పవన్ కళ్యాణ్ ని కలవాలి అంటూ అఘోరి హంగామా…ఉద్యోగుల పేరిట నిరుద్యోగులకు టోపీ..తాడిపత్రిలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ తనిఖీలు..గుంటూరు మేయర్ పై కేసు..డిసెంబర్ 15 నాటికి ఏపీలో కొత్త విధానం..గర్భగుడిలో పూజారి మద్యం సేవిస్తున్నాడంటూ భక్తుల ఆగ్రహం..హాస్టల్ వార్డెన్ వేధింపులు భరించలేక నిద్రమాత్రలు మింగి ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్యాయత్నం..నరసరావుపేటలో విలేకరిపై దాడి..ఎంబీబీఎస్ కాలేజీలో ర్యాగింగ్‌.. 3 గంటలు నిలబడి డ్యాన్స్ చేస్తూ విద్యార్థి మృతి..పులివెందులలోని మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి పిఎ కృష్ణారెడ్డి ఇంటి వద్ద పోలీసులు..

👉ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..ముఖ్యమంత్రి సోదరుడు రామ్మూర్తి నాయుడి మృతి పట్ల రాహుల్ సంతాపం..ఫోన్ లో చంద్రబాబును పరామర్శ చేసిన రాహుల్.
👉ఉద్యోగుల పేరిట నిరుద్యోగులకు టోపీ*
రోజు జరుగుతున్నవి కదా అని తేలికగా తీసుకోకండి…. 🤔 ఈ మోసం కారణంగా చాలా మంది జీవితాలు నాశనం అయ్యాయి…..*ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగాల పేరిట సుమారు 25 కోట్ల దోపిడి* …
సెంట్రల్ రైల్వే సింబల్ తో మరియు ఇతర రంగాల వ్యవస్థల సింబల్, స్టాంపుల తో దోపిడీకి పాల్పడిన వ్యక్తులు…
అన్ని వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల యువతి, యువకులకు, మాయ మాటలు చెప్పి ముగ్గులోకి దింపుతారు…
ఆ తరువాత ఉద్యోగం ఆశ చూపించి వారి వద్ద నుండి లక్షల రూపాయలలో సొమ్ములు కాజేస్తారు…
**ఇంకా ఈ వాస్తవ కథలో చాలా విచిత్రాలు ఉన్నాయి*…ముందుగా అడ్వాన్స్ కట్టించుకుని బరిలోకి దింపుతారు..
అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు.. ఐడి కార్డ్ ఇస్తారు… 45 రోజులు విజయవాడలో ట్రైనింగ్ కూడా ఇస్తారు…
ఆ తరువాత జాబ్ జాయిన్ లెటర్ వస్తుందని అని చెప్పి వారి దగ్గర నుండి అనుకున్న సొమ్మును తీసుకుంటారు .
*ఆ తర్వాత దిమ్మతిరిగే షాక్*🙃🙃🙃
నమ్మిన ఆ ట్రైనింగ్ తీసుకున్న నిరుద్యోగ యువతి యువకులకు జాయినింగ్ లెటర్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు ….అది ఫేక్ అని తెలుసుకుంటారు…..
విషయం తెలుసుకున్న ఆ యువకులు వారి పరిధి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయిస్తారు.
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన … ఏమి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు అని వాపోతున్నారు..
ఎన్నో కష్టాలు పడి చదువుకున్న ఆ యువతీ యువకులు డబ్బులు అప్పుగా తీసుకువచ్చి ఇలాంటి వారి చేతిలో మోసపోయి అప్పులు భారీన పడి ఆ అప్పులు తీర్చడానికి కూలీలుగా మారుతున్నారు.. ఇంకొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు…
ఇలాంటి పరిస్థితి ముఖ్యంగా వెనుకబడిన తరగతులు వారికే ఎదురవుతున్నది.. అందుకే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.. అని నిరుద్యోగ యువతీ ,యువకులు, వాపోతున్నారు… ఉద్యోగలా పేరిట మోసం చేసిన వారిపై కేసు నమోదు చేసి.. వేగవంతంగా ఈ కేసును దర్యాప్తు చేస్తే ఇంకొందరి విద్యార్థుల జీవితాలు బలికాకుండా…. ముందుకు సాగుతాయి…ఈ మోసగాళ్లు ను పట్టుకుంటే
నిరుద్యోగుల కుటుంబాలు రోడ్డు పాలు కాకుండా.. విద్యార్థులు కూలీలుగా మారకుండా….. వారి జీవితాల భవిష్యత్తుకు తోడ్పాటు కలుగుతుంది…
👉తాడిపత్రిలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ తనిఖీలు* అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయాన్ని మరియు కల్లు దుకాణాలను జిల్లా డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ నాగమద్దయ్య మరియు అసిస్టెంట్ కమిషనర్ మునిస్వామి పరిశీలించారు. మద్యం దుకాణాలలో మద్యం అధిక ధరలకు విక్రయించకూడదని, బెల్ట్ షాపులు నిర్వహించకూడదని సూచించారు. పక్క రాష్ట్రాల నుంచి సుంకం చెల్లించిన మద్యం, నాటసారా ఎక్కడ ఉన్నా సమాచారం తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ గడ్డం నాయుడు మరియు ఎస్ఐ ఆంజనేయులు పాల్గొన్నారు.
👉 గుంటూరు మేయర్ పై కేసు..
AP: వైసీపీ నేత, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ప గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో టీడీపీ, జనసేన నేతలు నిరసన చేస్తుండగా.. మనోహర్ అక్కడికి వచ్చి హల్చల్ చేశారు. అప్పట్లోనే ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదు.
👉డిసెంబర్ 15 నాటికి ఏపీలో కొత్త విధానం*
అమరావతి :
ఏపీలో భవననిర్మాణ అనుమతులకు సంబంధించి త్వరలో కొత్త విధానం తీసుకొస్తున్నామని మంత్రినారాయణ తెలిపారు. నెల్లూరు మున్సిపల్
అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన డిసెంబర్15 నాటికి కొత్త విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పారు. 20 రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాతే కొత్త విధానంపై నిర్ణయం తీసుకున్నా మన్నారు. ప్రజలు తమ పెండింగ్ పన్నులను వెంటనే చెల్లించాలని కోరారు.
👉గర్భగుడిలో పూజారి మద్యం సేవిస్తున్నాడంటూ భక్తుల ఆగ్రహం*
*దీనిపై అధికారులు స్పందించాలని కోరుకుంటున్న భక్తులు*
పల్నాడు జిల్లాలోని వినుకొండ లో దాదాపు 700 సంవత్సరాల పురాతన చరిత్ర గలిగిన పాత శివాలయంలో పూజారి గుడిని అపవిత్రం చేసాడట్టు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ పూజారి పవిత్రమైన శివాలయం గర్భగుడిలోని అమ్మవారి వద్ద మద్యం సేవిస్తున్నట్టుగా కనిపించినా పూజారి ప్రసాద్.. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు ఇంకా స్పందించాల్సిన అవసరం లేదా? ఇప్పటివరకు ఆలయ అర్చకులు కానీ, అధికారులు కానీ స్పందించకపోవడం పలు సందేహాలను రేకెత్తిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఈ ఘటన చోటు చేసుకుందా అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. దీనిపై నిజానిజాలు పూర్తిగా అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది.
👉హాస్టల్ వార్డెన్ వేధింపులు భరించలేక నిద్రమాత్రలు మింగి ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్యాయత్నం..పల్నాడు జిల్లా…
సత్తెనపల్లిలో వెంకటపతి కాలనీలోని హాస్టల్లో మాత్రలు మింగి ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
హాస్టల్ వార్డెన్ వేధింపుల వల్లనే విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు.భోజనం బాగోలేదని కంప్లైంట్ ఇచ్చినందుకు ఏదో వంకతో వార్డెన్ టార్చర్ పెడుతున్నారన్నారు.
వార్డెన్ తీరుపై 2రోజుల క్రితం విద్యార్థినుల తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
👉 శాసనసభ ముందుకు 7 బిల్లులు*
ఏపీ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఏడు బిల్లుల్ని ప్రవేశ పెట్టనుంది ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్ భూఆక్రమణల నిరోధక బిల్లు, ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ సొసైటీ బిల్లు, మున్సిపల్ లా
బిల్లు, డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయానికి సంబంధించిన బిల్లులు సభ ముందుకు రానున్నాయి.
👉 మార్కాపురం పట్టణ పోలీస్ వారి సహకారం మరియు పట్టణ 13 వ వార్డు ఇంచార్జ్ మొహమ్మద్ ఖాసీం, బాజీ
కృషి తో మూడూ రోజుల క్రితం తప్పి పోయిన అబ్బాయి
షేక్ అబ్దుల్ సత్తర్ ను
మహారాష్ట్ర లోని అమరావతి నగరం లో అమిద్ భాయ్ మరియు భోపాల్ సహాకారం తో గుర్తించి ఈరోజు మార్కాపురం పట్టణనీకి తీసుకోవచ్చి పోలీస్ వారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు.
👉విజయవాడ వెళ్లే రహదారి పైన మంగళగిరి వద్ద జనసేన పార్టీ కార్యాలయం దగ్గర హైవే పైన బైటాయించిన అగోరి..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవాలి అంటూ హంగామా….పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాత వెళ్తాను ఆంటూ హైవే పైన బైటాయించిన అగోరి..
పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

👉హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటి దాడులు*
హైదరాబాద్:నవంబర్ 18
హైదరాబాద్ లో మరోసారి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలో ఈరోజు ఉదయం నుండి తనిఖీలు చేస్తున్నారు.
ఆ సంస్థ నిర్వాహకులైన కల్పన రాజేంద్ర లక్ష్మణ్ నివాసాలతో పాటు షాద్‌ నగర్ చేవెళ్ల బంజారాహిల్స్ కార్యాలయాలతో సహా మొత్తం మూడు చోట్ల ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి.
ఇటీవలే స్వస్తిక్ గ్రూప్ షాద్‌నగర్ ప్రాంతంలో.. ఓ ఎంఎన్‌సీ కంపెనీకి రూ.300 కోట్ల విలువైన భూమిని అమ్మింది.
అయితే, బ్యాలెన్స్ షీట్స్‌లో భూ విక్రయానికి సంబం ధించి లెక్కలు చూపలేదనే ఆరోపణ నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.
👉 గుంటూరు జిల్లా..మంగళగిరిలో లేడీ అఘోరీ హల్చల్..
ఓ వ్యక్తిపై ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడిన అఘోరి
అడ్డుకున్న స్థానికులపై దాడికి పాల్పడ్డ అఘోరీ..
ఎన్నారై హాస్పటల్లో చికిత్స పొందుతున్న బాధితుడు
👉 కడప జిల్లా…పులివెందులలోని మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి పిఎ కృష్ణారెడ్డి ఇంటి వద్ద పోలీసులు…
పులివెందుల డిఎస్పి మురళి నాయక్, సీఐ జీవన్ గంగానాథ్ బాబు…గతంలో సిబిఐ పై ప్రైవేట్ కేసు విషయమై విచారణ చేస్తున్నట్టు సమాచారం…కృష్ణారెడ్డి తరఫున లాయర్ల సమక్షంలో విచారణ..కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేస్తున్న పోలీసులు..
👉నరసరావుపేటలో విలేకరిపై దాడి*
నరసరావుపేటలోని ఎస్ ఆర్ కే టి కాలనీ మార్పు కోసం పాటుపడుతున్న విలేకరిపై దాడి. కాలనీలో గంజాయి, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై గతంలో ప్రత్యేక కథనాలు రాయడం అలాగే స్పందనలో కంప్లైంట్ పెట్టడం వలన, మార్పుని జీర్ణించుకోలేని కొంతమంది ఈ దాడి చేయడం జరిగిందని సమాచారం.
👉ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలో పడొద్దు..
ఆర్టీసీ ఎంపీ, ఐపీఎస్ సజ్జనార్ హెచ్చరిక..
అర‌చేతిలో వైకుంఠం చూపించ‌డం అంటే బ‌హుశా ఇదే కాబోలు..! అంటూ Xలో పోస్ట్..
ఈ ట‌క్కుట‌మారా మాట‌లతో అమాయ‌కుల‌ను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారు.
యువ‌కుల్లారా!! ఈజీగా మ‌నీ సంపాదించాల‌నే ఆశ‌తో ఇలాంటి సంఘ విద్రోహ శ‌క్తుల మాయ‌మాటల్లో ప‌డ‌కండి!! బంగారు జీవితాల‌ను నాశ‌నం చేసుకోకండి.
జీవితంలో ఉన్న‌తంగా ఎద‌గ‌డానికి షార్ట్ క‌ట్స్ ఉండ‌వు. మీ క‌ష్టాన్ని న‌మ్ముకోండి. విజ‌యం దానంత‌ట అదే మీ ద‌రికి చేరుతుంది- సజ్జనార్
👉పుట్టపర్తి పట్టణంలోని సాంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థి మృతికి కారణమైన సాంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలను సీజ్ చేయాలిఐక్య విద్యార్థి సంఘాలు ..
*ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల వద్ద సోమవారం నాడు ధర్నా కార్యక్రమం ఉన్నది ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థి సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విద్యార్థి కుటుంబానికి న్యాయం చేసే విధంగా పోరాటం చేయాలని ఐక్య విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేశారు.
👉 ఎంబీబీఎస్ కాలేజీలో ర్యాగింగ్‌.. 3 గంటలు నిలబడి డ్యాన్స్ చేస్తూ విద్యార్థి మృతి!
గుజరాత్‌ రాష్ట్రం పటాన్‌లోని ధర్‌పూర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సీనియర్ల ర్యాగింగ్ కారణంగా ఓ వైద్య విద్యార్థి మృతి చెందాడు..
ఈ సంఘటన తర్వాత, కళాశాల అడ్మినిస్ట్రేషన్ 15 మంది సీనియర్ విద్యార్థులను అకడమిక్, హాస్టల్ కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేసింది. ఈ విషయమై ధర్‌పూర్ మెడికల్ కాలేజీ అదనపు డీన్ పటాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నవంబర్ 1న అనిల్ మెథానియా మరణించారని, ఆ తర్వాత కాలేజీ డీన్ హార్దిక్ షా ర్యాగింగ్ నిరోధక కమిటీని ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కమిటీ విచారణ ప్రారంభించింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
**అసలు ఏం జరిగింది?
పోలీసుల కథనం ప్రకారం.. మొదటి సంవత్సరం విద్యార్థులను సీనియర్ విద్యార్థులు రాత్రి 8:30 గంటలకు పరిచయం చేసుకునేందుకు పిలిచారు. జూనియర్ విద్యార్థులు వెళ్లారు. అందులో చనిపోయిన విద్యార్థి అనిల్ కూడా ఉన్నాడు. ఈ సమయంలో సీనియర్లు జూనియర్లపై ర్యాగింగ్ ప్రారంభించారు. సినిమా పాటలు పాడుతూ.. డ్యాన్ చేయాలని అనిల్ ని సీనియర్లు పోర్స్ చేశారు. అతనిని దుర్భాషలాడాడు, మూడు గంటల పాటు అలాగే నిలబెట్టారు. అనిల్ ఆరోగ్యం క్షీణించడంతో తల తిరగడంతో కింద పడిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
**15 మంది సీనియర్ విద్యార్థులు సస్పెండ్..
ఈ ఘటనపై కళాశాల కమిటీ ఇతర సీనియర్ విద్యార్థులను కూడా విచారించింది. వారు మొదటి సంవత్సరం విద్యార్థులు చెప్పిన విషయాన్ని సమర్థించారు. నిజంగానే ర్యాగింగ్ జరిగిందని తెలిపారు. దీని తర్వాత కమిటీ 15 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పటాన్ పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని 105, 127(2), 189(2), 190, 296(బి) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. కాలేజీలోని సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని డిప్యూటీ ఎస్పీ కేకే పాండ్య తెలిపారు. ఈ కేసును పూర్తిగా నిష్పక్షపాతంగా విచారించేందుకు వీలుగా సీనియర్‌ విద్యార్థులను అకడమిక్‌, హాస్టల్‌ కార్యకలాపాల నుంచి సస్పెండ్‌ చేశామని కళాశాల యాజమాన్యం చెబుతోంది. ర్యాగింగ్‌ను యాంటీ ర్యాగింగ్‌ కమిటీ నిర్ధారించి కఠిన చర్యలు తీసుకుంటోంది.

7k network
Recent Posts

తప్పు జరిగింది.. క్షమించండి: పవన్ .. *తొక్కిసలాట ఘటనలో డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు..*తొక్కిసలాట ఘటనకు సీఎం బాధ్యత వహించాలి: రోజా* 👉 టీటీడీ తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు.. .. *ఫార్ములా ఈ కారు రేసులో దూకుడు – ఆయన అనుమతితోనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాం… *పేట’ప్రిన్సిపల్ వేధింపులతోనే విద్యార్థి ఆత్మహత్య*.. *సిరిసిల్లలో కదులుతున్న భూకబ్జాలు డొంక..!.

*పెళ్ళుబుక్కుతున్న మత విద్వేష సునామి.. హిందువులు శంఖం ఊదాల్సింది అందుకు కాదు, మరెందుకు?* .. *విశాఖలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్* …రుయా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు*జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి: తిరుపతి జిల్లా కలెక్టర్ * ..*యూరప్ లో మోసపోయిన తెలుగు వారు …ప్రతీకార రాజకీయం కొనసాగుతోంది_డా. జయప్రకాష్ నారాయణ .. లంచం డిమాండ్ చేసిన ఎమ్మార్వో, వీఆర్వో, ఆర్ ఐ ల పై వేటు వేసిన జిల్లా కలెక్టర్ .. ఖమ్మం తిరుపతి జిల్లాలలో భారీగా గంజాయి పట్టివేత

👉కర్రలతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ..* కేజీవాల్ కు అఖిలేష్ మద్దతు.. ”ఇదేంటి పవన్ ఇలా అనేశారు” .. *కుప్పం టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు .. ప్రకాశం జిల్లాలో కుక్కల స్వైర విహారం *గంజాయి గూచుల వద్ద 120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న ఏసిపి..*ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వారు స్వయంగా కంపోస్టు ఎరువు తయారు చేయండి:*కమిషనర్ ఎన్.మౌర్య*..👉 ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు: గిద్దలూరు సీఐ సురేష్ .. *ఆక్రమణకు గురైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింత* .. *ఆన్‌లైన్‌ బెట్టింగులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్…*రామ్ చరణ్, బాలయ్య సినిమాలపై హైకోర్టులో పిల్* 👉 బీజీపీ నేతలకు అద్దంకి దయాకర్ సవాల్ …*గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్? (కరీంనగర్).. * వైయస్ అభిషేక్ రెడ్డి మృతి..*

ప్రియాంక గాంధీపై బీజేపీ నేత ర‌మేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మంత్రి సీత‌క్క‌*.. *నవీన్ కి చెక్ పెట్టినట్లే కేజ్రీవాల్ కి కూడా ?.. *ఈ ఫార్ములా రేసులో కొన్ని నిజాలు *.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవ రెడ్డి … ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మంత్రి సత్య కుమార్ యాదవ్* …ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా దోచుకున్న ఓం నారాయణ పై చర్యలు : లంబాడి హక్కుల పోరాట సంఘం.. *పొదిలి మాదిరెడ్డిపాలెం వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా ఎర్రం రెడ్డి

👉ఎంఎస్‌పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే ..*తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా.😲 ..హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ … ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటులను పర్యవేక్షించిన జిల్లా అధికారులు ..*ఆత్మకూరులో ఇస్తేమ పనులను పర్యవేక్షించిన మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ .. *

👉ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ …* విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్..😲… *విశాఖ సెంట్రల్‌ జైల్ ను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి .. అగ్ని ప్రమాదాల పై అవగాహన సదస్సు.. *ఉచిత బస్సు కంటే ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే బెటరేమో ! .. *అధికారులను సత్కరించిన పొదిలి పట్టణ టిడిపి అధ్యక్షుడు. . *నిలిచిపోయిన కాపు భవనాలను పునఃప్రారంభించాలి: బలిజ సేవ సంఘం డిమాండ్ .