సీఎంచంద్రబాబు ని కలిసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టిడిపి నేత ఎస్వీఎస్..రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు..సీఎం రేవంత్ రెడ్డిపై ఈడీ ఫోకాస్ పెడుతుందా!..వైద్యవిద్యార్థినిపై దారుణమైన వేధింపులు .మసీద్ స్థలాన్ని భూ కబ్జా దారుల నుండి వక్ఫ్ బోర్డు స్వాధీనం పరచుకోవాలి..ఆవాజ్ కమిటీ ..మంత్రి నారాయణ కాలేజీలో విద్యార్థులకు త్రాగునీరు కరువు..”వారి పెన్షన్ కట్.

👉హోం శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష..*హాజరైన హోం మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఉన్నతాధికారులు. *2014 -19తో పోల్చితే 2019-24 మధ్య క్రైం రేటు 46. 8 శాతం పెరిగిందని వివరించిన అధికారులు.*మహిళలపై నేరాలు 36 శాతం,*పిల్లలపై క్రైం 152 శాతం, *మిస్సింగ్ కేసెస్ 84 శాతం,*సైబర్ క్రైం నేరాలు 134 శాతం పెరిగిందని వివరణ..
👉గుంటూరు పెద్దాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు…*
*కనిపించిన సీన్ చూసి సూపరింటెండెంట్ షాక్!*
*గుంటూరు జిల్లా:*ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, ఆపై హత్యతో దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పనివేళల్లో వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు జనరల్ ఆసుపత్రిలో అర్దరాత్రి సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సూపరింటెండెంట్ ఆకస్మీక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.రోగులకు సంబంధం లేని వ్యక్తులు ఆసుపత్రి ప్రాంగణంలో అనేకమంది ఉన్నట్లు గుర్తించారు. వీరు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు కనుగొన్నారు. అసలు రోగులతో సంబంధం లేని వ్యక్తులు హాస్పిటల్‌లోకి ఎందుకు వచ్చారో ఆరా తీయాలంటూ సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. జీజీహెచ్ పక్కనే గుంటూరు రైల్వే స్టేషన్ ఉండటంతో ఆక్కడ సంచరించే బిచ్చగాళ్లు, అనాథలు కూడా రాత్రి వేళల్లో మద్యం సేవించి జీజీహెచ్ ప్రాంగణంలోకి వస్తున్నట్లు తెలిసింది. దీంతో సూపరింటెండెంట్ సెక్యూరిటీ సిబ్బందికి తక్షణమే వారందరిని బటయకు పంపాలంటూ ఆదేశాలు జారీ చేశారు.రోగులకు సంబంధించి ఒకరిద్దరూ మించి సహాయకులు ఉన్నట్లుగా సూపరింటెండెంట్ తనిఖీల్లో బయటపడింది. దీంతో వారందరికీ అవగాహన కల్పించి అక్కడ నుండి పంపించి వేశారు. రోగి సహాయకులు ఎక్కువ మంది ఉండటంతో వైద్యుల సేవలకు అంతరాయం కలుగుతున్న విషయాన్ని వారికి తెలిసేలా చెప్పాలంటూ సూపరింటెండెంట్ కిరణ్ సిబ్బందికి చెప్పారు. వైద్యులకు తగిన విధంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని దీంతో రాత్రి వేళలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేసినట్లు ఆయన తెలిపారు.క్రమంలో మందుబాబులకు జీజీహెచ్ అనుమతి లేదంటూ తేల్చి చెప్పారు. మద్యం సేవించినట్లు అనుమానం వెంటనే వెంటనే వారిని ఆసుపత్రి నుండి బయటకు పంపించేయాలంటూ సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. ఇక ముందు పగటి సమయాల్లో కూడా మద్యం సేవించి వచ్చే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ నుండి పంపించి వేయాలన్నారు.మొత్తం మీద రాత్రి సమయాల్లో విధుల్లో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు పూర్తి సహకారం అందిస్తామని ఎస్పీ సతీష్ కుమార్ కూడా తెలిపారు. దీంతో ఇక ముందు జీజీహెచ్‌లో మందుబాబులకు నో ఎంట్రీ అంటూ సిబ్బంది చెబుతున్నారు.

👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు..
సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పు Sc వర్గీకరణ కు వ్యతిరేకంగా నేడు నంద్యాల జిల్లా లో SC అడ్వకేట్స్ మరియు మాల మహానాడు నాయకులు నంద్యాల లో బంద్ కు పిలుపునిచ్చారు.
👉వారి పెన్షన్లు కట్!*ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్ పొందుతున్న వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటుండగా అందులో అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించి ఇటీవల నోటీసులు జారీ చేశారు. 60వేల మందికి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తాజాగా మంత్రి బాలవీరాంజనేయ స్వామి సైతం బోగస్ పెడితే పెన్షన్ల పంపిణీకి అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు.
👉 వైద్యవిద్యార్థినిపై దారుణమైన వేధింపులు.. హర్యానాలో మరో దారుణం..కొలకతాలో వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సమయంలో మరో దారుణం వెలుగుచూసింది. హరియాణా రాష్ట్రం రోహక్లోని మొదటి సంవత్సర వైద్య విద్యార్థిని ప్రాచీ హూడాని సీనియర్ డాక్టర్ మనీందర్ కౌశిక్ తీవ్ర వేధింపులకు గురిచేశాడు. తనను ప్రేమించాలని వేధిస్తూ కిడ్నాప్ చేసి, నరకం చూపాడు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది.
👉మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సొంత కాలేజీలో కనీసం విద్యార్థులకు తాగడానికి మంచినీరు కరువైపోయింది*విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని తాగడానికి మంచి నీరు హాస్టల్లో నాణ్యమైన భోజనం హాస్టల్లో ఇరుకు గదుల నుంచి విముక్తి కల్పించాలని అనంతపురంలో నారాయణ గర్ల్స్ కళాశాలలో రోడ్ ఎక్కిన నారాయణ కళాశాల విద్యార్థులు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తాం విద్యార్థినిల నినాదం*
👉 శుక్రవారం నుండి గ్రామ సభలు నిర్వహించనున్న పవన్ కళ్యాణ్…ఈనెల 23న అన్నమయ్య జిల్లా పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..
రైల్వేకోడూరు నియోజకవర్గం మైసూరా వారి పల్లిలో గ్రామసభలో పాల్గొననున్న పవన్..
అనంతరం రాజంపేట అన్నమయ్య డ్యాం వరద బాధిత ప్రాంతం పులపుత్తూరు లో మధ్యాహ్నం పర్యటన..
👉ఏపీలో నేటి నుంచి ఎడ్సెట్ కౌన్సెలింగ్*
ఆంధ్రప్రదేశ్ లో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) మొదటి విడత కౌన్సెలింగ్ను నేటి నుంచి ప్రారంభం కానుంది. 27వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని కన్వీనర్ ఉమామహేశ్వరి తెలిపారు. 22 నుంచి 28వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన 27న నిర్వహించ నున్నారు. 29 నుంచి SEP 2 వరకు వెబ్ఆప్షన్ల ఎంపిక, 5వ తేదీ నుంచి సీట్ల కేటాయింపు జరుగుతుంది
👉సీఎం రేవంత్ రెడ్డిపై ఈడీ ఫోకాస్ పెడుతుందా*!
తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు వెళ్లింది. రేవంత్ పై వచ్చిన ఫిర్యాదును ఈడీ స్వీకరించడం సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై ఈడీ దర్యాప్తు చేస్తే కీలక పరిణామాలు జరుగుతాయనే చర్చ సాగుతోంది. ఈడీ కేసులో రేవంత్ రెడ్డి బుక్ కావడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
*ఫిర్యాదు ఎందుకంటే..*
ఇటీవల అమెరికాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం.. తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి స్వచ్ బయో సంస్థతో రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నది. ఈ డీల్ పై పెద్ద వివాదం సాగింది. స్వచ్ బయో కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి సోదరుగు ఎనుముల జగదీశ్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారని, ఇతర డైరెక్టర్లు కూడా రేవంత్ అనుచరులనే విమర్శలు వచ్చాయి. ఆ కంపెనీ కూడా నెల రోజుల క్రితమే ఏర్పాటైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా విడుదల చేశారు. స్వచ్ బయో కంపెనీపై జరిగిన ఒప్పందంపై ఈడీ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఇటీవల ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వారి తమ్ముడు జగదీశ్ రెడ్డిపై విచారణ జరిపించాలని ఆయన ఈడీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును ఈడీ స్వీకరించింది.
*ఏం జరగబోతున్నది?*
ఈడీకి అన్ని ఆధారాలు ఇచ్చానని క్రిశాంక్ తెలిపారు. ఆ సంస్థకు డైరెక్టర్ గా ఉన్న జగదీశ్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రిపై విచారణ చేయాలని కోరినట్లు ఆయన మీడియాకు చెప్పారు. తన ఫిర్యాదును ఈడీ అధికారులు విచారణకు స్వీకరించారని పేర్కొన్నారు. దీంతో ఈడీ రంగంలోకి దిగితే ఎలాంటి పరిణామాలు జరగబోతాయన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
👉భారత్ బంద్ సందర్భంగా ఒంగోలు ఆర్టీసీ డిపో వద్ద మాల మహానాడు అధ్యక్షుడు బిల్లా వసంతరావు ఆధ్వర్యంలో బస్సులను అడ్డగించిన కార్యకర్తలు మాల మహానాడు నాయకులతో మాట్లాడుతున్న ఒంగోలు డిఎస్పి ఆర్ శ్రీనివాసరావు
👉ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ను కలిసిన ఎమ్మెల్యే ముత్తుముల*..మౌలిక వసతులు, నూతన బస్సుల ఏర్పాటు , కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరిన అశోక్ రెడ్డి..*విజయవాడలోని ఆర్టీసీ భవన్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ బ్రహ్మానంద రెడ్డి మరియు రవి వర్మ గార్లను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని పలు అంశాలను వారితో చర్చించారు. గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ ను మరింత అభివృద్ధి చేయాలని, ప్రయాణికులకు మౌలిక వసతులను మెరుగు పరచాలని, నూతన బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని వారిని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ డైరెక్టర్స్ గిద్దలూరు ఆర్టీసీ అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు..*

*సీఎంచంద్రబాబు నాయుడు ని కలిసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టిడిపి నేత ఎస్వీఎస్ అప్పలరాజు*
*నామినేటెడ్ పోస్టులో అవకాశం కల్పించాలని చంద్రబాబుకు ఎస్వీఎస్ వినతి..

కాకినాడ జిల్లా,అమరావతి, ఆగస్టు 21: అమరావతి లో గల సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు ఈ సందర్భంగా ఎస్వీఎస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ తో మర్యాదపరంగా కలిశామని పార్టీ ఆవిర్భావం నుంచి గత 42 సంవత్సరాలుగా పార్టీ కోసం పని చేస్తున్నానని నన్ను గుర్తించి మా ప్రాంతానికి ప్రజలకు సేవ చేసుకునే విధంగా నామినేటెడ్ పోస్ట్ కల్పించాలని. తన పూర్తి బయోడేటా ముఖ్యమంత్రి కి అందజేసేమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్నవరం రిటైర్డ్ పిఆర్ఓ తులా రాము తదితరులు పాల్గొన్నారు.
*అమ్మాయిలు, మహిళల భద్రత కోసం సీఎం రేవంత్ రెడ్డి మార్చి 12 2024లో, టీ సేఫ్ అనే యాప్ ను లాంచ్ చేశారు.*ఇప్పటివరకు 15,000 మందికిపైగా మహిళలు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు.మహిళల ప్రయాణ సమయంలో, పని ప్రాంతాల్లో వారి భద్రత కోసం ఈ యాప్ పనిచేస్తోంది. అపాయంలో ఉన్న మహిళలను గుర్తించి వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేలా ఈ యాప్ పనిచేస్తోంది.స్మార్ట్ ఫోన్ లో కాకుండా, సాధారణ ఫోన్ల ద్వారా కూడా టి సేఫ్ పనిచేస్తోంది.మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నా ఈ యాప్ ను అభినందిస్తూ హీరో మాధవన్ టి సేఫ్ ప్రచార వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.కోల్ కత్తా మహిళా డాక్టర్ హత్య నేపథ్యంలో టి సేఫ్ దేశ వ్యాప్తంగా మరోసారి చర్చలోకి వచ్చింది.టి సేఫ్ యాప్ ను తమ రాష్ట్రంలో ప్రారంభించేందుకు ఏడు రాష్ట్రాలు ముందు కొచ్చాయి.ఇతర రాష్ట్రాలకు టి సేఫ్ యాప్ ఆదర్శంగా మారటం, ప్రముఖ హీరో మాధవన్ తన ట్విట్టర్ అకౌంట్లో టి సేఫ్ వీడియో ను అప్లోడ్ చేసి ప్రమోట్ చేయడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. అమ్మాయిలు మహిళలు ఈ యాప్ ను వినియోగించాలనీ సూచించారు. మరింతగా ఈ యాప్ ను విన్యాయంలోకి తేవాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు.

.👉ప్రొద్దుటూరు రెండో పోలీస్ స్టేషన్ పరిధిలో “పూతరేకుల మాటున్న గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులు అరెస్ట్..కడప జిల్లా….వీరి వద్ద నుంచి సుమారు నాలుగు కేజీల గంజాయి, రెండు బైక్లు,నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం..సమాచారం వెల్లడించిన డిఎస్పీ భక్తవత్సలం…పాల్గొన్న సిఐ యుగంధర్, ఎస్సై ధనుంజయడు, సిబ్బంది…
👉సర్వేనెంబర్ 154 బూడాన్ ఖాన్ మసీద్ స్థలాన్ని అక్రమ భూ కబ్జా దారుల నుండి వక్ఫ్ బోర్డు స్వాధీనం పరచుకోవాలి*.. ఆవాజ్ కమిటీ డిమాండ్

సర్వే నంబర్ 154 బుడాన్ ఖాన్ మసీదు స్థలాన్ని భూకబ్జాదారుల నుండి వక్ఫ్ బోర్డ్ స్వాధీన పరచుకోవాలని హోటల్ ఇంటర్నేషనల్ ప్రక్కన గల వక్ఫ్ బోర్డు జిల్లా కార్యాలయం ముందు ఇస్మాయిల్ అధ్యక్షతన ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ అబ్దుల్ సుభాన్, బుడాన్ ఖాన్ మసీదు కమిటీ కార్యదర్శి మునీర్ అహ్మద్ లు , మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు అధికారులకు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు నగరంలోని జోహారాపురం పరిధిలోగల 19వ వార్డు సర్వే నంబర్ 154 రాజకీయ నాయకులు వారి అనుచరులుభూ కబ్జాలు చేశారని దానికి సబ్ రిజిస్టర్లు వక్ఫ్ బోర్డ్ అధికారులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారంతో భూ కబ్జాలు జరిగాయని వారు ఆరోపించారు. అధికారంలో ఉన్న నాయకులు అధికారం లేని నాయకులు తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ముస్లింల కు చెందిన భూములను కబ్జాలు చేయడం సమంజసం కాదని, వారు విమర్శించారు ఈ విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి పలుమార్లు తీసుకుపోయినప్పటికీ, కిందిస్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ,ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వ్యవహారం ఉందని వారు దుయ్యబట్టారు .అనంతరం ఆవాజ్ నగర అధ్యక్ష కార్యదర్శులు పీ ఇక్బాల్ హుస్సేన్ ఎస్ ఎం డి షరీఫ్ లు మాట్లాడుతూ రాజకీయంగా పలుకుబడి కలిగిన నాయకులు కాబట్టి వారి పైన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు .సబ్ రిజిస్టర్ ప్రవీణ్ కుమార్ ను సస్పెండ్ చేయడమే కాక అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అలాగే రిజిస్టర్ చేయించిన వారిపై కూడా క్రిమినల్ కేసులు బనాయించాలని, వారు డిమాండ్ చేశారు .వక్ఫ్ బోర్డు సంబంధించిన భూములను కొనడం గాని అమ్మడం గాని చెల్లదని ,చట్టం ఉన్నప్పటికీ తన అనుచర గణం కోసం, రాజకీయ నాయకులు, అధికారులు కలిసి చట్టాన్ని, తన చుట్టంగా మార్చుకొని, చట్టంలో ఉన్న లో సుగులను ఆసరా చేసుకుని సర్వే నంబర్లు తార్మాలు చేసి, అక్రమ కబ్జాలకు రిజిస్టర్లకు దారి మళ్లిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయని, దీనిపై విచారించి సంబంధించిన వారికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని మళ్లీ వక్ఫ్ యొక్క భూములను అన్యాక్రాంతం కాకుండా కబ్జాదారుల నుండి కాపాడుకోవడం కోసం తక్షణమే ఫెన్సింగ్ గోడాను కట్టి, ఇది బుడంకాన్ మసీద్ కు చెందిన భూమి అని బోర్డు పెట్టాలని, వారు వక్ఫ్ బోర్డు అధికారులను డిమాండ్ చేశారు.అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని మైనార్టీ ఆఫీస్ లోని డిస్టిక్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సునీల్ కన్నాతో చర్చించడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలియజేశారు. కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు ఈ నాయథుల్లాఖన్, యాకూబ్, నాజిర్ అహ్మద్, జాకీర్ హుస్సేన్ ,షేక్ నూర్ వలి, ఇలియాజ్ భాష సాదిక్ భాష ,జావిద్, అన్వర్ హుస్సేన్ ,నజిమొద్దీన్, శాలి భాషా ,అన్వర్ భాష, షాహిద్. అజీజ్ భాషా షాషావలి తదితరులు పాల్గొన్నారు

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం