హైడ్రా దూకుడు..ఆరుగురు ఆఫీసర్ల అరెస్ట్కు రంగం సిద్ధం..నూజివీడు త్రిబుల్ ఐటీ పని తీరుపై jc ఆగ్రహం.. పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి డోలా శ్రీ ,ఎమ్మెల్యే ముత్తుముల..భారీ వర్షాలు, వరదలపై మంత్రి డా. డోలా శ్రీ సమీక్ష.. గిద్దలూరు సబ్ జైల్ ను అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్..ఏకీకృత పెన్షన్ పథకాన్ని అంగీకరించం-యుటిఎఫ్..అన్నా క్యాంటీన్ కు విరాళం

👉హైడ్రా దూకుడు..ఆరుగురు ఆఫీసర్ల అరెస్ట్కు రంగం సిద్ధం…! హైదరాబాద్:నాలాలు,చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులను జైలుకు పంపేందుకు రంగం సిద్ధమైంది. హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ సిఫారసుతో స్పందించిన సైబరాబాద్​ సీపీ అవినాశ్​ మహంతి.. ఆరుగురిపై చర్యలకు డీసీపీ ప్రసాద్​ నేతృత్వంలోని ఎకనామిక్ అఫెన్స్​ వింగ్(ఈవోడబ్ల్యూ)కు బాధ్యతలు అప్పగించారు. హైడ్రా నుంచే పూర్తి ఆధారాలు అందడంతో ఆరుగురిపై కేసులు నమోదు చేసిన స్పెషల్​ వింగ్​.. సంబంధిత అధికారులను అరెస్ట్​ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.*అధికారులు ఏం చేశారంటే.. బాచుపల్లి ఎర్రకుంటలోని చెరువు శిఖం భూమిని పట్టా భూమిగా చూపుతూ తహసీల్దార్‌ పూల్‌సింగ్‌ చౌహాన్‌ తప్పుడు నివేదిక ఇచ్చారు. దాన్ని చూపి.. నిర్మాణదారు హెచ్‌ఎండీఏ నుంచి ఎర్రకుంటలో లేఅవుట్‌కు అనుమతి పొందారు. అక్కడ నిర్మాణాలకు నిజాంపేట నగరపాలక సంస్థ కమిషనర్‌ రామకృష్ణారావు అనుమతి ఇచ్చారు. ఆ నిర్మాణాలను ఇటీవల హైడ్రా కూల్చివేసింది. చందానగర్‌ సర్కిల్‌ పరిధిలోని ఈర్ల చెరువులో మూడు భవనాలకు అనుమతి ఇవ్వడమే కాకుండా నిర్మాణం పూర్తవకముందే వాటికి ఆక్యుపేషన్​ సర్టిఫికెట్​ ఇచ్చారు. వాటిని హైడ్రా కూల్చింది. అనుమతులు ఇచ్చిన అసిస్టెంట్​ ప్లానింగ్​ ఆఫీసర్​ రాజ్‌కుమార్, సర్కిల్​ డిప్యూటీ కమిషనర్​ సుధాంశు ఇద్దరిపైనా చర్యలు తీసుకుంటున్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఓ చెరువు ఆక్రమణలపై సర్వే డిపార్ట్​ మెంట్​ కు చెందిన ఏడీ శ్రీనివాస్‌ తప్పుడు నివేదిక ఇచ్చారు. తగిన ఆధారాలతో హైడ్రా ఆయనపై ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ భూమి అని బోర్డు ఉన్న ఓ స్థలాన్ని పరిశీలించాక కూడా.. ఓనిర్మాణానికి హెచ్‌ఎండీఏ అసిస్టెంట్​ ప్లానింగ్​ ఆఫీసర్​ సుధీర్‌కుమార్‌ అనుమతి ఇచ్చారు. ఇలా ఆరుగురు అధికారులపై క్రిమినల్​ చర్యలకు రంగం సిద్ధమైంది. హైడ్రా కూల్చివేతలు ప్రారంభించిన తర్వాత అధికారులపై చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి.

👉ఏపీ: సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన రద్దు.. ఓర్వకల్‌లో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం.. వాతావరణం కారణంగా రద్దయిన సీఎం పర్యటన.. ముందు పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ పర్యటన ఖరారు చేసి ఆ తరువాత రద్దు.. తర్వాత ఓర్వకల్‌లో పర్యటన ఖరారు చేసిన అధికారులు
👉 విజయవాడ: దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత.. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉంటుందని ముందస్తుగా ఘాట్ రోడ్ మూసివేసిన అధికారులు.. ఘాట్ రోడ్డు దిగువన కూలిన మూడు చెట్లు

👉 హైదరాబాద్‌కు ఐఎండీ భారీ వర్షసూచన.. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు అంటున్న అధికారులు.. మూసీ పరివాహక ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.. తెలంగాణలోని 10 జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ జారీ..
👉 నూజివీడు త్రిబుల్ ఐటీ పని తీరుపై ఆగ్రహం.. ఏలూరు జిల్లా నూజివీడు లోని త్రిబుల్ ఐటీ లో నిర్వహిస్తున్న మెస్ల పనితీరుపై ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ప్రాంగణంలోని మెస్లను పరీక్షించారు, వంటకు వినియోగించే సరుకులు నూనెల నాణ్యతను తెలుసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను సూచించారు.విద్యార్థుల ఆరోగ్యం పట్లబాధ్యత లేదా అని ప్రశ్నించారు. తక్షణమే మెస్లనిర్వాహకులు విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు…

👉 గుడ్లవల్లేరు కాలేజీ స్టూడెంట్స్ ఆడియో లీక్.. ఆధారాలు దొరికినా వాటిని చీకట్లోనే సమాధి చేస్తున్నారా..? లేక రాజకీయ పలుకుబడితో అసలు అలాంటి సంఘటన జరగనే లేదు అని నిరూపించాలని చూస్తున్నారా…!!!అసలు అంతమంది స్టూడెంట్స్ కెమెరాలు ఉన్నాయిరా బాబోయి అంటుంటే లేవు అని చెప్పి చేతులు దులుపుకోవడం లో ఎంతవరకు నిజం ఉంది……నిజంగా అలాంటి సంఘటన జరగలేదు సరే కెమెరాలు లేవు కదా మరి కథ మొత్తానికి సూత్రదారి అని చెప్తున్న ఆ అమ్మాయినీ ఎందుకు రాత్రికి రాత్రి పంపించేసారు…. అంతమంది స్టూడెంట్స్ ఆమెను కొట్టడానికి వస్తె తప్పు చేయకుండా ఎందుకు దాక్కుని ఉండాలి….పైగా వీడియో తీస్తున్న వారిని  చూపించడానికి కారణం ఏమిటి ? అసలు ఉన్నాయో లేవో కూడా తెలియని కెమెరాల కోసం  స్టూడెంట్స్ ఆరాటంగా పోరాటం చేస్తున్నారా….!!!

👉 పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామంలో ముందస్తు పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి.
👉 ప్రకాశం జిల్లా చీమకుర్తి ఎస్సీ బాయ్స్ హాస్టల్ లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆకస్మిక తనిఖీ..తనిఖీ సమయంలో విధుల్లో లేని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారి చేయాలని ఆదేశం..వర్షంలో తడుస్తూ హాస్టల్ లోని మరుగుదొడ్లు, పరిసరాలు పరిశీలించిన మంత్రి..అధ్వానంగా ఉన్న మరుగుదొడ్లు, అపరిశుభ్రతపై మంత్రి ఆగ్రహం ..గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలోని వసతి గృహాలు, గురుకుల పాఠశాలలకు ఈ దుస్థితి..
జగన్ కనీసం వసతి గృహాలకు మెయింటినెన్స్ నిధులు కూడా ఇచ్చిన పాపాన పోలేదు..జగన్ అధికారం పోయాక ప్రజలపై లేని ప్రేమను వలకబోస్తున్నారు..గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన వెనుక వైసీపీ కుట్ర ఉంది..తప్పుడు ప్రచారాలు చేయడం, ఎదుటివారిపై బురద చల్లడం వైసిపికి దినచర్య అని ఖండించారు..

👉భారీ వర్షాలు, వరదలపై మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమీక్ష…ప్రకాశం జిల్లా ఎస్పీ, కలెక్టర్ , రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల, సంక్షేమ వసతి గృహాలఉన్నతాధికారులతో సమీక్ష..భారీ వర్షాలు నేపద్యంలో జిల్లాలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్, ఎస్పీకి సూచన..గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశం..అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని జిల్లా ప్రజలకు మంత్రి విజ్ఞప్తి..అధికారులంతా అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఏ ఇబ్బంది రానీయెద్దు…రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి..

👉రోడ్ ప్రమాదం లో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి*ప్రకాశం జిల్లా కొమరోలు లోని గురువారం రాత్రి డ్రీమ్ రెస్టారెంట్ వద్ద బుల్లెట్ వాహనం అదుపు తప్పటంతో నల్లగుంట్ల గ్రామానికి చెందిన బుల్లెట్ భాషా (38) కు తీవ్ర గాయాలు కావటంతో నంద్యాలలోనే శాంతిరాం వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు.చికిత్స పొందుతున్న భాష శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.

👉బైక్‌తో సహా వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి …ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు..
ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండల పరిధిలోని ముప్పాళ్ల గ్రామంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో శనివారం ఓ వ్యక్తి వాగు దాటే ప్రయత్నం చేశాడు. వాగు దాటే క్రమంలో అతను కిందపడి బైక్‌తో సహా ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
👉 వర్షంలో సైతం పెన్షన్ల పంపిణీ..  ప్రకాశం జిల్లా..పెద్దరావీడు మండలంలోని దేవరాజుగట్టు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా ఫించన్ నగదును లబ్దిదారులకు పంపిణీ చేసిన రాష్ట్రా సాంఘిక సంక్షేమ శాఖ,విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖ,సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రివర్యులు డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి.

👉 పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి..ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి స్వయంగా పెన్షన్లను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజు ముందే పెన్షన్ల పంపిణీ జరగడంపై ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతుంది అనటానికి ఇదే నిదర్శనం అని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు పెంచిన పెన్షన్లను అందజేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

👉 గిద్దలూరు పట్టణంలోని సబ్ జైల్ ను అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.మేరీ సారా ధానమ్మ సందర్శించారు. విచారణ ఖైదీలను వారి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి బెయిల్ అప్లికేషన్ వేసుకునే హక్కు ఉందని తెలియజేశారు. సబ్ జైల్లో వారికి అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయమూర్తులు గాని, లీగల్ ఎయిడ్ క్లినిక్ న్యాయవాది గాని సబ్ జైలును సందర్శించినప్పుడు వారికి తమ సమస్యలను తెలుపుకోవచ్చన్నారు. దోమల నివారణకు చర్యలు చేపట్టవలసినదిగా జైల్ అధికారులను ఆదేశించారు. ఆర్థిక స్తోమత లేని వారికి వారి కేసులను వాదించడానికి ఉచిత న్యాయవాదిని పొందవచ్చు అని తెలియజేశారు. క్షణికావేశంలో తప్పిదాలు చేయవద్దని, ఏమైనా సమస్యలు ఉంటే ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని పలికారు. ఈ కార్యక్రమంలో సబ్ జైల్ హెడ్ వార్డెర్ పి. రవీంద్రనాథ్ ,పారా లీగల్ వాలంటీర్ అద్దంకి. మధుసూధనరావు,జైలు సిబ్బంది మరియు విచారణలో ఉన్న ఐదు మంది ఖైదీలు పాల్గొన్నారు.

👉గిద్దలూరును ఆదర్శ నగర పంచాయతీగా తీర్చిదిద్ది..పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా.. ఎమ్మెల్యే ముత్తుముల*

గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిద్దలూరు పట్టణాన్ని ఆదర్శ నగర పంచాయతీగా తీర్చిదిద్దాలని ముఖ్యంగా పట్టణంలో పచ్చదనానికి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం కావడంతో వీధుల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ఎప్పటికప్పుడు వీధులను పరిశుభ్రం చేయాలని, పట్టణంలోని సగిలేరు వాగు పరివాహక ప్రాంత ప్రజల రక్షణకు రిటైనింగ్ వాల్ ను అతి త్వరలోనే పూర్తి చేస్తామని, అదే విధంగా రాచర్ల రైల్వే గేట్ వద్ద వాహనదారులు ఎదుర్కొనుచున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని గిద్దలూరు పట్టణంలో అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం అన్నీ విధాలుగా సహకారం అందిస్తుందని అందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు.. ఈ కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకటసుబ్బయ్య కమిషనర్ డి. వెంకటదాసు మరియు పట్టణ కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్స్ నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.*
👉అన్న క్యాంటీన్ కు రూ. 20 వేలు విరాళం*
*గిద్దలూరు పట్టణంలోని ప్రశాంతి నగర్ లో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని పట్టణానికి చెందిన అన్నపూర్ణ హోటల్ యజమానులు ఆవులమంద శ్రీనివాసులు మరియు రాయల రామాంజినేయులు మర్యాదపూర్వకంగా కలిసి అన్నక్యాంటీన్ కు తమ వంతు సహకారంగా రూ. 20 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యేకి అందచేశారు. ఈ సందర్బంగా వారికీ ఎమ్మెల్యే అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బిల్లా రమేష్ పాల్గో న్నారు.*

👉ఏకీకృత పెన్షన్ పథకాన్ని అంగీకరించం…యుటిఎఫ్ పొదిలి డివిజన్ .*కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) పథకాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని యుటిఎఫ్ జిల్లా సహా అధ్యక్షులు, జిల్లా కార్యదర్శి షేక్ అబ్దుల్ హై ,పీ బాల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.శుక్రవారం సాయంత్రం యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యుపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ, నిరసిస్తూ యుటిఎఫ్ కార్యాలయం నుండి వైయస్సార్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు.ఈసందర్భంగా షేక్ అబ్దుల్ హై ,పీ బాల వెంకటేశ్వర్లులు మాట్లాడుతూ ఉద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కేవలం ఎన్‌పీఎస్‌ పేరును యూపీఎస్‌గా మార్చిందని ఆరోపించారు. 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు 50 శాతం పెన్షన్ గ్యారంటీ చేస్తున్నట్లు, సర్వీసులో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 60 శాతం ఫ్యామిలీ పెన్షన్ ఇస్తామని యుపిఎస్ పెన్షన్ విధానంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తో కూడిన పెన్షన్ పథకాన్ని రద్దు చేసే విషయాన్ని ఇందులో ప్రస్తావించకపోవడం, పైగా ఈ పథకం అమలు ఐచ్చికం అని పేర్కొనడంలోనే అసలు మోసం దాగి ఉందన్నారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ లేకుండా సర్వీసును బట్టి 50 శాతం పెన్షన్ ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడమే తమకు ఆమోదయోగ్యమని వారు పేర్కొన్నారు. యుపిఎస్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ యొక్క అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ యొక్క నకలు అని, నూతన పెన్షన్ పథకం యొక్క సంస్కరణకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుందని, ఇది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదనివారు పేర్కొన్నారు. పాత పెన్షన్ స్కీమ్ (ఓపిఎస్) అమలు అనేది దేశవ్యాప్తంగా ముఖ్యమైన రాజకీయ సమస్యగా మారిందని, గత లోక్‌సభ ఎన్నికలను సైతం ఇది ప్రభావితం చేసిందని వారు తెలిపారు. ఉద్యోగులలో వ్యతిరేకత మరియు సమీప భవిష్యత్తులో రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని, ఉద్యోగులకు కనీస ఉపశమనం అందించడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎత్తుగడ, మోసపూరిత వ్యూహంగా ఏకీకృత పెన్షన్ పథకం (యుపిఎస్) విధానాన్ని ప్రవేశపెట్టిందని వారు ఆరోపించారు. సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి రమేష్ మాట్లాడుతూ పాత పెన్షన్ పథకానికి ప్రత్యామ్నాయంగా ఏకీకృత పెన్షన్ పథకం అమలు ఆమోదయోగ్యం కాదని, పాత పెన్షన్ పథకాన్ని పూర్తిగా పునరుద్ధరిడమే ఏకైక పరిష్కారమని వారు తెలిపారు. పాత పెన్షన్ అమలు కోసం ఎఫ్ఆర్డిఏ చట్టాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.పాత పెన్షన్ అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు బి బుజ్జిబాబు,మూడు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణ రెడ్డి, పాలడుగు వెంకటేశ్వర్లు, కే నాసర్ మహమ్మద్, ఎస్ కామేశ్వరరావు, సిహెచ్ కోటేశ్వరరావు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్, ఆర్ టి సి ఎస్ డబ్ల్యూ ఎఫ్ నాయకులు ఎస్ వెంకటేశ్వర్లు, జెవివి జిల్లా కార్యదర్శి బీడీ ప్రసాద్ , మహిళా సహాధ్యక్షురాలు వై ఎస్ ఎన్ జ్యోతి ,లుక్ అని వెంకటేశ్వర్లు ,వెన్నెల మల్లికార్జునరావు, నారాయణరెడ్డి, వై గురవయ్య, గాలి ముట్టి రమేష్ ,మహమ్మద్ ఆలి, విజయ్ గోపాల్ ,బాల కాశిరెడ్డి, భీం పార్టీ శ్రీనివాసులు రెడ్డి, నూతలపాటి సురేష్ , వై శ్రీను,ఖాసింసా, సిహెచ్ ప్రభాకర్ రెడ్డి ,గంట ఆంజనేయులు రెడ్డి వెంకటేశ్వర్లు నాయక్, హనీఫ్,సయ్యద్ ఇబ్రహీం, శేషారావు, జూపల్లి వెంకటేశ్వర్లు,చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

**పొంగిన జంపలేరు వాగు..ప్రకాశం జిల్లా కంభం రూరల్.. శుక్రవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు జంపలేరు వాగు ఉప్పొంగింది.దీంతో కంభం చెరువుకు ఉధృతంగా నీళ్లు వస్తున్నాయి. పదునైన వర్షాలు కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు .

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం