అదానీకి మోడీ సర్కార్‌ అండ.. బంగ్లాదేశ్‌తో కాంట్రాక్ట్‌ విద్యుత్‌ను భారత్‌లో విక్రయించేందుకు అనుమతి.. నిర్మాణంలో ఉండగానే మూడోసారి కూలిన బ్రిడ్జి..భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య..ఐపీఎస్ లకు పనిష్మెంట్ ఐఏఎస్ లను వదిలేసారా..సహచారులే కీచకులా?..వైద్యురాలిపై ఘాతుకంలో డాక్టర్ల ప్రమేయం?.. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన వైద్య సేవలు..నిరసనలు..”పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఒంగోలు ఎంపీ మాగుంట, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల ఎమ్మెల్యే ముత్తుముల..

👉అదానీకి మోడీ సర్కార్‌ అండ…!!!* బంగ్లాదేశ్‌తో కాంట్రాక్ట్‌ విద్యుత్‌ను– భారత్‌లో విక్రయించేందుకు అనుమతి– ఎగుమతులపై మార్గదర్శకాలను సవరించిన కేంద్రం..న్యూఢిల్లీ: బడా వ్యాపారవేత్త అదానీకి మోడీ సర్కారు మరొకసారి అండగా నిలుస్తున్నది. ఇందుకు బంగ్లాదేశ్‌లోని రాజకీయ అస్థిర పరిస్థితులను సైతం అదానీకి అనుకూలంగా మార్చుతున్నది. బంగ్లాదేశ్‌తో ఒప్పందం చేసుకున్న విద్యుత్‌ను భారత్‌లో విక్రయించటానికి అదానీ పవర్‌కు మోడీ సర్కారు అనుమతించింది. ఈ మేరకు కేంద్రం విద్యుత్‌ ఎగుమతులపై మార్గదర్శకాలను సవరించింది. ఈ విషయాన్ని ఒక వార్త సంస్థ నివేదించింది. అయితే, బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం కారణంగా ఏర్పడే అంతరాయాల నుంచి అదానీ పవర్‌ను రక్షించటంలో ఈ చర్య సహాయపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.2018లో మోడీ ప్రభుత్వం పొరుగు దేశానికి ప్రత్యేకంగా విద్యుత్‌ సరఫరా చేసే జనరేటర్లపై మార్గదర్శకాలను రూపొందించింది.
జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో అదానీ పవర్‌ 1,600-మెగావాట్ల పవర్‌ ప్లాంట్‌ ప్రస్తుతం అది ఉత్పత్తి చేసే మొత్తం విద్యుత్‌ను మరొక దేశానికి సరఫరా చేయడానికి ఒప్పంద బాధ్యతను కలిగి ఉన్నది. ఈ సందర్భంలో అది బంగ్లాదేశ్‌కు చేయాల్సి ఉన్నది. అయితే, ఈనెల 12న కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఆమోదించిన మెమో.. మార్గదర్శకాలను సవరించింది. పూర్తి లేదా పాక్షిక సామర్థ్య స్థిరమైన షెడ్యూల్‌ లేని సందర్భంలో భారత్‌లో విద్యుత్‌ అమ్మకాలను సులభతరం చేయటానికి ప్రభుత్వం అటువంటి ఉత్పాదక స్టేషన్‌ను భారతీయ గ్రిడ్‌కు అనుసంధానించటానికి అనుమతించవచ్చని రాయిటర్స్‌ వివరించింది. చెల్లింపులు ఆలస్యమైతే భారతీయ గ్రిడ్‌కు విద్యుత్‌ను విక్రయించటానికి కూడా సవరణ అనుమతిస్తుంది. భారత్‌లో మొత్తం విద్యుత్‌ లభ్యతను పెంచటానికి ఈ చర్య సహాయపడుతుందని అదానీ గ్రూప్‌ తెలిపింది. మొత్తానికీ, బంగ్లాదేశ్‌కు అదానీ పవర్‌ విద్యుత్‌ ఎగుమతులు చాలా కాలంగా వివాదానికి కేంద్రంగా ఉన్నాయి. నిపుణులు దీనిని అధిక ధరలకు ఢాకా కొనుగోలు చేయవలసి ఉంటుందని వాదించారు. బంగ్లాదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీలు ఈ ఏర్పాటును విమర్శించాయి. ఇది అత్యంత అసమాన ఒప్పందమని అభివర్ణించాయి.2017లో ఢాకాలో షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంతకం చేసిన ఒప్పందం ప్రకారం అదానీ గ్రూప్‌ సంస్థ బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ను విక్రయిస్తుంది. ప్రధాని మోడీ బంగ్లాదేశ్‌లో పర్యటించిన కొద్దిసేపటికే 2015 ఆగస్టులో అదానీ గ్రూప్‌, ఢాకా మధ్య అవగాహన ఒప్పందం కుదరటం గమనార్హం. అదానీ గ్రూప్‌, బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మధ్య జరిగిన డీల్‌లో మోడీ ప్రమేయం నేరుగా ఉన్నదా అని భారత్‌లోని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి కూడా. అయితే ఈ ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ బంగ్లాదేశ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు గతేడాది కంపెనీకి లేఖ రాసింది. కోరిన సవరణలపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, అధిక ధరలు వివాదాస్పదంగా ఉన్నాయని ఒక అధికారి వ్యాఖ్యానించారు.

