‘బుడ‌మేరు’..పాల‌కుల‌ పాపం..త‌లా పిడికెడు!..ముంపు గ్రామాల్లో జగన్ కు షాకిచ్చిన మహిళ..వరదకు ఎదురీది..వరద ప్రాంతాల్లో మంత్రి సవితమ్మ పర్యటన..ప్రభుత్వం ఏం చేయాలో అదే చేస్తోంది..నారా భువనేశ్వరి.. బెంగాల్‌లో మళ్లీ వేధింపుల కలకలం..బాలికల హాస్టల్లో రహస్య కెమెరాల ఘటనపై 2 వారాల్లోగా నివేదిక..

👉’బుడ‌మేరు’.. పాల‌కుల‌ పాపం.. త‌లా పిడికెడు!అయితే… ఎప్ప‌టిక‌ప్పుడు..ఈ బుడ‌మేరు పొంగిన‌ప్పుడ‌ల్లా పాల‌కులు..త‌మ పాపం ఏమీ లేద‌ని..గ‌త పాల‌కుల‌దే త‌ప్ప‌ని అనేస్తారు.ఇప్పుడు చంద్ర‌బాబు కూడా అదే అనేశారు.విజ‌య‌వాడ మునిగిపోవ‌డానికి.. ప్ర‌జ‌లు గ‌త నాలుగు రోజులుగా కంటిపై కునుకు లేకుండా ఉండ‌డానికి కార‌ణం.. బుడ‌మేరు.ఇది కృష్ణాన‌ది పాయ‌.దీనికి చాలానే చ‌రిత్ర ఉంది.ఇప్పుడు ఇది పొంగి.. పొర్ల‌డంతోనే విజ‌య‌వాడ స‌హా చుట్టుప‌క్క‌ల ఉన్న గ్రామాలు అన్నీ నీట‌మునిగాయి. అయితే…ఎప్ప‌టిక‌ప్పుడు.. ఈ బుడ‌మేరు పొంగిన‌ప్పుడ‌ల్లా పాల‌కులు..త‌మ పాపం ఏమీ లేద‌ని.. గ‌త పాల‌కుల‌దే త‌ప్ప‌ని అనేస్తారు.ఇప్పుడు చంద్ర‌బాబు కూడా అదే అనేశారు.కానీ, వాస్త‌వం.. అది కాదు.ఈ బుడమేరు పాపం.. కొన్ని ద‌శాబ్దాల నాటిది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాలం నుంచి కూడా.. ఈ స‌మ‌స్య ఉంది.అప్ప‌ట్లోనే ఇక్క‌డి ప్ర‌జాప్ర‌తినిధులు.. అనేక రూపాల్లో ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని వేడుకున్నారు.దీంతో గ‌తంలో ఎన్టీఆర్ హ‌యాంలోనే బుడ‌మేరును ఆనుకుని ఉన్న ఆవాసాల‌ను తొల‌గించ‌డంతోపాటు.. బుడ‌మేరుకు అడ్డంకు లు లేకుండా చేసే ప్ర‌య‌త్నాలు సాగాయి.అయితే.. ఇవి పూర్తిగా ముందుకు సాగ‌లేదు. దీనికి కార‌ణం.. స్థానిక ఓటు బ్యాంకు.. స‌హా క‌బ్జాల ప‌ర్వ‌మే. వ్యాపారాలు..ఎక్కువ‌గా జ‌రిగేది కూడా..ఈ బుడ‌మేరును ఆనుకుని నిర్మించిన స‌ముదాయాల్లోనే కావ డం విశేషం. అంతేకాదు.. బుడ‌మేరుకు చుట్టుప‌క్క‌ల అంతా కూడా ఆక్ర‌మ‌ణ‌లే క‌నిపిస్తాయి.ఇప్పుడు అప్పుడు అనే తేడా లేకుండా.. ఇక్క‌డి వారికి రాజ‌కీయంగా బ‌ల‌మైన మ‌ద్ద‌తు కూడా ఉంది. అందుకే బుడ‌మేరు ఆక్ర‌మ‌ణ‌లు మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా ముందుకు సాగుతున్నాయి. అంతేకాదు.. ప్ర‌తి చోటా బుడ‌మేరును ఆనుకుని నిర్మించిన భారీ సౌధాల‌తో ఈ ఏరు నానాటికీ కుంచించుకు పోయింది. దీంతో బుడ‌మేరు ప‌రిస్థితి దీనం గా మారింది. బుడ‌మేరు పొంగ‌కుండా వేసిన క‌ట్ట‌ల‌ను తొలిచేసి ఆక్రమించుకుని ఆల‌యాలు క‌ట్టిన ప‌రిస్థితి.. వీటికి రాజ‌కీయ నేత‌ల మ‌ద్ద‌తు ఉన్న ప‌రిస్థితి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మొత్తంగా చూస్తే.. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకుంటు న్నామ‌ని.. బుడ‌మేరు క‌ట్ట‌ను ప‌టిష్టం చేస్తున్నామ‌ని చెబుతుండ‌డ‌మే త‌ప్ప‌..చేసిన ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు.దీనికి కార‌ణం..ఫ‌క్తు రాజ‌కీయాలే. ఇప్పుడు మున‌క‌ను చూసైనా.. ప్ర‌భుత్వం మేల్కొంటే మంచిది. క‌నీసం.. శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న‌.. చ‌ర్య‌లు చేప‌ట్టి బుడ‌మేరుకు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించాల్సి ఉంది.

👉 బెంగాల్‌లో మళ్లీ వేధింపుల కలకలం..!!!

భిర్బుమ్‌లో నర్సుకు వేధింపులు…కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ రాజధాని కొల్‌కతా ఆర్‌జి కర్‌ మెడికల్‌ కాలేజీలో జూనియర్‌ వైద్యురాలు హత్యాచారానికి గురైన ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగతున్న సమయంలోనే ఈ రాష్ట్రంలోనే ఒక నర్సు నైట్‌షిఫ్టులో వేధింపులను ఎదుర్కోవడం కలకలం రేపుతోంది. భిర్భుమ్‌ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. చోటోచక్‌ గ్రామానికి చెందిన అబ్బాస్‌ ఉద్దిన్‌కు జ్వరం రావడంతో అతడి కుటుంబసభ్యులు శనివారం రాత్రి 8.30 గంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతడిని పరీక్షించిన వైద్యులు సెలైన్‌ ఎక్కించడం కోసం వార్డుకు తరలించారు.అక్కడ విధుల్లో ఉన్న ఓ మహిళా నర్సు అతడికి సెలైన్‌ బాటిల్‌ ఎక్కిస్తుండగా ఆ రోగి అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. తనను అభ్యంతరకంగా తాకడంతో పాటు అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు ఫిర్యాదులో తెలిపారు.రోగి చేష్టలతో తాను భయభ్రాంతులకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.వైద్యులు హెచ్చరించినా అతడు వినిపించుకోలేదు. దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.👉👉👉సిటీ స్కాన్‌కు వెళ్తే బాలికపై..రాష్ట్రంలోని హవ్‌డాలో మరో ఘటన వెలుగుచూసింది. ఓ 14 ఏళ్ల బాలికపై ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ వేధింపులకు పాల్పడ్డాడు. నిమోనియాతో బాధపడుతున్న ఆమె హౌరా సర్దార్‌ ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ కోసం వెళ్లగా.. ల్యాబ్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆమెతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. భయంతో బాలిక కేకలు వేయడంతో గమనించిన కుటుంబసభ్యులు ఆమెను రక్షించారు. ఈ ఘటనతో బాధితురాలి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. నిందితుడిపై దాడికి యత్నించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు.

👉👉👉 ఒక వ్యక్తి నిందితుడు అయినంత మాత్రాన అతడి ఇంటిని కూల్చివేయలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.నిందితుల స్థిరాస్థులను రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చివేయడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇళ్లు, భవనాల కూల్చివేతలపై సూచనలు ఇవ్వాలని సంబంధిత వర్గాలను సుప్రీంకోర్టు బెంచ్‌ అడిగింది. అయితే, అనధికార నిర్మాణాలను చట్ట ప్రకారం కూల్చేయవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది.

👉 బాలికల హాస్టల్లో రహస్య కెమెరాల ఘటనపై 2 వారాల్లోగా నివేదిక..సిఎస్‌, డిజిపికి ఎన్‌హెచ్ఆర్‌సి నోటీసులు..గర్ల్స్‌ హాస్టల్‌ వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్‌), డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డిజిపి)కు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్ఆర్‌సి) నోటీసులిచ్చింది. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని బాలికల హాస్టల్‌ వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలు ఉన్నట్లు నివేదించబడిన సంఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్ఆర్‌సి) సుమోటాగా పరిగణనలోకి తీసుకుంది. మహిళల భద్రత, గౌరవ హక్కుపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ.. సిఎస్‌, డిజిపికి కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.

👉👉👉జేసీబీపై ప్రయాణిస్తూ ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు*..ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో జేసీబీ ఎక్కి పర్యటించారు.

కృష్ణలంక, పటమట, యనమలకుదురు, భవానీపురం, రామలింగేశ్వరనగర్, జక్కంపూడిలో ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితిలో… చంద్రబాబు జేసీబీ సాయంతో పర్యటించి బాధితులను పరామర్శించారు. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు. నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, కొన్ని గంటల్లో పరిస్థితిని చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు.ఓ వైపు పరామర్శలు, మరోవైపు సహాయక చర్యలను చంద్రబాబు సమాంతరంగా పర్యవేక్షిస్తూ ముందుకు సాగారు. అక్కడిక్కడే అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు.*మొద్దు నిద్ర వీడకుంటే ఎలా? – అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..విజయవాడ* *వరద ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు.**సహయక చర్యల్లో అధికారుల తీరుపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.**తానే స్వయంగా రంగంలోకి దిగినా అధికారుల మొద్దు నిద్ర వీడకుంటే ఎలా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.**అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యంపై మండిపడ్డారు.**పలువురు అధికారులు ఉద్దేశపూర్వకగానే పంపిణీ సక్రమంగా జరగకుండా చేస్తున్నారని సమీక్షలో చర్చ జరిగింది. దీనిపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.*వరద ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల్లో అధికారుల తీరుపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ జాఢ్యాన్ని వదిలించుకోకుంటే సహించేదే లేదని హెచ్చరించారు. బాధితులకు సహయ చర్యల విషయంలో ఇప్పటికీ కొందరు అధికారులు అలసత్వాన్ని వీడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పని తీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలని సూచించారు.తానే స్వయంగా రంగంలోకి దిగినా అధికారుల మొద్దు నిద్ర వీడకుంటే ఎలా అంటూ అధికారులకు సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యంపై సమావేశంలో సమీక్షించారు. బుడమేరు ముంపు ప్రాంతంలో డ్యూటీలో ఉన్న కొందరు ఉన్నతాధికారుల కారణంగా పంపిణీలో జాప్యం అని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. నాడు జగన్ భక్త అధికారులుగా ముద్రపడి, నాడు వైకాపాతో అంటకాగిన అధికారులు డ్యూటీలో ఉన్న చోట సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు.పంపిణీ సక్రమంగా, వేగంగా జరగకుండా ఉద్దేశపూర్వకంగా ఆయా అధికారులు వ్యవహరిస్తున్న విషయం గుర్తించామని మరో మంత్రి చెప్పారు. క్షేత్ర స్థాయి పర్యటనలో స్వయంగా తన పరిశీలనకు వచ్చిన అంశాలను రాసుకుని వచ్చి మంత్రి సీఎంకు ఇచ్చారు. వీఆర్లో ఉన్న డీఎస్పీ నుంచి డిఐజీ స్థాయి అధికారులు వరద బాధిత ప్రాంతాల్లో డ్యూటీకి వచ్చారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఉద్దేశ్యంతో ఆయా అధికారులు సహాయ చర్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆటంకాలు కల్పిస్తున్నారని సీఎం సమీక్షలో చర్చ జరిగింది.వివిధ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం వీఆర్లో ఉన్న కొల్లి రఘురామిరెడ్డి, విజయారావు, రఘువీరా రెడ్డి, శ్రీకాంత్, సత్యానంద్, గోపాలకృష్ణ వంటి అధికారులకు అక్కడ డ్యూటీలో ఉన్నారన్నారు. మంత్రి చెప్పిన సమాచారాన్ని తీవ్రంగా తీసుకున్న సీఎం ఆయా అధికారులు డ్యూటీలో ఉన్న ప్రాంతంలో పంపిణీకి ఆలస్యంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వీఆర్లో ఉన్న ఆ అధికారులకు బందోబస్తులో భాగంగా అక్కడ డ్యూటీలు వేశామని అధికారులు తెలిపారు. పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లాలని ప్రజలు బాధల్లో ఉన్న సమయంలో ఇలాంటి పోకడలను సహించేది లేదని హెచ్చరించారు.వరద పరిస్థితులపై చంద్రబాబు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టారు. అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వరుసగా ఆయన సమీక్షలు నిర్వహిస్తూ సహాయ చర్యల గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు ఇస్తున్నారు.👉అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి:* పునరావాస కేంద్రాలకు వచ్చే వారికి దుస్తులు సిద్ధంగా ఉంచాలని చంద్రబాబు ఆదేశించారు. బాధితుల సెల్ఫోన్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. కమ్యూనికేషన్లో అంతరాయం ఏర్పడకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆహారంతో పాటు పండ్ల పంపిణీకి కూడా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. రానున్న రెండు రోజుల్లో బాధితులకు అందించేందుకు కూరగాయలు కూడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. సమస్యను రెండు మూడు రోజుల పాటు ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.బోట్లలో వెళ్లడానికి అవకాశం లేని పరిసరాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మూడు పూటలా బాధితులకు ఆహారం అందించాలని సూచించారు. హార్ట్ పేషెంట్లు, చిన్నారులు, గర్భిణులను పునరావాస కేంద్రాలకు తరలించడానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలని ఆదేశాలిచ్చారు. ఒకే ప్రాంతంలో సాయం అందించడం కాకుండా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లాలని చెప్పారు. కృష్ణానదికి వస్తున్న వరదనీటిపైనా సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నానికి కొంతమేరకు వరద ప్రవాహం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. లంకగ్రామాల్లో సమస్యలపై స్థానిక అధికారులను అప్రమత్తం చేయమని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.👉నాతో సహా అందరూ బృందాలుగా ఏర్పడాలి:* అంతకుముందు వరద సహాయక చర్యలపై ఉదయం సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చానని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ హామీ నిలబెట్టుకునే దిశగా యంత్రాంగం పనిచేయాలన్నారు. కృష్ణానది కరకట్టపై వెంకటపాలెం వద్ద గండి పడే పరిస్థితిపై ఆరా తీశారు. గండిని పూడ్చగలిగామని చంద్రబాబుకు అధికారులు వివరించారు. రాజధాని రైతులు స్వచ్ఛందంగా చూపిన చొరవను ఆయన అభినందించారు. కరకట్ట వెంట గండి పడే ప్రాంతాల గుర్తింపునకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. తనతో సహా అధికారులంతా బృందంగా ఏర్పడాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

👉హోంమంత్రి నివాసాన్ని చుట్టుముట్టిన వరద- ‘నా కంటే ముందు సామాన్యులకు సాయం చేయండి’*
*విజయవాడను వరదల్లో హోంమంత్రి అనిత నివాసం కూడా జలమయమైంది.*
*ఈ క్రమంలోనే విపత్తు బృందం అక్కడికి చేరుకుంది. కానీ, ఆమె తన ఇంటి వద్ద కంటే ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.*
విజయవాడలో భారీ వర్షాలకు హోం మంత్రి అనిత నివాసాన్ని వరద చుట్టుముట్టింది. దీంతో ఆమె తన పిల్లల్ని ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి పంపించారు. రామవరప్పాడు వంతెన కింద ఆమె ఉండే కాలనీ జలదిగ్బంధమైంది. ఆదివారం నుంచి అనిత నివాసం వరద ముంపులోనే ఉంది. అయినా ఆమె సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
మరోవైపు విపత్తు నిర్వహణ బృందం అనిత ఇంటి వద్దకు చేరుకుంది. కానీ ఆమె తన ఇంటి వద్దకంటే ముంపు ప్రాంతాల్లో ముందు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కాలనీలో ఇతర కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తన ఇంటి కోసం వచ్చిన సహాయక బృందాన్ని సింగ్నగర్ వైపు పంపించారు.
ఆదివారం ఉదయం బుడమేరు కట్ట తెగిపోవటంతో ఒక్కసారిగా వరద నీరు విజయవాడ నగరాన్ని ముంచెత్తిందని హోంమంత్రి అనిత తెలిపారు. నగరంలోని 8 డివిజన్లతో పాటు గన్నవరం, మైలవరం, విజయవాడ తూర్పు పరిధిలోని కొన్ని ప్రాంతాలు కూడా వరద తాకిడికి గురయ్యాయన్నారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల పరిధిలో 24 కాలనీలు 70 సచివాలయాలు ఉన్నాయని చెప్పారు. ప్రతీ సచివాలయం పరిధిలో ఒక ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించామని అనిత వెల్లడించారు.
యుద్ధ ప్రాతిపదికన 5,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అనిత తెలిపారు. మిగిలిన వారిని తరలించేందుకు పడవల సమస్య ఉండటంతో కేంద్ర సాయం కోరామని పేర్కొన్నారు. విజయవాడ నగరం సాధారణ స్థితికి వచ్చి జనజీవనం మామూలుగా సాగేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అంత వరకూ ముఖ్యమంత్రి సహా ఏ ఒక్కరూ కదలకూడదని నిర్ణయించామన్నారు. దాదాపు 2 లక్షల మందికి యుద్ధ ప్రాతిపదికన ఆహారం పంపిణీ చేపట్టామని అనిత వెల్లడించారు.*జలవనరులశాఖ నిద్రపోవడంతోనే ఈ దుస్థితి:* విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరద నీటిని ఎక్కడికి ఎత్తి పోయాలన్నది ఇప్పుడు ప్రధాన సవాల్ గా మారిందని అనిత చెప్పారు. మంత్రి రామానాయుడు నేతృత్వంలో జలవనరుల శాఖ దీనిపై క్షేత్రస్థాయిలో నిర్విరామంగా పనిచేస్తోందని వెల్లడించారు. గత 5 ఏళ్లు జలవనరుల శాఖ నిద్రపోవడం వల్లే ఇప్పుడు వరద నీరు ఎటు పంపాలో అర్ధంకాని పరిస్థితి తలెత్తిందని అనిత వ్యాఖ్యానించారు.

👉ఏపీ ప్రభుత్వం ఏం చేయాలో అదే చేస్తోంది: నారా భువనేశ్వరి*…రాష్ట్రంలో వరద పరిస్థితులు, సీఎం చంద్రబాబు అహోరాత్రాలు సమీక్షలు చేపడుతూ, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న తీరు పట్ల ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి స్పందించారు.
ప్రకృతి విపత్తులను ఆపడం మన చేతుల్లో ఉండదని… కాకపోతే అలాంటి సమయాల్లో వేగంగా స్పందించి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సహాయక చర్యలు అందిస్తే… ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించుకోవచ్చని, బాధితులకు భరోసా కల్పించవచ్చని సూచించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అదే చేస్తోందని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.”ముఖ్యమంత్రి అయ్యుండి చంద్రబాబు స్వయంగా బాధితుల వద్దకు వెళ్లారు. బాధితులకు ఆహారం, నీరు అందించి ధైర్యం చెప్పారు. సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాల్లోనూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా తన వంతు సాయంగా రంగంలోకి దిగుతోంది. ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాను. దాంతోపాటే వాలంటీర్స్ తమ వంతు సహాయం చేయాలని అని కోరుతున్నాను” అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
👉వరదకు ఎదురీది…*వరద ప్రాంతాల్లో మంత్రి సవితమ్మ పర్యటన**• బోటులో వెళ్లి బాధితులను ఒడ్డుకు చేర్చిన మంత్రి..*• నడుం లోతు నీటిలో బాధితులకు పరామర్శ**• అన్ని విధాలా ఆదుకుంటామంటూ భరోసా..*• చంద్రబాబు స్ఫూర్తితో బాధితులకు అండగా ఉందామంటూ వైద్య సిబ్బందికి, అంగన్వాడీలకు మంత్రి సవిత సూచన*
*అమరావతి :* ఊళ్లకు ఊళ్లు మింగేసిన కృష్ణమ్మ ఉగ్రరూపంతో ఉప్పొంగుతోంది. గజ ఈతగాళ్ల సైతం కడలిలా ఎగిసి పడుతున్న కష్ణమ్మను చూసి నీరుగారిపోయారు. ఇవేవీ ఆమెను భయపట్టలేక పోయాయి… సీఎం చంద్రబాబు అప్పగించిన బాధ్యత… వరద ఉధృతిలో చిక్కుకున్న బాధితులను రక్షించాలనే ఆమె కర్తవ్యం ముందు ఉగ్ర కృష్ణమ్మ చిన్నబోయింది. కన్నీటి సంద్రంలో భవిష్యత్తు కొట్టుకుపోయిందని కన్నీరుమున్నీరవుతున్న ఆ బతుకుల్లో ఆమె మాటలు భరోసా నింపాయి. భయం లేదు… మేమున్నామన్న ఆ భరోసా.. కృష్ణమ్మ కడలిలో చిక్కుకున్న బాధితులకు ఆపన్నహస్తమైంది… మహామహులు సైతం వరద ఉధృతిని చూసి బెంబేలెత్తిపోయినా ఆమె వెరవలేదు. మొక్కవోని ధైర్యంతో… బోటు మీద వెళ్లి వరదలో చిక్కుకున్న వారినిని కృష్ణమ్మ ఒడ్డుకు చేర్చారు. ఇదీ పామర్రు, పెనమలూరులో రాష్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యుల ఎస్.సవితమ్మ పర్యటన దృశ్యాలు. గతంలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలను కృష్ణమ్మ ముంచేసింది. గంటల వ్యవధిలో విజయవాడ, కృష్ణా నదీపరివాహక ప్రాంతాల్లో తాము కట్టుకున్న కలల సౌధాలు, భవనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వేలాది మంది కృష్ణమ్మ వరద ఉధృతిలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు రెండ్రోజుల నుంచి విజయవాడ కలెక్టరేట్ నుంచి సమీక్షలు నిర్వహిస్తూ…వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి దిశా నిర్దేశం చేస్తున్నారు. పునరావాసా కేంద్రాలను ఏర్పాటుచేసి, బాధితులకు భోజనం, వసతి సౌకర్యం కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనల మేరకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత పెనమలూరు, పామర్రు ప్రాంతాల్లోని వరద ప్రాంతాల్లో పర్యటించారు. రామలింగేశ్వర్ నగర్, తాడికొండలో మున్సిపాల్టీలో వడ్డేరు కాలనీ, హెచ్పీ గ్యాస్ గోడౌన్ కాలనీ, మాదు తిరుపతిరావునగర్ తదితర ప్రాంతాల్లో నడుం లోతుల్లో నీటిలో పర్యటించారు. వరద బాధితులకు బిస్కట్లు, రొట్టెలు పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరద ఉధృతి పెరిగే ప్రమాదముందని తక్షణమే ఇళ్లు ఖాళీ చేయాలని కోరారు. ప్రభుత్వం పునరావాసా కేంద్రాలు ఏర్పాటు చేసింద, భోజన, వసతి సౌకర్యా లు కల్పించిందని, వరదలు తగ్గే వరక అక్కడ ఉండాలని వరద బాధితులకు మంత్రి సవిత కోరారు.
*వరదకు ఎదురీది…వరద బాధితులకు ఒడ్డుకు చేర్చి…*
