ఒకేసారి 4,000 మంది స్టీల్ ప్లాంట్ కార్మికుల తొలగింపు?.. కొనసాగుతున్న నిరసనలు….జగన్ పక్కన పెట్టడంతో రూటు మార్చిన మోహన్ బాబు!…ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర!..హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు..దేవర’ మూవీని బ్యాన్ చేయనున్న బీజేపీ ప్రభుత్వం ?..అమరావతిలో రూ.250 కోట్లతో 400 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి..పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన నూకసాని బాలాజీ..కంభం సర్కిల్ ఎక్సైజ్ సీఐగా కొండారెడ్డి.. కంభం అర్ధవీడు మండలాలలో అక్రమ మద్యం స్వాధీనం.

👉ఒకేసారి 4,000 మంది స్టీల్ ప్లాంట్ కార్మికుల తొలగింపు?..*ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు కొనసాగుతున్న వేళ కార్మికులకు భారీ షాక్ తగిలింది. ఏకంగా 4వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను
తొలగించినట్లు సమాచారం. వారి గేట్ పాస్ లను వెనక్కి తీసుకోవాలని వివిధ విభాగాల్లోని కాంట్రాక్టర్లకు,సూపర్ వైజర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న కార్మికులు ఆందోళనకు దిగారు. తొలగింపు ప్రక్రియను నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు.
👉స్టీల్ ప్లాంట్ సీఐటీయూ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో పాదయాత్ర..
ప్లాంట్ ను పూర్తిస్థాయిలో నడపాలి..
నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్..
1,326 రోజులుగా కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన దీక్షలు..
స్టీల్ ప్లాంట్ నుంచి శిబిరం వరకు వడ్లపూడి, కణితి, శ్రీనగర్, పాతగాజువాక, పెద గంట్యాడ వరకు పాదయాత్ర..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలని డిమాండ్..
*లడ్డూ పెట్టిన మంట.. టీ-బీజేపీ వర్సెస్ వైసీపీ!..
*కౌంటర్లు మీద కౌంటర్లు వేసుకుంటున్న ..మాధవి లత… నాని..ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు పక్క రాష్ట్రాలకు కూడా పాకుతోంది.
తాజాగా తెలంగాణ బీజేపీ నేత మాధవీలత తీరుపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.
మాధవీలత రైళ్లో భజన చేసుకుంటూ తిరుమల రావటంపై విమర్శలు గుప్పించారు.భజన చేసుకోవాలంటే ఆమె ఆస్పత్రిలో చేసుకోవాలంటూ సైటైర్లు పేల్చారు.
వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసిన ఈ నేతలందరూ.. ప్రధాని మోదీతో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుమలకు వస్తే ఆయనను ఎందుకు డిక్లరేషన్ అడగలేదని ప్రశ్నించారు.మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి వారు కూడా డిక్లరేషన్ తీసుకునే.. ఆలయానికి వచ్చారు..అని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు…
👉 హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు.. పేదలను ముందు పెట్టి బిల్డర్స్ ఇష్యూ చేస్తున్నారు.. ఇప్పటి వరకు FTLలో కట్టుకున్న ఇళ్లే కూల్చేస్తున్నాం.. బఫర్ జోన్ లో ఉన్నవాటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు- భట్టి విక్రమార్క.. ఒవైసీ ఆసుపత్రి, జన్వాడ ఫామ్‌హౌస్‌పై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు…*
ఒవైసీ,మల్లారెడ్డి,పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయన్న రంగనాథ్..
విద్యా సంవత్సరం ముగిశాక వాటిపై చర్యలు ఉంటాయని వెల్లడి..ఒవైసీ ఛాలెంజ్ చేస్తున్నారు కదా అంటే అలాంటి వాటిపై నో కామెంట్ అన్న రంగనాథ్..
జన్వాడ 111 జీవో పరిధిలో ఉందన్న హైడ్రా కమిషనర్..
ఒవైసీ ఆసుపత్రిపై,జన్వాడ ఫామ్ హౌస్‌పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.హైడ్రా అధికారులు,మూసీ రివర్ ఫ్రంట్ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు.*ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి ఒవైసీ ఆసుపత్రి గురించి ప్రశ్నించారు.
ఒవైసీ ఆసుపత్రి ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నప్పటికీ,దానిని కూల్చేందుకు హైడ్రా,ప్రభుత్వం భయపడుతుందనే విమర్శలు వస్తున్నాయని,ఒవైసీకి భయపడే విద్యా సంవత్సరం వృథా పేరుతో వారికి ఆరు నెలల సమయం ఇస్తున్నట్లుగా చెబుతున్నారని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. కానీ మీరు కూల్చివేతలు చేసిన చోట పేదలు,చిన్న చిన్న కుటుంబాలు ఉన్నారని,వారిని మాత్రం పట్టించుకోలేదని అడిగారు.*దీనిపై స్పందించిన రంగనాథ్, ఒవైసీది కావొచ్చు,మల్లారెడ్డి కాలేజీ కావొచ్చు,పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలు కావొచ్చు… కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. కానీ అందరికీ సమయం ఇస్తున్నామని తెలిపారు.పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సమయం ఇచ్చామన్నారు.విద్యా సంవత్సరం ముగిశాక వాటిపై చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు.
హైడ్రాను,ప్రభుత్వాన్ని ఒవైసీ ఛాలెంజ్ చేస్తున్నారు.కదా అని సదరు మీడియా ప్రతినిధి తిరిగి ప్రశ్నించారు.అలాంటి వాటిపై నో కామెంట్ అని రంగనాథ్ అన్నారు.
తమ ప్రథమ టార్గెట్ పెద్దవాళ్లేనని స్పష్టం చేశారు.విల్లాస్‌లలో ఉన్నది చిన్నవాళ్లే కావొచ్చు… కానీ వాటి వెనుక పెద్దవాళ్లు ఉన్నారని తెలిపారు.
జన్వాడ ఫామ్ హౌస్‌పై కూడా రంగనాథ్ స్పందించారు.జన్వాడపై తాను మాట్లాడబోనని,ఎందుకంటే అది 111 జీవో పరిధిలో ఉందని, హైడ్రా పరిధిలోకి రాదన్నారు.తమ పరిధిలోనే మాట్లాడుతామని తెలిపారు. 👉ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ దేవర మేనియా కొనసాగుతుంది. ఈ సినిమా నిన్న భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. త్రిపుల్ ఆర్ తర్వాత ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా రావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందులోనూ కొరటాలా శివ ఆచార్య ఫ్లాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ముందుగా అనుకున్న విధంగానే ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి భారీ ప్రభంజనాన్ని సృష్టించింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ సినిమా బాగా నచ్చేసిందని అర్థమవుతుంది. కానీ కొందరికి సినిమా నచ్చలేదని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాను బ్యాన్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని టాక్. ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.
👉‘దేవర’ మూవీని బ్యాన్ చేయనున్న బీజేపీ ప్రభుత్వం ?
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన భారీ బడ్జెట్ మూవీ దేవర.. నిన్న రిలీజై పాజిటివ్ టాక్ ను అందుకుంది. ప్రేక్షకులను అలరించిందని పబ్లిక్ టాక్ వింటే అర్థమవుతుంది. కానీ నార్త్ లో ఈ సినిమాను బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు, ఆ దిశగా రాజకీయ వేత్తలు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.అందుకు కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. దేవర సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది .ఈ సినిమాను నార్త్ లో కూడా రిలీజ్ చేశారు. అక్కడ ప్రమోషన్స్ తెలుగు కన్నా ఎక్కువగానే చేశారు. ఓసారి ముంబైలో ప్రమోషన్స్ చేశారు దేవర టీమ్.👉 ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. సైఫ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ గురించి ప్రశంసలు కురిపించారు.
తన అభిమాన నాయకుడు అని ఆయన పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ మాటలు బీజేపి ప్రభుత్వానికి నచ్చలేదని తెలుస్తుంది. అతని మాటలు రాజకీయాల్లో దుమారం రేపాయి. నిజానికి ఉత్తర భారతదేశంలో బీజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది. అతని మాటలు వారిని నొప్పించాయని అందుకే సినిమాను బ్యాన్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ సినిమాను బ్యాన్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి దేవర టీమ్ దీనిపై స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇకపోతే గతంలో కంగనా రానౌత్ కూడా సినిమా ప్రమోషన్స్ టైంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో తెలియదు కానీ. ఈ వార్త నిజమైతే మాత్రం దేవరకు నష్టం కలిగే పరిస్థితి కనిపిస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 172 కోట్లు రాబట్టిందని దేవర టీమ్ ప్రకటించారు. ఈ వీకెండ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది . సినిమాకు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
👉జగన్ పక్కన పెట్టడంతో రూటు మార్చిన మోహన్ బాబు!..
మంచు మోహన్ బాబు గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల పరంగా మోహన్ బాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన విలక్షణమైన నటనతో మోహన్ బాబు కలెక్షన్ కింగ్ గా తెలుగు నాట అవతరించారు. 90వ దశకంలో, మెగాస్టార్ చిరంజీవి… బాలకృష్ణలకు ధీటుగా సినిమాలు తీసి, తన ఉనికిని చాటుకున్నాడు మోహన్ బాబు. అయితే అలాంటి మోహన్ బాబు తన నోటి దురుసు కారణంగా అప్పుడప్పుడు సోషల్ మీడియా ఆడియన్స్ కి టైం పాస్ అవుతూ ఉంటాడు. ఇక ఆ చర్చల గురించి ఇప్పుడు అనవసరం!అయితే మంచు మోహన్ బాబు ప్రస్తుతం సినిమాల పరంగా కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నాడు అని చెప్పుకోవాలి. మరోవైపు రాజకీయంలో కూడా వేలు పెడుతూ, నేను కూడా ఉన్నాను! అని ప్రజలకు గుర్తు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నందమూరి తారక రామారావు గారు టిడిపిని నెలకొల్పిన నాటి నుండి మోహన్ బాబు టిడిపి సానుభూతిపరుడుగా పనిచేసేవాడు. ఇక తర్వాత చంద్రబాబు హయాంలో కూడా అదే జరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాలు చాలా మారిపోయాయి. 2019 వ సంవత్సరంలో వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక అక్కడి నుండే మోహన్ బాబు యూటర్న్ తీసుకొని వైసిపి సానుభూతిపరుడుగా మారడం జరిగింది. ఈ క్రమంలో జగన్ కి తన మద్దతుని కూడా తెలియజేశాడు.
అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, జగన్ మాత్రం మోహన్ బాబు మద్దతుని తలకు ఎక్కించుకోలేదు. మోహన్ బాబు కి ఎటువంటి పాత్రని ఇవ్వదలుచుకోలేదు. దాంతో బాబుకు మండిందేమో తెలియదు కానీ, తాజాగా టిడిపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో, మోహన్ బాబు మరలా బాబు పంచన చేరాడు. ఈ క్రమంలోనే తాజాగా మోహన్ బాబు, సీఎం చంద్రబాబు ని కలిసి పుష్ప గుచ్చాన్ని ఇస్తూ మరి తన మద్దతుని తెలియజేశాడు. ఆ మధ్య తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంలో కూడా మోహన్ బాబు చంద్రబాబుకే మద్దతు ప్రకటించాడు. ఒక విషయం ఏదైనాప్పటికీ, మోహన్ బాబు జిత్తుల మారి నక్క అని ఓవర్గం వారు విమర్శిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
👉అమరావతిలో రూ.250 కోట్లతో 400 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి..*ఏపీకి 30 ఈఎస్‌ఐ ఆస్పత్రులు మంజూరు..
ఏపీకి కేంద్ర ప్రభుత్వం 30 ఈఎస్‌ఐ ఆస్పత్రులను మంజూరు చేసిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. భూమి కేటాయింపు పూర్తైన వెంటనే వీటి నిర్మాణం ప్రారంభం అవుతుందన్నారు.అమరావతిలో రూ.250 కోట్లతో 400 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి రాబోతోందని పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన సుమారు వంద నిర్మాణాలు జరగాల్సి ఉందని, ఆయా శాఖలతో సంప్రదించి పనులు వేగంగా జరిగేలా చూస్తామన్నారు. కూటమి ప్రభుత్వం పవర్‌లోకి రాగానే గుంటూరు ప్రభుత్వాస్పత్రి డెవలప్‌మెంట్ కోసం వేగంగా చర్యలు తీసుకున్నామన్నారు.
అదేవిధంగా జీజీహెచ్ అభివృద్ధికి 60 అంశాలతో కూడిన అజెండాపై అధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు. రక్త పరీక్షలన్నీ ఆస్పత్రిలోనే నిర్వహించి, జీజీహెచ్‌లో పేదలకు వైద్య సేవలు అందిస్తామన్నారు. ‘పారిశ్రామికవేత్త రామచంద్ర తులసి రామచంద్ర ప్రభు రూ.4 కోట్లతో సర్వీస్ బ్లాక్, పొదిలి ప్రసాద్ మరో భవనం, నాట్కో వారు మరో భవన నిర్మాణానికి ముందుకొచ్చారని గుర్తుచేశారు.
👉ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర!
TG: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించడంతో వాతావరణం వేడెక్కింది. స్థానికులకు అనుమానం రావడంతో వారిని మంగళ్ హాట్ పోలీసులకు అప్పగించారు.వీరిని ఇస్మాయిల్, మహ్మద్ ఖాజాగా గుర్తించారు. ఇద్దరి ఫోన్లలో తుపాకులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటో ఉన్నాయి.దీంతో రాజాసింగ్ హత్యకు ఏమైనా కుట్ర పన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
👉 ప్రకాశం జిల్లా ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన నూకసాని బాలాజీ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, దోర్నాల మండల టీడీపీ నాయకులువల్లభనేని కాశయ్య,బట్టు సుధాకర్ రెడ్డి, దొడ్డ శేషాద్రి ఈదర మల్లయ్య పి చంటి కె రాజేంద్ర గాలి తాతిరెడ్డి పి మల్లయ్య ఏ మురళి కృష్ణ పాల్గొన్నారు.
👉ప్రకాశం జిల్లా కంభం సర్కిల్ ఎక్సైజ్ సీఐగా కొండారెడ్డి నియమితులయ్యారు. ఆదివారం ఎక్సైజ్ కమిషనర్ అమరావతి నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో గిద్దలూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐగా కొండారెడ్డి విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కంభం సర్కిల్ కు బదిలీ అయ్యారు. గిద్దలూరు సర్కిల్ ఎక్సైజ్ సీఐగా జయరావును అతి త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

👉రోడ్డు ప్రమాదం..పలువురికి తీవ్ర గాయాలు..
కూలి పనులకు వెళ్లి వస్తుండగా బోల్తా పడిన ట్రాక్టర్..
పొదిలి మండలం కాటూరివారిపాలెం కి చెందిన 20 మంది కూలీలు కూలి పనులకు వెళ్లి పూర్తి చేసుకొని వస్తున్న సమయంలో పొదిలి మండలం అగ్రహారం దగ్గర ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా ..*ట్రాక్టర్లు ప్రయాణిస్తున్న 20 మంది కూలీలు….అందులో 13 మంది కూలీలకు తీవ్ర గాయాలు…పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు
వీరందరూ చీమకుర్తి మండలం కంభంపాడు గ్రామంలోని కూలి పనులకు వెళ్లి వస్తుండగా జరిగిన ఘటన..
మెరుగైన వైద్యం కోసం ఒంగోలు హాస్పిటల్ కి తరలింపు
👉బెల్టు షాపు నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎస్ఐ నరసింహారావు ..*కంభం:* ప్రకాశం జిల్లా కంభం మండలం చిన్న కంభం గ్రామంలో బెల్టు షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని ఎస్ఐ నరసింహారావు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుండి 40 క్వార్టర్ల (180 ఎంఎల్) మద్యం బాటిళ్లు మరియు మూడు 750 ఎంఎల్ బాటిళ్లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషక్ కి తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరసింహారావు మాట్లాడుతూ మండల పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
👉 ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం గన్నపల్లె గ్రామంలోని బెల్ట్ షాప్ పై దాడులు నిర్వహించిన అర్ధవీడు ఎస్సై సుదర్శన్ వారి సిబ్బంది 100 క్వార్టర్ 180ml బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు…

7k network
Powered by the Tomorrow.io Weather API
Recent Posts

తప్పు జరిగింది.. క్షమించండి: పవన్ .. *తొక్కిసలాట ఘటనలో డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు..*తొక్కిసలాట ఘటనకు సీఎం బాధ్యత వహించాలి: రోజా* 👉 టీటీడీ తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు.. .. *ఫార్ములా ఈ కారు రేసులో దూకుడు – ఆయన అనుమతితోనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాం… *పేట’ప్రిన్సిపల్ వేధింపులతోనే విద్యార్థి ఆత్మహత్య*.. *సిరిసిల్లలో కదులుతున్న భూకబ్జాలు డొంక..!.

*పెళ్ళుబుక్కుతున్న మత విద్వేష సునామి.. హిందువులు శంఖం ఊదాల్సింది అందుకు కాదు, మరెందుకు?* .. *విశాఖలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్* …రుయా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు*జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి: తిరుపతి జిల్లా కలెక్టర్ * ..*యూరప్ లో మోసపోయిన తెలుగు వారు …ప్రతీకార రాజకీయం కొనసాగుతోంది_డా. జయప్రకాష్ నారాయణ .. లంచం డిమాండ్ చేసిన ఎమ్మార్వో, వీఆర్వో, ఆర్ ఐ ల పై వేటు వేసిన జిల్లా కలెక్టర్ .. ఖమ్మం తిరుపతి జిల్లాలలో భారీగా గంజాయి పట్టివేత

👉కర్రలతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ..* కేజీవాల్ కు అఖిలేష్ మద్దతు.. ”ఇదేంటి పవన్ ఇలా అనేశారు” .. *కుప్పం టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు .. ప్రకాశం జిల్లాలో కుక్కల స్వైర విహారం *గంజాయి గూచుల వద్ద 120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న ఏసిపి..*ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వారు స్వయంగా కంపోస్టు ఎరువు తయారు చేయండి:*కమిషనర్ ఎన్.మౌర్య*..👉 ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు: గిద్దలూరు సీఐ సురేష్ .. *ఆక్రమణకు గురైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింత* .. *ఆన్‌లైన్‌ బెట్టింగులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్…*రామ్ చరణ్, బాలయ్య సినిమాలపై హైకోర్టులో పిల్* 👉 బీజీపీ నేతలకు అద్దంకి దయాకర్ సవాల్ …*గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్? (కరీంనగర్).. * వైయస్ అభిషేక్ రెడ్డి మృతి..*

ప్రియాంక గాంధీపై బీజేపీ నేత ర‌మేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మంత్రి సీత‌క్క‌*.. *నవీన్ కి చెక్ పెట్టినట్లే కేజ్రీవాల్ కి కూడా ?.. *ఈ ఫార్ములా రేసులో కొన్ని నిజాలు *.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవ రెడ్డి … ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మంత్రి సత్య కుమార్ యాదవ్* …ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా దోచుకున్న ఓం నారాయణ పై చర్యలు : లంబాడి హక్కుల పోరాట సంఘం.. *పొదిలి మాదిరెడ్డిపాలెం వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా ఎర్రం రెడ్డి

👉ఎంఎస్‌పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే ..*తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా.😲 ..హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ … ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటులను పర్యవేక్షించిన జిల్లా అధికారులు ..*ఆత్మకూరులో ఇస్తేమ పనులను పర్యవేక్షించిన మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ .. *

👉ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ …* విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్..😲… *విశాఖ సెంట్రల్‌ జైల్ ను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి .. అగ్ని ప్రమాదాల పై అవగాహన సదస్సు.. *ఉచిత బస్సు కంటే ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే బెటరేమో ! .. *అధికారులను సత్కరించిన పొదిలి పట్టణ టిడిపి అధ్యక్షుడు. . *నిలిచిపోయిన కాపు భవనాలను పునఃప్రారంభించాలి: బలిజ సేవ సంఘం డిమాండ్ .