👉నిర్మాణంలో ఉండగా మూడోసారి కూలిన బ్రిడ్జ్… వీడియో వైరల్! ఎప్పుడో 2015లో మొదలుపెట్టిన బ్రిడ్జ్.. దీని నిర్మాణం కోసం రూ.1,717 కోట్లు కేటాయించారు.  ఎప్పుడో 2015లో మొదలుపెట్టిన బ్రిడ్జ్.. దీని నిర్మాణం కోసం రూ.1,717 కోట్లు కేటాయించారు. ఈ నిర్మాణం ఇప్పటికీ పూర్తవలేదు సరికదా ఇప్పటికి మూడుసార్లు కూలింది. కూలిన ప్రతీసారి స్థానికంగా ఉన్న వారు వీడియో తీయడం, అది కాస్తా నెట్టింట వైరల్ గా మారడం పరిపాటిగా మారింది! దీంతో ఈ ప్రాజెక్ట్ నాణ్యతపై తీవ్ర విమర్శలు తెరపైకి వస్తున్నాయి. అవును… బీహార్ లో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. అలా అని ఇలా నిర్మాణంలో ఉండగా కూలిపోవడం ఇదే తొలిసారి కాదు. ఇది మూడోసారి! ఇక ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. బీహార్ రాష్ట్రంలోని ఖగారియా డిస్ట్రిక్ట్ లో గంగానదిపై అగువాని సుల్తాన్ గంజ్ గంగా పేరుతో ఈ బ్రిడ్జ్ ని నిర్మిస్తున్నారు. ఖగారియా – అగువాని ప్రాంతాల మధ్య గంగా నదిపై ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి 2015లోనే నితీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సమయంలో బీహార్ ప్రభుత్వం దీని నిర్మాణం కోసం రూ.1,717 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో 2020 నాటికే ఈ వంతెన నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. ఈ నిర్మాణ బాధ్యతల్లు ఎస్.కే. సింగ్లా కనస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టింది. అలా 2020 నాటికే పూర్తి కావాల్సిన ఈ వంతెన నిర్మాణం ఇప్పటివరకూ పూర్తికాలేదు సరికదా.. నిర్మాణంలో ఉండగానే మూడోసారి కుప్పకూలింది. దీంతో… దీని నాణ్యతపై విపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం… ఈ వంతెనను సొంత ఖర్చుతోనే నిర్మించాలని కనస్ట్రక్షన్ కంపెనీని ఆదేశించింది. కాగా గత ఏడాది ఏప్రిల్ లో తుఫాను కారణంగా ఈ వంతెన పిల్లర్లు కొంతభాగం కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఇలా బీహార్ లో వంతెనలు కుప్పకూలిపోతుండటం సర్వసాధారణమై పోయింది.ఇందులో భగాంగా… 2022లో బీహార్ లోని బెగుసరాయ్ ప్రాంతంలో బుర్హి గండక్ నదిపై నిర్మించిన వంతెనలో కొంతభాగం కూలిపోయింది. అదే ఏడాది నవంబర్ లో సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లా నలందలోనూ నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూపిపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోగా.. మరొకరికి గాయాలయ్యాయి. అంతక మూందు సహర్సా, కిషన్ గంజ్ జిల్లాల్లోనూ రెండు వంతెనలు ప్రారంభానికి ముందే కూలిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా అగువాని సుల్తాన్ గంజ్ గంగా బ్రిడ్జ్ మూడో సారి కూలింది. ఈ వంతెన కూలుతున్న సమయంలో అక్కడ ఉన్న స్థానికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

👉భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య..?*
ముఖ్యమంత్రిని విచారించేందుకు గవర్నర్ అనుమతి..