కేవలం పర్యటనలు, ఓదార్పు మాటలతో సరిపెట్టకుండా మంత్రి సవిత రంగంలోకి దిగారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదలో చిక్కుకున్న బాధితులను రక్షించడానికి స్వయంగా బోటులో వెళ్లి ఒడ్డుకు చేర్చారు. తాడికొండలో పర్యటన అనంతరం అక్కడి నుంచి పెనమలూరులోని వరద ప్రాంతాల్లో మంత్రి సవిత పర్యటించారు. మంత్రిని చూసిన గణపతినగర్, శ్రీనగర్ కాలనీలోని ప్రజలు రక్షించాలంటూ కేకలు వేశారు. తొలుత శ్రీనగర్ కాలనీలో కాలనీ వాసులతో పాటు బాలింత, రెండు నెలల పసికందు కూడా వరద నీటిలో చిక్కుకున్నట్లు తెలిసిన మంత్రి సవిత… ఎస్డీఆర్ ఎఫ్ సిబ్బందితో మాట్లాడారు. వారు ఏర్పాటు చేసిన బోటులో స్వయంగా మంత్రి సైతం శ్రీనగర్ కాలనీలో పర్యటించారు. బోటులోనే ఇంటింటికీ వెళ్లి మంత్రి పాలు ప్యాకెట్లు అందజేశారు. చిన్నారులను, మహిళలను తాను ఎక్కిన బోటులోనే ఒడ్డుకు చేర్చారు. అక్కడి నుంచి గణపతి నగర్ చేరుకున్న మంత్రి..అక్కడ కూడా ఎస్డీఆర్ ఎఫ్ సిబ్బంది ఏర్పాటు చేసిన బోటులో వెళ్లి వరద బాధితులకు ఒడ్డుకు చేర్చారు. తిరుగు పయనంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కలిసి పెనమలూరులోని వరద ప్రాంతాల్లో భారీ పడవపై పర్యటించి, వరద బాధితులను పెద్ద సంఖ్యలో ఒడ్డుకు చేర్చారు..*చంద్రబాబు ఉన్నారు భయమొద్దు…*
వరద బాధితులను ఆదుకోడానికి సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. పామర్రులోని వల్లూరుపాలెం, తొట్లవల్లూరు జెడ్పీ హైస్కూళ్లో ఏర్పాటు చేసిన పునరా వాసా కేంద్రాలను ఎమ్మెల్యే వర్ల కుమార రాజాతో కలిసి మంత్రి సందర్శించారు. కన్నీటి పర్యాంతమైన బాధితులను మంత్రి ఓదార్చారు. ‘ఏం భయపడాల్సిన అవసరంలేదని, సీఎం చంద్రబాబు మిమ్మళ్ని ఆదుకోడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, ముందు ప్రాణ నష్టం కలుగుకుండా చర్యలు తీసుకున్నా మని, రాబోయే రోజుల్లో ఆస్తి నష్టాలను అంచనా వేసి, నష్టపరిహారం కూడా చెల్లిస్తామని’ మంత్రి తెలిపారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పునరావాసా కేంద్రాల్లో రెండ్రో జులు సేద తీరాలని, సొంత గ్రామాలకు తప్పనిసరిగా తరలిస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే కుమార రాజా మాట్లాడుతూ, మంత్ర సవితను చంద్రబాబు పంపారని, భయపడాల్సిన పనిలేదని అన్నారు. తాను కూడా 24 గంటలూ మీతోనే ఉంటానని, ఏ కష్టమొచ్చినా ఆదుకోడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
*బాధితుల కోసం 24 గంటలూ పనిచేద్దాం…*
పామర్రులోని వల్లూరుపాలెం, తొట్లవల్లూరు జెడ్పీ హైస్కూళ్లో ఏర్పాటు చేసిన పునరావాసా కేంద్రాలను పరిశీలించిన మంత్రి సవిత…అక్కడున్న వైద్య సిబ్బందితోనూ, అంగన్వాడీ కార్యకర్తలతోనూ మాట్లా డారు. బాధితులకు అండగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు రెండు రోజుల నుంచి నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారన్నారు. వైద్య సిబ్బంది, అంగన్వాడీలు కూడా చంద్రబాబు బాటలో నడుస్తూ, వరద బాధితులకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి కోరారు. మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ…బాధితుల్లో మనో ధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. వైద్య శిబిరాల్లో అందుబాటులో ఉంచిన మందులను పరిశీలించారు.
*రైతులకు అండగా ఉంటాం*..అనంతరం తొట్లవల్లూరులో తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. వరద బాధితుల కోసం రేయింబవళ్లు కృషి చేస్తున్నామన్నారు. పునరావాసా కేంద్రాలను ఏర్పాటు చేశామని, భోజనంతో పాటు వసతి సౌకర్యాలను ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు. పునరావాసా కేంద్రాల్లో వైద్య శిబి రాలను ఏర్పాటు చేశామన్నారు. వరదలు తగ్గగానే పంట నష్టాలతో ఆస్తి నష్టం లెక్కిస్తామన్నారు. బాధితులందరికీ న్యాయం చేయాలనే దృక్పథంతో సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు. రైతులకు న్యాయం జరిగేలా పంట నష్టం వివరాలు అంచనా వేస్తామన్నారు. మంత్రి పర్యటనలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఉన్నారు.
👉👉ముంపు గ్రామాల్లో జగన్ కు షాకిచ్చిన మహిళ*
వైసీపీ అధినేత జగన్ కు ఓ మహిళ షాకిచ్చింది.విజయవాడలోని సింగ్ నగర్ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటించారు. ఈ క్రమంలో ‘ఏమ్మా..మీకు ప్రభుత్వం నుంచి అన్ని సదుపాయాలూ అందుతున్నాయా..’ అని అడగ్గా.. ‘ ప్రతి ఇంటి దగ్గర
పీకల్లోతు నీళ్లున్నాయి. పాపం వాళ్లయినా ప్రతి ఇంటికి ఎలా వస్తారు? అని ఓ బాధితురాలు సమాధానమిచ్చింది. దీంతో జగన్ షాక్ కు గురయ్యారు.
👉👉👉వరదల సహాయం కోసం ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.*సాయం కావాల్సిన, ఆపదలో ఉన్నవారు ఫోన్ చేయొచ్చని అధికారులు తెలిపారు. వీఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ – +91 81819 60909, వీఎంసీ ల్యాండ్లైన్ నెంబర్ – 0866-2424172, 0866-2427485, కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెం. – 0866-2575833, కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెం. 18004256029, కలెక్టరేట్ టోల్ఫ్రీ నెం. 112 , 1070

👉భారీ వరదలు.. విజయవాడలో హెల్ప్‌లైన్ నంబర్లు ఇవేభారీ వరదలు.. విజయవాడలో హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..వరద ఉధృతితో నీట మునిగిన విజయవాడలో బాధితుల కోసం ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. 81819 60909, 0866-2424172, 0866-2575833, 18004256029 నంబర్లకు కాల్ చేసి తమ సమస్యలు తెలియజేయాలని ప్రభుత్వం తెలిపింది.

👉చెరువుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌గా రంగనాథ్‌!… హైడ్రా’ కమిషన్ రంగనాథ్‌ను HMDA పరిధిలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన కమిటీకి ఛైర్మన్‌గా నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ORR వరకు ఉన్న జలవనరుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ పరిధిలోని 7 జిల్లాల్లో ఉన్న చెరువులను పరిరక్షించే బాధ్యతలను కూడా హైడ్రాకు అప్పగించాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

👉ఏపీకి వైజయంతీ మూవీస్ రూ.25 లక్షల విరాళం.. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. తమ వంతు సాయంగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది. ‘ఈ రాష్ట్రం మాకెంతో ఇచ్చింది. ప్రకృతి పరంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇప్పుడు మేం కొంత తిరిగి ఇవ్వాలనుకున్నాం. ఇది మా బాధ్యత’ అని పేర్కొంది.

👉👉👉1980,90 లలో కూడా వర్షాలు ఇలాగే పడేవి..కాకపోతే ఎలాంటి వరద అయినా దాని దారి దానికి ఉండేది,వెళ్ళేది..ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆనే ఒక వ్యాపారం వచ్చాక ఎక్కడ ఉన్నా భూమిలో కూడా బిల్డింగులు, కట్టడాలు, ఇండ్లు, ఎట్లా పడితే అట్లా కట్టుకొని దాని జగాను కబ్జా చేసి..మళ్లీ పై నుంచి ఇంతా వాన అంతా వాన, సెంటీమీటర్ల లెక్కలు చెప్పుకుంటూ ప్రకృతి నీ తప్పు పట్టుకుంటూ సిగ్గుండాలే కొంచమైన.. ప్రకృతి దాని పని అది చెస్తుంది…మనుషులే మారాలి.. లేకపోతే అనుభవించాలి అంతే…
👉డ్రోన్ ద్వారా భోజనం.. వాళ్లను కాపాడేందుకు రాత్రంతా సహాయక చర్యలు…నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న దుందుభి వాగులో పదిమంది వ్యక్తులు చిక్కుకున్నారు. వాగులో చిక్కుకున్న వారిని రాత్రి నుంచి కాపాడేందుకు అచ్చంపేట దేవరకొండ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి డ్రోన్ ద్వారా పోలీసులు భోజనం పంపించారు. రాత్రంతా సహాయక చర్యల్లో నిమగ్నమైన పోలీసులు సంబంధిత సిబ్బంది. తాళ్ల సహాయంతో నలుగురిని బయటికి తీసుకొచ్చిన రిస్క్యూటివ్. మరో ఆరుగురిని కాపాడేందుకు రిస్క్యూ టీం, పోలీసులు.. ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

👉 బెంగాల్‌లో మళ్లీ వేధింపుల కలకలం..!!!
భిర్బుమ్‌లో నర్సుకు వేధింపులు…కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ రాజధాని కొల్‌కతా ఆర్‌జి కర్‌ మెడికల్‌ కాలేజీలో జూనియర్‌ వైద్యురాలు హత్యాచారానికి గురైన ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగతున్న సమయంలోనే ఈ రాష్ట్రంలోనే ఒక నర్సు నైట్‌షిఫ్టులో వేధింపులను ఎదుర్కోవడం కలకలం రేపుతోంది. భిర్భుమ్‌ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. చోటోచక్‌ గ్రామానికి చెందిన అబ్బాస్‌ ఉద్దిన్‌కు జ్వరం రావడంతో అతడి కుటుంబసభ్యులు శనివారం రాత్రి 8.30 గంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతడిని పరీక్షించిన వైద్యులు సెలైన్‌ ఎక్కించడం కోసం వార్డుకు తరలించారు.అక్కడ విధుల్లో ఉన్న ఓ మహిళా నర్సు అతడికి సెలైన్‌ బాటిల్‌ ఎక్కిస్తుండగా ఆ రోగి అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. తనను అభ్యంతరకంగా తాకడంతో పాటు అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు ఫిర్యాదులో తెలిపారు.రోగి చేష్టలతో తాను భయభ్రాంతులకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.వైద్యులు హెచ్చరించినా అతడు వినిపించుకోలేదు. దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.👉👉👉సిటీ స్కాన్‌కు వెళ్తే బాలికపై..రాష్ట్రంలోని హవ్‌డాలో మరో ఘటన వెలుగుచూసింది. ఓ 14 ఏళ్ల బాలికపై ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ వేధింపులకు పాల్పడ్డాడు. నిమోనియాతో బాధపడుతున్న ఆమె హౌరా సర్దార్‌ ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ కోసం వెళ్లగా.. ల్యాబ్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆమెతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. భయంతో బాలిక కేకలు వేయడంతో గమనించిన కుటుంబసభ్యులు ఆమెను రక్షించారు. ఈ ఘటనతో బాధితురాలి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. నిందితుడిపై దాడికి యత్నించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు.
👉👉👉 ఒక వ్యక్తి నిందితుడు అయినంత మాత్రాన అతడి ఇంటిని కూల్చివేయలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.నిందితుల స్థిరాస్థులను రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చివేయడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఇళ్లు, భవనాల కూల్చివేతలపై సూచనలు ఇవ్వాలని సంబంధిత వర్గాలను సుప్రీంకోర్టు బెంచ్‌ అడిగింది. అయితే, అనధికార నిర్మాణాలను చట్ట ప్రకారం కూల్చేయవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది.
👉 బాలికల హాస్టల్లో రహస్య కెమెరాల ఘటనపై రెండు వారాల్లోగా నివేదిక..

సిఎస్‌, డిజిపికి ఎన్‌హెచ్ఆర్‌సి నోటీసులు..
గర్ల్స్‌ హాస్టల్‌ వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్‌), డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డిజిపి)కు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్ఆర్‌సి) నోటీసులిచ్చింది. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని బాలికల హాస్టల్‌ వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలు ఉన్నట్లు నివేదించబడిన సంఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్ఆర్‌సి) సుమోటాగా పరిగణనలోకి తీసుకుంది. మహిళల భద్రత, గౌరవ హక్కుపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ.. సిఎస్‌, డిజిపికి కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.

7k network
Recent Posts

మంత్రి సీతక్క జిల్లాలో మహిళకు దక్కని న్యాయం..మత సామరస్యం ప్రతీ ఒక్కరూ పాటించాలి: KLR..పవన్ కళ్యాణ్ కి వరల్డ్ రికార్డ్స్..ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటోన్న ఎంపీ మిథున్ రెడ్డి..ఘనంగా ఎస్ డబ్ల్యూఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం..మార్కాపురం డిఎస్పీగా నాగరాజు .. ప్రకాశంజిల్లాలో 13 మంది ఎస్ఐ లకు స్థాన చలనం.. జూదరుల అరెస్టు..50 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం

ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు !..జగన్మోహన్ రెడ్డి కి హైడ్రా అధికారుల నోటీసులు..వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం..సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: కేజ్రీవాల్.. సీతారాం ఏచూరి మృతి పట్ల పలువురి సంతాపం..అక్రమ రేషన్ బియ్యం నిల్వలను పట్టుకున్న పోలీసులు..వంట నూనెలను మంట నూనెలు గా మార్చిన మోడీ ప్రభుత్వం.. అక్రమ రేషన్ బియ్యం నిల్వలను పట్టుకున్న పోలీసులు..బీజేపీలో నేతల మధ్య తీవ్రమవుతున్న కలహాలు.. మరో మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్.. ఎస్సై పై హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో కేసు..ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్ల తొలగింపులో ఎందుకింత ఆలస్యం?…

వైసీపీ అధినేత నోటి వెంట పాపం పవన్ అన్న మాట..!కోమాలో ఉన్న కానిస్టేబుల్ కోసం 10 లక్షల వైద్య సహాయం అందజేసిన పవన్ కళ్యాణ్.. ఆస్తికోసం సినిమా ఫక్కీలో బావ మరిదిని హత్య! చేసిన బావ..ఏపీలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జాప్యంతో విద్యార్థుల ఆందోళన..ప్రకాశం బ్యారేజ్ బొట్ల పరిస్థితి! అధికారులకు మళ్లీ నిరాశే.. .

క్రీం+బన్ = క్రీమ్-బన్…నిర్మలమ్మపై కామెంట్స్ వర్షంలో బిగ్ టర్న్!..గుంటూరు నగరంలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి..సిబ్బంది వేదింపులు భరించలేక కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..ఆధార్ ఉచిత గడువు మరోసారి పొడిగింపు..గిద్దలూరులో జాతీయ లోక్ అదాలత్.

ఏపీ గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి కోసం ఏసీబీ గాలింపు..జనసేనలోకి బాలినేని..వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చిన మంగళగిరి పోలీసులు..మాదాపూర్‌లో పెట్టుబడుల పేరుతో మోసం..నటి జత్వానీ కేసులో ఏసీపీ, సీఐపై సస్పెన్షన్ వేటు..కొడుకు ప్రేమ వివాహం – తల్లిని కట్టేసి చిత్రహింసలు ..పొదిలిలో నిఘా నేత్రాలు.

ఏచూరి పార్థివదేహానికి నివాళులర్పించనున్న చంద్రబాబు..తాడేపల్లి టీడీపీలో బయట పడ్డ విభేదాలు..మంత్రి నారా లోకేష్ ని కలిసి విరాళాలు అందజేసిన పలువురు ప్రముఖులు..మా భూమిని కబ్జా చేశారు..పర్మిషన్ ఇస్తే పాకిస్థాన్ వెళ్లిపోతాం..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట.