👉ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ముస్లిం సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు*..*కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ పై తమ అభ్యంతరాలు వివరించిన ప్రతినిధులు*
*ఆలిండియా ముస్లిం లా బోర్డు సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి ఎన్ఎండి ఫరూఖ్, మండలి మాజీ చైర్మన్ షరీఫ్ సహా పార్టీ మైనారిటీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సచివాలయంలో కలిశారు. వక్ఫ్ యాక్ట్ సవరణపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తమ అభ్యంతరాలు తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన ఈ ప్రతిపాదన వల్ల వక్ఫ్ బోర్డు నిర్వీర్యం అవుతుందని….ఈ చర్య ముస్లిం వర్గ హక్కులు, మనోభావాలు దెబ్బతీస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు తమ అభ్యంతరాలను, ఆందోళనను వివరించారు. వక్ఫ్ చట్టంలో మార్పులను అంగీకరించవద్దని, పార్లమెంట్ లో చట్టాన్ని వ్యతిరేకించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించారు. దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ముస్లిం ప్రతినిధులకు తెలిపారు.*
వక్ఫ్ సవరణ చట్టంపై అభ్యంతరాలను వివరించేందుకు మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాశ్యం మహమ్మద్ ఫరూక్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ముస్లిం పర్సనల్ లా బోర్డ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఫజులుర్ రహీం,మౌలానా అబు తాలిబ్ రెహ్మని, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష,గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్,మండలి మాజీ చైర్మన్ షరీఫ్ ,ఎం హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ,వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఉన్నారు.. స్టేట్ కన్వీనర్ అబ్దుల్ రజాక్ భాష
👉వైఎస్ జగన్‌కు లోకేష్ ఓపెన్ ఛాలెంజ్..!!!
వైఎస్ జగన్‌కు లోకేష్ ఓపెన్ ఛాలెంజ్
వైఎస్ జగన్ ఏపీలో శాంతిభద్రతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ‘సైకో, ఫేక్ జగన్.. నాతో చర్చకు రెడీనా’ అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా టీడీపీ ఎల్లప్పుడూ గౌరవప్రదంగా ఉంటుందని కౌంటర్ ఇచ్చారు. దిశ యాక్ట్ పూర్తిగా అబద్ధమని..మహిళ భద్రత పేరుతో జరిగిన పెద్ద మోసమని లోకేష్ ఆరోపించారు.
👉 చెన్నైలోని కొరియా కాన్సులేట్ జనరల్ కిమ్ చాంగ్ యున్ తో పాటు కొరియన్ ఎక్సిమ్(KEXIM) బ్యాంక్ ఈడీసీఎఫ్ ఆపరేషన్స్ డిపార్ట్ మెంట్-2 డైరెక్టర్ జనరల్ కెవిన్ చోయ్, కెక్సిమ్ బ్యాంక్ ఎన్డీఆర్వో ముఖ్య ప్రతినిధి జంగ్ వాన్ రియూ, కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(KOICA) డైరెక్టర్ చాంగ్ వూ చాన్‌లతో బుధవారం సచివాలయంలో సమావేశమయ్యాను. రాష్ట్రంలో చేపడుతున్న పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు కెక్సిమ్ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అందిస్తున్న రాయితీలను ఈ సందర్భంగా ఎగ్జిమ్ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు.ఏపీ అభివృద్ధిలో కొరియా సంస్థలు.. భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా వారిని కోరారు.
👉ఇకపై ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు! టెక్ట్స్ మెసేజ్ చేస్తే చాలు వాట్సప్లోనే సర్టిఫికెట్లు!!*’
వాట్సప్లోనే సర్టిఫికెట్లు వచ్చేలా ఏఐ సేవలు – ధ్రువపత్రాల సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రయత్నం – మెటాతో ఏపీ సర్కార్ ఎంవోయూఏదైనా సర్టిఫికెట్ కావాలంటే గవర్నమెంట్ ఆఫీసులు, వివిధ హోదాలో ఉన్న అధికారులు, సిబ్బంది చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. కరెంటు, నల్లా, ఇంటి పన్ను, ఇతరత్రా బిల్లులు సైతం చెల్లించాలంటే సంబంధిత కార్యాలయాల్లో ఇప్పటికీ ఎడతెగని క్యూలలో నిరీక్షణ తప్పదు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఈ సర్టిఫికెట్ల కష్టాలను యువత ఏకరువు పెట్టారు. వాట్సప్లో ఒక్క టెక్ట్స్ మెసేజ్ చేస్తే ఇంటికే అవసరమైన సమస్త వస్తువులు వస్తున్నాయి. అదే విధంగా ప్రతి సేవలూ అందుతున్నాయి.