బెంగళూరు :
కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి ప్రాదికార భూ కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. దానివల్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజకీ యంగా ఇబ్బందికర పరిస్థి తులు ఎదరవుతున్నాయి.
తాజాగా కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సంచల న నిర్ణయం తీసుకున్నారు. ముడా స్థలం కేటాయింపు కుంభకోణంలో ముఖ్య మంత్రి సిద్ధరామయ్యను విచారణ చేసేందుకు గవర్నర్ శనివారం ఉదయం ఆమోదం తెలిపారు.దీంతో ఈ కేసులో సీఎం విచారణను ఎదుర్కోను న్నారు. దీనికి సంబంధించిన సమాచారం అందినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
సామాజిక కార్యకర్త, న్యాయవాది టిజె అబ్రహం తన భార్య బీఎం పార్వతికి కేటాయించిన భూమికి సంబంధించిన కేసులో సీఎం సిద్ధరామయ్యను ప్రాసిక్యూ ట్ చేయడానికి అనుమతిం చాలని కోరుతూ కొద్దివారా ల క్రితం గవర్నర్ కు పిటీషన్ దాఖలు చేశారు.ఈ పిటీషన్ పై గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం సిద్ధరామయ్యపై విచారణకు ఆమోదం తెలిపారు. కొద్దిరోజుల ముందు తనపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ ను గవర్నర్ తిరస్కరిస్తారని సీఎం సిద్ధరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు.

👉ఐపీఎస్ లకు పనిష్మెంట్ ఓకే.. ఐఏఎస్ లను వదిలేశారా ఏంటి? *ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలయ్యిందే తప్ప భారత రాజ్యాంగం కాదు అనేలా పాలన సాగింది.
జనం జగన్ పాలనకు తమ ఓటుతో చరమగీతం పాడడానికి అది ఒక ప్రధాన కారణం.చరిత్రలో ఇంత వరకూ ఏ పార్టీకీ ఎదురు కానటువంటి ఘోర పరాజయాన్ని జగన్ కు అందించి ఇంటికి సాగనంపారు.సర్వ వ్యవస్థలనూ నిర్వీర్యం చేసి జగన్ సాగించిన అరాచక పాలనకు కొందరు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు వంత పాడారు. సరే జగన్ సర్కార్ పతనమై.. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్ హయాంలో నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా చంద్రబాబు సర్కార్ దూరంగా పెట్టింది. జీఏడీలో రిపోర్టు చేయమని ఆదేశించింది. సరే పని అప్పగించకుండా అప్పనంగా జీతం ఇచ్చేసి ఊరుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్న తరుణంలో జగన్ తో అంటకాగి పోస్టింగులు లభించక వెయిటింగ్ లో ఉన్న 16 మంది ఐపీఎస్ లకు రోజూ ఆఫీసుకు వచ్చి సంతకాలు పెట్టాలఆదేశాలు అందాయి. అంటే వారు ప్రతి రోజూ ఆఫీసుకు వచ్చి సంతకం చేయాలి. డ్యూటీ అవర్స్ ముగిసే వరకూ పని లేకుండా కార్యాలయంలో కూర్చుని సాయంత్రం వెళ్లే ముందు మరోసారి సంతకం చేయాలి.
ఏదైనా కేసులో నిందితుడికి కోర్టు బెయిలు మంజూరు చేస్తూ పెట్టే కండీషన్లు కూడా దాదాపు ఇలాగే ఉంటాయి. సాక్షులను ప్రభావితం చేయరాదు. కేసుకు సంబంధించి బయట ఎక్కడా నోరు విప్పకూడదు. నిత్యం అందుబాటులో ఉండాలి. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదు అన్నది సాధారణంగా కండీషన్డ్ బెయిలు నిబంధనలుగా ఉంటాయి. ఇప్పుడు పోస్టింగ్ లు లేని ఐపీఎస్ లకు కూడా పోలీస్ బాస్ జారీ చేసిన ఆదేశాలు ఆ కండీషన్డ్ బెయిలులాగే ఉన్నాయి. ఇదే విషయాన్ని తెలుగుదేశం సీనియర్ నాయకుడు జేసీ చెప్పారు. వారిని చూసి జాలి పడ్డారు. ఇప్పుడు జగన్ తో అంటకాగి నిబంధనలకు తిలోదకాలిచ్చేసిన 16 మంది ఐపీఎస్ లకు ఈ శిక్ష సమంజసమేనంటున్నారు ప్రజలు. ఇక శాఖాపరమైన విచారణకు కూడా ఉపక్రమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎస్ ల విషయంలో తీసుకున్న చర్యను అభినందిస్తునే .. ఐఏఎస్ ల విషయం ఏమిటంటూ సర్కార్ ను జనం నిలదీస్తున్నారు. నిబంధనలకు పాతరేసిన ఐఏఎస్ లపై చర్యలెప్పుడని ప్రశ్నిస్తున్నారు.ఎందుకంటే ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా సర్వీసు నిబంధనలలో తేడాలు ఉండవు. వెయిటింగ్‌లో ఉన్న అంటే పోస్టింగులు ఇవ్వని ఐపిఎస్‌లను రోజూ ఆఫీసుకు రావాలని పోలీసు బాసు ఆదే శించారు. మరి పోస్టింగులు ఇవ్వని, వెయిటింగ్ లో ఉన్న ఐఏఎస్ల విషయంలో సీఎస్ ఎందుకు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ సర్కారుతో అంటకాగిన 16 మంది ఐపిఎస్ అధికారులను ప్రతిరోజూ హెడ్‌క్వార్స్‌కు హాజర వాలన్న డీజీపీ నిర్ణయాన్ని.. ఐఏఎస్‌ల విషయంలో సీఎస్ ఎందుకు పాటించడం లేదంటూ తెలుగుదేశం శ్రేణులు కూడా నిలదీస్తున్నాయి. జగన్ జమానాలో ఒక వెలుగు వెలిగి, ఇప్పుడు వెయిటింగ్‌లో ఉన్న ఐఏఎస్‌ల పట్ల ప్రత్యేక అభిమానం ఏమిటన్న సందేహాలు అధికార వర్గాలలో కూడా వ్యక్తం అవుతున్నాయి.నిబంధనలను తుంగలోకి తొక్కి జగన్ కు వంత పాడిన ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్, రజత్‌భార్గవ్, గోపాలకృష్ణ ద్వివేదీ, ముత్యాలరాజు, మురళీధర్‌రెడ్డి, నారాయణ్‌భరత్ గుప్తా, మాధవీలత, అనిల్‌కుమార్‌రెడ్డి, నీలకంఠారెడ్డి, హరితకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టారు. వీరిలో ప్రవీణ్ ప్రకాష్ కు మాత్రం వీఆర్‌ఎస్ ఇచ్చారు. మిగిలిన వారంతా జీఏడీకి రిపోర్టు చేసి, దర్జాగా వేతనంతో కూడిన సెలవలను ఎంజాయ్ చేస్తుంటే సీఎస్ ఎందుకు ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఈ ఐఏఎస్ లలో కొందరు ఇప్పటికీ వైసీపీ అగ్రనేతలతో టచ్ లో ఉన్నారన్న ఆరోపణలు తెలుగుదేశం నుంచే వస్తున్నాయి. ఈవెయిటింగ్ ఐఏఎస్ లను కూడా ప్రతి రోజూ సెక్రటేరియెట్ కు వచ్చి సంతకాలు పెట్టాలన్న ఆదేశాలు వెంటనే జారీ చేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది..
