👉‘ఎన్’ కన్వెన్షన్‌పై రేవంత్ పట్టుదల ఇప్పటిది కాదు.
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ను కూల్చేయడం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. తుమ్మడిచెరువును ఆక్రమించి కట్టిన ఈ కన్వెన్షన్ సెంటర్ అక్రమమని ఎప్పట్నుంచో ఆరోపణలు ఉన్నాయి.
ఐతే చిన్న వర్షానికే హైదరాబాద్‌లో పలు ప్రాంతాలు, కాలనీలు నీటి మడుగుల్లా మారిపోతుండడానికి చెరువుల ఆక్రమణలే కారణమని.. చెరువులుండాల్సిన చోట్ల కట్టడాలు విపరీతంగా పెరిగిపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని భావించి రేవంత్ సర్కారు ఆక్రమణల కూల్చివేతకు నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కట్టడాలను కూల్చివేయగా.. ఇప్పుడు ‘ఎన్’ కన్వెన్షన్ కూడా ఆ జాబితాలోకి చేరింది. ‘ఎన్’ కన్వెన్షన్ కూల్చివేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ఎప్పట్నుంచో పోరాడుతోంది. గత ప్రభుత్వ హయాంలో చర్యలు మొదలుపెట్టినట్లే మొదలుపెట్టి ఆపేశారనే ఆరోపణలున్నాయి.ఐతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెరువులను ఆక్రమించి చేసిన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతుండగా.. నాగ్ పలుకుబడి దృష్ట్యా ఎలాగోలా తన కన్వెన్షన్ సెంటర్ మీదికి అధికారులు రాకుండా చూసుకుంటాడని భావించారు. కానీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా హైడ్రా అధికారులు ఈ కట్టడాన్ని కూల్చేశారు. ఐతే ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలే కారణం అనే చర్చలు జరుగుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా పలు సందర్భాల్లో రేవంత్ ‘ఎన్’ కన్వెన్షన్ గురించి ప్రస్తావించారు.టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగానే చెరువు మధ్యలో గోడ కట్టి మరీ ఈ కన్వెన్షన్ నిర్మించిన విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు రేవంత్. అది అక్రమ కట్టడమని క్లియర్‌గా తెలుస్తున్నా ఎందుకు కూల్చివేయట్లేదని ప్రశ్నించారు. కొన్నేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా మరోసారి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఎన్ కన్వెన్షన్‌ను కూల్చి తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి దీన్ని కూల్చివేయడంతో సోషల్ మీడియాలో సానుకూల స్పందన వస్తోంది.
*ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశాం. హైకోర్టు స్టే ఇవ్వడం పూర్తిగా అవాస్తవం. ఎన్ కన్వెన్షన్‌పై ఎలాంటి స్టే లేదు. FTLలో కట్టడాలు ఉన్నందుకే కూల్చివేశాం. చెరువును పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేశారు. ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్‌ను గతంలోనే అధికారులు తిరస్కరించారు. ఎన్ కన్వెన్షన్‌లో పూర్తిగా కట్టడాలను నేలమట్టం చేశాం. -హైడ్రా కమిషనర్*
👉విద్యార్థులకు అస్వస్థత..!!!
బాపట్లలో ఓ పాఠశాలలో ఆరో తరగతి చదివే విద్యార్థిని తోటి విద్యార్థులకు కాఫీ పొడిలో నిమ్మకాయ కలిపి ఇచ్చింది.దీంతో ఆ మిశ్రమం తాగిన 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురై బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు.జిల్లా డిప్యూటీ కలెక్టర్ విద్యార్థులను పరామర్శించారు.
👉రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..*
మధ్యాహ్నం మూడు గంటలకి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీటీడీపీ ముఖ్య నేతలతో బాబు సమావేశం..
