానాడు జిల్లా అధ్యక్షులుగా ఎన్ వి కృష్ణ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నిర్మల తో పాటు మిగతా కొన్ని మండలాల అధ్యక్షులను ఈ సందర్భంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన నాయకులు అందరికి ధన్యవాదాలు తెలిపారు.
👉ఉర్దూ స్కూల్ ఆధ్వర్యంలో హర్ ఘర్ ఖా తిరంగ్*
తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల ఉర్దూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ హర్షద్ వలి, ఉపాధ్యాయులు మురారి శ్రీనివాసులు, సయ్యద్ రహ్మత్ విద్యార్థుల తో హర్ ఘర్ ఖా తిరంగ్ కార్యక్రమం నిర్వహించి తర్లుపాడు గ్రామ విధుల్లో దేశభక్తి నినాదలాతో దేశభక్తిని చాటుతూ ర్యాలీ చేశారు
👉ప్రకాశం జిల్లా కలెక్టర్ చొరవతో రోడ్డు సమస్యకు సంబంధించి బేస్తవారిపేట సందర్శించిన మార్కాపురం సబ్-కలెక్టర్ రాహుల్ మీనా..*ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గంలోని,బేస్తవారిపేట పట్టణంలో మార్కాపురం సబ్-కలెక్టర్ రాహుల్ మీనా (NH-544D) రోడ్డు గురించి ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది.. ఇటీవల తరచుగా జరుగుతున్న ప్రమాదాల విషయమై ప్రజలతో ప్రస్తావించడం జరిగినది.. దీనికి సంబంధించి రోడ్డుకు మధ్యభాగం నుండి ఇరువైపులా 50 అడుగుల అవసరమని భూసేకరణ చేస్తామని,దీనికి సంబంధించి బాధితులకు ప్రభుత్వం వారు నష్టపరిహారం చెల్లిస్తారని చెప్పడం జరిగింది..*ఏమైనా సమస్యలు ఉంటే అధికారులతో మాట్లాడవలసినదిగా మార్కాపురం సబ్-కలెక్టర్ తెలిపారు.. అతి త్వరలో పనులు ప్రారంభించాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించడం జరిగినది.. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు మరియు నేషనల్ హైవే అథారిటీ అధికారులు పాల్గొన్నారు..*ఈ విషయానికి సంబంధించి జిల్లా కలెక్టర్ చొరవపట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
👉మానవత్వాన్ని చాటుకున్న ఆటో డ్రైవర్..*ల్యాప్ ట్యాప్, వెండి వస్తువులు పోగొట్టుకున్న మహిళకు తిరిగి అందజేత*.ఆటో డ్రైవర్ చేత మహిళకు అందజేయించిన పట్టణ సీఐ వినోద్ కుమార్* మంగళగిరి -ఓ ఆటో డ్రైవర్ మానవత్వాన్ని చాటుకున్నారు. బుధవారం గుంటూరు నుంచి మంగళగిరి కి ఓ మహిళ ఆటోలో వచ్చింది.ల్యాబ్ టాప్, పలు వెండి వస్తువులు ఉన్న బ్యాగ్ ను ఆటోలో మర్చిపోయింది. ఆ బ్యాగ్ ను సురేష్ అనే ఆటో డ్రైవర్ పట్టణ పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. కొద్దిసేపటి తర్వాత సదరు మహిళ సైతం పోలీస్ స్టేషన్ కు చేరుకొని తన బ్యాగ్ పోయిందని. పట్టణ సీఐ వినోద్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేసింది. ఆటో డ్రైవర్ సురేష్ ను పిలిపించిన సీఐ వినోద్ కుమార్ ఆటో డ్రైవర్ చేతుల మీదుగా ల్యాబ్ ట్యాప్,వెండి వస్తువులను అందజేయించారు. మానవత్వాన్ని చాటుకున్న ఆటో డ్రైవర్ సురేష్ కు స్పందించి తక్షణమే ల్యాబ్ ట్యాప్ వెండి వస్తువులను అందజేయించిన సిఐ వినోద్ కుమార్ కు మహిళ కృతజ్ఞతలు తెలిపింది.