👉 ఆర్టీసీ ఛైర్మన్ గా దేవినేని ఉమా.. టీటీడీ ఛైర్మన్ గా టీవీ5 బీఆర్ నాయుడు..!
ప్రారంభం కాబోతున్న నామినేటెట్ పదవుల జాతర
తెరపైకి పలువురు ప్రముఖుల పేర్లు
తొలి విడతలో 30 శాతం పదవులు భర్తీ చేసే అవకాశం
👉సహచారులే కీచకులా?..*వైద్యురాలిపై ఘాతుకంలో కొందరు డాక్టర్ల ప్రమేయం..అనుమానం వ్యక్తం చేసిన బాధితురాలి తల్లిదండ్రులు..సీబీఐ దర్యాప్తులో కొన్ని పేర్లు బయటపెట్టిన వైనం
కోల్‌కతా: ఆర్‌జీ కార్‌ ఆసుపత్రిలో యువ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలి తల్లిదండ్రులను ప్రశ్నించారు. తమ కుమార్తెపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలో అదే ఆసుపత్రిలో పని చేస్తున్న కొందరు జూనియర్‌ వైద్యులు, ఇతర సీనియర్‌ వైద్యుల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నామంటూ తల్లిదండ్రులు చెప్పినట్లు సీబీఐ అధికారులు శుక్రవారం వెల్లడించారు.
కొన్ని పేర్లను సైతం బయటపెట్టారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో బాధితురాలితోపాటు కలిసి పనిచేసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని తల్లిదండ్రులు తెలిపినట్లు స్పష్టంచేశారు. 30 మందిని పిలిపించి, విచారించాలని నిర్ణయించామని అధికారులు వివరించారు. ఆసుపత్రి వైద్యులను, పోలీసు అధికారులను ప్రశ్నించబోతున్నామని చెప్పారు. బాధితురాలు హత్యకు గురైన రోజు ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందికి సమన్లు జారీ చేశామని తెలిపారు.ఇదిలా ఉండగా, ట్రైనీ డాక్టర్‌ హత్యకు గురైన గదిలో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) ఆధ్వర్యంలో ఏర్పాటైన విచారణ కమిటీ ఆరోపించింది. హత్య సంగతి బయటపడగానే ఆ గదిని పరిరక్షించాల్సి ఉండగా, కొందరు లోపలికి వెళ్లి శుభ్రం చేశారని పేర్కొంది. కోల్‌కతాలోని డాక్టర్‌ హత్యాకాండను నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో వైద్యులు శుక్రవారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా డాక్టర్లకు ప్రభుత్వం రక్షణ కలి్పంచాలని డిమాండ్‌ చేశారు.

**విధ్వంసం కేసులో 25 మంది అరెస్టు
ఆర్‌జీ కార్‌ హాస్పిటల్‌లో విధ్వంసం కేసులో ఇప్పటిదాకా 25 మందిని అరెస్టు చేసినట్లు కోల్‌కతా పోలీసులు చెప్పారు. వారిని కోర్టుకు తరలించామని తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం న్యాయస్థానం వారిని ఈ నెల 22 దాకా పోలీసు కస్టడీకి అప్పగించిందని వెల్లడించారు.
మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌
ట్రైనీ డాక్టర్‌ హత్యకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం పశి్చమబెంగాల్‌లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లపై బైఠాయించారు. బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. కోల్‌కతాలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. నిరసన కార్యక్రమాల్లో సోషలిస్టు యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా(కమ్యూనిస్టు) సైతం పాల్గొంది.
విధ్వంసం వెనుక సీపీఎం, బీజేపీ : మమత
జూనియర్‌ డాక్టర్‌ను హత్య చేసిన రాక్షసులకు ఉరిశిక్ష విధించాలని పశి్చమ బెంగాల్‌ సీఎం మమత డిమాండ్‌ చేశారు. కేసు దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలని సీబీఐని కోరారు. ఆస్పత్రి∙విధ్వంసం వెనుక ప్రతిపక్ష సీపీఎం, బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. సాక్ష్యాధారాలను మాయం చేయడానికే ఈ విధ్వంసం జరిగిందని అన్నారు. జూనియర్‌ డాక్టర్‌ హత్యపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. డాక్టర్‌ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం కోల్‌కతాలో నిర్వహించిన భారీ ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. సీపీఎం, బీజేపీ మధ్య బంధం త్వరలో బయటపడుతుందని చెప్పారు.
నేడు నాన్‌-ఎమర్జెన్సీ వైద్య సేవల నిలిపివేత
యువ డాక్టర్‌ హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా 24 గంటలపాటు నాన్‌-ఎమర్జెన్సీ వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ప్రకటించింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల దాకా ఆసుపత్రుల్లో ఈ సేవలను అందించబోమని వెల్లడించింది.
👉కంభంలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది నిరసన*. కలకత్తాలో జూనియర్ డాక్టర్ మౌమిత ను దుండగులు అతి కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు.. ఈ దుర్ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపు ఇచ్చిన దరిమిలా శనివారం కంభం సబ్ డివిజన్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వైద్యులు సిబ్బంది ప్లే కార్డులు ప్రదర్శించి నిరసన తెలియ జేశారు.

 

*వైద్యురాలు మౌనిత హత్యకు నిరసనగా పొదిలిలో ర్యాలీ……ప్రభుత్వ వైద్య సిబ్బంది,ఆర్.ఎం.పి, పి.ఎం.పి అసొషేషియన్ తో సహ దేశ వ్యాప్తంగా పెల్లుబికిన నిరసన..పొదిలి ప్రభుత్వ వైద్యశాల నుంచి చిన్న బస్టాండ్ వరకు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన వైద్యురాలు మౌనవిత హత్యకు నిరసనగా ప్రకాశంజిల్లా పొదిలిలో మానవత స్వచ్చంద సంస్ద, మరియు ప్రభుత్వ వైద్య సిబ్బంది, ప్రాధమిక వైద్యుల ఆద్వర్యంలో భారి ర్యాలీ నిర్వహించారు.ప్రభుత్వ వైద్య శాలనుంచి బయలుదేరి పెద్ద బస్టాండ్ సెంటర్ లో మానవహరం ఏర్పాడగా అనంతరం చిన్న బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.నిందితులను కఠినంగా శిక్షించాలని,చట్టాలలో మార్పు తీసుకరావలని పలువురు కొరారు.ఈ కార్యక్రమంలో మానవతవాదులు, వైద్యులు, ఆర్.ఎం.పి,పిఎంపి అసొషేషియన్ వైద్యులు ప్రజలు  పాల్గొన్నారు.

**దర్శి DSPని కలిసిన దర్శి టిడిపి నాయకులు*
శనివారం ఉదయం దర్శి DSP లక్ష్మీనారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసి శ్యాలువతో సత్కరించి, పుష్పగుచం అందజేసిన దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, టిడిపి యువనాయకులు దారం సుబ్బారావు, కొట్టె మల్లి, సీనియర్ టిడిపి నాయకులు సంగు కొండలు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పుల్లలచెరువు చిన్నా, నియోజకవర్గ ఐ.టిడిపి అధ్యక్షులు యస్.వి.రామయ్య,, తెలుగు యువత ఉపాధ్యక్షులు కల్లూరి సుబ్బు తదితరులు ఉన్నారు.
👉మెగా మెడికల్ క్యాంపు ను ప్రారంభించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..
కొమరోలు మండలం, తాటిచర్ల గ్రామంలోని RCM చర్చి ఆవరణంలో Big Tv మరియు కిమ్స్ హాస్పిటల్, అమ్మ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపు ను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా మొదటగా పూలమొక్కను నాటిన అనంతరం రిబ్బన్ కట్ చేసి క్యాంపు ను ప్రారంభించారు. కొమరోలు పరిసర ప్రాంతాలలోని ప్రజల సౌకర్యార్థం మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయటం చాలా అభినందనీయమని Big Tv, కిమ్స్ హాస్పిటల్, అమ్మ ఫౌండేషన్ యాజమాన్యాలకు అభినందనలు తెలియచేశారు. ముఖ్య అతిధిగా హాజరైన అశోక్ రెడ్డిని పూలమాల శాలువాతో సత్కరించారు. మెగా మెడికల్ క్యాంపులో వృద్దులకు, కంటి పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి వారికీ ఉచితంగా మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో BIG TV, కిమ్స్ హాస్పిటల్, అమ్మ ఫౌండేషన్ సిబ్బంది, కొమరోలు మండల పార్టీ అధ్యక్షులు, అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోనేని వెంకటేశ్వర్లు, గిద్దలూరు జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్ యాదవ్ గిద్దలూరు మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, రాష్ట్ర బీసీ నాయకులు బైలడుగు బాలయ్య, నియోజకవర్గ రైతు అధ్యక్షులు బిజ్జం రవీంద్రా రెడ్డి, బోగెం నాయుడు, రాజ గోపాల్ , భూపాల్, మరియు జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు స్వరూపరెడ్డి, RCM చర్చి బోధకులు, పాల్గోన్నారు.
👉అన్నా క్యాంటీన్ కు విరాళం..ఎమ్మెల్యే ముత్తుములకు అందించిన కండక్టర్ శంకర్ నాయుడు..గిద్దలూరు..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపు మేరకు పేదల ఆకలి తీర్చాలని ఈ నెల 15న అన్న క్యాంటీన్ లను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. దానిలో భాగంగా గిద్దలూరు పట్టణంలో ఆగస్టు 31న ప్రారంభించబోయే అన్న క్యాంటీన్ కు రాచర్ల మండలానికి చెందిన సామాజిక కార్యకర్త శంకర్ నాయుడు శనివారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి 20వేల రూపాయలు వారి కార్యాలయంలో అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చే కార్యక్రమానికి 20వేల రూపాయలు విరాళం అందించి ఓ గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కావటం గొప్ప విషయమని శంకర్ నాయుడును అభినందించారు.ఈ కార్య క్రమంలో జనసేన నాయకులు అలిశెట్టి వెంకటేశ్వర్లు అమ్మ ఆశ్రమం నిర్వాహకురాలు తిరుపతమ్మ  పాల్గొన్నారు.

👉 కర్నూలు: నగర సమీపంలోని పడిదంపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఉల్లి పంటకు సాగు చేసి సరైన గిట్టుబాటు ధరలు రాకపోవడంతో అప్పుల పాలై ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. పడిదంపాడు గ్రామానికి చెందిన యువరైతు బోయరాజు (32) గత మూడేళ్లుగా ఉల్లిపంట సాగు చేశాడు. అయితే పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో చేసిన అప్పులు పెరగడంతో… గురువారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు విషయాని పోలీసులకు చేరవేశారు. కుటుంబానికి ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

👉స్వర్ణ భారత్ ట్రస్ట్ 23 వసంతాల సందర్బంగా నెల్లూరు లోని వెంకటాచలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొన్న భారత దేశ గౌరవ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, స్వర్ణ భారత్ ట్రస్ట్ స్ఫూర్తి ప్రధాత ముప్పవరపు వెంకయ్య నాయుడు, దేవాధాయ శాఖ మంత్రివర్యులు అనం రాంనారాయణ రెడ్డి, పురపాలక శాఖ మంత్రివర్యులు నారాయణ , ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , శాసనసభ సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు.

👉 ఒంగోలు నగరంలోని రిమ్స్ హాస్పిటల్ నందు జూడాల చేస్తున్న సమ్మె దీక్షా శిబిరానికి చేరుకొని వైద్యుల సమ్మెకు మద్దతు తెలిపిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు.ఈ సందర్బంగా జనార్దన్ మాట్లాడుతూ కోల్‍కతాలో వైద్యవిద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటన జరగటం చాలా బాధాకరం.ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసిందని, ఇది మానవాళిపై ఒక తీవ్రమైన దాడి, ఇలాంటి ఘటన మాయని మచ్చలా నిలిచిపోతుందని.రోజులు గడిచిపోతున్నా కేసులో పురోగతి కనిపించడం లేదని, ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి అని కోరారు.

👉కళ్ళ ముందే తండ్రిని కొడుతుండగా చూసి తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కూతురు…!!
సూర్యాపేట -నాగారం మండలం డీకొత్తపల్లి గ్రామానికి చెందిన కాసం సోమయ్యకు అదే గ్రామానికి చెందిన కడారి సైదులు, కడారి సోమయ్య, కాసం కళింగంతో భూ తగాదాలున్నాయి…!!
గురువారం బోనాల పండుగ రోజు రాత్రి 10 గంటలకు సోమయ్య ఇంటికొచ్చి సైదులు, సోమయ్య, కళింగం కర్రలు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు.. ఈ దాడిలో సోమయ్య కాలు విరిగడంతో పాటు తల పగలగా అడ్డుకోబోయిన భార్య తలకూ గాయాలయ్యాయి…!!దాడి జరుగుతుంటే చూస్తున్న కూతురు పావని(14) ‘నాన్నా.. మా నాన్నను వదలండి’ అంటూ ఎంత అడిగినా అలానే కొట్టడంతో సృహతప్పి కుప్పకూలింది…!!కుటుంబసభ్యులు వెళ్లిచూడగా అప్పటికే చనిపోయింది…!!కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…!!
👉బాధిత కుటుంబానికి అండగా నిలిచిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..

*విద్యుత్ షాక్ తో మృతి చెందిన బాధిత కుటుంబానికి రూ.5లక్షల రూపాయల చెక్కు అందచేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి* గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్  పలువురు బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. బెస్తవారిపేట గ్రామానికి చెందిన కాలువ మణికంఠ గత సంవత్సరం సెప్టెంబర్ 22 వ తేదీన ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మరణించారు. ఈ విషయం పై గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ. 5.00000 – 00 లు (అక్షరాల ఐదు లక్షల రూపాయలు) ఆర్ధిక సహాయం మంజూరు చేశారు. సంబంధిత చెక్కును బాధితుడి సతీమణి వసుందరకు ఎమ్మెల్యే అందచేశారు.. అదే విధంగా అర్ధవీడు గ్రామంలో విద్యుత్ షాక్ కు గురై యండాల రంగస్వామి కి చెందిన 2గేదెలు మృతి చెందగా వారికీ రూ. 65 వేలు (అక్షరాల అరవై ఐదు వేల రూపాయలు) చెక్కును, కాకర్ల గ్రామానికి చెందిన మహబూబ్ పీరాకు చెందిన 13 గొర్రెలు విద్యుత్ షాక్ తో మృతి చెందగా వారికీ రూ. 1.30000 లు (అక్షరాల లక్ష ముప్పై వేల రూపాయలు) చెక్కును, మరియు అర్ధవీడు మండలం చింతమల్లెలపాడు గ్రామంలో విద్యుత్ షాక్ కు గురై బోగెం లింగయ్య కు చెందిన ఒక గేదె మరణించగా వారికీ రూ. 40.000 లు (అక్షరాల నలభై వేల రూపాయలు) చెక్కును వారికీ అందచేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏ కష్టం వచ్చిన అండగా నిలుస్తారని, ప్రజా శ్రేయస్సు, సంక్షేమమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని చేసిన మేలును ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు బాధిత కుటుంబాలు పాల్గోన్నారు..*

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం