👉 గాజాలో మారణహోమాన్ని, దాడులను ఖండిస్తూ చికాగోలో నిరసనల హోరు..
చికాగో : డెమొక్రటిక్ పార్టీ నాలుగు రోజుల జాతీయ సదస్సుకు నిరసనల సెగ తగిలింది. నవంబరు5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసేందుకు కమలా హారిస్‌కు అధికారికంగా టికెట్ ప్రకటించడం కోసం సోమవారం నుండి నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు వారం రోజుల ముందు నుంచే వివిధ సంస్థలు నిరసనలకు సన్నాహాలు చేశాయి. ఈ రెండు మూడు రోజుల్లో ఏడెనిమిది భారీ నిరసన ర్యాలీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. చికాగోలోని యునైటెడ్ సెంటర్‌కు వెలుపల సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు.గాజాలో మారణ హోమాన్ని సృష్టిస్తున్న ఇజ్రాయిల్‌కు డబ్బు, ఆయుధాలు అందిస్తున్న బైడెన్ ప్రభుత్వ వైఖరిని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని నినదించారు. గత నెలలో రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సుకు కూడా నిరసనల సెగ తగిలింది. గాజాపై ఇజ్రాయిల్‌కు సాయం చేయడం మానుకోవాలని, మొత్తంగా ఇజ్రాయిల్ పట్ల విధానాల్లో మార్పు రావాలని వారు నినదించారు. దాదాపు 20వేల మంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారని అంచనా. దీనికి ఒక రోజు ముందుగా అంటే ఆదివారం నాడు చికాగోలో వందలాదిమంది ఆందోళనకారులు ప్రదర్శన నిర్వహించారు. ఆర్థిక అన్యాయం, పునరుత్పత్తి హక్కులు వంటి అమెరికాలోని అన్యాయమైన చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ అందోళన క్రమంగా గాజాలో దాడులను నిరసిస్తూ, పాలస్తీనా అనుకూల నిరసనగా మారిపోయింది. ఆ వెంటనే చికాగోలోని మిచిగాన్ అవెన్యూ వరకు ప్రదర్శన చేపట్టారు. చికాగో ఏరియాలో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు వుంటారు. పాలస్తీనా పతాకాలు చేబూని ఆందోళనకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు. తొలుత 200మందితో ప్రారంభమైన ప్రదర్శన కొద్ది సేపటికే ప్రభంజనంలా మారిపోయింది. గుంపులు గుంపులుగా జనం తరలి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ప్రదర్శకులను అదుపు చేసేందుకు పోలీసు బలగాలను పెద్దయెత్తున మోహరించారు. దాదాపు 13మంది వక్తలు ర్యాలీనుద్దేశించి ప్రసంగించారు.డెమొక్రాటిక్ పార్టీ జాతీయ సదస్సు ప్రారంభం ..డెమొక్రాటిక్ పార్టీ నాలుగు రోజుల జాతీయ సదస్సు అధ్యక్షుడు బైడెన్ ప్రసంగంతో ప్రారంభమైంది. మిగతా మూడు రోజులు కమలా హారిస్ పట్టాభిషేకానికి కేటాయించారు. మాజీ ప్రాసిక్యూటర్ కమలా హారిస్‌కు ఉపాధ్యక్షురాలిగా పనిచేసే అనుభవం ఉంది. యుద్ధ విస్తరణ, కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేయడంలో రిపబ్లికన్లకు, డెమొక్రాట్లకు పెద్ద తేడా ఏమీ లేదు. కాకుంటే డెమొక్రాట్లు వాటిని పాపులిస్టిక్ పద్ధతిలో ప్రచారం చేసుకుంటారు. డెమొక్రాటిక్ పార్టీ జాతీయ సదస్సు వాస్తవాలను కప్పిపుచ్చి ప్రజలను మభ్య పుచ్చేందుకు అన్ని రకాల టక్కు టమార విద్యలను ప్రదర్శిస్తుందని సోషలిస్టు ఈక్వాలిటీ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జోసెఫ్ కిషోర్ వ్యాఖ్యానించారు.