పార్టీ సభ్యత్వాల నమోదు పై ఫోకస్ చేసిన చంద్రబాబు నాయుడు *ప్రస్తుతం ఉన్న అన్ని కమిటీలు రద్దు చేసే అవకాశం..??? నియోజవర్గాల వారీగా అత్యధిక సభ్యత్వాలు చేసిన నేతలకు పెద్ద పీఠ వేసే అవకాశం..!!!*రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై నేతల అభిప్రాయాలు తీసుకోనున్న బాబు..*ఒక ప్రముఖ NRI ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేనందుకు చర్చలు జరుగు తున్నట్లు సమాచారం..తెలంగాణ లో పార్టీ బలోపేతంపై నేతలకి దిశానిర్దేశం చేయనున్న బాబు..
👉ఢిల్లీ వెళ్లి మీ బాబాయ్ కేసు కోసం ధర్నా చేయండి-జగన్ పై మంత్రి అనిత ఫైర్..
జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ గ్రేషియా కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉంది. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతారు.ఏపీలో రెండు ప్రమాదాలు జరగడం దురదృష్టకరం అన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత..ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమైందన్నారు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేయకపోతే మృతుల సంఖ్య పెరిగేదన్నారు.ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయని.. క్షతగాత్రులను తక్షణమే ఆసుపత్రులకు తరలించామని వివరించారు. సహాయ చర్యల విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను, ఆరోపణలను మంత్రి అనిత కొట్టిపడేశారు. ప్రమాదం రోజు విజయవాడ నుండి తాను రోడ్డు మార్గంలో ఘటనా స్థలానికి రాత్రి 12.30 కు చేరుకున్నానని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అధికారులతో ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్షతగాత్రులను పరామర్శించారని చెప్పారు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించారని, తక్షణమే అధికారులతో సమీక్ష నిర్వహించారని వెల్లడించారు. సీఎం ప్రకటించిన 24 గంటల గడవక ముందే మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందజేశామన్నారు హోంమంత్రి అనిత.”జగన్ ధర్నా చేయాలంటే చాలా ఉన్నాయి. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడికి పిలిపించుకున్నారు? ఎల్జీ పాలిమర్స్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారా? ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 15 మంది మృతి చెందితే 12 మందికే ఎక్స్ గ్రేషియా ఇచ్చారు. ముగ్గురికి ఇప్పటికీ ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదు. పులివెందుల ఎమ్మెల్యే అనకాపల్లి వచ్చి ప్రమాదంపై మంత్రులు, ప్రభుత్వం స్పందించడం లేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ గ్రేషియా కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంకటాపురంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు. ఇప్పటికీ హాస్పిటల్ లేదు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతారు.ధర్నా చేయాలంటే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయండి. మీ బాబాయ్ కేసు కోసం ధర్నా చేయండి. మీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు చేస్తున్న పనులు కోసం ధర్నా చేయండి. గత ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి ఒక్కసారైనా అధికారులతో సమావేశం నిర్వహించారా? పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే, పరిశ్రమ మూసివేస్తాం అని హెచ్చరించాం. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే, కఠిన చర్యలు ఉంటాయి” అని వార్నింగ్ ఇచ్చారు.
👉తిరుపతిలోని స్విమ్స్ ఎమర్జెన్సీ వార్డు వద్ద వైద్య విద్యార్థుల నిరసన*
తిరుపతి స్విమ్స్ ఎమర్జెన్సీ వార్డులో ఇంటర్న్‌షిప్ చేస్తున్న లేడి డాక్టర్ పై దాడి జరిగింది . వైద్యురాలి పై దాడికి నిరసనగా వైద్య విద్యార్దిని , విద్యార్దులు ధర్నా చేపట్టారు. ఓ ప్రక్క దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వైద్య విద్యార్థులు ఎమర్జెన్సీ వార్డు వద్ద బైఠాయించి ధర్నా చేస్తుంటే మరో ప్రక్క వైద్యం కొరకు వచ్చిన రోగులకు మాత్రం నరకం కనబడుతుంది. వైద్యురాలి పై దాడికి నిరసనగా స్విమ్స్ ఆస్పత్రి లో ఎక్కడికక్కడ వైద్య సేవలు నిలిపివేయడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన వారికి సైతం వైద్య సేవలు అందక అసలు ఎం జరుగుతుందో అర్థం కాక దీనంగా రోగులు ఎదురుచూపులు చూడాల్సి వచ్చింది.ఆస్పత్రికి వచ్చిన రోగులు పడిగాపులు కాస్తూ ఎవరైనా తమ బాధను అర్థం చేసుకుంటారెమో అనే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని, ఆసుపత్రిలో వైద్య సేవలు అందించే విదంగా తగు కార్యాచరణ చేయాలని పలువురు కోరుతున్నారు.
*విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠ్యపుస్తకాలు సిద్ధం కావాలి!*అనకాపల్లి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు*
*నవంబర్ లో మెగా పేరెంట్–టీచర్ సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి*ఏ స్థాయిలో ప్రశ్నాపత్రాలు లీకైనా కఠిన చర్యలు తీసుకుంటాం*
*పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష*
అమరావతి: వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… పాఠ్యపుస్తకాలను సకాలంలో అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అనకాపల్లి అనాధ శరణాలయంలో కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటనపై మంత్రి విచారం వ్యక్తంచేస్తూ ఆ సంఘటన పూర్వాపరాలపై ఆరా తీశారు. భవిష్యత్తులో మరోమారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏజన్సీ స్కూళ్లతో పాటు ప్రైవేట్ వ్యక్తులు నడిపే ఆశ్రమాలు కూడా నిరంతరం ట్రాక్ చేస్తూ పర్యవేక్షించాలన్నారు. పాఠశాలల్లో ఇంటర్నల్, ఎక్సటర్నల్ ప్రశ్నాపత్రాలు ఏ స్థాయిలో లీకైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా సిబిఎస్ఇ సిలబస్ అమలవుతున్న వెయ్యి పాఠశాలల్లో అసెస్ మెంట్ టెస్ట్ కొనసాగుతోందని, ఇందుకు సంబంధించిన ఫలితాలు వచ్చాక విధాన పరమైన నిర్ణయాలు తీసుకుందాం అని అన్నారు. మండలస్థాయిలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చిందని, ఆ తర్వాత డివిజన్ స్థాయిలో చేపడతామని అన్నారు. సర్దుబాటు ప్రక్రియలో ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 5 న గురుపూజోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని, ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించాలని లోకేష్ అన్నారు. నవంబర్ లో మెగా పేరెంట్ – టీచర్స్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సైన్స్ ఫేర్, స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించాలని, విద్యార్థుల్లో క్రీడానైపుణ్యాలను పెంపొందించేందుకు అవసరమైన స్పోర్ట్స్ కిట్స్ అందజేయాలన్నారు. పాఠశాల విద్య శాఖను పట్టిపీడిస్తున్న కోర్టు వివాదాల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాలల్లో పారిశుద్ధ నిర్వహణకు సంబంధించిన యాప్ ల భారాన్ని టీచర్లకు తప్పించినట్లు చెప్పారు. గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించామని, స్కూలు మేనేజ్ మెంట్ కమిటీలు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యి పర్యవేక్షణ చెయ్యాలని అన్నారు. పాఠశాలల్లో ఆయాలు, వాచ్ మెన్లకు పెండింగ్ లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లెర్నింగ్స్ అవుట్ కమ్స్ పై సమీక్షిస్తూ విద్యా సామర్థ్యాల మెరుగుదలకు పకడ్బందీగా శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్ పదోన్నతులు, పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులపై సుదీర్ఘంగా చర్చించారు. సాధ్యమైనంత త్వరగా కేసుల పరిష్కారానికి చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, డైరక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు.
👉ఎడిపై వరల్డ్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి……*
*ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం ఆలస్యంగా వెలుగులోకి తెచ్చిన విద్యార్థి సంఘాల నాయకులు…….*
అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం మండలం, వడియం పేట, హైవే సమీపన గల ఎడిఫై వరల్డ్ స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నం చేసుకోవడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినది. కార్పొరేట్ విద్యాసంస్థల్లో సంవత్సరానికి 1,90,000 రూపాయలు ఫీజులు కడుతూ చదువుకోవడానికి స్కూలు పంపిస్తే ఏమాత్రం బాధ్యత లేకుండా ధనార్జన ధ్యేయoగా పిల్లల ప్రాణాలు లెక్కచేయకుండా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని ఏపీ ఎం ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జెన్నే చిరంజీవి, ఎస్సీ ఎస్టీ విద్యార్థి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మధు ప్రసాద్, అప్పా టీం జిల్లా అధ్యక్షులు మద్దెల చెరువు వెంకీ,వన్నురు స్వామి తదితరులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గవర్నమెంట్ రూల్స్ ను పాటించకుండా లక్షల రూపాయలను ఫీజులు ఎలా తీసుకుంటున్నారని, విద్యా హక్కు చట్టం ప్రకారం నియమ నిబంధనలను పాటించకుండా ఫీజు డిక్లరేషన్, ఫ్యాకల్టీ డిక్లరేషన్ బోర్డ్, బిల్డింగ్ అప్రూవల్, ఫైర్ అప్రోవల్, టీచింగ్ అండ్ నాట్ టీచింగ్ స్టాఫ్ క్వాలిఫికేషన్ గవర్నమెంట్ రికగ్నిషన్ లేకుండా ఎలా విద్యాసంస్థలు నడుపుతారని ఉన్నత విద్యా శాఖ అధికారులు స్పందించి ఇలాంటి స్కూలును సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే అక్కడ ఉన్న ఇద్దరు పిల్లల పేరెంట్స్ మాట్లాడుతూ పిల్లలకు ఫుడ్డు, బెడ్డు, హాట్ వాటర్, ఏసీ రూమ్స్ అని చెప్పి లక్షల రూపాయలు డబ్బులు కట్టించుకున్నారని ఇక్కడ కనీస సౌకర్యాలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి స్కూల్స్ ను వెంటనే సీజ్ చేయాలని వారు తెలిపారు.
👉 డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు.
అమరావతి నిర్మాణానికి రూ.60 వేల కోట్ల ఖర్చు.
నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్న ఏపీ సర్కార్.
అమరావతితో పాటు ఏకకాలంలో 26 జిల్లాల అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
👉వినియోగదారుల రక్షణ చట్టంతో వైద్యుల నిర్లక్ష్యంపై అపోలో ఆసుపత్రి పై చర్యలు…*
*ఆశ్ర వ్యవస్థాపకులు, సుప్రీంకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ పలు వివరాలు వెల్లడి…
*విశాఖపట్నం:* వినియోగదారుల రక్షణ చట్టంతో అపోలో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై కోర్టులో ఒక వినియోగ దారుడు గొప్ప విజయం సాధించారని, నష్టపరిహారంగా 21.60 లక్షల రూపాయల నష్ట పరిహారం పొందడం జరిగిందని సుప్రీంకోర్టు న్యాయవాది, అడ్వకెట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ (ఆశ్రా) వ్యవస్థాపకుడు, హబీబ్ సుల్తాన్ అలీ తెలియజేశారు.శనివారం డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య రంగం నిర్లక్ష్యం మీద ఒక వినియోగ దారుడు సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించారు. ఒక మహిళ 2011 లో కడుపు నొప్పి కారణంగా అపోలో ఆస్పత్రిలో రోగి చేరారు.గాల్ బ్లాడర్ తొలగించే ఆపరేషన్ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపారు. అదే ఆసుపత్రి 2020 లో శరీరంలో గాల్ బ్లాడర్ వుందని, అందులో రాళ్ళు వున్నాయని రిపోర్ట్ ఇవ్వడం గమనార్హ మన్నారు. మహిళకు జరిగిన అన్యాయంపై వినియోగదారుల కోర్టు కేసు ఫైల్ చేసి 21.60 లక్షల రూపాయలు నష్ట పరిహారం సాధించినట్లు తెలిపారు. డాక్టర్లు దేవుళ్ళుని భావించే రోగులకు న్యాయం చేయాలని కోరారు. లాజరస్ ఆస్పత్రిలో కూడా వైద్య నిర్లక్షం వల్ల ఒక రోగి 29 లక్షల నష్ట పరిహారం సాధించమని గుర్తు చేశారు. పలు కేసులు పెండింగ్ ఉన్నాయన్నారు. ఆశ్ర సంస్థ దేశంలోనే అతి పెద్ద వినియోగదారుల పరిరక్షణ సంస్థ అన్నారు. వినియోగదారులకు న్యాయం 2002 లో డిల్లీ లో ప్రారంభ అయ్యిందన్నారు. 2,500 అవగాహన శిబిరాలు, బీమా కేసులు, సేవా లోపం అంశాల మీద 275 కేసులు వేశామన్నారు. ఇటీవలి కాలంలో వైద్య నిర్లక్ష్యం మీద ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. సాధారణ కాన్పులకు అవకాశం ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో గర్భిణీలకు సీజేరియన్ ఆపరేషన్లు కూడా ఎక్కువ జరుగుతున్నాయని, ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కార్పొరేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు చేయాలని కోరారు. 2023 లో కేసు వేశాం రిపోర్ట్ ల కోసం రూ. 5,250 ఫీజు చెల్లించారన్నారు. డబ్బులే ప్రధానంగా ఆస్పత్రుల్లో యాజమాన్యం వ్యవహరిస్తుందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 70 ఏళ్ల వయసు ప్రాతిపదికన నష్ట పరిహారం ఇస్తారన్నారు. ఆస్పత్రుల్లో నష్ట పోయిన బాధితులకు న్యాయం కోసం సంప్రదించాలని కోరారు. దొండపర్తి రాజమండ్రి సారీ మందిర్ భవనంలో ఆశ్ర కార్యాలయం వుందని తెలిపారు. ఆస్పత్రుల్లో తూనిక యంత్రాలు తూనికలు కొలతలు శాఖ సీళ్ళు లేకుండా బరువులు కొలవడం దారుణమన్నారు. మందుల చీటీలో కూడా వైద్యులు రోగులకు వివరాలు ఇవ్వాలని కోరారు. వైద్య నిర్లక్ష్యం మీద చట్ట ప్రకారం కేసులు వేయొచ్చునని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఆశ్ర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయ వాది తోట శత్రుఘ్నుడు, ఆశ్రా సభ్యులు మహ్మద్ ఇక్బాల్, జీ.కిషోర్ కుమార్, ఎం.డి. నజ్జీమ్, జీ శ్యామలా దేవి, పీ.హైమా, ఈ. సత్యనారాయణ మూర్తి , పాల్గొన్నారు.
*తిరుపతి నగరపాలక సంస్థలో సీఐడీ సోదాలు..*టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణ..
అభివృద్ధి పేరుతో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో జరిగిన టీడీఆర్ బాండ్ల అక్రమాలపై సర్కార్ ఫోకస్..
తిరుపతి నగరపాలక సంస్థలో జరిగిన కుంభకోణంపై విచారణకు రంగంలోకి దిగిన CID.. శనివారం పట్టణ ప్రణాళిక విభాగంలో దస్త్రాలను పరిశీలించిన AP CID ఉన్నతాధికారులు *మాస్టర్ ప్లాన్ పేరుతో అవినీతికి తెరలేపిన వైకాపా నేతలు* *రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆరోపణలు*
దాదాపు రూ.2,500కోట్ల మేర టీడీఆర్ బాండ్లు జారీ.. టీడీఆర్ బాండ్ల మాటున సాగిన అక్రమాలపై విచారణ నిర్వహించాలన్న తెదేపా నేత రవినాయుడు ఫిర్యాదుతో సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు..