👉 భారత్‌లో ఆకలి రాజ్యం !..న్యూఢిల్లీ..
భారత్ వెలిగిపోతోందని… ఎక్కడికో వెళ్లిపోతున్నామని ప్రచారం జోరుగా సాగుతూంటుంది. కానీ నిజం మాత్రం అది కాదని గ్లోబల్ ర్యాంకులు కొన్ని కొన్ని సార్లు వెల్లడిస్తూ ఉంటాయి. దీనికి తాజా సాక్ష్యం గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోని అన్నిదేశాల్లో శిశుమరణాలు, పోషకాహారం ఎంత మందికి ఎలా అందుతుందో రికార్డుల్ని పరిశీలించి.. క్షేత్ర స్థాయిలో సర్వే చేసి ఈ వివరాను వెల్లడిస్తుంది. ఈ నివేదికలో భారత్ 105వ స్థానంలో ఉంది. భారత్ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్న దేశాల గురించి చెప్పుకుంటే మనకు సిగ్గు చేటు..
భారత్‌లో భావి పౌరులకు పోషకాహారం అందడం లేదని, శిశుమరణాలు కూడా ఎక్కువేనని చెప్పి ఆందోళనకర స్థాయి అని రేటింగ్ ఇచ్చింది. నిజానికి భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం. చైనాను దాటిపోయాం. కానీ ప్రజలందరికీ అవసరమైన పోషకాహారం మాత్రం పంపిణీ చేయలేకోపోతోంది ప్రభుత్వం. ఈ విషయంపై స్పష్టత వచ్చిందేమో కానీ గరీబ్ కల్యాణ్ యోజన పేరుతో పేదలకు ఇచ్చే బియ్యాన్ని ఫోర్టిఫైడ్ చేయాలని ఇటీవల నిర్ణయించారు. అంటే పోషకాలు బియ్యంలో కలుపుతారన్నమాట.
ఇలాంటి నివేదికలు ఎప్పుడు బయటకు వచ్చినా కేంద్రం ఐక్యారాజ్యసమితితో పాటు ఆయా సంస్థలపై ఎదురుదాడి చేస్తూంటుంది. భారత్ ఇమేజ్ ను దెబ్బతీయడానికి చేస్తున్న కుట్రగా చెబుతూంటుంది. దేశంలో పోషకాహారం లేక ఆకలితో అలమటిస్తున్న వారి బాధలు బయటకు రాకుండా చేస్తే అదే గొప్ప విజయం అనుకుంటోంది. కానీ దేశం లో జరుగుతున్న అభివృద్ధి అందరికీ సమానంగా లేదు. పేదలు మరింత పేదలవుతున్నారు. ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు. ఈ అంతరం పెరిగిపోతున్న ఫలితమే హంగర్ ఇండెక్స్‌లలో ఆందోళనకరస్థాయి. దీనికి ఎదురుదాడి సరిపోదు… మానవత్వంతో ప్రభుత్వాలు వ్యవహరించాల్సి ఉంది.
👉సత్యసాయిజిల్లాలో అత్తాకోడళ్లపై అత్యాచారఘటన బాధాకరం.. హోమ్ మినిస్టర్ అనిత..
కేసును ఛాలెంజ్ గా తీసుకున్నాం.48 గంటల్లో నిందితులను పట్టుకున్నాం. మహిళ భద్రత విషయంలో రాజీపడే ఆలోచన లేదు. టెక్నాలజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నాం. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఒక్కో నిందితుడిపై 30 వరకు క్రిమినల్ కేసులు ఉన్నాయి. నిందితులకు త్వరితగతిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం. అందుకే త్వరితగతిన విచారణకు ఈ కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తున్నాం. ఇలాంటి కేసుల్లో జాప్యం లేకుండా స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. మహిళల భద్రత విషయంలో చిన్న ఘటన జరిగినా సీఎం నేరుగా మాట్లాడుతున్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు…
👉తాడేపల్లిగూడెంలో అక్రమంగా బాణాసంచా వ్యాపారం..ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులు.
ఎలాంటి రసీదులు ఇవ్వకుండా కోట్లాది రూపాయల విలువైన బాణాసంచా అమ్మకాలు చేస్తున్న వ్యాపారులు.
ప్రభుత్వ ఆదాయనికి భారీగా గండి పడుతున్నా పట్టించుకోని వాణిజ్య శాఖ అధికారులు.
పోలీస్, రెవిన్యూ, ఫైర్, వాణిజ్య శాఖ అధికారులకు భారీగా ముడుపులు అందటంతో
ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవటలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.
👉దొంగే అందర్నీ దొంగ అంటున్నాడు.. జగన్ పై టీడీపీ సెటైర్స్ ..అమరావతి..
ఏపీలో కూటమి సర్కార్ అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? లభిస్తే ఎక్కడో చెప్పగలరా? అని జగన్ ప్రశ్నించారు. ఉచిత ఇసుక పాలసీ పేరుతో అవినీతి జరుగుతుందంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన ఆరోపణలు చేశారు. అధికార దుర్వినియోగంతో ఇసుక చుట్టూ ఒక మాఫియాను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. అయితే జగన్ విమర్శలు, ఆరోపణలపై టీడీపీ స్పందించింది. దొంగే అందర్నీ దొంగ అంటున్నాడంటూ జగన్ పై ఘాటుగా సెటైర్స్ పెల్చేసింది.
ఒక ఘరానా దొంగోడు, నేను దొరని అంటూ ప్రజలని మోసం చేస్తూ ఉండే వాడు. ఆ సైకో దొంగ బుద్ధి పసిగట్టిన ప్రజలు, ఆ దొంగని పట్టుకుని, ము* మీద నాలుగు పీకి బుద్ధి చెప్పి, ఊరు నుంచి తోలేశారు. ఆ ఘరానా దొంగ మళ్ళీ వేషం మార్చి, నేను చాలా అమాయకుడిని, ఇక్కడ ఉన్న వారు అందరూ దొంగలు అన్నాడు అంట. అవినీతి గురించి నువ్వు మాట్లాడితే అలాగే ఉంటుంది సైకో వైఎస్ జగన్..
ఇసుక గురించి, మద్యం గురించి, నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే, నీకు అంత మంచిది సైకో జగన్. ఇప్పటికే నీ ఇసుక దోపిడీకి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయ్యింది, విచారణ కూడా జరుగుతుంది. ఏ నిమిషం అయినా తాడేపల్లి కొంప దాకా వస్తుంది. ఇక మద్యం విషయంలో, తాడేపల్లి కొంపలో సాయంత్రం అయ్యేసరికి, నువ్వు డైరెక్ట్ గా ఎంత డబ్బులు వసూలు చేసే వాడివో, ఆ కేసు విచారణ కూడా త్వరలోనే ప్రారంభం అవుతుంది. నీ డబ్బు పిచ్చతో , ఎంతో మంది ప్రాణాలు తీసావ్, ఆ ఉసురు తగలకుండా ఉంటుందా.. కర్మ ఫలం అనుభవించాలి కదా.
రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? అని అడుగుతున్నావా ? నువ్వు ఉండే బెంగళూరులో లభించటం లేదేమో, మా ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుకే లభిస్తుంది. ఒక పక్క ఉచిత ఇసుక లభిస్తుందా అని అడుగుతున్నావ్, మరో పక్క ఇసుక నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఆగిపోయింది అంటున్నావ్. నీ స్క్రిప్ట్ రైటర్ ని బుర్ర వాడమని చెప్పు..నీ ప్రభుత్వంలో కంటే ఇప్పుడు ఇసుక రెండింతలు అయ్యిందా ? నీ ప్రభుత్వంలో 20 టన్నుల లారీ రూ.30 నుంచి రూ.40 వేలకి అమ్మితే, మా ప్రభుత్వంలో రూ.16 వేల నుంచి రూ.18 వేలకు కేవలం రవాణా ఇతర చార్జీలతో వస్తుంది. ఇది రెండింతలు అవ్వటమా ? పేపర్లు కొట్టేసిన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ?..వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా స్టాక్ యార్డుల్లో ఉంచావా ? మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే,అప్పుడే 80 లక్షల టన్నులు తీసి పెట్టావా ? నీ మొఖానికి అంత ముందు జాగ్రత్త ఏడిస్తే, ఈ రాష్ట్రం ఇప్పుడు ఇలా ఎందుకు ఉండేది ?..
నీ ప్రభుత్వంలో అసలు ఇళ్లు కట్టుకోవాలని ఎవరికి ఉండేది ? నీ భారతీ సిమెంట్స్ కోసం సిమెంట్ బస్తాని రూ.450కి అమ్ముకున్న నీచుడువి నువ్వు, మర్చిపోయావా ? అప్పుడు రియల్ ఎస్టేట్ పడుకుంది. మా కూటమి ప్రభుత్వం రాగానే నిర్మాణాలు ఊపందుకున్నాయి. నువ్వు మా రాష్ట్రంలో ఉంటే కదా, ఇక్కడ ఏమి జరుగుతుందో తెలియటానికి.
ఇసుక విధానం గురించి, నువ్వే మాట్లాడాలి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టి, వందల మంది ఆత్మహత్యకు కారణం అయిన సైకోవి నువ్వు. కేవలం నీ డబ్బు పిచ్చతో, అంత మందిని బలి తీసుకున్నావ్. పాలసీల గురించి, పరిపాలన గురించి నువ్వు మాట్లాడకు. నోటితో కాకుండా, ఇంకా దేంతోనే నవ్వుకోవాలి..
నీ ప్రభుత్వంలో టన్ను రూ.475కే ఇచ్చావా ? ఎక్కడ ఇచ్చావ్ ? ఎవరికి ఇచ్చావ్ ? నీ దరిద్రపు మొఖంతో, వందల కోట్ల ప్రకటనలు ఇచ్చి, నువ్వు వదిలిన ప్రకటనలు మర్చిపోయావా ? టన్ను 800 నుంచి 1200 వందలు అని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది నువ్వు కాదా ? దొంగ లెక్కలు రాసే, దొంగ బ్రతుకు కదా. ఇలాగే దొంగ లెక్కలు చెప్తావ్ అంటూ జగన్ పై టీడీపీ మండిపడింది. ఈ మేరకు అధికారిక ఎక్స్ లో జగన్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టింది.
👉 కొండా సురేఖ – రేవూరి అంశంపై స్పందించిన పీసీసీ చీఫ్..హైదరాబాద్:
మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వివాదంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పరకాలలో కార్యకర్తల అత్యుత్సాహం వల్లే ఇద్దరి మధ్య వివాదం చెలరేగిందన్నారు. మంత్రి , ఎమ్మెల్యే ఇరువురి తో మాట్లాడినట్లు తెలిపారు.ఈ అంశంపై మాట్లాడాలని ఇన్‌ఛార్జి మంత్రికి చెప్పామన్నారు. మంత్రి సురేఖ, ఎమ్మెల్యే రేవూరి వివాదం పార్టీ అంతర్గత సమస్య త్వరలో సమసిపోతుందని స్పష్టం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే పోచారం, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి పై మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. డీసీసీ అధ్యక్షునికి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలకు నష్టం జరగకుండా సామరస్యంగా సమస్య పరిష్కరిస్తామన్నారు.
*అసలు ఏం జరిగింది?*
వరంగల్ జిల్లాలో మరోసారి కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు బయటకు వచ్చాయి. కొండ వర్గానికి రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గానికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఆదివారం కొండా వర్గం రేవూరి వర్గం మధ్య ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. దసరా బతుకమ్మ వేడుకల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి పేరు లేకపోవడంతో వివాదం మొదలైంది. ఎమ్మెల్యే పేరు పెట్టాలంటూ కొండ వర్గానికి రేవూరి అనుచరులు సూచించారు. రేవూరి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు పెట్టడంతో ఫ్లెక్సీలను చించేశారు. ఫ్లెక్సీలు చించి వేసారంటూ రేవూరి అనుచరులపై కొండ వర్గం దాడికి పాల్పడ్డారు. దీంతో గాయాల పాలైన రేవూరి అనుచరులు కొండ వర్గంపై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కొండ అనుచరులను అరెస్ట్ చేశారు. ఆధారాలు లేకుండానే తమ కార్యకర్తలను అరెస్ట్ చేశారంటూ కొండ అనుచరులు పేర్కొన్నారు.. గీసుకొండా పోలీస్ స్టేషన్ పరిధిలో 16వ డివిజన్ నర్సంపేట రహదారిపై కొండా వర్గం ధర్నాకు దిగింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న తమ వర్గానికి చెందిన కార్యకర్తలను విడుదల చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ధర్నా చేస్తున్న కార్యకర్తలపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. సమస్య వివాదాస్పదం కాకుండా రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ఈ ధర్నాతో మరోసారి కొండ, రేవూరి ఆధిపత్య పోరు మరోసారి బట్టబయలైంది.
👉మహిళా కానిస్టేబుల్ ఘటనపై ఏసీపీ స్పందన..
NTR: విజయవాడలో మాచవరం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ భవాని నిద్ర మాత్రలు మింగి గత రాత్రి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సెంట్రల్ ఏసీపీ దామోదర్ స్పందించారు. భవాని ఆరోగ్యం స్థిమితంగానే ఉందన్నారు. సీఐ ప్రకాశ్ వేధించారనడం అవాస్తవమన్నారు. భవాని శాఖ పరంగా డ్యూటీ డ్రెస్ కోడ్ పాటించాలని హెచ్చరించినందుకు ఆమె ఆత్మహత్యకు యత్నించిందన్నారు.
👉ఈనెల 16వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించినందున జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, అన్ని యాజమాన్యాలలోని పాఠశాలలు, కాలేజీలకు బుధవారం కూడా సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ఆమె సూచించారు. భారీ వర్షాల వలన ఎలాంటి పరిస్థితి తలెత్తినా సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమై ఉన్నట్లు చెప్పారు.
👉 మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దంటూ ఆందోళన..
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్ సమీపంలోని సాయిబాబా నగర్ వద్ద మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దంటూ స్థానిక ప్రజలు మంగళవారం ఎక్సైజ్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ మద్యం దుకాణం ఉండేదని పలుమార్లు అధికారులకు మార్చాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. ఈ ప్రాంతంలో స్కూలు పిల్లలు కూడా అధికంగా తిరుగుతూ ఉంటారని వారి పట్ల మహిళల పట్ల మందుబాబులు అసభ్యంగా ప్రవర్తించే వారిని ఎక్సైజ్ అధికారులకు విజ్ఞప్తి చేసి వినతి పత్రం అందజేశారు…
👉మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపైకి ఎక్కిన కొండచిలువ.. కాపాడిన స్థానికులు
కర్నూలు – అవుకు మండలం సింగనపల్లికి చెందిన లారీ డ్రైవర్ డ్యూటీ దిగి ఫుల్లుగా మద్యం సేవించాడు.
మద్యం బాగా ఎక్కడంతో ఇంటికి వెళ్లలేక.. ఓ చోట అరుగుపై కూర్చున్నాడు. మద్యం మత్తులో తూగుతూ ఉండిపోయాడు.
అయితే పక్కనే ఉన్న పొదల్లో నుంచి ఓ కొండ చిలువ.. సదరు వ్యక్తి మీదకు ఎక్కిన అతనికి ఏమీ తెలియలేదు.
కొంతసేపటికి కొండచిలువతో ఉన్న లారీ డ్రైవర్‌ను చూసిన స్థానికులు.. కట్టెల సహాయంతో పక్కకు లాగేశారు.
ఒంటిపై కొండచిలువ నాట్యం చేస్తున్నా లారీ డ్రైవర్‌కు స్పర్శ తెలియకపోవడంతో ఇలా ఉన్నాడేంటి అంటూ గ్రామస్తులు నవ్వుకున్నారు…
👉ఇంట్లోకి దూసుకెళ్లిన కార్బన్ పౌడర్ లారీ*
జమ్మలమడుగు వైపు నుండి
నల్ల కార్బన్ పౌడర్ లోడుతో ముద్దనూరుకు వస్తున్న లారీ అదుపు తప్పి బ్రిడ్జి, ఢీకొని ఇంట్లోకి దూసుకెళ్లింది.
ఆర్‌టిపిపికి చెందిన ఉద్యోగి రవి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి పులివెందులకు వెళ్తుండగా ముద్దనూరులో గేటు వేయడంతో పక్కన నిలబెట్టుకుని ఉండగా
లారీ అతి వేగంగా వచ్చి కారును ఢీ కొట్టడంతో కారు వెనుక భాగం దెబ్బతిని వెనక్కు రివర్స్ తిరిగి లారీతో పాటుగా ఆటో ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగక పోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
👉చిత్తూరు జిల్లా యందు భారీ ఎత్తున కర్ణాటక మద్యం స్వాధీనం.
* నలబై ఇదు వేల రూపాయల విలువైన 720 ప్యాకట్ల మద్యం, 3 లక్షలు రూపాయలు విలువ చేసే టాటా ఇండికా కారును స్వాధీనం చేసుకొన్న చిత్తూరు తాలూకా పోలీసులు.
*ఒక వ్యక్తి అరెస్టు.
చిత్తూరు జిల్లాలో కర్ణాటక మద్యం అక్రమ రవాణా మరియు అమ్మకం పైన చిత్తూరు జిల్లా ఎస్.పి శ్రీ మణికంట చందోలు, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు DSP శ్రీ T.సాయినాద్ నేతృత్వంలో దాడులు నిర్వహించడం జరుగుచున్నది. ఈ కార్యచరణలో భాగంగా రాబడిన రహస్య సమాచారం మేరకు చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాస రావు మరియు చిత్తూరు తాలుకా పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ G.రమేష్ బాబు మరియు సిబ్బందితో కలసి 15.09.2024 వతేది ఉదయం 9.45 గంటలకు, చిత్తూరు జిల్లా, చిత్తూరు మండలము, నరిగిపల్లి గ్రామం నుంచి కన్నికాపురం గ్రామం వైపుగా అనుమానాస్పదంగా వస్తున్న ఒక టాటా ఇండికా కారును అదుపులో తీసుకొని తనిఖి చేసి అందులో అక్రమంగా రవాణా చేస్తున్న 15 కేసుల కర్ణాటక మద్యంను గుర్తించి అందులో ఉన్న ఒక వ్యక్తి S. శివ కుమార్ ని అదుపులోకి తీసుకోగా, అంతట పట్టుబడిన ముద్దాయిని విచారించగా సదరు వ్యక్తి కర్ణాటక మద్యంను కర్ణాటక రాష్ట్రం నుండి మనరాష్ట్రంకు అక్రమంగా రవాణచేసి పెద్దఎత్తున డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలిసింది,
సదరు ముద్దాయిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాస రావు, చిత్తూరు తాలుకా పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ G.రమేష్ బాబు మరియు చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందిచడమైనది.
అరెస్ట్ చేసిన ముద్దాయి వివరములు:
B.శివ కుమార్ , వయస్సు 34 సంవత్సరాలు, తండ్రి లేట్ బసవరజప్ప, నామగొండ్లు, గౌరీబిడనూర్, చిక్కబల్లాపూర్, కర్ణాటక రాష్ట్రం.
👉”పల్లె పండుగ ~ ప్రగతికి అండగా” వారోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం 10.00లకు రాచర్ల గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయనున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి..
👉రాచర్ల గ్రామంలో “పల్లె పండుగ” వారోత్సవాల్లో పాల్గోన్న ఎమ్మెల్యే ముత్తుముల..
*రాచర్ల పంచాయతీలో రూ. 40 లక్షల రూపాయల, అంతర్గత సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముత్తుముల..*పల్లె పండుగ ~ ప్రగతికి అండగా కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు రాచర్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన “పంచాయతీ వారోత్సవాల్లో” గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్బంగా రాచర్ల గ్రామ పంచాయతీలోని ఫారం గ్రామంలో రూ. 10 లక్షలు, పలుగుంటి పల్లె గ్రామంలో రూ. 10 లక్షలు మరియు రాచర్ల గ్రామంలో రూ. 20 లక్షల రూపాయలు మొత్తం రూ. 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న అంతర్గత సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా గ్రామంలో ఏర్పాటు చేసిన శిలాఫలకానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించారు.. రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని, నాడు జరిగిన నష్టాలను అధిగమిస్తూ గ్రామాలను అభివృద్ధి చేయటానికి ఎన్దీయే ప్రభుత్వం కంకణం కట్టుకుందని, అందులో భాగంగానే “నవంబర్ 14 నుండి 20 వరకు” జరిగే పంచాయతీ వారోత్సవాల్లో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో మండల ఎంపీడీఓ వెంకట రామిరెడ్డి, ఎమ్మార్వో వెంకటేశ్వర్లు, పంచాయతీ రాజ్ డీఈ సుబ్బారెడ్డి, NREGS పీడీ జోసఫ్ కుమార్, హోసింగ్ ఏఈ విజయకుమారి, మండల పార్టీ అధ్యక్షులు కటికే యోగానంద్, జిల్లా నాయకులు గోపిరెడ్డి జీవనేశ్వర రెడ్డి, దప్పిలి కాశిరెడ్డి, షేక్ తాహీర్ బాషా, పంకా మాధవ్, వీరాచారి, యల్లా కృష్ణ, సొంటం కళ్యాణ్ రెడ్డి, వేల్పుల రంగరాజు, మనోహర్, మరియు నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గోన్నారు.. స్టాఫ్ రిపోర్టర్ రహిమాన్
👉గ్రామాల అభివృద్దే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యం : రాచర్ల మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముత్తుముల..
*గ్రామాలను అభివృద్ధి చేయటమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. రాచర్ల మండల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గోన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ అధికార యంత్రాంగం ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు చేయటం జరిగిందన్నారు. రాచర్ల మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 2.50 కోట్లు మంజూరు చేసి నేడు “పల్లె పండుగ” వారోత్సవాల్లో ప్రారంభించటం జరిగిందన్నారు. అదే విధంగా మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని నెరవేర్చి తీరుతామని, పేదలకు, రైతులకు, మహిళా సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.కార్యక్రమంలో స్థానిక వైస్ ఎంపీపీ ఈదుల సుజాత, సర్పంచ్ సగినాల రాయలమ్మ, ఎంపీడీవో వెంకటరామిరెడ్డి, ఎమ్మార్వో వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ డిఈ సుబ్బారెడ్డి, సర్పంచులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు*
👉ఇరుగుల వారి వివాహా కార్యక్రమంలో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..
*గిద్దలూరు పట్టణంలోని, రాంభూపాల్ రెడ్డి కాలనీలో ఇరుగుల వెంకట రవి ప్రసాద్ రెడ్డి కుమార్తె చి.ల.సౌ తనూజ” వివాహా కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.. కార్యక్రమంలో పట్టణ టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ రిపోర్టర్ అస్లాం బేగ్..
భారత్‌లో “ఆకలి రాజ్యం” !..అత్తాకోడళ్లపై అత్యాచారఘటన బాధాకరం.. హోమ్ మినిస్టర్ అనిత….దొంగే అందర్నీ దొంగ అంటున్నాడు.. జగన్ పై టీడీపీ సెటైర్స్ ….కొండా సురేఖ – రేవూరి అంశంపై స్పందించిన పీసీసీ చీఫ్….మహిళా కానిస్టేబుల్ ఘటనపై ఏసీపీ స్పందన….మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దంటూ ఆందోళన.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల.
Recent Posts