👉ఆంధ్ర ప్రగతి బ్యాంకు ఆధ్వర్యంలో విద్యార్థినిలకు బహుమతులు అర్ధవీడు :78వ స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో అర్థవీడు కస్తూరిభా పాఠశాల్లో యస్ ఏ రైటింగ్ ఎల్ కుషన్ పరీక్ష నిర్వహించారు. ప్రతిభ కనపర్చిన విద్యార్థిని లకు ఆంధ్రప్రగతి బ్యాంకు మేనేజర్ భద్రీనాద్,కస్తూరిభ ప్రిన్సిపాల్ మాలతీ ఆధ్వర్యంలో ఎనిమిది మంది విద్యార్థినిలకు బహుమతులు అందచేశారు. అంతే కాకుండా తమ బ్యాంకు ఆధ్వర్యంలో బీటెక్, ఎంసెట్ విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం ఉన్నట్లు మేనేజర్ తెలిపారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ మణికంఠ ఫీల్డ్ ఆఫీసర్ ఆసిస్ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
👉బైక్ వెనుక తాళ్లు కట్టి.. భార్యను ఊరంతా ఈడ్డుకెళ్లిన అమానుషం ఎక్కడంటే? షాకింగ్ ఉదంతం ఒకటి రాజస్థాన్ లో చోటు చేసుకుంది. భార్య విషయంలో ఒక భర్త అత్యంత అమానుషంగా వ్యవహరించిన వైనం వెలుగు చూసింది.
షాకింగ్ ఉదంతం ఒకటి రాజస్థాన్ లో చోటు చేసుకుంది. భార్య విషయంలో ఒక భర్త అత్యంత అమానుషంగా వ్యవహరించిన వైనం వెలుగు చూసింది. తన సోదరి ఇంటికి వెళతానని చెప్పిన దానికి తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు భర్త.. ఆమెను బైక్ వెనుక తాళ్లతో కట్టేసి.. ఊరంతా ఈడ్చుకెళ్లిన అనాగరిక ఘటన సంచలనమైంది. రాజస్థాన్ లోని నాగౌర్ కు చెందిన 32 ఏళ్ల ప్రేమ్ రామ్ మేఘ్ వాల్ కు బాధిత మహిళతో వివాహమైంది. తాజాగా ఆమె జైసల్మేర్ లో ఉన్న సోదరి ఇంటికి వెళ్లాలనుకుంది. దీనిపై భార్యభర్తలు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర వాగ్వాదం జరిగిన వేళ.. మద్యం తాగి ఉన్న ప్రేమ్ కుమార్ తన భార్యను తాళ్లతో కట్టేసి.. ఆ తాడును బైక్ కు కట్టేశాడు. అనంతరం ఊరంతా ఈడ్చుకెళ్లి రాక్షస ఆనందాన్ని పొందాడు. ఈ దారుణ ఉదంతాన్ని పలువురు వీడియో తీశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో.. ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Also Read – అక్కడ అమ్మాయిల విషయంలో మరో దారుణం! భార్య కాళ్లకు తాళ్లు కట్టేసి.. మట్టి రోడ్ మీద ఊరంతా ఈడ్చుకెళ్లిన ఉదంతంపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధిత మహిళ భర్త మీద ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదట. ప్రస్తుతం ఆమె జైసల్మార్ లోని తన సోదరి ఇంట్లో ఉంటోంది. వైరల్ అయిన వీడియో ఆధారంగా నిందితుడ్ని అరెస్టు చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. అయితే.. ఇంత దారుణ హింసకు గురైనప్పటికీ భర్త మీద సదరు బాధిత భార్య ఫిర్యాదు చేయకపోవటం కొసమెరుపుగా చెబుతున్నారు