అలాంటప్పుడు సర్టిఫికెట్ల కోసం ఆఫీసులు చుట్టూ పనులు మానుకుని మరీ తిరగాల్సిన పరిస్థితికి చెక్ పెడతామని, ప్రభుత్వంలోకి రాగానే వాట్సప్ ద్వారా పర్మినెంట్ సర్టిఫికెట్ పొందే అవకాశం కల్పిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
👉వైసీపీ పాలనలో వేలాది హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగితే జగన్ ఒక్క రోజైనా సమీక్ష చేశారా? ఒక్క కుటుంబానైన్నా ఆదుకున్నారా? ఒక్కరినైనా పరామర్శించారా? అని మాజీ మంత్రి పీతల సుజాత నిలదీశారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ నా అక్కచెల్లెమ్మలంటూ మహిళలపై జగన్ కపట ప్రేమ ఒలకబోశారన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలన ఆడబిడ్డల పాలిట శాపంగా మారిందని, జగన్ పాలనలో ఏపీ అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యిందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఆడబిడ్డలపై అఘాయిత్యం జరిగితే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
👉మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను నవంబరు మొదటి వారంలో జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. 3న నోటిఫికేషన్ ఇవ్వాలనుకున్నా ఆ రోజు ఆదివారం కావడంతో మరో తేదీని పరిశీలిస్తున్నారు. 16,347 పోస్టులతో ఈ నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే న్యాయ వివాదాలు లేవనెత్తి భర్తీని అడ్డుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుందనే సమాచారం ప్రభుత్వానికి అందింది. అందువల్ల న్యాయ వివాదాలకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడు, నాలుగు నెలల్లో భర్తీ ప్రక్రియ ముగించి, ఆ వెంటనే ఎంపికైన వారికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మెగా డీఎస్సీ పూర్తయితే రాష్ట్రంలోని 12 సింగిల్ టీచర్ స్కూళ్లకు అదనంగా ఉపాధ్యాయులు వస్తారు. అలాగే ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీరనుంది.
👉24 గంటల్లో అకౌంట్లో డబ్బులు పడ్డాయ్: మంత్రి..,
24 గంటల్లో అకౌంట్లో డబ్బులు పడ్డాయ్: మంత్రి
రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో ఖాతాలో డబ్బులు జమ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన పోలిశెట్టి శేషయ్య అనే రైతు నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లోనే డబ్బులు జమ చేశాం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కౌలు రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నారని అనడానికి ఇదే తార్కాణం’ అని నాదెండ్ల ట్వీట్టర్‌లో పోస్టు చేశారు.
👉మహారాష్ట్ర ఎన్నికలు..ఎంవీఏ లో కుదిరిన సీట్ల ఒప్పందం..మహావికాస్ అఘాడిలో పార్టీల మధ్య సీట్ల ఒప్పందం బుధవారం ఓ కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే)ల మధ్య ఒప్పందం కుదిరింది. మహారాష్ట్రలో మొత్తంగా 288 సీట్లు ఉన్నాయి. ఒక్కో పార్టీ 85 స్థానాల్లో పోటీ చేయాలని కూటమి నిర్ణయించింది. 270 స్థానాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఎంవీఏ నేతలు తెలిపారు. మిగిలిన 18 సీట్లపై ఎస్పీ పార్టీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నేతలు వెల్లడించారు.. స్టేట్ ఇంచార్జ్ ఎస్ రహమాన్.
👉మైనర్ బాలికపై పోలీస్ ఇన్‌స్పెక్టర్ అత్యాచార యత్నం..ఖాజీపేట సీఐపై పోక్సో కేసు నమోదు
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బాలికపై సీఐ అత్యాచార యత్నం..సీఐ చెర నుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పిన బాధిత బాలిక.. పేరెంట్స్ ఫిర్యాదుతో సీఐపై కేసు నమోదు
👉జిల్లా ఎస్పీ ఆదేశాలతో మట్కాపై మెరుపు దాడులు
* ఒకర్ని అరెస్టు చేసి రూ. 2,02,500/- నగదు స్వాధీనం చేసుకున్న యల్లనూరు పోలీసులు
* వివరాలు వెల్లడించిన పుట్లూరు సి.ఐ సత్యబాబు
జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో పుట్లూరు సర్కిల్ పోలీసులు మట్కాపై మెరుపు దాడులు నిర్వహించారు. యల్లనూరు మండలం కొండవండ్లపల్లి గ్రామ సమీపంలో మట్కా అక్రమంగా కొనసాగుతోన్నట్లు పుట్లూరు సి.ఐ సత్యబాబుకు సమాచారం అందింది. అనంతపురం రూరల్ డీఎస్పీ టి.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో పుట్లూరు సి.ఐ, యల్లనూరు ఎస్సై శ్రీరాంప్రసాద్ ల ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో కొడవండ్లపల్లికి చెందిన తిరుపతినాయుడిని అరెస్టు చేశారు. ఇతని నుండీ రూ.2,02,500/- నగదు స్వాధీనం చేసుకున్నారు.
👉ఏసీబీకి చిక్కిన విద్యుత్ లైన్ ఇన్‌స్పెక్టర్.
నూతన భవన నిర్మాణ సమయంలో వేరే వాళ్ళ ఇంటి నుంచి విద్యుత్‌ను వినియోగించుకోవడానికి ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండటానికి” రూ.26,000/- లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడ్డ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా,పాల్వంచ విద్యుత్ లైన్ ఇన్‌స్పెక్టర్ -నాగరాజు..“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
👉గుంటూరు రేంజ్ ఐజి వారి కార్యాలయంలో రేంజ్ పరిధిలో ఉన్న అన్ని జిల్లాల ఎస్పీలతో ఐ.జి సర్వ శ్రేష్ట త్రిపాఠి రివ్యూ మీటింగ్ నిర్వహించటం జరిగింది
ఈ రివ్యూ మీటింగ్ లో భాగంగా రేంజ్ పరిధిలో లా & ఆర్డర్ సమస్యలను, తీవ్రమైన నేరాలు సంబంధిత కేసులు గురించి మరియు రేంజ్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల కార్యకలాపాలను అణిచివేయటం, రేంజ్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల పై నిఘా ఉంచడం, అన్ని జిల్లాల్లో ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి పనితీరును సమీక్షించాలని
అదేవిధంగా కేసు దర్యాప్తులలో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కేసులను దర్యాప్తు చేయాలని,
కమ్యూనిటీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించడం,సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా తప్పుడు ప్రచారాలు చేసే వారిని అరికట్టడం, సైబర్ క్రైమ్ నేరాలు తగ్గించడం వంటి అంశాలను చర్చించి జిల్లా ఎస్పీలకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.గుంటూరు రేంజ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గుంటూరు ఐ.జి సర్వ శ్రేష్ట త్రిపాఠి తో పాటు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్,పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు,బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి,ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్,నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పాల్గొన్నారు.. స్టేట్ ఇంచార్జ్ ఎస్ రెహమాన్
👉తాగిన మైకంలో కన్న కూతుర్ని అమ్మేసింది*
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కేంద్రంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వేములవాడకు చెందిన శ్యామల అనే మహిళకు ఐదుగురు పిల్లలు కాగా, అందులో తన 10 నెలల చిన్నారిని జగిత్యాలకు చెందిన ఓ మహిళకు కల్లు తాగిన మైకంలో రూ. లక్షకు విక్రయించింది. మైకం నుండి తేరుకున్న అనంతరం శ్యామల తన పాపను ఎవరో అపహరించారని పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. కాగా పోలిస్ విచారణలో అసలు విషయం బయటపడింది.
*👉మార్కాపురం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఎటువంటి అనుమతులు లేని చెరువు ఆక్రమిత కట్టడాలపై కనీస చర్యలు తీసుకోకపోవడం బాధాకరం..మార్కాపురం చెరువు అలుగులను పరిశీలించిన ప్రజాసంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరె రంగసాయిరెడ్డి…
అన్నారు.చెరువు పరిధిలోని తమ ఆస్తులు కాపాడుకోవాల్సిన నీటి పారుదల శాఖ మొద్దు నిద్ర నటిస్తోందని ప్రాధమికంగా ఈ చెరువు దాదాపు 500 ఎకరాలలో నిర్మించారు.
నేడు అధిక వంతు ఆక్రమణలకు గురై, చిల్ల చెట్లతో, పూడికతో, మురికి నీటికి కేంద్రంగా దీనావస్థలో ఉందన్నారు.
ఆంగ్లేయులు చెరువును మరింత పటిష్ట పరుస్తూ,అలుగులు తూములు నిర్మించారు,కానీ ఇప్పుడు కొందరు స్వార్థపరులు ఆక్రమిస్తున్నారని.. పట్టణంలోని రేడియో స్టేషన్ సమీపంలో పారిశ్రామికవాడ వద్ద చెరువు అలుగు పూర్తిస్థాయిలో ఆక్రమణలకు గురైందని..రేడియోస్టేషన్ సమీపంలో వెలసిన అక్రమ కట్టడాలు చిన్నమస్జీద్ వద్ద ఉన్న తూము వరకు విస్తరించాయని ఆరోపించారు.1976లో వచ్చిన తుఫాన్‌కు అలుగు పారి సమీపంలోని గృహాల వద్ద నీరు చేరిందని
దీంతో నీరు పారకుండా గోడకట్టి రాతి రివిట్‌మెంట్ వేశారన్నారు.కాలక్రమేనా ఆక్రమణదారులు అలుగుకట్టను ఆక్రమించారని తొలుత దిబ్బలు వేస్తూ, అనంతరం చుట్టూ రాళ్లు పేరుస్తారు.ఆపై రేకుల షెడ్లు నిర్మిస్తు మరికాస్త ముందుకు వెళ్లి ఇంకా కట్టడాలు నిర్మించారని ఆరోపించారు.ఎటువంటి అనుమతులు లేకపోయినా చెరువు అలుగు నుంచి చిన్నమసీద్ వరకు పక్కా కట్టడాలు వెలిశాయి.ఇదేవిధంగా పారిశ్రామకవాడ సమీపంలోని రెండో అలుగు వద్ద కూడా కట్టడాలు వెలిశాయి.
చెరువు నిండినప్పుడు అధికమైన నీరు బయటకు పోయేందుకు ఏర్పా టు చేసిన ఈ అలుగులు ఆక్రమణలతో నిండి చిన్న మురు గు కాలువల మాదిరి మారి పోయాయి.
విశాలమైన ఈ అలుగులను పక్కా కట్టడా లతో పాటు జీపు స్టాండ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు.
సాక్షాత్తు అలుగు గోడలపైనే నిర్మాణాలు సాగించారంటే రెండు శాఖల అధికారులు మాత్రం కళ్లు మూసుకుంటున్నారు.
రేడియో స్టేషన్ నుంచి తిరువీధుల బావి వరకు మార్కాపురం పట్టణం నుంచి వెళ్లే ప్రధాన రహదారిగా ఉండేది.
అక్రమ కట్టడాలతో ఈ రహదారి కుంచించుకుపోయింది.
ఇప్పటికైనా అధికారులు స్పందించి అలుగుపై ఉన్న అక్రమ కట్టడాలు తొలగించాల్సి ఉందని కోరారు.
👉 ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పాత సివిల్ కోర్టు సమీపంలో బైక్ మెకానిక్ ఉన్న ప్రాంతంలోని పాత బైకులపై అగ్ని ప్రమాదం పాత బైకులు పై అగ్ని ప్రమాదం వెలువడంతో పాత బైకులు అగ్ని ప్రమాదానికి ఒక్కొకటిగా పేలుడు సంభవించడంతో భయభ్రాంతులయిన ప్రజలు..వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది ..ఇంతకు ఆ పాత బైకులపై ఎవరైనా కావాల్సి నిప్పు పెట్టారా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయం తెలియాల్సి ఉంది.
మార్కాపురం డివిజన్ ఇంచార్జి అస్లాం బేగ్..
👉పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి .. నర్సాపురం.ఏలూరు జిల్లా టీ. నర్సాపురం మండలం అప్పలరాజు గూడెం శివారి లో పేకాట శిబిరంపై దాడి.
పేకాట నిర్వహిస్తున్న 14 మందిఅదుపులో తీసుకున్న పోలీసులు.వారి వద్ద నుంచి ఒక లక్ష 79 వేల 500 రూపాయలు నగదును స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేసినట్లు టి నర్సాపురం ఎస్సై జయ బాబు వివరించారు.
రెండు కారులతో పాటు నాలుగు మోటర్ సైకిల్స్.సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
వక్ఫ్ అంశంపై సిఎం ను కలిసిన ముస్లిం సంఘాల ప్రతినిధులు ..వైఎస్ జగన్‌కు లోకేష్ ఓపెన్ ఛాలెంజ్.. కొరియా ప్రతినిధులతో చర్చలు..ఇకపై ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు! – టెక్ట్స్ మెసేజ్ చేస్తే చాలు వాట్సప్లోనే సర్టిఫికెట్లు!!..వైసీపీ పాలనలో వేలాది హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగితే ఒక్క రోజైనా సమీక్ష చేశారా?-మాజీ మంత్రి పీతల.. ఎస్పీలతో ఐ.జి సర్వ శ్రేష్ట త్రిపాఠి రివ్యూ మీటింగ్ ..పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి -నర్సాపురం.. మార్కాపురం చెరువు ఆక్రమణలు తొలగించాలని ప్రజా సంకల్పవేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరె రంగసాయిరెడ్డి.
Recent Posts