👉100 మంది కాలేజీ యువతులపై సామూహిక అత్యాచారం.. 32 ఏళ్ల తర్వాత నిందితులకు జీవిత ఖైదు..1992 లో రాజస్థాన్‌లో వెలుగులోకి వచ్చిన ఈ సెక్స్ స్కాండల్ కేసు అప్పట్లో దేశం మొత్తాన్ని కుదిపేసింది. అజ్మీర్‌లోని కాలేజీ యువతులే లక్ష్యంగా కొందరు వ్యక్తులు చేసిన అకృత్యాలు బయటికి రావడంతో ఈ సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చింది. 100 మందికిపైగా కాలేజీ అమ్మాయిలను సామూహిక అత్యాచారం చేసి.. వారి నగ్న ఫోటోలను వైరల్ చేశారు. ఈ క్రమంలోనే వారిని బెదిరించి.. మరికొంత మంది అమ్మాయిలను తీసుకువచ్చేలా నిందితులు బ్లాక్ మెయిల్ చేశారు.ఈ క్రమంలోనే ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నఫీస్ చిస్తీ ప్రధాన నిందితుడు అని తేల్చారు.మొత్తం 18 మంది నిందితులు ఉండగా.. అందులో 9 మందికి ఇప్పటికే శిక్షలు ఖరారు కాగా.. ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. మరో వ్యక్తి పరారీలో ఉండగా.. ఇంకొక వ్యక్తిపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది. ఇక మిగిలిన ఆరుగురు వ్యక్తులకు జీవిత ఖైదు విధిస్తూ తాజాగా ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 100 మంది కాలేజీ యువతులపై సామూహిక అత్యాచారం చేసి.. వారిని బ్లాక్ మెయిల్ చేసిన.. అజ్మీర్ సెక్స్ స్కాండల్ బ్లాక్ మెయిల్ కేసులో రాజస్థాన్ అజ్మీర్‌లోని ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. మరోవైపు.. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల జరిమానా విధించింది.
👉రోజు రోజుకి పెరుగుతున్న అభం శుభం తెలియని మైనర్ల పై అత్యాచారాలు….ఇలాంటి వారి పై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని. కోరుతున్న బాధిత కుటుంబాలు….పల్నాడు జిల్లా…బెల్లంకొండ మండలం రామాంజనేయపురం తండాలో దళిత మూగ బాలిక(11)పై లైంగిక దాడి…గ్రామానికి చెందిన లోకేష్(25) అనే యువకుడు లైంగిక దాడి చేసినట్లు చెబుతున్న బాలిక తరపు బంధువులు…ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘటన…ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన…ఇంటిదగ్గర ఆడుకుంటున్న బాలికను వెనుక నుండి నోరు మూసి ఎవరూ లేని గృహంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు చెబుతున్న బాధితురాలి బంధువులు…బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలింపు…కేసు నమోదు ..
👉 మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా *పులివర్తి సుధారెడ్డి తిరుపతి: ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి నియమితులనట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె నియామకాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. చంద్రగిరిలో వైసీపీ హవాను ఎదుర్కొని పులివర్తి నాని విజయం సాధించడంలో సుధారెడ్డి పాత్ర ఎంతో ఉంది. నానీపై దాడులు జరిగిన ప్రతి సారి ఆమె రోడ్డుపైకి వచ్చి తన నిరసన గళం వినిపించారు. చెవిరెడ్డిలాంటి వ్యక్తిని ఓడించడంలో, టీడీపీ జెండా చంద్రగిరిలో ఎగరడం వెనుక సుధారెడ్డి కీలకంగా పనిచేశారు. ఈ క్రమంలోనే ఆమెకు మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
👉 ఏపీలో కొత్త పాలసీని తీసుకురాబోతున్న ప్రభుత్వం. నూతన ఇంధన విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ పేరిట కొత్త విద్యుత్ విధానాన్ని ప్రభుత్వం తీసుకురాబోతోంది. సోలార్, విండ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్, బయో ఎనర్జీకి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా పాలసీని రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పర్యావరణహితంగా, తక్కువ ఖర్చుతో విద్యుదుత్పత్తి సాధించేలా ఈ పాలసీ ఉండాలన్నారు. తక్కువ కాలంలో పెట్టుబడులు, తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ పాలసీ ఉపయోగపడాలని తెలిపారు.
👉 తనతో పెళ్లికి నిరాకరించాడని మహారాష్ట్రలో ప్రియుడి మర్మాంగంపై కత్తితో దాడి చేసిన యువతి..తనతో పెళ్లికి నిరాకరించాడని మహారాష్ట్రలో ప్రియుడి మర్మాంగంపై కత్తితో దాడి చేసిన యువతి..31 ఏళ్ల ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని అతడి మర్మాంగంపై 26 ఏళ్ల యువతి ఇంట్లో కూరగాయలు కోసే కత్తితో దాడి చేసిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. గాయపడిన బాధితుడు యువతి నుంచి తప్పించుకుని ఆసుపత్రికి వెళ్లాడని పేర్కొన్నారు. ఆగస్టు 16న జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు. అయితే ఈ కేసులో ఇప్పటికీ ఎవరిని అరెస్టు చేయలేదని పోలీసులు వివరించారు.
👉 కోల్‌కతా డాక్టర్ ఫోటోలు, వీడియోలే కాదు పేరును వాడొద్దు..: సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ వార్నింగ్*.కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆండ్ హాస్పిటల్ వైద్యురాలి హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆమె పేరుతో పాటు ఫోటోలు, వీడియోలతో వార్తలు ప్రసారంచేయడం, సోషల్ మీడియాలో పెట్టడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బాధితురాలికి సంబంధించిన వివరాలను, ఫోటోలు, వీడియోల ప్రసారాన్ని నిలిపివేయాలని మీడియా సంస్థలను… సోషల్ మీడియా పోస్టులను తొలగించాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్యురాలి హత్యాచారం ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇవాళ(మంగళవారం) చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జెబి పర్దివాల, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే బాధితురాలి వివరాలు, ఫోటోలు,వీడియోలను ప్రసారం చేయడంపై లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో వెంటనే బాధితురాలి వివరాలను,ఫోటోలు,వీడియోలను తొలగించాలని న్యాయమూర్తులు ఆదేశించారు.
👉 ఏపీలో సీబీఐ విచారణకు ప్రభుత్వ అనుమతి..సీబీఐ విచారణకు అనుమతి ఇస్తూ గెజిట్ విడుదల..కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలపై నేరుగా సీబీఐ విచారణకు ఏపీ ప్రభుత్వం అనుమతిఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ గెజిట్..2014-19 టీడీపీ హయాంలో సీబీఐకి అనుమతి నిరాకరణ
👉వెలుగొండ ప్రాజెక్ట్ పటిష్టతపై మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు. వెలుగొండ హెడ్ రెగ్యులేటర్ పనుల్లో నాణ్యత లేదన్న మంత్రి నిమ్మల. వెలుగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు కడపకు చెందిన కాంట్రాక్టర్ చేపట్టాడు. ఒక్కపైసా పెండింగ్ లేకంఉడా బిల్లులన్నీ డ్రా చేసేసుకున్నారు. వెలుగొండ పనులు చేపట్టిన అధికారలే ఈ విషయాన్ని చెబుతున్నారు. వాళ్ల మెడకు చుట్టుకుంటుందనే భయంతో అధికారులు వాస్తవాలు బయటపెడుతున్నారనీ ఆరోపించారు.
👉ఫేస్‌బుక్ పరిచయంతో పెళ్లి..కట్ చేస్తే, భర్త కువైట్‌లో..*భార్య అత్తగారింట్లో..చివరికి ఏమైంది అంటే?ఫెస్‌బుక్ పరిచయం.. పెళ్లిదాకా తీసుకెళ్ళింది.. కానీ.. భర్త, అతని కుటుంబసభ్యుల తీరుతో ఓ మహిళ జీవితం అర్ధాంతరంగా ముగిసింది..భర్త గల్ఫ్ కంట్రీలో ఉండటం.. ఆమె అత్తగారింట్లో ఉండటం.. కట్ చేస్తే పెళ్లైన ఏడాదిన్నరకే.. ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం పలు ప్రశ్నలకు తావిస్తోంది..
ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా పీలేరులో చోటుచేసుకుంది.పీలేరుకు చెందిన ఒక యువతి ఫేస్బుక్ ప్రేమాయణం, పెళ్లి విషాదంగా ముగిసింది.
అత్తారింట్లో జరుగుతున్న గొడవలు, వేధింపుల విషయంపై అర్షియ మాట్లాడేందుకు రెండ్రోజుల క్రితం పీలేరులోనీ పుట్టింటికి వచ్చింది.. ఆ తర్వాత తిరిగి సాయంత్రమే వాల్మీకిపురంలోని అత్తవారింటికి చేరుకుంది. ఇంటికి వచ్చిన గంటలోపే ఆర్షియ సెల్‌ఫోన్ ఆఫ్ అయింది.. ఈలోపే అర్షియ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం పీలేరులో ఉన్న తల్లిదండ్రులకు అందింది. ఉరి వేసుకుని మృతి చెందిందని.. వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రిలో డెడ్ బాడీ ఉందని చెప్పడంతో అర్షియ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.ఉదయం ఇంటికి వచ్చి కష్టాలు, బాధలు చెప్పుకున్న కూతురు సాయంత్రానికి శవంగా మారడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆర్షియను అత్తారింటి వారే హతమార్చారని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు అర్షియ తల్లిదండ్రులు. భర్త వసీం, అత్తామామలే అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.
ఆర్షియ మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.. ఇంటిని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. అర్షియా అత్తామామలను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఫేస్బుక్ పరిచయం పెళ్లి వరకు వెళ్లినా.. వసీం అక్రమ్.. అతని కుటుంబసభ్యుల తీరుతో అర్షియా జీవితం ఇలా ఏడాదిన్నరలోపే అర్ధాంతరంగా ముగిసి పోయిందని కుటుంబసభ్యులు రోదిస్తున్నారు.
👉అందమైన పనిమనిషి.. నమ్మారంటే మీ ఇల్లు హుష్‌ఖాకీ..😱😲😲
అందమైన పనిమనిషి.. వయసు మళ్లినవారు ఉండే ఇళ్లలోనే ఎక్కువగా పనిచేస్తుంది. కొద్దికాలంలోనే ఇంట్లో మనిషిగా కలిసిపోతుంది. మంచి అదును చూసి మత్తుమందు ఇచ్చి.. ఇళ్లంతా గుళ్ల చేసి ఎస్కేప్ అవుతుంది. కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో.. ఈమెపై 18 కేసులు ఉన్నాయి. 10 కేసుల్లో నేరం ప్రూవ్ అయ్యి.. జైలుకు వెళ్లి వచ్చింది. అయినా కూడా తీరు మారలేదు. తాజాగా ఈమె మరోసారి పోలీసులకు చిక్కింది. ఆ వివరాలను డీఎస్పీ భవ్యకిషోర్… రాజమహేంద్రవరంలో మీడియాకు వెల్లడించారు..మేడం పేరు… నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అలియాస్ బుజ్జి. ఊరు కోనసీమ జిల్లా అంగర. పెళ్లి అయింది కానీ భర్త చాన్నాళ్ల క్రితమే మరణించాడు. ప్రజంట్ రాజమండ్రి రూరల్ బొమ్మూరులో ఉంటోంది. వయసుమళ్లినవారితో పరిచయం పెంచుకుని.. డబ్బు తక్కువ ఇస్తానన్న సరే వారి ఇళ్లలో పనిమనిషిగా చేరుతుంది. కొద్ది కాలంలోనే తన పనితనంతో ఆ ఇంట్లోవారి నమ్మకాన్ని చూరగొంటుంది. తర్వాత కొన్నాళ్లకు అన్నంలో, టీ, కాపీ, ప్రసాదం వంటి వాటిల్లో హైడోస్ మత్తు మందు కలిపి ఇస్తుంది. వారు ఘాడ నిద్రలో ఉండగా… ఒంటిపై నగలతోపాటు ఇంట్లోని గోల్డ్, డబ్బుతో ఉడాయిస్తుంది. చోరీ చేసిన బంగారాన్ని బ్యాంకులు లేదా ప్రవేట్ ఫైనాన్స్ వాళ్ల వద్ద తనఖా పెట్టి డబ్బు తీసుకుంటుంది. కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం తదితర పోలీసు స్టేషన్లలో ఈమె నిందితురాలిగా ఉంది. ఈ తరహా చోరీలపై వరస ఫిర్యాదులు అందడంతో అలెర్టన పోలీసులు.. ఈ మహిళతో జాగ్రత అని ఆమె ఫోటోతో జనాల్ని అప్రమత్తం చేశారు. ఈ నెల 18న ఆమెను పట్టుకున్నారు
పలు దొంగతనం కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన ఈమె 2021 విడుదలైంది. అయినా తీరు మార్చుకోకుండా.. తిరిగి అదే తరహా చోరీలకు పాల్పడుతోంది. ఆరు కేసులకు సంబంధించిన 273.8 గ్రాముల గోల్డ్ ఆమె నుంచి సీజ్ చేసినటగ్లు డీఎస్పీ తెలిపారు. నిందితురాలిని పట్టుకోవడంలో.. చతురత చూపిన సిబ్బందిని అభినందించారు.
👉వెలుగొండ ప్రాజెక్ట్ పటిష్టతపై మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు. వెలుగొండ హెడ్ రెగ్యులేటర్ పనుల్లో నాణ్యత లేదన్న మంత్రి నిమ్మల.
వెలుగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు కడపకు చెందిన కాంట్రాక్టర్ చేపట్టాడు.ఒక్కపైసా పెండింగ్ లేకంఉడా బిల్లులన్నీ డ్రా చేసేసుకున్నారు.వెలుగొండ పనులు చేపట్టిన అధికారలే ఈ విషయాన్ని చెబుతున్నారు.వాళ్ల మెడకు చుట్టుకుంటుందనే భయంతో అధికారులు వాస్తవాలు బయటపెడుతున్నారు. -మంత్రి నిమ్మల..
👉మహారాష్ట్ర..బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారుల(4 ఏళ్లు)పై అత్యాచారయత్నం చేసిన స్వీపర్.
స్థానిక రైల్వేస్టేషన్‌ని ముట్టడించిన ఆందోళనకారులు.
👉 థానేలో ఇద్దరు నర్సరీ బాలికలపై లైంగిక వేధింపులు.
లైంగిక వేధింపులకు పాల్పడ్డ స్కూల్ స్వీపర్.
ఆగస్ట్ 12, 13 తేదీల్లో ఘటన. చిన్నారులపై లైంగిక వేధింపులను నిరసిస్తూ బద్లాపూర్ స్టేషన్‌లో రైల్‌రోకో.
రైల్‌రోకోలో పెద్దసంఖ్యలో పాల్గొన్న స్థానికులు.
బద్లాపూర్ రైల్వే స్టేషన్‌ను ముట్టడించిన నిరసనకారులు.
ఆగస్ట్ 16న బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు.
పోక్సో కేసు పెట్టడంలో ఆలస్యం చేసిన ఇన్స్‌పెక్టర్.
ఇన్స్‌పెక్టర్‌ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
👉నల్లగొండ జిల్లా:-*-మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ “సుధాకర్” ఐజీ కార్యాలయానికి అటాచ్.*-సుధాకర్ పై అవినీతి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు.*
*-శాఖాపరమైన విచారణలో నిజమేనని తేలడంతో చర్యలు.**-సిబ్బంది, అధికారులు అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ “శరత్ చంద్ర పవార్” హెచ్చరిక.*
👉మళ్ళీ మొదలైన ఉజ్వల్ భారత్ పధకం*
*ఉచితంగా గ్యాస్ సిలిండర్.. ఇలా అప్లై చేసుకోండి!*
మోదీ ప్రభుత్వం ఉజ్వల్ పథకాన్ని తిరిగి ప్రారంభించింది. ఈ పథకం రెండో ఫేజ్ కింద ఇప్పటికే 2.34కోట్లమంది గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు.
ఇందు కోసం దరఖాస్తు చేసుకునేవారు ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ వర్గాలకు చెందిన మహిళలై ఉండాలి.
18సంవత్సరాల వయసు నిండటంతో పాటు మరో ఎల్పీజీ కనెక్షన్ ఉండకూడదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబరు తీసుకొని దగ్గరలోని ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించొచ్చు.